పిచ్చి మొక్కలు తొలగిస్తున్న వైద్య ఉద్యోగులు
స్వచ్ఛభారత్‌లో వైద్య ఉద్యోగులు
Published Tue, Aug 2 2016 11:29 PM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM
ఆదిలాబాద్ రిమ్స్ : జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రిలో మంగళవారం తెలంగాణ వైద్య ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు బండారి కృష్ణ ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహించారు. రిమ్స్ డైరెక్టర్ అశోక్‌తో పాటు వైద్య ఉద్యోగులు పాల్గొని రిమ్స్ ఆస్పత్రి ఆవరణలోని మురికి కాలువల పూడికను తీసివేశారు. పిచ్చిమొక్కలు, గడ్డి, చెత్తను తొలగించి శుభ్రం చేశారు. ముఖ్యంగా ఓపీ విభాగం ఎదుట ఆవరణలో వర్షం నీరు నిల్వ ఉండకుండా కాలువలు తీసి నీటిని మురికి కాలువలకు మళ్లీంచారు.
ఈ సందర్భంగా అధ్యక్షుడు బండారి కృష్ణ మాట్లాడుతూ స్వచ్ఛ రిమ్స్ ఆస్పత్రిగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలన్నారు. జిల్లాలోని వైద్య ఉద్యోగులు ఆస్పత్రి పరిసరాలను పరిశుభ్రం చేసేందుకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య ఉద్యోగుల సంఘం జిల్లా కోశాధికారి అనిల్, మహిళ విభాగం అధ్యక్షురాలు శారద, బీడీ కార్మిక సంఘం నాయకురాలు అనుసూయ, నాయకులు శ్రీకాంత్, రమణాచారి, నవీద్, ప్రమోద్, సెక్యూరిటీ అధ్యక్ష, కార్యదర్శులు నగేష్, మోహన్, గంగారెడ్డి, వామన్‌లు పాల్గొన్నారు.
Advertisement