Boyfriend
-
ప్రియుడితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జాన్వీ కపూర్ (ఫోటోలు)
-
12 ఏళ్ల క్రితం ప్రేమ పెళ్లి, ఇపుడు భార్యకు ప్రేమ పెళ్లి
'పురుషులందు పుణ్యపురుషులు వేరయా' అని వేమన అంటే, 'పురుషుల్లో మంచివారు నల్లహంసలంత అరుదు' అన్నాడు లాటిన్ కవి జువెనాల్. ఇపుడు నెటి జనులు మహాపురుషుడిగా అభివర్ణిస్తున్న కథ ఒకటి వైరల్‌గా మారింది. పెళ్లయ్యి ఇద్దరు బిడ్డలు పుట్టిన తరువాత మరొకవ్యక్తిని ప్రేమించిన భార్యకు దగ్గరుండి మరీ పెళ్లి చేశాడో భర్త. ట్విస్ట్ ఏంటంటే..12 ఏళ్ల క్రితం ఈమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఏం మనస్పర్దలు వచ్చాయో, ఏమైందో ఏమో తెలియదు గానీ, అప్పటికే పెళ్లయ్యి ఇద్దరు బిడ్డలున్న వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది భార్య. ఇది తెలిసిన భర్త ఆమెకు అతనితో(భార్య ప్రియుడితో) వివాహం జరిపించడం నెట్టింట వైరల్‌గా మారింది. ఘర్ కా కాలేశ్ అనే యూజర్ ట్విటర్లో ఈ వీడియోను పోస్ట్ చేశారు. బిహార్‌లో ఈ ఘటన చోటు చేసుకున్నట్టు తెలిపారు. దీనిపై నెటిజన్లు విభిన్నంగా స్పందించారు. Extra-Marital Affair (Mother of three children fell in love with the father of two children, the husband got his wife married to her boyfriend; they had love marriage 12 years ago) Saharsa Bihar pic.twitter.com/0QV5Trw8PS— Ghar Ke Kalesh (@gharkekalesh) December 19, 2024 ; -
ప్రియుణ్ణి కిడ్నాప్ చేసిన ప్రియురాలు!
తిరుపతి క్రైమ్: ఓ ప్రియురాలు తన ప్రియుడినే కిడ్నాప్ చేసిన ఘటన గురువారం తిరుపతి జిల్లాలో సంచలనం సృష్టించింది. తిరుపతి ఈస్ట్ ఇన్చార్జ్ సీఐ రామకృష్ణ తెలిపిన వివరాల మేరకు.. ప్రస్తుతం తిరుపతిలోని పీకే లేఅవుట్లో లాడ్జి నిర్వహిస్తున్న నాని అనే వ్యక్తికి మదనపల్లికి చెందిన భాను పరిచయమైంది. ఈ క్రమంలో వారు గత ఎనిమిది నెలలుగా సన్నిహితంగా ఉంటున్నారు.అయితే మూడు నెలల నుంచి నాని భానును పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలో భాను తన ప్రియుడిపై కోపం పెంచుకుంది. మరో నలుగురు సహాయంతో మదనపల్లి నుంచి వచ్చి పీకేలో లాడ్జిలో ఉన్న నానిని ఇన్నోవా కార్లో కిడ్నాప్ చేసి తీసుకెళ్లింది. కిడ్నాప్ ఘటన సమాచారం పోలీసులకు అందడంతో.. వాయల్పాడు వద్ద వారిని అడ్డగించి నానిని సురక్షితంగా కాపాడారు. పోలీసులను చూసి కిడ్నాపర్లు పరార్ అయ్యారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. -
'బిగ్‌బాస్' ఫేమ్ సోనియా ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్ (ఫొటోలు)
-
Keerthy Suresh: కీర్తి సురేశ్ మ్యారేజ్ ఫిక్స్.. వరుడు ఎవరంటే
-
దే..వుడా!
జాన్వీ కపూర్ స్నేహితురాలికి ఆమె బాయ్‌ఫ్రెండ్‌తో బ్రేకప్ అయిందట. ఆ అమ్మాయి శోక సముద్రంలో మునగడం జాన్వీని కదిలించింది. దాంతో తన ఫ్రెండ్ బీఎఫ్‌ని ఉడికించాలని.. తను స్విట్జర్లండ్లో వింటర్ జాకెట్‌తో బ్యాక్ నుంచి తీసుకున్న ఓ ఫొటోను తన ఫ్రెండ్ ఇన్‌స్టాలో పోస్ట్ చేసిందట.. విత్ మై బాయ్‌ఫ్రెండ్ ఇన్ స్విట్జర్లండ్ అనే రైటప్‌తో! ఆ పోస్ట్ చూసి ‘అబ్బా.. తన ఎక్స్‌కి స్విట్జర్లండ్ తీసుకెళ్లే రిచ్ బాయ్‌ఫ్రెండ్ దొరికాడా!’ అని ఆమె బీఎఫ్ కుళ్లుకుంటాడని ఆశపడిందట జాన్వీ! కానీ ఆప్పటికే ఆ అబ్బాయి ఆ అమ్మాయి ఇన్‌స్టా అకౌంట్‌ని అన్‌ఫాలో చేసేశాడట. ఆ నిజాన్ని ఆలస్యంగా గ్రహించిన జాన్వీ ‘దే..వుడా!’ అంటూ తల పట్టుకుందట. -
ఫ్యావరేట్ టైం:బోయ్ ఫ్రెండ్‌తో దేవర బ్యూటీ ఫెస్టివ్ మూడ్ (ఫొటోలు)
-
ప్రియుడితో బిగ్ బాస్ బ్యూటీ దీపావళి వేడుకలు (ఫోటోలు)
-
బాయ్ ఫ్రెండ్‌తో కలిసి జాన్వీ కపూర్ మాల్దీవులు ట్రిప్? (ఫొటోలు)
-
ప్రేమ పేరుతో ట్రాప్.. గర్భవతిని చేసి పెళ్లి చేసుకోమన్నందుకు..
ఢిల్లీ: ఢిల్లీలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ యువతి (19)ని గర్భవతిని చేసిన ఆమె బాయ్‌ఫ్రెండ్.. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయటంతో ఆమెను దారుణంగా హత్య చేశాడు. మరో ఇద్దరు స్నేహితుల సాయంతో ఆమెను పూడ్చిపెట్టాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ ఢిల్లీకి చెందిన సోనీ (19) సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు సంజూ అకా సలీమ్ అనే ఓ యువకుడితో పరిచయం అయ్యాడు. వారి మధ్య స్నేహం పెరిగింది. అయితే కొన్ని రోజులకు ఆమె గర్భం దాల్చడంతో తనను వివాహం చేసుకోవాలని పట్టుబట్టింది. అయితే.. పెళ్లి చేసుకోవాడానికి తాను సిద్ధంగా లేనని తేల్చి చెప్పాడు. అంతే కాకుండా అబార్షన్ చేయించుకోవాలన్నాడు.#LoveJihad: In a tragic incident in Nangloi, Delhi, a 19-year-old pregnant woman named Soni was allegedly murdered by her boyfriend, Mohammad Salim, also known as Sanju, with the assistance of two accomplices.Soni, seven months pregnant, had been pressing Salim for marriage,… pic.twitter.com/M0cqJDDfCq— Oxomiya Jiyori 🇮🇳 (@SouleFacts) October 26, 2024దీంతో ఈ విషయంలో ఇద్దరి మధ్య తరచూ గొడవ జరుగుతోంది. ఈ క్రమంలోనే సోమవారం అతడిని కలిసేందుకు యువతి వెళ్లగా.. సలీమ్ తన ఇద్దరు స్నేహితులతో కలిసి ఆమెను హర్యానాలోని రోహ్తక్కు తీసుకెళ్లి హత్య చేశాడు. ప్రస్తుతం సోని ఏడు నెలల గర్భవతి అని పోలీసులు వెల్లడించారు. ఇక.. ఈ దారుణ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుతులు సలీమ్, అతడి స్నేహితుడు ఒకరిని అరెస్టు చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆ నిందితుడి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.చదవండి: ఢిల్లీ బర్గర్ కింగ్ హత్య కేసు: ‘లేడీ డాన్’ అరెస్ట్ -
ప్రియుని హత్య... ప్రియురాలి ఆత్మహత్య
గోదావరిఖని: కట్టుకున్న భర్తను, కడుపున పుట్టిన పిల్లలను కాదని ఓ మహిళ ప్రియుడితో కలిసి వెళ్లిపోయింది. ఇది నచ్చని ఆమె అన్న, మాజీ భర్త కలిసి ప్రియుడిని హత్య చేశారు. దీంతో నిర్వేదానికి గురైన ఆమె ఉరివేసుకుని జీవితాన్ని చాలించింది. గోదావరిఖని హనుమాన్‌నగర్‌కు చెందిన అంజలి (25) భర్త, ఇద్దరు పిల్లలను కాదని యైటింక్లయిన్ కాలనీకి చెందిన ప్రియునితో కాపురం సాగిస్తోంది. పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించినా ప్రియుడితో ఉండేందుకే మొగ్గుచూపింది. ఇద్దరూ మేజర్లు కావడంతో పోలీసులు చేసేదేమీ లేక ఇష్టపడిన ప్రియునితో పంపించేశారు. ఇలా 3 నెలలపాటు గడిచాయి. అయితే శుక్రవారం సద్దుల బతుకమ్మ రోజు చూ డాలంటూ అంజలికి అన్న ఫోన్ చేశాడు. నిజమని నమ్మిన ఆమె ప్రియుడిని ఎదురుగా పంపించింది. చెల్లిని ఇంట్లో బంధించి బయట గడియవేసి ప్రియుడు వినయ్‌కుమార్ (26)ను అన్న, మాజీ భర్త కలిసి హతమార్చారు. ఈ సంఘటన తర్వాత అంజలిని పోలీసులు అదేరోజు పెద్దపల్లిలోని సఖీ కేంద్రానికి పంపించారు. అనంతరం గుంటూరుకు వెళ్లి న అంజలి చిన్నమ్మ ఇంట్లో ఆదివారం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని గోదావరిఖనికి తీసుకొస్తున్నట్లు పేర్కొన్నారు. -
బీచ్‌లో ప్రియుడు గౌతమ్‌తో రచ్చచేస్తున్న బిగ్ బాస్ 'ఇనయా సుల్తానా' (ఫోటోలు)
-
బాయ్ ఫ్రెండ్ రూమర్.. ఇంతలోనే హీరోయిన్ బ్రేకప్!
మరో స్టార్ హీరోయిన్ బ్రేకప్ చెప్పేసిందా? అంటే అవుననే అనిపిస్తోంది. ప్రభాస్ 'సాహో' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్.. గత కొన్నాళ్లుగా రాహుల్ మోదీ అనే రైటర్‌తో ప్రేమలో ఉంది. దీన్ని నిజం చేసేలా పలు ఈవెంట్స్‌లో జంటగా కనిపించారు. నెల క్రితం కూడా రాహుల్ గురించి శ్రద్ధా పోస్ట్ పెట్టింది. ఇంతలోనే బ్రేకప్ న్యూస్ బయటకొచ్చింది.(ఇదీ చదవండి: ప్రభాస్ ఫుడ్‌కి ఫిదా అయిన ఆరో హీరోయిన్.. ఏం చెప్పిందంటే?)శ్రద్ధా కపూర్.. రాహుల్‌తో పాటు అతడి కుటుంబ సభ్యులు అందరినీ ఇన్ స్టాలో అన్ ఫాలో చేసింది. దీంతో బ్రేకప్ అయిందని అంటున్నారు. మరికొందరు మాత్రం త్వరలో శ్రద్ధా నటించిన 'స్త్రీ 2' త్వరలో రిలీజ్ కానుందని, దీనిపై బజ్ లేకపోవడంతో కావాలనే ఇలా స్టంట్ చేస్తోందని కామెంట్స్ చేస్తున్నారు. శ్రద్ధా చెబితే తప్ప దీనిపై ఓ క్లారిటీ రాదు.తండ్రి శక్తి కపూర్ నటుడు కావడంతో సులువుగానే ఇండస్ట్రీలోకి వచ్చేసింది. 2010 నుంచి హిందీలో అడపాదడపా మూవీస్ చేస్తోంది. ప్రభాస్ 'సాహో'తో దక్షిణాదిలో గుర్తింపు తెచ్చుకుంది. మళ్లీ చాన్నాళ్ల తర్వాత ఇప్పుడు ఇలా బ్రేకప్ న్యూస్ వల్ల వైరల్‌గా మారిపోయింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీలో 21 సినిమాలు/ సిరీస్‌లు రిలీజ్) -
