Asha activists
-
ఆశ కార్యకర్తపై హత్యాచారం
గుంటూరు(మాచర్ల): ఆశ కార్యకర్తపై ముగ్గురు లైంగికదాడి చేసి తర్వాత హత్య చేసిన ఘటన ఆలస్యంగా ఆదివారం వెలుగులోకి వచ్చింది. పల్నాడు జిల్లా మాచర్ల మండలం అనుపు చెంచుకాలనీకి చెందిన మహిళ (46) కొప్పునూరు, నాగులవరం పంచాయతీ పరిధిలోని అనుపు చెంచుకాలనీ, బీకెవీ పాలెం చెంచుకాలనీలలో ఆశ కార్యకర్తగా పనిచేస్తున్నారు. లస్కర్‌కు ఆమె రెండో భార్య. లస్కర్ మొదటి భార్య సాయితో గ్రామ శివారులోని పొలంలో ఉంటున్నాడు. ఈ నెల 16న సాయంత్రం లస్కర్ తన రెండో భార్యతో మాట్లాడి వెళ్లాడు. 17న ఉదయం ఇంటికి రాగా ఆమె కనిపించలేదు. పక్క ఇంటిలో ఉంటున్న ఆమె తండ్రి లాలు, లస్కర్ కలిసి గ్రామంలో ఆమె కోసం వెతికారు. ముత్తయ్య సమాచారంతో బీకేవీపాలెంకు.. గ్రామానికి చెందిన మండ్లి ముత్తయ్యను తన భార్య కనిపించిందా అని లస్కర్ అడిగాడు. దీనికి అతను రాత్రి 9 గంటలకు తన సెల్‌ఫోన్ పోయిందని ఆమె తమ ఇంటివైపు వచ్చిందని, ఆ సమయంలో ఇక్కడే ఉన్న బీకేవీ పాలెంకు చెందిన సావిటి చిన్న అంజి, శీలం అంజి, శీలం భైస్వామి తమ గ్రామంలో వెంకన్న అనే వ్యక్తి పోయిన సెల్‌ఫోన్ ఎక్కడ ఉందో కనిపెడతాడని చెప్పారని, దీంతో ఆమె వారితోపాటు ఆ గ్రామానికి వెళ్లిందని చెప్పాడు. లస్కర్ బీకేవీపాలెంలోని వెంకన్న వద్దకు వెళ్లి ఆరా తీశాడు. తన దగ్గరకు వచ్చిన మాట నిజమేనని, అయితే సెల్ స్విచ్ఆఫ్లో ఉందని, తరువాత రోజు వస్తే చూస్తానని చెప్పడంతో ఆమె ఆ ముగ్గురితో కలిసి వెళ్లిపోయిందని వివరించాడు. నేరం అంగీకరించిన నిందితులు దీంతో అనుమానమొచ్చిన లస్కర్‌తోపాటు గ్రామస్తులు సావిటి చిన అంజి, శీలం అంజిలను గట్టిగా ప్రశ్నించారు. ముగ్గురం లైంగికదాడి చేశామని, ఆ సమయంలో ఆమె గొడవ చేయటంతో శీలం అంజి రాయితో తల మీద కొట్టాడని చెప్పారు. తీవ్ర గాయం కావడంతో ఆమె మృతి చెందిందని వివరించారు. రోడ్డు పక్కన రెండు బండరాళ్ల మధ్య బాధితురాలి మృతదేహాన్ని ఉంచి తాటాకులు కప్పామని వెల్లడించారు. ఘటనాస్థలాన్ని చూపించారు. లస్కర్, గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించటంతో ముగ్గురు నిందితులు చిన అంజి, అంజి, భైస్వామిలను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. మృతురాలికి ఆరుగురు కుమార్తెలు. ముగ్గురికి వివాహమైంది. పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్‌రెడ్డి ఘటన స్థలాన్ని పరిశీలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. గతంలోనూ నేరాలు సావిటి చిన అంజి, శీలం అంజికి గతంలోనూ నేర చరిత్ర ఉంది. 2020 జనవరిలో వెల్దుర్తి మండలం గుడిపాడు చెరువు గ్రామానికి చెందిన మహిళ హత్యాచారం కేసులో వీరు నిందితులు. -
‘అందుకే ఆత్మహత్యాయత్నం.. నన్ను ఎవరూ బెదిరించలేదు..’
రాప్తాడు: ‘‘ఉద్యోగం పోతుందనే భయంతోనే నేను ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాను. నన్ను ఎవరూ బెదిరించలేదు. దీన్ని ఎవరూ రాజకీయం చేయవద్దండి. పరిటాల సునీత దీన్ని రాజకీయం చేయడం చాలా బాధగా ఉంది’’ అని ఎం.చెర్లోపల్లి గ్రామానికి చెందిన ఆశా కార్యకర్త కపాడం అనిత అన్నారు. బుధవారం ఆమె రాప్తాడులో విలేకరులతో మాట్లాడారు. తాను పది సంవత్సరాలుగా ఆశా కార్యకర్తగా పని చేస్తున్నానని, గ్రామంలో కొందరు టీడీపీ నాయకులు తన ఉద్యోగం పోతుందని చెప్పడంతో భయాందోళనతో ఈ నెల 19న విష ద్రావకం తాగానన్నారు. వెంటనే తనను అనంతపురంలోని ప్రభుత్వ సర్వజనాస్పత్రికి తరలించి చికిత్స చేయించారన్నారు. అయితే తాను ఆస్పత్రిలో ఉన్న సమయంలో మాజీ మంత్రి పరిటాల సునీత పరామర్శించారని, ఆ తర్వాత దీన్ని రాజకీయంగా వాడుకునేందుకు ప్రయత్నించారన్నారు. తనను రాజకీయ పావుగా వాడుకునేందుకు ప్రయత్నించడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. తనను గ్రామంలోని వైఎస్సార్సీపీ నాయకులు ఎవరూ ఎలాంటి వేధింపులకు గురి చేయలేదన్నారు. ఇంతకు మించి ఈ ఘటనపై రాజకీయ రాద్ధాంతం తగదన్నారు. చదవండి: అవినీతి గని.. నాటి సీఎం రిలీఫ్ నిధి ప్రకృతి ఆరాధన: చెట్టు మానులే దేవతామూర్తులు.. -
రాసలీలల వీడియో.. ఆశా కార్యకర్త సస్పెన్షన్
రాయచూరు రూరల్/కర్ణాటక: విజయపుర జిల్లా ఇండి తాలూకా తాంబ్రా ప్రాథమిక ఆరోగ్యం కేంద్రంలో విధులు నిర్వహిస్తూ రాసలీలలో పాల్గొన్న ఆశా కార్యకర్తను సస్పెండ్ చేశారు. ఈ విషయంపై జిల్లా ఆరోగ్య శాఖాధికారి రాజ్‌కుమార్ మాట్లాడుతూ, సీసీ కెమెరాలో రికార్డు అయిన రాసలీల సాక్ష్యాధారాన్ని ఆధారంగా సేవల నుంచి తొలగించినట్లు తెలిపారు. కాగా గ్రామ పంచాయతీ సభ్యుడు, ఆశా కార్యకర్త చేష్టలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇక మాజీ మంత్రి రమేశ్ జార్కిహోళి రాసలీలల సీడీ కేసు ఉదంతంపై విచారణ జరుగుతున్న సమయంలో ఈ వీడియో బయటకు రావడం కలకలం రేపింది. చదవండి: కర్ణాటక: మరో రాసలీల వీడియో వైరల్ రాసలీలల కేసు: కోర్టుకు హాజరైన యువతి -
కర్ణాటక: మరో రాసలీల వీడియో వైరల్
రాయచూరు రూరల్/కర్ణాటక: విజయపుర జిల్లాలో ఆశా కార్యకర్త, జీపీ సభ్యుడి రాసలీల వీడియో వైరల్ అయింది. ఇండి తాలూకా తాంబ్రాలోని ప్రభుత్వాస్పత్రిలో సోమవారం ఈ ఉదంతం చోటు చేసుకున్నట్లు వెలుగులోకి వచ్చింది. తాంబ్రా పంచాయతీ సభ్యుడితో ఆశా కార్యకర్త ఆస్పత్రిలో రాసలీల కేళిలో పాల్గొన్న దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. వారు చేసిన చిలిపి చేష్టల వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. కాగా మాజీ మంత్రి రమేశ్ జార్కిహోళి రాసలీలల సీడీ కేసు ఉదంతాన్ని ప్రజలు మరువక ముందే మరో వీడియో వైరల్ కావడం చర్చకు దారితీసింది. చదవండి: రాసలీలల కేసు: కోర్టుకు హాజరైన యువతి సీడీ యువతి తల్లికి అనారోగ్యం -
టీకా వేయించుకున్న ఆశా కార్యకర్త మృతి
యశవంతపుర: కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న ఆశా కార్యకర్త మృతి చెందిన ఘటన కర్ణాటకలో బెళగావి జిల్లా చిక్కోడి తాలూకాలో జరిగింది. 33 ఏళ్ల ఆశా కార్యకర్త జనవరి 22న కరోనా టీకా వేయించుకుంది. 30వ తేదీన ఆమెకు ఎక్కువగా వాంతులయ్యాయి. దీంతో బెళగావి జిల్లా ఆస్పత్రిలో చేర్చారు. ఈ నెల 3న ఆమె మృతి చెందారు. మెదడులో రక్తం గడ్డ కట్టడమే మరణానికి కారణమని పోస్టుమార్టం నివేదికలో పేర్కొన్నారు. ఆమె తలనొప్పితో బాధపడుతూ తరచూ మందులను వాడేవారని కుటుంబసభ్యులు తెలిపారు. ఆమె మరణానికి కరోనా వ్యాక్సిన్ కారణం కాదని వైద్యులు తెలిపారు. కలబురిగిలో ఆరుమంది ఆస్పత్రిపాలు .. కలబురిగిలో శుక్రవారం మధ్యాహ్నం కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న ఆరుమంది వైద్యారోగ్య సిబ్బంది అస్వస్థతకు గురయ్యారు. జ్వరం, తలనొప్పి, వాంతులు రావడంతో రాత్రి 7 గంటలకు ఆరుమందినీ కలబురిగి ఆస్పత్రిలో చేర్పించారు. ప్రాణాపాయ సమస్య లేదని వైద్యులు తెలిపారు. -
వ్యాక్సిన్: బ్రెయిన్ డెడ్ అయిన ఆశా వర్కర్ మృతి
సాక్షి, నగరంపాలెం (గుంటూరు): కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న అనంతరం అస్వస్థతకు గురై.. బ్రెయిన్ డెడ్ అయిన ఆశా కార్యకర్త ఆదివారం వేకువజామున మృతి చెందింది. గుంటూరు ప్రభుత్వాస్పత్రి వైద్యులు ఈ విషయం వెల్లడించారు. వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాకకు చెందిన బొక్కా విజయలక్ష్మి (42) ఆశా కార్యకర్తగా పీహెచ్సీలో పరిధిలో విధులు నిర్వర్తిస్తోంది. ఆమెకు భర్త సాంబశివరావు, కుమారులు సాయికుమార్, శరత్‌కుమార్ ఉన్నారు. ఈ నెల 20న విజయలక్ష్మి కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకుంది. అనంతరం తలనొప్పి, వాంతులు, మూర్ఛ వంటి లక్షణాలతో స్పృహ కోల్పోయింది. చదవండి: (వికటించిన వ్యాక్సిన్.. ఆశ కార్యకర్త బ్రెయిన్ డెడ్!) ఆమెను మెరుగైన వైద్యసేవల కోసం ఈ నెల 22న గుంటూరు జీజీహెచ్‌కు తరలించగా.. ఆస్పత్రిలోని బ్రెయిన్ స్ట్రోక్ విభాగంలో ఉంచి వైద్యసేవలు అందించారు. ఆమె బ్రెయిన్ స్టెమ్ స్ట్రోక్‌కు గురికాగా, శనివారం రాత్రి బ్రెయిన్ డెడ్ అయి.. ఆదివారం వేకువజామున మృతి చెందింది. విషయం తెలుసుకున్న కలెక్టర్ శామ్యూల్ ఆనంద్‌కుమార్, జాయింట్ కలెక్టర్ ప్రశాంతి, డీఎంహెచ్‌వో జె.యాస్మిన్, ఆస్పత్రి సూపరింటెండెంట్ ఎన్.ప్రభావతి మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆశ కార్యకర్త విజయలక్ష్మి మృతి చెందడం చాలా బాధాకరమన్నారు. కరోనా విజృంభిస్తున్న తరుణంలో ప్రతి ఒక్కరూ ఎంతో సమర్థంగా విధులు నిర్వర్తించారని తెలిపారు. మృతురాలి కుటుంబం అర్హతను పరిశీలించి ఇంటి స్థలం ఇవ్వడంతో పాటు, ఆమె కుమారుడికి ఉద్యోగ అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. నష్ట పరిహారం కింద రూ.50 లక్షలు చెల్లించే విషయమై రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేస్తామన్నారు. చదవండి: (వరంగల్: టీకా తీసుకున్న హెల్త్‌కేర్ వర్కర్ మృతి) -
వికటించిన వ్యాక్సిన్.. ఆశ కార్యకర్త బ్రెయిన్ డెడ్!
సాక్షి, గుంటూరు (మెడికల్): కోవిడ్ వ్యాక్సిన్ వికటించి ఆశ కార్యకర్తకు బ్రెయిన్ డెడ్ అయినట్టు సమాచారం అందగా.. మరో ఏఎన్ఎం అస్వస్థతకు గురై కోలుకుంటోంది. వివరాలివీ.. తాడేపల్లి పీహెచ్సీ పరిధిలోని ఆరోగ్య కార్యకర్త (ఏఎన్ఎం) గొట్టిముక్కల లక్ష్మి (38), ఆశ కార్యకర్త బొక్కా విజయలక్ష్మి (42)కి ఈ నెల 20న కోవిడ్ వ్యాక్సిన్ వేశారు. తరువాత ఏఎన్ఎం లక్ష్మికి తలనొప్పి, ఫిట్స్ రాగా.. విజయలక్ష్మి తలనొప్పి, మగత, వాంతులు వంటి లక్షణాలతో స్పృహ కోల్పోయింది. దీంతో వారిద్దరినీ ఈ నెల 22న జీజీహెచ్‌లో చేర్చించారు. చదవండి: (వ్యాక్సిన్: ఆసుపత్రిలో అంగన్వాడీ టీచర్) ఆందోళన వల్ల ఏఎన్ఎం లక్ష్మికి రియాక్షన్ వచ్చిందని, చికిత్స అందించిన వెంటనే సాధారణ స్థితికి చేరుకుని డిశ్చార్జి అయ్యేందుకు సిద్ధంగా ఉందని జీజీహెచ్ వైద్యులు తెలిపారు. ఆశ కార్యకర్త విజయలక్ష్మి బ్రెయిన్ స్టెమ్ స్ట్రోక్‌కు గురైనట్టు తేల్చారు. శనివారం రాత్రి ఆమెకు బ్రెయిన్ డెడ్ అయినట్టు సమాచారం. అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. ఇదిలావుండగా.. విజయలక్ష్మికి వేసిన వయల్ నుంచే మరో వైద్యుడికి టీకా వేసినా అతనికి ఎలాంటి రియాక్షన్ లేకపోవడం గమనార్హం. డీఎంహెచ్‌వో డాక్టర్ జొన్నలగడ్డ యాస్మిన్, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ చుక్కా రత్నమన్మోహన్ జీజీహెచ్‌కు చేరుకుని వారిద్దరి పరిస్థితిపై ఆరా తీశారు. -
‘ఆశ’ నెరవేరింది
సాక్షి, కాశినాయన(కడప) : ఆశా కార్యకర్తలకు ఇక నుంచి నెలకు రూ.10 వేలు వేతనం లభించనుంది. ప్రభుత్వం ఈమేరకు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయంతో జిల్లాలో 2100 మంది ఆశా కార్యకర్తలకు ప్రయోజనం కలగనుంది. ఉత్తర్వులు వెలువడటంతో వారంతా హర్షాతిరేకం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు వీరికి నెలకు గౌరవ వేతనంగా రూ.3 వేలు చెల్లించేవారు. అదనంగా చేసిన సేవలకు కొంత మొత్తం ఇన్సెంటివ్‌గా చెల్లించేవారు. నెలకు రూ.6 వేల వరకు వచ్చేది. గర్భవతి వివరాల నమోదు మొదలుకుని సకాలంలో టీకాలు ఇప్పించడం, ప్రభుత్వ ఆసుపత్రులకు ప్రసవానికి తీసుకురావడం జరిగింది. బిడ్డకు అన్ని టీకాలు వేయించడం వంటి పనుల్లో సాయం అందించినందుకు వైద్య, ఆరోగ్యశాఖ విభాగం అధికారులు వీరికి నెలకుఇన్సెంటివ్ చెల్లించేది. ప్రతి నెల వారికి ఇది ఓ ప్రహసనంగా ఉండేది. క్షేత్రస్థాయిలో ఎంపీహెచ్ఏ నుంచి సేకరించిన నివేదికల ఆధారంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు జిల్లా కార్యాలయానికి సేవలకు సంతృప్తి వ్యక్తం చేస్తూ నివేదిక పంపిస్తేనే ప్రోత్సాహక నగదు ముట్టేది. సరైన రీతిలో కొందరికి ఇన్సెంటివ్ జమ అయ్యేది కాదు. ఇలాంటి ఆశా కార్యకర్తలకు ఇకపై ఇబ్బందులు ఇక తొలగనున్నాయి. రూ.10 వేల గౌరవ వేతనం అందనుంది. పెంచిన ఆగస్టు నుంచి అమల్లోకి వస్తుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. అంటే సెప్టెంబర్ 1వ తేదీన కొత్త వేతానలు రూ.10 వేలు జమ అవుతాయి. ఎంతో ఆనందంగా ఉంది : ప్రతి నెల రూ.10 వేలు ఇచ్చేలా ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందని తెలిసి చాలా ఆనంద పడుతున్నాం. ఇది మా కుటుంబాలకు తీపి కబురే. అయితే మాకు ఆరు నెలల ప్రోత్సాహక డబ్బులు అందాలి. వాటి గురించి కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే ఎంతో మేలు జరుగుతుంది. కె.విజయలక్ష్మి, ఆశావర్కర్ ఇన్నాళ్లకు గుర్తింపు వచ్చింది : దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి హయాంలో విధుల్లో చేరాం. ఇన్నాళ్లు సేవచేసినందుకు మేలు జరిగింది. జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అవడంతో మా కష్టాలు తొలగిపోయాయి. నెలకు రూ.10 వేలు ఇచ్చేలా ఆదేశాలు వచ్చాయని మా డాక్టర్లు చెప్పారు. సంతోషంగా ఉంది. -
అడిఆశలు చేశారు!
మండపేట: గ్రామీణ ప్రజల ఆరోగ్య పరిరక్షణలో కీలక భూమిక పోషిస్తున్న ఆశ వర్కర్లు ఐదు నెలలుగా జీతాలు అందక అవస్థలు పడుతున్నారు. కుటుంబ పోషణ భారమై అర్ధాకలితో అలమటిస్తున్నారు. జీతాల పెంపు హామీని తుంగలోకి తొక్కిన చంద్రబాబు సర్కారు, జీతాలు విడుదలను కూడా నిలిపివేసిందని ఆశ వర్కర్లు మండిపడుతున్నారు. జిల్లాలోని ఆశ వర్కర్లకు ఐదు నెలలకుగాను రూ.19.35 కోట్ల మేర వేతన బకాయిలు పేరుకుపోయాయి. కనీస వేతనానికి నోచుకోని ఆశ వర్కర్లను వెబ్సైట్లో ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడంతో ప్రభుత్వ పథకాల లబ్ధికి దూరం చేసిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారి ఆరోగ్య పరిరక్షణకు ఆశ వర్కర్లు పాటుపడుతున్నారు. కుష్ఠు, టీబీ, తదితర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారిని గుర్తించి వారికి వైద్య సహాయం అందించడంతో పాటు 104 శిబిరాల నిర్వహణలో వీరు సేవలందిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు 4,500 మంది ఆశ వర్కర్లు ఉన్నారు. గతంలో ఆశ వర్కర్లు ఒక్కొక్కరికి గౌరవ వేతనం రూ.3 వేలు, పారితోషికం రూ.2 వేలు చెల్లించేవారు. గత ఎన్నికల్లో ఆశ వర్కర్ల వేతనాలు పెంచుతామని చంద్రబాబు ఇచ్చిన హామీ అమలుకు నోచుకోలేదు. సార్వత్రిక ఎన్నికల ముందు నవంబర్‌లో చంద్రబాబు నిర్వహించిన ప్రజాదర్భారులో పారితోషికం రూ.5,600, గౌరవ వేతనం రూ.3 వేలు చొప్పున అందజేస్తామని ఇచ్చిన హామీ కార్యరూపం దాల్చలేదు. తమకు ఇచ్చే వేతనాలు, పారితోషికం పెంచకపోగా జనవరి నుంచి మొత్తం చెల్లింపులు నిలిపివేశారని ఆశ వర్కర్లు మండిపడుతున్నారు. ఒక్కొక్కరికి నెలకు రూ.8,600గాను జిల్లాలోని ఆశ వర్కర్లకు నెలకు రూ.3.87 కోట్లు చొప్పున ఐదు నెలలకు రూ.19.35 కోట్లు చెల్లించాల్సి ఉంది. తమతో వెట్టిచాకిరీ చేయించుకుంటున్న ప్రభుత్వం పనికి తగిన వేతనం ఇవ్వకపోగా జీతాలు నిలిపివేసిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యూనిఫాం అలవెన్సులు ఇవ్వడం లేదని, 104 సంచార వైద్యసేవలకు సంబంధించి బిల్లులు చెల్లించడం లేదని వారంటున్నారు. పెంచిన జీతాలు, బిల్లు బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వెబ్సైట్లో ప్రభుత్వ ఉద్యోగులుగా నమోదు ఆశ వర్కర్లు అందరూ పేద వర్గాలకు చెందిన వారే. చంద్రబాబు సర్కారు వీరిని వెబ్సైట్లో ప్రభుత్వ ఉద్యోగులుగా నమోదు చేయడంతో ప్రభుత్వ పథకాల లబ్ధికి వీరిని దూరం చేసింది. కనీస వేతనాలకు నోచుకోని తమను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తూ తమ పిల్లలకు ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్, నిరుద్యోగభృతి తదితర ఏ పథకాలకు ఎంపిక చేయడం లేదని వాపోతున్నారు. జీతాలు పెంచుతామని, వెబ్సైట్ నుంచి పేర్లు తొలగిస్తామని హామీ ఇచ్చిన టీడీపీ ప్రభుత్వం తమ ఆశలను అడియాశలు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
ఆశ వర్కర్లకు షరతులు వర్తిస్తాయి!
ఎన్నో పోరాటాలు చేశారు. పోలీసు దెబ్బలు తిన్నారు. అవమానాలు చవిచూశారు. ఏమైతేనేం అనుకున్నది సాధించామని సంతోషించారు. ఇచ్చింది స్వల్పమైనా అనంతానందం పొందారు. కృతజ్ఞతతో సన్మానాలు చేశారు. చిత్రాలకు పాలాభిషేకం చేశారు. ఇంతలోనే వారి ‘ఆశ’లపై నీళ్లు చల్లుతూ కొత్త ఉత్తర్వులు వెలుడ్డాయి. ఇదీ ఆశ వర్కర్లపై సర్కారు అనుసరించిన వైఖరి. ముఖ్యమంత్రి తమ కోర్కెలు తీర్చేశారని సంబరపడితే... కొత్తగా పెట్టిన కండిషన్లతో వారంతా ఇప్పుడు గగ్గోలు పెడుతున్నారు. బొబ్బిలి: అరవ చాకిరీ చేయించుకుంటూ కూడా ఆశ వర్కర్లకు వేతనం పెంచామని సన్మానాలు, సత్కారాలు, పాలాభిషేకాలు చేయించుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసలు స్వరూపం మరోసారి బహిర్గతమైంది. ఆశ వర్కర్ల వేతనం పెంపు వెనుక పెద్ద కుట్రే దాగి ఉందని నిరూపించారు. పెంచిన వేతనం రూ.5,600 అందా లంటే ప్రతీ ఆశ వర్కర్ నెలకు నలుగురు గర్భిణులను నమోదు చేసి, నాలుగు డెలివరీలు చేయించాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు. వేతనాల కోసం ఏటా ఎదురు చూస్తున్న ఆశ వర్కర్లకు నెలకు రూ.3 వేలు, పారితోషకంగా మరో మూడు వేలుఇస్తామన్న రాష్ట్ర సర్కారు ఇప్పుడు రూ.5,600ను ప్రకటించింది. ఆ డబ్బులు కూడా లక్ష్యాన్ని సాధిస్తేనే ఇస్తామని చెప్పడంతో ఇప్పుడు ఆశ వర్కర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా సేవలు వినియోగించుకుని ఇలా లక్ష్యాలను విధించడం అన్యాయమని వారు వాపోతున్నారు. పోరాటంతో దిగొచ్చిన సర్కారు జిల్లాలో 5,600 మంది ఆశ వర్కర్లున్నారు. వీరిని సబ్ సెంటర్ల వారీగా ప్రభుత్వ అవసరాలకు వినియోగించుకుంటున్నారు. వివిధ సర్వేలు, పల్స్‌పోలియో, చిన్నారులకు టీకాలు వంటి కార్యక్రమాలకు ఇంటింటికీ తిరుగుతూ ఒళ్లు హూనం చేసుకుంటున్నా... వారికి నెలకు ఇచ్చేది మూడు వేలే. ఈ సొమ్మును మరో మూడు వేలు పెంచి ఆరు వేలు చేస్తున్నామని కొద్ది నెలల క్రితం ప్రకటించారు. కానీ దానిని అమలు చేయలేదు. ఇక అందరి మాదిరి వారూ ఆందోళనలకు దిగారు. పోలీసులచేత ఈడ్చివేతలు... అధికారులతో ఛీత్కారాలు తిన్నారు. ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం ఆరు వేలు కాదని, రూ.5,600 ఇస్తామని ప్రకటించారు. తాజాగా పెట్టిన మెలికలు వెయ్యి జనాభా నుంచి రెండు వేల జనాభా ఉన్న సబ్ సెంటర్ల వారీగా లక్ష్యాలు విధించారు. ఒక్కొక్కరూ నలుగురు గర్భిణులను నమోదు చేయాలి, నాలుగు డెలివరీలు చేయించాలి. వీటితో పాటు నలుగురు బిడ్డలకు మీజిల్స్ వేయించాలి. మరో నాలుగు బూస్టర్ డోసులు వేయించాలి. ఇలా రోజూ వారు గర్భిణుల కోసం, బాలింతల కోసం వెతకాల్సిందే. ఒక వేళ ఆ ప్రాంతంలో గర్భిణులు లేకపోతే వీరికి వేతనం లేనట్టేనని చెబుతున్నారని ఆశా వర్కర్లు వాపోతున్నారు. బర్త్సర్టిఫికెట్లు అంగన్వాడీలకు అప్పగించాలి ఆశ వర్కర్లు తాము పనిచేస్తున్నట్టు రుజువు చేసేందుకు సవాలక్ష నిబంధనలు విధించింది ప్రభుత్వం. బిడ్డలు పుట్టినట్టు ఆస్పత్రిలో ఇచ్చే సర్టిఫికెట్లను జత చేయాల్సి ఉంది. అలాగే పుట్టిన బిడ్డ అత్తవారు, కన్నవారింటికి మారినప్పుడు అక్కడి అంగన్వాడీ సెంటర్‌కు అప్పగించే బాధ్యత కూడా ఆశ వర్కర్లదే. దీంతో తాము చేసిన పనులు ఏమన్నా తక్కువ చేస్తున్నామా? పనికి తగిన వేతనం ఇస్తున్నారా? మాకెందుకీ లక్ష్యాలని వాపోతున్నారు. వర్కర్లతో విరివిగా సమావేశాలు ఆశ వర్కర్లకు వేతనం పెంచినట్టే పెంచి లక్ష్యాలను బారెడు చేసిన ప్రభుత్వం వారి కోసం విడుదల చేసిన లక్ష్యాలు, నిబంధనలపై రిపోర్టులు తీసుకుంటోంది. ఇందుకోసం ఏఎన్ఎంల ఆధ్వర్యంలో ఆశ వర్కర్లకు సమావేశాలు నిర్వహిస్తున్నారు. సమావేశాల్లో మీరు చేయాల్సిన పనులివీ అని వారికి వివరిస్తున్నారు. పెరిగిన వేతనం అందుకోవాలంటే ఈ మాత్రం చేయకతప్పదని వారికి సుద్దులు చెబుతున్నారు. దీంతో ఆశ వర్కర్లు మరింత ఆవేదన చెందుతున్నారు. బర్త్ సర్టిఫికేట్లు అప్పగిస్తేనే వేతనమట మాకు లక్ష్యాలు ఇచ్చి వాటి ప్రకారం గర్భిణులు, బాలింతలను నమోదు చేయాలంటున్నా రు. బిడ్డ పుట్టిన తరువాత వారిని అంగన్వాడీలకు అప్పగించాలని ఆదేశించారు. లేకుంటే వేతనం లేదని, కట్ అవుతుందని ముందుగానే మాకు స్పష్టం చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫారంలో అన్ని కాలమ్స్‌ను మాచేత నింపిస్తున్నారు. ఇదెక్కడి న్యాయం. జీతం పెంపు అంటే ఇదేనా? – ఎల్ శాంతి, అధ్యక్షురాలు, ఆశ వర్కర్ల అసోసియేషన్. -
గొడ్డు చాకిరీ.. గొర్రె తోక జీతం
కాకినాడ రూరల్ : చాలీచాలని వేతనాలతో ఆశ వర్కర్లు నానా అవస్థలు పడుతున్నారు. పనిని బట్టి పారితోషికం అంటూ నియామకాలు చేసుకున్న ప్రభుత్వం, వారికి కనీస వేతనాలు కూడా ఇవ్వడం లేదు. వేతనాలు పెంచే అవకాశం లేదని ఇటీవల ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పడంతో వీరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మాతాశిశు మరణాలు తగ్గించడం మొదలు, గర్భిణులకు, శిశువులకు టీకాలు, పల్స్ పోలియో చుక్కలు, ప్రభుత్వాస్పత్రుల్లోనే ప్రసవాలు అయ్యేలా చూడడం తదితర పనుల్లో ప్రభుత్వం వీరి సేవలను ఉపయోగించుకుంటోంది. రూరల్ నియోజకవర్గంలో 172 మంది ఆశ వర్కర్లు పని చేస్తున్నారు. అన్ని పనులు వీరితోనే.. గ్రామాల్లో డెంగీ, మలేరియా, టైఫాయిడ్, తదితర విష జ్వరాలు ప్రబలితే తొలుత వైద్యసేవలు అందించేది ఆశ వర్కర్లే. ఇంటింటికీ వెళ్లి జ్వరపీడితులు ఎంతమంది ఉన్నారనే సమాచారం సేకరిస్తారు. ప్రసవం కేసులు కాకినాడ జీజీహెచ్‌కి రిఫర్ చేసి వారి వెనువెంటనే ఉంటూ ప్రసవం పూర్తి అయ్యే వరకు సేవలందిస్తున్నారు. వేతనం తక్కువ.. వీరికి నెలకు రూ.800 నుంచి రూ.1200కి మించి ఇవ్వడంలేదు. పల్స్ పోలియో కార్యక్రమంలో (రోజంతా పనిచేస్తే) రూ.75, గర్భిణిని ఆసుపత్రిలో పరీక్షకు తీసుకువస్తే రూ.60, ప్రభుత్వాసుపత్రిలో పరీక్షకు పంపితే రూ.300, కుటుంబ సంక్షేమ ఆపరేషన్ చేయిస్తే రూ.150, బాలింతను పర్యవేక్షిస్తే రూ.20, టీబీ రోగికి ఐదు నెలల పాటు మందులు అందజేస్తే రూ.300, ఇంటింటికి తిరిగి ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందిస్తే ప్యాకెట్‌కి రూపాయి చొప్పున అందజేస్తున్నారు. ఏటా ఆశ కార్యకర్తలకు యూనిఫారం ఇవ్వాల్సి ఉండగా రెండేళ్లుగా ఇవ్వడం లేదు. ఇటీవలే 36 గంటలపాటు ఆందోళన నిర్వహించిన కార్యకర్తలు కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురంలోని మంత్రి యనమల రామకృష్ణుడు క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించారు కూడా. డిమాండ్లు ఇవీ.. ∙కనీస వేతనం అమలు చేయాలి. ∙కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పారితోషికాలు పెంచాలి. ∙రూ.ఐదు లక్షల ప్రమాద బీమా అర్హత కల్పించాలి. ∙104 సేవల బకాయిలు చెల్లించాలి. ∙రెండేళ్లుగా ఇవ్వని యూనిఫాంతో పాటు అలవెన్స్ చెల్లించాలి. ∙అర్హులైన ఆశలకు ఏఎన్ఎం శిక్షణ ఇవ్వాలి. .ఇప్పటికే శిక్షణ పొందిన వారిని సెకండ్ ఏఎన్ఎంగా తీసుకోవాలి. -
కుర్కురేలో ఎలుకల మందు కలిపి..
సాక్షి, చీమకుర్తి రూరల్: నాలుగేళ్ల బాలుడికి ఓ ఆశా కార్యకర్త కుర్కురే ప్యాకెట్లో ఎలుకల మందు కలిపి బలవంతంగా తినిపించి హత్య చేసిన ఘటన ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం పిడతలపూడి గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు, బాలుడి బంధువుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన పిన్నిక సుధాకర్ యాదవ్ రెండో కుమారుడు పిన్నిక ధనుంజయ్ (4) ఈనెల 27న అంగన్వాడీ కేంద్రానికి వెళ్లగా..అదే గ్రామానికి చెందిన వేల్పుల జ్యోతి అనే ఆశా వర్కర్ ఎవరూ లేని సమయం చూసి కుర్కురే ప్యాకెట్లో ఎలుకల మందు కలిపి బాలుడితో బలవంతంగా తినిపించి మంచినీళ్లు తాగించి వెళ్లిపోయింది. అదే సమయంలో మిగిలిన చిన్నారులు కుర్కురే పెట్టమని అడిగితే ఇది మీరు తినేది కాదని చెప్పి ఖాళీగా ఉన్న ప్యాకెట్‌ను పక్కనే ఉన్న గోడపక్కన వేసింది. కుర్కురే తిన్న కొద్దిసేపటికి బాలుడు వాంతులు చేసుకుని ఆరోగ్యం విషమించడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఒంగోలు ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి గుంటూరులోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం మృతి చెందాడు. ఈ ఘటనపై బాలుడి బంధువులు అంగన్వాడీ కేంద్రంలో విచారణ చేయగా ఆశా వర్కర్‌పై అనుమానం బలపడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితురాలిని అరెస్టు చేయాలంటూ మృతదేహాన్ని నేరుగా ఆదివారం పోలీస్‌స్టేషన్ వద్ద ఉంచి ధర్నాకు దిగారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు వేల్పుల జ్యోతిని, ఆమె భర్తను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. జ్యోతి నుంచి లభించిన సమాచారం ప్రకారం ధనుంజయ్‌ది అనుమానాస్పద కేసు నుంచి హత్య కేసుగా త్వరలో మార్పు చేస్తామని సీఐ తెలిపారు. సుధాకర్ మొదటి కుమారుడు, ధనుంజయ్‌కి సోదరుడు తరుణ్ (4)ను కూడా ఇలాగే గత ఏడాది నవంబర్ 17న ఆశావర్కర్ జ్యోతి అన్నం, సాంబార్లో విషం కలిపి పెట్టిందన్న అనుమానాలు కుటుంబ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు. అప్పట్లో తరుణ్ ఆరోగ్యం బాగోలేక మృతిచెందాడని భావించామని..ఈ ఘటన చూశాక తరుణ్‌ను చంపింది కూడా జ్యోతేనని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వివాహేతర సంబంధం నేపథ్యంలోనే హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. -
నిరాశావర్కర్లు
► ఆశ కార్యకర్తలకు భరోసా కరవు ► పని భద్రత, పీఎఫ్, ప్రమాదబీమా సౌకర్యాలు లేవు ► విధులు విస్తారం.. పారితోషికం పాక్షికం.. ► రేపటి నుంచి సమ్మెకు సిద్ధమవుతున్న వైనం పర్చూరు: మాతా శిశు సంరక్షణ–సంక్షేమం కోసం ప్రభుత్వం క్షేత్రస్థాయిలో నియమించిన ఆశ వర్కర్లకు భరోసా లేకుండా పోయింది. భవిష్యత్‌పై ఆశతో ఏళ్ల తరబడి వెట్టిచాకిరి చేస్తున్న ప్రభుత్వం మాత్రం ఆశ కార్యకర్తల సమస్యల పరిష్కారంపై చిత్తశుద్ధి చూపడం లేదు. వీరికి ఇచ్చే పారితోషికం నెలల తరబడి చెల్లించకపోవడం, వారి డిమాండ్ల పరిష్కారంపై పాలకులు పట్టించుకోకపోయినా వారి విధులు మాత్రం సక్రమంగా నిర్వహిస్తున్నారు. మరోవైపు డిమాండ్ల సాధన కోసం సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నాలు, ఆందోళన చేస్తున్నారు. మాతా శిశు సంక్షేమానికి పనికి తగ్గ పారితోషికం పేరుతో ప్రభుత్వం పదేళ్ల క్రితం ఆశ వర్కర్లను నియమించింది. జిల్లాలో 91 పిహెచ్సీల పరిధిలో సుమారు 3000 మంది ఆశ వర్కర్లు పనిచేస్తున్నారు. పనికి తగ్గ పారితోషికం సకాలంలో అందక కుటుంబ పోషణకు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామస్థాయిలో అన్ని రకాల విధులు నిర్వర్తిస్తున్న ఆశాలకు ఇచ్చే పారితోషికం ఏ నెలకు ఆ నెల సక్రమంగా అందకపోవడంతో అవస్థలు తప్పటం లేదు. ఐదేళ్లుగా యూనిఫాం సరఫరా చేయలేదు. అప్పట్లో ఇచ్చిన యూనిఫారాలనే నేటికి ఆశాలు వినియోగించాల్సిన దుస్థితి ఏర్పడింది. డిమాండ్లు ఇవీ... ♦ పన్నెండేళ్లుగా వెట్టిచాకిరి చేస్తున్న ఆశాలకు కనీస వేతనం రూ.6వేలు చెల్లించాలి ♦ ఏటా యూనిఫాం సరఫరా చేయాలి. ♦ పీఎఫ్, ఈఎస్ఐ, ప్రమాదబీమా, పనిభద్రత కల్పించాలి. ♦ చంద్రన్న సంచార చికిత్స బకాయిలు వెంటనే చెల్లించి, పారితోషికం రూ.300కి పెంచాలి. ♦ 2013–2014 నుంచి యూనిఫాం, అలవెన్స్ లు వెంటనే చెల్లించాలి. ♦ అర్హులైన వారికి ఏఎన్ఎం శిక్షణ ఇవ్వాలి. ♦ శిక్షణ పొందిన వారికి 2వ ఏఎన్ఎంగా తీసుకోవాలి. ఈ డిమాండ్లతో ఆశ కార్యకర్తలు సీఐటీయూ ఆధ్వర్యంలో సెప్టెంబరు 5, 6, 7 తేదీల్లో సమ్మె చేపట్టనున్నారు.11వ తేదీన ‘చలో విజయవాడ’ కార్యక్రమంతో ఆందోళనలకు శ్రీకారం చుట్టనున్నారు. ప్రభుత్వం కళ్లు తెరవాలి ఆశ కార్యకర్తల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కళ్లు తెరవాలి. తెలంగాణలో ఆశాలకు ఇస్తామన్న గౌరవవేతనం ఏపీలో వెంటనే అమలు చేయాలి. సమస్యల పరిష్కారానికి సెప్టెంబరు 5న పీహెచ్‌సీల వద్ద, 6న నోటికి నల్లబ్యాడ్జీలతో తహశీల్దారు కార్యాలయాల వద్ద ధర్నా, 7న డివిజన్ సెంటర్ల వద్ద రాస్తారోకోలు నిర్వహిస్తాం. – జి.ప్రతాప్‌కుమార్ సీఐటీయూ పర్చూరు డివిజన్ కార్యదర్శి.. ఆశతోనే పనిచేస్తున్నాం.. ఆశ ర్కర్ల సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందని, గౌరవ వేతనం ఇస్తుందని, జీవనం గడుస్తుందన్న ఆశతోనే పనిచేస్తున్నాం. ప్రభుత్వం సానుభూతితో సమస్యలను పరిష్కరించి ఉపాధి కల్పిస్తుందన్న ఆశతోనే ఉన్నాం. తెలంగాణలో ఆశవర్కర్లకు ఇస్తున్న గౌరవ వేతనాన్ని మాకూ అమలు చేయాలి. – సుజాత, ఆశ కార్యకర్త శ్రమకు తగ్గ ఫలితం లేదు గ్రామాల్లో తాము పడుతున్న శ్రమకు తగ్గ ఫలితం అందటం లేదు. ప్రభుత్వం ఎప్పటికైనా న్యాయం చేస్తుందన్న నమ్మకంతో వేరే పనికి వెళ్లలేకపోతున్నాం. మా కష్టాన్ని ప్రభుత్వం గుర్తిస్తుందన్న ఆశతోనే పనిచేస్తున్నాం. – సుభాషిణి, ఆశ కార్యకర్త -
కదం తొక్కిన ఆశ కార్యకర్తలు
► చలో జిల్లావైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం ఉద్రిక్తం ► కనీస వేతనం చెల్లించాలని డిమాండ్ ► 21 మంది కార్యకర్తల అరెస్టు శ్రీకాకుళం పాతబస్టాండ్: తమకు రూ. 6వేలు కనీస వేతనం చెల్లించాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశవర్కర్లు బుధవారం చేపట్టిన ‘చలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం’ ఉద్రిక్తంగా మారింది. ముందుగా ఆశ కార్యకర్తలు పట్టణంలోని నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాల మైదానం నుంచి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీగా వచ్చిన కార్యకర్తలను వైద్య ఆరోగ్య కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించగా రెండో పట్టణ పోలీసులు అడ్డుకున్నారు. ప్రధాన గేట్లను మూసివేయడంతో కార్యకర్తలు కార్యాలయం ముందు బైఠాయించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వచ్చి వినతి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అశ కార్యకర్తలు ఆందోళన విరమించాలని రెండో పట్టణ సీఐ దాడి మోహనరావు, ఎస్ఐ రవికుమార్ కోరారు. కానీ ఎంతకీ విరమించకపోవడంతో పోలీసులు 21 మంది కార్యకర్తలను అరెస్టు చేసి రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దీంతో ఆశ కార్యకర్తలు పోలీస్‌స్టేషన్ ముందు బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం పరిపాలనాధికారి డాక్టర్ దవల భాస్కరరావు వచ్చి వినతి పత్రాన్ని అందుకున్నారు. సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళతామని హమీ ఇచ్చారు. అరెస్టులు చేసిన కార్యకర్తలను పోలీసులు విడుదల చేశారు. కాగా అరెస్టు చేయడంలో పోలీసులు దురుసుగా ప్రవర్తించారని, మహిళలను ఇబ్బందులు పెట్టారని కార్యకర్తలు ఆరోపించారు. ప్రభుత్వ వైఖరి దుర్మార్గం ర్యాలీకి ముందు సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి.గోవిందరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళల పట్ల దుర్మార్గంగా ప్రవర్తిస్తోందన్నారు. మహిళా సంక్షేమం పేరు చెబుతూ, మహిళలకు ఉద్యోగ భద్రత లేకుండా చేస్తోందని దుయ్యబట్టారు. ఆశ కార్యకర్తలకు తెలంగాణాలో నెలకు రూ. 6 వేలు వేతనం చెల్లిస్తున్నారని, ఆదే విధంగా ఏపీలోనూ జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోసం జూలై 3న పెద్ద ఎత్తున కార్యకర్తలతో కలెక్టరేట్‌ను దిగ్భందిస్తామని వెల్లడించారు. ఆశ కార్యకర్తల శ్రమకు కనీస వేతం కూడా ప్రభుత్వం ఇవ్వడంలేదని దుయ్యబట్టారు. వారి సమస్యలు పరిష్కారమయ్యేవరకూ ఉద్యమాలు చేయడానికి సిద్ధమని గోవిందరావు తెలిపారు. ఆశ కార్యకర్తల సంఘం నాయకులు ఎన్. హిమప్రభ, కె.నాగమణి, ఎ సత్యం మాట్లాడుతూ.. ఆశ కార్యకర్తలకు అలవెన్సులివ్వాలని, పని భద్రత కల్పించాలని, ప్రమాద బీమా సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పి.లతాకాంతి, ఎ.మహలక్ష్మి, కె.ఆదిలక్ష్మి, బి.స్వప్న, రామూర్తి, అమ్మన్నాయుడు, కె.ధనలక్ష్మి పాల్గొన్నారు. -
సీఎం దిష్టిబొమ్మ దహనం
సిరికొండ మండలకేంద్రంలో గురువారం ఆశాకార్యకర్తలు తెలంగాణ సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. తమ జీతాలు పెంచాలని, తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కొన్ని రోజులుగాసమ్మె చేస్తున్న సంగతి తెల్సిందే. సమ్మెలో భాగంగా భారత కార్మిక సంఘాల సమాఖ్య(ఐఎఫ్టీయూ) ఆధ్వర్యంలో ఆశాకార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ డిమాండ్లను నెరవేర్చాలని నినాదాలు చేశారు.