
హీరో నితిన్ గతేడాది తండ్రిగా ప్రమోషన్ పొందాడు.

అతడి భార్య షాలిని కందుకూరి 2024 సెప్టెంబర్‌లో పండంటి కుమారుడికి జన్మనిచ్చింది.

2024 తమకు బెస్ట్ గిఫ్ట్ ఇచ్చిందంటూ షాలిని ఓ వీడియో షేర్ చేసింది.

అందులో షాలిని బేబీ బంప్‌తో కనిపించింది.

డెలివరీ తర్వాత బాబును ఎత్తుకుని ఉంది.

పిల్లాడితో కలిసి నితిన్ దంపతులు క్రిస్మస్ కూడా సెలబ్రేట్ చేసుకున్నారు.

ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రేష్ట్ మూవీస్ అధినేత సుధాకర్ రెడ్డి తనయుడే నితిన్ .

తండ్రి నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ కావడంతో చిన్నప్పటినుంచే నితిన్‌పై సినిమాల ప్రభావం ఉంది.

అలా జయం చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయ్యాడు. ఫస్ట్ సినిమాతోనే హిట్ కొట్టాడు. వరుస సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నితిన్ ప్రస్తుతం రాబిన్ హుడ్ సినిమాతో బిజీగా ఉన్నాడు.