కోల్‌కతా:మహాకుంభమేళాలో పాపులర్ అయిన తేనేకళ్ల మోనాలిసా గురించి ఆసక్తికర విషయం ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. మూడేళ్ల క్రితం 2022లో మధ్యప్రదేశ్‌లోని మహేశ్వర్ అహిళ్యాదేవికోటలో పరికర్మ అనే సినిమా చిత్రీకరిస్తున్నపుడు ఆ షూటింగ్ చూసేందుకు మోనాలిసా వచ్చింది.
ఆకట్టుకునే కళ్లతో పాటు విలక్షణమైన మోనాలిసా ముఖ కవలికలు ఆ సినిమా యూనిట్‌ను ఆకట్టుకున్నాయి. ఆ సినిమాకు పనిచేసిన ఫొటోగ్రాఫర్ సంజీత్ చౌదరి మోనాలిసాను చూశారు. ఆమెలోని కట్టిపడేసే ఆకర్షణకు ముగ్ధులయ్యారు. వెంటనే మోనాలిసాతో ఫొటో సెషన్ చేయాలని డిసైడయ్యారు. ఫొటోలు తీసకునేందుకు మోనాలిసాను ఒప్పించారు.
ఇంకేముంది షూటింగ్ భోజన విరామ సమయంలో మోనాలిసా ఫోజులను తన కెమెరాలో బంధించారు. సినిమా షూటింగ్ పూర్తయి కోల్‌కతాకు వచ్చిన వెంటనే మోనాలిసా ఫొటోలను సంజీత్ సోషల్‌మీడియాలో కూడా పోస్టు చేశారు.
అయితే ప్రస్తుతం కుంభమేళాలో పూసలమ్ముకునేందకు వెళ్లిన మోనాలిసా ఫొటోలు, వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసి ఫొటోగ్రాఫర్ సంజీత్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.మోనాలిసా రూపం ఎవరినైనా ఇట్టే ఆకట్టుకుంటుందని ఫొటోగ్రాఫర్ అన్నారు.
కాగా, కుంభేళాలో వచ్చిన పాపులారిటీతో తాజాగా మోనాలిసాకు ఏకంగా బాలీవుడ్‌లో మూవీ ఆఫర్ కూడా వరించింది. ప్రముఖ డైరెక్టర్ సనోజ్ మిశ్రా తన సినిమాలో ఛాన్స్ ఇచ్చాడు. ది డైరీ ఆఫ్ మణిపూర్ పేరుతో తెరకెక్కించనున్న సినిమాలో మోనాలిసా కనిపించనుంది.అయితే మోనాలిసాకు వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
సినిమాలో నటించడం కోసం మేకప్ వేసుకుని వీడియోలో కనిపించింది. ఈ వీడియో చూస్తే మోనాలిసా ప్రస్తుతం ముంబయిలో ఉన్నట్లు తెలుస్తోంది. హీరోయిన్‌గా మోనాలిసా మేకోవర్ నెటిజన్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది. ఏదేమైనా కుంభమేళా మోనాలిసా ఫేట్‌ను మార్చేసి బాలీవుడ్‌లో సినిమా ఆఫర్ వచ్చేలా చేసింది.
Comments
Please login to add a commentAdd a comment