ఒకే కాన్పులో ముగ్గురు | triplets born in Rims Adilabad | Sakshi
Sakshi News home page

ఒకే కాన్పులో ముగ్గురు

Published Tue, Oct 20 2015 1:06 PM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM

triplets born in Rims Adilabad

ఆదిలాబాద్ పట్టణంలోని రిమ్స్ ఆస్పత్రిలో ఒక మహిళ మంగళవారం ముగ్గురు చిన్నారులకు జన్మనిచ్చింది. ఇచ్చోడ మండలం మాదాపూర్‌కు చెందిన షబానాకు ప్రసవ నొప్పులు తీవ్రం కావడంతో ఆమెను భర్త షఫీఖాన్ ఆస్పత్రికి తీసుకొచ్చారు.

వైద్యులు మంగళవారం ఉదయం శస్త్రచికిత్స చేయగా, ఇద్దరు మగ శిశువులు, ఒక ఆడ శిశువుకు ఆమె జన్మనిచ్చింది. ముగ్గురూ ఆరోగ్యంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. దీంతో ఆ దంపతుల ఆనందానికి అవధుల్లేవు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement