health employees
-
టీకా వేయించుకున్న ఆశా కార్యకర్త మృతి
యశవంతపుర: కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న ఆశా కార్యకర్త మృతి చెందిన ఘటన కర్ణాటకలో బెళగావి జిల్లా చిక్కోడి తాలూకాలో జరిగింది. 33 ఏళ్ల ఆశా కార్యకర్త జనవరి 22న కరోనా టీకా వేయించుకుంది. 30వ తేదీన ఆమెకు ఎక్కువగా వాంతులయ్యాయి. దీంతో బెళగావి జిల్లా ఆస్పత్రిలో చేర్చారు. ఈ నెల 3న ఆమె మృతి చెందారు. మెదడులో రక్తం గడ్డ కట్టడమే మరణానికి కారణమని పోస్టుమార్టం నివేదికలో పేర్కొన్నారు. ఆమె తలనొప్పితో బాధపడుతూ తరచూ మందులను వాడేవారని కుటుంబసభ్యులు తెలిపారు. ఆమె మరణానికి కరోనా వ్యాక్సిన్ కారణం కాదని వైద్యులు తెలిపారు. కలబురిగిలో ఆరుమంది ఆస్పత్రిపాలు .. కలబురిగిలో శుక్రవారం మధ్యాహ్నం కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న ఆరుమంది వైద్యారోగ్య సిబ్బంది అస్వస్థతకు గురయ్యారు. జ్వరం, తలనొప్పి, వాంతులు రావడంతో రాత్రి 7 గంటలకు ఆరుమందినీ కలబురిగి ఆస్పత్రిలో చేర్పించారు. ప్రాణాపాయ సమస్య లేదని వైద్యులు తెలిపారు. -
స్వచ్ఛభారత్‌లో వైద్య ఉద్యోగులు
ఆదిలాబాద్ రిమ్స్ : జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రిలో మంగళవారం తెలంగాణ వైద్య ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు బండారి కృష్ణ ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహించారు. రిమ్స్ డైరెక్టర్ అశోక్‌తో పాటు వైద్య ఉద్యోగులు పాల్గొని రిమ్స్ ఆస్పత్రి ఆవరణలోని మురికి కాలువల పూడికను తీసివేశారు. పిచ్చిమొక్కలు, గడ్డి, చెత్తను తొలగించి శుభ్రం చేశారు. ముఖ్యంగా ఓపీ విభాగం ఎదుట ఆవరణలో వర్షం నీరు నిల్వ ఉండకుండా కాలువలు తీసి నీటిని మురికి కాలువలకు మళ్లీంచారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు బండారి కృష్ణ మాట్లాడుతూ స్వచ్ఛ రిమ్స్ ఆస్పత్రిగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలన్నారు. జిల్లాలోని వైద్య ఉద్యోగులు ఆస్పత్రి పరిసరాలను పరిశుభ్రం చేసేందుకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య ఉద్యోగుల సంఘం జిల్లా కోశాధికారి అనిల్, మహిళ విభాగం అధ్యక్షురాలు శారద, బీడీ కార్మిక సంఘం నాయకురాలు అనుసూయ, నాయకులు శ్రీకాంత్, రమణాచారి, నవీద్, ప్రమోద్, సెక్యూరిటీ అధ్యక్ష, కార్యదర్శులు నగేష్, మోహన్, గంగారెడ్డి, వామన్లు పాల్గొన్నారు.