రకుల్ ప్రీత్ సింగ్ దక్షిణాదిలో పరిచయం అక్కర్లేని పేరు. టాలీవుడ్‌లో స్టార్ హీరోలందరితో సినిమాలు చేసింది. కెరటం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన భామ వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ చిత్రంలో గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత లౌక్యం, సరైనోడు, నాన్నకు ప్రేమతో, ధృవ, కిక్-2 లాంటి చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం ఇండియన్-2, అయాలన్ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనెల 10న 32వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా ఆమె బాయ్‌ఫ్రెండ్, బాలీవుడ్ హీరో జాకీ భగ్నానీ స్పెషళ్ విషెస్ చెప్పాడు. ఇద్దరు కలిసి ఉన్న ఫోటోలతో ఓ వీడియోను రిలీజ్ చేసి సర్‌ప్రైజ్ ఇచ్చాడు.
ఇన్‌స్టాలో జాకీ రాస్తూ..'మీ ఈ ప్రత్యేకమైన రోజున.. నన్ను ఎప్పుడూ ఆశ్చర్యానికి గురిచేసే వ్యక్తి పట్ల నా అభిమానాన్ని తెలియజేయాలనుకుంటున్నా. మీతో ఉంటే ప్రతి రోజు ఒక అద్భుతమైన ప్రయాణంలా అనిపిస్తుంది. ఎప్పుడూ కూడా అలసిపోయినట్లు అనిపించదు. మీరు నా సహచరుడి కంటే ఎక్కువ. నువ్వే నా ధైర్యం.. ప్రతి అడుగులో నువ్వే నా భాగస్వామి. నా జీవితాన్ని ప్రేమ, సంతోషంతో నింపే వ్యక్తి నువ్వే. ఈ గొప్ప రోజున, మీరు కలలుగన్నవన్నీ నెరవేరాలని నేను కోరుకుంటున్నాను. మీ కలలన్నీ నిజమవుతాయి.. ఎందుకంటే మీరు మాత్రమే జీవితంలో ఉత్తమమైన వాటిని సాధించడానికి అర్హులు. ప్రతి రోజును ఎక్స్‌ట్రార్డినరీగా మార్చే వ్యక్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు! ' అంటూ పోస్ట్ చేశారు.
కాగా.. రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీ డేటింగ్‌లో ఉన్నట్లు గతేడాది ప్రకటించిన సంగతి తెలిసిందే. జాకీ భగ్నానీ హీరో, నిర్మాత, వ్యాపారవేత్తగా రాణిస్తున్నారు. ఆయన 2009లో కల్ కిస్నే దేఖా సినిమా ద్వారా ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు.
Comments
Please login to add a commentAdd a comment