Maternity
-
మెటర్నిటీ ఫోటో షూట్ : అందమైన అనుభవం
-
Maternity Photoshoot: నిండు నెలల జ్ఞాపకం
ప్రీ వెడ్డింగ్ షూట్ వెడ్డింగ్ షూట్ తెలిసిందే. కాని ఇప్పుడు మెటర్నిటీ షూట్ ట్రెండ్‌లో ఉంది. స్త్రీలు తమ నిండు గర్భం సమయంలో భర్తతో కలిసి ఫొటో షూట్లో పాల్గొనడం ఒక ముఖ్య ఉత్సవంగా మారింది. తాజాగా దీపికా పడుకోన్ విడుదల చేసిన మెటర్నిటీ షూట్ ఫొటోలు ఈ ట్రెండ్ గురించి ప్రొత్సాహంగా మాట్లాడుతున్నాయి.తొలి చూలుతో పుట్టింటికి వచ్చిన కూతురు రేపో మాపో కాన్పు అవుతుందనగా ‘నొప్పులొస్తే నన్ను లేపమ్మా’ అందట నిద్రపోతూ. అప్పుడు తల్లి నవ్వుతూ ‘పిచ్చిపిల్లా... నొప్పులొస్తుంటే నేను నిన్ను లేపడం కాదే. నువ్వే గోల చేసి ఊరంతా లేపుతావు’ అందట. మాతృత్వపు మధురిమ స్త్రీ జీవితంలో అత్యంత ముఖ్యమైనది. గర్భం దాల్చడంతో మొదలు నెలలు నిండుతూ వెళ్లడం, శరీరంలో మార్పు ఉదర భాగం బిడ్డకు గూడుగా మారుతూ ఎదుగుతూ ఉండటం, ఆ మార్పులన్నీ చూసుకోవడం, చివరకు కాన్పు జరిగి అంతవరకూ గర్భంలో ఉన్న బిడ్డ ఒడికి చేరడం... స్త్రీకి ఇదంతా అద్భుత ఘట్టం. మానసిక శాస్త్ర అధ్యయనం ప్రకారం చాలామంది స్త్రీలకు గర్భం దాల్చినప్పుడు ఆ నిండుదనాన్ని నలుగురికీ చెప్పుకోవాలని ఉంటుందట. నిండు గర్భంతో అప్పుడప్పుడు నలుగురిలోకి రావడాన్ని ఇష్టపడతారట. కాలక్రమంలో ఈ ఇష్టం ఆ క్షణాలను ఫొటోలుగా దాచుకునే వరకూ వచ్చింది.1991లో మొదలైన ట్రెండ్హాలీవుడ్ ప్రసిద్ధ నటి డెమి మూర్ 1991లో తన ఏడు నెలల గర్భాన్ని ప్రదర్శిస్తూ ఒక మేగజీన్ కవర్ పేజీ మీద కనపడినప్పుడు అది ప్రపంచ వ్యాప్తంగా పెను సంచలనం అయ్యింది. ప్రఖ్యాత మహిళా ఫొటోగ్రాఫర్ ఆనీ లీబోవిజ్ ఈ ఫొటో తీసింది. చాలామంది దీనిని స్త్రీ శరీర ధర్మానికి సంబంధించిన ఒక గౌరవ ప్రకటనగా భావిస్తే మరికొందరు ఇందులో అశ్లీలత ఉందని విమర్శలు చేశారు. అయితే కాలక్రమంలో సెలబ్రిటీలు చాలా మంది మెటర్నిటీ ఫొటోస్ను జనం ముందుకు తీసుకురాసాగారు.2012 నుంచి ఇండియాలోమన దేశంలో బాలీవుడ్ నుంచి సెలబ్రిటీలు మెటర్నిటీ షూట్‌ను 2010 నుంచి పరిచయం చేయసాగారు. కొంకణా సేన్, సోహా అలీ ఖాన్, నేహా ధూపియా, బిపాషా బసు, అనుష్కా శర్మ, కరీనా కపూర్, సోనమ్ కపూర్, ఇటీవల ఆలియా భట్... వీళ్ల ఫొటోషూట్లు సామాన్యజనానికి కుతూహలం రేకెత్తించాయి. మనం కూడా ఎందుకు ఇలాంటి జ్ఞాపకాలు నిక్షిప్తం చేసుకోకూడదు అనిపించేలా చేశాయి. ఇప్పుడు దీపికా పడుకోన్ తన భర్త రణ్వీర్ సింగ్‌తో కలిసి బ్లాక్ అండ్ వైట్‌లో చేసిన మెటర్నిటీ షూట్ అందరి చేత ప్రశంసలు పొందుతోంది. రెండు ఫ్యాషన్ బ్రాండ్ల నుంచి ప్రత్యేకంగా ఎంచుకున్న దుస్తులతో దీపిక ఈ షూట్ చేసింది. రణ్వీర్ సింగ్ ఈ షూట్లో సంబరంగా పాల్గొన్నాడు.మధ్యతరగతికి దూరం కాదుమెటర్నిటీ షూట్లకు సెలబ్రిటీలు లక్షలు ఖర్చు పెడుతుంటే మధ్యతరగతి స్త్రీలకు అదేమీ అందని కల కాదు. ్ర΄÷ఫెషనల్ ఫొటోగ్రాఫర్లతో మొదలు హాబీగా ఫొటోలు తీసేవారి వరకూ ఇలాంటి ఫొటోలు తీసి పెట్టేవారు ఉన్నారు. నాలుగు గంటల వ్యవధిలో మూడు రకాల డ్రస్సులతో ఫొటోలు తీసి పెట్టే ΄్యాకేజీలు కూడా ఉన్నాయి. ‘ఒకప్పుడు గర్భిణులు కెమెరా ముందుకు రావడానికి సిగ్గు పడేవారు. కాని తమ మాతృత్వ దశలను పదిలం చేసుకునేందుకు ఇప్పుడు సంతోషంగా ముందుకొస్తున్నారు’ అని ఇలాంటి ఫొటోలు తీసే ఒక ఫొటోగ్రాఫర్ అన్నారు.థీమ్ ఫొటోలుప్రెగ్నెన్సీ షూట్లో కూడా థీమ్స్ ఉన్నాయి. పల్లెటూరి జంటలుగా, నగర శ్రీమంతులుగా, గుడి ్రపాంగణంలో, తెలుగుదనంతో ఇలా చాలా రకాలున్నాయి. ఎనిమిదవ నెలలో ఈ ఫొటోషూట్ చేయించుకుంటే ఫొటోలు బాగావస్తాయంటున్నారు నిపుణులు. ఇంకెందుకు ఆలస్యం. మీ మనసులో ఈ ముచ్చట ఉంటే వెంటనే అందుకు సిద్ధం కండి. -
పెళ్లే వద్దన్నాడు.. భార్యతో కలిసి గుడ్‌న్యూస్ చెప్పిన రాకింగ్ రాకేశ్ (ఫోటోలు)
-
యంగ్ హీరోయిన్‌కు ప్రెగ్నెన్సీ.. ఫోటోషూట్ వైరల్!
కన్నడ హీరోయిన్ ఆదితి ప్రభుదేవా శాండల్‌వుడ్‌లో పరిచయం అక్కర్లేని పేరు. శాండల్‌వుడ్‌లో ధైర్యం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ పలు సినిమాల్లో నటించింది. బ్రహ్మచారి, ఓల్డ్ మాంక్, సింగ, తోతాపురి చాప్టర్ -1 లాంటి చిత్రాలతో శాండల్‌వుడ్‌లో గుర్తింపు తెచ్చుకుంది. సినిమాలతో బిజీగా ఉండగానే.. 2022లో వివాహాబంధంలోకి అడుగుపెట్టింది. వ్యాపారవేత్త యషాస్ను వివాహం చేసుకుంది. అయితే కొత్త ఏడాది ప్రారంభంలోనే అభిమానులకు గుడ్ న్యూస్ కూడా చెప్పింది. తాను గర్భం ధరించినట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది ముద్దుగుమ్మ. ఆ తర్వాత తన భర్తతో ఉన్న ఫోటోలను షేర్ చేసింది. అంతే కాకుండా నెల క్రితమే ఆదితి సీమంతం వేడుక ఘనంగా నిర్వహించారు. బెంగళూరులోని ఆమె నివాసంలో బేబీ షవర్ వేడుకలో బంధువులు, సన్నిహితులు పాల్గొన్నారు. శాండల్‌వుడ్‌కు చెందిన పలువురు నటీనటులు కూడా హాజరై కాబోయే తల్లిదండ్రులను ఆశీర్వదించారు. తాజాగా ఈ ముద్దుగుమ్మ మెటర్నిటీ ఫోటో షూట్ నిర్వహించింది. తన భర్తతో పాటు దిగిన ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. చివరికీ నా చిన్న కోరిక కూడా తీరింది.. అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. ఇది చూసిన అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. చాలా అద్భుతంగా ఉందంటూ పోస్టులు పెడుతున్నారు. ప్రస్తుతం ఆదితి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by ADITI PRABHUDEVA (@aditiprabhudeva) -
అక్కడ..అబ్బాయే అత్తారింటికి వస్తాడు..
ఇప్పటికీ చాలా కుటుంబాల్లో కొడుకు పుట్టగానే వారుసుడు పుట్టాడంటూ ఘనంగా వేడుకలు చేస్తారు. కానీ ఇక్కడ మాత్రం ఆడిపల్ల పుడితేనే సెలబ్రేషన్స్. ఆడిపిల్లలకే ఆస్తి ఇస్తారు. ఆఖరికి అక్కడి మహిళలు అత్తారింటికి వెళ్లరు. అబ్బాయిలే అత్తారింటికి వస్తారు. దశాబ్దాలుగా సాగుతున్న పితృస్వామ్య వ్యవస్థకు పూర్తి విభిన్నంగా ఉంటారని చెప్పొచ్చు. ఆ వ్యవస్థ విదేశాల్లోనేమో! అనుకోకండి. మనదేశంలోనే ఈ వ్యవస్థ ఉంది. ప్రపంచ మహిళా దినోత్సవం నేపథ్యంలో మనదేశంలో ఉన్న ఆ ప్రదేశం ఎక్కడ ఉంది? ఏంటా వింత ఆచారాలు తెలుసుకుందామా!. గిరిజనులు అనగానే బాగా వెనుకబడిన వాళ్లు, అమాయకులు అనుకుంటాం. మేఘాలయ రాష్ట్రంలోని గిరిజన తెగను చూస్తే మీ అభిప్రాయం మార్చుకుంటారు. ఆ తెగల ఆచారాలు సంప్రదాయలను చూసి సమాజానికి ఎంత స్ఫూర్తిగా ఉన్నాయా ? అని ఆశ్చర్యపోవడం ఖాయం. మనమే చాలా వెనకబడి ఉన్నామా? అన్నా సందేహం కూడా వస్తుంది. ఇలా ఎందుకు చెబుతున్నానంటే.. ఆడపిల్లకే పట్టం.. మేఘాలయలోని ఖాసీ, గరో అనే తెగలు మయాన్మార్, బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన తెగలు. ఈ తెగలు మేఘలయాలోని జైంటియా అనే పర్వత ప్రాంతాల్లో స్థిరపడ్డారు. అయితే ఈ తెగలు దశాబ్దాలకు పూర్వమే కొన్ని నియమాలు, పద్ధతులు పెట్టుకున్నారు. వాటినే ఇప్పటికీ ఆచరిస్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు. అక్కడ ఆడపిల్ల పుడితేనే వేడుకగా సెలబ్రేషన్స్ చేస్తారు. ఆడపిల్లకే పట్టం కడతారు.పెత్తనం అంతా ఆడపిల్లదే. ఆడపిల్లకే ఆస్తి ముట్టజెప్పుతారు. ఆఖరికిగా ఆడపిల్ల అత్తారింటికి వెళ్లదు. వరుడే అత్తారింటికి ఇళ్లరికం అల్లుడుగా వస్తాడు. అయితే ఆ తెగలోని ఆడపిల్లలు తమ తెగలోని అబ్బాయిని కాకుండా మరో జాతి అబ్బాయిని పెళ్లి చేసుకుంటే ఈ నియమాలు వర్తించవట. అలాగే అక్కడి కుటుంబాల్లో ఒకరికి మించి ఎక్కువమంది ఆడిపిల్లలు ఉంటే..చిన్న కూతురు తప్పించి మిగతా వాళ్లంతా తమ భర్తలతో అదే ఇంట్లో ఉండోచ్చు. అక్కడ చిన్న అమ్మాయిని ఖథూగా పరిగిణిస్తారు. ఆ అమ్మాయికి పెళ్లి తర్వాత ఇంటి భాద్యతలు, ఆస్తిపాస్తులన్నీ ఆమెకే ఇస్తారు. ఆఖరికీ తల్లి మరణం తర్వాత ఇంటి భాద్యతలన్నీ నిర్వర్తించాల్సి కూడా ఆమెనే. అంతేగాదు పుట్టబోయే పిల్లలకు ఇంటిపేరు కూడా తల్లి ఇంటి పేరే పెడతారు. అలాగే పిల్లల పోషణ, బాధ్యతలు నిర్వర్తించే విషయంలో కూడా ఆడవాళ్లకే ఎక్కువ హక్కులు ఉంటాయట. అందువల్లే ఇక్కడ మహిళలు వ్యవసాయం, ఇతర ఉద్యోగాల్లో వాళ్లే బాగా రాణిస్తారట. ఇలా ప్రతి విషయంలో పురుషుల కంటే మహిళలదే పైచేయి కావడంతో అక్కడ గృహహింస,అత్యాచారాలు, వేధింపులు ఉండవని అక్కడ స్థానికులు చెబుతున్నారు. సమానత్వం కోసం పురుషుల పోరాటం.. ఇలా ఇక్కడ దశాబ్దాలుగా మాతృస్వామ్య వ్యవస్థే రాజ్యమేలుతోంది. అయితే ప్రపంచంలో చాలా చోట్ల స్త్రీలకు సమాన హక్కుల ఉండాలని, లింగ సమానత్వం కోసం తెగ పోరాటాలు చేస్తుంటే ఆ ఖాసీ, గరో తెగకు చెందిన పురుషులు మాత్రం తమ సమానత్వం కోసం ఏళ్లుగా పోరాడుతుండటం విశేషం. ఇందుకోసం 1990 నుంచి ఓ స్వచ్ఛంద సంస్థ నిరంతరం కృషి చేస్తోందని స్థానికులు చెబుతున్నారు. ఏదీఏమైన ఈ రెండు తెగలు సమాజానికి స్ఫూర్తిగా మంచి నియమాలు పెట్టుకున్నాయి కదూ!. అయితే ఇలాంటి ఆచారమే 20వ శతాబ్దానికి పూర్వమే కేరళలోని నాయర్ తెగలో కూడా ఉండేదట. (చదవండి: వజ్రాలు, వైఢ్యూర్యాలతో డిజైన్ చేసిన జాకెట్..ధర ఏకంగా..!) -
త్వరలో పేరెంట్స్‌గా ప్రమోషన్.. బుల్లితెర జంట కుప్పిగంతులు, ట్రోలింగ్
బిగ్‌బాస్ జోడీ సింగర్ రాహుల్.. నటి దిశా పార్మర్ త్వరలో పేరెంట్స్‌గా ప్రమోషన్ పొందనుండటంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఇటీవలే మెటర్నటీ ఫోటోషూట్ కూడా చేసి ఆయా ఫోటోలను ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. అయితే మెటర్నటీ షూట్ సందర్భంలో చేసిన చిలిపి పనులను, కుప్పి గంతులను తాజాగా వీడియో రూపంలో రిలీజ్ చేశారు. నలుపు రంగు దుస్తుల్లో ఉన్న రాహుల్- దిశా సంతోషంతో ఎగిరి గంతేస్తున్నారు. దిశా బేబీ బంప్‌ను ఆప్యాయంగా తడుముతూ ముద్దు పెట్టాడు రాహుల్. అభిమానులు వీరి ఆనందాన్ని చూసి మురిసిపోతుంటే మరికొందరు మాత్రం ఇంత ఓవరాక్షన్ అవసరమా? అని కామెంట్లు చేస్తున్నారు. ప్రెగ్నెన్సీని కూడా అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు, ప్రపంచంలో పిల్లలను కంటున్న మొదటి జంట మీదే అన్నట్లుగా బిల్డప్ ఇస్తున్నారే అని ట్రోల్ చేస్తున్నారు. అలా మొదలైంది.. సింగర్ రాహుల్ హిందీ బిగ్‌బాస్ 14వ సీజన్లో పాల్గొన్నాడు. వీకెండ్ కా వార్ ఎపిసోడ్లో దిశా బిగ్‌బాస్ ఇంట్లో ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలో ఆమె బర్త్‌డే రోజు తన మనసులో ఉన్న ప్రేమను బయటపెట్టాడు రాహుల్. మోకాళ్ల మీద కూర్చుని పెళ్లి చేసుకోమని అడిగాడు. అందుకు ఆమె పచ్చజెండా ఊపడంతో 2021 జూలై 16న పెద్దల సమక్షంలో వీరి పెళ్లి జరిగింది. 2023 మే 18న అమ్మానాన్న కాబోతున్నామంటూ రాహుల్, దిశ గుడ్‌న్యూస్ చెప్పారు. View this post on Instagram A post shared by Disha Parmar Vaidya (@dishaparmar) చదవండి: మళ్లీ పెళ్లి ఏ ఓటీటీలోకి రానుందంటే? -
ప్రసూతి సమస్యలకు ఆధునిక వైద్యం
తిరుపతి తుడా: మూడు రోజులుగా తిరుపతిలో ప్రసూతి, గైనకాలజీ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి వైద్య సదస్సు ఆదివారంతో ముగిసింది. ఆధునిక విధానాలతో పాటు ప్రసూతి వైద్యంలో సందేహాలను నిపుణులు నివృత్తి చేశారు. చివరి రోజు మొత్తం నాలుగు సెషన్లలో సదస్సు జరిగింది. గర్భిణుల్లో మూర్ఛ వ్యాధి, గర్భధారణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై స్విమ్స్ డైరెక్టర్ వెంగమ్మ సూచనలు చేశారు. ‘సేఫ్ మదర్, సేఫ్ బేబీ, సేఫ్ గైనకాలజిస్ట్‘ అనే అంశంపై డాక్టర్ పద్మజ మాట్లాడారు. ఈ ఏడాది ప్రసూతి, గైనకాలజీ సొసైటీ నినాదం కూడా అదే కావడం విశేషం. గర్భిణిల్లో థైరాయిడ్, తీసుకోవాల్సిన జాగ్రత్తలను డాక్టర్ కావ్య వివరించారు. ఇన్ ఫెర్టిలిటీలో ల్యాప్రోస్కోపీ పాత్రపై డాక్టర్ రామచంద్రయ్య ప్రసంగించారు. అనంతరం పీజీ వైద్య విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించి బహుమతులు ప్రదానం చేశారు. పేపర్ ప్రజెంటేషన్‌లో విజేతలుగా నిలిచిన వారికి జ్ఞాపికలను బహూకరించారు. కార్యక్రమంలో తిరుపతి గైనకాలజీ సొసైటీ ప్రెసిడెంట్ డాక్టర్ భారతి, ఉపాధ్యక్షులు సునీత సుబ్రమణ్యం, ఆశాలత, ఆర్గనైజింగ్ చైర్పర్సన్ లక్ష్మీ సుశీల, ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ పార్ధసారధిరెడ్డి, శేషసాయి, సునీత, మాధవి, భవాని, శ్రీదేవి, పద్మావతి, రాధ, ఉమాదేవి, భువనేశ్వరి తదితరులు పాల్గొన్నారు. -
మెటర్నిటీ బీమా క్లెయిమ్ .. ఇలా సులభతరం
యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ (యూఎన్ఎఫ్పీఏ) ఇటీవలి గణాంకాల ప్రకారం 2017లో ప్రసూతి సంబంధ కారణాలతో 2,95,000 మంది మహిళలు మరణించారు. వీటిలో చాలా మటుకు మరణాలు నివారించతగినవే. సాధారణంగా మెట ర్నిటీ, తత్సంబంధ వ్యయాలనేవి జీవితంలో భాగ మే అయినా ముందుగా ఊహించని వైద్య ఖర్చులేవైనా ఎదురైతే ఆర్థికంగా సన్నద్ధంగా ఉండాలి. ఇందుకు మెటర్నిటీ ఇన్సూరెన్స్ ఉపయోగపడుతుంది. దీనితో నార్మల్, సిజేరియన్ డెలివరీలకు కవరేజీ లభిస్తుంది. అయితే, పాలసీ, కవరేజీ రకాన్ని బట్టి ప్రయోజనాలు మారుతుంటాయి. సాధారణంగా మెటర్నిటీ ప్లాన్లలో కవర్ అయ్యేవి చూస్తే.. ఏవైనా సమస్యల వల్ల గర్భాన్ని తొలగించాల్సి రావడం, నిర్దిష్ట పరిమితి వరకూ నవజాత శిశువుకు కూడా కవరేజీ మొదలైన ప్రయోజనాలు ఉంటాయి. ప్రసవానికి ముందు, తర్వాత అయ్యే ఖర్చులు (డాక్టర్ కన్సల్టేషన్, రూమ్ చార్జీలు మొదలైనవి) కూడా కవర్ అవుతాయి. ఇక, ప్రీ–హాస్పిటలైజేషన్ ఖర్చులకూ (అడ్మిషన్ తేదికి ముందు 30 రోజుల వరకు అయ్యే వ్యయాలు) కవరేజీ ఉంటుంది. క్లెయిమ్ ప్రక్రియ .. ఇన్సూరెన్స్ సంస్థ, సౌకర్యాన్ని బట్టి ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్ మార్గాల్లో మెటర్నిటీ ఇన్సూరెన్స్‌ను క్లెయిమ్ చేయొచ్చు. ఆస్పత్రిని బట్టి క్యాష్‌లెస్ లేదా రీయింబర్స్మెంట్ విధానాన్ని ఎంచుకోవచ్చు. ఒకవేళ ఆన్లైన్ ప్రక్రియను ఎంచుకునే పక్షంలో... - డెలివరీకి ఆస్పత్రిలో చేరుతున్న విషయాన్ని బీమా సంస్థకు ముందుగా తెలియజేసి, అవసరమైన వివరాలు ఇవ్వాలి. - ఆ తర్వాత క్లెయిమ్ ఫారంను డౌన్లోడ్ చేసుకుని, అవసరమైన పత్రాలతో కలిపి సమర్పించాలి. - వివరాలను బీమా సంస్థ ప్రతినిధితో వె రిఫై చేయించుకోవాలి. - మరోవైపు, ఆఫ్‌లైన్ విషయానికొస్తే ఆయా పత్రాలను సమీపంలోని బీమా సంస్థ బ్రాంచ్‌లో సమర్పించి, క్లెయిమ్‌ను ఫైల్ చేయాలి. - క్లెయిమ్ ప్రక్రియ సులభతరంగా ఉండాలంటే పాలసీ పత్రాలు, క్లెయిమ్ ఫారం తప్పనిసరి గా దగ్గర ఉంచుకోవాలి. - అలాగే కన్సల్టేషన్ బిల్లు, అడ్మిషన్ సిఫార్సు, డిశ్చార్జి రసీదు, ఆస్పత్రి .. ఫార్మసీ ఒరిజినల్ బిల్లులు ఉండటం శ్రేయస్కరం. చదవండి: ఎక్సైడ్ లైఫ్ స్మార్ట్ ఇన్‌కం ప్లాన్ -
ప్రసవించిన ప్రతి తల్లి బిడ్డ క్షేమం కోసం...తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్
పార్వతీపురంటౌన్: ప్రసవానంతరం తల్లీబిడ్డలు ఆస్పత్రినుంచి వారి ఇళ్లకు క్షేమంగా వెళ్లాలని భావించి రాష్ట్రప్రభుత్వం ప్రారంభించిన తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ (102) సర్వీసులు వారికి బాగా సేవలందిస్తున్నాయి. గతంలోనూ ఉన్న ఈ పథకం వాహనాలను ఆధునీకరించి అందుబాటులోకి తీసుకువచ్చింది. బాలింత చేరేగమ్యం ఎంత దూరమైనా, ఏప్రాంతమైనా మేమున్నామంటూ వాహనం ముందుకు వచ్చి సేవలందిస్తోంది. ఒక్క రూపాయి ఖర్చులేకుండా ఉచితంగా వారిని ఇళ్లకు చేరవేస్తూ ఏప్రిల్1న ప్రశంసలు అందుకుంటోంది. రాష్ట్రప్రభుత్వం ఆధునీకరించిన తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహన సేవలు పార్వతీపురం నియోజకవర్గంలో దూసుకుపోతున్నాయి. గత ఏప్రిల్ 1న రాష్ట్రవ్యాప్తంగా 2వ తేదీన పార్వతీపురం పట్టణానికి ఈ వాహనాల సేవలు అందుబాటులోకి వచ్చాయి. తెలుగుదేశం అధికారంలో ఉన్న సమయంలో పార్వతీపురంలో ఈ సేవలు అరకొరగా ఉండేవి. గతంలో ఒక్కో వాహనంలో నలుగురైదుగురు బాలింతలు వెళ్లాల్సివచ్చేది. ఉదయం డిశ్చార్జ్ అయినా సాయంత్రం వరకు ఊళ్లకు వెళ్లే పరిస్థితి ఉండేది కాదు. ఇలాంటి పరిస్థితిని దూరం చేయాలనే ఉద్దేశంతో రాష్ట్రప్రభుత్వం పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి నాలుగు వాహనాలు, పార్వతీపురం మండలానికి ఒక వాహనం, సీతానగరం మండలానికి ఒకటి కేటాయించింది. ఆస్పత్రుల్లో ప్రసవించిన బాలింతలను పూర్తి ఉచితంగా ఈ వాహనాల ద్వారా ఇళ్లకు చేరవేస్తున్నారు. ఈ సేవలతో బాలింతలు, వారి కుటుంబసభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. క్షేమంగా గమ్యం చేర్చడమే లక్ష్యం గతంలో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన బాలింతలు ఎవరికి వారే సొంత వాహనాల్లో ఖర్చుపెట్టుకుని ఇళ్లకు వెళ్లేవారు. ఇప్పుడు రాష్ట్రప్రభుత్వం ఒక్కరూపాయి ఖర్చులేకుండా తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ ద్వారా సొంతిళ్లకు చేరుస్తోంది. ఈ సేవలను నియోజవకర్గ వ్యాప్తంగా అందిస్తున్నాం. ఎస్.మన్మథనాయుడు, 102 సర్వీసుల పర్యవేక్షకుడు -
భర్తతో హీరోయిన్ బేబీ బంప్ ఫొటోలు, వైరల్
హీరోయిన్ ప్రణీత సుభాష్ సంతోషం అంతాఇంతా కాదు. తను ప్రెగ్నెంట్ అని తెలిసిన దగ్గర నుంచి అమ్మ అని పిలిపించుకోవడానికి ఎంతగానో తహతహలాడుతోంది. తాజాగా ఆమె సోషల్ మీడియాలో బేబీ బంప్ ఫొటోలు షేర్ చేసింది. భర్తతో కలిసి దిగిన బ్యూటిఫుల్ ఫొటోలను అభిమానులతో పంచుకుంది. ప్రణీతను ఇలా చూసిన ఫ్యాన్స్ అందమైన యువరాణిలా ఉన్నారు, లవ్యూ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా ప్రణీత 2021 మే 30న వ్యాపారవేత్త నితిన్ రాజును పెళ్లాడింది. ఏప్రిల్ నెలలో తను తల్లి కాబోతున్న విషయాన్ని అభిమానులతో పంచుకుంది. ఈ సంవత్సరంలోనే డెలివరీ జరగనున్నట్లు తెలిపింది. కాగా ప్రణీత ఏం పిల్లో ఏం పిల్లడో సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది. బావ మూవీతో గుర్తింపు సంపాదించుకుంది. అత్తారింటికి దారేది చిత్రంతో బాపుబొమ్మగా మరింత క్రేజ్ తెచ్చుకుంది. View this post on Instagram A post shared by Pranitha Subhash 🧿 (@pranitha.insta) View this post on Instagram A post shared by Pranitha Subhash 🧿 (@pranitha.insta) View this post on Instagram A post shared by Pranitha Subhash 🧿 (@pranitha.insta) చదవండి 👉🏾 మే నాలుగో వారం థియేటర్, ఓటీటీలో సందడి చేసేందుకు వస్తున్న సినిమాలివే! హౌస్‌ఫుల్ బోర్డ్‌తో హీరో.. తనకే టికెట్లు దొరకలేదని ట్వీట్ -
ప్రెగ్నెన్సీ ఇన్సూరెన్స్ ప్లాన్: హాస్పిటల్ బిల్ ఎన్నిరోజులకు చెల్లిస్తారు!
న్యూఢిల్లీ: హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలకు సంబంధించి పరిహారం చెల్లించేందుకు.. బీమా సంస్థలు సగటున 20 నుంచి 46 రోజుల సమయాన్ని తీసుకుంటున్నట్టు ‘సెక్యూర్‌నౌ’ అనే ప్లాట్‌ఫామ్ నిర్వహించిన సర్వేలో తెలిసింది. ► మెజారిటీ పాలసీదారులు తమ ఆస్పత్రిలో చేరిన తర్వాత రీయింబర్స్మెంట్ క్లెయిమ్ విషయాన్ని బీమా సంస్థలకు వెంటనే తెలియజేస్తున్నారు. కానీ, అదే సమయంలో చెల్లింపులు చేసేందుకు అవి ఎక్కువ సమయం తీసుకుంటున్నాయి. ► మేటర్నిటీ క్లెయిమ్‌లకు (ప్రసవ సంబంధిత) చెల్లింపులు చేయడానికి 7 నుంచి 108 రోజుల సమయం తీసుకుంటున్నాయి. సిజేరియన్ క్లెయిమ్ చెల్లింపులకు 9–135 రోజుల సమయం పడుతోంది. ► అతి తక్కువగా కీమోథెరపీకి 12–35 రోజుల్లోపు పరిహారం చెల్లిస్తున్నాయి. ►ఏటా కోటి హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లు నమోదవుతున్నాయి. ►క్లెయిమ్ చేసిన మొత్తంలో 13–26 శాతాన్ని బీమా సంస్థలు కోత పెడుతున్నాయి. కన్జ్యూమబుల్స్, పరిపాలనా చార్జీల కింద ఈ పనిచేస్తు నాయి. వీటికి సాధారణంగా పరిహారం రాదు. ప్రభుత్వరంగ సాధారణ బీమా సంస్థల పరిధిలో ఆస్పత్రిలో చేరే వారి పాలసీదారుల రేటు తక్కువగా ఉంటోంది. దీంతో తక్కువ క్లెయిమ్‌లు రావడం, ఫలితంగా ప్రీమియం రేట్లు తక్కువగా ఉంటున్నాయి మరిన్ని వివరాలు వెల్లడించాలి.. ‘‘ఆరోగ్యబీమా ఎలా అభివృద్ధి చెందిందన్న దానికి ఇది సంకేతం. క్లెయిమ్‌లకు సంబంధించి పూర్తిస్థాయి వివరాలను బహిరంగ పరచడం తదుపరి అడుగు కావాలి. అప్పుడు క్లెయిమ్‌ల పరిష్కారంలో బలాలు, బలహీనతలపై దృష్టి పెట్టడానికి వీలుంటుంది’’అని సెక్యూర్‌నౌ సహ వ్యవస్థాపకుడు కపిల్ మెహతా పేర్కొన్నారు. చదవండి: ఎల్ఐసీ బంపరాఫర్, మరికొన్ని రోజులే..ఈ ఆఫర్ అస్సలు మిస్ చేసుకోవద్దు! -
Maternity Photoshoot: ట్రెండ్.. ప్రెగ్నెన్సీకి గ్లామర్ .. ఫొటోషూట్‌కు అదే అనువైన సమయం!
అమ్మ అవడం అనే వరాన్ని ముందస్తుగా పదిలం చేసుకోవాలనే ఆరాటం ఇటీవల సోషల్ మీడియా పోస్టుల్లో విరివిగా కనిపిస్తోంది. తమ జీవితంలోకి కొత్త అతిథి రాబోతున్నాడనే సూచనను నలుగురికి తెలియజేయాలనే తపనతో పాటు, గర్భంతో ఉన్న అందమైన ఫొటోలను సంతోషంగా షేర్ చేస్తున్నారు. వెండితెర, బుల్లితెర నటీమణులు కూడా ఈ ఆసక్తిని మరింతగా పెంచుతున్నారు. గర్భం అనేది స్త్రీకి జీవితంలో ఒక ప్రత్యేక దశ. తల్లిగా మారే ఈ ప్రయాణంలో కొన్ని కష్టాలు ఎదురైనా ఆనందాన్ని నింపుతుంది. ఇటీవల నటి కాజల్ అగర్వాల్, శ్వేతా అగర్వాల్‌ల బేబీ బంప్ ఫొటోలు నెట్టింట బాగా వైరల్ అయ్యాయి. వారిలాగే ఫొటో షూట్స్ చేసుకోవడానికి ఆసక్తి చూపేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. మెటర్నిటీ ఫొటోషూట్ ఎప్పుడూ గుర్తుండిపోయేలా, ప్రత్యేకంగా ఉండాలనుకునే ట్రెండ్ జోరందుకుంది. కాలేజీ, ఉద్యోగం, పెళ్లిరోజులను ఎంజాయ్ చేయడం ఎంతగా ఇష్టపడతారో అదేవిధంగా ప్రెగ్నెన్సీని పండగలా జరుపుకోవడం నేటి రోజుల్లో అతి ముఖ్యమని ఈ ఫొటోలు చూపుతున్నాయి. ఈ ఫొటోషూట్స్ కోసం ఫొటోగ్రాఫర్లు తమ స్టూడియోలను ప్రత్యేకంగా డిజైన్ చేస్తున్నారు. విభిన్న రకాల డ్రెస్ డిజైన్లనూ గర్భవతుల కోసం రూపొందిస్తున్నారు. అనువైన సమయం ‘బేబీ బంప్ ఫొటో షూట్‌కి ఏడు–ఎనిమిది నెలల సమయం అనువైనది’ అంటున్నారు హైదరాబాద్‌లో బేబీ, ప్రెగ్నెన్సీ ఫొటోగ్రాఫర్‌గా పేరొందిన మనోజ్ఞ. ‘ఈ సమయంలో పొట్టభాగం బాగా కనిపిస్తుంది. పసిపిల్లలను ఫొటోషూట్ చేయడం కన్నా ఇది త్వరగా పూర్తవుతుంది కాబట్టి గర్భవతులకు అలసట ఏమీ ఉండదు. డ్రెస్ కలర్స్, డిజైన్స్ కోసం మాత్రం ప్రత్యేక శ్రద్ధ పెడతాం. ఒక కలర్ థీమ్‌తో అన్ని సైజుల డ్రెస్సులను డిజైన్ చేసి ఉంచుతాను. ఇందుకు విదేశీ డిజైనర్స్‌తోనూ చర్చలు జరుపుతాను’ అంటారీమె. ఎందుకు పెరుగుతోంది అంటే.. ‘కాబోయే తల్లితండ్రులు తమ జీవితంలోకి అడుగిడబోయే కొత్త అతిథిని విభిన్న రకాలుగా ఆహ్వానించడానికి ఆసక్తి చూపుతుంటారు. కొందరు తమ చేతులపై పసిపాప మెహెందీ డిజైన్ చేయించుకొని, ఆ ఫొటోను పోస్ట్ చేస్తూ తాము తల్లిదండ్రులు కాబోతున్న విషయాన్ని పంచుకుంటారు. తమ ప్రెగ్నెన్సీ వార్తలను రకరకాలుగా షేర్ చేయడం లాగే మెటర్నిటీ ఫొటోలను కూడా పంచుకుంటున్నారు’ అంటారు ఫొటోగ్రాఫర్లు. ఇందుకు సంబంధించి తమ స్టూడియోని ప్రెగ్నెన్సీ షూట్‌కి అనువుగా మార్చుకున్నామని చెబుతున్నారు. థీమ్‌లకు పెరిగిన డిమాండ్ కాన్సెప్ట్ షూట్, బ్యాక్‌డ్రాప్ మొత్తం సాదాగా ఉండేలా, ఒంటరిగా దిగే సొలో థీమ్, బోహో థీమ్, డ్రేప్ షాట్.. వంటి థీమ్స్ ప్రస్తుతం డిమాండ్‌లో ఉన్నాయి అంటున్నారు ఫొటోషూట్స్ ఏర్పాటు చేసేవాళ్లు. ఈ ఫొటో షూట్ల సమయంలో హెయిర్ స్టైల్, మేకప్, డ్రెస్ వరకూ ప్రతి దానికీ తమ ప్రొడక్షన్ హౌజ్ నుంచే బాధ్యత తీసుకుంటున్నారు. ఫొటోషూట్ ఖర్చు కూడా ప్రొడక్షన్ హౌజ్, థీమ్, అందులో ఉపయోగించే వస్తువులపైన ఆధారపడి ఉంటుంది. అయితే, ఈ ప్రెగ్నెన్సీ ఫొటో షూట్ విషయంలో ఖర్చుకు వెనకాడటం లేదన్నది వాస్తవం. ఫ్లయింగ్ డ్రెస్ స్టైల్లో.. ప్రీ వెడ్డింగ్ షూట్ వీలుపడనివారు ఈ ప్రెగ్నెన్సీ షూట్ పట్ల మరింత ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రసవం తర్వాత కంటే గర్భంతో ఉన్నప్పుడు జంటగా ఫొటోలు తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు. చాలావరకు బ్రైట్ కలర్స్, ఫ్లయింగ్ డ్రెస్ స్టైల్‌కి మొగ్గు చూపుతున్నారు. ప్రెగ్నెన్సీ ఫొటోషూట్‌కి 2 నుంచి 3 గంటల సమయం కేటాయించాల్సి ఉంటుంది. ఔట్‌డోర్ అయితే గర్భిణులు త్వరగా అలసిపోయే అవకాశం ఉంది. అదే, స్టూడియోలో అయితే విశ్రాంతి తీసుకుంటూ ఫొటోషూట్ పూర్తి చేయవచ్చు. దానికి తగిన విధంగా స్టూడియో థీమ్ ఉంటుంది. శారీస్‌తోనూ ఫొటోషూట్ చేస్తాం. కానీ, సీమంతం సమయంలో తీసే ఫొటోలతో గర్భిణులు సంతృప్తిపడతారు. అందుకే చాలా వరకు వెస్ట్రన్వేర్లో కనిపించాలనుకుంటారు. లాంగ్ ఫ్లయింగ్ స్టైల్ ప్లెయిన్ గౌన్లను బాగా ఇష్టపడుతున్నారు. – మనోజ్ఞారెడ్డి, ఫొటోగ్రాఫర్ అండ్ స్టైలిస్ట్, హైదరాబాద్ -
AP: ప్రసవానికి ప్రభుత్వాస్పత్రికొస్తే రూ.11 వేలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ వైద్య రంగంలో అనేక విప్లవాత్మక సంస్కరణలతో దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది.. ఏపీ ప్రభుత్వం. ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవం చేయించుకున్నవారికి కేంద్రం భాగస్వామ్యంతో రూ.11 వేలు అందిస్తోంది. ఉచిత వైద్యసేవలు, మందులు, ఆహారం, రవాణాకు ఈ రూ.11 వేలు అదనం కావడం విశేషం. ఈ మొత్తాన్ని కూడా నగదు రూపంలో నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తున్నారు. దేశంలో మరే రాష్ట్రంలోనూ ఇలా లేకపోవడం గమనార్హం. ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంల ద్వారా ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికీ చేరవేయాలని ఆదేశించింది. ప్రభుత్వాస్పత్రులకు వస్తే అందే ప్రయోజనాలను వివరంగా చెప్పాలని సూచించింది. రవాణా నుంచి వైద్యసేవలన్నీ ఉచితంగానే.. ప్రభుత్వాస్పత్రులకు ప్రసవం కోసం వచ్చే గర్భిణులకు రవాణా నుంచి మందుల వరకు అన్నీ ఉచితమే. గర్భిణికి పురిటినొప్పులు రాగానే 108కు ఫోన్ చేస్తే ఆస్పత్రికి తీసుకెళతారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ) నుంచి బోధనాస్పత్రి వరకూ ఎక్కడైనా వైద్యం చేయించుకోవచ్చు. 372 పీహెచ్‌సీల్లో జీరో డెలివరీలు రాష్ట్రంలో 1,149 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలుండగా 372 పీహెచ్‌సీల్లో ఒక్క ప్రసవం కూడా జరగడం లేదు. ఇందులో అత్యధికంగా కృష్ణా జిల్లాలో 52 పీహెచ్‌సీలు ఉన్నాయి. వీటిలో కూడా సాధారణ ప్రసవాలు చేయాలని కుటుంబ సంక్షేమ శాఖ యోచిస్తోంది. ఇప్పటికే ఇద్దరు వైద్యాధికారులు, ముగ్గురు నర్సులు, లేబర్ రూమ్‌కు కావాల్సిన వసతులు అన్నీ పీహెచ్‌సీల్లో సమకూరుస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వాస్పత్రుల్లో 40 శాతం మాత్రమే ప్రసవాలు జరుగుతున్నాయి. వీటిని భారీగా పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వాస్పత్రులకు వస్తే లాభాలెన్నో.. ► గర్భిణి దశలోనే ప్రభుత్వాస్పత్రుల్లో వైద్య పరీక్షలకు వస్తే స్టాఫ్ నర్స్, పీహెచ్ఎన్, ఎంపీహెచ్ఎస్, మెడికల్ ఆఫీసర్లు ప్రత్యేక ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా పరిశీలిస్తారు. ► సాధారణ ప్రసవాలను ప్రోత్సహిస్తారు. సిజేరియన్ అవసరమైతే బాధ్యతగా చేస్తారు. ► ప్రసవం సమయంలో రక్తం అవసరమైతే ప్రభుత్వమే సమకూరుస్తుంది. ► బాలింతకు ఆస్పత్రిలో ఉన్నన్ని రోజులు ఉచితంగా పోషకాహారం అందిస్తారు. ► చిన్నారులకు ఉచితంగా వ్యాక్సిన్లు ఇస్తారు. ► ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కాగానే తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌లో ఇంటికి ఉచితంగా చేర్చుతారు. ► బిడ్డ పుట్టగానే ఆధార్ నమోదు చేస్తారు.. పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం ఇస్తారు. బాలింతలకు భారీగా ఆసరా గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య ఆసరా ఇస్తోంది. సాధారణ ప్రసవానికి రూ.5 వేలు, సిజేరియన్ ప్రసవానికి రూ.3 వేలు ఇస్తోంది. తల్లి కోలుకునే సమయంలో ఈ మొత్తం వారికి ఎంతో భరోసానిస్తోంది. దీనికి తోడు ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన, జననీ సురక్ష యోజనల కింద మరికొంత సొమ్ము సమకూరుతోంది. -
వీటికి కూడా ఈఎంఐ ఉందా?
-
ఏంటీ.. వీటికి కూడా ఈఎంఐ ఉందా?