కోనసీమ జిల్లా: ప్రేమ పేరుతో ప్రియుడి మోసం.. యువతి విన్నూత నిరసన
సాక్షి, అంబేద్కర్ కోనసీమ జిల్లా: ప్రియుడితో పెళ్లి జరిపించాలని కోరుతూ యువతి వినూత్నంగా నిరసన తెలిపింది. రాజోలు మండలం పొన్నమండ గ్రామానికి చెందిన సరెళ్ల తేజస్వినిని వివాహం చేసుకుంటానని అదే గ్రామానికీ చెందిన కుక్కల స్టాలిన్ అనే యువకుడు నమ్మించి మోసం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసినా తనకు న్యాయం జరగలేదంటూ బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది.తక్షణమే న్యాయం జరగాలని కోరుతూ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి తన గోడును అంబేద్కర్ విగ్రహానికి మొరపెట్టుకున్న బాధితురాలు తేజస్విని.. తనను మోసం చేసిన వ్యక్తితోనే పెళ్లి జరిపించాలని.. లేదంటే అతని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తోంది. -
హీరోతో లైగర్ భామ బ్రేకప్.. అప్పుడే బాయ్‌ఫ్రెండ్ దొరికేశాడా?
బాలీవుడ్ భామ, లైగర్ బ్యూటీ అనన్య పాండే చివరిసారిగా ఖో గయే హమ్ కహాన్ చిత్రంలో కనిపించింది. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న ముద్దుగుమ్మ తన తొలి వెబ్ సిరీస్ కాల్ మీ బేలో కనిపించనుంది. తాజాగా అనన్య ముంబయిలో జరిగిన అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ పెళ్లిలో సందడి చేసింది. జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఈ వేడుకల్లో అనంత్ బారాత్‌లో ఫుల్‌గా ఎంజాయ్ చేస్తూ కనిపించింది.అయితే గతంలో హీరో ఆదిత్య రాయ్ కపూర్‌తో డేటింగ్ కొనసాగించిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ ముద్దుగమ్మ ఆదిత్య రాయ్ కపూర్‌తో మార్చి 2024లో బ్రేకప్ చేసుకుంది. అయితే ఈ విషయాన్ని ఇప్పటివరకు అధికారికంగా మాత్రం వెల్లడించలేదు. ఇద్దరు కూడా ఈ విషయంపై ఎక్కడా మాట్లాడలేదు. కానీ మార్చి నుంచి ఈ జంట దూరంగానే ఉంటున్నారు.తాజాగా అనంత్ అంబానీ పెళ్లిలో మరొకరితో అనన్యపాండే కనిపించింది. దీంతో అందరిదృష్టి అతనిపైనే పడింది. ఎవరా మిస్టరీ మ్యాన్? అంటూ తెగ ఆరా తీస్తున్నారు నెటిజన్స్. తీరా చూస్తే అతని పేరు వాకర్ బ్లాంకో అని.. ఇన్‌స్టాగ్రామ్‌లోనూ ఒకరినొకరు ఫాలో అవుతున్నట్లు ఓ నివేదికలో వెల్లడైంది. దీంతో అనన్య అతనితో డేటింగ్లో ఉందా? అంటూ ఫ్యాన్స్ డౌటానుమానం వ్యక్తం చేస్తున్నారు. -
పెళ్లి వేడుకల్లో ప్రియుడితో కలిసి సందడి చేసిన హీరోయిన్..!
బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ ప్రస్తుతం దేవర సినిమాలో నటిస్తోంది. జూనియర్ ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోలో వస్తోన్న ఈ చిత్రం ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఆ తర్వాత బుచ్చిబాబు డైరెక్షన్లో వస్తోన్న మూవీలో రామ్ చరణ్ సరసన కనిపించనుంది. వీటితో పాటు బాలీవుడ్‌లోనూ బిజీగా ఉంది ముద్దుగుమ్మ.తాజాగా ముంబయిలో జరుగుతున్న అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ వెడ్డింగ్ వేడుకల్లో మెరిసింది. బుధవారం జరిగిన శివశక్తి పూజకు హాజరైంది. జాన్వీ భాయ్‌ఫ్రెండ్‌గా భావిస్తున్న శిఖర్ పహారియాతో కలిసి పెళ్లి వేడుకల్లో పాల్గొంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. వీరితో పాటు కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దంపతులు కూడా సంప్రదాయ దుస్తులు ధరించి సందడి చేశారు. View this post on Instagram A post shared by Manav Manglani (@manav.manglani) -
డైరెక్టర్‌తో ప్రేమలో ఉన్న యంగ్ హీరోయిన్.. వీడియో వైరల్
యంగ్ హీరోయిన్ ప్రేమలో ఉన్నట్లు బయటపెట్టింది. కాకపోతే పరోక్షంగా ఆ విషయాన్ని చెప్పుకొచ్చింది. అయితే కుర్రాడు కూడా ఇండస్ట్రీకి చెందిన వాడే కావడం ఇక్కడ ఆసక్తికర విషయం. తాజాగా బాయ్ ఫ్రెండ్ పుట్టినరోజు సందర్భంగా విషెస్ చెబుతూ ఏకంగా వీడియో పోస్ట్ చేయడంతో హీరోయిన్ ప్రేమ కహానీపై క్లారిటీ వచ్చేసింది.(ఇదీ చదవండి: ఫాదర్స్ డే స్పెషల్.. ఓటీటీలో తెలుగు మూవీ డైరెక్ట్ రిలీజ్)చెన్నైకి చెందిన అమ్ము అభిరామి.. 2017 నుంచి ఇండస్ట్రీలో ఉంది. దళపతి 'భైరవ' మూవీతో నటిగా మారింది. కాకపోతే తమిళ సూపర్ హిట్ సినిమా 'రాక్షసుడు'లో స్కూల్ స్టూడెంట్‌గా చేసి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులోనూ నారప్ప, ఎఫ్‌సీయూకే, రణస్థలి, డెవిల్ చిత్రాల్లో నటించింది. ఓవైపు హీరోయిన్గా చేస్తూనే మరోవైపు సహాయ పాత్రల్లోనూ నటిస్తోంది.అభిరామి ప్రేమ విషయానికొస్తే.. తెలుగు, తమిళంలో సినిమాలు చేస్తూ 'కుక్ విత్ కోమలి' అనే వంటల ప్రోగ్రామ్‌లోనూ చేసింది. ఈ షోకి పనిచేస్తున్న డైరెక్టర్ పార్థివ్ మణితో అలా ప్రేమలో పడింది. గతంలో ఓసారి ప్రేమ విషయాన్ని చూచాయిగా బయటపెట్టింది. కానీ ఇప్పుడు అతడి పుట్టినరోజున వీడియో పోస్ట్ చేసి.. 'నా జీవితంలో వచ్చినందుకు థ్యాంక్స్' అని రాసుకొచ్చింది. దీనిబట్టి చూస్తే త్వరలో వీళ్ల పెళ్లి వార్త చెబుతారేమో!(ఇదీ చదవండి: ఈ టాలీవుడ్ హీరోయిన్ని గుర్తుపట్టారా.. ఇలా తయారైందేంటి?) View this post on Instagram A post shared by Ammu_Abhirami (@abhirami_official) -
కెమెరామెన్తో పెళ్లి పీటలు ఎక్కనున్న రవితేజ హీరోయిన్
చిత్రపరిశ్రమలో హీరోయిన్ల పెళ్లి అంటేనే పెద్ద వార్తగా మారుతున్న పరిస్థితి. కొంత కాలం పాటు డేటింగ్ చేసి కొందరు పెళ్లి పీటలెక్కుతే.. మరికొందరు మాత్రం పెద్దల అంగీకారంతో వివాహబంధంలోకి అడుగుపెడుతున్నారు. ఇప్పటికే ఓ యంగ్ హీరోయిన్ తన ప్రియుడ్ని పరోక్షంగా పరిచయం చేసింది. త్వరలో పెళ్లితో శుభం కార్డు వేయాలని ఆ బ్యూటీ చూస్తుందట. ఇంతకీ ఆమె ఎవరు అనుకుంటున్నారా..?రజీషా విజయన్ గుర్తుందా. మొదట్లో పలు టీవీ కార్యక్రమాల్లో పాల్గొని పాపులర్ అయిన ఈ కేరళ భామ.. 2016లో మలయాళంలో కథానాయకిగా రంగప్రవేశం చేశారు. మాతృభాషలో ఉత్తమ నటిగా కేరళ రాష్ట్ర ప్రభుత్వ అవార్డును కూడా పొందింది. 2021లో తమిళంలో కర్ణన్ చిత్రంలో ధనుష్‌కు జంటగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత జైభీమ్, సర్దార్ వంటి చిత్రాల్లో మెప్పించింది. సర్దార్ చిత్రం తరువాత కోలీవుడ్ లో కనిపించని రజీషా తెలుగులో రవితేజ నటించిన రామారావు ఆన్ డ్యూటీ చిత్రంలో నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. ఇలా బహుభాషా నటిగా గుర్తింపు పొందిన ఈమె త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు తాజా సమాచారం. మలయాళ ప్రముఖ చాయాగ్రహకుడు టోపిన్ థామస్‌తో కలిసి ఏడడుగులు వేయనున్నట్లు తెలిసింది. గతంలో వీళ్లిద్దరూ కలిసి 'ఖోఖో', 'లవ్లీ యువర్స్' సినిమాలకు పనిచేశారు. అలా మొదలైన పరిచయం ఇప్పుడు ప్రేమ వరకు వెళ్లిందనమాట. అయితే దీనికి సబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉందన్నది గమనార్హం. View this post on Instagram A post shared by Rajisha Vijayan (@rajishavijayan) -
ప్రియుడితో పెళ్లి వార్తలు.. తొలిసారి స్పందించిన జాన్వీ కపూర్!
-
ప్రియుడితో కలిసి పెట్స్ బర్త్‌డే సెలబ్రేట్ చేసిన వరలక్ష్మి (ఫోటోలు)
-
గర్ల్ ఫ్రెండ్ కోసం, సాహసం: అతగాడి కష్టం తెలిస్తే ఔరా అనాల్సిందే!
ప్రియురాలి కోసం గొప్ప సాహసం చేశాడో ప్రియుడు. ఇందుకోసంగా దాదాపు నాలుగేళ్లపాటు కష్టపడి మరీ జాగ్రత్తగా ఆమెకు విగ్‌ను గిఫ్ట్‌గా ఇచ్చాడు. విగ్‌ను గిఫ్ట్‌గా ఇవ్వడానికి అంత కష్టం ఎందుకు అనుకుంటున్నారా? రండి.. ఈ స్టోరీని చూద్దాం. మెయిల్ ఆన్లైన్ కథనం ప్రకారం మిచిగాన్‌లోని వాటర్ఫోర్డ్కు చెందిన కోడి ఎన్నిస్, హన్నా హోస్కింగ్ ఇద్దరూ ప్రేమికులు. ఆరునెలల డేటింగ్ తరువాత తనకోసం 30 అంగుళాల జట్టు కావాలని అడిగింది సరదాగా. అంతేకాదు దీనికి మూడు నాలుగేళ్లుపడుతుందని కూడా జోక్ చేసింది. అయితే దీన్ని సీరియస్‌గా తీసుకున్నాడు ఎన్నిస్. 