సీరియల్ నటికి ప్రమాదం.. తీవ్ర గాయాలు | Tamil Serial Actress Sai Gayatri Injured Hand | Sakshi
Sakshi News home page

Sai Gayatri: మెషీన్‌లో ఇరుకున్న నటి చెయ్యి.. పోస్ట్ వైరల్

Published Wed, Nov 20 2024 11:16 AM | Last Updated on Wed, Nov 20 2024 12:48 PM

Tamil Serial Actress Sai Gayatri Injured Hand

తమిళంలో సీరియల్ నటిగా గుర్తింపు తెచ్చుకున్న సాయి గాయత్రికి ప్రమాదం జరిగింది. మెషీన్‌లో ఈమె చెయ్యి ఇరుక్కుపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ క్రమంలోనే తనకు యాక్సిడెంట్ అయిన విషయాన్ని సాయి గాయత్రి ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది. 1-2 వారాల పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉంటానని చెప్పుకొచ్చింది.

(ఇదీ చదవండి: జీవితంలో పెళ్లి చేసుకోను: హీరోయిన్ ఐశ్వర్య)

ఓవైపు సీరియల్ నటిగా చేస్తూనే సాయి గాయత్రి బ్యూటీ ప్రొడక్ట్స్ కంపెనీ కూడా పెట్టుకుంది. పాండియన్ స్టోర్స్, నీ నాన్ కాదల్ తదితర సీరియల్స్ ఈమెకు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. అయితే పలు వ్యక్తిగత కారణాలతో ఈ రెండు ప్రాజెక్ట్‌ల నుంచి మధ్యలోనే బయటకొచ్చేసింది. గతేడాది తల్లిదండ్రులతో కలిసి 'సాయి సీక్రెట్స్' అనే బ్యూటీ ప్రొడక్ట్స్ కంపెనీ పెట్టింది.

సబ్బులు, హెయిర్ ఆయిల్ తదితర ఉత్పత్తులు తన సంస్థలో తయారు చేసి విక్రయించేది. తాజాగా కంపెనీలో పనిచేస్తున్న టైంలో సాయి గాయత్రి చెయ్యి.. అనుకోకుండా ఓ యంత్రంలో ఇరుక్కుంది. దీంతో కుడి చేతికి తీవ్ర గాయాలయ్యాయి. సకాలంలో స్పందించడంతో పెద్దగా ప్రమాదం జరగలేదు.

(ఇదీ చదవండి: 'కిష్కింద కాండం' సినిమా రివ్యూ (ఓటీటీ))

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement