శ్రీకాకుళం : శ్రీకాకుళం రిమ్స్ ప్రసూతి విభాగం ఖాళీ అయింది. ప్రస్తుతం ఇక్కడ ఇద్దరే పనిచేస్తున్నారు. మిగిలినవారంతా సెలవుల్లో వెళ్లిపోయారు. ఈ విభాగంలో 9 మంది వైద్యులుండగా ఏడుగురు సెలవులో వెళ్లిపోయారు. వీరంతా ఇప్పట్లో విధుల్లో చేరే అవకాశాలు కనిపించడం లేదు. అంద రూ మెడికల్ లీవ్ పెట్టడమే ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. అసిస్టెంట్ ప్రొఫెసర్ శశికళ, ట్యూటర్లు వైదేహి, ఏపీ ప్రసాద్ 15 రోజులుగా సెలవులో ఉన్నా రు. గురువారం నుంచి డాక్టర్ పార్వతి, రోజ్‌మేరీ, శైలజ సెలవు పెట్టారు. సంపతిరావు శ్రీదేవి రెండు నెలలుగా అప్పుడప్పుడూ సెలవులు పెడుతూ విధు ల్లో చేరుతూ కాలం వెళ్లదీస్తున్నారు.
ఇలా వైద్యులు ఒక్కసారిగా సెలవు పెట్టడంతో ఇప్పటికే ప్రసవించి న రోగులు, ప్రసవం కోసం ఎదురుచూస్తున్న రోగులతోపాటు చికిత్స కోసం వస్తున్న గర్భిణులు తీవ్ర కష్టాలు ఎదుర్కొంటున్నారు. గురువారం వీరు పడ్డ కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. దీనంతటికీ కార ణం ఈ విభాగంలో పనిచేస్తున్న అధికారి వేధింపులే కారణమన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇందుకు ఉదాహరణగా మరో అంశాన్ని కూడా రిమ్స్‌లోని కొందరు ఉద్యోగులే బహిరంగంగా చెబుతున్నారు. వైద్యవిద్యలో పీజీ కోర్సు పూర్తి చేసిన తరువాత ఏదైనా ప్రభుత్వ ఆస్పత్రిలో సీనియర్ రిసిడెంట్‌గా కొద్దికాలం పనిచేస్తేనే వారికి డిగ్రీ మంజూరు చేస్తా రు. ఈ విధంగా ఏటా రిమ్స్‌కు కూడా సీనియర్ రెసిడెంట్లను కేటాయిస్తున్నారు. ఈ ఏడాది 40 నుంచి 50 మంది సీనియర్ రెసిడెంట్లను కేటాయించగా ప్రసూతి విభాగం మినహా మిగిలిన అన్ని విభాగాల్లోనూ వీరు చేరారు.
ప్రసూతి విభాగానికి కేటాయించిన నలుగురు మాత్రం తాము ఎట్టి పరిస్థితుల్లోనూ విధుల్లోకి చేరేది లేదని చెబుతున్నట్టు తెలుస్తోంది. సీనియర్లు ఈ విభాగంలో పనిచేసినప్పుడు ఓ అధికారి వేధింపులు తీవ్ర స్థాయిలో ఉంటాయని చెప్పడంతోనే ఈ నలుగురూ విధుల్లో చేరలేదన్న వ్యాఖ్యానాలు రిమ్స్‌లో వినిపిస్తున్నాయి. వాస్తవం ఏదైనప్పటికీ రోగులు మాత్రం తీవ్ర కష్టాలు పడుతున్నారు. దీనిపై జిల్లా ఉన్నతాధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. విషయాన్ని రిమ్స్ సూపరింటెండెంట్ డాక్టర్ సునిల్‌నాయక్ వద్ద సాక్షి ప్రస్తావించగా ఏడుగురు సెలవుపై వెళ్లడం నిజమేనన్నారు. దీని వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవడం వాస్తవమేనని తెలిపారు.
విషయాన్ని రిమ్స్ డెరైక్టర్, జిల్లా కలెక్టర్, డీఎంహెచ్‌ఓల దృష్టికి తీసుకెళ్లారని, ఒకటి రెండు రోజుల్లో సమస్య పరిష్కారమవుతుందని తెలిపారు. రిమ్స్ డెరైక్టర్ డాక్టర్ ప్రసాద్ వద్ద ప్రస్తావించగా వైద్యులు సెలవు పెట్టడం వల్ల శస్త్ర చికిత్సలు ఆగాయనడంలో వాస్తవం లేదన్నారు. అయితే కొందరు వైద్యులకు పనిభారం అయిందని పేర్కొన్నారు. ఓ అధికారి వేధిస్తున్నట్లు తమకు మౌఖికంగా గాని, లిఖితపూర్వకంగా గాని ఫిర్యాదులు లేవని స్పష్టం చేశారు.
రిమ్స్‌లో ప్రసవ వేదన
Published Fri, Aug 14 2015 1:28 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM
Advertisement