పెళ్లి చూపులకు వెళ్లి .. | The wedding was going to turn .. | Sakshi
Sakshi News home page

పెళ్లి చూపులకు వెళ్లి ..

Published Thu, Jan 1 2015 6:53 AM | Last Updated on Sat, Sep 2 2017 7:04 PM

The wedding was going to turn ..

  • ఆర్టీసీ బస్సు ఢీకొని ఒకరి మృతి
  • మరొకరి పరిస్థితి విషమం
  • చింతకొమ్మదిన్నె: పెళ్లి చూపులకోసం వచ్చిన ఓ వ్యక్తి ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో మృతి చెందిన సంఘటన బుధవారం సాయంత్రం  కర్నూలు-చిత్తూరు జాతీయ రహదారిలోని మూలవంక  గ్రామ సమీపంలో జరిగింది. వీరపునాయునిపల్లె అలిదినె ఓబాయపల్లెకు చెందిన వై. శ్రీనివాసులు(52) తదితరులు చింత కొమ్మదిన్నె మండలం రాజుల తాతయ్యగారిపల్లెలో పెళ్లి చూపుల కోసం వచ్చారు.

    ఈ తంతు ముగిసిన తర్వాత కె.పెద్దసుబ్బరాయుడు అనే వ్యక్తిని కడపలో వదిలేందుకు శ్రీనివాసులు మోటార్ బైక్‌పై బయలుదేరాడు. మూలవంక వద్దకు రాగానే  ద్విచక్ర వాహనాన్ని ఏపీ04 జెడ్ 0091 నెంబరు గల ఆర్టీసీ అద్దె బస్సు వెనుక భాగం నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంలో వెళుతున్న  వై.శ్రీనివాసులు(52) అక్కడికక్కడే మృతి చెందగా కె.పెద్ద సుబ్బరాయుడు తీవ్రంగా గాయపడ్డాడు.

    వెంటనే అతన్ని కడప రిమ్స్‌కు తీసుకెళ్లగా వైద్యుల సూచన మేరకు తిరుపతికి తరలించారు. మృతుడికి ఇద్దరు కుమారులు, నలుగురు కుమార్తెలు ఉన్నట్లు తెలిసింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసినట్లు వారు తెలిపారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement