Sai gayathri
-
సీరియల్ నటికి ప్రమాదం.. తీవ్ర గాయాలు
తమిళంలో సీరియల్ నటిగా గుర్తింపు తెచ్చుకున్న సాయి గాయత్రికి ప్రమాదం జరిగింది. మెషీన్లో ఈమె చెయ్యి ఇరుక్కుపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ క్రమంలోనే తనకు యాక్సిడెంట్ అయిన విషయాన్ని సాయి గాయత్రి ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది. 1-2 వారాల పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉంటానని చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: జీవితంలో పెళ్లి చేసుకోను: హీరోయిన్ ఐశ్వర్య)ఓవైపు సీరియల్ నటిగా చేస్తూనే సాయి గాయత్రి బ్యూటీ ప్రొడక్ట్స్ కంపెనీ కూడా పెట్టుకుంది. పాండియన్ స్టోర్స్, నీ నాన్ కాదల్ తదితర సీరియల్స్ ఈమెకు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. అయితే పలు వ్యక్తిగత కారణాలతో ఈ రెండు ప్రాజెక్ట్‌ల నుంచి మధ్యలోనే బయటకొచ్చేసింది. గతేడాది తల్లిదండ్రులతో కలిసి 'సాయి సీక్రెట్స్' అనే బ్యూటీ ప్రొడక్ట్స్ కంపెనీ పెట్టింది.సబ్బులు, హెయిర్ ఆయిల్ తదితర ఉత్పత్తులు తన సంస్థలో తయారు చేసి విక్రయించేది. తాజాగా కంపెనీలో పనిచేస్తున్న టైంలో సాయి గాయత్రి చెయ్యి.. అనుకోకుండా ఓ యంత్రంలో ఇరుక్కుంది. దీంతో కుడి చేతికి తీవ్ర గాయాలయ్యాయి. సకాలంలో స్పందించడంతో పెద్దగా ప్రమాదం జరగలేదు.(ఇదీ చదవండి: 'కిష్కింద కాండం' సినిమా రివ్యూ (ఓటీటీ)) -
తల్లీకొడుకు బెదిరించారని ఆత్మహత్య!
బంజారాహిల్స్: బెదిరింపులతో మనస్తాపం చెందిన ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఘటన వివరాలిలా ఉన్నాయి. బంజారాహిల్స్ రోడ్ నంబర్ -14లోని నందినగర్‌కు చెందిన సాయి గాయత్రి(17) స్థానిక హిల్మెన్ పబ్లిక్ స్కూల్లో ఎస్ఎస్సీ చదువుతోంది. ఆమె తల్లిదండ్రులు ఈ నెల 17వ తేదీన స్వగ్రామానికి వెళ్లారు. ఈ నెల 18వ తేదీన సాయి గాయత్రి ఇంటికి అదే గల్లీలో నివసిస్తున్న ఓ యువకుడు వచ్చి ఆమెను బెదిరించాడు. అయితే ఎందుకు బెదిరించాడన్నది తెలియకుండా ఉంది. ఆ తెల్లవారే సదరు యువకుడి తల్లి కూడా వచ్చి గాయత్రిని తీవ్రంగా హెచ్చరించింది. ఇది తట్టుకోలేక గాయత్రి ఫ్యాన్‌కు ఉరేసుకొంది. తల్లిదండ్రులు వచ్చి చూసేసరికి ఫ్యాన్‌కు వేలాడుతుండటంతో వెంటనే ఆమెను కిందికి దించి ఆస్పత్రికి తరలించారు. ఏం జరిగిందని తల్లిదండ్రులు ప్రశ్నించగా జరిగిన విషయాన్ని తెలియజేసింది. రెండు రోజులుగా చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున చనిపోయింది. ఈ మేరకు మృతురాలి తండ్రి యానాదిబాబు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆమెను బెదిరించిన యువకుడితో పాటు ఆయన తల్లిని విచారించనున్నారు.