సాక్షి, వెబ్‌డెస్క్: ఈక్వెటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్.. అంటే చాలా మందికి తెలియకపోవచ్చు. కానీ ఈఎంఐ అంటే అందరికీ ఇట్టే అర్థమవుతుంది. మనం పెద్ద వస్తువులు ఏం కొనాలన్నా ఇప్పుడు ఈఎంఐ అందుబాటులో ఉంది. ఇంట్లో వినియోగించే టీవీ, వాషింగ్ మిషన్ నుంచి ప్రయాణానికి వాడే వాహనాల వరకు ఈఎంఐతో కొనుక్కోవచ్చు. అంతేకాదు చదువులు, పెళ్లిళ్లు వంటి కుటుంబ అవసరాలకు కూడా ఈఎంఐ అక్కరకొస్తోంది. తాజాగా ఐవీఎఫ్, సరోగసీకి కూడా ఈఎంఐ రుణాలు దొరుకుతున్నాయి. సంతానలేమితో బాధ పడుతున్న దంపతులకు ఈఎంఐ ఎలా వరంగా మారుతుందో ఈ వీడియో చూసి తెలుసుకోండి. -
మాతృత్వం స్త్రీ హక్కు.. బెయిల్ ఇస్తే ఏం కాదు: హైకోర్టు
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. గౌరవప్రదమైన మాతృత్వం ప్రతి స్త్రీ హక్కు.. గర్భిణీ స్త్రీలకు కావాల్సింది జైలు కాదు.. బెయిల్ అని స్పష్టం చేసింది. నార్మాటిక్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ యాక్ట్ (ఎన్డిపిఎస్ యాక్ట్) కింద నమోదైన కేసులో సహ నిందితురాలిగా ఉన్న గర్భిణీ స్త్రీకి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్భంగా జస్టిస్ అనూప్ చిట్కర మాట్లాడుతూ.. నిందితురాలికి తాత్కాలిక బెయిల్ మంజూరు చేసి.. శిక్షను ప్రస్తుతం నిలిపివేసి.. డెలివరీ తర్వాత ఒక సంవత్సరం వరకు పొడిగించవచ్చని తెలిపారు. అంతేకాక నేరాలు చాలా ఘోరంగా ఉన్నప్పుడు, ఆరోపణలు చాలా తీవ్రంగా ఉన్నప్పుడు కూడా దీన్ని అనుమతించాలన్నారు. ‘‘జైలు శిక్షను వాయిదా వేయడం ద్వారా రాష్ట్రానికి, సమాజానికి ఏదైనా హానీ జరుగుతుందా.. జైలు శిక్ష వాయిదా వేస్తే ఆకాశం ఊడి పడదు. సమాజంలోని ప్రతి స్త్రీ గౌరవప్రదమైన మాతృత్వానికి అర్హురాలు. గర్భం దాల్చిన నాటి నుంచి డెలివరీ తరువాత ఏడాది వరకు ఆమె మీద ఎలాంటి పరిమితులు ఉండకూడదు” అన్నారు చిట్కరా. ‘‘జైలులో ప్రసవిస్తే.. ఆ బిడ్డ సామాజిక ద్వేషాన్ని చవి చూస్తుంది. పుట్టుక గురించి ప్రశ్నించి.. జైలులోనే జన్మించాడని తెలిస్తే.. సమాజం ఆ బిడ్డను ఎంత చీదరించుకుంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇవన్ని ఆ బిడ్డ మీద తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతాయి. ఇక జైలులో మంచి ఆహారం అందించడం ద్వారా శారీరక ఆరోగ్యం బాగానే ఉండవచ్చు.. కానీ మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది’’ అన్నారు. ‘‘ఎన్డీపీఎస్ చట్టంలోని సెక్షన్ 37 లోని ఆదేశం నిందితులు నిర్దోషులుకు క్లీన్ చీట్ ఇవ్వడానికి.. రెండు షరతులను సంతృప్తి పరచాలని సూచిస్తుంది. దర్యాప్తుదారులు సేకరించిన సాక్ష్యాలు నిందితులకు బెయిల్ నిరాకరించడానికి చట్టబద్ధంగా సరిపోకపోవడమే కాక, వారి మీద మరే ఇతర దోషపూరిత సాక్ష్యాలు, ఆరోపణలు లేనప్పుడు.. నిందితులను నిర్దోషులుగా భావించవచ్చు. దీని ప్రకారం, పిటిషనర్ మొదటి షరతును సంతృప్తిపరిచారు. కనుక ఆమెకు తక్కువ వ్యవధి బెయిల్ మంజూరు చేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదు. దీని ఆధారంగా కోర్టు నిందితురాలికి బెయిల్ మంజూరు చేస్తుంది’’ అని తెలిపారు. కేసేంటంటే.. గర్భిణీ స్త్రీని, మాదకద్రవ్యాల వ్యాపారంలో తన భర్తతో కలిసి కుట్రపన్నారనే ఆరోపణలపై అరెస్టు చేశారు పోలీసులు. అంతేకాక వారి ఇంట్లో సోదాలు నిర్వహించి 259 గ్రాముల హెరాయిన్, 713 గ్రాముల ట్రామడోల్ మాత్రలను స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో నిందితురాలు ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. దీని కంటే ముందు బాధితురాలు కంగ్రా జిల్లా ప్రత్యేక కోర్టులో బెయిల్ పిటీషన్ దాఖలు చేశారు. కానీ కోర్టు ఈ ఏడాది జనవరి, 19న దాన్ని కొట్టేసింది. దాంతో బాధితురాలు హైకోర్టును ఆశ్రయించారు. -
ప్రసవాల్లో కింగ్‌జార్జి ఆసుపత్రి అరుదైన ఘనత
విశాఖపట్నంలోని కింగ్‌జార్జి (కేజీహెచ్) ఆస్పత్రి రాష్ట్రంలోనే ఎక్కువ ప్రసవాలు చేస్తున్న ఆస్పత్రిగా ఘనత సాధించింది. 2020–21లో ఇక్కడ సగటున రోజుకు 33.70 ప్రసవాలు చేశారు. 33.56 ప్రసవాలతో తిరుపతి మెటర్నిటీ ఆస్పత్రి రెండోస్థానంలో నిలిచింది. సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఏటా సుమారు 3 లక్షల ప్రసవాలు ప్రభుత్వాస్పత్రుల్లో జరుగుతుండగా, అందులో లక్ష ప్రసవాలు బోధనాసుపత్రుల్లోనే జరుగుతున్నాయి. మిగతా రెండు లక్షల ప్రసవాలు జిల్లా ఆస్పత్రులు, ఏరియా ఆస్పత్రులతో పాటు 195 సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో జరుగుతున్నాయి. బోధనాసుపత్రుల్లో అత్యల్పంగా ఒంగోలు ప్రభుత్వాస్పత్రిలో రోజుకు 1.72 ప్రసవాలు మాత్రమే జరుగుతున్నట్లు తాజా గణాంకాల్లో తేలింది. పీహెచ్‌సీల్లో కోసిగి టాప్.. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కర్నూలు జిల్లా కోసిగి పీహెచ్సీ ఆదర్శంగా నిలిచింది. ఏడాదిలో ఇక్కడ 1,578 ప్రసవాలు నిర్వహించారు. అత్యధిక ప్రసవాలు చేస్తున్న 10 పీహెచ్సీలలో ఆరు పీహెచ్‌సీలు కర్నూలు జిల్లాలోనే ఉండటం గమనార్హం. కోసిగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సగటున రోజుకు 4.32 ప్రసవాలు జరుగుతున్నాయి. రెండో స్థానంలో ఉన్న ఆదోని పరిధిలోని పెద్దతుంబళం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏడాదికి 1,302 ప్రసవాలు చేస్తోంది. అంటే రోజుకు 3.57 ప్రసవాలు జరుగుతున్నాయి. అలాగే, పెద్దకడుబూరు, బేతంచెర్ల, కౌతాళం వంటి ఎక్కువ ప్రసవాలు జరిగే పీహెచ్‌సీలు కర్నూలు జిల్లాలో ఉన్నాయి. ఇక్కడ ఏడాదికి వంద అంతకంటే ఎక్కువ ప్రసవాలు 96 పీహెచ్‌సీల్లో జరుగుతున్నాయి. ప్రభుత్వాస్పత్రుల్లో 2.83 లక్షల ప్రసవాలు.. కాగా, రాష్ట్రవ్యాప్తంగా 2020–21లో 2.83 లక్షల ప్రసవాలు ప్రభుత్వాస్పత్రుల్లో జరిగాయి. అందులో సింహభాగం బోధనాసుపత్రుల్లో జరగ్గా, ఆ తర్వాత స్థానం సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో ఎక్కువ డెలివరీలు జరిగాయి. ప్రస్తుతం 1,149 పీహెచ్‌సీల్లో 200 పైచిలుకు పీహెచ్‌సీల్లో మాత్రమే ప్రసవాలు జరుగుతున్నాయి. ఇకపై అన్ని పీహెచ్‌సీల్లో సాధారణ ప్రసవాలు జరపాలని కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా వైద్యులు, స్టాఫ్ నర్సులకు ప్రత్యేక శిక్షణనిచ్చారు. ఎక్కడ ఎన్ని ప్రసవాలు కేటగిరీ ప్రసవాలు బోధనాసుపత్రులు 88,684 జిల్లా ఆస్పత్రులు 42,061 ఏరియా ఆస్పత్రులు 38,883 సీహెచ్‌సీలు 73,258 పీహెచ్‌సీలు 40,877 బోధనాసుపత్రుల్లో ప్రసవాలు ఇలా ఆస్పత్రి ఏడాదిలో ప్రసవాలు రోజుకు సగటున కింగ్‌జార్జి విశాఖ 12,301 33.70 మెటర్నిటీ, తిరుపతి 12,249 33.56 జీజీహెచ్, కాకినాడ 9,375 25.68 జీజీహెచ్, విజయవాడ 9,279 25.47 జీజీహెచ్, గుంటూరు 8,771 24.03 జీజీహెచ్, అనంతపురం 8,093 22.17 జీజీహెచ్, కర్నూలు 7,928 21.72 జీజీహెచ్, కడప 7,290 19.97 జీజీహెచ్, నెల్లూరు 5,210 14.27 జీజీహెచ్, శ్రీకాకుళం 3,329 9.12 జీజీహెచ్, ఒంగోలు 628 1.72 -
స్టైలిష్‌గా కాబోయే అమ్మ ..
అమ్మాయిలకు డిజైన్ వేర్ తప్పనిసరి. అమ్మలకూ డ్రెస్ డిజైన్స్‌లో బోలెడన్ని ఎంపికలు ఉన్నాయి. కాబోయే అమ్మలకు సౌకర్యవంతమైన, స్టైలిష్ డిజైనర్ వేర్ ఎందుకు ఉండకూడదు అని ప్రశ్నించుకున్నారు ఢిల్లీలో ఉంటున్న ఇద్దరు సోదరీమణులు. ఆంచల్ జౌరా, ఆష్నా అనే అక్కాచెల్లెళ్ళిద్దరూ గర్భిణులకు అందమైన దుస్తుల రూపకల్పన చేస్తూ అందరి మెప్పు పొందుతున్నారు. తమ బ్రాండ్ దుస్తులకు బాలీవుడ్ నటి కరీనాకపూర్‌ను బ్రాండ్ ఎంబాసిడర్‌గా తీసుకున్నారు. మాస్టర్స్ డిగ్రీ చేసిన ఈ ఇద్దరు అక్కాచెల్లెళ్లు తమ దారిని కాబోయే తల్లులవైపుగా ఎందుకు మళ్లించుకున్నారో వారినే అడిగితే ఎన్నో ఆసిక్తకర విషయాలు తెలుస్తాయి. తక్కువ ఖర్చుతో డిజైనింగ్ ఆంచల్ జౌరా, ఆష్నా షా ఈ ఇద్దరు అక్కచెల్లెళ్లు ‘చిక్ మామ్జ్’ అనే పేరుతో ప్రసూతి వేర్‌ను రూపొందించారు. గర్భధారణలో ఉన్న కరీనా కపూర్ వాటిని ధరించి, మెరిసిపోయారు. ఆంచల్ మాట్లాడుతూ– ‘కరీనా కపూర్‌కు దుస్తులను డిజైన్ చేయడానికి మాకు అవకాశం లభించడం చాలా పెద్ద విషయం, ఇదంతా మా అమ్మ అందించిన స్ఫూర్తిగానే మేం భావిస్తున్నాం’ అని తెలియచేసింది. వీరిద్దరూ గర్భిణీ స్త్రీలకు సౌకర్యవంతమైన, స్టైలిష్, తక్కువ ఖర్చుతో ప్రసూతి దుస్తులను డిజైన్ చేస్తారు. ఆంచల్, అష్నా ఉత్తర్‌ప్రదేశ్‌లోని సహారన్పూర్లో ఉండేవారు. ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రులయ్యారు. ఆ తర్వాత ముంబైలోని ఐబిఎస్ నుంచి ఎంబీఏ పట్టా పొందారు. కంప్యూటర్ సై¯Œ ్సలో ఇంజనీరింగ్ చేసిన అష్నా ఇంగ్లాండ్‌లో మాస్టర్స్ డిగ్రీ పొందింది. గర్భిణులకు తక్కువ డ్రెస్సులు ఉండేవి అష్నా మాట్లాడుతూ ‘నేను గర్భవతిగా ఉన్నప్పుడు చాలా వదులుగా ఉండే దుస్తులు కావాలనుకునేదాన్ని. అందుకు నా భర్త టీ షర్టు, కుర్తా ధరించేదాన్ని. ఆఫీసుకు వెళ్లడానికి చాలా తక్కువ డ్రెస్సులు ఉండేవి. మార్కెట్లో నేను చూసిన అన్ని ప్రసూతి దుస్తులు చాలా ఖరీదైనవి. ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు నా పొట్టను స్టైలిష్ లుక్‌లో ఆత్మవిశ్వాసంతో చూపించాలనుకునేదాన్ని. నా పొట్టను దాచాలని ఎప్పుడూ అనుకోలేదు. కానీ, అందుకు సరైన దుస్తులు ఉండేవి కావు. చాలా ఇబ్బందిగా అనిపించేది. అందుకే ఈ ఇబ్బందిని గమనించి గర్భవతుల కోసం స్టైలిష్ దుస్తులను తీసుకువచ్చాం’ అని తెలిపింది. -
పొట్టపై 10 వేల తేనెటీగల గూడుతో..
టెక్సాస్: ప్రస్తుత కాలంలో మొదటిసారిగా తల్లిదండ్రులు కాబోతున్న జంట బేజీ షవర్, మెటర్నిటీ ఫొటోషూట్ వంటి కార్యక్రమాలకు మక్కువ చూపుతున్నారు. ఇందుకోసం కోసం అందమైన, ఆకర్షించే ప్రదేశాలను ఎంచుకోవడం లేదా వారి ఫొటోషూట్ భిన్నంగా ఉండేలా చూసుకుంటున్నారు. అయితే టెక్సాస్‌కు చెందిన ఓ మహిళ మాత్రం తన మెటర్నిటీ ఫొటోషూట్‌ను మరింత ప్రత్యేకంగా ఉంచేందుకు అత్యంత సాహసమైన ఆలోచన చేసింది. తన పొట్టపై ఏకంగా 10 వేల తేనెటీగల గూడును పెట్టుకుని ఫొటోషూట్‌కు ఫోజ్లిచ్చింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. ఆమె పేరు బేథానీ కరులక్. ఆమె ముందునుంచే ఇలాంటి సాహసాల్లో నిపుణురాలు. (వైరల్ : నల్ల చిరుతను చూశారా?) బేథానీ ఇటీవల తీసుకున్న తన మెటర్నిటీ ఫొటోషూట్‌కు సంబంధించిన ఫొటోలను తన ఫేస్బుక్లో పోస్టు చేశారు. ‘ఇది ప్రమాదకరమైనది. దయచేసి అనుభవం లేకుండా ఎవరూ ప్రయత్నించకండి’ అనే క్యాప్షన్‌తో ఆమె పోస్టు చేసింది. ‘ఫొటోషూట్ మొత్తంలో ఆ తేనెటీగల నన్ను ఒక్కసారి కూడా కుట్టలేదు. మొదట రాణీ తేనెటీగను నా పొట్టపై బంధించాము. ఆ తర్వాత మిగతా తేనెటీగలను ఉంచడంతో కాసేపట్లలో అవి గూడు కట్టాయి. ఇక్కడ దాదాపు 10 వేలకు పైగా తేనెటీగల ఉన్నాయి. అయితే ఇందులో కంగారు పడాల్సిన అవసరం లేదు. దీనిని డాక్టర్ సలహాతోనే ప్రయత్నించాం’ అంటూ బేథాని రాసుకొచ్చింది. ఇది చూసిన నెటిజన్లు ఆమె సాహసానికి ఫిదా అవుతూ ప్రశంసల జల్లు కురిపిస్తూంటే మరికొందరూ ‘అసలు ఎందుకిలా చేయడం’, ‘తేనెటీగలకు బదులుగా సీతాకోక చిలుకలను ప్రయత్నించచ్చు కదా’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. (ఫొటో షూట్.. కొత్త జంటకు చేదు అనుభవం) -
మానవత్వం పరిమళించిన వేళ
సాక్షి, పాచిపెంట(విజయనగరం) : మానవ సేవే మాధవ సేవగా భావించారు. అందరూ సహకరించి ఓ గర్భిణికి పురుడుపోశారు. తల్లీబిడ్డలు క్షేమంగా ఉండడంతో సంతోషించిన ఘటన సాలూరులో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. సాలూరు మండలంలోని పట్టుచెన్నేరు పంచాయతీ కోమటివలస గ్రామానికి చెందిన కొర్ర రాములమ్మ నాలుగు నెలల గర్భిణిగా ఉన్న సమయంలో భర్త, కుటుంబంతో కలిసి పనుల కోసం తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంకు వలస వెళ్లిపోయారు. రాములమ్మకు ప్రసవ తేదీ దగ్గర పడడంతో బుధవారం స్వగ్రామానికి బయల్దేరారు. ఈ క్రమంలో విశాఖపట్నంలో దిగి సాలూరు వస్తున్న ఆర్టీసీ బస్సు ఎక్కారు. రాత్రి సుమారు 10 గంటల సమయంలో బస్సు రామభద్రపురానికి చేరుకునే సరికి రాములమ్మకు నొప్పులు అధికమయ్యాయి. బిడ్డ ప్రసవమయ్యే పరిస్థితి రావడంతో వెంటనే రాములమ్మ భర్త నాగేశు కోమటివలస ఏఎన్ఎం సంగీతకు ఫోన్ చేసి పరిస్థితిని వివరించారు. బస్సును ఆపకుండా సాలూరు వచ్చేయాలని, సాలూరులో సిద్ధంగా ఉంటానని తెలి పింది. డ్రైవర్‌కు సైతం బస్సును సాలూరు తీసుకరావాలని, మధ్యలో నిలిపివేయవద్దని ఏఎన్ఎం విన్నవించింది. మానవత్వం చాటుకున్న ప్రయాణికులు, బస్సు డ్రైవర్, కండక్టర్ అందరి సహకారంతో రాములమ్మను సాలూరుకు తీసుకొచ్చారు. అప్పటికే బిడ్డ సగం బయటకు వచ్చేసింది. స్థానిక తహసీల్దార్ కార్యాలయ సెంటర్ వద్ద ఏఎన్ఎం బస్సులోకి ఎక్కి గర్భిణి పరిస్థితిని గుర్తించింది. బిడ్డ బయటకు రావడం, పేగులు కోయడం వల్ల తల్లికి ప్రమాదమని భావించింది. అంబులెన్స్‌కు ఫోన్ చేసినా రాలేదు. వెంటనే ఏఎన్ఎం స్థానిక సీహెచ్‌సీ స్టాఫ్ నర్స్‌కు ఫోన్‌చేసి ఇద్దరూ కలిసి అదే బస్సులో ఆర్టీసీ కాంప్లెక్స్ వెళ్లి అక్కడ బస్సులోనే రాములమ్మకు పురుడుపోశారు. రెండో కాన్పులో పండంటి మగబిడ్డకు రాములమ్మ జన్మనిచ్చింది. అనంతరం తల్లీబిడ్డలను అర్ధరాత్రి సాలూరు సీహెచ్‌సీకి ఆటోలో తరలించారు. తల్లీ, బిడ్డ క్షేమంగా ఉండడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. -
పోస్టుల భర్తీకి పురిటినొప్పులు
సీహెచ్‌సీల్లో వేధిస్తున్న వైద్యుల కొరత వైద్యవిధాన ఆసుపత్రుల్లో భారీగా ఖాళీలు పడిపోతున్న ప్రసూతి సూచీలు అన్నీ తెలిసి చోద్యం చూస్తున్న ప్రభుత్వం ‘‘ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలోని ఏరియా ఆసుపత్రి. ఒకప్పుడు ఏటా 2400 వరకు ఈ ఆసుపత్రిలో ప్రసవాలు జరిగేవి. కానీ ఇప్పుడు ప్రసవాల సంఖ్య 30 శాతం పడిపోయింది. కారణం ఇక్కడ రెండేళ్లుగా సివిల్ సర్జన్, ఫిజీషియన్, ఈఎన్టీలు లేరు. దీంతో ఇక్కడి ప్రజలు ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు.’’ చిత్తూరు (అర్బన్):జిల్లాలోని ఏపీ వైద్య విధాన పరిషత్ (ఏపీవీవీపీ) ఆసుపత్రుల్లో ఖాళీ కుర్చీల రాజ్యమేలుతోంది. జిల్లా ఆసుపత్రి మినహా మిగిలిన సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆసుపత్రుల్లో ఏళ్ల తరబడిగా వైద్యుల పోస్టులు భర్తీ కావడంలేదు. దీనికి తోడు ఇటీవల పీజీ విద్యను అభ్యసించడానికి చాలా మంది వైద్యులు దీర్ఘకాలిక సెలవులపై వెళ్లిపోతున్నారు. ఫలితంగా గ్రామీణ ప్రాంతాల్లో మాత,శిశు మరణాలను అరికట్టి ఆసుపత్రుల్లోనే కాన్పులు జరిగేలా చూడటానికి ఏర్పాటు చేసిన వైద్యకేంద్రాలు నిర్వీర్యం అయిపోతున్నాయి. ఖాళీలే ఖాళీలు... వాయల్పాడు సామాజిక ఆరోగ్య కేంద్రం (సీహెచ్‌సీ)లో చిన్న పిల్లల వైద్య నిపుణులు, అనస్తీషియన్ (శస్త్ర చికిత్స సమయంలో మత్తుకుప్పం ఏరియా ఆసుపత్రిలో సివిల్ అసిస్టెంట్ సర్జన్, ఫిజీషియన్, ఈఎన్టీలతో పాటు సివిల్ సర్జన్ పోస్టులు మూడేళ్లుగా భర్తీకి నోచుకోలేదు. చిన్నగొట్టిగల్లు సీహెచ్‌సీలో గైనకాలజిస్టు, అనస్తీషియన్, జనరల్ మెడిసిన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక్కడున్న వైద్యుల్లో కొందరు పీజీ అభ్యసించడానికి వెళ్ళిపోయారు. ఫలితంగా గత ఏడాది 600 కాన్పులు ఇక్కడ జరగాల్సి ఉండగా కేవలం 117తో సరిపెట్టాల్సి వచ్చింది. పుంగనూరులో అనస్తీషియన్, చిన్నపిల్లల వైద్యులు లేరు. కలికిరిలోనూ చిన్నపిల్లల వైద్యులు, గైనకాలజిస్టు లేరు. ఈ రెండు ఆసుపత్రుల్లో అయిదేళ్లుగా ఈ పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. పీలేరులో ఏడాదిగా సివిల్ సర్జన్ లేకపోవడంతో శస్త్రచికిత్సల పడిపోయాయి. పలమనేరులో సివిల్ సర్జన్ అనస్తీషయన్, గైనకాలజిస్టు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏపీవీవీపీలో ప్రసవాలు ఇలా... జిల్లాలోని వైద్య విధాన ఆసుపత్రుల్లో గత అయిదేళ్లలో కాన్పుల సంఖ్య లక్ష్యాన్ని చేరుకోవడంలో తడబడుతోంది. వైద్యులు లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి మినహా ఇతర ఏపీవీవీపీ ఆసుపత్రుల్లో కాన్పుల సంఖ్య పరిశీలిస్తే... సంవత్సరం కాన్పుల లక్ష్యం జరిగిన కాన్పులు 2011-12 12,775 9,658 2012-13 16,200 11,141 2013-14 16,200 12,936 2014-15 16,200 13,001 2015-16 17,280 12,559 -
ఎయిర్టెల్ భారీ నజరానా
న్యూఢిల్లీ: తన సంస్థ మహిళా ఉద్యోగులకు మొబైల్ రంగానికి చెందిన ప్రముఖ సంస్థ భారతీ ఎయిర్టెల్ భారీ నజరానా ప్రకటించింది. మహిళా ఉద్యోగులకు ఆ సంస్థ ఇచ్చే ప్రసూతి సెలవులను అమాంతం పెంచేసింది. ఇప్పటి వరకు ఆ సంస్థ మహిళా ఉద్యోగులకు 12 వారాలపాటు ప్రసూతి సెలవులు ఇవ్వగా ప్రస్తుతం 22 వారాలకు పెంచింది. తల్లిగా మారనున్న స్త్రీలపై మానసిక ఒత్తిడి తగ్గించడంతోపాటు వారు మాతృత్వాన్ని పూర్తిగా ఆస్వాధించేందుకు అవకాశం కల్పించినట్లవుతుందని ప్రకటించింది. దీంతోపాటు ఇప్పటికే గుర్గావ్ లోని తమ కంపెనీ పిల్లల సురక్షిత బాధ్యతలు కూడా ప్రారంభించిందని పేర్కొంది. ఒక వేళ పిల్లలను దత్తతకు తీసుకుంటే ఆ దత్తత తీసుకునే పిల్లల వయసు రెండేళ్లలోపు ఉంటే ప్రసూతి సెలవులు వర్తిస్తాయని, వారికి పన్నెండు వారాలు ఇవ్వడం జరుగుతుందని, అదే రెండేళ్ల వయసు పైబడిన పిల్లలైతే.. ఆరు వారాల ప్రసూతి సెలవులు లభిస్తాయని చెప్పారు. పురుష ఉద్యోగులకు అయితే వారం రోజులపాటు సెలవులు తీసుకునే అవకాశం ఉంటుందని కూడా తెలిపింది. -
ఒకే కాన్పులో ముగ్గురు
ఆదిలాబాద్ పట్టణంలోని రిమ్స్ ఆస్పత్రిలో ఒక మహిళ మంగళవారం ముగ్గురు చిన్నారులకు జన్మనిచ్చింది. ఇచ్చోడ మండలం మాదాపూర్‌కు చెందిన షబానాకు ప్రసవ నొప్పులు తీవ్రం కావడంతో ఆమెను భర్త షఫీఖాన్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. వైద్యులు మంగళవారం ఉదయం శస్త్రచికిత్స చేయగా, ఇద్దరు మగ శిశువులు, ఒక ఆడ శిశువుకు ఆమె జన్మనిచ్చింది. ముగ్గురూ ఆరోగ్యంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. దీంతో ఆ దంపతుల ఆనందానికి అవధుల్లేవు. -
సూర్యకాంతితో ప్రసూతి చాలా తేలిక...!
సన్ ప్రివెంట్స్ ద పెయిన్ గర్భవతుల్లో విటమిన్ డీ లోపం ఉంటే వారిలో ప్రసూతి చాలా బాధాకరంగా ఉంటుంది. నొప్పుల తీవ్రత అధికంగా ఉంటుంది. గర్భవతుల్లో విటమిన్-డి లోపం రావడం చాలా సాధారణమైన విషయం. ప్రత్యేకంగా హై-రిస్క్ ప్రెగ్నెన్సీలో ఉన్నవారికీ, కేవలం శాకాహారం మాత్రమే తీసుకునేవారికీ, ఎండలో ఎక్కువగా తిరగని వారికి ప్రసవం కష్టమవుతుంది. దీనికి కారణం - విటమిన్ ‘డి’ లోపమే. అందుకే ఇలాంటి వారికి ప్రసవ సమయంలో నొప్పిని తగ్గించే ‘ఎపిడ్యూరల్’ ప్రొసిజర్స్ అవసరమవుతాయి. ఇటీవలే నిర్వహించిన అనస్థీషియాలజిస్టుల వార్షిక సమావేశంలో కొందరు పరిశోధకులు దాదాపు 100 మంది గర్భవతులపై నిర్వహించిన అధ్యయనాల్లో తేలిందని అధ్యయన వేత్తలు తెలిపారు. అందుకే మహిళలు గర్భం దాల్చాక తగినంతగా ఎండపొడకు తిరగాలని వారు పేర్కొంటున్నారు.