Tamil Actress Anika Vijay Vikraman Abused by Boyfriend - Sakshi
Sakshi News home page

Actress Anika Vikraman: ప్రియుడి చేతిలో చావు దెబ్బలు తిన్న నటి, శరీరమంతా కమిలిపోయి..

Mar 6 2023 3:17 PM | Updated on Mar 6 2023 5:42 PM

Tamil Actress Anika Vijay Vikraman Abused by Boyfriend Shares Photos on Instagram - Sakshi

సాధారణ అమ్మాయిల నుంచి నటీమణుల వరకు ప్రియుడి వేధింపులకు గురైన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇటీవల ప్రియుడి చేతిలో మృతి చెందిన శ్రద్ధా వాకర్‌ నుంచి బాయ్‌ఫ్రెండ్‌ చేతిలో దారుణంగా దెబ్బలు తిన్న నటి ఫ్లోరా సైనీ(అలియాస్‌ ఆశ) ఘటనలే ఇందుకు ఉదహరణ. ‘నువ్వు నాకు నచ్చావ్‌’ చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమైన ఆశ ఇటీవల ఓ ఇంటర్య్వూలో బాయ్‌ఫ్రెండ్‌ వల్ల చావు అంచుల వరకు వెళ్లి వచ్చింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఓ ఇంటర్య్వూలో వెల్లడించింది.

చదవండి: కొత్త జంట మనోజ్‌-మౌనికలపై మంచు లక్ష్మి ఎమోషనల్‌ పోస్ట్‌

తాజాగా మరో నటి బాయ్‌ఫ్రెండ్‌ బాధితురాలుగా మారిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తన బాయ్‌ఫ్రెండ్‌ చిత్రహింసలకు గురి చేశాడంటూ ప్రముఖ తమిళ నటి అనిఖా విక్రమన్‌ సోషల్‌ మీడియా వేదికగా నోరు విప్పింది. ఈ సందర్భంగా తన రిలేషన్‌ తాలూకు అనుభవాలను ఇన్‌స్టాగ్రామ్‌లో గుర్తు చేసుకుని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో కొన్ని ఫొటోలు, నోట్‌ షేర్‌ చేసింది. ఆ ఫోటోల్లో అనిఖా శరీరమంత గాయాలతో, ముఖం, కళ్లు కందిపోయి కనిపించింది. ఆ ఫొటోలన్నింటిని ఆమె షేర్‌ చేస్తూ తన బాయ్‌ఫ్రెండ్‌ వల్ల ప్రాణహానీ ఉందని, తనని.. తన కుటుంబాన్ని వేధిస్తున్నాడని తెలిపింది. 

‘గతంలో అనూప్‌ పిల్లై అనే వ్యక్తితో రిలేషన్‌లో ఉన్నాను. అది నాకు చేదు జ్ఞాపకాలను మిగిల్చింది. అతడు నన్ను మానసికంగా, శారీరకంగా చిత్ర హింసలకు గురి చేశాడు. అలాంటి వ్యక్తిని నా జీవితంలో చూడలేదు. ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను కలలో కూడా ఊహించలేదు.  నన్ను ఇంత ఇబ్బంది పెట్టిననా అతడిలో అసలు మార్పే లేదు. ఇప్పటికీ నన్ను వేధిస్తూనే ఉన్నాడు’ అని పేర్కొంది. అయితే అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు అనిఖా పేర్కొంది. 

చదవండి: భారీ బందోబస్తు మధ్య అత్తారింటికి మనోజ్‌.. వీడియో, ఫొటోలు వైరల్‌

అలాగే మరో పోస్ట్‌లో ‘మొదటి సారి కొట్టినపుడు.. నా కాళ్ల మీద పడి క్షమాపణ అడిగాడు. అందుకే వదిలేశా. రెండోసారి కూడా అదే రిపీట్‌ అయ్యింది. ఒళ్లంతా కమిలేలా కొట్టాడు. ఇక భరించలేక పోలీసులకు ఫిర్యాదు చేశాను. కానీ పోలీసులకు డబ్బులు ఇచ్చి తన వైపు తిప్పుకున్నాడు. మొదట మేమిద్దరం ఫ్రెండ్స్‌గా ఉన్నాము. రిలేషన్‌షిప్‌లో ఉన్నపుడు తరచుగా అతడు నా ఫోన్‌ను చెక్‌ చేస్తూ ఉండేవాడు. ఓ రోజు నన్ను దారుణంగా కొట్టి ఫ్రెండ్స్‌తో పార్టీ చేసుకోవటానికి వెళ్లాడు. నేను ఆ దెబ్బలు భరించలేక ఏడుస్తుంటే డ్రామా బాగా చేస్తున్నావంటూ ఎద్దేవా చేస్తూ వెకిలిగా నవ్వాడు’ అంటూ నటి ఆవేదన వ్యక్తం చేసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement