Rakul Marriage: ఫిబ్రవరిలో పెళ్లి?  | Rakul Preet Singh And Jackky Bhagnani To Get Married In February 22nd 2024, Rumours Goes Viral - Sakshi
Sakshi News home page

Rakul Preet Singh Marriage: ఫిబ్రవరిలో పెళ్లి? 

Published Tue, Jan 2 2024 12:09 AM | Last Updated on Tue, Jan 2 2024 11:31 AM

Rakul Preet Singh And Jackky Bhagnani To Get Married In February 22 2024 - Sakshi

రకుల్, జాకీ

జాకీ భగ్నానీ, రకుల్‌ప్రీత్‌ సింగ్‌ ఫిబ్రవరిలో ఏడడుగులు వేయనున్నారనే వార్త గుప్పుమంది. హీరోయిన్‌ రకుల్, హీరో–నిర్మాత జాకీ దాదాపు రెండు మూడేళ్లుగా ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. ఈ ప్రేమను పెళ్లి వరకూ తీసుకెళ్లాలని ఈ ఇద్దరూ నిర్ణయించుకున్నారట.

ఫిబ్రవరి 22న పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారని సమాచారం. గోవాలో డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ ప్లాన్‌ చేస్తున్నారట. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో రకుల్, జాకీల పెళ్లి జరగనుందని భోగట్టా. సోమవారం ఈ పెళ్లి వార్త వైరల్‌గా మారినప్పటికీ రకుల్, జాకీ నుంచి ఎలాంటి స్పందన లేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement