ప్రియుడికి స్పెషల్ విషెస్‌ చెప్పిన 'సరైనోడు' భామ.. పోస్ట్ వైరల్! | Rakul Preet Singh Special Wishes To Her Boy Friend On His Birthday | Sakshi
Sakshi News home page

Rakul Preet Singh: బాయ్‌ఫ్రెండ్‌కు బర్త్‌ డే విషెస్.. రకుల్ ఫోటోలు వైరల్!

Published Mon, Dec 25 2023 5:04 PM | Last Updated on Mon, Dec 25 2023 5:21 PM

Rakul Preet Singh Special Wishes To Her Boy Friend - Sakshi

రకుల్ ప్రీత్ సింగ్‌ టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. తెలుగులో స్టార్‌ హీరోలందరితో సినిమాల్లో నటించింది. కెరటం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన భామ వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌ చిత్రం ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత లౌక్యం, సరైనోడు, నాన్నకు ప్రేమతో, ధృవ, కిక్-2 లాంటి చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం ఇండియన్-2, అయాలన్ చిత్రాల్లో నటిస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా ఆమె ప్రియుడితో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట తెగ వైరలవుతున్నాయి. 

ఆమె బాయ్‌ఫ్రెండ్‌, బాలీవుడ్ హీరో జాకీ భగ్నానీ స్పెషల్ విషెస్ చేసింది ముద్దుగుమ్మ. ఇవాళ అతని బర్త్ ‍డే కావడంతో ఇద్దరు కలిసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. మీ జీవితంలో ప్రతిరోజు అనుకునవన్నీ జరగాలని కోరుకుంటున్నానంటూ పోస్ట్ చేసింది. నీలాంటి అమాయకత్వం, దయ, నవ్వించే గుణంతో ఎవరూ ఉండరేమో అంటూ కొనియాడారు. ఇలాగే జీవితంలో మరింత ముందుకు సాగాలని ఆశిస్తున్నట్లు రకుల్ రాసుకొచ్చింది. 

కాగా.. రకుల్ ప్రీత్‌ సింగ్, జాకీ భగ్నానీ డేటింగ్‌లో ఉ‍న్నట్లు గతేడాది ప్రకటించిన సంగతి తెలిసిందే. జాకీ భగ్నానీ హీరో, నిర్మాత, వ్యాపారవేత్తగా రాణిస్తున్నారు. ఆయన 2009లో కల్ కిస్నే దేఖా సినిమా ద్వారా ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement