photoshoot
-
బేబీ బంప్ ఫోటోలు షేర్ చేసిన నితిన్ భార్య (ఫోటోలు)
-
జోరుగా.. హుషారుగా వసూళ్లు : ప్రీ వెడ్డింగా? ప్రీ వేస్టింగా!
పెళ్లంటే..పందిళ్లు, బాజాలు, భజంత్రీలు, బంధువుల, విందు భోజనాలు...ఇది ఒకప్పుడు ఇప్పుడు ట్రెండ్ మారింది. వివిధ రకాల ఫోటోషూట్లు వీటి స్థానాన్ని ఆక్రమించాయి. నేటి యువత పెళ్లి కంటే ప్రీ వెడ్డింగ్‌కే ఎక్కువగా ప్రాధాన్యమిస్తున్నారు. వీటితోపాటు పెళ్లి, రిసెప్షెన్ డ్రస్సులకు కూడా వేలు, ఒక్కోసారి లక్షల్లో కూడా ఖర్చు చేస్తున్నారు. ప్రీ వెడ్డింగ్ షూట్‌కు తమ చుట్టుపక్కల చూడదగిన రమణీయమైన ప్రాంతాలకు వెళ్లడం లేదా ప్రత్యేకంగా పర్యాటక ప్రాంతాలకు వెళ్లడం చేస్తున్నారు.కాబోయే జంటలను తీసుకెళ్లడానికి కార్లు, భోజనం మొదలుకుని బస చేయడానికి హోటళ్లు, గెస్ట్ హౌస్‌లలో గదుల బుకింగ్ పనులన్నిటినీ ఫొటోగ్రాఫర్లే చూసుకుంటారు. కొందరు ప్రీ వెడ్డింగ్‌కు రూ.25 వేల నుంచి 35 వేలు చార్జీలు తీసుకుంటుండగా మరికొందరు రూ.50–75 వేల వరకు వసూలు చేస్తున్నారు. కొంత హై ఫై సౌకర్యా లు కావాలంటే ఏకంగా రూ.90 వేల వరకు చార్జీలు కూడా వసూలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫోటోగ్రాఫర్లు, ఈవెంట్మేనేజర్లకు డిమాండ్ పెరిగింది. (ప్రియురాలికి ఫ్లాట్, లగ్జరీ కారు, అడ్డంగా బుక్కైన ప్రియుడు!)ఎంతైనా తగ్గేదేలే... గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ముహూర్తాలు ఎక్కువగా ఉన్నాయి. వారానికి కనీసం మూడు, నాలుగు పెళ్లిళ్లు జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా పెళ్లి బాజాలు వినిపిస్తున్నాయి. సాయంత్రమైందంటే చాలు భాజాభజంత్రీలు, బ్యాండ్ల మోతలతో బారాత్‌లు(పెళ్లి ఊరేగింపులు) తీస్తున్న దశ్యాలే దర్శనమిస్తున్నాయి. ఒకప్పుడు పెళ్లంటే ఇంటి గుమ్మం ముందు లేదా ఖాళీ స్థలాల్లో జరిగేవి. కాని కాలం మారడంతో వాటికి స్వస్తి పలికి ఏసీ, నాన్ ఏసీ పంక్షన్ హాళ్లలో చేస్తున్నారు. ఫలితంగా హాళ్లకు డిమాండ్ పెరిగింది.ఇందుకోసం ఫొటోగ్రాఫర్లకు ఎంత చార్జీలు చెల్లించేందుకైనా వెనకాడడం లేదు. అయితే ఇది తమ తల్లిదండ్రులకు అదనపు భారంగా పరిణమిస్తుందని వధూవరులు గ్రహించలేక పోతున్నారు. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో ఫొటోగ్రాఫర్లు, మ్యూజిక్ బ్యాండ్లు, సంప్రదాయ సంగీత వాద్య బృందాలకు కూడా డిమాండ్ పెరిగింది. డిమాండ్‌కు తగ్గట్లుగా.... అమ్మాయిల కొరత కారణంగా గత రెండు, మూడేళ్లుగా పెళ్లిళ్లు ఎక్కువ శాతం జరగలేదు. దీనికి తోడు ముహూర్తాలు కూడా ఎక్కువగా లేకపోవడంవల్ల చాలా పెళ్లిళ్లు వాయిదా పడ్డాయి. కానీ ఈ ఏడాది ముహూర్తాలు ఎక్కువ ఉండడంవల్ల ఎక్కడ చూసిన పెళ్లి సందడి కనిపిస్తోంది. ఫంక్షన్ హాళ్లన్నీ ఇప్పటికే రిజర్వై పోయి ఉండటంతో అందుబాటులో ఉన్న స్కూళ్లు, కాలేజీ గ్రౌండ్లు, క్రీడా మైదానాలలో కూడా పెళ్లిళ్లు జరిపిస్తున్నారు. ఒకప్పుడు ముహూర్తాలు చూసుకుని ఫంక్షన్ హాళ్లు బుక్ చేసుకునేవారు. (చిట్టి లవంగం : గట్టి లాభాలు, బరువు కూడా తగ్గొచ్చు!)కానీ ఇప్పుడు డిమాండ్ పెరగడంతో ఏ రోజు హాలు ఖాళీ ఉందో ఆరోజు ముహూర్తం పెట్టుకోవల్సిన పరిస్ఠితి వచి్చంది. ముఖ్యంగా ఫంక్షన్ హాళ్లు, బాంక్వేట్ హాళ్లలో వేడుకలకు ఖర్చు తక్కువ కావడంతోపాటు బంధువులకు భద్రత, విలువైన వస్తువులకు రక్షణ ఎక్కువ. కానీ గ్రౌండ్లలో, ఖాళీ మైదానాలలో పెళ్లి చేయాలంటే చాలా ఖర్చు చేయాల్సిఉంటుంది. భారీ వేదిక, చుట్టుపక్కల, పైన టెంట్లు నిర్మించడం, గాలికి దుమ్ము, ధూళి లేవకుండా మైదానంలో కార్పెట్లు వేయడం, కళ్లు జిగేల్మనిపించే విద్యుత్ దీపాలు, సిరీస్ లైట్ల ఏర్పాటు, వాహనాల పార్కింగ్‌కు ప్రత్యేకంగా స్ధలం కేటాయించడం, విలువైన వస్తువులు దొంగతనానికి గురికాకుండా కాపాడుకునేందుకు, బిచ్చగాళ్లు, బయట వ్యక్తులు వచ్చి భోజనం చేయకుండా చూసేందుకు ప్రైవేటు సెక్యురిటీ గార్డులను నియమించడం... ఇదంతా పెద్ద ఖర్చుతో కూడుకున్న పని.మరోపక్క డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని లౌడ్‌స్పీకర్ల యజమానులు, బ్రాస్ బ్యాండ్ నిర్వాహకులు, బారాత్‌లకు అద్దెకిచ్చే ఓపెన్ టాప్ కార్లు, మెర్సిడీస్ బెంజ్ వాహనాలు, గుర్రపు బండ్ల యజమానులు అడ్డగోలుగా చార్జీలు పెంచేశారు. మేకప్‌కు కూడా లక్షల్లోనే... ఈ ఖర్చులన్నీ ఒక ఎత్తైతే వధూవరులు అనవసరంగా చేస్తున్న ప్రీ వెడ్డింగ్, మేకప్ ఖర్చులు హద్దులు దాటుతున్నాయి. వధూవరులతోపాటు బంధువుల మేకప్‌కు సైతం లక్షల్లో ఖర్చు చేస్తున్నారు. -
పెళ్లి తర్వాత అక్కినేనివారి కోడలు ఫోటోషూట్.. బంగారంలా మెరిసిపోతున్న శోభిత!
-
పెళ్లిళ్ల సీజన్.. లెహంగాలో అవనీత్ హాట్నెస్ తగ్గేదే లే! (ఫొటోలు)
-
ఫార్మల్ వేర్లో మతిపోగొట్టే ఫోజులతో బాలీవుడ్ బ్యూటీ మలైక అరోరా (ఫోటోలు)
-
కాబోయే అక్కినేని కోడలు.. స్టన్నింగ్ ఫొటోషూట్
-
ఐటీ ఉద్యోగుల క్రష్‌గా అనన్య (ఫోటోలు)
-
మోడ్రన్ డ్రస్‌లో మెస్మరైజ్ చేసిన ముద్దుగుమ్మ అషురెడ్డి (ఫొటోలు)
-
పాపులర్ యాంకర్, టీవీ నటి మెటర్నిటీ ఫోటోషూట్
-
సీరియల్ హీరోయిన్ దేవలీనా మెటర్నిటీ ఫొటోషూట్ (ఫొటోలు)
-
సీరియల్ నటి నేహా ‘మెటర్నిటీ ఫోటోషూట్’ ఫోటోలు వైరల్
-
మెటర్నిటీ ఫోటో షూట్ : అందమైన అనుభవం
-
Bindu Madhavi: బిందు మాధవి హాట్ ఫోటోషూట్..
-
మోడ్రన్ లుక్‌లో ట్రెండ్ అవుతున్న అనసూయ (ఫోటోలు)
-
ఫోటో షూట్ పిచ్చి: లోయలోకి దూకేసిన కొత్త జంట వీడియో వైరల్
ఫోటోలు, రీల్స్ పిచ్చి ప్రాణాల మీదకి తీసుకొస్తోంది. దీనికి సంబంధించిన అనేక విషాదకర సంఘటనలు వెలుగులోకి వస్తున్నప్పటికీ, ప్రమాదకరమని తెలిసినప్పటికీ కొంతమంది తీరుమారడం లేదు. తాజాగా రాజస్థాన్‌లోని పాలిలో ఫోటో షూట్ సమయంలో జరిగిన ప్రమాదం సంచలనం రేపింది. ఇరుకుగా ఉన్న రైలు పట్టాలపై ఫోటోషూట్ తీసుకుంటూ ప్రాణాల మీదకు తెచ్చుకున్న ఘటన షాకింగ్‌గా మారింది.వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్‌లోని పాలి సమీపంలోని గోర్మ్ ఘాట్ వద్ద పురాతన రైల్వే వంతెన ఉంది. చుట్టూ పచ్చని ప్రకృతితో ఇక్కడి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. అందుకే ఇక్కడికి చాలామంది సందర్శకులు వస్తుంటారు. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం రాజస్థాన్‌లోని బాగ్దీ నగర్‌కు చెందిన కొత్త జంట రాహుల్ మేవాడ (22), భార్య జాహ్నవి (20) కూడా ఈ ప్రదేశానికి వచ్చారు. వీరికి తోడుగా రాహుల్ సోదరి, ఆమె భర్త వచ్చారు. నలుగురూ కలిసి బ్రిడ్జిపై ఫొటో షూట్ చేసుకునే ఉత్సాహంతో మీటర్ గేజ్ ట్రాక్‌పైకి చేరుకున్నారు. పరిసరాలను మైమరిచి ఫోటోలకు ఫోజులిస్తుండగా రైలు దూసుకొచ్చింది. ప్రమాదాన్ని పసిగట్టిన రాహుల్ సోదరి, ఆమె భర్త ట్రాక్‌పై నుంచి పక్కకు వచ్చేసి ప్రమాదం నుంచి బయటపడ్డారు. కొత్త జంట మాత్రం రైలు సమీపానికి వచ్చేదాకా విషయాన్ని గమనించలేదు.राजस्थान के पाली जिले में एक बड़ा हादसा हुआ। राहुल मेवड़ा अपनी पत्नी जाह्नवी संग हेरिटेज पुल पर फोटो शूट करा रहे थे। तभी ट्रेन आ गई। ट्रेन से बचने को दोनों 90 फीट गहरी खाई में कूद गए। दोनों का इलाज जारी है।🚨Disturbing Visual🚨 pic.twitter.com/WwDSTd5jrW— Sachin Gupta (@SachinGuptaUP) July 14, 2024ఇక ఏం చేయాలో అర్థంకాక, రైలు పట్టాలకింద నుజ్జు నుజ్జు కావడం ఖాయం, పక్కనున్న లోయలోకి దూకడం తప్ప వేరే మార్గం లేదని గమనించిన ఆ జంట చేయి చేయి పట్టుకొని 90 అడుగుల లోయలోకి దూకేసింది. ప్రస్తుతం తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. రాహుల్ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం జోధ్‌పూర్ ఆస్పత్రికి తరలించినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
Navya Nair : స్టన్నింగ్ లుక్స్‌తో ఆకట్టుకుంటున్న నవ్య నాయర్ (ఫోటోలు)
-
Malaika Arora: బాలీవుడ్ బ్యూటీ అవుట్ ఫిట్ పిక్స్ వైరల్ (ఫోటోలు)
-
Anikha Surendran: ‘ఓహ్ మై డార్లింగ్’ హీరోయిన్ అనిఖా సురేంద్రన్ అందమైన లుక్స్ (ఫోటోలు)
-
Eesha Rebba Photos: హాట్ ఫోజులతో కిర్రెక్కిస్తోన్న ఈషా రెబ్బ (ఫొటోలు)
-
Kavya Kalyanram Photos: బలగం బ్యూటీ ఫోటోషూట్.. కావ్య కల్యాణ్‌రామ్ స్మైల్‌కి నెటిజన్లు ఫిదా (ఫొటోలు)
-
యంగ్ హీరోయిన్‌కు ప్రెగ్నెన్సీ.. ఫోటోషూట్ వైరల్!
కన్నడ హీరోయిన్ ఆదితి ప్రభుదేవా శాండల్‌వుడ్‌లో పరిచయం అక్కర్లేని పేరు. శాండల్‌వుడ్‌లో ధైర్యం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ పలు సినిమాల్లో నటించింది. బ్రహ్మచారి, ఓల్డ్ మాంక్, సింగ, తోతాపురి చాప్టర్ -1 లాంటి చిత్రాలతో శాండల్‌వుడ్‌లో గుర్తింపు తెచ్చుకుంది. సినిమాలతో బిజీగా ఉండగానే.. 2022లో వివాహాబంధంలోకి అడుగుపెట్టింది. వ్యాపారవేత్త యషాస్ను వివాహం చేసుకుంది. అయితే కొత్త ఏడాది ప్రారంభంలోనే అభిమానులకు గుడ్ న్యూస్ కూడా చెప్పింది. తాను గర్భం ధరించినట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది ముద్దుగుమ్మ. ఆ తర్వాత తన భర్తతో ఉన్న ఫోటోలను షేర్ చేసింది. అంతే కాకుండా నెల క్రితమే ఆదితి సీమంతం వేడుక ఘనంగా నిర్వహించారు. బెంగళూరులోని ఆమె నివాసంలో బేబీ షవర్ వేడుకలో బంధువులు, సన్నిహితులు పాల్గొన్నారు. శాండల్‌వుడ్‌కు చెందిన పలువురు నటీనటులు కూడా హాజరై కాబోయే తల్లిదండ్రులను ఆశీర్వదించారు. తాజాగా ఈ ముద్దుగుమ్మ మెటర్నిటీ ఫోటో షూట్ నిర్వహించింది. తన భర్తతో పాటు దిగిన ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. చివరికీ నా చిన్న కోరిక కూడా తీరింది.. అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. ఇది చూసిన అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. చాలా అద్భుతంగా ఉందంటూ పోస్టులు పెడుతున్నారు. ప్రస్తుతం ఆదితి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by ADITI PRABHUDEVA (@aditiprabhudeva) -
రెడ్ చీరలో RGV గర్ల్ అప్సర రాణి హాట్ ట్రీట్ (ఫొటోలు)
-
అయ్ బాబోయ్ ఇదేంటండీ!
‘వెర్రి వెయ్యి విధాలు’ అంటారు. ఆ జాబితాలో అర్జంటుగా చేర్చదగ్గ వెర్రి ఇది. కర్నాటకలోని చిత్రదుర్గ ప్రభుత్వ ఆస్పత్రిలోని కాంట్రాక్ట్–బేస్డ్ ఫిజీషియన్ అభిషేక్ తన ప్రి–వెడ్డింగ్ షూట్ కోసం అందరిలాగా ఆహ్లాదకరమైన, అందమైన ప్రదేశాన్ని ఎంచుకోలేదు. ఏకంగా ఆపరేషన్ థియేటర్‌నే ఎంచుకున్నాడు. ఈ వీడియోలో బెడ్‌పై పడుకున్న పేషెంట్‌కు సర్జరీ చేస్తున్నట్లు డాక్టర్ నటిస్తుంటే, కాబోయే శ్రీమతి సర్జరీకి తనవంతుగా సహకరిస్తున్నట్లు నటించింది. (ఉత్తుత్తి) ఆపరేషన్ పూర్తికాగానే (ఉత్తుత్తి) పేషెంట్ లేచి ‘ఇప్పుడు నాకు ఫరవాలేదు’ అన్నట్లుగా కూర్చోవడం మరో వినోదం. ఆపరేషన్ థియేటర్లో కెమెరాలు, లైట్లతో హడావిడి చేస్తున్న వ్యక్తులు కనిపిస్తారు.ఈ వీడియో వీర లెవెల్లో వైరల్ కావడం మాట ఎలా ఉన్నా సదరు డాక్టర్‌ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది.ఈ వీడియో పుణ్యమా అని ప్రభుత్వ ఆస్పత్రుల్లోని లో΄ాల నుంచి వెర్రితలలు వేస్తున్న ప్రి–వెడ్డింగ్ షూట్ల వరకు ఎన్నో విషయాలపై గరం గరంగా నెటిజనులు చర్చ చేస్తున్నారు. -
స్టూడెంట్‌తో అసభ్య ఫోటోషూట్.. టీచర్ సస్పెండ్
పదో తరగది విద్యార్ధితో ఫోటోషూట్ చేసి.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన టీచర్‌పై సస్పెన్షన్ వేటు పడింది. విద్యార్థి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బీఈవో ఉమాదేవి పాఠశాలను సందర్శించి విచారణ చేపట్టి ఉన్నతాధికారులకు నివేదిక అందించారు. బీఈవో ఇచ్చిన నివేదిక ఆధారంగా చిక్కబళ్లాపూర్ జిల్లా విద్యాశాఖ డిప్యూటీ డైరెక్టర్ సదరు ఉపాధ్యాయురాలిని సస్పెండ్ చేస్తూ చర్యలు చేపట్టారు. ఈ మేరకు ప్రధాన ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేస్తూ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్ (డీడీపీఐ) బైలాంజినప్ప ఉత్తర్వులు జారీ చేశారు అసలేం జరిగిందంటే.. కర్ణాటకలోని చిక్కబళ్లపూర్లోని మురుగమళ్ల ప్రభుత్వ పాఠశాలకు చెందిన విద్యార్ధులు, ఉపాధ్యాయులు విహారయాత్రకు వెళ్లారు. అక్కడ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పుష్పలత, పదో తరగది చదువుతున్న విద్యార్ధితో కలిసి అసభ్యకరంగా ఫోటోలు దిగారు. టీచర్ అనే పదానికి అర్ధాన్ని మార్చేస్తూ స్టూడెంట్‌తో లవర్‌లాగా పోజులు ఇచ్చారు. ముద్దులు కౌగిలింతలతో హద్దులు మీరి ప్రవర్తించారు. విద్యార్ధి సైతం ఉపాధ్యాయురాలిని ఎత్తుకొని, ప్రేమతో ఆమె కొంగు లాగుతున్నట్లు ఫోటోలకు పోజులు ఇచ్చాడు. ఇంకేముంది ఈ ఫోటోలోను అమిత్ సింగ్ రాజవత్ అనే వ్యక్తి ట్విటర్లో పోస్టు చేయడంతో నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. Where are we heading as a society ? Pictures and videos from a romantic photoshoot of a government school teacher with a Class 10 student in Karnataka's Murugamalla Chikkaballapur district, went viral, following which the student's parents filed complaint with the Block… pic.twitter.com/WviIHtOP3J — Amit Singh Rajawat (@satya_AmitSingh) December 28, 2023 ఈ ఫోటోషూట్‌పై నెటిజన్లు మండుపడుతున్నారు. గౌరవమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ ఆ పదవికి కలంకం తెచ్చే ప్రవర్తించిన టీచర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేగాక విద్యార్ధిపై కూడా చివాట్లు పెడుతున్నారు. వీళ్ల కారణంగా ఇతరులు చెడిపోయే ప్రమాదం ఉందని, ఇద్దరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాడు. మరోవైపు ఫోటోషూట్ సమాచారం తెలుసుకున్న విద్యార్థి తల్లిదండ్రులు బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ (బీఈవో)కి ఫిర్యాదు చేసి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. పాఠశాలకు వెళ్లి సైతం టీచర్‌తో గొడవకు దిగారు. దీంతో ఫిర్యాదు అందుకున్న బీఈవో ఉమాదేవి పాఠశాలను సందర్శించి విచారణ చేపట్టి టీచర్‌ను సస్పెండ్ చేశారు. -
కెమెరాల్లో రీళ్లు వేసుకుని, ఫొటోలు తీసేలా ఫిల్మ్‌రోల్
డిజిటల్ కెమెరాలు, స్మార్ట్ఫోన్లు వచ్చాక రీళ్లు వేసుకునే పాతకాలం కెమెరాలు కనుమరుగైపోయాయి. పాత పద్ధతిలో కెమెరాల్లో రీళ్లు వేసుకుని, ఫొటోలు తీయడం ఇష్టపడేవారి కోసం తాజాగా డిజిటల్ ఫిల్మ్‌రోల్ అందుబాటులోకి వచ్చింది. అమెరికన్ ఫొటోగ్రఫీ కంపెనీ ‘ఐయామ్ బ్యాక్’ ఈ డిజిటల్ ఫిల్మ్రోల్ను ఇటీవల రూపొందించింది. ఇందులోని ఫిల్మ్ రోల్ హోల్డర్‌లో 20 మెగాపిక్సెల్ సోనీ 4/3 సెన్సర్, బ్యాటరీ, మెమరీ కార్డ్ స్లాట్ ఉంటాయి. ఈ డిజిటల్ ఫిల్మ్ రోల్ హోల్డర్‌ను ఎలాంటి 35 ఎంఎం కెమెరాలోనైనా ఉపయోగించుకోవచ్చు. పాతకాలం నికాన్, కేనన్, పెంటాక్స్, ఒలింపస్ తదితర కంపెనీల 35 ఎంఎం కెమెరాల్లో ఈ డిజిటల్ ఫిల్మ్రోల్ను వేసి, వాటితో ఇంచక్కా ఫొటోలు తీసుకోవచ్చు. ప్రస్తుతం ఇది ‘కిక్‌స్టార్టర్’ ద్వారా ఆన్లైన్లో ప్రీఆర్డర్‌పై అందుబాటులో ఉంది. వచ్చే ఏడాది మార్చి నాటికి మార్కెట్లోకి అందుబాటులోకి రానుంది.