
రాయచూరు రూరల్/కర్ణాటక: విజయపుర జిల్లా ఇండి తాలూకా తాంబ్రా ప్రాథమిక ఆరోగ్యం కేంద్రంలో విధులు నిర్వహిస్తూ రాసలీలలో పాల్గొన్న ఆశా కార్యకర్తను సస్పెండ్ చేశారు. ఈ విషయంపై జిల్లా ఆరోగ్య శాఖాధికారి రాజ్‌కుమార్ మాట్లాడుతూ, సీసీ కెమెరాలో రికార్డు అయిన రాసలీల సాక్ష్యాధారాన్ని ఆధారంగా సేవల నుంచి తొలగించినట్లు తెలిపారు.
కాగా గ్రామ పంచాయతీ సభ్యుడు, ఆశా కార్యకర్త చేష్టలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇక మాజీ మంత్రి రమేశ్ జార్కిహోళి రాసలీలల సీడీ కేసు ఉదంతంపై విచారణ జరుగుతున్న సమయంలో ఈ వీడియో బయటకు రావడం కలకలం రేపింది.
చదవండి: కర్ణాటక: మరో రాసలీల వీడియో వైరల్
రాసలీలల కేసు: కోర్టుకు హాజరైన యువతి
Comments
Please login to add a commentAdd a comment