
యశవంతపుర: కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న ఆశా కార్యకర్త మృతి చెందిన ఘటన కర్ణాటకలో బెళగావి జిల్లా చిక్కోడి తాలూకాలో జరిగింది. 33 ఏళ్ల ఆశా కార్యకర్త జనవరి 22న కరోనా టీకా వేయించుకుంది. 30వ తేదీన ఆమెకు ఎక్కువగా వాంతులయ్యాయి. దీంతో బెళగావి జిల్లా ఆస్పత్రిలో చేర్చారు. ఈ నెల 3న ఆమె మృతి చెందారు. మెదడులో రక్తం గడ్డ కట్టడమే మరణానికి కారణమని పోస్టుమార్టం నివేదికలో పేర్కొన్నారు. ఆమె తలనొప్పితో బాధపడుతూ తరచూ మందులను వాడేవారని కుటుంబసభ్యులు తెలిపారు. ఆమె మరణానికి కరోనా వ్యాక్సిన్ కారణం కాదని వైద్యులు తెలిపారు.
కలబురిగిలో ఆరుమంది ఆస్పత్రిపాలు ..
కలబురిగిలో శుక్రవారం మధ్యాహ్నం కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న ఆరుమంది వైద్యారోగ్య సిబ్బంది అస్వస్థతకు గురయ్యారు. జ్వరం, తలనొప్పి, వాంతులు రావడంతో రాత్రి 7 గంటలకు ఆరుమందినీ కలబురిగి ఆస్పత్రిలో చేర్పించారు. ప్రాణాపాయ సమస్య లేదని వైద్యులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment