RIMs
-
'సాక్షి' ప్రచురిత కథనానికి.. రిమ్స్ అక్రమార్కులపై స్పందించిన కలెక్టర్!
ఆదిలాబాద్: రిమ్స్‌లో అవినీతి, అక్రమార్కులపై కలెక్టర్ రాహుల్‌రాజ్ సీరియస్ అ య్యారు. డైరెక్టర్ జైసింగ్ రా థోడ్‌ను మంగళవారం సాయంత్రం పిలిపించి తాజా ఘటనలపై ఆరా తీశారు. అక్రమాలకు పాల్పడుతున్న వారిపై కఠినంగా వ్యవహరించాలని డైరెక్టర్‌ను ఆదేశించారు. ఈనెల 18న ‘సాక్షి’లో ‘అవుట్సోర్సింగ్ మోసాలు.. ’శీర్షికన ప్రచురితమైన కథనానికి స్పందించారు. నిరుద్యోగి నుంచి డబ్బులు వసూలు చేసిన సంబంధిత ఉద్యోగిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ విషయమై డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ మాట్లాడుతూ, విచారణ కమిటీ ఏర్పాటు చేసి అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. -
'రిమ్స్ అక్రమ ప్రావీణ్యుడి' బాగోతం తెరపైకి..!
ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రిలో అక్రమార్కుల దందా జోరుగా సాగుతోంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కొంతమంది ఘరానా మోసగాళ్ల ఆగడాలు పెరిగిపోతున్నాయి. రిమ్స్‌లో తవ్వినకొద్దీ బండారం బయటపడుతోంది. కాంట్రాక్ట్ స్టాఫ్‌నర్స్, ల్యాబ్ అసిస్టెంట్, ల్యాబ్ టెక్నీషియన్, సెక్యూరిటీగార్డు, పేషెంట్‌కేర్, రికార్డు అసిస్టెంట్ తదితర పోస్టులు ఇప్పిస్తామంటూ వారి నుంచి రూ.లక్షలు వసూలు చేస్తున్నారు. ఉద్యోగాలు ఇప్పించడం పక్కనబెడితే వారు తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వకుండా నానా ఇబ్బందులకు గురిచేస్తున్న ఘటనలు ఇటీవల అనేకం వెలుగులోకి వస్తున్నాయి. అక్రమాలకు పాల్పడిన ఓ అవుట్సోర్సింగ్ ఉద్యోగిని ఇటీవల టర్మినెట్ చేయగా, తాజాగా మరో అక్రమ ‘ప్రావీణ్యు’డి బాగోతం తెరపైకి వచ్చింది. చాలామంది నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసి ఉద్యోగాలు ఇప్పించకపోగా, తిరిగి ఇచ్చేందుకు ముప్పుతిప్పలు పెడుతున్నాడు. విషయం రిమ్స్‌లో బహిరంగ రహస్యమే అయినప్పటికీ రాజకీయ నాయకులు, యూనియన్ అండదండలతో అతడు తప్పించుకొని తిరుగుతున్నట్లు తెలుస్తోంది. అక్రమార్కుల్లో ఓ ‘ప్రావీణ్యు’డు.. ► కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరికి చెందిన ఓ నిరుద్యోగి ఐటీఐ పూర్తి చేశాడు. కూలీనాలి చేస్తేనే ఆ కుటుంబ సభ్యుల జీవనం సాగేది. తనకు తెలిసిన మిత్రుడు ఆదిలాబాద్‌లోని రిమ్స్ ఆస్పత్రిలో రికార్డు అసిస్టెంట్ ఉద్యోగం ఉందని చెప్పడంతో తండ్రి అప్పు చేసి రూ.లక్ష ఇచ్చాడు. దీంతో ఆ యువకుడు రిమ్స్‌లో పనిచేసే అవుట్సోర్సింగ్ ఉద్యోగి బ్యాంక్ ఖాతాలో ఆ మొత్తం ట్రాన్స్ఫర్ చేశాడు. అయితే డబ్బులు తీసుకున్న సదరు వ్యక్తి ఉద్యోగం ఇప్పించకపోగా, ఏడాదిన్నరగా రేపూమాపు అంటూ తిప్పుకుంటున్నట్లు బాధితుడు వాపోయాడు. ► కుమురంభీం జిల్లా కెరమెరికి చెందిన మరో నిరుద్యోగి ల్యాబ్ టెక్నీషియన్ పూర్తి చేశాడు. జిల్లా కేంద్రంలోని రిమ్స్‌లో ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగం ఇప్పిస్తానని ఈ అక్రమార్కుడే నిరుద్యోగి నుంచి రూ.లక్ష తీసుకున్నాడు. ఐదారు నెలలుగా తిప్పుకున్నాడు. దీంతో బాధితుడు ఓ రాజకీయ పార్టీ నాయకుడి దృష్టికి విషయాన్ని తీసుకెళ్లాడు. రిమ్స్ డైరెక్టర్‌తో పాటు కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించడంతో ఆ బాధితుడికి డబ్బులు తిరిగి ఇచ్చేశాడు. ఇలా ఆదిలాబాద్ జిల్లాతో పాటు నిర్మల్, ఖానాపూర్, తదితర ప్రాంతాలకు చెందిన అనేక మంది నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసి అందినకాడికి దండుకుంటున్నాడు. ఇతనొక్కడే కాదు.. అంగట్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు అనేలా పలువురు ఈ దందా నడుపుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో చాలామంది పెద్దల హస్తమున్నట్లు సమాచారం. ఇటీవల పలు ఘటనలు వెలుగు చూసినా ఉన్నతాధికారులు కఠిన చర్యలకు వెనుకాడడం అనుమానాలకు తావిస్తోంది. అక్రమాలకు పాల్పడుతున్న తీరిలా.. జిల్లాలో పలువురు అక్రమార్కులు అవుట్సోర్సింగ్ ఉద్యోగాల పేరిట నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. ముఖ్యంగా రిమ్స్ ఆస్పత్రిలో ఉద్యోగాలు ఇప్పిస్తామని అందులో పనిచేసే అవుట్సోర్సింగ్ ఉద్యోగులే ఎక్కువ శాతం ఈ దందాకు తెరలేపుతున్నారు. కొన్ని అవుట్సోర్సింగ్ ఏజెన్సీల నుంచి ఉద్యోగాలు ఇప్పిస్తామని, ఆ ఏజెన్సీల వారు తమకు తెలుసని, అదేవిధంగా రాజకీయ నాయకులతో పరిచయం ఉందని మాయమాటలు చెబుతున్నారు. రిమ్స్ ఆస్పత్రితో పాటు సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పడటం అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఉన్నాయని మోసాలకు తెర లేపుతున్నారు. విద్యార్హతలు, ఇంటర్వ్యూలు లేకుండానే కొలువు ఇప్పిస్తామని చెప్పడంతో అమాయక నిరుద్యోగులు వీరి వలలో చిక్కుకుంటున్నారు. డబ్బులు ఇచ్చిన తర్వాత మోసపోయామని లబోదిబోమంటున్నారు. కొంత మంది ఈ విషయాన్ని బహిర్గతం చేస్తుండగా, మరికొంత మంది ఎవరికై నా చెబితే తమ డబ్బులు రావనే భయంతో మానసికంగా కుంగిపోతున్నారు. ఇలాంటి బాధితులు వందలాదిగా ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా వెలుగులోకి వచ్చిన సదరు అక్రమార్కుడు దాదాపు 50 మందికి పైగా నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసినట్టు సమాచారం. ఏకంగా గెజిటెడ్ సంతకాలు పెట్టి ఉత్తర్వులు జారీ చేయడం సంచలనం కలిగిస్తోంది. తనతో పాటు దందాలో కుటుంబీకులను కూడా కలుపుకొని ఇంటి వద్ద నుంచే ఈ మోసాలకు పాల్పడుతున్నట్లు బాధితులు పేర్కొంటున్నారు. విధులు నిర్వహించకుండా ఇదే పనులపై దృష్టి పెడుతున్నారని రిమ్స్‌లో పనిచేసే ఉద్యోగులు సైతం పేర్కొనడం ఆయన పాల్పడిన అక్రమాలకు అద్దం పడుతోంది. నా దృష్టికి రాలేదు.. రిమ్స్‌లో పనిచేసే అవుట్సోర్సింగ్ ఉద్యోగి నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు నా దృష్టికి రాలేదు. బాధితులెవరైనా ఫిర్యాదు చేస్తే విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటాం. రిమ్స్‌లో ప్రస్తుతం ఎలాంటి ఉ ద్యోగాలు లేవు. నిరుద్యోగులు మధ్యవర్తులను ఆశ్రయించి మోసపోవద్దు. ఎవరికి డబ్బులు ఇవ్వొద్దు. ఉద్యోగాలు ఇప్పిస్తామని ఎవరైనా డబ్బులు అడిగితే మా దృష్టికి తీసుకురావాలి. – జైసింగ్ రాథోడ్, రిమ్స్ డైరెక్టర్, ఆదిలాబాద్ -
‘మీడియా’ కథనంతో.. రిమ్స్‌ను తనిఖీ చేసిన కలెక్టర్..!
ఆదిలాబాద్: ‘పడకేసిన వసతులు’ శీర్షికన ఈనెల 6న ‘సాక్షి’ మెయిన్ పేజీలో ప్రచురితమైన కథనా నికి కలెక్టర్ రాహుల్ రాజ్ స్పందించారు. రిమ్స్‌లో పడకలు సరిపోక రోగులు తిప్పలు పడుతున్నారు. ఒకే పడకపై ఇద్దరు, ముగ్గురేసి ఉన్నారనే విషయాన్ని ప్రస్తావించగా.. స్పందించిన కలెక్టర్ శుక్రవారం ఆస్పత్రిని తనిఖీ చేశారు. ఎమర్జెన్సీ, ఫీవర్ వార్డులతో పాటు ఇతర వార్డుల్లో కలియ తిరిగారు. అందుతున్న వైద్యసేవల వివరాలను రోగులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డైరెక్టర్‌ను ఆదేశించారు. జిల్లాలో ఈనెలలో ఇప్పటివరకు 12 డెంగీ, రెండు మలేరియా కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక చర్యలు చేపట్టాలని మున్సిపల్ అధికారులను ఆదేశించినట్లు వివరించారు. వారానికి రెండుసార్లు డ్రైడే పాటించాలన్నారు. నీరు నిల్వ ఉండకుండా చూడాలని తెలిపారు. వర్షాలు కురుస్తున్నందున సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతి ఒక్కరూ పరిసరాల, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలన్నారు. కలెక్టర్ వెంట రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, డీఎంహెచ్‌వో నరేదంర్ రాథోడ్, జిల్లా మలేరియా నివారణ అధికారి శ్రీధర్, రిమ్స్ సూపరింటెండెంట్ అశోక్, వైద్యులు సుమలత, శ్యాంప్రసాద్ తదితరులు ఉన్నారు. -
అసలు దొంగలు ఎవరో ?
ఈ చిత్రంలో కనిపించేది కడప పాత రిమ్స్‌లోని వైద్య ఆరోగ్య శాఖ ప్రాంతీయ కార్యాలయం. గతంలో ఇక్కడ పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయి. పలు అంశాలు చర్చకు దారి తీశాయి. అప్పుడు ‘సాక్షి’ పలు సంచలన కథనాలను ప్రచురించింది. తరువాత కాలంలో ఆ కార్యాలయంలో పరిపాలన గాడిలో పడినట్లైంది. తాజాగా స్టాఫ్ నర్సుల నియామకాల ప్రక్రియ వివాదాస్పదంగా మారింది. కడప రూరల్ : వైద్య ఆరోగ్య శాఖ ప్రాంతీయ కార్యాలయం (జోన్–4) పరిధిలో 291 కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సుల నియామకానికి ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఆ మేరకు కడపలోని ఆ శాఖ కార్యాలయానికి రాయలసీమలోని జిల్లాల నుంచి 11 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల మెరిట్ ఆధారంగా ఆ శాఖ అధికారులు జనవరి 17వ తేదీ నుంచి స్టాఫ్ నర్స్‌ల నియామకాలను చేపట్టారు. ఉద్యోగాలు పొందిన వారు రెండు నెలల నుంచి వేతనాలు కూడా పొందుతున్నారు. అనుమానమే నిజమైంది... చిత్తూరు జిల్లాలో పదవీ విరమణ పొందిన ఒక పోలీసు ఉద్యోగి కుమార్తెకి మంచి మార్కులు ఉన్నాయి. అయితే ఆమెకు ఉద్యోగం రాలేదు. ఇతరులకు వచ్చాయి. ఆ రిటైర్డ్ ఉద్యోగికి అనుమానం వచ్చింది. ఉద్యోగాలు పొందిన వారిపై సంబంధిత శాఖకు ఫిర్యాదు చేశారు. మొత్తం 15 మంది మార్కుల సర్టిఫికెట్స్‌ను డాక్టర్ వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీకి పంపారు. అందులో 8 మంది మార్కుల జాబితా శ్రీట్యాంపర్డ్శ్రీ (సర్టిఫికెట్ మార్ఫింగ్)గా నిర్ధారించారు. ఆ 8 మందిలో వైద్య విధాన పరిషత్ విభాగానికి చెందిన ఉద్యోగులు ఐదుగురు, డైరెక్టర్ ఆఫ్ హెల్త్‌కు చెందిన ఇద్దరు ఉద్యోగులు ఉండగా, ఒక అభ్యర్థి జాబితాలో ఉన్నప్పటికీ మెరిట్ లేనందున ఉద్యోగం రాలేదు. షోకాజ్ నోటీసుకు బదులు లేనందున... డాక్టర్ వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ నుంచి ఆ 8 మంది నివేదిక కడప వైద్య ఆరోగ్య శాఖ ప్రాంతీయ కార్యాలయానికి చేరింది. ఆ ఎనిమిది మందిలో ఐదుగురు వైద్య విధాన పరిషత్‌కు చెందిన వారు ఉన్నారు. ఆ ఉద్యోగులపై చర్యల నిమిత్తం నివేదికను వైద్య విధాన పరిషత్ కమిషనర్‌కు పంపారు. ఇక ఇద్దరు ఉద్యోగులు డైరెక్టర్ ఆఫ్ హెల్త్‌కు చెందిన వారు తమ పరిధిలోకి రావడంతో వారికి షోకాజ్ నోటీసులను జారీ చేశారు. ఇంత వరకు వారి నుంచి సమాధానం లేకపోవడంతో వారిపై కేసులు బనాయించడానికి రంగం సిద్ధమైంది. మరో బోగన్ ఉద్యోగ నియామకం.. ఈ బోగస్ మార్కుల సర్టిఫికెట్స్ బాగోతం బయట పడక ముందు. ఒక అభ్యర్థి తాను స్టాఫ్ నర్స్ పోస్టుకు ఎంపికై నట్లు, తనకు పోస్టింగ్ ఇవ్వాలని చిత్తూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖకు వెళ్లారు. ఆ నియామక పత్రం ప్రకారం నిర్దేశించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పోస్టింగ్ లేదని అక్కడి అధికారులు గమనించి ఇక్కడ ఉన్న ప్రాంతీయ కార్యాలయానికి సమాచారం ఇచ్చారు. ఆ నియామక పత్రాన్ని గమనించిన అధికారులు అది ఒక బోగస్ నియామక పత్రంగా తేల్చారు. అనంతరం ఆమైపె అధికారులు కడప పోలీస్ స్టేషన్లోి ఫిర్యాదు చేశారు. కాగా ఈ బోగస్ ఉద్యోగ నియామక పత్రంపై సంబంధిత అధికారుల సిగ్నేచర్ (సంతకం) ఎవరిది ఉందనేది ఆసక్తిగా మారింది. అక్రమాల వెనుక హస్తం ఎవరిదో.. మొత్తం ఈ బోగస్ వ్యవహారమంతా చిత్తూరు జిల్లా కేంద్రంగా సాగడం గమనార్హం. బోగస్ సర్టిఫికెట్లను పదుల సంఖ్యలో సృష్టించడం అంటే మాటలు కాదు. ఇదంతా ఎవరో బాగా అనుభవజ్ఞులైన వారి కనుసన్నల్లో జరుగుతున్నట్లుగా ఆ శాఖ ఉద్యోగులు అనుమానిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారం ఇంటి దొంగల పనా లేక బయటి దొంగల మాయాజాలమా. లేదంటే ఇద్దరూ కలిసి ఆడుతున్న నాటకమా.? అనేది తేలాలంటే సమగ్ర విచారణ చేపట్టాలని ఆ శాఖ ఉద్యోగులు కోరుతున్నారు. మొత్తం మీద ఈ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో అనేది ఆ శాఖలో చర్చనీయాంశంగా మారింది. కేసులు బనాయించమని ఆదేశించాం కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సు నియామకాల్లో బోగస్ మార్కుల జాబితాను సమర్పించి, మెరిట్ ఆధారంగా ఉద్యోగాలు పొందారని ఫిర్యాదులు వచ్చాయి. మొత్తం 15 మందిలో 8 మంది మార్కుల జాబితాను ‘ట్యాంటర్డ్’ చేశారని డాక్టర్ వైఎస్సార్ యూనివర్సిటీ నుంచి నివేదిక వచ్చింది. ఇందుకు సంబంధించి షోకాజ్ నోటీసులకు బదులు ఇవ్వనందున, వారిపై కేసు నమోదు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించాం. మిగతా ఏడుగురి నివేదిక త్వరలో రానుంది. బోగస్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందిన వారు, అందుకు సహకరించిన వారిపై కఠిన చర్యలు చేపడతాం. – డాక్టర్ కోటేశ్వరి, రీజినల్ డైరెక్టర్, వైద్య ఆరోగ్య శాఖ ప్రాంతీయ కార్యాలయం -
ఆదిలాబాద్: కస్తూర్బా ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్
సాక్షి, ఆదిలాబాద్: జిల్లాలోని నేరడిగొండ మండల పరిధిలోని కస్తూర్బా గాంధీ ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటన చోటు చేసుకుంది. ఆశ్రమ పాఠశాలలోని ఫుడ్ పాయిజన్‌తో 20 మంది విద్యార్థినులకు అస్వస్థత చోటు చేసుకుంది. దీంతో వాళ్లందరినీ రిమ్స్‌కు తరలించారు నిర్వాహకులు. ఇదిలా ఉంటే విద్యార్థుల పరిస్థితి ఎలా ఉంది? ఫుడ్ పాయిజన్ ఘటనపై స్కూల్ నిర్వాహకుల స్పందన తెలియాల్సి ఉంది. ఇదీ చదవండి: హైదరాబాద్‌లో ప్రాణం తీసిన కోడిగుడ్డు -
ఆదిలాబాద్ రిమ్స్‌లో శిథిలావస్థకు చేరిన డ్రగ్ స్టోరేజీ భవనం
-
పురిటి నొప్పులతో ఆసుపత్రికి.. అమ్మతనం ఆస్వాదించకుండానే..
సాక్షి, ఆదిలాబాద్‌టౌన్: తొలి కాన్పుతో అమ్మతనం ఆస్వాదించాలని ఆమె ఎన్నో కలలు కన్నది. గర్భందాల్చిన నాటి నుంచే పుట్టబోయే బిడ్డను ఊహించుకుంటూ మురిసిపోయింది. నెలనెలా పెరుగుతుంటే తన్మయం పొందింది. నెలలు నిండి పురిటి నొప్పులు రావడంతో ప్రసవం కోసం కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ వైద్యుల నిర్లక్ష్యంతో కాన్పు కాకుండానే కన్నుమూసింది. ఈ విషాద సంఘటన ఆదిలాబాద్ రిమ్స్‌లో శుక్రవారం జరిగింది. అసలేం జరిగింది.. ఆదిలాబాద్ పట్టణం పుత్లీబౌళి సమీపంలోని కేవీ.నగర్‌కు చెందిన కొర్రి రాజుకు గతేడాది జూలై 1న ఇచ్చోడ మండలం బోరిగామకు చెందిన అక్షిత(22)తో వివాహం జరిగింది. ప్రస్తుతం ఆమె నిండు గర్భిణి. గురువారం పురుటినొప్పులు రావడంతో సాయంత్రం 4 గంటలకు కుటుంబ సభ్యులు రిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు ప్రసవానికి సమయం ఉందని చెప్పడంతో తిరిగి ఇంటికి వెళ్లిపోయారు. శుక్రవారం తెల్లవారుజామున 3.45 గంటల సమయంలో మళ్లీ నొప్పులు రావడంతో ఈ విషయాన్ని సమీపంలోని ఆశ కార్యకర్తకు తెలియజేశారు. దీంతో ఆమె అంబులెన్స్‌లో రిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆ సమయంలో ఆమెకు ఫిట్స్ వచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రిమ్స్‌కు 4 గంట లకు చేరుకున్నారు. ఆ తర్వాత మెటర్నిటీ వార్డుకు తీసుకెళ్లగా వైద్యులు అందుబాటులో లేరు. స్టాఫ్ నర్సులు మాత్రమే ఉన్నారు. వారు అక్షితకు ఇంజెక్షన్ ఇచ్చా రు. ఎలాంటి చికిత్స చేయకపోవడంతో ఉదయం 6 గంటలకు గర్భిణిమృతి చెందింది. మృతదేహంతో ఆందోళన.. వైద్యుల నిర్లక్ష్యంతోనే గర్భిణి మృతిచెందిందని అక్షిత కుటుంబ సభ్యులు, బంధువులు రిమ్స్ ఎదుట ఆందోళనకు దిగారు. ఒకరోజు ముందుగా ఆస్పత్రికి వచ్చినా చికిత్స చేయకుండా తిరిగి ఇంటికి పంపించారని తెలిపారు. మళ్లీ పురిటి నొప్పులు రావడంతో ఆస్పత్రికి తీసుకొస్తే వైద్యులు అందుబాటులో లేక చికిత్స చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యులు అందుబాటులో ఉండి చికిత్స చేస్తే అక్షిత బతికేదని పేర్కొన్నారు. గర్భిణి మరణ వార్త తెలుసుకున్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్, రాష్ట్ర నాయకురాలు సుహాసినిరెడ్డి రిమ్స్‌కు చేరుకున్నారు. బాధితులతో మాట్లాడారు. మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. స్పందించిన రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ విచారణ కమిటీ ఏర్పాటు చే స్తామని తెలిపారు. ముగ్గురు సీనియర్ వైద్యులతో వి చారణ జరిపించి వైద్యుల నిర్లక్ష్యం ఉన్నట్లు తేలితే శా ఖాపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. తల్లడిల్లుతున్న తల్లులు.. గర్భిణులతోపాటు గర్భంలోనే శిశువులు మృత్యువాత పడుతున్న ఘటనలు జిల్లాలో పెరిగిపోతున్నాయి. వైద్యుల నిర్లక్ష్యంతోనే ఈ సంఘటనలు జరుగుతున్నాయని బాధిత కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. ఇటీవల జిల్లాకేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో బాలింతతోపాటు శిశువు మృతిచెందగా, అదే ఆస్పత్రిలో చికిత్స పొందిన ఓ గర్భిణి కడుపులోనే బిడ్డ మృతిచెందింది. రిమ్స్ ఆస్పత్రిలో కూడా ఓ గర్భిణి కడుపులోనే శిశువు మృతిచెందగా కనీసం వైద్యులు బయటకు తీయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. రిమ్స్‌లో వైద్యులు అందుబాటులో ఉండకపోవడంతోనే ఇలాంటివి పునరావృతం అవుతున్నట్లు పలువురు పేర్కొంటున్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు మాత్రమే వైద్యులు ఆ స్పత్రిలో ఉంటున్నారు, తర్వాత ఇళ్లకు వెళ్లిపోతున్నారు. అత్యవసరం ఉన్నప్పుడు సిబ్బంది ఫోన్‌చేసి సమాచారం ఇస్తేనే వస్తున్నారు. వారు వచ్చేసరికి గర్భిణులు, శిశులు మృత్యువాత పడుతున్నారు. ఇప్పటికైనా ఇలాంటి ఘటనలు జరుగకుండా చూడాలని కోరుతున్నారు. -
రిమ్స్ ఆస్పత్రిలో ఔట్సోర్సింగ్ ఉద్యోగాల దందా
సాక్షి, ఆదిలాబాద్: రిమ్స్ అస్పత్రిలో ఔట్సోర్సింగ్ ఉద్యొగాల అమ్మకాల దందా బయటపడింది. స్డాప్ నర్సు ఉద్యోగానికి రూ. లక్ష 50 వేలు చెల్లించాలని మద్యవర్తులు నిరుద్యోగులతో బేరసాలకు దిగారు. స్టాప్ నర్సు ఉద్యోగానికి ఎంపికైన సుప్రియను డబ్బులు చెల్లించాలని బ్రోకర్ డిమాండ్ చేశాడు. మద్యవర్తి రూ.లక్షకు బేరం కుదుర్చుకున్నాడు. ఇలా ఐదుగురు నిరుద్యోగులతో మద్యవర్తులు బెరసారాలకు దిగుతున్నారు. ఈ క్రమంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగాల వేలంపై నిరుద్యోగులు మండిపడుతున్నారు. దీనిపై బాదిత కుటుంబ సభ్యులు రిమ్స్ డైరెక్టర్ కరుణాకర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని రిమ్స్ డైరెక్టర్ బాధితులకు తెలిపారు. -
రిమ్స్‌లో దారుణం: కాలం చెల్లిన ఇంజక్షన్లతో చికిత్స..
సాక్షి, ఆదిలాబాద్: రిమ్స్‌లో రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. రోగం నయం చేసుకునేందుకు ఆస్పత్రికి వస్తున్న వారికి కాలం చెల్లిన ఇంజక్షన్ ఇస్తూ వారి ప్రాణాలకు ముప్పు తెస్తున్నారు. పట్టించుకోవాల్సి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. రిమ్స్ ఆస్పత్రిలోని మూడో అంతస్తు మేల్ జనరల్ వార్డులో దాదాపు 30 మంది రోగులు వివిధ రోగాలతో చికిత్స పొందుతున్నారు. ఆదివారం రాత్రి ఆ వార్డులోని నర్సు ఐదుగురు రోగులకు ఇంజక్షన్లు ఇచ్చింది. వ్యాక్సిన్ బాటిళ్లను రోగుల బెడ్లపై ఉంచడంతో అదే వార్డులో చికిత్స పొందుతున్న ఓ ఆర్ఎంపీ వైద్యుడి కుమారుడు గమనించి ఇంజక్షన్‌కు కాలం చెల్లిందని వైద్యసిబ్బందికి చెప్పడంతో వెంటనే చెత్తబుట్టలో పారేశారు. బంధువుల ఆందోళన.. రోగుల బంధువులు ఆదివారం రాత్రి ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్, బీ జేపీ నాయకులు అక్కడికి చేరుకుని వైద్య సిబ్బందిని నిలదీశారు. రిమ్స్ డైరెక్టర్‌ను ఫోన్లో సంప్రదించగా స్పందించకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. రోగులకు ఇచ్చిన యాంటి బయోటిక్ ఇంజక్షన్ 2019లో తయారుకాగా 2021 జనవరితో గడువు ముగిసింది. ఈ విషయమై ఏఐసీసీ సభ్యురాలు గండ్రత్ సుజాత, బీజేపీ నాయకులు పాయల్ శరత్ సోమవారం జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. రిమ్స్ సిబ్బంది, డైరెక్టర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై రిమ్స్ డైరెక్టర్ బలరాం రాథోడ్‌ను వివరణ కోరగా కమిటీని ఏర్పాటు చేసి విచారణ జరిపిన అనంతరం బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. సిబ్బందిపై కేసు నమోదు రిమ్స్‌లో చికిత్స పొందుతున్న గాంధీచౌక్‌కు చెందిన గౌరీశంకర్‌శర్మ కుమారుడు కైలాస్‌శర్మ ఆస్పత్రి సిబ్బందిపై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టూటౌన్ సీఐ వివరించారు. చదవండి: ల్యాబ్ నుంచి వైరస్ లీక్ కాలేదు : చైనా వైరాలజిస్ట్ -
అల్లుడి కోపం తగ్గింది.. సంసారం నిలబడింది
జీవితాంతం తోడు నీడగా ఉంటామని నవ దంపతులు చేసుకున్న పెళ్లినాటి ‘నాతిచరామి’ ప్రమాణాలను పక్కనపెట్టి చిన్నచిన్న మనస్పర్థలతో సంసారాలను బుగ్గిపాలు చేసుకుంటున్నారు. అనుమానాలు, అపార్థాలు, అసూయా ద్వేషాలు ఇందుకు ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. ఇంకొందరి విషయాల్లో వివాహేతర సంబంధాలు చిచ్చురేపుతున్నాయి. ఫలితంగా విడాకుల వరకు వెళ్లి కాపురాలు కుప్ప కూలిపోతున్నాయి. కలహాల కాపురాలను ‘కౌన్సెలింగ్’మంత్రంతో నిలబెడుతూ దంపతులకు ‘దిశా’ నిర్దేశం చేస్తున్నారు కడప మహిళా స్టేషన్ పోలీసులు. –కడప అర్బన్ ఇలా సరిచేశారు.. కడపకు చెందిన ఓ మహిళను ముంబైకి చెందిన వ్యక్తికి ఇచ్చి వివాహం చేశారు. ఇటీవల ఆ మహిళ తనను ఓ గదిలో నిర్బంధించి చిత్రహింసలకు గురిచేస్తున్నారని తల్లికి సమాచారం ఇచ్చింది. స్థానికుల సలహా మేరకు బాధితురాలి తల్లి కడపలోని దిశ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి డీఎస్పీ షౌకత్ ఆలీకి ఫిర్యాదు చేసింది. ఆయన తమ సిబ్బందితో కలిసి బాధితురాలు చేసిన ఫోన్ నంబర్ ఆధారంగా ముంబైలోని ఆ ప్రాంతం పరిధిలోని పోలీస్‌స్టేషన్ అడ్రస్‌ను సేకరించారు. పోలీస్‌స్టేషన్‌కు ఇక్కడి నుంచి ఫిర్యాదు చేస్తే వారు ఏసీపీని సంప్రదించాలని సూచించారు. ఆ అధికారి ఫోన్లో స్పందించకపోవడంతో ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం ఇచ్చారు. వెంటనే బాధిత మహిళకు విముక్తి కల్పించారు. కడప దిశ పోలీస్ స్టేషన్‌కు తీసుకుని వచ్చి భర్తకు, కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. దీంతో వారి సంసారం చక్కబడింది. అనంతరం బాధితురాలి తల్లి బంధువులతో ముంబైకి వెళ్లి, తన కుమార్తెను, అల్లుడిని చూసుకుని వచ్చారు. ‘‘బాధితురాలి తల్లి కష్టాన్ని తమదిగా భావించి సమస్యను పరిష్కరించామని’’డీఎస్పీ తెలియజేశారు. ఇద్దరినీ కలిపారు రాజంపేట పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో ఓ మండలానికి చెందిన యువతీ, యువకుడు పరస్పరం ప్రేమించుకున్నారు. యువకుడు తాను గ్రూప్స్‌కు ప్రిపేర్ అవుతున్నాని ప్రభుత్వ ఉద్యోగం వచ్చాక పెద్దలను ఒప్పించి వివాహం చేసుకుందామని చెప్పాడు. ఆమె ససేమిరా ఒప్పుకోకపోగా, తనను వెంటనే వివాహం చేసుకోవాలని కోరింది. మరోవైపు తనను ప్రేమించిన యువకుడు బంధువులకు చెందిన వేరే అమ్మాయిని వివాహం చేసుకుంటున్నాడని ప్రచారం జరుగుతుండటంతో ఆమె పోలీసులను సంప్రదించింది. ఈ విషయంపై ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు లోతుగా విచారించారు. వీరి మధ్య మనస్పర్థలను తొలగించే ప్రయత్నం చేశారు. దీంతో వారి మధ్య సయోధ్య కుదిరింది. లేదంటే ఇద్దరు ప్రేమికులతో పాటు, మరో యువతి పేరును అనవసరంగా ప్రచారంలోకి తీసుకుని వస్తే.. ఆమె ఆవేదనకు గురైతే? ఆత్మహత్యలు లాంటి అనర్థాలకు దారితీసే అవకాశాలు కూడా లేకపోలేదు. అల్లుడి కోపం తగ్గింది.. సంసారం నిలబడింది చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తికి చెందిన ఓ అధ్యాపకుడికి, కడపకు చెందిన ఓ యువతికి నాలుగు సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి ఏడాదిన్నర బాబు ఉన్నాడు. భర్తతో గొడవపడి, బాబును తండ్రి దగ్గరే వదిలేసి కడపకు వచ్చేసింది భార్య. భార్యకోసం భర్త కడపకు వస్తే తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు గొడవపడి బయటకు నెట్టేశారు. దీంతో వీరిమధ్య మనస్పర్థలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. కొన్నిరోజులకు భార్య, తనకు కుమారుడు కావాలని, కనీసం వీడియోకాల్లోనైనా మాట్లాడించాలని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతో చెప్పింది. వారు అల్లుడిమీద కోపంతో తమ కుమార్తె మాటలను ఖాతరు చేయలేదు. దీంతో ఆమె దిశ మహిళా పోలీస్ స్టేషన్‌ను సంప్రదించారు. బోరున విలపిస్తూ తన కుమారుడిని, భర్తను కలపాలని ప్రాధేయపడ్డారు. స్పందించిన డీఎస్పీ ఆమె భర్తను, కుమారుడిని, బంధువులను పిలిపించారు. కౌన్సెలింగ్ నిర్వహించి వారి మధ్య మనస్పర్థలను తొలగించారు. దీంతో భర్త తన కుమారుడితో పాటు అత్తారింటికి వెళ్లాడు. మరుసటిరోజున భార్యాభర్తలు స్టేషన్‌కు వచ్చి ‘‘తమ సంసారాన్ని నిలబెట్టారని.. లేకుంటే జీవితాంతం విడిపోయేవారమని, సంతోషం వ్యక్తం చేస్తూ, కృతజ్ఞతలు’’తెలియజేశారు. ఒన్‌స్టాప్ (దిశ)సెంటర్ పాత్ర కీలకం జిల్లా స్త్రీ,శిశు సమగ్రాభివృద్ధి (ఐసీడీఎస్) పరిధిలో రిమ్స్ ఆవరణంలో నిర్మించిన ఒన్‌స్టాప్ సెంటర్(దిశ సెంటర్)లో ప్రాజెక్టు డైరెక్టర్ పద్మజ ఆదేశాల మేరకు అడ్మినిస్ట్రేటర్ ఎన్. అశ్విని, సైకాలజిస్ట్‌గా సునీత, న్యాయసలహాదారుగా ఉమాదేవి, ఇతర సిబ్బంది విధులను నిర్వహిస్తున్నారు. వీరు తమ పరిధిలో భార్యాభర్తల కౌన్సెలింగ్‌ను విడతలవారీగా నిర్వహించి వారి మధ్య తలెత్తే విభేదాలను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. -
బస్సులో ప్రయాణికుడి మృతి
కడప కోటిరెడ్డిసర్కిల్ : మైదుకూరు నుంచి కడపకు వస్తున్న ఆర్టీసీ బస్సులో మైదుకూరు మండలం తిప్పిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన వేపరాల యర్రన్న (80) మృతి చెందారు. ఈయన కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధతున్నారు. ఇతన్ని భార్య సాలమ్మ రిమ్స్‌కు తీసుకు వస్తుండగా మార్గమధ్యంలో సీటులోనే కుప్పకూలి మృతి చెందాడు. బస్సు బస్టాండుకు రాగానే ఆర్టీసీ సెక్యూరిటీ హెడ్ కానిస్టేబుల్ శివారెడ్డి, కానిస్టేబుల్ రవి, చిన్నచౌకు ఔట్‌పోస్టు సిబ్బంది గోపాల్‌లు మేము సైతం స్వచ్ఛంద సంస్థ వారితో కలిసి మృతదేహాన్ని తిప్పిరెడ్డిపల్లెకు పంపించే ఏర్పాట్లు చేశారు. చదవండి: జాతరకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదం వయసు ఎక్కువని హేళన.. విద్యార్థి ఆత్మహత్య -
రేపే బిహార్ ఫలితాలు.. క్షీణించిన లాలూ ఆరోగ్యం
పట్నా : ఆర్జేడీ అధ్యక్షుడు, బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూప్రసాద్ యాదవ్ ఆరోగ్యం క్షీణించినట్లు వైద్యులు పేర్కొన్నారు. రేపు(నవంబర్ 10) బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రానున్న నేపథ్యంలో లాలూప్రసాద్ యాదవ్ తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నట్లు వైద్యులు తెలిపారు. లాలూకు డయాలసిస్ కొనసాగుతుందని చెప్పారు. ఈ మేరకు సోమవారం లాలూ హెల్త్ బులెటిన్‌ను విడుదల చేశారు. దాణా కుంభకోణం కేసులో దోషిగా తేలిన లాలూ 2017 నుంచి జైలులో ఉన్నారు. పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన కొంతకాలంగా రాంచీలోని రిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. ఆయన దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నానని, అయినప్పటీకి ఇప్పటివరకు ఆయనకు డయాలసిస్ చేయాల్సిన అవసరం రాలేదని వైద్యులు పేర్కొన్నారు. కానీ ప్రస్తుతం ఆయన ఆరోగ్యం క్షీణించడంతో డయాలసిస్ చేస్తున్నట్లు రిమ్స్ వైద్యులు పేర్కొన్నారు. కాగా, ఇటీవల జరిగిన బిహార్ ఎన్నికల ప్రచారంలో లాలూ ప్రసాద్ పాల్గొననప్పటికీ, ప్రతి రోజు పార్టీ కార్యక్రమాలు, ప్రజల అభిప్రాయాలను టీవీ చానళ్లు, వార్త పత్రికల ద్వారా సమీక్షించేవాడని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను కూడా ఆయన పరిశీలించారని చెప్పారు. రేపే ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో లాలూ తీవ్ర ఒత్తిడికి లోనయ్యాడని, అందుకే ఆరోగ్యం క్షీణించిందని ఆయన సన్నిహితులు పేర్కొన్నారు. కాగా, 243 అసెంబ్లీ స్థానాలకు ఉన్న బిహార్‌లో మూడు విడతలుగా ఎన్నికలు జరిగాయి. నవంబర్ 10న ఓట్ల లెక్కింపు జరగనున్నాయి. ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలన్నీ ఆర్జేడీ-కాంగ్రెస్- కూటమికే జైకొట్టాయి. -
అవన్నీ అవాస్తవాలు: మంత్రి సీదిరి అప్పలరాజు
సాక్షి, శ్రీకాకుళం: రిమ్స్‌లో కార్డియాలజీ, యురాలజీ, నెఫ్రాలజీ విభాగాలకు ఆరుగురు స్పెషలిస్టుల నియామకానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖా మంత్రి సీదిరి అప్పలరాజు తెలిపారు. కొత్తగా యూనిట్ల మంజూరుకు భవనం ఉందని, స్థలం, బెడ్స్ కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. రిమ్స్‌లో మౌలిక సదుపాయాల కల్పన అంశంపై మంత్రి బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘గత 7 నెలలుగా కోవిడ్ గురించే మాట్లాడుతున్నాం. జనరల్ మెడిసిన్‌లో 4 యూనిట్లు ఉన్నాయి. మౌలిక సదుపాయాలు ప్రస్తుతం కల్పించుకునే అవకాశం ఉంది. పోస్టుల అవసరం ఉంది. అందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. నెఫ్రాలజీ విభాగం ప్రారంభించి సేవలు అందించాలి’’ అని పేర్కొన్నారు.(చదవండి: రాజధాని కోసం రాజీనామాకు సిద్ధం..) సమీక్ష సందర్భంగా.. వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డా.ఏ.కృష్ణ వేణి మాట్లాడుతూ రాష్ట్ర వైద్య శాఖామంత్రి సందర్శించిన తరువాత అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు 50 నుంచి 100కు పెంచారని తెలిపారు. అదే విధంగా స్టాఫ్ నర్సుల పోస్టులు 180 కి పెరిగాయన్నారు. ‘‘సీనియర్ ఫాకల్టీ, ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్ల అవసరం ఉంది. పెడియాట్రిక్స్, గైనకాలజీలో అదనంగా రెండు యూనిట్లు చొప్పున, జనరల్ మెడిసిన్ లో 3 యూనిట్లు అవసరం. తద్వారా నాణ్యమైన వైద్య సేవలు అందించగలం. సూపర్ స్పెషాలిటీ విభాగాలు లేవు. కార్డియాలజీ, నెఫ్రాలజీ విభాగాలలో సూపర్ స్పెషాలిటీ అవసరం. యు.జి. విద్యార్థులకు వసతి సౌకర్యాలు తక్కువగా ఉన్నాయి. పీజీలకు వసతి లేదు. సిటికి 16 స్లైడ్స్ అవసరం. క్షేత్ర స్థాయి సందర్శనలకు 50 సీటర్ల బస్సు అవసరం’’ అని మంత్రికి విజ్ఞప్తి చేశారు. అది అవాస్తవం: మంత్రి సీదిరి అప్పలరాజు ‘‘టీడీపీ తిత్లీ దొంగలు మత్స్యకార భరోసాపై ఫిర్యాదు చేశారు. ఈ పథకంలో అక్రమాలు జరిగాయన్నది అవాస్తవం. టీడీపీ నాయకులు ఆరోపణలు చేయడం సరికాదు. మత్స్యకార గ్రామాలకు వచ్చి వాస్తవాలు తెలుసుకోవాలి. అమరావతి కావాలనుకుంటే రాజీనామా చేసి పోటీకి రావాలి. పత్రికా సమావేశాలో సవాళ్లు చేయడం ఎందుకు?’’ అని మంత్రి సీదిరి అప్పలరాజు టీడీపీ నేతల తీరును ఎండగట్టారు. -
కరోనా: నెలకో నోడల్ ఆఫీసర్
సాక్షి, ఆదిలాబాద్: రిమ్స్ కోవిడ్ విభాగానికి సంబంధించి నెలకో నోడల్ అధికారి మారుతున్నాడు. దీంతో ఆ విభాగంలో సేవలకు కొంత అంతరా యం ఏర్పడుతుంది. కొత్తగా వచ్చే నోడల్ అధికారి అక్కడి పరిస్థితులను తెలుసుకోవడానికి కొంత సమయం పడుతుండటంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. జనరల్ మెడిసిన్‌కు సంబంధించి ఐదుగురు వైద్యులు ఉండగా, ప్రస్తుతం ఇద్దరు నోడల్ అధికారులు మారారు. మంగళవారం మ రో ఎండీకి బాధ్యతలను అప్పగించారు. దీంతో ఇ టు వైద్యారోగ్య శాఖాధికారులకు కూడా ఈ మా ర్పుల కారణంగా ఇబ్బందులు తలెత్తుతున్నాయని సమాచారం. నోడల్ అధికారి పోస్టు మార్పు చేయకుండా చూడాల్సిన రిమ్స్ డైరెక్టర్ నెలకోసారి ఇలా మార్పు చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఇతర వైద్యులకు ఇస్తే ప్రయోజనం నోడల్ అధికారి పోస్టును జనరల్ మెడిసిన్ వైద్యులకు కాకుండా ఈఎన్టీ, అప్తాల్మిక్, సివిల్ సర్జన్, ఇతర వైద్యులకు అప్పగిస్తే ఎండీల ద్వారా కోవిడ్ బాధితులకు మరింతగా వైద్యసేవలు అందుతాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. నోడల్ అధికారిగా ఉన్న వ్యక్తి రోజుకు ఎన్ని టెస్టులు జరిగాయి, ఎంతమందికి పాజిటివ్, ఎంతమందికి నెగిటివ్, ఎంతమంది డిశ్చార్జి అయ్యారు, ఎవరైనా మరణించారా.. కిట్స్, గ్లౌజులు, తదితర పరికరాలు అందుబాటులో ఉన్నాయా.. లేవా అనే విషయాన్ని తెలుసుకుంటారు. అయితే ఎవరైతే నోడల్ అధికారిగా ఉంటారో వారు కోవిడ్ బాధితులకు వైద్యసేవలు చేయకుండానే ఈ పోస్టులో ఉంటారని పలువురు వైద్యులు చెబుతున్నారు. అయితే జనరల్ మెడిసిన్‌లో ఐదుగురు మాత్రమే వైద్యులు ఉన్నారు. వీరికి ఐదు రోజులు విధులు కేటాయిస్తారు. వీరితో పాటు జూనియర్ డాక్టర్లే కోవిడ్ బాధితులకు వైద్యసేవలు అందిస్తున్నారు. జనరల్ మెడిసిన్ వైద్యులే కీలకం కావడంతో పనిభారం పెరుగుతుందని పలువురు వైద్యులు పేర్కొంటున్నారు. ఇతర డిపార్ట్మెంట్లకు చెందినవారికి నోడల్ అధికారి బాధ్యతలు అప్పగిస్తే కొంత పనిభారం తగ్గే అవకాశం ఉండటంతో పాటు కోవిడ్ బాధితులకు నాణ్యమైన వైద్యసేవలు అందుతాయని భావిస్తున్నారు. అయితే కోవిడ్ విభాగం ఏర్పాటు చేసినప్పుడు మొదట డాక్టర్ సందీప్ జాదవ్, ఆ తర్వాత డాక్టర్ తానాజీ నోడల్ అధికారులుగా వ్యవహరించగా, ప్రస్తుతం డాక్టర్ శ్రీనివాస్‌కు ఈ బాధ్యతలు అప్పగించారు. ఉన్నా.. నిరుపయోగమే రిమ్స్‌లో కోవిడ్ పరీక్షలు నిర్వహించేందుకు లక్షలాది రూపాయలు పెట్టి కొనుగోలు చేసిన ఆర్టీపీసీఆర్ యంత్రం గత కొన్ని నెలలుగా నిరుపయోగంగా మూలన పడి ఉంది. ఈ యంత్రం ద్వారా కరోనా పరీక్షలు నిర్వహించేందుకు టెక్నీషియన్ లేకపోవడంతో మూలన పడింది. ప్రస్తుతం ట్రూనాట్, సీబీనాట్ ద్వారానే కోవిడ్ పరీక్షలు చేస్తున్నారు. వీటి ద్వారా రోజుకు 50 నుంచి 60 వరకు మాత్రమే ఫలితాలు వస్తున్నాయి. ఆర్టీసీపీఆర్ ద్వారా రోజుకు వందకు పైగా టెస్టులు చేయొచ్చు. ప్రస్తుతం రిమ్స్‌లో ఐదుగురు టెక్నీషియన్లు ఉండగా, ఇద్దరు కోవిడ్ బారినపడ్డారు. ముగ్గురు మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. వీరు ఈ కోవిడ్ పరీక్షలతో పాటు ఇతర రక్త నమూనాలను కూడా చేస్తుండటంతో పనిభారం పెరుగుతుందని చెబుతున్నారు. నెలకొకరికి బాధ్యతలు అప్పగిస్తున్నాం నోడల్ అధికారిగా నెలకొకరికి బాధ్యతలు అప్పగిస్తున్నాం. కోవిడ్ నేపథ్యంలో ఎవరికీ పనిభారం కలగకుండా చూస్తున్నాం. జనరల్ మెడిసిన్ వారికి బాధ్యతలు ఇవ్వాల్సి ఉంది. త్వరలోనే ఆర్టీపీసీఆర్ యంత్రం ద్వారా కోవిడ్ టెస్టులు చేసేలా టెక్నీషియన్‌ను నియమిస్తాం. – బలరాం, రిమ్స్ డైరెక్టర్ -
ఐసోలేషన్‌లో పేషెంట్లు భయపడుతున్నారు
సాక్షి, ఆదిలాబాద్: కేసీఆర్ సర్కార్ రిమ్స్ ఆస్పత్రికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని కాంగ్రెస్ శాసనసభా పక్ష (సీఎల్పీ) నేత భట్టి విక్రమార్క అన్నారు. ఆయన ఆదిలాబాద్‌లోని రిమ్స్ ఆస్పత్రిని శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ.. ఒక్క రిమ్స్‌లోనే 100 డాక్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. ఇక్కడ ఐసోలేషన్‌లో పేషెంట్లు భయంతో ఒత్తిడికి లోనవుతున్నారని తెలిపారు. (చదవండి: ఏం డాక్టర్‌వయ్యా.. దిమాక్ ఉందా?) కరోనా బాధితులను సర్కార్ గాలికొదిలేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా చావులన్నీ ప్రభుత్వ హత్యలుగా పేర్కొన్నారు. తెలంగాణలో ఏ ఒక్క ఆస్పత్రి సరిగా లేదన్నారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలన్నారు. వచ్చే శాసన సభ సమావేశాల్లో కేసీఆర్ వైఫల్యాలను ఎండగడుతామని హెచ్చరించారు. (చదవండి: ఫామ్‌హౌస్‌కు వెళ్లడంకాదు.. ప్రజల్లో ధైర్యం నింపండి ) -
ప్రాణం తీసిన సెల్ఫీ సరదా
ఆదిలాబాద్‌రూరల్: సెల్ఫీ సరదా ఓ యువకుడి ప్రాణం తీసింది. రక్షాబంధన్ రోజున జలపాతం వద్దకు స్నేహితులతో వెళ్లిన యువకుడు అందులోపడి గల్లంతు కాగా మంగళవారం మృతదేహం లభ్యమైంది. పోలీసుల, కుటుంబ సభ్యుల క థనం ప్రకారం.. ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని భీంనగర్‌కు చెందిన డి.సచిన్ (20) స్నేహితుడితో కలిసి సోమవారం మండలంలోని ఖండాల జలపాతానికి వెళ్లాడు. సరదాగా సెల్ఫీ తీసుకుంటున్న సమయంలో ప్రమాదవశాత్తు జలపాతంలో జారీ పడ్డాడు. దీంతో తోటిమిత్రులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. గల్లంతైన యువకుడి కోసం గాలింపు చేపట్టిగా చీకటి పడడంతో ఆచూకీ లభ్యం కాలేదు. తిరిగి మంగళవారం ఉదయం నుంచే జలపాతం వద్ద గాలింపు చర్యలు చేపట్టగా యువకుడి మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్రంలోని రిమ్స్‌కు తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్‌కానిస్టేబుల్ తెలిపారు. పెద్ద దిక్కుకోల్పోయిన కుటుంబం.. సచిన్ తండ్రి ఏడేళ్ల కిందట పాముకాటుతో మృతిచెందాడు. అప్పటి నుంచి తల్లి తిర్వణబాయి సచిన్‌తో పాటు మరో కుమారుడిని చూసుకుంటుంది. ఈ క్రమంలోనే సచిన్ ఆదిలాబాద్ పట్టణంలో డిగ్రీ చదువుతూ ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని ఓ టీ హోటల్లో పని చేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉంటున్నాడు. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న సచిన్ మృతి చెందడంతో ఆ కుటుంబం పెద్ద దిక్కు కోల్పోయింది. సచిన్ కుటుంబ సభ్యుల రోదనలు చూపరులను కంటతడి పెట్టించాయి. -
రిమ్స్ డైరెక్టర్ బలరాం నాయక్ సంచలన వ్యాఖ్యలు
-
రిమ్స్ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, ఆదిలాబాద్: రిమ్స్‌లో వైద్య ఖాళీల భర్తీకి వైద్యులే అడ్డుపడుతున్నారంటూ రిమ్స్ డైరెక్టర్ బలరాం నాయక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రిమ్స్‌లో ఖాళీలు భర్తీ చేయాలని జిల్లా, రాష్ట్ర స్థాయిలో అధికారులకు లేఖలు రాశాను. ఖాళీలు భర్తీ చేస్తే ఉన్న వైద్యులకు ఏ ఇబ్బందులు ఉండవు. అయినా వారు ఒప్పుకోవడం లేదు. నా సీటు నా పోస్టు అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. స్థానిక రాజకీయ నాయకులు కూడా వైద్యులకు వత్తాసు పలుకుతూ రిక్రూట్మెంట్ వద్దంటూ.. రాజకీయం చేస్తున్నారు. ఉన్న సౌకర్యాలతో ఉన్న సిబ్బందితోనే నెట్టుకొస్తున్నాము. 90శాతం నుంచి 100శాతం వరకు పనిచేస్తున్నామని రిమ్స్ డైరెక్టర్ బలరామ్ నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా.. తమను ఎవరూ పట్టించుకోవడం లేదంటూ రిమ్స్ ఐసోలేషన్ కేంద్రం నుంచి 10మంది కరోనా పాజిటివ్ వ్యక్తులు పరారైన సంగతి తెలిసిందే. (10మంది కరోనా రోగులు పరారీ!) -
ఆదిలాబాద్‌లో కలకలం
-
10మంది కరోనా రోగులు పరారీ!
సాక్షి, ఆదిలాబాద్ : తమను ఎవరూ పట్టించుకోవడం లేదంటూ రిమ్స్ ఐసోలేషన్ కేంద్రం నుంచి కరోనా రోగులు పరారైన సంఘటన కలకలం రేపుతోంది. ఒకవైపు రోజురోజుకు కరోనా కేసులు పెరుగుగుండగా, మరోవైపు జిల్లా కేంద్రంలోని రిమ్స్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్న 10మంది కరోనా పాజిటివ్ వ్యక్తులు శనివారం రాత్రి తప్పించుకుని బయటకు వచ్చారు. (కరోనా సోకి విద్యాశాఖ మంత్రి మృతి) ఇటీవల ఈ రిమ్స్‌లో సరైన సౌకర్యాలు లేవని సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పాజిటివ్ వచ్చిన పదిమంది సిబ్బంది కళ్లుగప్పి తప్పించుకున్నారు. అయితే వీరిని రిమ్స్ సెక్యూరిటీ గార్డులతో పాటు ఎప్పటికప్పుడు సిబ్బంది, వైద్యబృందం పర్యవేక్షించాల్సి ఉండగా వారు పట్టించుకోకపోవడంతో ఈ సంఘటన చోటుచేసుకుంది. రిమ్స్ నుంచి తప్పించుకున్న బాధితులు కైలాస్‌నగర్, చాందా, టీచర్స్ కాలనీ, నిజామాబాద్, కొత్త కుమ్మరివాడ, ద్వారక నగర్, ఇంద్రవెల్లి, ఖానాపూర్‌కు చెందిన వారు ఉన్నట్లు సమాచారం. (తెలంగాణలో కొత్తగా 1891 కరోనా కేసులు) అయితే మెరుగైన వైద్య సేవలు, సరైన సౌకర్యాలు లేకపోవడంతోనే వీరంతా రిమ్స్ నుంచి పరారైనట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇక తప్పించుకున్నవారి ముగ్గురిని గుర్తించినట్లు వైద్యాధికారులు, పోలీసులు తెలిపారు. ఇద్దరు ఆదిలాబాద్ పట్టణానికి చెందిన వ్యక్తుల్ని తిరిగి రిమ్స్‌కు తరలించారు. ఇంద్రవెల్లికి చెందిన ఒకరిని హోం ఐసోలేషన్‌లో ఉంచేందుకు అనుమతి ఇచ్చారు. (విషాదం.. కరోనా బాధితులు ఆత్మహత్య) పరారీ అవాస్తవం ఐసోలేషన్ కేంద్రం నుంచి పదిమంది కరోనా రోగులు పరారయ్యారనేది అవాస్తవమని రిమ్స్ డైరెక్టర్ బలరాం నాయక్ కొట్టిపారేశారు. వారు పండుగ కోసం అనుమతి తీసుకుని వెళ్లారని, వాళ్లంతా తిరిగి రిమ్స్‌కు వచ్చేశారని తెలిపారు. -
రిమ్స్‌లో ముదురుతున్న విభేదాలు..
ఆదిలాబాద్‌టౌన్: జిల్లా కేంద్రంలోని రాజీవ్‌గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్)లో డైరెక్టర్, వైద్యులు, సిబ్బంది మధ్య రోజురోజుకు వివాదాలు తారస్థాయికి చేరుకుంటున్నాయి. రిమ్స్ డైరెక్టర్ ఇబ్బందులకు గురిచేస్తున్నారని సిబ్బంది, వైద్యులు డైరెక్టర్ చాంబర్ ఎదుట నిరసనకు దిగారు. గతకొన్ని రోజులుగా చాపకింద నీరులా కొనసాగుతున్న వివాదాలు ముదురుతున్నాయి. అయితే విధుల పట్ల వైద్యులు, సిబ్బందితో డైరెక్టర్ కఠినంగా వ్యవహరించడం ఈ వివాదాలకు దారి తీసినట్లు తెలుస్తోంది. కాగా వైద్యులు, సిబ్బంది గురువారం విధులు బహిష్కరించి నిరసనకు దిగారు. కార్మికులు, స్టాఫ్‌నర్సులు, ఫార్మసిస్టులు, డాక్టర్లు, జూనియర్ డాక్టర్లు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. దీంతో అత్యవసరంగా చికిత్స అందక రోగులు అవస్థలు పడ్డారు. ముదురుతున్న విభేదాలు రిమ్స్ డైరెక్టర్ బానోత్ బలరాం వైద్యులు, సిబ్బందిని తన జాబ్ చార్ట్ ప్రకారం విధులు నిర్వహించాలని, సమయపాలన పాటించాలని సూచిస్తున్నారు. రిమ్స్‌లో పనిచేస్తున్న కొంతమంది వైద్యులు, సిబ్బందికి ఇది మింగుడు పడటం లేదు. ఉదయం 9గంటలకు విధులకు హాజరై సాయంత్రం 4గంటల వరకు పని చేయాలని ఆదేశించారు. అలాగే బయోమెట్రిక్ విధానం ద్వారా హాజరు నమోదు చేయాలని చెప్పడం ఈ నిరసనకు దారి తీసినట్లు సమాచారం. కరోనా నేపథ్యంలో గత రెండు నెలలుగా రిజిస్టర్లో సంతకం చేస్తున్న వైద్యులను గురువారం నుంచి బయోమెట్రిక్ ద్వారా హాజరు నమోదు చేసుకోవాలని డైరెక్టర్ సూచించారు. అయితే కొంతమంది వైద్యులు డైరెక్టర్‌కు వ్యతిరేకంగా సిబ్బందితో కలిసి ఆందోళనకు దిగినట్లు తెలుస్తోంది. రిమ్స్‌లో పనిచేస్తున్న చాలా మంది వైద్యులు ఆదిలాబాద్ పట్టణంలో ప్రైవేట్ క్లినిక్‌లు నిర్వహిస్తున్నారు. దీంతో రిమ్స్‌లో సమయం కేటాయించలేకపోతున్నారు. మధ్యాహ్నమే ఇంటిముఖం పడుతున్నారు. బయట క్లినిక్‌లో వైద్యం చేస్తూ నిబంధనలను అతిక్రమిస్తున్నారు. ఇలా విధులకు గైర్హాజరవుతున్న వైద్యులు, సిబ్బందికి డైరెక్టర్ మెమోలు జారీ చేస్తున్నారు. దీంతో కొంతమంది ఉద్యోగులు, వైద్యులు, సిబ్బంది ఏకమై నిరసన చేపడుతున్నట్లు సమాచారం. కాగా ఇటీవల స్టాఫ్‌నర్సులు కూడా డైరెక్టర్ చాంబర్ వద్ద నిరసనకు దిగిన విషయం విదితమే. స్టాఫ్‌నర్సులు కూడా బయోమెట్రిక్ ద్వారా హాజరు నమోదు చేసుకోవాలని, డైరెక్టర్ కార్యాలయంలోని రిజిస్టర్లో సంతకాలు చేయాలని పేర్కొనడంతో ఆందోళన చేపట్టారు. గతంలో కూడా.. రిమ్స్‌లో పనిచేస్తున్న వైద్యులు రెండు గ్రూపులుగా ఉన్న విషయం తెలిసిందే. కొంతమంది డైరెక్టర్‌కు మద్దతుగా ఉంటే మరికొంత మంది వ్యతిరేకంగా నడుచుకుంటున్నట్లు సమాచారం. మహారాష్ట్రకు చెందిన వైద్యులు, ఇక్కడి వైద్యులకు కూడా గొడవలు జరిగాయి. అలాగే గతంలో పనిచేసిన డైరెక్టర్లు కూడా కఠినంగా వ్యవహరించడంతో వైద్యులు, సిబ్బంది ఏకమై ఇలాంటి ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం పరిపాటిగా మారింది. వేధింపులకు పాల్పడడంతోనే.. రిమ్స్ డైరెక్టర్ తమపై మానసికంగా వేధింపులకు పాల్పడుతున్నారని వైద్యులు, సిబ్బంది పేర్కొంటున్నారు. బాధ్యతగా విధులు నిర్వర్తిస్తున్నా మెమోలు జారీ చేస్తున్నారని పలువురు చెబుతున్నారు. కరోనా నేపథ్యంలో విధులు నిర్వహించిన తమకు మాస్కులు, గ్లౌజులు, శానిటైజర్లు అందుబాటులో ఉంచలేదని ఆరోపిస్తున్నారు. ఇతర మెడికల్ కళాశాలల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నా రిమ్స్‌లో మాత్రం లేవన్నారు. తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విపత్కర పరిస్థితుల్లోనూ విధులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎలాంటి సౌకర్యాలూ కల్పించడం లేదు కరోనా నేపథ్యంలో కూడా రిమ్స్‌లో వైద్యులు, సిబ్బందికి కనీస సౌకర్యాలు కల్పించడం లేదు. రిమ్స్ డైరెక్టర్‌ను పలుసార్లు కలిసి గ్లౌజులు, మాస్కులు అందజేయాలని కోరాం. స్వచ్ఛంద సంస్థలు, ఇతరులు ముందుకొచ్చి అందిస్తున్నారే కాని ఆస్పత్రిలో మాత్రం మాకు మాస్కులు, శానిటైజర్లు ఇవ్వలేదు. ఇతర మెడికల్ కళాశాలల్లో పీపీఈ కిట్లు కూడా అందించారు. కరోనా ఉధృతి సమయంలో కూడా ప్రాణాలను సైతం లెక్కచేయకుండా వైద్యసేవలు అందించాం. డైరెక్టర్.. వైద్యులు, సిబ్బంది పట్ల వ్యవహరిస్తున్న తీరు సరికాదు. – ప్రణవ్, జూనియర్ డాక్టర్,రిమ్స్, ఆదిలాబాద్ బాధ్యతగా విధులు నిర్వహించాలనడంతోనే.. రిమ్స్ వైద్యులు, ఉద్యోగులు, సిబ్బంది బాధ్యతగా విధులు నిర్వర్తించాలని చెప్పడంతోనే వారు ఆందోళనకు దిగారు. ఇదివరకే ఒక్కో వైద్యుడికి నాలుగు చొప్పున మాస్కులు ఇచ్చాం. వారు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బయోమెట్రిక్ ద్వారా హాజరు నమోదు చేసుకోవాలని సూచించాం. వైద్యులు, ఉద్యోగులు, సిబ్బందిని వేధింపులకు గురిచేయడం లేదు. – బానోత్బలరాం, రిమ్స్ డైరెక్టర్, ఆదిలాబాద్ -
రోడ్డు ప్రమాదంలో హెడ్ నర్స్ మృతి
శ్రీకాకుళం, నరసన్నపేట: జాతీయ రహదారిపై మండలం కంబకాయ కూడలి వద్ద మంగళవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్ర మాదంలో శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రిలో హెడ్‌నర్స్‌గా పనిచేస్తున్న భా నుమతి బరోడా (47) మృతి చెందారు. ఆస్పత్రిలో విధులు పూర్తయిన అనంతరం భర్త మోహన్‌కుమార్ దాస్‌తో కలిసి ఆమె స్వగ్రామం సారవకోటకు బయల్దేరారు. సత్యవరం కూడలి వద్దకు వచ్చేసరికి వెనుక నుంచి వస్తున్న డీసీఎం వాహనం బలంగా ఢీకొనడంతో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. భర్త మోహనకు మార్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. జాతీ య రహదారి అంబులెన్స్‌లో శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించగా.. చికిత్స ప్రారంభించేలోగానే ఆమె కన్ను మూశారు. భానుమతి పదేళ్లు నరసన్నపేట, పాతపట్నం ఆస్పత్రుల్లో సేవలు అందించారు. గత నవంబర్లోనే హెడ్ నర్సుగా పదోన్నతి పొంది పాతపట్నం నుంచి శ్రీకాకుళం రిమ్స్‌కు వచ్చా రు. ఈమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రమాదంపై నరసన్నపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యా ప్తు చేస్తున్నారు. హెడ్‌నర్సు మృతితో స్వగ్రామం సారవకోటతో పాటు రిమ్స్‌లోనూ విషాద ఛాయ లు అలముకున్నాయి. -
ర్యాగింగ్: 600 గుంజీలు తీయించిన సీనియర్లు..
కడప అర్బన్: కడప ప్రభుత్వ వైద్య కళాశాల (రిమ్స్)లో ర్యాగింగ్ భూతం మంగళవారం కలకలం రేపింది. మొదటి సంవత్సరం వైద్య విద్యార్థిని వారం రోజులుగా తృతీయ సంవత్సరం విద్యార్థులు ర్యాగింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. వేధింపులపై బాధిత విద్యార్థి తల్లిదండ్రులు ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేశారు. తనచేత సీనియర్ విద్యార్థులు 600 గుంజీలు తీయించి వేధించారని బాధిత విద్యార్థి ప్రిన్సిపాల్ ఎదుట బోరున విలపించాడు. తాను నడువలేని పరిస్థితిల్లో ఉన్నానని కళ్లనీళ్లు పెట్టుకున్నాడు. తనను వేధించిన ఇద్దరి పేర్లను తెలియజేసినట్లు సమాచారం. ఈ ఘటనపై ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రసాదరావు స్పందిస్తూ వైస్ ప్రిన్సిపాల్‌తో పాటు, నలుగురు అధ్యాపక వైద్యులతో విచారణ కమిటీని వేశామన్నారు. వేధింపులు రుజువైతే పోలీసులకు ఫిర్యాదు చేయడంతోపాటు రాష్ట్ర వైద్య విద్య డైరెక్టర్ (డీఎంఈ)కి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. -
అన్నదాతా.. సుఖీభవ
సాక్షి: కడప అర్బన్ : ఆస్పత్రికి వచ్చే రోగుల సహాయకులు ఎవరూ ఇబ్బంది పడకూడదు. దు:ఖంలో ఉన్నవారికి కొంతయినా చేయూతనివ్వాలి... వారి ఆకలి తీర్చాలి. వసతి కల్పించాలి... ఎంత ఖర్చయినా సొంతంగానే భరించాలని కమలాపురం ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్‌రెడ్డి సంకల్పించారు... అనుకున్నట్లే రోగుల సహాయకుల సౌకర్యార్థం కడప రిమ్స్‌లో భోజనం, వసతి కోసం శాశ్వత భవనాన్ని నిర్మించారు. రెండు పూటలా ఆకలి తీరుస్తూ, వసతి కల్పిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. కడప నగర శివార్లలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (రిమ్స్) ప్రాంగణంలో రోగుల సహాయకుల కోసం శాశ్వతంగా రెండు పూటలా ఉచిత భోజనం, రాత్రి వేళ వసతి కల్పించారు. కమలాపురం ఎమ్మెల్యే పి. రవీంద్రనాథ్‌రెడ్డి సొంత ఖర్చులతో ఈనెల 1న ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఎమ్మెల్యే తల్లిదండ్రులు స్వర్గీయ పోచిమరెడ్డి తులశమ్మ, రామాంజులరెడ్డి జ్ఞాపకార్థం శాశ్వత భవనాన్ని నిర్మించారు. లోపలికి వెళ్లగానే కుడి, ఎడమ వైపుగా భోజనశాలకు వెళ్లేదారి ఉంటుంది. రెండువైపులా రెండేసి విశ్రాంతి గదులు ఉన్నాయి. ఒక్కో గదిలో 14 మంది విశ్రాంతి తీసుకునేలా పడకలు ఏర్పాటు చేశారు. ప్రతి బ్యాచ్‌కు 50 మంది చొప్పున భోజనం చేసేందుకు లోపలికి అనుమతిస్తారు. ప్రతి రోజూ భోజన వసతికే సుమారు రూ. 15 వేల నుంచి 20 వేల వరకు ఖర్చు చేస్తున్నారు. రోగుల సహాయకుల కోసం వసతి గది టోకెన్ ఇలా.. ప్రతి రోజూ ఉదయం 6 నుంచి 7 గంటల లోపు రిమ్స్ ఐపీ విభాగం సిబ్బంది వార్డులలో తిరిగి, రోగుల సహాయకులకు టోకన్లు అందజేస్తారు. సాయంత్రం నాలుగు గంటలకు రాత్రి భోజనం కోసం మళ్లీ టోకన్లు ఇస్తారు. శుభ్రం.. రుచికరం అన్నం, పప్పు లేదా సాంబార్, తాళింపు, రసం లేక మజ్జిగ తప్పనిసరిగా వడ్డిస్తారు. భోజనం తయారీ కోసం వాడే నీళ్లు పరిశుభ్రంగా ఉండేందుకు భవనం పైభాగాన ప్యూరిఫైడ్ వా టర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. అందులో నుంచి ప్యూరిఫై అయిన నీళ్లనే కూలింగ్ చేసి సహాయకులకు ఇస్తున్నారు. వేసవి కావడంతో బుధవారం నుంచి రసంతో పాటు, మజ్జిగను కూడా తప్పనిసరిగా భోజనంతో పాటు ఇస్తున్నారు. సాయంత్రం స్పెషల్: రాత్రి 7 నుంచి 8 గంటల లోపు పులిహోర, చిత్రన్న, పొంగలిలో ఏదోఒకటి వచ్చిన సహాయకులకు వడ్డిస్తారు. ఇందులో సాంబారు, పచ్చడిని ఇస్తున్నారు. విశ్రాంతి కోసం: రాత్రి వేళల్లో ఇక్కడ విశ్రాంతి తీసుకునే వారి జాబితాను రిమ్స్ అధికారులు పంపిస్తారు. లిస్టులో ఉన్నవారందరికీ విశ్రాంతి సౌకర్యం కల్పిస్తారు. మేయర్‌గా ఉన్నపుడు ఆలోచన రోగుల కోసం వచ్చే సహాయకులు, బంధువులు వసతి లేక గడ్డిపై పడుకొనేవారు. కడప మేయర్‌గా ఉన్న నాకు ఒక భోజన, వసతి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్న ఆలోచన వచ్చింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ దృష్టికి తీసుకుపోయాను. స్థలం కేటాయించి భూమిపూజ చేశారు. ఆయన అకాల మరణంతో ముందుకు తీసుకుపోలేకపోయాను. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావడం, కలెక్టర్ హరికిరణ్ పదే పదే కోరడంతో నా ఆలోచనకు కార్యరూపం ఇవ్వాలనిపించింది. ఇది అందరికీ ఉపయోగపడుతుందని నేను విశ్వసిస్తున్నా. – పి.రవీంద్రనాథ్‌రెడ్డి, ట్రస్ట్ చైర్మన్, ఎమ్మెల్యే, కమలాపురం నాపేరు నాగలక్షుమ్మ. మాది కర్నూలు జిల్లా చాగలమర్రి మండలం. నా మనవడు కొండయ్య మానసిక స్థితి సరిగా లేకపోవడంతో రిమ్స్‌లోనే ఉన్నాను. అప్పటి నుంచి రెండు పూటలా భోజనం ఉచితంగా చేస్తున్నాను. చాలా రుచికరంగా ఉంది. ఈ సౌకర్యం వల్ల ఎంతో మేలు జరుగుతోంది. నా కుమారుడికి ఆరోగ్యం సరిగా లేదు. వారం రోజుల నుంచి రిమ్స్‌లోనే ఉంటున్నాం. ఇక్కడే భోజనం తింటున్నాం. ఎంతో రుచికరంగా ఉంది. వృథా చేయకుండా ఉపయోగించుకుంటే మంచిది. – అక్కిశెట్టి కొండయ్య, ఇడమడక, దువ్వూరు మండలం, వైఎస్ఆర్ జిల్లా -
మళ్లీ రెచ్చిపోయిన మృగాళ్లు
ఒంగోలు:మహిళపై సామూహిక అత్యాచారం చేయగా బాధితురాలు మృతి చెందిన సంఘటన ఒంగోలు నగర పరిధిలో మంగళవారం అర్ధరాత్రి జరగ్గా బుధవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. స్థానిక చిన మల్లేశ్వర కాలనీకి దక్షిణం వైపున ఒక సన్నటి మార్గం ఉంది. ద్విచక్రవాహనాలు, ఆటోలు ఆ మార్గం ద్వారా పాత గుంటూరు రోడ్డులోని ఏ1 ఫంక్షన్‌హాలు వరకు వస్తుంటాయి. ఆ మార్గంలో చిల్లచెట్ల వద్ద ఓ మహిళ ఒంటిపై దుస్తులు ఊడిపోయి అపస్మారక స్థితిలో ఉండగా.. ఉదయాన్నే ఆ వైపుగా వెళ్లిన పందులు కాసుకునేవారు చూసి సమీప కాలనీ వాసులకు చెప్పారు. దీంతో వారు 108కు సమాచారం అందించడంతో సిబ్బంది ఒంగోలు జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వైద్యులు ఆమెను పరీక్షించగా ఆమె నోట్లో బియ్యం కనిపించాయి. నోట్లో బియ్యం కుక్కి చంపేందుకు యత్నించారనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఆమె ఒక చేతిపై జి.రాము అని పచ్చబొట్టు ఉంది. కాగా రెండో చేతిపై పచ్చబొట్టు చెరిపేసేందుకు బలవంతంగా యత్నించిన ఆనవాళ్లను పోలీసులు గుర్తించారు. ఆమె కాళ్లకు మెట్టెలు, పట్టీలున్నాయి. శరీరంమీద చీర ఉండగా.. ఘటనా స్థలంలో ఆమెకు సంబంధించిన ఒక బ్రా, జాకెట్, ఒక లెగ్గిన్ ఉన్నాయి. వీటితోపాటు ఆమె మెడలో ఉండే నల్లపూసల తాడు కూడా గుర్తించారు. దీంతో పోలీసులు ఆమె ఫొటోతో నగరంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లి ఆచూకీని కనుగొన్నారు. హత్యాయత్నం జరిగిన సంఘటనా స్థలం వద్ద పడి లోదుస్తులు, చెప్పులు, వాడిన కండోమ్స్ శివారు ప్రాంతాల్లో గాలింపు ముమ్మరం మహిళ ఫొటో మీడియాలో, సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయించారు. ఈ క్రమంలో కొంతమంది ఆమెను కర్నూల్‌రోడ్డులో చూసినట్లు చెప్పడంతో కర్నూల్ రోడ్డుకు చుట్టు పక్కల ఉన్న కాలనీల్లో సిబ్బందిని పంపి గాలింపు చర్యలు చేపట్టారు. స్థానిక శ్రీనగర్ కాలనీలో మృతురాలి సోదరి, తల్లి నివాసం ఉంటున్నట్లు గుర్తించి విచారించారు. మృతురాలి తల్లి బుట్టి లింగమ్మ వద్దనుంచి సేకరించిన సమాచారం ప్రకారం మృతురాలు ఆమెకు పెద్ద కుమార్తె అయిన ఆలూరి పోలమ్మ (30)గా కనుగొన్నారు. పోలమ్మ భర్త జయరావు, ఆటో డ్రైవర్. కొంతకాలంగా వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో వేర్వేరుగా ఉంటున్నారు.వీరికి ఇద్దరు కుమార్తెలు. ఒకరికి 13 సంవత్సరాలు, మరొకరికి 11 సంవత్సరాలు. రాత్రి 9 గంటల సమయంలో పిల్లలు ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో పోలమ్మ తలుపు బయట తాళం వేసి వెళ్లిపోయింది. ఆ తరువాత ఆమె జాడ లేకపోవడంతో పెద్ద కుమార్తె తెల్లవారుజామున తలుపులు బద్దలు కొట్టి అమ్మమ్మ వద్దకు పరిగెత్తింది. దీంతో కుమార్తె మనుమరాళ్లను ఇద్దరిని తన ఇంట్లోనే ఉంచింది. ఎందుకు వెళ్లిందనే దానిపైదర్యాప్తు చేస్తున్న పోలీసులు అర్ధరాత్రి సమయంలో స్థానిక బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ వరకు మృతురాలి సెల్‌కు సిగ్నల్ కనిపించింది. ఆ తరువాత నుంచి స్విచాఫ్ అయింది. దీంతో ఆమె సెల్‌కు ఎవరెవరి నుంచి కాల్స్ వచ్చాయనే దానిపై సంబంధిత సిమ్‌కార్డు కంపెనీ నుంచి సమాచారం సేకరించే పనిలో పోలీసుశాఖ నిమగ్నమైంది. ఆమెను ఎవరైనా బలవంతంగా హెచ్చరిస్తే బయటకు వెళ్ళిందా, లేక ఆమే బయటకు వెళ్ళిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలంలో లభించిన సాక్ష్యాల ఆధారంగా ఆమెపై అయిదుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడి ఉంటారని తెలుస్తోంది.అయితే అక్కడ నుంచి లభించిన కండోమ్‌లు ఈ ఘటనకు సంబంధించినవేనా లేక గతంలో అటు వైపు వచ్చిన వ్యభిచార ముఠాకు సంబంధించినవా అన్నది తేలాల్సి ఉంది. శివారు ప్రాంతాలపై ప్రత్యేకంగా దాడులు నిర్వహించి అసాంఘిక చర్యలకు పాల్పడేవారిపై చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు. ఘటనా స్థలంలో ఒక్క బియ్యం గింజ కూడా లభించలేదన్నారు. -
వచ్చింది ఐదుగురు... వెళుతోంది ఇద్దరే.!
కడప అర్బన్: ‘యా.. అల్లాహ్..’.‘ఎంతపని జరిగింది దేవుడా...’! అంటూ మృతుల కుటుంబాల రోదనలు రిమ్స్ మార్చూరీ ఆవరణలో మిన్నంటాయి.. గురువారం సాయంత్రం సిద్దవటం మండలంలోని పెన్నా తీరంలో జరిగిన దారుణ ఘటనతో ముగ్గురు బిడ్డలను పోగొట్టు కున్న గౌస్‌పీర్, ముంతాజ్ కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది.. అటు భర్త చనిపోవడంతో అన్వర్‌బాషా భార్య , కుమార్తె అనాథలుగా మిగిలారు. శుక్రవారం రిమ్స్ ఆవరణలో మృతదేహాల పోస్టుమార్టం సందర్భంగా రిమ్స్ ఆవరణలో శుక్రవారం విషాదఛాయలు అలముకున్నాయి. ముగ్గురు చిన్నారుల శవాలు.. పక్కనే మేనమామ మృతదేహాన్ని చూస్తూ.. ‘ఏం పాపం చేశారని ఈ శిక్ష వేశావు దేవుడా.. ఎందుకింత అన్యాయం చేశావు..’ అంటూ బంధువులు గుండెలు బాదుకుంటుంటే.. అది చూసిన ప్రతి ఒక్కరూ కంట నీరు కార్చారు. అక్కడికొచ్చిన బంధుమిత్రులెవరిని కదిలించినా కన్నీరే సమాధానమైంది. ప్రాణం మీదకు తెస్తున్నఈత సరదా.. పెన్నా పరీవాహక ప్రాంతంతో పాటు జిల్లాలోని పలు నదీపరీవాహక ప్రాంతాలు ప్రమాదకరంగా మారాయి. పండుగ వస్తేనే.. సెలవులుంటేనో ఈత కోసం సరదాగా వెళ్లడం, ఈత రాక మడుగుల్లో చిక్కుకునిపోయి ప్రాణాలనుకోల్పోతున్న ఘటనలు ఇటీవల తరచూ జరుగుతున్నాయి. తాజాగా జరిగిన ఘటనతో పాటు.. ఈనెల 2వ తేదీ సాయంత్రం సిద్దవటం మండల పరిధిలోని వంతెన సమీపంలో జరిగిన దుర్ఘటన ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యం. కాగా పెన్నానది నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న సమయంలో పోలీసు ఉన్నతాధికారులు అక్కడ కూడా కొంతమంది పోలీసు సిబ్బందిని వినియోగిస్తున్నారు. అయితే ఉధృతి తగ్గిన తర్వాత వెళుతున్న ప్రజలు తమకు ఈత రాకపోయినా సరదాగా నీటిలో ఆడుకుంటూ కాలక్షేపం చేసి వస్తుంటారు. ఈ క్రమంలోనే తమకు తెలియకుండానే నీటిలో పడి, మునిగిపోయి తమ విలువైన ప్రాణాలను కోల్పోతున్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ నుంచైనా నష్టపరిహారం వచ్చేలా చూస్తాం... వైఎస్ఆర్సిపి కడప పార్లమెంటరీ అధ్యక్షుడు, మాజీ మేయర్ కె. సురేష్‌బాబు ఈ సంఘటనను గురించి తెలుసుకున్న వైఎస్ఆర్ సీపీ కడప పార్లమెంటరీ అధ్యక్షుడు కె. సురేష్‌బాబు శుక్రవారం కడప రిమ్స్ మార్చురీకి చేరుకున్నారు. అక్కడ మృతదేహాలను పరిశీలించిన ఆయన సంఘటన జరిగిన తీరును బంధువులను అడిగి తెలుసుకున్నారు. ఇలాంటి సంఘటన చోటుచేసుకోవడం తీరని విషాదమన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్వర్‌బాష భార్య, కుమార్తెకు ప్రభుత్వం నుంచి నష్టపరిహారం వచ్చేలా చూస్తామని, లేకపోయినా సిఎం రిలీఫ్ ఫండ్ నుంచి నష్టపరిహారం వచ్చేలా చూస్తామన్నారు. పెన్నానదిలోకి వెళ్లేవారికి తగిన జాగ్రత్తలను సూచిస్తూ, ప్రమాద హెచ్చరికల సూచికలను ఏర్పాటు చేస్తే బాగుంటుందనీ, ఎప్పటికపుడు అప్రమత్తతగా వుంచేటా చూడాలనిఒంటిమిట్ట సిఐ హనుమంతనాయక్‌ను, సురేష్‌బాబు కోరారు. పెన్నాలో పడి మృతిచెందిన నలుగురు మృతదేహాలకు రిమ్స్‌లో వైద్యులు, వైద్యసిబ్బంది పోస్టుమార్టం నిర్వహించారు. మధ్యాహ్నం బంధువులకు మృతదేహాలను అప్పగించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ హనుమంతనాయక్ వెల్లడించారు. ఆ రెండు కుటుంబాల్లో... కర్ణాటక రాష్ట్రం రాయచూర్‌కు చెందిన గౌస్‌పీర్, ముంతాజ్‌లకు కుమారుడు జునైద్, కుమార్తెలు జోహా, ముదీహా, పదీహా సంతానం. ముంతాజ్, తన నలుగురు పిల్లలతో కలిసి గత నెల 28న తన సోదరుల ఇంటికొచ్చింది. తిరిగి వీరు ఈనెల 3న రాయచూరుకు వెళ్లాల్సి ఉంది. కానీ ఇంతలోనే ఈ దారుణ ఘటన జరిగింది. నలుగురు పిల్లలతో వచ్చిన ముంతాజ్ ముగ్గురిని పోగొట్టుకుని ఒక్క కుమారుడితో వెళ్లాల్సి వస్తోంది. మరోవైపు ఎలక్ట్రికలæ పనిచేసుకు టూ జీవన సాగిస్తున్న సోదరుడు అన్వర్‌బాషా కుటుంబంలోనూ ఈ ఘటన తీరని విషాదాన్నే నింపింది. అన్వర్ 17 సంవత్పరాల క్రితం సునీతను ఆదర్శ వివాహ చేసుకున్నాడు. వీరికి 15 సంవత్సరాల కుమార్తె ఉంది. ఈ దుర్ఘటనలో అన్వర్ బాషా ప్రాణాలను కోల్పోవోవడంతో భార్య, కుమార్తె అనాథలుగా మిగిలారు. నదిలోకి రాకుండారోడ్డుకు ఇరువైపుల కంచె సిద్దవటం: సిద్దవటం గ్రామ సమీపంలోని పెన్నానదిలోకి ఎవ్వరు దిగకుండా పాత వంతెన ఇరువైపుల కంపతో కంచె వేశామని ఎస్ఐ రమేష్‌బాబు తెలిపారు. శుక్రవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ గురువారం సాయంత్రం పెన్నానదిలో నలుగురు నీట మునిగి మృతి చెందిన సంఘటన నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నామన్నారు. నదిపై నిర్మించిన పాత వంతెన వద్ద మడుగు ఉండటంతో ఎవ్వరినీ దిగకుండా హైలెవల్ వంతెన స్తంభాలకు హెచ్చరిక సూచనను ఏర్పాటు చేశారు. ఆ ప్రదేశంలో ఎర్ర జండాలను కూడా ఏర్పాటు చేస్తామన్నారు. -
మారని రిమ్స్ ఆస్పత్రి
సాక్షి, ఆదిలాబాద్: ఎన్ని విమర్శలు ఎదుర్కొంటున్నా రిమ్స్‌లో కొంతమంది వైద్యుల తీరు మారడం లేదు. నవిపోదురూ.. నాకేంటి అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. గిరిజన మరణాలు తగ్గించాలనే ఉద్దేశంతో దివంగత ముఖ్యమంత్రి 2008లో రూ.125 కోట్లతో రాజీవ్ గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్)ను ఏర్పాటు చేశారు. 500 పడకలతో ఈ ఆస్పత్రిని నిర్మించారు. కార్పొరేట్ వైద్యం అందుతుందని భావించిన ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందడం లేదు. జ్వరం, చిన్నపాటి రోగాలు తప్పా గుండెనొప్పి, క్యాన్సర్ తదితర వ్యాధుల చికిత్స కోసం నాగ్‌పూర్, యావత్మాల్, హైదరాబాద్, తదితర ప్రాంతాలకు రెఫర్ చేస్తున్నారు. గుండెనొప్పితో రిమ్స్‌లో చేరిన కన్జర్వేటర్ ఫారెస్టుకు సరైన వైద్యం అందక ఆస్పత్రిలోనే మృతిచెందిన సంఘటనలు అనేకం. జూనియర్ డాక్టర్లతోనే నెట్టుకొస్తున్నారు. పేదలకు మెరుగైన వైద్యసేవలు అందకపోవడంతో వారు ప్రైవేట్ వైపు మొగ్గు చూపుతూ ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతున్నారు. మధ్యాహ్నమే ఇంటిముఖం.. రిమ్స్‌లో పనిచేసే వైద్యులు సమయపాలన పాటించడం లేదు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4గంటల వరకు విధులు నిర్వహించాలి. కానీ కొంతమంది వైద్యులు ఆలస్యంగా రావడమే కాకుండా మధ్యాహ్నమే ఇంటిబాట పడుతున్నారు. ఈ విషయం రిమ్స్ అధికారులకు, జిల్లా అధికారులకు తెలిసినా చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. మధ్యాహ్నం నుంచి ప్రైవేట్ క్లినిక్‌లు నిర్వహిస్తూ డబ్బులు దండుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. రిమ్స్‌లో సీసీ కెమెరాలు, బయోమెట్రిక్ ఉన్నప్పటికీ ఏమాత్రం ప్రయోజనం లేదు. కొంతమంది వైద్యులు విధులకు హాజరుకానప్పటికీ వేతనాలు పొందుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. జూనియర్లతోనే వైద్యం.. రిమ్స్ ఆస్పత్రి జూనియర్ వైద్యులతోనే కొనసాగుతుందంటే అతిశయోక్తి కాదు. ఎమర్జెన్సీతో పాటు అన్ని వార్డుల్లో ఉదయం నుంచి రాత్రి వరకు జూనియర్ డాక్టర్లే విధులు నిర్వహిస్తున్నారు. శిక్షణలో ఉన్న వీరు రోగులకు పూర్తిస్థాయిలో వైద్యసేవలు అందించలేకపోతున్నారనే విమర్శలు ఉన్నాయి. అత్యవసర పరిస్థితుల్లో ఉంటే రోగి పరిస్థితిని సీనియర్ వైద్యుడికి ఫోన్ ద్వారా విన్నవించి ఎలాంటి వైద్యం అందించాలి అనే వివరాలను తెలుసుకుంటున్నారు. రాత్రి వేళల్లో కనీసం ఒకరిద్దరు సీనియర్ వైద్యులు కూడా ఉండటం లేదు. రాత్రి డ్యూటీలో ఉండాల్సిన వైద్యులు ఇంటి వద్ద ఉండడంతో అత్యవసర సమయంలో వైద్యుడి ఇంటికి వాహనాన్ని పంపించి వారిని రిమ్స్‌కు తీసుకొస్తున్నారు. ఖాళీల జాతర.. గత కొన్నేళ్లుగా రిమ్స్ ఆస్పత్రితో పాటు వైద్య కళాశాలలో పోస్టుల ఖాళీలు వెక్కిరిస్తున్నాయి. దీంతో రోగులకు నాణ్యమైన వైద్యసేవలు అందకపోగా మెడికోలకు సైతం సరైన రీతిలో విద్యాబోధన జరగడం లేదనే ఆరోపణలున్నాయి. రిమ్స్‌కు మొత్తం 151 పోస్టులు మంజూరు ప్రస్తుతం 95 మంది వైద్యులు మాత్రమే పనిచేస్తున్నారు. 56 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రొఫెసర్ పోస్టులు 21కి ఏడుగురు పనిచేస్తుండగా, 14 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అసోసియేట్ ప్రొఫెసర్ 30 పోస్టులకు 15 మంది పనిచేస్తుండగా, మరో 15 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అసిస్టెంట్ ప్రొఫెసర్ 41 పోస్టులకు గాను 34 పనిచేస్తున్నారు. 7 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అదేవిధంగా ట్యూటర్ పోస్టులు 59కి 39 మంది విధులు నిర్వహిస్తున్నారు. మరో 20 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆస్పత్రి అంతా కంపు కంపు రిమ్స్ ఆస్పత్రి ఆవరణతో పాటు వార్డులన్నీ కంపు కొడుతున్నాయి. మరుగుదొడ్లు సరిగా లేవు. చెత్తాచెదారం శుభ్రం చేయకపోవడంతో దుర్గంధం వెదజల్లుతోంది. రిమ్స్ ఆస్పత్రికి వెళ్లిన వారు ముక్కున వేలుసుకొని, మూతికి గుడ్డ పెట్టుకొని వెళ్లాల్సిన పరిస్థితి. ఆస్పత్రిలో రోగులను చూడటానికి వచ్చిన వారి బంధువులు రోగాల భారీన పడాల్సి వస్తుందని చర్చించుకుంటున్నారు. పారిశుధ్యం కోసం నెలకు లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నా ఫలితం మాత్రం కానరావడం లేదు. ఈ విషయమై రిమ్స్ డైరెక్టర్ కరుణాకర్, రిమ్స్ సూపరింటెండెంట్‌ను ఫోన్ ద్వారా సంప్రదించగా వారు స్పందించ లేదు. సెప్టెంబర్ 14న జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్ధన్ రిమ్స్ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆ సమయంలో ఒకరిద్దరు వైద్యులు తప్పా ఎవరూ అందుబాటులో లేరు. వైద్యులు విధులను విస్మరించి ప్రైవేట్ క్లీనిక్‌లు నిర్వహిస్తున్నారని తమ దృష్టికి వచ్చినట్లు చెప్పారు. ఈ విషయం జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. రిమ్స్ ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశం ఎందుకు నిర్వహించడం లేదని సూపరింటెండెంట్‌ను ప్రశ్నించారు. జిల్లా కలెక్టర్ దివ్యదేవరాజన్ పలుసార్లు రిమ్స్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్యులతో సమావేశం నిర్వహించారు. రోగులకు నాణ్యమైన సేవలు అం దించాలని, సమయపాలన పాటించాలని సూచిం చారు. విధులు బాధ్యతాయుతంగా నిర్వర్తించాలని పలు మార్లు ఆదేశించినప్పటికీ రిమ్స్ వైద్యుల తీరులో మా త్రం మార్పు కానరావడం లేదు. జిల్లా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు తనిఖీలు చేపడుతున్నప్పటికీ కూడా వారిలో చలనం లేకుండా పో యిందని పలు వురు పేర్కొంటున్నారు. ఇదీ రిమ్స్ వైద్యుల తీరు.. -
పలాస ఆస్పత్రి.. రిమ్స్‌కు అనుసంధానం
సాక్షి, శ్రీకాకుళం: జిల్లాలోని పలాసలో ఏర్పాటు చేయనున్న 20 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, కిడ్నీ రీసెర్చ్ సెంటర్, డయాలసిస్ యూనిట్లను శ్రీకాకుళంలోని రిమ్స్ మెడికల్ కళాశాలకు అనుసంధానం చేస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలోకి తీసుకు వస్తున్నట్టు జీఓలో పేర్కొన్నారు. రూ. 50 కోట్ల ఖర్చుతో 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, కిడ్నీ రీసెర్చ్ సెంటర్, డయాలసిస్ యూనిట్లను పలాసలో ఏర్పాటు చేయనున్న విషయం పాఠకులకు తెలిసిందే. వైద్య విద్యార్థులు, రోగులకు ఉపయోగకరం ఇక్కడ పనిచేసేందుకు ఐదు రెగ్యులర్ పోస్టులు, 100 పోస్టులు కాంట్రాక్టు విధానంపైన, 60 పోస్టులు ఔట్ సోర్సింగ్ విధానంపైన భర్తీ చేసేందుకు మంజూరు చేస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వులో పేర్కొంది. రిమ్స్‌కు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి అనుసంధానం చేయడం వల్ల ఇక్కడి వైద్య విద్యార్థులకు, పలాస సూపర్ స్పెషాలిటీలోని రోగులకు ఎంతో ఉపయోగం కానుంది. వైద్య విద్యార్థులు రీసెర్చ్ సెంటర్లో కిడ్నీ వ్యాధులకు సంబంధించి పలు విషయాలు తెలుసుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది. అలాగే రిమ్స్‌లోని వైద్యులు, వైద్య విద్యార్థులు సూపర్ స్పెషాలిటీలోని రోగులకు వైద్య సేవలు అందించేందుకు కూడా వీలు కలుగుతుంది. జిల్లాలోని పలు కమ్యూనిటీ ఆస్పత్రులు వైద్య విధాన పరిషత్ ఆధీనంలో కొనసాగుతున్నాయి. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని కూడా వైద్య విధాన పరిషత్‌కే అప్పగిస్తారని పలువురు భావించారు. అయితే ప్రభుత్వం రిమ్స్‌కు అనుసంధానం చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వంలో వలె కాకుండా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి కావాల్సిన పోస్టులను కూడా మంజూరు చేయడం పట్ల అన్ని వర్గాల్లోనూ హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో నియమించనున్న ఉద్యోగులకు ఏటా రూ.8.93 కోట్లు జీతాల కోసం వెచ్చించనున్నారు. సీఎం జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు ప్రతిపక్ష నాయకుని హోదాలో జిల్లాలో వై.ఎస్.జగన్మోహన్రెడ్డి పర్యటించినపుడు ఉద్దానంలో కిడ్నీ వ్యాధుల బారిన పడిన వారి కష్టాలతో పాటు వారి కుటుంబాలు పడుతున్న అవస్థలను నేరుగా తెలుసుకున్నారు. తాను అధికారంలోకి వచ్చిన వెంటనే రీసెర్చ్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రిగా జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని పలాసకు మంజూరు చేస్తూ ఇటీవలే శంకుస్థాపన సైతం పూర్తి చేశారు. అదే విధంగా కిడ్నీ రోగులకు మనోధైర్యం కల్పించేలా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాల పట్ల ఉద్దానం ప్రాంత ప్రజలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. విధి విధానాలు తెలియాల్సి ఉంది రిమ్స్ ఆస్పత్రికి పలాస సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని అనుసంధానం విషయం తెలుసుకున్నాను. ఉత్తర్వులు ప్రభుత్వం నుంచి తమకు ఇంకా అందకపోయినా ఆదేశాలను చదివాను. అయితే ఈ విషయంలో అనుసరించాల్సిన విధివిధానాలు ఇంకా తెలియాల్సి ఉంది. రిమ్స్‌కు మరో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని అనుసంధానం చేయడం ఎంతో ఉపయోగకరం. – డాక్టర్ కృష్ణవేణి, రిమ్స్ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ -
బీహార్ మాజీ సీఎంకు అనారోగ్యం
రాంచీ : ఆర్జేడీ అధ్యక్షుడు, బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ (71) అనారోగ్యం బారినపడ్డారు. ఆయన కిడ్నీలు సరిగా పనిచేయడం లేదని రాజేందర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వైద్యులు తెలిపారు. దాణా కుంభకోణం కేసులో దోషిగా తేలిన లాలూ 2017 నుంచి జైలులో ఉన్నారు. పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన కొంతకాలంగా రాంచీలోని రిమ్స్ చికిత్స పొందుతున్నారు. లాలూ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ఆస్పత్రి సీనియర్ డాక్టర్ ఉమేశ్ ప్రసాద్ శనివారం వెల్లడించారు. షుగర్, బీపీ స్థాయుల్లో కూడా నిలకడ లోపించిందని తెలిపారు. -
రిమ్స్ సిబ్బంది నిర్లక్ష్యం.. రోగికి గడువు ముగిసిన సెలైన్
ఒంగోలు సెంట్రల్: స్థానిక రిమ్స్‌లో వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించి గడువు ముగిసిన సెలైన్‌ను రోగికి ఎక్కించారు. రోగి తరుపు వారు ఈ విషయాన్ని గుర్తించి వైద్య సిబ్బంది దృష్టికి తీసుకువెళ్లడంతో అప్పటికప్పుడు దానిని మార్చివేశారు. ఈతముక్కలకు చెందిన జి. శ్రీను అనే వ్యక్తి ఈ నెల 4వ తేదీన కడుపునొప్పితో బాధపడుతూ రిమ్స్‌లో వైద్య చికిత్స నిమిత్తం చేరాడు. పరీక్షించిన వైద్యులు రోగిని చికిత్స నిమిత్తం వైద్యశాలలో చేర్చారు. అయితే వైద్య సిబ్బంది గడువు ముగిసిన సెలైన్ ఇంజెక్షన్‌ను రోగికి ఎక్కిస్తున్నారు. బుధవారం రోగి తరఫు వారు ఈ విషయాన్ని గమనించి వైద్య సిబ్బంది దృష్టికి తీసుకువచ్చారు. ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎలా అని సిబ్బందిని నిలదీశారు. దీంతో వైద్య సిబ్బంది గడువు ముగిసిన సెలైన్‌ను తీసిశారు. పక్క వారికి కూడా ఇదే ఇంజెక్షన్లను ఇస్తుండటంతో ఈ విషయాన్ని కూడా వైద్య సిబ్బంది దృష్టికి తీసుకెళ్లారు. -
మనస్తాపంతో అగ్రికల్చర్ విద్యార్థి ఆత్మహత్య
పాతపట్నం: స్థానిక శివశంకర్ కాలనీ మెయిన్ రోడ్డులో అద్దెకు ఉంటున్న బీఎస్సీ అగ్రికల్చర్ ఫైనల్ ఇయర్ విద్యార్థి బిడ్డక వివేక్‌కుమార్ (23) మనస్తాపంతో పురుగుల మందు తాగాడు. శ్రీకాకుళం రిమ్స్‌లో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందినట్లు ఎస్ఐ ఇ.చిన్నంనాయుడు తెలిపారు. పోలీసులు తెలపిన వివరాలిలా ఉన్నాయి. ఒడిశాలోని సెంచురీయన్ యూనివర్సిటీ (పర్లాకిమిడి)లో వివేక్‌కుమార్ అగ్రికల్చర్ ఫైనల్ సంవత్సరం చదువుతున్నాడు. ఏడాదిగా పాతపట్నం శివశంకర్ కాలనీ మొదటి లైన్ రోడ్డులో అద్దెకు ఉంటున్నాడు. ఈ నెల 26వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం ఇంట్లో పురుగు మందు తాగి అపస్మారకస్థితిలో ఉన్న వివేక్ కుమార్‌ను స్థానికులు గుర్తించారు. చికిత్స కోసం ఆటోలో పాతపట్నం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. రిమ్స్‌లో చికిత్స పోందుతూ శనివారం ఉదయం మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. రిమ్స్‌లో పోస్ట్‌మార్టం నిర్వహించి కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. వివేక్‌కుమార్ స్వస్థలం విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం పుట్టజమ్ము గ్రామం. తమ గ్రామానికి చెందిన ఓ అమ్మాయిని ప్రేమించానని పెళ్లి చేయమని అడిగాడని తండ్రి సుకుమార్‌కు చెప్పారు. ఆ అమ్మాయి ప్రేమను నిరాకరించడంతో మనస్తాపం చెంది ఉండవచ్చని కుటుంబ సభ్యులు అంటున్నారు. వివేక్‌కుమార్ తండ్రి సుకుమార్ కడపలో ఆంధ్ర జాగృతి బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్‌గా ఉద్యోగం చేస్తున్నారు. -
చివరి మజిలీలో భరోసా
ఆదిలాబాద్‌టౌన్ : దీర్ఘకాలిక వ్యాధులు నయం కాక నరకయాతన పడుతున్న వ్యాధిగ్రస్తులకు భరోసా ఇచ్చేందుకు రిమ్స్‌లో ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేశారు. చివరి మజిలీలో ప్రశాంత జీవనం గడపడానికి కౌన్సెలింగ్‌తోపాటు వైద్యం చేస్తున్నారు. ఫ్యాలియేటివ్ కేర్ సెంటర్ ద్వారా నయం కాని వ్యాధితో బాధపడుతున్న వారికి మనోధైర్యాన్నిస్తూ భరోసా కల్పిస్తున్నారు. ముఖ్యంగా కాలేయం, కిడ్నీ, క్యాన్సర్, పక్షవాతం రోగులకు ఈ కేంద్రం ద్వారా చికిత్స అందిస్తున్నారు. వ్యాధి నయం కాదని తెలిసినా చివరి దశలో వారికి చికిత్సలు చేస్తూ ధైర్యం నింపుతున్నారు. అంతే కాకుండా ఆస్పత్రికి రాకుండా ఇంటి వద్ద మంచానికే పరిమితమైన రోగుల ఇళ్లకు చికిత్సలు అందిస్తున్నారు. దీర్ఘకాలిక వ్యాధులైన క్యాన్సర్, పుండ్లతో మంచం పట్టిన వారికి, పక్షవాతం వల్ల నడవలేని వారికి, కాలేయం, కిడ్నీ పాడైపోయిన వారికి కేంద్రంలో ముఖ్యంగా వైద్యసేవలు అందజేస్తూ మేమున్నామని భరోసానిస్తున్నారు వైద్యులు. రిమ్స్‌లో కేంద్రం.. దీర్ఘకాలిక వ్యాధితో మంచానికే పరిమితమై తీవ్ర ఇబ్బందులు పడుతున్న వారికి చేయూతనిచ్చేందుకు ప్యాలియేటీవ్ సేవ కేంద్రం రిమ్స్‌లో ఏర్పాటు చేశారు. ఇక్కడ 8 పడకలు అందుబాటులో ఉంచారు. 50శాతం క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు చికిత్స అందిస్తుండగా, మిగతా కాలేయం, కిడ్నీ, క్యాన్సర్, పక్షవాతం వ్యాధిగ్రస్తులకు చికిత్స నిర్వహిస్తున్నారు. బతకడం కష్టమని తెలిసినా ఇంటివద్ద రోగంతో ఇబ్బందులు పడుతున్న వారికి ఇక్కడ చికిత్స అందించి కొంతమేర అయిన నొప్పుల నుంచి ఉపశమనం కల్పిస్తున్నారు. వారికి ప్రత్యేక భోజనంతోపాటు ఫిజియోథెరపీ, ఇతర చికిత్సలు చేస్తున్నారు. జాతీయ ఆరోగ్యమిషన్ ద్వారా పీఆర్పీసీ సొసైటీ ద్వారా ఈ కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. 2018 అక్టోబర్ 8వ తేదీన ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. రోగాల బారిన పడి కుటుంబ సభ్యుల నుంచి చేయూతలేని వారికి ముఖ్యంగా ఇక్కడ సేవలు అందిస్తున్నారు. ఇంటి వద్దే వైద్యం.. ఆస్పత్రికి రాలేని పరిస్థితిలో తీవ్ర ఇబ్బందులు పడుతున్న దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ఇంటి వద్దే వైద్యం అందిస్తున్నారు. జిల్లా కేంద్రం నుంచి 30 కిలోమీటర్ల పరిధిలో ఉన్న రోగులకు ఈ సేవలు అందజేస్తున్నారు. ప్రత్యేక వాహనం ద్వారా ఇంటికెళ్లి చికిత్స చేస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో 392 మందికి హోమ్‌కేర్ ద్వారా వైద్యం అందిస్తున్నట్లు ప్యాలియేటీవ్ కేంద్రం వైద్యులు తెలిపారు. ప్రతీరోజు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు వారి ఇంటికెళ్లి క్యాన్సర్, పక్షవాతం, కాలేయం వ్యాధిగ్రస్తులకు పరీక్షలు చేస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 120 మంది క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు, 600 మంది ఇతర దీర్ఘకాలిక రోగులకు చికిత్సలు చేసినట్లు వారు చెబుతున్నారు. సేవలు ఇలా.. రిమ్స్‌లోని మొదటి అంతస్తులో ఈ కేంద్రం ఉంది. ఇక్కడ చేరిన రోగులకు వైద్యం అందించడంతోపాటు భోజనం వసతి కల్పిస్తున్నారు. అలాగే రోగి బంధువుకు కూడా భోజనం అందిస్తున్నారు. ప్రతినెలా 4వ బుధవారం హైదరాబాద్ నుంచి సర్జికల్ ఆంకాలజిస్ట్ (క్యాన్సర్ వైద్య నిపుణులు) వీరికి పరీక్షలు నిర్వహిస్తారు. అవసరమైన వారికి ఆపరేషన్లు కూడా చేస్తున్నారు. అయితే రోగులకు వైద్యం అందించేందుకు ఒక వైద్యురాలు, ఒక ఫిజియోథెరపిస్ట్, నలుగురు స్టాఫ్ నర్సులు, ఇద్దరు ఏఎన్ఎంలు, హోంకేర్ వెళ్లేందుకు వాహనం కోసం ఒక డ్రైవర్, నలుగురు కేర్‌గీవర్స్ పనిచేస్తున్నారు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు సేవలు పాలియేటీవ్ సేవ కేంద్రం ద్వారా దీర్ఘకాలిక వ్యాధి నయం కాని వారికి వైద్యసేవలు అందిస్తాం. మంచానికే పరిమితమైన వారికి నొప్పులు తగ్గించడానికి వైద్యసేవలు అందిస్తున్నాం. ఆస్పతికి రాలేని పరిస్థితిలో ఉన్న వారికి 30 కిలోమీటర్ల పరిధిలోని వారి ఇంటికి వెళ్లి వైద్యం చేస్తున్నాం. ప్రశాంత జీవనం గడపడం కోసం రోగులకు కౌన్సెలింగ్ ఇస్తున్నాం. ఎవరైన దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడితే సేవ కేంద్రంలో చేరేందుకు సెల్ నం.9492903315లో సంప్రదించవచ్చు. – వెంకటలక్ష్మి, పాలియేటీవ్ సేవ కేంద్రం వైద్యురాలు -
ప్రకాశం జిల్లా రిమ్స్ అస్పత్రిపై కిమ్స్ మాస్టర్ ప్లాన్
-
రిమ్స్‌లో అప్పుడే పుట్టిన శిశువు మృతి
ప్రకాశం, ఒంగోలు సెంట్రల్: వైద్యురాలి నిర్లక్ష్యంతో అప్పుడే పురుడు పోసుకున్న శిశువు (మగబిడ్డ) ప్రాణాలు గాలిలో కలిశాయి. ఆమె నిర్లక్ష్యానికి ఆ తల్లికి గర్భశోకం మిగిలింది. ఈ సంఘటన రిమ్స్‌లో గురువారం జరిగింది. శిశువు మృతి చెందడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. బాధితుల కథనం ప్రకారం.. చినగంజాం మండలం కడవకుదురుకు చెందిన కె. మధులత మొదటి కాన్పుకు ఈ నెల 25న రిమ్స్‌లో చేరింది. 26న కాన్పు చేస్తామని చెప్పిన వైద్యులు పట్టించుకోలేదు. 29న బంధువులు ప్రశ్నించడంతో రాత్రి పదిన్నర గంటల సమయంలో కాన్పు చేసేందుకు చర్యలు ప్రారంభించారు. కాన్పు కష్టం కావడంతో చాలాసేపు సాధారణ కాన్పు అవుతుందని వేచి ఉన్నారు. బిడ్డ కొద్దిగా బయటకొచ్చి అగిపోయింది. కడుపులో ఉన్న శిశువు ఒత్తిడికి గురై శ్వాస పీల్చుకోవడం కష్టమైంది. ఆ తర్వాత స్పృహ కోల్పోయాడు. ఆ తర్వాత చిన్న శస్త్రచికిత్స చేసి బిడ్డను బయటకు తీశారు. బిడ్డ అప్పటికే పూర్తిగా అనారోగ్యానికి గురవడంతో రిమ్స్‌లో ఉన్న చిన్న పిల్లల చికిత్స కేంద్రానికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ శిశువు మరణించింది. కాన్పు చేసిన విధానంపై ఆగ్రహం మందులు కావాలంటూ మధులత బంధువులను వైద్యులు అర్ధరాత్రి బయటకు పంపించారు. అప్పటికప్పుడు వారు రెండు వేల రూపాయల మందులు బయట నుంచి తీసుకొచ్చి వైద్య సిబ్బందికి అందించారు. అయినా బిడ్డ ప్రాణాలు దక్కలేదని బాధితులు కన్నీటిపర్యంతమయ్యారు. పైగా తల్లికి ఇష్టం వచ్చినట్లు దాదాపు 10 కుట్లకుపైగా వేశారని, రిమ్స్ వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపిస్తున్నారు. కాన్పు కోసం ఇష్టం వచ్చినట్లు తల్లి ముఖంపై కొట్టారని, పెదవి చిట్లిపోయి రక్తం కారిందని ఆరోపించారు. పొట్ట మీద ఇష్టం వచ్చినట్లు నొక్కడంతో వాతలు తేలాయని, ఇంత నిర్దయగా వ్యవహరిస్తారని అనుకుంటే తాము చీరాలలోనే కాన్పు చేయించుకునే వారమని విలపించారు. బాధితులు రిమ్స్ క్యాజువాలిటీ వద్ద డైరెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. కాన్పు కోసం వచ్చిన తమ బిడ్డను పట్టించుకోకుండా డాక్టర్ సమయం వృథా చేయడంతో ఇదంతా జరిగిందని పేర్కొన్నారు. కాన్పు కష్టం అవుతుందనుకుంటే సీజేరియన్ చేసి బిడ్డను బయటకు తీయవచ్చు కదాని మధులత బంధువులు ప్రశ్నిస్తున్నారు. మధ్యాహ్నం కొంత మంది నాయకులు రంగ ప్రవేశం చేయడంతో బాధితులు, నాయకులు రిమ్స్ డైరెక్టర్ చాంబర్ ఎదుట ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని నిరసన వ్యక్తం చేశారు. ఆర్ఎంఓ గది వద్ద బాధితులతో డైరెక్టర్ మాట్లాడారు. సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఆందోళనకారులకు ఆయన హామీ ఇచ్చారు. మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రవీంద్రనా«థ్‌రెడ్డి, గైనిక్ హెచ్ఓడీ డాక్టర్ బి.వెంకటేశ్వర్లు ఉన్నారు. వైద్యుల పొరపాటు లేదు: మధులత విషయంలో వైద్యుల పొరపాటు లేదు. కాన్పు కష్టం అయింది. ఇందుకు తల్లి ఎత్తు, బరువు లేదు. బిడ్డ ఉమ్మ నీరు తాగింది. ఊపిరి తిత్తుల్లోకి కూడా నీరు చేరింది. శిశువు మృతి చెందాడు. అయినా జరిగిన సంఘటనపై విచారణ చేస్తున్నాం. ఎస్కే మస్తాన్ సాహెబ్, డైరెక్టర్, రిమ్స్ -
ఆదిలాబాద్ రిమ్స్‌కు ఎమ్సీఐ అనుమతి నిరాకరణ
-
రిమ్స్‌లో నర్సుల ఆందోళన
ఆదిలాబాద్ : నర్సుల బదిలీలను 20 శాతానికి కుదించడాన్ని నిరసిస్తూ రిమ్స్ ఆస్పత్రి నర్సులు సోమవారం ఆందోళన చేపట్టారు. ఆస్పత్రిలోని వాటర్ ట్యాంక్ ఎక్కేందుకు యత్నించగా పోలీసులు వారిని మధ్యలోనే అడ్డుకున్నారు. మరికొందరు రిమ్స్‌భవనం ఎక్కి నిరసన తెలిపారు. ఆందోళన సమాచారం అందుకున్న ఆదిలాబాద్ డీఎస్పీ నర్సింహారెడ్డి, రిమ్స్ డైరెక్టర్ సంఘటన స్థలానికి చేరుకొని వారికి నచ్చజెప్పారు. ప్రభుత్వం రిమ్స్ సిబ్బందిపై వివక్ష చూపుతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఎనిమిదేళ్ల నుంచి రిమ్స్‌లోనే పనిచేస్తున్నామని, కుటుంబాలకు దూరంగా గడుపుతున్నామన్నారు. ప్రభుత్వం ముందుగా ప్రకటించినట్లు 40 శాతం బదిలీలు చేపట్టాలని డిమాండ్ చేశారు. బదిలీల కోసం ఎదురుచూస్తున్న తమకు ప్రభుత్వం నిర్ణయం తీవ్ర మనోవేదనకు గురిచేస్తోందన్నారు. కార్యక్రమంలో నర్సింగ్ సిబ్బంది పద్మ, వినోద, కరుణ, వేరోనిక, సరిత, తదితరులు పాల్గొన్నారు. -
మానవత్వమా నీవెక్కడ?
ఒంగోలు టౌన్: ఊరుగాని ఊరు. నా అని పలకరించేవారు లేరు. ఒక్కసారిగా ఆమె భర్త ఆరోగ్యం క్షీణించింది. రిమ్స్‌లో చేర్పిస్తే.. ఇరవై రోజులు చికిత్స చేసి చేతులెత్తేసి తీసుకువెళ్లాలంటూ చెప్పారు. ఎటు వెళ్లాలో తెలియక నాలుగు రోజుల నుంచి కలెక్టరేట్లోని ఫుట్‌పాత్‌పైనే భర్తను పడుకోబెట్టి రెండేళ్ల బిడ్డను ఎత్తుకొని భిక్షాటనకు వెళుతోందా తల్లి. మొదటిరోజు కొంచెం కళ్లు తెరిచి చూసినా మూడు రోజుల నుంచి పూర్తిగా కోమాలోనే ఉన్నాడు. నిత్యం జన సంచారంతో రద్దీగా ఉండే కలెక్టరేట్ వద్ద ఇలా మూడు రోజులుగా ఓ వ్యక్తి అచేతనంగా పడిఉన్నా ఎవరూ పట్టించుకోలేదు. శుక్రవారం పరిస్థితి మరింత విషమించింది. భర్త చనిపోయాడనుకుని దహన సంస్కారాలకు డబ్బులు లేకపోవడంతో భిక్షాటన కోసం అతని భార్య వెళ్లింది. తోడుగా ఉంటున్న మామ తాగునీటి కోసం వెళ్లాడు. ఆ సమయంలో రెండేళ్ల చిన్నారి తన తండ్రి తల, చేతులను పట్టుకొని అటూ ఇటూ కదిలిస్తున్నాడు. సమీపంలో ఉన్న మీడియా ప్రతినిధులు ఈ విషయాన్ని గమనించి 1098కు సమాచారం ఇచ్చారు. హెల్ప్ ప్రోగ్రాం ఆఫీసర్ బీవీ సాగర్, చైల్డ్‌లైన్ ప్రతినిధి డి.దేవకుమారి హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. కోమాలో ఉన్న వ్యక్తిని లేపేందుకు ప్రయత్నిస్తే ఎలాంటి చలనం లేదు. రెండేళ్ల చిన్నారిని ఎత్తుకొని కొద్దిసేపు ఇటూ ఇటూ చూశారు. చివరకు ఆ బిడ్డ తల్లి వచ్చింది. తన దీనగాథను వారి వద్ద వెళ్లబోసుకుంది. తన పేరు నీలం అనూష అని, తన భర్త పేరు దుర్గాప్రసాద్ అని చెప్పింది. రాజమండ్రిలోని మండపేటలో ఉంటున్న తాము ఐదారేళ్ల క్రితం కాగితాలు ఏరుకుంటూ ఒంగోలు వచ్చామని తెలిపింది. ‘ఇక్కడ నా అనేవారు లేకపోయినా నా భర్త, రెండేళ్ల కుమారుడు, మామతో కలిసి ఫుట్‌పాత్‌పైనే ఉంటున్నాం. భర్త మద్యం దుకాణంలో పనిచేశాడు. నేను కాగితాలు ఏరుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నా. నా భర్త లివర్, గుండె చెడిపోవడంతో ఇరవై రోజుల క్రితం రిమ్స్ హాస్పిటల్లో చేర్పించాను. నాలుగు రోజుల క్రితం ఇక బతకడు తీసుకువెళ్లమంటే, కలెక్టరేట్ ఫుట్‌పాత్‌పైనే పడుకోబెట్టా...మూడు రోజుల నుంచి నా భర్తను పిలిచినా పలకడం లేదు.. కదలడం లేదు..’ అంటూ కన్నీళ్ల పర్యంతమైంది. దహన సంస్కారాలకు డబ్బులు లేకపోవడంతో భిక్షాటన కోసం వెళ్లానని అనూష తెలిపింది. స్పందించిన సాగర్ తన వద్ద ఉన్న రూ.500 ఇచ్చి..రెండేళ్ల చిన్నారిని బాలల సంక్షేమ కమిటీ ముందు హాజరుపరచిన అనంతరం శిశుగృహలో చేర్పించాడు. సాయంత్రం ఆరుగంటల సమయంలో కూడా దుర్గాప్రసాద్ కోమాలోనే ఉన్నాడు. -
రిమ్స్‌లో షార్ట్ సర్క్యూట్
ఒంగోలు సెంట్రల్: రిమ్స్ శస్త్రచికిత్సల గదిలో సోమవారం ఉదయం షార్ట్ సర్క్యూట్ అయింది. దీంతో మూడు ఏసీలు తగలబడి, శస్త్రచికిత్సలు నిలిచిపోయాయి. దట్టమైన పొగ అలుముకోవడంతో రోగులు భయంతో బయటకు పరుగులు తీశారు. దీంతో తాత్కాలికంగా ప్రధాన శస్త్రచికిత్స గదిని మూసేశారు. ఆర్దోపెడిక్ శస్త్రచికిత్స గదిలో కూడా పూర్తిగా పొగ అలుముకోవడంతో శస్త్రచికిత్సలను నిలిపేశారు. సిబ్బంది మంటలను ఆర్పివేశారు. సమాచారం అందుకున్న రిమ్స్ డైరక్టర్, ఇతర అధికారులు శస్త్రచికిత్సల గదుల వద్దకు చేరుకుని పరిశీలించారు. నాసిరకం వైరింగ్ గానీ, ఏసీలు గానీ వాడటం వలన అగ్నిప్రమాదం సంభవించి ఉండవచ్చని భావిస్తున్నారు. -
రిమ్స్‌లో అన్నీ అగచాట్లే
సాక్షి, కడప : కడపలో ఉన్న రిమ్స్‌లో అనేక సమస్యలు రాజ్యమేలుతున్నాయి. రిమ్స్‌కు వెళ్లిన రోగులకు సంబంధించి ఓపీ దగ్గరి నుంచి వైద్య సేవలు పొంది ఇంటికి వచ్చేంతవరకు అన్నీ అగచాట్లే. ఒకప్పుడు కడప నుంచి రిమ్స్ వరకు ఉచిత బస్సులు ఉండేవి. అవీ లేవు. ఎన్నో ప్రయాసలు కోర్చి ఆస్పత్రికి వెళ్లినా, అక్కడ కూలైన్లలో ఓపీ తీసుకోవడంలోనే సగం ప్రాణం పోతుంది. తర్వాత మళ్లీ డాక్టర్ వద్ద వైద్య పరీక్షలనంతరం నేరుగా రక్త, ఇతర పరీక్షలకు వెళితే అక్కడ క్యూలైన్లు.. మళ్లీ వాటి రిపోర్టుల కోసం మధ్యాహ్నం వరకు వేచి ఉండాల్సిన పరిస్థితి. ఇలా ఒకటేమిటి అనేక రకాల సమస్యలు వేధిస్తున్నాయి. పైగా ఐపీలో లిఫ్ట్‌లు కూడా పనిచేయకపోవడంతో రోగులను తిప్పలు తప్పడం లేదు. చివరికి రోగులను తరలించే వీల్ ఛైర్లు కూడా ఒక్కోసారి అందుబాటులో లేకపోవడంతో రోగులను బంధువులే ఎత్తుకుని వెళుతున్న దృశ్యాలు ‘సాక్షి’ కంటపడ్డాయి. పేరుకే సూపర్ స్పెషాలిటీ రిమ్స్ పేరుకే సూపర్. కానీ స్పెషాలిటీలో లేదు. సూపర్ స్పెషాలిటీకి సంబంధించి విభాగాలే ఇంతవరకు ఏర్పాటు కాలేదు. సూపర్ స్పెషాలిటీ వైద్యులు కూడా అందుబాటులో లేరు. అనేక రకాల పరికరాలు కూడా రిమ్స్‌కు రావాల్సి ఉంది. సామగ్రి లేకపోవడంతోనే ఇక్కడి నుంచి ప్రమాదకర పరిస్థితుల్లో రోగిని ఇతర ప్రాంతాలకు రెఫర్ చేయాల్సి వస్తోందని వైద్యులు పేర్కొంటున్నారు. ప్రతిరోజు 1,800 నుంచి 2,000 మంది వివిధ ప్రాంతాల నుంచి రోగులు వస్తున్నారు. ఆర్థోపెడిక్‌కు సంబంధించి సోమవారం దాదాపు 215 మంది రిమ్స్‌కు రాగా, జనరల్ మెడిసిన్‌కు సంబంధించి 202 మంది, గైనకాలజీకి సంబంధించి 140, చర్మవ్యాధులకు సంబంధించి 115, కంటి వ్యాధిగ్రస్తులు 110 మంది వచ్చారు. ఆపరేషన్లకు సంబంధించి గైనకాలజీ, ఆర్థోపెడిక్, జనరల్ సర్జరీ, ఈఎన్టీ, ఆప్తాలమిక్ తదితర వాటికి ఆపరేషన్లు అనుకున్న సమయానికే జరిగిపోతున్నాయి. ప్రతిరోజు ఆస్పత్రులకు 13వేల మంది రోగులు జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, 24 గంటల ఆస్పత్రులు, రిమ్స్, జిల్లా ఆస్పత్రి, ఏరియా ఆస్పత్రులకు దాదాపు ప్రతిరోజు 12 వేల నుంచి 13 వేల మంది రోగులు వస్తున్నారు. వివిధ రకాల జబ్బులతో అల్లాడుతున్న బాధితులతోపాటు ప్రతినిత్యం జలుబు, జ్వరం, కీళ్ల నొప్పులు, కాళ్ల నొప్పులతోపాటు ఇతర సమస్యలతో రోజూ భారీగా ఆస్పత్రులకు వెళుతున్నారు. అయితే వచ్చిన రోగులందరినీ పరీక్షిస్తున్నా నాణ్యమైన వైద్య సేవలు అందడం గగనంగా మారింది. మంచినీటికి నోచుకోని జిల్లా ఆస్పత్రి ప్రొద్దుటూరులోని జిల్లా ఆస్పత్రి మండు వేసవిలో గుక్కెడు నీటి కోసం అల్లాడిపోతోంది. మంచినీటి కోసం బయటికి రోగులు పరుగులు పెడుతున్నారు. ఎందుకంటే ఆస్పత్రిలో మంచినీటి ట్యాంకు మరమ్మత్తులకు గురి కావడంతో ప్రస్తుతం ఇబ్బందులు పడుతున్నారు. పైగా డాక్టర్లు కూడా సమయపాలన పాటించడం లేదు. సివిల్ సర్జన్ల కొరత కూడా ఆస్పత్రిని వెంటాడుతోంది. కొన్ని మందులు బయటికి రాసిస్తున్నారు. పులివెందుల ఏరియా ఆస్పత్రిలో కూడా రోగులకు మధ్యాహ్న భోజనం అందడం లేదు. కాంట్రాక్టర్ ముందుకు రాకపోవడంతో పరిస్థితి అధ్వానంగా మారింది. ఈసీజీ మిషన్ కూడా చెడిపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. ఐవీ సెట్లు కనబడవు....ఐరన్ మాత్రలూ లేవు జిల్లాలోని రాజంపేట సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని కోట్లాది రూపాయలతో నిర్మించినా ఇప్పటికీ ప్రారంభం కాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా డాక్టర్ వద్దకు వెళ్లాలన్నా, ఓపీ తీసుకోవాలన్నా ఎండలోనే రోగులకు తిప్పలు తప్పడం లేదు. బడ్జెట్ కొరత కారణంగా మందులు కూడా అంతంతమాత్రంగానే వచ్చినట్లు పలువురు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఆస్పత్రుల్లో ఐవీసెట్లు లేవు. ఐరన్ మాత్రలు కూడా అందుబాటులో లేవు. దీంతో రోగులకు తిప్పలు తప్పడం లేదు. తాగునీరు కూడా అందుబాటులో లేకపోవడంతో సమస్య జఠిలంగా మారింది. మొత్తానికి ఆస్పత్రి అస్తవ్యస్తంగా మారిందని, బాగు చేయాలని రోగులు కోరుతున్నారు. బద్వేలులో కూడా వైద్యుల కొరత వెంటాడుతోంది. ప్రభుత్వ ఆస్పత్రిని ప్రస్తుతం సీమాంక్ కేంద్రంలోనే నడుపుతున్నారు. రైల్వేకోడూరు 30పడకల ఆస్పత్రిలో చిన్నపిల్లల వార్డు కోసం లక్షలు వెచ్చించి నిర్మించినా వైద్యుడు లేకపోవవడంతో ప్రారంభించలేదు. ఎక్స్‌రే ప్లాంటు ఉన్నా మూలనపడింది. జమ్మలమడుగు ఆస్పత్రి నుంచి చిన్నచిన్న సమస్యలకు సైతం రోగులను రెఫర్ చేస్తున్నారు. గైనకాలజీ, అనస్తిషియా వైద్యులు లేకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. రేడియాలజిస్టు లేరు. మంత్రి నియోజకవర్గంలోని ఆస్పత్రిలో సమస్యలను పట్టించుకునేవారే లేరు. రాయచోటి ఆస్పత్రిలో కూడా వసతులు అరకొరగానే ఉన్నాయి. పేరుకు 50 పడకల ఆస్పత్రి అయినా వంద పడకల ఆస్పత్రిలాగా రోగులతో కిటకిటలాడుతూ ఉంటుంది. పారిశుధ్యం అధ్వానంగా ఉంది. సమీప ప్రాంతంలో కుక్క చనిపోయి రెండు రోజులు కావడంతో దుర్వాసన వస్తున్నా పట్టించుకునే నాథుడే లేడు. కమలాపురంలో 30 పడకల ఆస్పత్రి ఉన్నా చిన్నపిల్లలు, అనస్తీషియా, గైనకాలజీ వైద్యులు లేకపోవడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఎక్స్‌రే కూడా లేదు. రోగులు అధికంగా ఉన్నా అనువైన వసతులు లేవని లబోదిబోమంటున్నారు. పూర్తిస్థాయిలో వైద్యులను నియమిస్తే మారుమూల ప్రాంతాల నుంచి వచ్చే రోగులకు సౌకర్యవంతంగా ఉంటుంది. మైదుకూరులో ఆస్పత్రి ఆధునీకరిస్తుండడంతో పక్కన గదుల్లో వైద్యం అందిస్తున్నారు. ఆస్పత్రి నిర్మాణం పూర్తికాకపోవడంతో ప్రస్తుతం కాన్పులకు ఇబ్బందిగా మారింది. ఆరుగురు వైద్యులు ఉండాల్సి ఉండగా, కేవలం ఇద్దరే ఉన్నారు. ఇక 24 గంటల ఆస్పత్రిగా పేరొందిన వనిపెంట ఆస్పత్రిలో అయితే ఒకే ఒక వైద్యుడు ఉంటారు. రోగులు అధిక సంఖ్యలో వస్తుండడంతో రోగులను పరీక్షించం కష్టంగా మారుతోంది. స్కానింగ్‌కు బయటకు.. ప్రత్యేకంగా ఎప్పటినుంచో రిమ్స్‌కు ఎంఆర్ఐ స్కానింగ్ వస్తుందంటున్నా ఇప్పటికీ కనిపించడం లేదు. పైగా ఎంసీఐ నిబంధనల ప్రకారం ఒక సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో ఖచ్చితంగా ఎంఆర్ఐ స్కానింగ్ సెంటర్ ఉండాల్సి ఉన్నా ఇప్పటికీ అతీగతి లేదు. సిటీ స్కానింగ్ ఉన్నా పనిచేయడం లేదు. ఆర్ఎంఓ నుంచి ఇప్పటివరకు కొన్నివేల స్కానింగ్‌లు నిర్వహించారు. అది మరమ్మతులకు గురికావడంతో నెల కిందటి నుంచి సిటీ స్కాన్ పనిచేయడం లేదు. దీంతో రోగులను ఆరోగ్యశ్రీ ద్వారా బయటికి పంపి స్కానింగ్‌లు చేస్తున్నారు. సీటీస్కాన్ పనిచేయడం లేదంటూ బోర్డు ఏర్పాటు -
కార్పొరేట్ వైద్యం
ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రి లో అత్యాధునిక సేవలు త్వరలో అందుబాటులోకి వస్తున్నాయి. కార్పొరేట్‌స్థాయిలో వైద్యం అందించేందుకు నూతన పరికరాలు మంజూరయ్యాయి. రిమ్స్ ప్రారంభం నుంచి సెంట్రల్ ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటులో జాప్యం జరుగుతూ వచ్చింది. త్వరలో ఇది కూడా అందు బాటులోకి రానుంది. ఆస్పత్రిలో సదుపాయలు, వైద్యసేవల మెరుగు కోసం కలెక్టర్ దివ్య దేవరాజన్ ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమం లో త్వరలో ఆస్పత్రికి కార్పొరేట్ ఆస్పత్రుల్లో సైతం అందుబాటులో లేని అత్యాధునిక పరికరాలు రానున్నాయి. ఇటీవలే రిమ్స్‌లో డయాలసీస్ సేవలు ప్రారంభమయ్యాయి. అయితే మొదట్లో ఉద్యోగుల హెల్త్‌కార్డులకు ఈ సేవలు వర్తించలేదు. వారం క్రితం ఉద్యోగులకు సైతం ఈ సేవలు వర్తింపజేస్తూ ఉత్తర్వులు వెలువడినట్లు రిమ్స్ డైరెక్టర్ తెలిపారు. ఇప్పటి వరకు డయాలసీస్ కేంద్రంలో 500 మందికి రక్తశుద్ధి చేశారు. అలాగే రూ.కోటి వ్యయంతో ఆస్పత్రిలో లిక్విడ్ కల్చర్ ల్యాబ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. దీని ద్వారా టీబీకి సంబంధించిన స్పుటం పరీక్షలు చేస్తారు. ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లోని ఆస్పత్రుల నుంచి నమూనాలు రిమ్స్‌కు తీసుకురానున్నారు. ఇలా పలురకాల అత్యాధునిక సేవలు రిమ్స్‌లో ప్రారంభం కానున్నాయి. శరవేగంగా సెంట్రల్ ఆక్సిజన్‌ప్లాంట్.. ఆస్పత్రిలో సెంట్రల్ ఆక్సిజన్ ప్లాంట్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఆవరణలో ఇప్పటికే ప్లాంట్ మిషన్ ఏర్పాటు చేశారు. మెడికల్ ఐసీయూ, పిడియాట్రిక్, ఆపరేషన్ థియేటర్, ఐసీసీయూ, ఎమర్జెన్సీవార్డుల నుంచి పైపులైన్ ద్వారా ఆక్సిజన్ సరఫరా చేస్తారు. పైపులైన్ పనులు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం జంబోసిలిండర్ ద్వారా రోగులకు ఆక్సిజన్ అందిస్తున్నారు. సెంట్రల్ ఆక్సిజన్ ప్లాంట్ అందుబాటులోకి వస్తే వార్డులో రోగులకు పైపులైన్ ద్వారా ఆక్సిజన్ అందించవచ్చు. కలెక్టర్ ఫండ్స్ నుంచి రిమ్స్‌కు నిధులు.. రిమ్స్ ఆస్పత్రి అభివృద్ధితో పాటు రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడంపై జిల్లా కలెక్టర్ దృష్టి సారించారు. ఇప్పటికే ప్రతీవారం ఆస్పత్రి అధికారులతో సమావేశాలు నిర్వహిస్తున్న కలెక్టర్ రిమ్స్‌లో అవసరమైన సదుపా యాల కోసం కలెక్టర్ ఫండ్స్ నుంచి నిధులు వెచ్చిస్తున్నారు. ఇందులో భాగంగానే రూ.7.5 లక్షలతో అంబులెన్స్ మంజూరు చేశారు. దీంతో పాటు రూ.15లక్షలతో ఈఎంటీ పరికరాలు కొనుగోలుకు టెండర్ ప్రక్రియ ప్రారంభించారు. జేసీ ఆధ్వర్యంలో ఈ టెండర్లు జరుగనున్నాయి. వీటితో పాటు రిమ్స్‌లో మరిన్ని సేవలు త్వరలో అందుబాటులోకి రా>నున్నాయి. ఇటీవల చిన్నపిల్లలకు శస్త్రచికిత్స సేవలు సైతం అందుబాటులోకి తీసుకొచ్చారు. అలాగే రూ. 1.60 కోట్లతో అప్తాలమిక్ విభాగంలో రేజర్స్, మైక్రోస్కోప్, టోనోమిటర్స్, తదితర పరికరాల కోసం ఈ నిధులు మంజూరయ్యాయి. రోగులకు మెరుగైన వైద్యసేవలు.. రిమ్స్‌కు వచ్చే రోగులకు ఇప్పటికే మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నాం. త్వరలో మరిన్ని అత్యాధునిక పరికరాలు అందుబాటులోకి రానున్నాయి. ఫుల్లీ ఆటోమెటిక్ మిషన్, సెంట్రల్ ఆక్సిజన్ ప్లాంట్, లిక్విడ్ కల్చర్ ల్యాబ్, ఈఎంటీ, అప్తాలమిక్ విభాగాల్లో నూతన పరికరాలు మంజూరయ్యాయి. సెంట్రల్ ఆక్సిజన్‌ప్లాంట్ పనులు 80 శాతం పూర్తయ్యాయి. కలెక్టర్ నిధుల నుంచి సైతం అంబులెన్స్ మంజూరైంది. రోగులకు పూర్తిస్థాయిలో వైద్య పరీక్షలు, సేవలు ఇక్కడే అందుతాయి. అలాగే వైద్య విద్యార్థుల కోసం రూ. 6లక్షలతో డిజిటల్ లైబ్రెరీ ప్రారంభించనున్నాం. ఇందుకు సంబంధించి 12 కంప్యూటర్లు కొనుగోలు చేశాం. – కె.అశోక్, రిమ్స్ డైరెక్టర్ గంటకు 400 పరీక్షలు.. రిమ్స్ బయోకెమిస్ట్రీ విభాగానికి రూ.40 లక్షల విలువ చేసే ఫుల్లీ ఆటోమెటిక్ మిషన్ ఇప్పటికే చేరుకుంది. త్వరలో ఈ యంత్రాన్ని ప్రారంభించనున్నారు. ఈ పరికరానికి గంటకు 400 పరీక్షలు చేసే సామర్థ్యం ఉంది. 50 రకాల రక్త పరీక్షలను దీని ద్వారా చేస్తారు. ప్రస్తుతం ఆయా రక్త పరీక్షల రిపోర్టు రావాలంటే రోజంతా సమయం పడుతుంది. రోగులు పరీక్షల రిపోర్టు కోసం మరుసటి రోజు రావాల్సి ఉండేది. ఈ మిషన్ ద్వారా ఇకపై ఇలాంటి ఇబ్బందులు ఉండవు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన రోగులు సైతం ఒకే రోజు అన్ని పరీక్షలు చేయించుకొని ఇంటికి వెళ్లే వీలు ఉంటుంది. రాష్ట్రంలో ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల్లో మాత్రమే ఈ పరికరం ఉంది. ఇప్పటికే ఇద్దరు టెక్నీషియన్లకు శిక్షణ సైతం ఇచ్చారు. కేవలం రక్త నమూనాలు సేకరించి మిషన్‌లో పెడితే చాలు మిగతా పనులన్నీ పరికరమే చూసుకుంటుంది. -
రిమ్స్ సెక్యూరిటీగార్డ్కు దేహశుద్ధి
శ్రీకాకుళం పాతబస్టాండ్: రిమ్స్‌లో వైద్యం కోసం వచ్చిన వ్యక్తి బంధువుల అశ్లీల చిత్రాలు సెల్ఫోన్లో చిత్రీకరిస్తూ సెక్యూరిటీ గార్డు దొరికిపోయారు. దీంతో అతడికి రోగి బంధువులతోపాటు అక్కడ ఉన్న మరికొంతమంది దేహశుద్ధి చేశారు. రిమ్స్‌లో ఆస్పత్రిలో ఫిమేల్ మెడికల్ (ఎఫ్ఎం) వార్డులో ఈ సంఘటన శుక్రవారం జరిగింది. రిమ్స్‌లో ఎఫ్ఎం వార్డులో నరసన్నపేటకు చెందిన రోగి బంధువు బాత్రూమ్లో ఉండగా ఆ వార్డులో విధులు నిర్వహిస్తున్న బలగ గ్రామానికి చెందిన ఒక సెక్యూరిటీ గార్డు సెల్ఫోన్లో వీడియో తీస్తుండటాన్ని కొందరు మహిళలు గమనించారు. విషయం తెలిసిన మహిళలందరూ దేహశుద్ధి చేశారు. రిమ్స్ ఆర్ఎంఓ డాక్టర్ బి.సి.హెచ్.అప్పలనాయుడు మాట్లాడుతూ.. ఈ విషయం తన దృష్టికి వచ్చిందని, దీనిపై ఫిర్యాదు వస్తే ఉన్నతాధికారులతో చర్చించి చర్యలు తీసుకుంటామని అన్నారు. రిమ్స్‌లో సెక్యూరిటీ గార్డులు కొంతమంది సరిగా పనిచేయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఇటీవల జీతాలను కోత పెట్టారు. పూర్తి జీతాల కోసం ఈనెల 9 నుంచి 19 రోజులు సమ్మెచేశారు. కాంట్రాక్టరు, అధికారుల చొరవతో ఈ సమస్య సద్దుమణిగింది. సమ్మె ముగిసిన రెండో రోజుల్లోనే సెక్యూరిటీ సిబ్బంది ఇటువంటి చర్యలకు పాల్ప డడం రిమ్స్‌లో చర్చనీయంశంగా మారింది. -
హెచ్ఐవీ గర్భిణికి చికిత్స నిరాకరణ
ఆపద సమయంలో వైద్యమందించి ప్రాణం పోయాల్సిన వైద్యుడు అంతుచిక్కని వ్యాధి ఉందంటూ అసహ్యించుకున్నాడు. చికిత్స అందించలేమంటూ చీదరించుకున్నాడు. వైద్యుడి నిర్వాకంతో తల్లడిల్లిన నిండు గర్భిణి ఆస్పత్రి ఎదుట కన్నీరు మున్నీరైంది. ఈ విషయం మీడియా దృష్టికి రావడంతో తప్పనిసరైన పరిస్థితిలో ఆస్పత్రిలో చేర్చుకున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు పెద్దదిక్కుగా ఉన్న రిమ్స్‌లో శనివారం ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆదిలాబాద్: జిల్లా కేంద్రం ఆదిలాబాద్‌లోని రిమ్స్ ఆస్పత్రిలో మరోసారి వైద్యులు, అధికారుల నిర్లక్ష్య వైఖరి బయటపడింది. ఇప్పటికే వైద్యం అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటుండగా.. మరోసారి స్పష్టమైంది. నిండు గర్భిణి అ ని కూడా చూడకుండా అందులోనూ హెచ్ఐవీ ఉందనే కారణంగా ఆమె ముఖంపైనే ‘ఎందుకొచ్చావు వైద్యం చేయబోం..’ అంటూ వైద్యు డు బెదిరించిన సంఘటన శనివారం రిమ్స్ ఆస్పత్రిలో చోటుచేసుకుంది. భైంసా మండలం కోల గ్రామానికి చెందిన మహిళ తన భర్తతో కలిసి ఉదయం 10గంటలకు రిమ్స్ ఆస్పత్రికి వచ్చింది. జిల్లా ఆదర్శ హెచ్ఐవీ పాజిటివ్ పీపుల్ వెల్ఫేర్ అధ్యక్షురాలు సరిత ఏఆర్టీ సెంటర్లో మందులు తీసుకున్న తర్వాత బయటకొచ్చింది. భైంసా నుంచి గర్భిణి రావడంపై మెటర్నిటీ వైద్యుడు డాక్టర్ రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు అధ్యక్షురాలు సరిత తెలిపారు. భైంసాలో ఆస్పత్రి, వైద్యులు ఉండగా ఇక్కడికి ఎందుకు వచ్చావంటూ ప్రశ్నించారని, దీంతో తాము వెళ్లిపోయే క్రమంలో సదరు గర్భిణికి నొప్పులు రావడంతో వైద్య పరీక్షలు చేసిన తర్వాత మధ్యాహ్నం 12గంటలకు అడ్మిట్ చేసినట్లు పేర్కొన్నారు. అక్కడ ఉన్న సిబ్బంది స్పందించి గర్భిణిని అడ్మిట్ చేసుకున్నప్పటికీ రౌండ్స్ కోసం సాయంత్రం 4గంటలకు వచ్చిన డాక్టర్ రామకృష్ణ మళ్లీ ఎందుకొచ్చావు.. ఉదయాన్నే నిన్ను పొమ్మన్నాను కదా అంటూ ఆమె పట్ల ఆగ్రహంగా మాట్లాడడంతో బాధితురాలు కంటతడి పెట్టింది. వెళ్లిపోవాలంటూ బెదిరించడంతో చేసేదేమీ లేక రిమ్స్ ఆస్పత్రి బయట కూర్చుంది. అధ్యక్షురాలు సరితకు ఫోన్‌చేసి విషయాన్ని చెప్పడంతో ఆమె అక్కడికి వచ్చింది. డాక్టర్ రామకృష్ణ తీరుపై రిమ్స్ డైరెక్టర్ అశోక్‌కు చెప్పినప్పటికీ స్పందించకపోవడం గమనార్హం. తనకెందుకు చెబుతున్నారు, సంబంధిత డిపార్ట్మెంట్ డాక్టర్ ఉన్నారు కదా ఆయనకు చెప్పుకొమ్మంటూ డైరెక్టర్ సమాధానం ఇవ్వడంపై అధ్యక్షురాలు ఆగ్రహం వ్య క్తం చేసింది. ఈ క్రమంలో డాక్టర్, డైరెక్టర్ స్పందించకపోవడంతో మీడియాను ఆశ్రయించింది. విషయం బయటకు పొక్కడంతో చేసేదేమీ లేక చివరకు గర్భిణిని అడ్మిట్ చేసుకున్నారు. కనికరం లేదా.. పేదలకు దేవాలయం లాంటి ఆస్పత్రిని, వైద్యులను దేవుళ్లతో పోల్చుకొని వైద్యం కోసం ఇక్కడికి వస్తుంటారు. అలాంటివారిని మానవత దృక్పథంతో, బాధ్యతాయుతంగా వైద్యం అందించాల్సిన వైద్యులు, ఉన్నత స్థానంలో ఉన్న రిమ్స్ డైరెక్టర్ సైతం స్పందించకపోవడం గమనార్హం. కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తున్నామంటూ ప్రజాప్రతినిధుల ముందు గొప్పలు చెప్పుకుంటున్న రిమ్స్ అధికారులు.. తీరా రిమ్స్‌కు వచ్చిన రోగులకు వైద్యం అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. సదరు గర్భిణికి వైద్యం నిరాకరించిన వైద్యుడికి అనుకూలంగా మాట్లాడాడని, తన స్థాయికి తగ్గట్లు వ్యహరించకపోవడం సరైంది కాదని హెచ్ఐవీ వెల్ఫేర్ అధ్యక్షురాలు సరిత అన్నారు. గతంలో సైతం హెచ్ఐవీ రోగులకు వైద్యం అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. రిమ్స్ ఆస్పత్రి మొత్తానికి అధికారిగా ఉన్న డైరెక్టర్ రోగులకు వైద్యం, వారి సౌకర్యాలను పర్యవేక్షించాల్సిన బాధ్యత ఉంటుంది. కేవలం తనకు ఎలాంటి సంబంధం లేదనే ధోరణిలో సమాధానం ఇవ్వడం పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా మళ్లీ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని రోగులు కోరుతున్నారు. కలెక్టర్ హెచ్చరించినా.. తీరు మారదా ఇటీవల రిమ్స్ ఆస్పత్రిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్న కలెక్టర్ దివ్యదేవరాజన్ గత శనివారం రిమ్స్ వైద్యులతో ఏర్పాటు చేసిన సమావేశంలో వైద్యసేవలపై నిర్లక్ష్యం చేయకూడదంటూ హెచ్చరించిన విషయం తెలిసిందే. ప్రైవేట్ ప్రాక్టిస్తోపాటు రిమ్స్‌కు వచ్చే రోగుల పట్ల అలసత్వం వహించకుండా వారితో మంచిగా స్పందించాలని సూచించారు. వైద్యులతోపాటు సిబ్బంది సైతం రోగులను ఇబ్బందులకు గురిచేయకుండా చూడాలని కలెక్టర్ గతంలోనే ఆదేశించారు. గత నెలలో జరిగిన రిమ్స్ అభివృద్ధి సమావేశంలో సైతం ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు రిమ్స్ సేవలపై అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం విదితమే. ఆ సమావేశంలోనే ఇలాంటి నిర్లక్ష్య ధోరణిని వీడాలంటూ ఉన్నతాధికారులు ఆదేశించా రు. అయినప్పటికీ రిమ్స్ వైద్యులు, అధికారుల తీరు మాత్రం మారడం లేదు. దీనికి నిదర్శనమే శనివారం జరిగిన సంఘటన. -
డాక్టరు పట్టాకు రూ. 25 వేలు?
ఒంగోలు సెంట్రల్: ఒంగోలు రిమ్స్‌లో ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ పాస్ అవ్వాలంటే కనీసం రూ. 25 వేలు ఇవ్వాలంటూ సర్జరీ విభాగంకు చెందిన ప్రొఫెసర్ బేరం పెట్టాడు. దీంతో విద్యార్థులు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, హెల్త్ యూనివర్సిటీ అధికారులు, ఇతర ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అలాగే డైరెక్టర్ దృష్టికి కూడా వెళ్లడంతో గురువారం విద్యార్థులను పిలిపించి విచారణ నిర్వహించారు. ఈ నెల 16 నుంచి ఫైనల్ ఇయర్ విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. దీంతో ప్రొఫెసర్ బేరాలకు దిగాడు. గతంలో మాదిరిగా రూ. 10 వేలు ఇస్తే కుదరదని రూ. 25 వేలు చెల్లించాల్సిందేనని పట్టు బట్టాడు. ఎగ్జామినర్లకు వసతి, భస, భోజనం, విందు వంటి ఖర్చులకు ఈ డబ్బు వాడతామని చెప్పాడు. ఇదే వ్యవహారంలో గతంలో రూ. 10 వేలు చొప్పున వసూలు చేసిన రిమ్స్ అధికారులు ఏకంగా భారతీయ వైద్య మండలి అధికారుల విచారణనే ఎదుర్కొనాల్సి వచ్చింది. అయినప్పటికీ ప్రొఫెసర్ల తీరు మారలేదు. కాగా రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ మస్తాన్ సాహెబ్‌కు విషయం తెలియడంతో విద్యార్థులతో మాట్లాడారు. అయితే ఈ విషయాన్ని బహిర్గతం చేసేందుకు విద్యార్థులు భయపడినట్లు సమాచారం. డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు: డాక్టర్ మస్తాన్, రిమ్స్ డైరెక్టర్ రిమ్స్‌లో ఎంబీబీఎస్ విద్యార్థులు ఎవరికీ డబ్బు చెల్లించాల్సిన అవసరంలేదు. బాగా చదువుకుని పరీక్షలు రాయాలి. ఎవరైనా ఇలాంటి వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం. ఓ ప్రొఫెసర్‌పై ఆరోపణలు రావడంతో విద్యార్థులను విచారించాం. ఓ హోటల్‌తో ఎంఓయూ ఒంగోలు నగరం 60 అడుగుల రోడ్డులోని ఓ హోటల్‌తో ఎంఓయూ కుదుర్చుకున్నట్లు రిమ్స్ డైరెక్టర్ తెలిపారు. రిమ్స్‌కు వచ్చే ఎక్స్టర్నల్ ఎగ్జామినర్లు ఈ హోటల్లో బస చేయవచ్చని, దీనికి సంబంధించిన బిల్లులను రిమ్స్ నుంచి చెల్లిస్తామన్నారు. విద్యార్థుల మీద భారం పడకూడదని ఈ నిర్ణయిం తీసుకున్నట్లు తెలిపారు. -
రిమ్స్ ఏఓపై ఏసీబీ పంజా
కడప అర్బన్ : కడప నగరంలోని ప్రతిష్టాత్మకమైన వైద్య కళాశాల రిమ్స్‌లో పరిపాలన అధికారిగా పనిచేస్తున్న భరత్మోహన్సింగ్పై అవినీతి నిరోధకశాఖ అధికారులు పంజా విసిరారు. అతను తన సీటులో కూర్చొని గురువారం బాధితుడు సురేష్‌కుమార్‌రెడ్డి వద్ద నుంచి నేరుగా రూ. 60 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ సంఘటన వివరాలను ఏసీబీ డీఎస్పీ నాగరాజు వెల్లడించారు. అనంతపురం నర్సింగ్ కళాశాలలో ఆఫీసు సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న సి.సురేష్‌కుమార్‌రెడ్డి గత ఏడాది నవంబరు 21న కడప రిమ్స్‌కు బదిలీపై వచ్చాడు. అప్పటి నుంచి ఇప్పటివరకు నాలుగు నెలలు గడుస్తున్నా వేతనంగానీ, పనిచేసే స్థానంగానీ ఇవ్వకుండా రిమ్స్‌లో ఏఓగా పనిచేస్తున్న భరత్‌మోహన్‌సింగ్ వేధింపులకు గురిచేశారు. రూ. లక్ష ఇస్తేనే సురేష్‌కుమార్‌రెడ్డికి వేతనం ఇప్పించడంగానీ, స్థానం కేటాయించడంగానీ జరుగుతుందని ఏఓతోపాటు మరో ఇద్దరు అధికారులు తెగేసి చెప్పారు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈనెల 6వ తేదీ ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఏసీబీ డీఎస్పీ నాగరాజు తమ సీఐలు సుధాకర్‌రెడ్డి, రామచంద్ర, సిబ్బందితో కలిసి ఈ సంఘటనలో పాల్గొన్నారు. బాధితుడు సురేష్‌కుమార్‌రెడ్డి తాను ఒప్పందం కుదుర్చుకున్న రూ. 60 వేలు లంచం ఇచ్చేందుకు నేరుగా భరత్‌మోహన్‌సింగ్ కూర్చొన్న సీటు వద్దకు వెళ్లి ఇచ్చాడు. ఈ మొత్తాన్ని తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు నేరుగా వెళ్లి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. స్థానం కేటాయించడంలోనూ కక్కుర్తి రిమ్స్ ఆస్పత్రిలో పరిపాలన విభాగం అధికారిగా పనిచేస్తున్న భరత్‌మోహన్‌సింగ్ తనతోపాటు భవిష్యత్తులో పదోన్నతి లభించబోయే స్థాయి కలిగిన ఆఫీసు సూపరింటెండెంట్ క్యాడర్లో ఉన్న సురేష్‌కుమార్‌రెడ్డికి పనిచేసే సీటు కేటాయింపులోనూ, ట్రెజరీ నుంచి వేతనాన్ని మంజూరు చేయించడంలోనూ కక్కుర్తి పడ్డాడు. ఎల్పీసీ, ఎస్ఆర్ లాంటి రికార్డులను వెంటనే తీసుకొచ్చి ఇచ్చినా, అనేకసార్లు ప్రాధేయపడినా సురేష్‌కుమార్‌రెడ్డికి న్యాయబద్ధంగా చేయాల్సిన పనిని నిర్లక్ష్యం చేశాడు. దీంతో తీవ్ర ఆవేదన చెందిన సురేష్‌కుమార్‌రెడ్డి ఏసీబీ అధికారులను ఆశ్రయించాల్సి వచ్చింది. ఈ సందర్భంగా సురేష్‌కుమార్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పరిపాలనాధికారి భరత్‌మోహన్‌సింగ్ తోపాటు మరో ఆఫీసు సూపరింటెండెంట్ మారుతిప్రసాద్, డైరెక్టర్ కూడా రూ. లక్ష ఇవ్వాలని పట్టుబట్టారని ఆరోపించారు. రూ. 60 వేలు ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత నేరుగా డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారని వివరించారు. అతనిని లోతుగా విచారించి ఈ సంఘటనలో హస్తమున్న వారిపై కూడా చర్యలు తీసుకోనున్నట్లు తెలిసింది. జిల్లాలో వరుసగా ఏసీబీ దాడులు వైఎస్సార్ జిల్లాలో జనవరి నెలలో 2వ తేదిన పెద్దముడియం వీఆర్వోగా పనిచేస్తున్న చంద్రమోహన్ రూ. 5 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. ∙4న రైల్వేకోడూరుకు చెందిన శ్రీరాములు అనే సర్వేయర్ రూ. 10 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. ∙కడప నగరంలోని పాత రిమ్స్‌లో కార్మికశాఖ సహాయ కమిషనర్ పెంచలయ్య లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. ∙ఎర్రగుంట్లలో రైల్వే హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న దేవదానం రూ. 9 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. తాజాగా భరత్‌మోహన్‌సింగ్ ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఏసీబీ అధికారులను నేరుగా కలవాలన్నా, ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వాలన్నా డీఎస్పీ నాగరాజు (94404 46191), సీఐలు సుధాకర్‌రెడ్డి (94404 46100), రామచంద్ర (94906 11024), కార్యాలయం (08562–244637)లో సంప్రదించాలని డీఎస్పీ వెల్లడించారు. -
ముగ్గురిని బలిగొన్న నిర్లక్ష్యం
అంతసేపు ఆనందంగా గడిపారు. సరిగ్గా 15 నిమిషాల్లో ఇల్లు చేరుతామనుకున్నారు.. అంతలోనే రోడ్డుప్రమాదం వారింట విషాదాన్ని నింపింది. గుడిహత్నూర్ సమీపంలో ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గుడిహత్నూర్(బోథ్) : మండల కేంద్రానికి సమీపంలో జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ముగ్గురి ప్రాణాలు తీసింది. పోలీసులు, మృతుడి మిత్రులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా ముప్కాల్‌కు చెందిన స య్యద్ అహ్మద్ (43) గత కొన్ని సంవత్సరాలుగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కూరగాయల వ్యాపారం చేస్తున్నాడు. తరుచూ ముప్కాల్‌లో ఉన్న తల్లిదండ్రుల వద్దకు వచ్చి వెళ్లేవాడు. ఈ క్రమంలో మంగళవారం భార్య ఫర్హానాబేగం, కొడుకు సయ్యద్ ఉమర్ (9) కూతురు మహదియాతోపాటు డ్రైవర్ బిలాల్ (22) ఎర్టీగా వాహనంలో ముప్కాల్‌లో ఉన్న కుటుంబ సభ్యులను కలిసి తిరుగు ప్రయాణంలో నిర్మల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొని ఆదిలాబాద్‌కు బయలు దేరారు. మండల కేంద్రం దాటిన తర్వాత తెలంగాణ దాబా వద్ద హైవే స్పీడ్ ట్రాక్‌పై ఓ లారీ టైరు పగలడంతో ఆగి ఉంది. ఇది గమనించని కారు డ్రైవర్ లారీని రాత్రి 11 గంటల సమయంలో ఢీకొట్టాడు. ఎయిర్ బెలూన్లు తెరుచుకున్నప్పటికీ ముందు సీట్లో కూర్చున్న తండ్రీకొడుకులు సయ్యద్ అహ్మద్, సయ్యద్ ఉమర్, డ్రైవర్ బిలాల్ అక్కడికక్కడే మృతి చెందారు. భార్య ఫర్హానాబేగం, కూతురు మహదియాకు తీవ్రగాయాలయ్యాయి. పెద్ద శబ్దం రావడంతో వెంటనే అక్కడికి చేరుకున్న స్థానికులు పోలీసులు, అంబులెన్సుకు సమాచారం అందించి క్షతగాత్రులను రిమ్స్‌కు తరలించారు. మరో 15 నిమిషాల్లో ఇంటికి చేరాల్సిన ఓ కుటుంబం ప్రమాదానికి గురికావడం వీరిలో తండ్రీకొడుకులు చనిపోవడం..మృతుడి భార్య, కూతురు తీవ్రంగా గాయపడడంతో సన్నిహితులు, కుటుంబసభ్యులు కంటతడి పెట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎ.కిరణ్‌కుమార్ తెలిపారు. నిర్లక్ష్యమే నిండు ప్రాణాలు తీసింది హైవేపై నిరంతర పర్యవేక్షణ చేయాల్సిన హైవే పెట్రోలింగ్‌తోపాటు సదరు హైవే నిర్వహణ సంస్థ నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమైంది. లారీ టైరు పేలి మరమ్మతు కోసం గంటల తరబడి హైవే స్పీడ్ ట్రాక్‌పై నిలిచి ఉంది. వెంటనే ప్రమాద సూచికలు ఏర్పాటు చేయడంలో ఆయా అధికారులు నిర్లక్ష్యం వహించారు. దీంతో పాటులారీ డ్రైవర్ కనీసం ఇండికేటర్లు, ఇతరాత్ర ప్రమాద సూచికలు ఏర్పాటు చేయకపోవడంతో లారీ చీకట్లో కనిపించలేదు. కారు డ్రైవరు సైతం అతివేగంగా ఉండడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం కంటే ముందే పలువురు లారీ చీకట్లో కనిపించక వాహనాన్ని అదుపు చేసుకొని ప్రమాదం నుంచి తప్పించుకున్నట్లు తెలిసింది. ఇరువురి నిర్లక్ష్యం మూడు ప్రాణాలను తీసింది. -
ఏ తల్లి కన్న బిడ్డో?
మద్దిపాడు: ఆ తల్లికి వచ్చిన కష్టం ఏమిటో తెలియదుగానీ పొత్తిళ్ల శిశువు (బాలుడు)ను చెరువు గట్టుపై ఉంచి మాయమైంది. ఈ సంఘటన మద్దిపాడు మండలం గాజులపాలెం చెరువు వద్ద బుధవారం వెలుగు చూసింది. వివరాలు.. చెరువు గట్టుపై పసిబిడ్డ రోదనలు విన్న స్థానికులు అంగన్వాడీ ఆయా మరియమ్మకు సమాచారం ఇచ్చారు. ఇంతలో అక్కడకు వచ్చిన ధేనువకొండ గ్రామానికి చెందిన వ్యక్తి తాను పెంచుకుంటానంటూ బిడ్డను మేదరమెట్ల ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ఆయా ద్వారా సమాచారం అందుకున్న ఐసీడీఎస్ సీడీపీఓ చిలకా భారతి, సూపర్వైజర్ జ్యోతి, అంగన్వాడీ కార్యకర్త మంజువాణిలు మేదరమెట్లకు వెళ్లి శిశువును స్వాధీనం చేసుకున్నారు. వెంటనే 108లో రిమ్స్‌కు చికిత్స కోసం తరలించారు. అక్కడి నుంచి ఒంగోలులోని శిశుగృహకు తీసుకెళ్లినట్లు సీడీపీఓ భారతి తెలిపారు. బిడ్డను ఎవరో వదిలేసి వెళ్లారన్న విషయమై గాజులపాలెం వాసులు పలు రకాలుగా చర్చించుకుంటున్నారు. సమీపంలో ఒడిశాకు చెందిన మహిళలు పలువురు రొయ్యల ఫ్యాక్టరీలో పని చేసే వారు ఉన్నారని, వివాహేతర సంబంధం వల్లకలిగిన శిశువును ఇలా వదిలించుకుని ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పండంటి బిడ్డను అనాథగా వదిలి వెళ్లడంపై స్థానికులు విచారం వ్యక్తం చేస్తున్నారు. -
బాలుడి కిడ్నాప్
కడప కార్పొరేషన్: కడప నగరం హౌసింగ్‌బోర్డు కాలనీకి చెందిన దేవేంద్రారెడ్డి(4) అనే ఎల్కేజీ విద్యార్థి శుక్రవారం సాయంత్రం కిడ్నాప్ అయ్యాడు. ఈ వార్త నగరంలో కలకలం రేపింది. డీఎస్పీ మాసూం బాషా కథనం ప్రకారం.. హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన పవన్‌కుమార్‌రెడ్డి ఇంట్లోనే ల్యూమినస్ బ్యాటరీల షాపు నిర్వహిస్తున్నాడు. గుత్తికి చెందిన వినోద్ ఆ షాపులో గుమస్తాగా పని చేస్తున్నాడు. రాత్రి 8 గంటల సమయంలో వినోద్.. యజమాని కుమారుడు దేవేంద్రారెడ్డిని కిడ్నాప్‌నకు పాల్పడ్డారు. ఆ బాలుడిని మోటార్‌సైకిల్‌పై ఎక్కించుకుని రిమ్స్ వైపు తీసుకెళ్లారు. వేరే నంబర్‌తో పవన్‌కుమార్‌రెడ్డికి ఫోన్ చేసి.. గొంతు మార్చి మాట్లాడుతూ రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. బాలుడి తండ్రి వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో వారు అప్రమత్తమయ్యారు. పవన్‌కుమార్‌రెడ్డికి వచ్చిన ఫోన్ నంబర్ సిగ్నల్స్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దొరికిపోతాననే భయంతో వినోద్.. బాలుడిని రిమ్స్ రోడ్డులోని బొరుగుల ఫ్యాక్టరీ సమీపంలో బండకేసి బాదారు. దీంతో పిల్లవాడు అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో.. అక్కడే వదిలేశాడు. తర్వాత ఏమీ తెలియనట్లు షాపునకు వచ్చేశాడు. అయితే వన్‌టౌన్ పోలీసులు శుక్రవారం రాత్రి నగరంలో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. రాజీÐŒవ్ పార్కు సమీపంలోని బాలుడి ఇంటి వద్ద విచారణ చేపట్టారు. దుకాణంలో పని చేసే వారి గురించి ఆరా తీసే సమయంలో.. వినోద్ ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటంతో అదుపులోకి తీసుకున్నారు. అతన్ని పోలీసు స్టేషన్‌కు తీసుకొచ్చి విచారణ చేయగా.. బాలుడిని చంపినట్లు తెలిపారు. అయితే తండ్రి పవన్‌కుమార్‌రెడ్డి తమ బిడ్డ మృతదేహాన్నైనా చూస్తామని అడగ్గా.. బొరుగుల ఫ్యాక్టరీ వద్ద పడవేశామని చెప్పాడు. అక్కడికి వెళ్లి చూడగా బాలుడు కదలాడుతూ ఉండటంతో వెంటనే నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. బాలుడు పరిస్థితి పర్వాలేదని, అపాయమేమీ లేదని వైద్యులు తెలిపారు. తలకు మాత్రం పెద్ద గాయమైనట్లు సమాచారం. కిడ్నాప్‌నకు గురైన విద్యార్థి దొరకడంతో తల్లిదండ్రులు కుదుట పడ్డారు. తమ వద్ద పని చేసే వారే ఇలా దుర్మార్గంగా వ్యవహరిస్తారని అనుకోలేదని వారు వాపోతున్నారు. -
‘నారాయణ’ యాజమాన్యమే పొట్టన పెట్టుకుంది
కడప వైఎస్ఆర్ సర్కిల్: ‘‘మా కుమార్తె పావనిని నారాయణ కళాశాల యాజమాన్యమే పొట్టనపెట్టుకుంది’’ అని మృతురాలి తల్లిదండ్రులు మల్లేశ్వర్‌రెడ్డి, శివమ్మలు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం వైఎస్సార్ జిల్లా కడపలోని అంబేడ్కర్ సర్కిల్లో నారాయణ కళాశాలల్లో ఆత్మహత్యలపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరవకధిక నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ దీక్షల్లో పాల్గొన్న విద్యార్థిని పావని తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతూ మాట్లాడారు. తమ కుమార్తె చదువుతోపాటు అన్నింటిలో మొదటిస్థానంలో నిలిచేదని, ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని తెలిపారు. నారాయణ కళాశాల యాజమాన్యమే తమ కుమార్తెను చంపిందని వారు ఆరోపించారు. తల్లిదండ్రులకు, పోలీసులకు ఎటువంటి సమాచారం అందించకుండా రిమ్స్ మార్చురీలో అనాథ శవంలా పావనిని ఉంచారని, దీనిని బట్టి చూస్తే యాజమాన్యం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహారించిందో అర్థమవుతోందని ధ్వజమెత్తారు. పావని మృతి పట్ల న్యాయం చేయాల్సిన పోలీసులే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని చెప్పడం దారుణమని, తమకు జరిగిన అన్యాయం ఇతర తల్లిదండ్రులకు జరగకూడదన్నారు. నారాయణ కళాశాల మంత్రులకు చెందినది కాబట్టే ప్రభుత్వం సైతం వారికి వత్తాసు పలుకుతోందని విమర్శించారు. తమ కుమార్తె మృతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని మల్లేశ్వర్‌రెడ్డి, శివమ్మ డిమాండ్ చేశారు. -
ప్రకాశం రిమ్స్‌లో ప్రైవేటు దందా
-
మేల్కొంటేనే ఊపిరి..!
►ఏదైనా అత్యవసరం జరిగితే అంతే సంగతులు ►గతంలోనూ రిమ్స్‌లో ఆక్సిజన్ వ్యవహారంపై రచ్చ ►కొన్ని పీహెచ్‌సీల్లోనే కనిపిస్తున్న ఆక్సిజన్ సిలిండర్లు ►ప్రస్తుత పరిస్థితుల్లో అన్నిచోట్ల ఉంటేనే ఉపయోగం ►గోరఖ్‌పూర్‌లాంటి ఘోరం జరగకముందే జాగ్రత్తలు అవసరం గోరఖ్‌పూర్ లాంటి ఘోరం జరగకమునుపే వైద్యారోగ్యశాఖ మేలుకోవాలి. అన్ని ఆస్పత్రుల్లో ఆక్సిజన్ సిలిండర్లు ఉన్నాయా.. లేదా? ఉన్నచోట సక్రమంగా పనిచేస్తున్నాయా అనేది పరిశీలించాల్సి ఉంది. ఒక ప్రమాదం జరిగిన తర్వాత అప్రమత్తమయ్యేకంటే ఒక్కసారి అవలోకనం చేసుకుంటేనే మంచిది. ఏళ్ల నాటి క్రితం సిలిండర్లు...ఎంతమాత్రం పనిచేస్తున్నాయన్నది కూడా అనుమానాలకు తావిస్తోంది. అవసరమైనపుడే బయటికి తీయడం, అప్పుడు పనిచేయకపోతే ఆందోళన చెందే పరిస్థితి కంటే ముందే పరిశీలిస్తేనే బాగుంటుందని జనం కోరుతున్నారు. కడప :రెండేళ్ల క్రితం జిల్లాలో ప్రధాన ఆస్పత్రిగా చెప్పుకునే రాజీవ్‌గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్)లో ఒకేరోజు ముగ్గురు, నలుగురు చనిపోయిన నేపథ్యంలో వెంటిలేటర్ సిస్టమ్తోపాటు ఆక్సిజన్ల సిలిండర్లు పనిచేయకపోవడంతోనే ఘటన జరిగిందని రచ్చ జరిగింది. ప్రస్తుతం అలాంటి పెద్ద సంఘటనలు జిల్లాలో లేకపోవడం ఊపిరి పీల్చుకునే అంశం. జిల్లాకేంద్రమైన కడపలోని రిమ్స్‌తోపాటు ప్రొద్దుటూరు, పులివెందుల ఏరియా ఆస్పత్రుల్లో ఆక్సిజన్ల సిలిండర్లు సంపూర్ణంగానే ఉన్నాయి. కానీ చాలా పీహెచ్‌సీల్లో ప్రాణవాయువు అందుబాటులో లేదు. ఉన్నవాటిల్లోనూ వాటిని వాడటం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఏదైనా ప్రమాదం కానీ, అత్యవసర కేసులు వస్తే వెంటనే రిమ్స్‌కు రిఫర్ చేస్తున్నారు తప్పించి ప్రాథమికంగా కొద్దిసేపు ఆక్సిజన్ పెట్టి ప్రాథమిక చికిత్స చేస్తున్న దాఖలాలు తక్కువే. అత్యవసరానికే ముందే అప్రమత్తత అవసరం జిల్లాలో సుమారు 75 పీహెచ్‌సీలతోపాటు పలు 24 గంటలు పనిచేసే ఆస్పత్రులతోపాటు 30, 50, 100 పడకల ఆస్పత్రులు ఉన్నాయి. అయితే కేవలం వృద్ధులు, కొంతమంది చిన్నారుల పరిస్థితిని బట్టి ఆక్సిజన్ వినియోగిస్తున్నారు. దీంతో అవసరం కూడా తక్కువగానే ఉంది. కానీ ఏదైనా పెద్దప్రమాదం జరిగితే కష్టమే. ఇటీవలె గోరఖ్‌పూర్‌లోని మెడికల్ ఆస్పత్రిలో చిన్నారులు ఆక్సిజన్ అందక సుమారు 30మందికి పైగా మృత్యువాతపడ్డారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వైద్యా«ధికారులు ఎక్కడికక్కడ ఆస్పత్రుల నుంచి ఆక్సిజన్ సిలిండర్లకు సంబంధించిన వివరాలతోపాటు వెంటిలేటర్ల సిస్టమ్ గురించి నివేదికలు తెప్పించుకున్నారు. అయితే ఇప్పటివరకు పలు ఆస్పత్రుల్లో చిన్నారులకు సంబంధించిన ప్రత్యేక విభాగాలు ప్రారంభానికి నోచుకోలేదు. అంతంత మాత్రమే జిల్లాలోని అన్ని ప్రధాన ఆస్పత్రులతోపాటు పలు పీహెచ్‌సీల్లో ఏర్పాటుచేసిన ఆక్సిజన్ సిలిండర్లలో కొన్ని అంతంతమాత్రంగానే పనిచేస్తున్నట్లు తెలుస్తోం ది. కొంతమంది పీహెచ్సీ సిబ్బంది చూసుకోకపోతే సిలిండర్ ఖాళీ అయినా అలాగే ఉండిపోతుంది. అదేవిధంగా కొన్ని లీకై ఆక్సిజన్ బయటికి వెళ్లినా పట్టించుకోని పరిస్థితి. ఆక్సిజన్ సిలిండ ర్లు అయిపోయిన వెంటనే ఆస్పత్రి అభివృద్ధి నిధులతో మళ్లీ సిలిండర్‌కు ఆక్సిజన్ పట్టుకోవాలి. అందుకుగాను రూ.600–800 మధ్య మాత్రమే ఖర్చవుతుంది. కొన్ని పీహెచ్‌సీలకే పరిమితం జిల్లాలో 75 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలున్నా 35చోట్లనే ఆక్సిజన్ సిలిండర్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అలాకాకుండా అన్ని పీహెచ్‌సీల్లో ఆక్సిజన్ ఉండడం చాలా అవసరం. ఎందుకంటే ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నం అవుతాయో కూడా తెలియని పరిస్థితి. పెద్దాస్పత్రులను పక్కన పెడితే మారుమూల పల్లెల నుంచి ఎక్కువగా పీహెచ్‌సీలకు రోగులు వెళుతుంటారు. వర్షాకాలం నేపథ్యంలో ఎక్కువగా చిన్నారులు, ఆస్తమా రోగులు వస్తుంటారు. వాటన్నింటిని పరిగణలోకి తీసుకుని అన్ని పీహెచ్‌సీల్లో ఆక్సిజన్ సిలిండర్లను అందుబాటులో ఉంచితే ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే అత్యవసర పరిస్థితుల్లో గర్భిణులు నేరుగా పీహెచ్‌సీలకు వెళతారు. ఎమర్జెన్సీని దృష్టిలో పెట్టుకుని అప్పటికప్పుడు అత్యవసరంగా అక్కడనే ఆక్సిజన్ పెట్టడానికి అవకాశం ఉండేలా చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. ఆక్సిజన్ సమస్య లేదు జిల్లాలో 24గంటలు పనిచేసే పీహెచ్‌సీలు దాదాపు 35 వరకు ఉన్నాయి. ఇక్కడ అన్నిచోట్ల ఆక్సిజన్ సిలిండర్లను అందుబాటులో ఉంచి జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం! అంతేకాకుండా గర్భిణులు, చిన్నపిల్లలు అధికంగా వచ్చే పీహెచ్‌సీలను కూడా గుర్తించి అక్కడ కూడా ఆక్సిజన్ సిలిండర్లు ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉండేలా చర్యలు తీసుకున్నాం. ఆక్సిజన్ సిలిండర్లు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం. ఇప్పటికే అందరినీ అప్రమత్తం చేశాం! – డాక్టర్ రామిరెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి -
రిమ్స్‌లో దేశ చిత్రపటానికి అవమానం
ఆదిలాబాద్ : ఆదిలాబాద్‌లోని రిమ్స్‌లో మంగళవారం స్వాతంత్య్ర వేడుకల్లో దేశ చిత్రపటానికి అవమానం జరిగింది. జాతీయ పతాకంలోని మూడు రంగులతో వేసిన భారత దేశ చిత్రపటంపై నిలబడి రిమ్స్ డైరెక్టర్ అశోక్ స్వాతంత్య్ర వేడుకలు నిర్వహించడం చర్చనీయాంశమైంది.జాతీయ పతాకం రంగుల్లో అశోక్ చక్రం చిత్రపటంపై నిలుచున్న డైరెక్టర్ తీరు అక్కడున్న వారిని విస్మయపర్చింది. -
ఆడపిల్ల పుట్టిందని..
ఆదిలాబాద్: ఆడపిల్ల పుట్టిందని ఆసుపత్రిలోనే వదిలేసిపోయిందో తల్లి. ఈ సంఘటన ఆదిలాబాద్ రిమ్స్‌లో చోటు చేసుకుంది. స్థానికులు గమనించి పోలీసులుకు, ఆసుపత్రికి సిబ్బందికి తెలియజేయగా వారు పాపను శిశుగృహానికి తరలించారు. పాప సంబంధీకులు ఎవరైనా 60 రోజుల లోపలవచ్చి తీసుకువెళితే సరి.. లేదంటే తర్వాత పాపను దత్తతకు ఇస్తామని ఐసీడీఎస్ అధికారి ప్రసాద్ పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పాప వయసు 5 రోజులు ఉంటుందని వైద్యులు నిర్దారించారు. -
రిమ్స్‌లో జూనియర్ డాక్టర్ల ఆందోళన
ఒంగోలు: స్థానిక రిమ్స్‌లో జూనియర్ డాక్టర్లు శనివారం విధులు బహిష్కరించి ఆందోళనకు దిగారు. రిమ్స్‌కు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎంసీఐ) గుర్తింపు రాకపోవడంతో తమ చదువు పూర్తయినా నిరూపయోగంగా మిగిలిపోతున్నామంటూ జూనియర్ డాక్టర్లు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా... జూనియర్ డాక్టర్ల ఆందోళనకు మెడికోలు మద్దతు పలికి వారు కూడా ఆందోళనలో పాల్గొన్నారు. -
పేరుకే బయోమెట్రిక్
శ్రీకాకుళం : రిమ్స్‌లో బయోమెట్రిక్ విధానం అమలు కావడం లేదు. దీన్ని అదనుగా తీసుకుని సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల కొత్తగా విశాఖపట్నం, తదితర ప్రాంతాల నుంచి వచ్చిన స్టాఫ్ నర్సులు, ఇతర సిబ్బంది ఈ బయోమెట్రిక్ లేకపోవడంతో హాజరు పట్టీల్లో ఒకరి బదులు ఒకరు సంతకాలు చేస్తూ సమయపాలన పాటించడం లేదని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వారం రోజులుగా ఈ ఫోర్జరీ ప్రక్రియ జరుగుతోందని, దీనిపై అధికారులకు ఫిర్యాదు చేస్తే హాజరు పట్టీపై ఓ క్రాస్ మార్క్ వేసి వదిలేస్తున్నారని, ఇటీవల ఇలాంటి హాజరు పట్టీలు బయటపడ్డాయని కొందరు తెలిపారు. అవినీతి ఆశలో.. రిమ్స్‌కి ఇటీవల కొంతమంది వివిధ ప్రాంతాలు, విశాఖపట్నం నుంచి కొత్తగా స్టాఫ్‌నర్సులు వచ్చారు. వారికి ఇక్కడకు రావడం ఇబ్బందిగా ఉంది. ఈ పరిస్థితుల్లో వారిలో కొంతమంది విధులను ఎగ్గొంటేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా కొంతమంది తోటి సిబ్బందితో సంతకాలు చేయించడం, మరి కొంతమంది హాజరు విషయంలో సంబంధిత అధికారికి కొంత ముట్టజెప్పడం, ప్రలోభాలకు పాల్పడడం వంటివి జరుగుతున్నట్లు సమాచారం. ప్రధానంగా నర్సింగ్ గ్రేడ్-1 సూపరింటెండెంట్ అస్వస్థతకు గురికావడంతో ఆ తర్వాతి స్థానంలో ఉన్న వారు ఈ హాజరును నిర్వహిస్తున్నారు. అక్కడే ఈ అవినీతి కోణం బయటపడినట్టు తెలుస్తోంది. మూలకు చేరిన బయోమెట్రిక్ రిమ్స్‌లో బయోమెట్రిక్ విధానం మూలకు చేరింది. ఈ విధానం అక్కడ అమలులో ఉన్నా నామమాత్రంగానే నడుస్తోంది. కొత్తలో బాగానే నడిచినా రిమ్స్‌లో ఈ విధానం ఆధారంగా జీతాల చెల్లింపులు, ఇతర సెలవులు వంటివి పరిగణనలోకి తీసుకోకపోవడంతో చిక్కువచ్చిపడింది. దీన్ని అదనుగా తీసుకుని కొందరు ఇలా ఆటలాడుతున్నారు. రిమ్స్‌లో కొత్తగా వచ్చిన వారికి ఇంకా విధుల్లో డ్యూటీ చార్టులు తయారు కాలేదు. దీంతో దొంగ సంతకాలతో విధులకు డుమ్మా కొడుతున్నారు. దీనిపై రిమ్స్ సూపరింటెండెంట్ సునీల్ నాయక్ వద్ద ప్రస్తావించగా వారం రోజుల్లో అన్నీ సరి చేస్తామని చెప్పారు. విధులకు రాని వారిని క్షమించబోమని తెలిపారు. డైరెక్టర్ రాగానే ఆమెతో చర్చించి చర్యలు తీసుకుంటామన్నారు. హజరు పట్టీలో దిద్దుబాట్లు లేకుండా చర్యలు తీసుకుంటామని, దీనికి కొంచెం సమయం పడుతుందని పేర్కొన్నారు. -
రీకౌన్సెలింగ్..రచ్చరచ్చ
కడప రూరల్: కడప పాత రిమ్స్‌లోని వైద్య ఆరోగ్యశాఖ రీజనల్ డెరెక్టర్ కార్యాలయ పరిధిలోని నాలుగు (కర్నూలు, చిత్తూరు, అనంతపురం, వైఎస్సార్)జిల్లాల ఉద్యోగులకు సోమవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో రీకౌన్సెలింగ్ ప్రక్రియ రచ్చ..రచ్చగా సాగింది. గడిచిన గురు, శుక్ర, శనివారాల్లో కడపలోని ఆ శాఖ ఆర్డీ కార్యాలయంలో నిర్వహించిన కౌన్సెలింగ్‌లో అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈక్రమంలో ఆ శాఖ కమిషనర్ రీకౌన్సెలింగ్ జరపాలని ఆదేశాలు జారీ చేశారు. ముందుజాగ్రత్త చర్యగా ఈ రీకౌన్సెలింగ్‌ను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో ఆ శాఖ జాయింట్ డైరెక్టర్ మీనాకుమారి, ప్రాజెక్టు ఆఫీసర్ డాక్టర్ అరుణ్, అసిస్టెంట్ డైరెక్టర్ ప్రకాశ్‌రావు, డిప్యూటీ డైరెక్టర్లు డాక్టర్ శ్రీనివాసరెడ్డి, గణపతిరావు తదితరులు డీఎంహెచ్ఓ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. అయితే వారిని లోనికి వెళ్లనీయకుండా ఎన్జీఓ అసోసియేషన్ నాయకులతోపాటు ఇతరులు అడ్డుకున్నారు. తప్పులు సరిదిద్దాలని, రీకౌన్సెలింగ్‌ను మాత్రం జరపరాదని డిమాండ్ చేశారు. గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు శివారెడ్డి, కార్యదర్శి శ్రీనివాసులరెడ్డి తదితరులు మాట్లాడుతూ ఏవైనా లోపాలు ఉంటే సరిదిద్దండి..రీకౌన్సెలింగ్‌కు మాత్రం జరపరాదని తెలిపారు. రీకౌన్సెలింగ్ జరిగితే చాలామందికి ఇబ్బందిగా ఉంటుందని, అందరూ హాజరుకావాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. అనంతరం రీకౌన్సెలింగ్‌కు వ్యతిరేకవర్గం డీఎంహెచ్ఓ కార్యాలయ తలుపులను మూసివేశారు. రీకౌన్సెలింగ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అనుకూల వర్గం ఆగ్రహం ఇదే తరుణంలో రీకౌన్సెలింగ్ జరపాలని ఓ వర్గం డిమాండ్ చేసింది. కొంతమంది కార్యాలయం లోపల, బయట బైఠాయించి రీకౌన్సెలింగ్ జరిపి తీర్సాలిందే అంటూ పోటీ నినాదాలు చేశారు. రీ కౌన్సెలింగ్ జరపకపోతే తమకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తిరుపతి రుయా ఆస్పత్రి స్టాఫ్ నర్సు సుజాత మాట్లాడుతూ సుఖాలు, సంతోషాలు నాయకులకేనా.. తమకు లేవా? అని నిలదీశారు. నిబంధనల మేరకు ఎవరైనా సరే లాంగ్ స్టాడింగ్లో ఉన్న వారందరినీ బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ రీకౌన్సెలింగ్లో కూడా ఏవైనా అక్రమాలు జరిగితే సహించేది లేదని హెచ్చరించారు. రీ కౌన్సెలింగ్ చేపట్టి తీరుతాం రీకౌన్సెలింగ్ వద్దన్న వారి మాటలను ఆ శాఖ జేడీ మీనాకుమారి తదితరులు లెక్కచేయలేదు. ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తామని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తాము వెనక్కి వెళ్లేది లేదని, రీకౌ న్సెలింగ్ చేపట్టి తీరుతామన్నారు. ఏదైనా అభ్యంతరాలుంటే ఫిర్యాదులు ఇచ్చుకోవచ్చని తెలిపారు. అంత ఆందోళన జరుగుతున్నా అధికారులు ఏమాత్రం వెనుకడుగు వేయకుండా మెల్లమెల్లగా ముందుకు సాగి కార్యాలయంలోకి వెళ్లిపోయారు. దీంతో చేసేదేమీలేక రీకౌన్సెలింగ్‌కు వ్యతిరేకులు చూస్తూ ఉండిపోయారు. స్థానికేతరుల ఇబ్బందులు..కరువైన సౌకర్యాలు రీకౌన్సెలింగ్ ఉందంటూ ఉన్నఫలంగా వైఎస్సార్ జిల్లాతోపాటు చిత్తూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల్లోని ఆ శాఖ ఉద్యోగులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారంతా తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. చాలామంది ఉద్యోగులు వ్యయ ప్రయాసలు కోర్చి డీఎంహెచ్ఓ కార్యాలయానికి చేరుకున్నారు. అయితే రావాల్సిన వారిలో ఎంతమంది వచ్చారనేది తేలియలేదు. అలాగే ఆర్డీ కార్యాలయంలో నీడ ఇవ్వడానికి కనీసం చెట్లయినా ఉన్నాయి. డీఎంహెచ్ఓ కార్యాలయంలో అవి కూడా లేకపోవడంతో నాలుగు జిల్లాలకు చెందిన ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అక్కడ నామమాత్రంగా చిన్నవి రెండు షామియానాలు మాత్రమే వేశారు. ఒక షామియాన వాహనాల పార్కింగ్‌కు సరిపోయింది. దీంతో నిలువ నీడలేక చాలామంది ఉద్యోగులు ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా పిల్లాపాపలతో వచ్చిన వారు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. అందులోనూ మహిళా ఉద్యోగులు మరింతగా ఇబ్బందులకు గురయ్యారు. కాగా, మండువేసవిలో కనీసం తాగునీటి సౌకర్యం కూడా కల్పించకపోవడం గమనార్హం. -
ఈ సారీ.. నిరాశే!
► రిమ్స్‌కు లభించని ఎంసీఐ అనుమతులు ► 600 మంది విద్యార్థుల భవితవ్యం ప్రశ్నార్థకం ఒంగోలు సెంట్రల్ : ఆశ.. నిరాశే అయింది. ఈ సారి కూడా రిమ్స్‌కు ఎంసీఐ అనుమతులు రాలేదు. కొన్ని చిన్న, చిన్న కారణాలను ఎత్తిచూపుతూ భారతీయ వైద్యమండలి రిమ్స్‌కు పూర్తి స్థాయి అనుమతులు ఇచ్చేందుకు అంగీకారం తెలపలేదు. ఈ మేరకు ఆన్లైన్లో రిమ్స్‌కు గురువారం ఎంసీఐ నుంచి ఆదేశాలు అందాయి. దీంతో 600 మంది వైద్య విద్యార్థుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. పూర్తిస్థాయి అనుమతులు వస్తేనే వైద్య విద్యార్థులకు ఇచ్చిన పట్టాలకు గుర్తింపు ఉంటుంది. లేకుంటే పీజీ ఎంట్రన్స్ రాయాలన్నా, ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలన్నా అర్హత ఉండదు. పనికిరాని పట్టాలు.. ఇప్పటికే ఒక బ్యాచ్ వైద్య విద్యార్థులు హౌస్ సర్జన్ షిప్‌ను పూర్తి చేసుకున్నారు. వైద్య పట్టాలు పుచ్చుకుని కూడా ఏం చేయడానికి వీలు గాక ఖాళీగా ఉంటున్నారు. ఏప్రిల్ నుంచి మరో బ్యాచ్ ఎంబీబీఎస్ పరీక్షలను పూర్తి చేసుకుని హౌస్ సర్జన్లుగా విధులు నిర్వహిస్తున్నారు. మరో 400 మంది ప్రస్తుతం రిమ్స్‌లో వైద్య విద్యను అభ్యసిస్తున్నారు. రిమ్స్‌కు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది కానీ, వైద్య విద్యను, వైద్యులను పర్యవేక్షించే భారతీయ వైద్య మండలి మాత్రం తగిన సౌకర్యాలు లేవని అనుమతులు ఇవ్వడం లేదు. ప్రజాధనం వృథా.. ఇప్పటి వరకూ మూడు నాలుగు సార్లు ఎంసీఐ పరిశీలనకు దరఖాస్తు చేసుకోవడంతో రూ. 10 లక్షలకు పైగా ప్రజాధనం వృథా అయింది. ఎంసీఐ పరిశీలించాలంటే వారికి దాదాపు రూ.3 లక్షలు ముందుగా చెల్లించాలి. ఇవి గాక వారు వచ్చినప్పుడు వసతి ఖర్చులు అదనం. ఇలా లక్షలాది రూపాయలు వృథా అయ్యాయి. సమస్యలు పరిష్కరించాం.. ఎంసీఐ అభ్యంతరాలను తాము పూర్తి చేశాం. వాటి ఫొటోలు తీసి ఎంసీఐకి పంపుతున్నాం. గతంలో రిమ్స్‌కు పూర్తిస్థాయిలో అనుమతులు రావడానికి రెండోసారి వచ్చిన సమయంలో లేవనెత్తిన అభ్యంతరాలను మూడో పర్యటనకు పరిష్కరించాం. అధికారులు వాటిని చూడకుండా కొత్తగా చిన్న, చిన్న కారణాలను ఎత్తిచూపుతూ అనుమతులు నిరాకరించారు. – డాక్టర్ వల్లీశ్వరి, రిమ్స్ డైరక్టర్ అభ్యంతరాలివీ.. ► రిమ్స్‌లో 600 ఎంఎ ఎక్స్‌కే విభాగంలో కిటికీలు ఉన్నాయి. ఎక్స్‌రే యంత్రం అమర్చిన గదిలో కిటికీలు ఉండకూడదు. ► లైబ్రరీలో 7,090 పుస్తకాలు ఉన్నప్పటికీ, వేరు, వేరు రచయితలవి లేవు. ► డెర్మటాలజీ విభాగంలో సీనియర్ రెసిడెంట్ వైద్యులు లేరు. ► ఇంటెన్సివ్ కరోనరీ కేర్ యూనిట్ (ఐసీసీ యూ)ను రిమ్స్‌లో ఏర్పాటు చేయలేదు. -
సమస్యలకు నిలయం పెద్దాస్పత్రి
► పనిచేయని లిఫ్టులు.. గోడలపై గుట్కా మరకలు ► ముక్కు మూసుకోనిదే నోఎంట్రీ ఎదులాపురం: జిల్లా కేంద్రంలోని పెద్దాస్పత్రి అయిన రిమ్స్ సమస్యలకు నిలయంగా మారింది. చెత్త కుండీల్లో చెత్త పేరుకుపోవడంతో దుర్గంధం వెదజల్లుతోంది. దీంతో ముక్కు మూసుకోనిదే ఆస్పత్రిలోనికి వెళ్లే పరిస్థితి లేదు. ఆస్పత్రిలో లిఫ్టులు పనిచేయకపోవడంతో రక్త పరీక్షలు, స్కానింగ్, ఎక్స్‌రే, ఇతర పరీక్షల కోసం రోగులను పైఅంతస్తు నుంచి కిందికి, కింది నుంచి పైఅంతస్తుకు తీసుకెళ్లాలంటే అవస్థలు ఎదురవుతున్నాయి. కొన్ని వార్డుల్లో గోడలు, మెట్లపై గుట్కా మరకలు దర్శనమిస్తున్నాయి. ఆయా వార్డుల్లోని కిటికీలకు అట్ట ముక్కలతో తాత్కాళికంగా తలుపులు అమర్చారు. అపరిశుభ్ర వాతారణం కారణంగా రోగుల వెంబడి వచ్చే వారు రోగాల బారిన పడే అవకాశాలు లేకపోలేదు. పనిచేయని లిఫ్ట్‌లు రిమ్స్ ఆస్పత్రిలో మొత్తం నాలుగు లిఫ్ట్‌లు ఉన్నాయి. అందులో మూడు పనిచేయడం లేదు. ఒక లిఫ్ట్ మాత్రమే పనిచేస్తుండటం, నాలుగు లిఫ్ట్‌లలో నుంచి ఏ లిఫ్ట్ ఎప్పుడు పనిచేస్తుందో సిబ్బందికే తెలియదంటే ఇక పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. పై అంతస్తుల్లో చికిత్స పొందుతున్న రోగులైతే రోజుకోసారైనా పరీక్షల నిమిత్తం కిందికి దిగాల్సి ఉంటుంది. దీంతో వారు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. కనీసం రోగులను తీసుకెళ్లే విధంగానైనా లిఫ్ట్‌లను అందుబాటులోకి తీసుకురావాలని రోగుల బంధువులు కోరుతున్నారు. గోడలు, మెట్లపై గుట్కా మరకలు పలు వార్డుల్లోని గోడలు, మూలలు, మెట్లపై గు ట్కా మరకలు దర్శనమిస్తున్నాయి. గతంలో ఆ స్పత్రిలోనికి వెళ్లేవారిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన సెక్యూరిటీ సిబ్బంది ఇప్పుడు పట్టించుకోవడం లేదు. ప్రజలను తనిఖీ చేసి మరీ వారి వద్ద ఉన్న గుట్కాలు, అంబర్ లాంటి మత్తు పదార్థాలను లోనికి అనుమతించలేదు. దీంతో ఆ సమయ ంలో ఇలాంటివి చోటుచేసుకోలేదు. ప్రస్తు తం గోడలు మరకలతో నిండుగా కనిపిస్తున్నాయి. వెదజల్లుతున్న దుర్గంధం ఆస్పత్రిలో ఎటు వెళ్లినా దుర్గంధం వెదజల్లుతోంది. మరుగుదొడ్లను శుభ్రం చేయకపోవ డం, రోజుల తరబడి చెత్తాచెదారం నిల్వ ఉండడంతో ఈ దుస్థితి నెలకొంది. నిత్యం వందల సంఖ్యలో వచ్చే ప్రజలు దుర్వాసనతో ఇబ్బ ందులు ఎదుర్కొంటున్నారు. నోటిపై గుడ్డను అడ్డుగా పెట్టి ఆస్పత్రిలోనికి వెళ్తున్నారు. -
నిన్న మామ.. నేడు అల్లుడు
► ఒకరికొకరు అంబులతో దాడి ► 24 గంటల్లో మామ, అల్లుడి మృతి ► అర్ధవీడు ఇందిరా నగర్లో ఘటన.. అర్ధవీడు : మామ, అల్లుడు పరస్పర అంబుల దాడి ఘటనలో తీవ్రంగా గాయపడిన అల్లుడు రిమ్స్‌లో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి గురువారం మృతి చెందాడు. వీరిద్దరూ బుధవారం రాత్రి అంబులతో ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో మామ అక్కడికక్కడే మృతి చెందిన విషయం తెలిసిందే. వివరాలు.. దోర్నాల మండలం కొర్రప్రోలు గిరిజన తండాకు చెందిన ఉడతల గురన్న (30)కు ఇద్దరు బార్యలు. మొదటి భార్య దుర్గమ్మకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఇందిరా నగర్‌కు చెందిన పులసల వెంకటేశ్వర్లు కుమార్తె గురమ్మను గురన్న (30) రెండో వివాహం చేసుకున్నాడు. గురమ్మ ఈ నెల 5వ తేదీన కుమారుడికి జన్మనిచ్చింది. బిడ్డ పుట్టినప్పటి నుంచి తన భార్యను కాపురానికి పంపాలంటూ గురన్న అత్తాగారింట్లోనే ఉంటున్నాడు. కుమార్తెను మూడో నెల తర్వాత కాపురానికి పంపుతానని మామ వెంకటేశ్వర్లు అల్లుడితో తెగేసి చెప్పాడు. ఇద్దరూ మద్యం తాగి గొడవకు దిగారు. ఎదురెదురుగా అంబులు వేసుకున్నారు. వెంకటేశ్వర్లు గొంతులో అల్లుడు వేసిన అంబు దిగడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. మామ అంబు వేయడంతో అల్లుడు గురన్న పొట్టలో దిగబడింది. ఆయన్ను చికిత్స కోసం తొలుత మార్కాపురం, ఆ తర్వాతో రిమ్స్‌కు తరలించారు. రిమ్స్‌లో చికిత్స పొందుతూ గురన్న కూడా మృతి చెందాడు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ సంఘటన స్థలాన్ని మార్కాపురం డీఎస్పీ శ్రీహరిబాబు, సీఐ శ్రీనివాసరావులు గురువారం పరిశీలించారు. వెంకటేశ్వర్లు బంధువుల నుంచి వివరాలు సేకరించారు. అర్ధవీడు ఎస్ఐ జి.కోటయ్య రిమ్స్‌కు వెళ్లి మృతదేహానికి పంచనామా చేశారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
వ్యక్తి ఆత్మహత్య
పెండ్లిమర్రి: పెండ్లిమర్రి మండలంలోని మమ్ముసిద్దుపల్లె గ్రామానికి చెందిన బండి చంద్రశేఖర్‌రెడ్డి (46) అనే వ్యక్తి శనివారం విషపు గుళికలు మింగి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు, పోలీసుల కథనం మేరకు చంద్రశేఖర్‌రెడ్డి అనారోగ్య సమస్య కారణంగా జీవితంపై విరక్తి చెంది విషపు గుళికలు మింగాడు. కుటుంబ సభ్యులు గమనించి కడప రిమ్స్‌కు తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం వేలూరుకు తీసుకెళ్తుండగా మార్గ మధ్యంలో మృతి చెందాడు. కమలాపురం ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్‌రెడ్డి, వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి, జెడ్పీటీసీ భాస్కర్, సింగల్ విండో అధ్యక్షుడు నాగేంద్రారెడ్డి తదితరులు మృతుడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానూభూతి తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రోషన్ తెలిపారు. -
యువకుని హత్య...ఆపై కాల్చివేత
కడప అగ్రికల్చర్: గుర్తు తెలియని యువకుడిని హత్య చేసి ఎక్కడినుంచో తీసుకొచ్చి జన సంచారం లేని ప్రాంతంలో రోడ్డు పక్కన పడేసి కాల్చివేసిన సంఘటన కడప నగర శివార్లలో చోటుచేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించి రిమ్స్ సీఐ మోహన్‌ప్రసాద్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కడప నగర శివార్లలోని కేంద్ర కారాగారం నుంచి రిమ్స్‌కు వెళ్లే బైపాస్ రహదారిలోని రైల్వేబ్రిడ్జి సమీపంలో 25–27 సంవత్సరాల మధ్య వయసున్న యువకుడిని ఆటోలో తీసుకొచ్చి పడవేసి కాల్చినట్లు తెలుస్తోంది. కాలిన మృతదేహాన్ని పరిశీలించగా గొంతుకు చున్నీ బిగించి చేతులు, కాళ్లు వెనక్కి మడచి ప్లాస్టిక్ వైరుతో కట్టి దారుణంగా హత్య చేసినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. అంతేకాకుండా ముఖం గుర్తు పట్టకుండా కాల్చేశారు. ఈ సంఘటన శనివారం తెల్లవారుజామున జరిగి ఉండవచ్చని సీఐ తెలిపారు. సంఘటన స్థలాన్ని కడప డీఎస్పీ ఈజీ అశోక్‌కుమార్ సందర్శించారు. -
అనారోగ్యంతో జీవిత ఖైదీ మృతి
కడప అర్బన్ : కడప కేంద్ర కారాగారంలో జీవిత ఖైదు అనుభవిస్తున్న బొరుసు శ్రీనివాసులు (47) కడప రిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ సంఘటనపై సీఐ మోహన్‌ప్రసాద్ తెలిపిన వివరాల మేరకు....వేంపల్లె పట్టణం శ్రీరామ్‌నగర్‌కు చెందిన బొరుసు శ్రీనివాసులు ఓ హత్య కేసులో నిందితుడిగా ఉంటూ 2011 ఏప్రిల్ 21న జీవిత ఖైదు పడడంతో కడప కేంద్ర కారాగారానికి వచ్చాడు. అప్పుడప్పుడు అనారోగ్యంతో బాధపడేవాడు. ఈ ఏడాది జనవరి 30న అనారోగ్యంతో బాధపడుతూ కడప రిమ్స్‌లో చేరాడు. మంగళవారం రిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. కడప కేంద్ర కారాగారం సూపరింటెండెంట్ లక్ష్మినరసయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
రిమ్స్‌ను సర్వతోముఖాభివృద్ధి చేస్తాం
– కలెక్టర్ కేవీ సత్యనారాయణ రిమ్స్ (కడప అర్బన్):రిమ్స్‌ను అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు తమ వంతు కృషి చేస్తామని వైద్య విద్యను అభ్యసిస్తున్న ప్రతి విద్యార్థి భవిష్యత్తులో ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని జిల్లా కలెక్టర్ కెవి సత్యనారాయణ అన్నారు. రిమ్స్ ప్రారంభమై 10 వసంతాలను పూర్తి చేసుకుని 11వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా శనివారం రాత్రి రిమ్స్ ఆడిటోరియంలో కాలేజ్ డే వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పవిత్రమైన వైద్య వృత్తిలో వున్న వారు కోర్సు పూర్తి కాగానే ప్రైవేట్ ప్రాక్టీస్‌లను పెట్టుకుని ధనార్జనే ధ్యేయంగా ముందుకు వెళ్లకుండా ప్రజలకు సేవ చేసే వైద్యులుగా పేరు తెచ్చుకోవాలన్నారు. రిమ్స్‌కు ఎంఆర్ఐ స్కానింగ్ తెప్పిస్తామన్నారు. వైద్యవిద్యార్థుల్లో విశేష ప్రతిభ కనపర్చిన వారికి నగదు రివార్డులను, గోల్డ్ మెడల్స్‌ను కలెక్టర్ అందజేశారు.రిమ్స్ డైరెక్టర్ మాజేటి శశిధర్, ప్రిన్సిపల్డాక్టర్ ఎం. వెంకటేశ్వర్లు, సూపరింటెండెంట్ డాక్టర్ టి. గిరిధర్, ఆర్ఎంఓ డాక్టర్ జంగం వెంకటశివ, రిమ్స్ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ ఎం. సురేశ్వర్ రెడ్డి, రిమ్స్ హెచ్‌డీఎస్ చైర్మన్ మురళీధర్ రెడ్డి, సభ్యుడు డాక్టర్ వారణాసి ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రిమ్స్‌లో పసికందు మృతి
కడప అర్బన్ : కడప నగర శివార్లలోని రిమ్స్ కాన్పుల వార్డులో సుమలత అనే మహిళ ఓ పసికందుకు జన్మనిచ్చింది. సదరు పసికందు చికిత్స పొందుతూ గురువారం మృతి చెందింది. ఈ సంఘటనపై బాధితులు తెలిపిన కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. లక్కిరెడ్డిపల్లె మండలం చౌటపల్లెకు చెందిన సుమలత, గంగరాజులు తమ బంధువులతో కలిసి ఈనెల 1వ తేదీన రిమ్స్‌కు వచ్చారు. ప్రసవ వేదనతో ఉన్న సుమలతను వార్డులో చేర్పించారు. అప్పటి నుంచి ఈనెల 9వ తేదీ వరకు సరిగా పట్టించుకోలేదు. ఉన్నట్లుండి గురువారం సుమలతను ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లి చిన్నపాటి ఆపరేషన్ నిర్వహించి పసికందుకు జన్మనిచ్చేలా వైద్యం చేశారు. అనంతరం ఆ బిడ్డకు ఉలుకూ, పలుకూ లేదు. ఎందుకిలా జరిగిందని వైద్యులను నిలదీశామని బాధితులు తెలిపారు. వారు బిడ్డ ఆరోగ్యంగా లేదని, తమవంతు వైద్య సహాయం చేశామని, నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని పేర్కొన్నారు. తమ పసిపాప మరణానికి వైద్యులే కారణమని, న్యాయం చేయాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మీడియాతో మాట్లాడుతూ తమ బిడ్డ మరణానికి రిమ్స్‌లో పనిచేస్తున్న వైద్యులే కారణమని ఆరోపించారు. ఈ సంఘటనపై రిమ్స్ ఆర్ఎంఓ డాక్టర్ జంగం వెంకట శివను వివరణ కోరగా సుమలత గర్భంలోనే మెడచుట్టూ పేగులు బిగించుకుని ఉన్నదని, వైద్యులు శతవిధాలా ప్రయత్నించినా బిడ్డను రక్షించలేక పోయారని తెలిపారు. తల్లి సుమలత క్షేమంగా ఉందని, వార్డులో చికిత్స పొందుతోందని తెలిపారు. -
అమ్మా మేమిక్కడ చదవలేం..!
♦ రిమ్స్‌లో ర్యాగింగ్ భూతం! ♦ గుంటూరు తరహా ఘటనలు జరగకుండా నివారణ చర్యలేవీ? ♦ ర్యాగింగ్ నిరోధక కమిటీల జాడ ఏదీ? ♦ ఫ్రెషర్స్‌డే రోజు వరకు వేధింపులు తప్పవా? సమాజంలో ఎంతో గౌరవప్రదమైన వ్యక్తి వైద్యుడు. ప్రజలు దేవుడితో సమానంగా వారిని చూస్తారు. అలాంటి వృత్తిలోకి త్వరలో వారంతా అడుగుపెట్టేవారే.. కానీ ఆ విలువలను కాలరాస్తూ తమ తర్వాత వచ్చేవారికి ఆదర్శంగా ఉండటం మాని వారితో వికృతంగా ప్రవర్తిస్తున్నారు. జూనియర్లను వేధిస్తూ వికృతానందం పొందుతున్నారు.. ఇటీవల కాలంలో రిమ్స్‌లో జరుగుతున్న ర్యాగింగ్ ఘటనలు వెలుగులోకి రాకపోరుునా.. బాధిత విద్యార్థులతల్లిదండ్రుల ద్వారా వినతులు మీడియాకు చేరుతున్నారుు. గుంటూరు లాంటి ఘటనలు చోటుచేసుకోకముందే అధికారులు మేల్కోవాల్సి ఉంది. అనంతపురం జిల్లాకు చెందిన ఓ విద్యార్థిని సీనియర్ విద్యార్థులు వేధిస్తున్నారు. ముఖ్యం గా రూమ్‌లో, బయట తరగతులకు వెళ్లేటపుడు, అధ్యాపకులు రాని సమయంలో ర్యాగింగ్ చేస్తున్నారు. మొదటిరోజు తనతోపాటు మరో ఇద్దరిని కూడా బహిరంగంగా హాస్టల్ వద్ద నిలిపి ఇబ్బందికరంగా ప్రవర్తించమని వేధించారు. ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితుల్లో తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఏడ్చాడు. నెల్లూరు జిల్లాకు చెందిన ఓ విద్యార్థిని దంత వైద్య కళాశాలలో ఇటీవలే చేరారు. ఆమెకు కేటారుుంచిన మంచాన్ని ఇవ్వకుండా సీనియర్ విద్యార్థులు ఇబ్బందులు పెట్టి, తాము చెప్పినట్లు చేయాలని వేధిస్తున్నారు. సదరు విద్యార్థిని తల్లిదండ్రులకు ఫోన్ చేసి బోరుమంది. తాను ఇక్కడ చదవలేనని, ఇంటికి వచ్చేస్తానని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఇద్దరు విద్యార్థుల తల్లిదండ్రు లు ’సాక్షి’కి ఫోన్ చేసి తమ ఆవేదన వ్యక్తం చేశా రు. పోలీసులు, కేసులు అంటే తమ కుమార్తె భయపడుతోందని, సున్నితంగా వ్యవహరించి ర్యాగింగ్, ఈవ్‌టీజింగ్‌ను అరికట్టాలని వారు విజ్ఞప్తిచేశారు. ఇలా బయటకు చెప్పుకోలేక పలువురు జూని యర్ విద్యార్థులు లోలోన కుమిలిపోతున్నారని తెలిసింది. కడప అర్బన్: కడప రిమ్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ప్రజల వైద్య కలల ప్రాకారం. 2006 నుంచి వైద్య విద్య కోర్సును అభ్యసించేందుకు 150మంది విద్యార్థులు వచ్చారు.. వస్తున్నారు. 2016-17 బ్యాచ్‌లో కూడా 150మంది విద్యార్థులు మొదటి సంవత్సరంలో అడుగుపెట్టారు. రిమ్స్‌లో తరగతులు ప్రారంభమయ్యేరోజు డెరైక్టర్, ప్రిన్సిపాల్, అధ్యాపక సిబ్బంది, వైద్య విద్యార్థులు, వారి తల్లిదండ్రుల సమక్షంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యను అభ్యసించాలని ఆహ్వానాలు పలుకుతూ సమావేశాలు నిర్వహించారు. కానీ ఇటీవల ర్యాగింగ్, ఈవ్‌టీజింగ్‌లాంటి భూతాలు మొదటి సంవత్సరం విద్యార్థులను పట్టిపీడిస్తున్నారుు. తమను సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ చేస్తున్నారని బాధితులు బయటకు చెప్పుకోలేకపోతున్నారు. తమ తల్లిదండ్రులకు ఫోన్ చేసి తాము ఇక్కడ చదవలేమని రోదిస్తున్నారు. ఈ వ్యవహారం బయటకు వెళితే తర్వాత భరతం పడతామని కూడా సీనియర్ విద్యార్థులు బెదిరిస్తున్నట్లు కూడా ఆరోపణలు వినిపిస్తున్నారుు. దసరా, దీపావళి సెలవులకు వెళ్లకముందే నూతనంగా రిమ్స్ కళాశాల ఆవరణలోకి అడుగుపెట్టిన వైద్య విద్యార్థులకు చేదు అనుభవాలు ఎదురయ్యారుు. ఈ విషయాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చారుు. గుంటూరు తరహా దురదృష్ట ఘటనలు చోటుచేసుకోకముందే అధికారులు స్పందించాల్సిన అవసరం ఉందని కొందరు జూనియర్ విద్యార్థులు కోరుతున్నారు. కళాశాల అధికారులు, అధ్యాపకులు, మరోవైపు పోలీసు యంత్రాంగం వారు కూడా అప్రమత్తమై విద్యార్థులకు అవగాహన కల్పించాలని బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు. కనిపించని కమిటీలు రాష్ట్రంలో వైద్య కళాశాలల్లోగానీ, ఇతర కళాశాలల్లోగానీ ర్యాగింగ్, ఈవ్‌టీజింగ్‌ల ద్వారా నష్టం జరిగినపుడు మాత్రమే ర్యాగింగ్, ఈవ్‌టీజింగ్‌ల కమిటీలు గుర్తుకొస్తారుు. అలాకాకుండా ప్రతి కళాశాలలోనూ ఈ కమిటీలను ఏర్పాటుచేసి ఫిర్యాదులను రహస్యంగా బాక్సుల్లో వేసేలా చర్యలు చేపట్టాలి. బాధితులు ఎవరైనా ఉంటే ఆ బాక్సులో ఫిర్యాదులు వేయవచ్చు. దంత వైద్య కళాశాలలో.. దంత వైద్య కళాశాలలో కూడా సీనియర్ విద్యార్థులు జూనియర్లపై జులుం ప్రదర్శిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నారుు. జూనియర్ విద్యార్థులకు కేటారుుంచిన మంచం, ఇతర వస్తువులను ఉపయోగించుకోకుండా సీనియర్ విద్యార్థినులు వేధిస్తున్నట్లు, సూటిపోటి మాటలతో దెప్పిపొడుస్తున్నట్లు బాధితులు తమ తల్లిదండ్రులకు చెప్పుకొని వాపోతున్నారు. ఫ్రెషర్స్‌డే రోజున అవగాహన కల్పిస్తాం రిమ్స్‌లో త్వరలో ఫ్రెషర్స్‌డే నిర్వహించనున్నాం. ఆకార్యక్రమంలో ఈవ్‌టీజింగ్, ర్యాగింగ్‌లపై అవగాహన కల్పిస్తాం. పోలీసు అధికారులతో కూడా చర్చించి తగిన ఏర్పాట్లు చేస్తాం. - డాక్టర్ మాజేటి శశిధర్, రిమ్స్ డెరైక్టర్, కడప ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతాం రిమ్స్ వైద్య కళాశాలలోగానీ, దంత వైద్య కళాశాలలోగానీ ర్యాగింగ్లు, ఈవ్‌టీజింగ్‌లు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటాం. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి విద్యార్థులకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తాం. తర్వాత కూడా మార్పురాకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. - మోహనప్రసాద్, రిమ్స్ సీఐ -
ట్రాక్టరుపై నుంచి పడి మహిళ మృతి
అట్లూరు: మండల పరిధిలోని కడప–బద్వేలు ప్రధాన రహదారిపై అటవీ చెక్‌పోస్టు సమీపాన గురువారం ఉదయం ట్రాక్టరుపై నుంచి కింద పడి మహిళ మృతి చెందినట్లు ఎస్ఐ మహమ్మద్‌రఫీ తెలిపారు. బద్వేలు మండలం చెన్నంపల్లి గ్రామానికి చెందిన ట్రాక్టరు వరిగడ్డి కోసం సిద్దవటం మండలానికి వెళుతుండగా అదే గ్రామానికి చెందిన ముమ్మనబోయిన సుబ్బరత్నమ్మ(40) ట్రాక్టర్ ఎక్కింది. అట్లూరు మండలం అటవీ చెక్‌పోస్టు సమీపానికి చేరుకునే సమయానికి ట్రాక్టరు వేగంగా వెళుతుండడంతో ట్రాక్టరుపై నుంచి సుబ్బరత్నమ్మ కింద పడింది. వెంటనే అదే ట్రాక్టరులో కడప రిమ్స్‌కు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టరు ధ్రువీకరించారు. ఈమేరకు పోస్టుమార్టం నిర్వహించి కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. -
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
వేంపల్లె : వేంపల్లె పట్టణ పరిధిలోని కడప – పులివెందుల బైపాస్ రోడ్డు వద్ద మదర్‌థెరిస్సా పాఠశాల దగ్గరలో మంగళవారం సాయంత్రం డి.వెంకటసుబ్బారెడ్డి అనే వ్యక్తి తీవ్ర గాయాలపాలై కడప రిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే ఇది రోడ్డు ప్రమాదమా.. ఎవరైనా దాడి చేసి అక్కడ పడేసి వెళ్లారా అనే అనుమానాలు బంధువులు వ్యక్తం చేస్తున్నారు. వివరాలలోకి వెళితే.. చక్రాయపేట మండలం మారెళ్లమడక గ్రామానికి చెందిన డి.వెంకటసుబ్బారెడ్డి వేంపల్లె శ్రీచైతన్య హైస్కూలు సమీపంలో నివాసముంటున్నారు. మంగళవారం సాయంత్రం పులివెందుల – కడప బైపాస్ రోడ్డులో మోటారు బైకు మీద వెళుతుండగా తీవ్ర గాయాలయ్యాయి. తలకు బలమైన గాయాలు కావడంతో స్థానికులు వేంపల్లె ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చి బంధువులకు సమాచారం అందించారు. అయితే ప్రమాదం జరిగిన తీరు చూస్తే బైకు ఒక చోట.. గాయపడిన వెంకటసుబ్బారెడ్డి మరోచోట పడి ఉండటంవల్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారా.. గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిందా అనేది స్పష్టంగా తెలియడంలేదు. గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని మృతుని బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. -
రోడ్డు ప్రమాదంలో ఇంజనీర్లు దుర్మరణం
చింతకొమ్మదిన్నె: వారు తమ స్నేహితుని వివాహానికి హాజరయ్యేందుకు కారులో బయలుదేరారు. మరో మూడు నిమిషాల్లో కల్యాణ మండపం వద్దకు చేరుకోవాల్సిన వారిని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు వెంట తీసుకెళ్లింది. సుదూర ప్రయాణం.. నిద్రమత్తు.. అలసట.. వేగం.. అన్నీ కలిపి ఇద్దరి నిండు ప్రాణాలను బలిగొన్నాయి. ఎదురుగా వస్తున్న లారీని ఒక్క సారిగా ఢీ కొనడంతో ఇరువురు స్నేహితులు మృత్యువాత పడగా.. మరో ఇద్దరు మృత్యువుతో పోరాడుతున్నారు. ఈ ప్రమాదాన్ని చూసిన ప్రతి ఒక్కరూ చలించి పోయారు. వివరాల్లోకి వెళితే... కర్నాటక రాష్ట్రం బెంగళూరులోని క్విన్టాల్స్ఫాంకో విజిలెన్స్ అనే కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా పని చేస్తున్న ప్రతీక్ (27 ఉత్తర ప్రదేశ్), అమృత్ ( 27, హైదరాబాదు), రవితేజ (27, రాజమండ్రి), సంతోష్ ( 27 తిరుపతి)లు కడప నగరంలోని తన స్నేహితుని వివాహానికి బెంగళూరు నుంచి కెఎ03 ఏసీ 1500 నెంబరు గల కారులో బయలుదేరారు. కల్యాణ మండపానికి మరో కిలోమీటరు దూరంలో ఉన్న ఊటుకూరులోని కృషి విజ్జాన కేంద్రం వద్దకు రాగానే ఉదయం 6.30 నిమిషాలకు కడప వైపు నుంచి బెంగళూరు వైపు వెళుతున్న టిఎన్ 37 సికె 3205 నెంబరు గల లారీని వీరి కారు వేగంగా ఢీ కొంది. ఈ ప్రమాదంలో ప్రతీక్ అక్కడికక్కడే మృతి చెందగా, అమృత్, రవితేజ, సంతోష్‌లు కారులో ఇరుక్కుపోయారు. స్థానికులు కారు తలుపులను పగులగొట్టి తీవ్రంగా గాయపడ్డ ముగ్గురిని 108 సహాయంతో రిమ్స్‌కు తర లించారు. రిమ్స్‌లో చికిత్స పొందుతూ అమృత్ తుది శ్వాస విడిచాడు. రవితేజ, సంతోష్‌లు చికిత్స పొందుతున్నారు. ప్రధాన రహదారిపై ప్రమాదం సంభవించడంతో వాహన రాకపోకలు 30 నిమిషాల పాటు నిలిచి పోయాయి. విషయం తెలుసుకున్న చింతకొమ్మదిన్నె ఎస్ఐ చాంద్‌బాషా, తమ సిబ్బందితో ఘటనా స్థలికి చేరుకుని ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి గాయాలు
– వీరిలో ప్రతిభా అవార్డు గ్రహీత విద్యార్థికి తీవ్రగాయాలు – తీవ్రంగా దెబ్బతిన్న ఇన్నోవా, ట్రాక్టర్ కడప అర్బన్ : కడప నగరం మరియాపురం సమీపంలోని పెట్రోల్ బంక్ ఎదురుగా ట్రాక్టర్, ఇన్నోవాను ఢీకొన్న ప్రమాదంలో ఐదుగురు గాయపడ్డారు. తృటిలో ఘోర ప్రమాదం తప్పింది. ఈప్రమాదంలో ప్రతిభా అవార్డు గ్రహీత తేజ (16) తీవ్రంగా గాయపడ్డాడు. తేజ బంధువులు ముగ్గురు, ట్రాక్టర్ డ్రైవర్ గాయపడ్డారు. సంఘటన జరిగిన వెంటనే గాయపడ్డవారిని రిమ్స్‌కు తరలించారు. క్షతగాత్రుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. రాయచోటి మాసాపేట గొల్లపల్లెకు చెందిన తేజ (16) గత విద్యా సంవత్సరంలో పదవ తరగతిలో అత్యధిక మార్కులు సాధించడంతో అతనికి ప్రతిభా అవార్డు దక్కింది. రెండు రోజుల క్రితం విజయవాడకు తన బంధువులతో కలిసి వెళ్లాడు. గత రాత్రి విజయవాడలో కార్యక్రమం ముగించుకుని తిరిగి రాయచోటికి శనివారం రాత్రి 7:30 గంటలకు ఇన్నోవా వాహనంలో బయలుదేరాడు. రాత్రి ఒంగోలులో రెండు గంటలపాటు విశ్రాంతి తీసుకున్నారు. అనంతరం కడప మీదుగా రాయచోటికి బయలు దేరారు. కడప మరియాపురం పెట్రోల్ బంక్ దగ్గరికి ఆదివారం తెల్లవారు జామున 5:30 గంటల సమయంలో రాగానే, అపుడే పెట్రోల్ బంక్‌లో నుంచి బాలాజీనగర్‌కు చెందిన ట్రాక్టర్ డ్రైవర్ రాముడు తన వాహనంతో వేగంగా రావడం, అదే సమయంలో ఇన్నోవా వాహనం వచ్చి ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. సంఘటన జరిగిన వెంటనే గాయపడ్డ తేజ, శ్రీనివాసులు, మోహన్‌రాజు, ప్రకాష్ , ట్రాక్టర్ డ్రైవర్ రాముడులను రిమ్స్‌కు తరలించారు. ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
వ్యక్తిపై హత్యాయత్నం
కడప అర్బన్ : కడపలోని చిన్నచౌకు పోలీసుస్టేషన్ పరిధిలో భాగ్యనగర్‌కు చెందిన లక్ష్మినారాయణరెడ్డి తన ఇంటి పక్కనున్న బాత్రూము పైపులైన్ పగులగొట్టించేందుకు గంగులయ్య అనే తన స్నేహితుని ద్వారా కూలీలను శనివారం ఉదయం పిలిపించాడు. వారు పని చేస్తుండగా సిద్దారెడ్డి, ఇంకా కొంత మంది కలిసి పక్కింటిలో నివసిస్తున్న రేవతి అలియాస్ అనసూయకు అనుకూలంగా లక్ష్మినారాయణరెడ్డిపై హత్యాయత్నానికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడిన లక్ష్మినారాయణరెడ్డి రిమ్స్‌లో చికిత్స పొందుతున్నాడు. బాధితుడి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సిద్దారెడ్డి, అతని కుమారుడు, రేవతి అలియాస్ అనసూయ, ఆమె కుమార్తె, అల్లుడు ఇంకా కొంత మందిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్ల చిన్నచౌకు ఎస్ఐ యోగేంద్ర తెలిపారు. -
ఉరేసుకుని మహిళ మృతి
కడప అర్బన్ : కడప నగరంలోని వన్‌టౌన్ పోలీసుస్టేషన్ పరిధిలో సియోనుపురంలో షాహినా (28) అనే వివాహిత ఇంటిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని మృతి చెందింది. ఆరు సంవత్సరాల క్రితం సుధీర్ అనే యువకుడితో ప్రేమ వివాహం చేసుకుంది. వీరికి మూడు సంవత్సరాల కుమార్తె కూడా ఉంది. ఎంసీఏ వరకు చదువుకున్న షాహినా వివాహమైనప్పటి నుంచి ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తుండేది. ఓవైపు పుట్టిల్లు, మరోవైపు మెట్టినిల్లు బంధువులు ఎవరూ కూడా దగ్గరికి రానీయకపోవడంతోపాటు భర్త వేధింపులు తట్టుకోలేక గురువారం తాను ఉంటున్న ఇంటిలోనే ఫ్యాన్‌కు చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈమె మృతి అనుమానాస్పదంగా ఉందని స్థానికులు, బంధువులు భావిస్తున్నారు. ఎవరూ లేని సమయంలో తలుపులు లోపల గడియ వేసుకుని ఉరి వేసుకోవడంతో వీఆర్వో సమక్షంలోనే పోలీసులు గడియ పగులగొట్టి లోనికి వెళ్లారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వన్‌టౌన్ ఎస్ఐ నాగరాజు తెలిపారు. ఈ సంఘటనపై పూర్తి విచారణ చేస్తే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని స్థానికులు అనుకుంటున్నారు. -
ఆచూకేది..?
ముందుకు సాగని మెడికోపై అత్యాచారం కేసు బెయిల్ ప్రయత్నంలో వైద్యుడు రాజీ కుదుర్చుకునేందుకు ప్రయత్నాలు..! డెరైక్టర్, డాక్టర్‌ను సస్పెండ్ చేయాలని కొనసాగుతున్న ఆందోళనలు ఆదిలాబాద్ క్రైం : తనపై అత్యాచారం చేశాడంటూ రిమ్స్ వైద్య విద్యార్థిని పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసి పది రోజలు గడుస్తున్నా కేసు ఇంకా ముందుకు సాగడం లేదు. సంబంధిత వైద్యుడు పరారీలో ఉండడం తో ఆచూకీ కోసం పోలీసులు గాలి స్తూనే ఉన్నారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసు లు వైద్యుడి అరెస్టులో జాప్యం జరుగుతుండడంతో కేసు నీరుగారిపోయే ప్రమాదం ఉన్నట్లు తెలుస్తోంది. బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే డాక్టర్ సందీప్ పవార్ తరఫు న్యాయవాది కేసుకు సంబంధించిన పత్రాలు తీసుసుకున్నారు. పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్న వైద్యుడు బెయిల్ వచ్చే వరకు అజ్ఞాతంలో ఉండేలా ప్రయత్నాలు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రత్యేక పోలీసు బృందం వైద్యుడి కోసం గాలిస్తోంది. ఈ క్ర మంలో మొదటి రోజు వైద్యుడి ఫోన్ సిగ్నల్ దొరికినప్పటికీ ఆ తర్వాత నుంచి పత్తా లేకుండా పోయినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లో ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు సదరు పోలీసు బృందం ఇప్పటికే హైదరాబాద్‌కు చేరుకుంది. ఎలాంటి కేసైనా సాంకేతికంగా త్వరగా గుర్తించి పట్టుకోవడానికి ప్రయత్నించే పోలీసులు ఈ కేసులో మాత్రం వెనుకబడిపోయారని తెలుస్తోంది. రాజీ కుదిర్చేందుకు ప్రయత్నాలు.. ఇదిలా ఉంటే.. వైద్యుడిపై కేసును వెనక్కి తీసుకోవాలంటూ విద్యార్థినిపై రిమ్స్ అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతున్నట్లు సమాచారం. విద్యార్థినితో రాజీ కుదిర్చేందుకు వైద్యుడి సంబంధీకులతోపాటు, కొంత మం ది నేతలు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. వీలైంత త్వరగా కేసును పక్కదారి పట్టించేందుకే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. డాక్టర్‌కు రిమ్స్ అధికారులు కూడా మద్దతు తెలుపడంతో విద్యార్థిని వైపు నుంచి రిమ్స్‌లో ఎవరూ సహాయం చేయకుండా చూస్తున్నారు. తల్లిదండ్రులను వదిలేసి ఎంతో దూరం నుంచి వచ్చి రిమ్స్‌పై నమ్మకంతో తమ పిల్లలను ఇక్కడ వదిలేసి పోతున్నారు. కానీ.. రిమ్స్ అధికారులు మాత్రం వారికి భద్రత కల్పించడంలో విఫలమయ్యారు. కొనసాగుతున్న ఆందోళనలు.. రిమ్స్ డెరైక్టర్ అశోక్‌ను తొలగించాలని, మరోవైపు డాక్టర్ సందీప్ పవార్‌ను అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్‌తో పది రోజులుగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. మెడికల్ విద్యార్థినికి మద్దతుగా అన్ని సంఘాలు, పార్టీలు, మహిళా సమాఖ్యలు మద్దతు తెలుపుతున్నాయి. రిమ్స్ డెరైక్టర్, డాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం దళిత సంఘాలు జిల్లా కేంద్రంలో రాస్తారోకో చేపట్టగా, భారత జాతీయ మహిళా సమాఖ్య నాయకులు సీపీఐ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మెడికోపై అత్యాచారం చేసిన డాక్టర్ సందీప్ పవార్, విద్యార్థినికి మతిస్థిమితం లేదని డాక్టర్ మద్దతు పలికి రిమ్స్ డెరైక్టర్ అశోక్‌పై వెంటనే చర్యలు చేపట్టాలన్నారు. కేసు నమోదు చేసి ఇన్ని రోజులైనా పోలీసులు జాప్యం చేయడం సరైంది కాదన్నారు. విద్యాబుద్ధులు చెప్పే ప్రొఫేసరే ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడడం సిగ్గుచేటన్నారు. ఇలాంటి సంఘటనలు జరుగకుండా భద్రత చర్యలు చేపట్టాలన్నారు. వైద్యుడి కోసం గాలిస్తున్నాం.. వైద్యుడి ఆచూకీ కోసం ప్రత్యేక పోలీ సు బృందాన్ని పంపించాం. వైద్యుడి కాల్‌డేటా ఆధారంగా వివరాలు సేకరిస్తున్నాం. మొదట్లో హైదరాబాద్, తదితర ప్రాంతాల్లో ఉన్నట్లు సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా గుర్తించాం. ప్రస్తుతం సెల్ స్విచ్ ఆఫ్ వస్తుండడంతో హైదరాబాద్‌లోని తన బంధువుల ఇళ్లలో తనిఖీలు చేయిస్తున్నాం. వీలైనంత త్వరగా అరెస్టు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. - సత్యనారాయణ, వన్‌టౌన్ సీఐ -
కీచక వైద్యుడి అరెస్టుకు రంగం సిద్ధం..
⇒ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసిన పోలీసులు ⇒ వివిధ పార్టీలు, దళిత, మహిళా సంఘాల ఆందోళనలు ఆదిలాబాద్ క్రైం : అన్ని వైపుల నుంచి ఒత్తిడి పెరగడంతో రిమ్స్ వైద్య విద్యార్థినిపై అత్యాచారం కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే అత్యాచారం కేసు నమోదు చేసిన పోలీసులు సీనియర్ వైద్యుడు సందీప్ పవార్ అరెస్టుకు రంగం సిద్ధం చేశారు. ఎస్సై, ఏఎస్సై, కానిస్టేబుళ్లతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి అతడి కోసం గాలిస్తున్నారు. అతడి కాల్‌డాటా సేకరణతో పాటు, ఆయన సంబంధీకుల వివరాలు సేకరిస్తున్నారు. మరోవైపు రిమ్స్ డెరైక్టర్ అశోక్‌ను తొలగించాలని, సందీప్ పవార్‌ను అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని, ఆయన ప్రైవేట్ క్లినిక్‌ను మూసివేయాలనే డిమాండ్ ఊపందుకుంది. దళిత సంఘాలు, వివిధ పార్టీలు ఇప్పటికే ఈ విషయంలో ఆందోళన చేపట్టగా తాజాగా మహిళ సంఘాలు కూడా డాక్టర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధిత వైద్య విద్యార్థినికి న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. పలు రాజకీయ పార్టీలు, దళిత, గిరిజన, మహిళ సంఘాలు ఆందోళనలు చేస్తున్పటికీ రిమ్స్ అధికారులు స్పందించకపోవడం శోచనీయం. గతంలోనే తనను వేధిస్తున్నాడంటూ రిమ్స్ అధికారులకు ఫిర్యాదులు చేసిన దీనిపై ఎలాంటి విచారణ చేయకుండానే చేతులెత్తేశారనే ఆరోపణలున్నారుు. సంబంధిత వైద్యుడికి సహకరించేందుకే అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మహిళా సంఘాల ఆందోళనలు డాక్టర్ సందీప్ పవార్‌పై చర్యలు తీసుకోవాల ని డిమాండ్ చేస్తూ ఆదివారం రిమ్స్ ఆస్పత్రి ప్రధాన ద్వారం వద్ద శ్రీసాయి మహిళ సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. డాక్టర్‌ను సస్పెండ్ చేయాలని సంఘం అధ్యక్షురాలు బియ్యాల అనుసూయ డిమాండ్ చేశారు. సంఘం సభ్యులు జ్యోతి, త్రిశూల, రేణుక, రేఖ, తదితరులు పాల్గొన్నారు. రిమ్స్ డెరైక్టర్‌ను విధుల నుంచి తొలగించాలి రిమ్స్ డాక్టర్ సందీప్ పవార్‌ను, కేసును పక్కదారి పట్టిస్తున్న రిమ్స్ డెరైక్టర్ అశోక్‌ను పదవి నుంచి తొలగించాలని రాష్ట్ర అంబేద్కర్ సంఘం నాయకులు ఆదివారం మానవహక్కుల కమిషన్‌కు పోస్టు ద్వారా వినతిపత్రం పంపించారు. డాక్టర్ సందీప్ పవార్‌ను వెంటనే అరెస్టు చేయాలని, పోలీసులు ఆలస్యం చేస్తే కేసు పక్కదారిపట్టే అవకాశముందని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు భోజనం రాములు అన్నారు. సుదూరప్రాంతాల నుంచి చదువుకోవడానికి వచ్చిన విద్యార్థినిలకు రక్షణ కరువైందని, బాధితురాలికి మతిస్థిమితం లేదని నమ్మించిన డెరైక్టర్ అశోక్‌పై చర్యలు తీసుకోవాలన్నారు. -
మత్స్యకారుని ప్రాణం తీసిన ‘వల’
చెన్నూరు : ‘వలతో చేపలు పట్టి జీవించే మత్స్యకారుని అదే వల ప్రాణాలు తీసిన సంఘటన చెన్నూరు వద్ద పెన్నానదిలో మంగళవారం చోటు చేసుకొంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం స్థానిక బెస్తకాలనీకి చెందిన జింకా సంటెయ్య(65) మత్సకారుడు. ఐదు దశాబ్దాలుగా చేపలు పట్టి జీవిస్తున్నాడు. మంగళవారం మధ్యాహ్నం చేపలు పట్టేందుకు స్థానిక పెన్నానది వద్దకు వెళ్లిన సంటెయ్య వల వేసి చేపలు పడుతున్నాడు. చేపలు పడక పోవడంతో కాస్త లోపలికి వెళ్లి వలవేశాడు. వల తీస్తుండగా నీటి ఉధృతికి నిలవలేక పక్కకు వచ్చేందుకు ప్రయత్నించాడు. ఇంతలో తాను విసిరిన వల కాళ్లకు చుట్టుకుని నీటిలోకి కొట్టుకుపోయాడు. కాళ్లు ఆడివ్వడానికి వీలు లేక పోవడంతో ఈత బాగా వచ్చే సంటెయ్య స్థానిక మత్స్యకారులు చూస్తుండగానే మునిగిపోయాడు. స్థానికులు మృత దేహాన్ని బయటకు తీశారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్ట కోసం కడప రిమ్స్‌కు తరలించారు. -
బిడ్డలు పుట్టేందుకు మందు ఇస్తామని మోసం
రామచంద్రాపురం(కమలాపురం): బిడ్డలు పుట్టేందుకు మందు ఇస్తామని చెప్పి దంపతులను మోసం చేసిన ఘటన కమలాపురం మండలం రామచంద్రాపురంలో మంగళవారం చోటు చేసుకుంది. 108 సిబ్బంది తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. మండల పరిధిలోని రామచంద్రాపురానికి చెందిన ప్రేమకుమారి, దానమయ్యలకు రెండేళ్ల క్రితం వివాహమైంది. అయితే ఇంత వరకు వారికి సంతానం కలగ లేదు. మంగళవారం గుర్తు తెలియని ఒక మహిళ, ఒక పురుషుడు గ్రామంలోకి వచ్చి బిడ్డలు పుట్టేందుకు నాటు మందు ఇస్తామని ప్రచారం చేసుకుంటూ వెళ్లారు. దీంతో బిడ్డలపై మమకారం పెంచుకున్న ప్రేమకుమారి వారిని పిలిచి మందు ఇవ్వాలని కోరింది. రు.3500 తీసుకుని వారు నాటు మందు ప్రేమ కుమారి ఇంట్లోనే తయారు చేసి ఇచ్చారు. ఆ మందు తాగిన అర గంట నుంచి ప్రేమకుమారికి విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది. దీంతో 108 వాహనంలో చికిత్స నిమిత్తం రిమ్స్‌కు తరలించారు. ఇరుగు పొరుగు వారు తేరుకొని చూసే సరికి మందు ఇచ్చిన వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ విషయంపై పోలీసులను వివరణ కోరగా తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని, బాధితురాలు రిమ్స్‌లో ఫిర్యాదు చేస్తే అక్కడి పోలీసులు కేసు నమోదు చేసి తమకు బదిలీ చేస్తారని తెలిపారు. -
స్వచ్ఛభారత్‌లో వైద్య ఉద్యోగులు
ఆదిలాబాద్ రిమ్స్ : జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రిలో మంగళవారం తెలంగాణ వైద్య ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు బండారి కృష్ణ ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహించారు. రిమ్స్ డైరెక్టర్ అశోక్‌తో పాటు వైద్య ఉద్యోగులు పాల్గొని రిమ్స్ ఆస్పత్రి ఆవరణలోని మురికి కాలువల పూడికను తీసివేశారు. పిచ్చిమొక్కలు, గడ్డి, చెత్తను తొలగించి శుభ్రం చేశారు. ముఖ్యంగా ఓపీ విభాగం ఎదుట ఆవరణలో వర్షం నీరు నిల్వ ఉండకుండా కాలువలు తీసి నీటిని మురికి కాలువలకు మళ్లీంచారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు బండారి కృష్ణ మాట్లాడుతూ స్వచ్ఛ రిమ్స్ ఆస్పత్రిగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలన్నారు. జిల్లాలోని వైద్య ఉద్యోగులు ఆస్పత్రి పరిసరాలను పరిశుభ్రం చేసేందుకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య ఉద్యోగుల సంఘం జిల్లా కోశాధికారి అనిల్, మహిళ విభాగం అధ్యక్షురాలు శారద, బీడీ కార్మిక సంఘం నాయకురాలు అనుసూయ, నాయకులు శ్రీకాంత్, రమణాచారి, నవీద్, ప్రమోద్, సెక్యూరిటీ అధ్యక్ష, కార్యదర్శులు నగేష్, మోహన్, గంగారెడ్డి, వామన్లు పాల్గొన్నారు. -
రిమ్స్‌కు మరో 50 ఎంబీబీఎస్ సీట్లు
కడప అర్బన్ : రిమ్స్‌లో మరో 50 ఎంబీబీఎస్ సీట్లు కేటాయించేందుకు ఎంసీఐకి ప్రతిపాదనలు పంపామని, అవి వచ్చేందుకు కృషి చేస్తామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. ప్రస్తుతం రిమ్స్‌లో ఏడు విభాగాల్లో పీజీ సీట్లు ఉన్నాయని, ఆర్థోపెడిక్, రేడియాలజీ, పిడియాట్రిక్స్ విభాగాల్లో పీజీలు వచ్చేందుకు కృషి చేస్తామన్నారు. మంత్రి కామినేని శ్రీనివాస్ శనివారం ఉదయం రిమ్స్ ఆస్పత్రి, కళాశాల ఆవరణాల్లో పలు విభాగాలను పరిశీలించారు. ఓపీ, ఐపీ విభాగాల్లో రోగులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు. రిమ్స్ ఐపీ విభాగంలోని సీఎం క్యాంపు ఆఫీసు ఫర్ మెడికల్ కన్సెల్టెన్సీని ప్రారంభించారు. కళాశాలలోని విద్యార్థుల హాస్టళ్లను పరిశీలించారు. వారి మెస్‌లను తనిఖీ చేశారు. ఓపీ విభాగంలోని బయో కెమిస్ట్రీలో వివిధ అనలైజర్ యంత్రాలను, క్షయ నిర్ధారణను తెలియజేసే సీబీ నాట్ యంత్రాన్ని, డెంగీ నిర్ధారించే ఎలీజా యంత్రాన్ని ప్రారంభించారు. రిమ్స్‌లోనే రూ. 1.06 కోట్లతో నిర్మించబోయే జిల్లా బాలల భవిత కేంద్రం నిర్మాణం కోసం శంకుస్థాపన చేశారు.తర్వాత మొక్కలు నాటి నీరు పోశారు. అనంతరం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. తన పర్యటన ముగించుకుని మీడియాతో మాట్లాడారు. రిమ్స్‌ను అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు. తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ విధానం ప్రస్తుతం 78 శాతం అమలులో ఉందని, దాన్ని వంద శాతానికి తీసుకెళ్లాలని పేర్కొన్నారు. ఎంఆర్ఐ స్కానింగ్ పరీక్షలను ప్రైవేటు భాగస్వామ్యం పద్ధతిలో ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా మరో వారంలో రిమ్స్‌లో ప్రవేశ పెడతామని తెలిపారు. డాక్టర్ల కొరతను అధిగమించేందుకు త్వరలో చర్యలు తీసుకుంటామన్నారు. డయాలసిస్ విభాగంలో ప్రస్తుతం 17 యూనిట్లు ఉన్నాయని, మరో 18 యూనిట్లను స్థాపించేందుకు సిద్దం చేస్తున్నామన్నారు. వీటిల్లో 10 యూనిట్లు ప్రొద్దుటూరు జిల్లా ఆస్పత్రిలోనూ, ఎనిమిది కడప రిమ్స్ ఆస్పత్రిలో ప్రస్తుతం ఉన్న డయాలసిస్ కేంద్రానికి అనుబంధంగా ఏర్పాటు చేస్తామన్నారు. దంత వైద్య కళాశాలకు ప్రత్యేకంగా కమిటీ అవసరం లేదని, రిమ్స్ హెచ్‌డీఎస్ కమిటీ వారే పర్యవేక్షించి మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలన్నారు. మంత్రి వెంట శాసనమండలి డిప్యూటీ చైర్మన్ ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ కేవీ సత్యనారాయణ, అడిషనల్ డీఎంఈ బాబ్జి, రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ శశిధర్, ప్రిన్సిపాల్ డాక్టర్ వెంకటేశ్వర్లు, సూపరింటెండెంట్ డాక్టర్ గిరిధర్ తదితరులు పాల్గొన్నారు. ఆర్ఎంఓ డాక్టర్ వెంకట శివ, డీఎంహెచ్ఓ డాక్టర్ సత్యనారాయణరాజు, వైద్య సిబ్బంది అధికారులు పాల్గొన్నారు. -
మెడిసిన్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
ఆదిలాబాద్ రిమ్స్: డాక్టర్ వేధింపులు భరించలేకపోతున్నానంటూ ఆత్మహత్యాయత్నం చేసిందో వైద్యవిద్యార్థిని. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ వైద్య కళాశాలలో చోటుచేసుకున్న ఈ సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాల మండలం తర్లపాడుకు చెందిన యువతి రిమ్స్ లో ఎంబీబీఎస్ సెకండియర్ చదువుతోంది. రిమ్స్ ఆసుపత్రిలోనే జనరల్ ఫిజీషియన్ గా పనిచేస్తున్న వ్యక్తి ఆమెను కొంతకాలంగా వేధిస్తున్నాట్లు తెలిసింది. ఈ క్రమంలోనే శుక్రవారం ఆసుపత్రి ఓపీ భవనంపైకి ఎక్కిన విద్యార్థిని.. కిందికి దూకి ఆత్మహత్యకు యత్నించింది. ఇది గమనించిన ఆసుపత్రి సిబ్బంది ఆమెను అడ్డుకున్నారు. వైద్యుడు తనను లైంగికంగా, మానసికంగా వేధిస్తున్నాడని, ఈ విషయం తల్లిదండ్రులకు చెప్పినా పట్టించుకోవడంలేదని అందుకే చనిపోవాలనుకుంటున్నట్లు బాధిత విద్యార్థిని వెల్లడించింది. తండ్రి మాటలతో గందరగోళం సిబ్బంది ఇచ్చిన సమాచారంతో రిమ్స్ కు చేరుకున్న పోలీసులు విద్యార్థిని తల్లిదండ్రులను పిలిపించి మాట్లాడగా.. అమ్మాయి ఆరోగ్య పరిస్థితి బాగోలేదని ఆమె తండ్రి పోలీసులకు చెప్పాడు. దీంతో కాసేపు గందరగోళ వాతావరణం ఏర్పడింది. అనంతరం బాధితురాలికి చికిత్స నిమిత్తం హైదరాబాద్ తరలిస్తామని, వేధింపుల వ్యవహారంపై దర్యాప్తు చేస్తామని టూ టౌన్ ఎస్సై విష్ణు వెల్లడించారు. కాగా, వైద్యుడితో పాటు కొంత మంది విద్యార్థులు కూడా ఆమెను వేధించినట్లు తెలుస్తోంది. బాధితురాలి ఆరోగ్యం కుదుటపడిన తర్వాతగానీ నిజానిజాలు వెలుగులోకి రావని పోలీసులు భావిస్తున్నారు. -
ప్రజా ఉద్యమంలా మొక్కలు నాటాలి
కడప అర్బన్ : రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృతృంలో ‘వనం–మనం’ కార్యక్రమం చేపడుతున్నామనీ, ఇందులో రాష్ట్ర వ్యాప్తంగా కోటి మొక్కలను ప్రజా ఉద్యమంలా నాటాలని సంకల్పించామని రాష్ట్ర మానవ వనరుల, విద్యాశాఖ, జిల్లా ఇన్చార్జి మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం కడప నగర శివార్లలోని రిమ్స్ సమీపంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో కడప నగర వనం ప్రాంగణంలో ‘వనం– మనం’ కార్యక్రమాన్ని మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కోటి మొక్కలను నాటే కార్యక్రమం చేపట్టామన్నారు. ఇందులో భాగంగా జిల్లాలో 11.48 లక్షల మొక్కలను నాటుతామని జిల్లా కలెక్టర్ కేవీ సత్యనారాయణ ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఈ మొక్కలను నాటడంతో సరిపెట్టకుండా ప్రతి ఒక్కరూ పది మొక్కలను నాటి వాటిని సంరక్షించే బాధ్యతను తీసుకోవాలన్నారు. శాసనమండలి డిప్యూటీ చైర్మన్ ఎస్వి సతీష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ఎర్రచందనం చెట్లను అవగాహన లేని సమయంలో వంటచెరకుగా వాడిన సందర్భాలున్నాయన్నారు. జిల్లా కలెక్టర్ కెవి సత్య నారాయణ మాట్లాడుతూ జిల్లాలో ప్రకృతి కరుణించి 30 సెంటీ మీటర్లకు పైగా వర్షపాతం నమోదైందన్నారు. చిన్నారుల చేతుల మీదుగా మొక్కలు నాటే అవకాశం దక్కడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో అటవీ శాఖ అడిషనల్ పీసీసీఎఫ్ ఉదయ భాస్కర్, జిల్లాజాయింట్ కలెక్టర్ శ్వేత తేవతీయ, డీఎఫ్ఓ బి.ఎం.దివాన్ మైదీన్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసుల రెడ్డి, నాయకులు హరిప్రసాద్, గోవర్ధన్ రెడ్డి, సురేష్ నాయుడు, దుర్గాప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో వ్యాసరచన, వక్తృత్వ పోటీలలో ప్రతిభ కనపర్చిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. గ్రీష్మ అనే చిన్నారి ప్రదర్శించిన కూచిపూడి నృత్యం అందరినీ ఆకట్టుకుంది.కార్యక్రమం ముగింపులో మొక్కల పెంపకంపై అందరూ ప్రతిజ్ఞ చేశారు. -
ప్రజా ఉద్యమంలా మొక్కలు నాటాలి
కడప అర్బన్ : రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృతృంలో ‘వనం–మనం’ కార్యక్రమం చేపడుతున్నామనీ, ఇందులో రాష్ట్ర వ్యాప్తంగా కోటి మొక్కలను ప్రజా ఉద్యమంలా నాటాలని సంకల్పించామని రాష్ట్ర మానవ వనరుల, విద్యాశాఖ, జిల్లా ఇన్చార్జి మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం కడప నగర శివార్లలోని రిమ్స్ సమీపంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో కడప నగర వనం ప్రాంగణంలో ‘వనం– మనం’ కార్యక్రమాన్ని మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కోటి మొక్కలను నాటే కార్యక్రమం చేపట్టామన్నారు. ఇందులో భాగంగా జిల్లాలో 11.48 లక్షల మొక్కలను నాటుతామని జిల్లా కలెక్టర్ కేవీ సత్యనారాయణ ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఈ మొక్కలను నాటడంతో సరిపెట్టకుండా ప్రతి ఒక్కరూ పది మొక్కలను నాటి వాటిని సంరక్షించే బాధ్యతను తీసుకోవాలన్నారు. శాసనమండలి డిప్యూటీ చైర్మన్ ఎస్వి సతీష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ఎర్రచందనం చెట్లను అవగాహన లేని సమయంలో వంటచెరకుగా వాడిన సందర్భాలున్నాయన్నారు. జిల్లా కలెక్టర్ కెవి సత్య నారాయణ మాట్లాడుతూ జిల్లాలో ప్రకృతి కరుణించి 30 సెంటీ మీటర్లకు పైగా వర్షపాతం నమోదైందన్నారు. చిన్నారుల చేతుల మీదుగా మొక్కలు నాటే అవకాశం దక్కడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో అటవీ శాఖ అడిషనల్ పీసీసీఎఫ్ ఉదయ భాస్కర్, జిల్లాజాయింట్ కలెక్టర్ శ్వేత తేవతీయ, డీఎఫ్ఓ బి.ఎం.దివాన్ మైదీన్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసుల రెడ్డి, నాయకులు హరిప్రసాద్, గోవర్ధన్ రెడ్డి, సురేష్ నాయుడు, దుర్గాప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో వ్యాసరచన, వక్తృత్వ పోటీలలో ప్రతిభ కనపర్చిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. గ్రీష్మ అనే చిన్నారి ప్రదర్శించిన కూచిపూడి నృత్యం అందరినీ ఆకట్టుకుంది.కార్యక్రమం ముగింపులో మొక్కల పెంపకంపై అందరూ ప్రతిజ్ఞ చేశారు. -
రిమ్స్‌లో పీజీ విద్యార్థులు ఉత్తీర్ణత
రిమ్స్ (కడప అర్బన్ ): కడప రిమ్స్‌లో పిజీ విద్యార్థుల పరీక్షల ఫలితాల్లో పరీక్షలు రాసిన 16 మంది పిజి విద్యార్థులు తమ విభాగాల్లో ఉత్తీర్ణత సాధించినట్లు రిమ్స్ ప్రిన్సిపాల్ డాక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. రిమ్స్‌లోని పిజి విభాగాలైన అనస్తీషియా, డెర్మటాలజీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఈఎన్టి, ఆప్తమాలజీ (కంటి విభాగం), గైనకాలజీ తదితర విభాగాల్లో ఉత్తీర్ణత సాధించారు.