2020, మే నుంచి జుట్టు పెంచడాన్ని ప్రారంభించాడు. దీనికోసం వేలాది ఆన్లైన్ క్లాసులు, ఆన్లైన్ ట్యుటోరియల్స్ చూశాడు. దీన్ని ఒక యజ్ఞంలాగా చేపట్టాడు. క్రమం తప్పకుండా జుట్టును వాష్ చేసుకోవడం, కండీషనింగ్ లాంటి ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాడు. కాస్మోటాలజిస్ట్ సలహా మేరకు ఖరీదైన షాంపూలు, కండిషనర్లు వాడాడు. జుట్టు ఏ మాత్రం తెగకుండా సిల్క్ బోనెట్ వాడుతూ జాగ్రత్తపడ్డాడు. చివరికి గత అక్టోబరులో, తన జుట్టును 29-అంగుళాలకు పెంచాడు. దీన్ని కట్ చేసి అంతే జాగ్రత్తగా అందమైన విగ్‌ను ఆమెకు ప్రెజెంట్ చేశాడు. అచ్చం ఆమె పాత జుట్టులా ఉండేలా శ్రద్ధ తీసుకోవడం మరీ విశేషం. అసలు విషయం ఏమిటంటే.. హన్నా హోస్కింగ్ ఒక కంటెంట్క్రియేటర్. ఆమెకు ఏడేళ్లున్నపుడే అలోపేసియా (హెయిర్ ఫోలికల్ మూలాలను నాశనం చేసే ఆటో-ఇమ్యూన్) అనే వ్యాధి సోకింది. దీంతో క్రమంగా దాదాపు ఐదేళ్ల క్రితంఆమె శరీరం మీద ఉన్న ఒక్కో వెంట్రుక(కనుబొమ్మలతో) సహా రాలిపోవడం మొదలైంది.దీంతో జుట్టుంతా షేవ్ చేసుకుంది. ఈ క్రమంలో 2019లో కోవిడ్ లాక్డౌన్ సమయంలో నవంబరులో హన్నా ఎన్నిస్ తొలిసారి కలుసుకున్నారు. వీరి పరిచయం ప్రేమంగా మారింది. ‘ఇది తన జీవితంలో మర్చిపోలేని అనుభూతి అని, సినిమాలా అనిప్తిస్తోంది అని హన్నా భావోద్వేగానికి లోనైంది హనా. ‘‘ఇది మామూలు విగ్ కాదు. సాధ్యమైనంత ఎక్కువ కాలం పాటు నాతో ఉండాలని కోరుకుంటున్నాను. తన జీవింతలో ఇంత ఇష్టపడే వ్యక్తి ఉన్నాడని తెలియడం,చాలా ఓదార్పుగా, భద్రంగా అనిపిస్తోంది’’ అంటూ కంటతడి పెట్టుకుంది. తన బాయ్‌ఫ్రెండ్స్ జుట్టుతో తయారు చేసిన విగ్ పెట్టుకుని ఫోటోలకు ఫోజులిచ్చింది హన్నా. నా విగ్గు తనకి చక్కగా అమరిపోయింది అంటే..ఇక నాతో తను విడిపోలేదు అని చెప్పాడు ప్రేమతో -
ఆమెకు 25.. అతడికి 42.. బాయ్‌ఫ్రెండ్‌తో సబలెంక (ఫొటోలు)
-
Taapsee-Mathias: తాప్సితో ప్రేమ.. మథియస్ బ్యాగ్రౌండ్ ఇదే! (ఫొటోలు)
-
కెమెరామ్యాన్‌తో ప్రేమలో పడిన రవితేజ హీరోయిన్?
హీరోయిన్లు ఈ మధ్య కాలంలో వరసగా పెళ్లి చేసుకుంటున్నారు. లేదంటే నిశ్చితార్థం కానిస్తున్నారు. మరికొందరైతే తాము ప్రేమలో ఉన్న విషయాన్ని పరోక్షంగా బయటపెడుతున్నారు. ఇప్పుడు ఓ యంగ్ హీరోయిన్ అలానే ప్రియుడ్ని పరిచయం చేసింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈమె రిలేషన్లో ఉన్నది కూడా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తే. ఇంతకీ ఎవరీ హీరోయిన్? ఏంటా ప్రేమకథ? (ఇదీ చదవండి: 12 ఏళ్ల తర్వాత విడాకులు తీసుకున్న హీరోయిన్.. కారణమేంటి?) మలయాళ నటి రజిషా విజయన్ గురించి తెలుగు ప్రేక్షకులకు కాస్త తెలుసు. ఎందుకంటే ఓటీటీ సినిమాల కాస్త గుర్తింపు తెచ్చుకున్న ఈమె.. రవితేజ 'రామారావు ఆన్ డ్యూటీ'లో ఓ హీరోయిన్గా నటించి తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఇది ఫ్లాప్ కావడంతో ఈమెకు ఇక్కడ పెద్దగా ఛాన్సులు రాలేదు. ప్రస్తుతానికైతే సొంత భాషతో పాటు తమిళంలో అడపాదడపా చిత్రాల్లో నటిస్తోంది. రజిషా విజయన్ ప్రస్తుతం సినిమాటోగ్రాఫర్ టోబిన్ థామస్‌తో ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయం నేరుగా బయటపెట్టనప్పటికీ టోబిన్ తాజాగా పెట్టిన ఇన్ స్టా పోస్ట్ చూస్తే వీళ్ల ప్రేమ నిజమేనేమో అనిపిస్తోంది. రజిషాతో ఉన్న ఫోటోలను షేర్ చేసిన టోబిన్.. 1461 రోజులు కలిసి ఉన్నాం. ఎంతో ప్రేమ, సంతోషం.. ఇద్దరి అల్లరిని భరిస్తూ.. మరెన్నో ప్రయాణాలు చేయాలనుకుంటున్నాం అని రాసుకొచ్చాడు. టోబిన్ పోస్టుకు రజిషా రిప్లై కూడా ఇచ్చింది. గతంలో వీళ్లిద్దరూ కలిసి 'ఖోఖో', 'లవ్లీ యువర్స్' సినిమాలకు పనిచేశారు. అలా మొదలైన పరిచయం ఇప్పుడు ప్రేమ వరకు వెళ్లిందనమాట. (ఇదీ చదవండి: సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్.. కుర్రాడెవరో తెలుసా?) View this post on Instagram A post shared by Tobin Thomas (@tobin_thomas7) -
చాలా ఏళ్ల నుంచి అతనితో డేటింగ్లో ఉన్నాను: తాప్సీ
టాలీవుడ్లో ‘ఝుమ్మంది నాదం’తో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ తాప్సీ.. తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఆ తర్వాత బాలీవుడ్లో అడుగుపెట్టి అక్కడ కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. డెన్మార్క్ బ్యాడ్మింటన్ ఆటగాడు మాథిస్ బోతో తాప్సీ ప్రేమలో ఉన్నట్లు ఇప్పటికే అనేక వార్తలొచ్చాయి. అయితే తాప్సీ మాత్రం తన ప్రేమ గురించి ఎప్పుడూ పెదవి విప్పలేదు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయంపై తొలిసారి ఆమె మాట్లాడింది. దాదాపు పదేళ్ల నుంచి మాథిస్ బోతో ప్రేమలో ఉన్నానని ఇలా చెప్పింది. 'దక్షిణాది నుంచి బాలీవుడ్లో అడుగుపెట్టిన తొలినాళ్లలోనే అతడితో పరిచయం ఏర్పడింది. ఇన్నేళ్ల కాలంలో మా బంధం మరింతగా బలపడుతూ వచ్చింది. ఆ సమయం నుంచి అతడి వెంటే నేను ఉన్నాను. అతనితో బ్రేకప్ చెప్పేసి మరో బంధంలో అడుగుపెట్టాలనే ఆలోచన ఏ రోజూ నాకు రాలేదు. అతడి వల్ల చాలా సంతోషంగా ఉన్నాను. ప్రేమ, పెళ్లి విషయంలో నాకు కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. అందుకే మా ప్రేమ వ్యవహారం గురించి ఇప్పటివరకు నేను ఎక్కడా మాట్లాడలేదు.' అని తాప్సీ చెప్పింది. చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టి 13 ఏళ్లు అయ్యిందని తాప్సీ గుర్తు చేసుకుంది. ప్రేక్షకాదరణ వల్లే తాను ఈ స్థాయికి చేరుకోగలిగానని ఆమె పేర్కొంది. అభిమానుల తనపై చూపించిన ప్రేమకు కృతజ్ఞతలు చెప్పింది. గతేడాదిలో షారుక్ ఖాన్‌తో 'డంకీ' చిత్రంలో తాప్సీ మెరిసింది. బాలీవుడ్లో ఈ సినిమా మంచి విజయాన్నే అందుకుంది. వహ లడ్కీ హై కహా, ఫిర్ అయీ హసీన్ దిల్రుబా, ఖేల్ ఖేల్ మే చిత్రాల్లో ఆమె నటిస్తుంది. (ఇదీ చదవండి: జై శ్రీరామ్ అంటూ.. క్షమాపణ చెప్పిన నయనతార)