బెంగళూరులో యువతికి కరోనా టీకా
సాక్షి, బెంగళూరు: కరోనా రక్కసి గత మూడురోజుల కంటే మరింత దిగువకు వచ్చింది. గత 24 గంటల్లో రాష్ట్రంలో 1,386 పాజిటివ్‌లు వచ్చాయి. 3,204 మంది కోలుకున్నారు. 61 మంది కన్నుమూశారు. మొత్తం కరోనా కేసుల సంఖ్య 28,72,684కు, డిశ్చార్జ్‌లు 28,01,907 కి చేరాయి. ప్రాణనష్టం 35,896గా ఉంది. 34,858 ఇంకా చికిత్స పొందుతుండగా, పాజిటివిటీ రేటు 1.26 శాతంగా ఉంది. ఐటీ సిటీలో 319 కేసులు, 784 డిశ్చార్జిలు, 9 మరణాలు సంభవించాయి.
►రాష్ట్రంలో కొత్తగా 1,09,309 టెస్టులు చేయగా, మొత్తం పరీక్షలు 3,57,75,720 కి పెరిగాయి. మరో 2,03,562 మందికి కరోనా టీకాలు ఇచ్చారు. దీంతో మొత్తం టీకాలు 2,58,30,507 కి పెరిగాయి.
మెట్రోలో కోవిడ్ జరిమానాలు
యశవంతపుర: బెంగళూరులో మెట్రో రైళ్లలో కరోనా నియమాలను పాటించకపోతే రూ.250 జరిమానా విధిస్తున్నారు. మెట్రో స్టేషన్, రైళ్లలో మాస్క్, భౌతిక దూరాన్ని తప్పనిసరి. పాటించని ప్రయాణికులపై జరిమానా బాదుతున్నా రు. వారంరోజుల్లోనే రూ. 1.77 లక్షల జరిమా నా వసూలు చేసినట్లు అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment