NH
-
ఢిల్లీవాసులకు దిల్ లేదా? మృతదేహాన్ని తొక్కుకుంటూ పోతారా?
దేశ రాజధాని ఢిల్లీలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వసంత్ కుంజ్ ప్రాంతంలో ఓ వ్యక్తిని కారు ఢీకొని, చాలా దూరం ఈడ్చుకెళ్లింది. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. కారు డ్రైవర్‌పై ఢిల్లీ పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో అత్యంత అమానవీయమైన విషయం ఏమిటంటే ప్రమాదం జరిగిన తరువాత ఆ వ్యక్తి మృతదేహంపైనుంచి అనేక వాహనాలు వెళ్లిపోయాయి. కనీసం ఎవరూ కూడా పట్టించుకోకపోవడం గమనార్హం. ఈ ప్రమాదానికి సంబంధించి ఢిల్లీ పోలీసులు ఒక ప్రకటనలో ‘గత రాత్రి 11:20 గంటలకు, జాతీయరహదారి- 8 సర్వీస్ రోడ్ సమీపంలో గుర్తు తెలియని పురుషుని మృతదేహం ఉన్నట్లు ఉత్తర వసంత్ కుంజ్ పోలీస్ స్టేషన్‌కు కాల్ వచ్చిందని తెలిపారు. పరిశీలనలో ఆ గుర్తుతెలియని మృతదేహం ఫరీదాబాద్‌కు చెందిన 43 ఏళ్ల బిజేందర్గా గుర్తించామని పేర్కొన్నారు. బిజేందర్ టాక్సీ డ్రైవర్. ఈ ఘటనకు కారకులైన గుర్తుతెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ప్రమాదానికి గురైన టాక్సీ.. మృతుడు బిజేందర్దేని పోలీసులు గుర్తించారు. బిజేందర్ ఈ టాక్సీని నడిపేవాడు. ఈ ఏడాది ఏప్రిల్‌లో వేరొకరి నుంచి ఈ టాక్సీ కొనుగోలు చేశాడు. కాగా ప్రమాదం జరిగిన సమయంలో కారు నడుపుతున్న వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇది కూడా చదవండి: రీల్స్ కోసం సరయూలో అశ్లీల నృత్యం.. -
ప్రమాదమా.. హత్యా..!
పెరవలి: పెరవలి మండలం ఖండవల్లి వద్ద జాతీయ రహదారిపై బుధవారం అర్ధరాత్రి వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అం దించారు. పోలీసులు వచ్చి పరిశీలించి గుర్తుతెలియని వాహనం ఢీకొట్టిందని భావిస్తుండగా, మృతుని బంధువులు మాత్రం కొట్టి చంపేశారని ఆరోపిస్తున్నారు. హత్యా లేక ప్రమాదమా అన్నది పోస్టుమార్టం రిపోర్టులో తేలనుంది. వివరాలిలా ఉన్నాయి.. ఖండవల్లి వద్ద జాతీయ రహదారిపై బుధవారం రాత్రి అదే గ్రామానికి చెందిన మానుపాటి రా ముడు (40) అనే వ్యక్తి మృతిచెంది పడి ఉన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని తణుకు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే మృతిపై బంధువులు, స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతుని శరీరంపై గాయాలను పరిశీలిస్తే అనుమానాలకు బలం చేకూరుతుంది. అయితే వాహనం ఢీకొట్టడంతోనే ప్రమాదం జరిగిందని పోలీసులు చెబుతున్నారు. ‘నా భర్తను కొట్టి చంపేశారు’ తన భర్త రాముడిది హత్యేనని భార్య చంద్రమ్మ కన్నీటి పర్యంతమయ్యారు. రాత్రి 11 గంటల సమయంలో జాతీయరహదారిపై మద్యం దుకాణం వద్ద గొ డవ జరుగుతుందని తెలిసి బిడ్డతో కలిసి వెళ్లగా అప్పటికే రాముడు మృతిచెందాడన్నారు. తాను వచ్చేటప్పటికే మృతదేహాన్ని పోలీసులు ప్రభుత్వాస్పత్రికి తరలించారని చెప్పింది. తన భర్తది హత్యేనని, తాను, ఐదుగురు బిడ్డలు అనాథలుగా మారామని వాపోయింది. ఘటనా స్థలంలో ప్రమాదం జరిగిన ఆనవాళ్లు లేవని మృతుని వదినలు నర్సమ్మ, పెద్దింట్లు అంటున్నారు. మద్యం దుకాణం వద్ద జరిగిన గొడవలో రాముడిని చంపేశారని ఆరోపిస్తున్నారు. అనుమానాలు ఎన్నో.. పెరవలి పోలీసులు రాత్రి 10 గంటల సమయంలో ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. అయితే దుకాణదారులు గాని స్థానికులు గాని తామేమీ చూడలేదంటున్నారు. సాధారణంగా ఆ సమయంలో ఈ ప్రాంతం రద్దీగా ఉంటుంది. దుకాణాలు 11 గంటల వరకు తెరిచి ఉంటాయి. అయినా ఎవరూ చూడ లేదనడం, మృతుని శరీరంపై గాయాలుండటం అనుమానాలకు తావిస్తోంది. -
పెళ్లి మండపం కట్టి వస్తూ పరలోకాలకు..
పెరవలి : పెళ్లి మండపం కట్టి వస్తూ గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో పూలవ్యాపారి మృతిచెందిన ఘటన జాతీయ రహదారిపై పెరవలి రామకృష్ణ రైస్ మిల్లు సమీపంలో శనివారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. పెరవలి మండలం కాకరపర్రు గ్రామానికి చెందిన టెక్కలి శివకుమార్ (48) పూల వ్యాపారి. వ్యాపారం నిమిత్తం తణుకులో పెళ్లి మండపం కట్టి మధ్యాహ్నం 2 గంటల సమయంలో మోటార్‌సైకిల్‌పై స్వగ్రామానికి బయలుదేరాడు. పెరవలిలో రామకృష్ణ రైస్ మిల్లు సమీపంలోకి వచ్చేసరికి వెనుక నుంచి వచ్చిన గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో తలకు బలమైన గాయమైంది. స్థానికులు పోలీసులకు, ఎన్‌హెచ్ అం బులెన్స్‌కు సమాచారం ఇచ్చి శివకుమార్‌ను తణుకు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం బంధువులకు పెరవలి ఎస్సై అప్పగించారు. కాకరపర్రులో విషాదఛాయలు శివకుమార్ మృతి వార్త తెలియడంతో కాకరపర్రు గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. శివకుమార్ అందరితో కలివిడిగా ఉండేవాడని తోటి వ్యాపారులు అన్నారు. స్నేహానికి ప్రాణం ఇచ్చేవాడిని రోదించారు. కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. శివకుమార్‌కు భార్య కృష్ణవేణి, కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఇటీవల కుమార్తెకు పెళ్లి చేశాడని గ్రామస్తులు చెప్పారు. -
రోడ్డు ప్రమాదంలో కారు డ్రైవర్ దుర్మరణం
తాడేపల్లిగూడెం రూరల్ : రోడ్డు ప్రమాదంలో ఓ కారు డ్రైవర్ దుర్మరణం పాలయ్యాడు. కొండ్రుప్రోలు కె.ఎస్.ఎస్.కాలనీ సమీపంలో బుధవారం జరిగిన ఈ దుర్ఘటనలో కారు యజమానికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం.. విజయనగరం నుంచి బెంగళూరు ఆనందపురానికి టైల్స్ లోడుతో వెళ్తున్న లారీని వెనుక నుంచి కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ మేడబలిమి నరసింహారావు (30) మృతి చెందగా, కారు యజమాని అచ్యుత రామసుబ్బారావు గాయపడ్డారు. ఆయనను ఏలూరు ఆశ్రం ఆస్పత్రికి పోలీసులు తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో కారును యజమాని అచ్యుత రామసుబ్బారావు డ్రైవ్ చేస్తున్నారు. మృతుడు నరసింహారావు గుంటూరు జిల్లా చవల్సాపురం గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు రూరల్ ఎస్ఐ వి.చంద్రశేఖర్ కేసు నమోదు చేసి దర్యాప్త చేస్తున్నారు. -
సమ్మక్క-సారలమ్మ జిల్లా ఏర్పాటు చేయాలి
ములుగును జిల్లాగా ఏర్పాటు చేసి దానికి సమ్మక్క-సారలమ్మ పేరు పెట్టాలని కోరుతూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఏటూరు నాగారంలో 163 వ నెంబర్ జాతీయరహదారిపై మానవహారం ఏర్పాటు చేసి రాస్తారోకో చేపట్టారు. ఎన్నికల సమయంలో కేసీఆర్ ఇచ్చిన హామీలు వెంటనే అమలు పర్చాలని డిమాండ్ చేశారు. ఏజెన్సీని విడదీస్తే ఊరుకోమని హెచ్చరించారు. విద్యార్థులు, స్థానిక నాయకుల ఆందోళనతో కాసేపు ఆ మార్గంలో ట్రాఫిక్ నిలిచిపోయింది. -
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
బైక్‌పై వెళుతన్న ముగ్గురు వ్యక్తులు రోడ్డు ప్రమాదంలో చనిపోయిన సంఘటన గురువారం విశాఖ జిల్లా కంచరపాలెం జాతీయ రహదారిపై జరిగింది. ఓ ద్విచక్రవాహనంపై ముగ్గురు ప్రయాణిస్తుండగా ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఒకరు అక్కడిక్కడే మృతి చెందగా, మరో ఇద్దరుకు తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.వారి పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది. -
మంత్రులు చెప్పినా మారరా?
జాతీయ రహదారిలో టీఆర్ఎస్ ఫ్లెక్సీలు కంటోన్మెంట్: రోడ్లపై ఇబ్బడి ముబ్బడిగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయొద్దని కోర్టులతో పాటు, సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు పదే పదే చెబుతున్నారు. అయినప్పటికీ అధికార టీఆర్ఎస్ పార్టీ నేతలే ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తున్నారు. గల్లీ రోడ్లు, అంతర్గత రహదారులతో పాటు ఏకంగా జాతీయ రహదారిలోనూ పెద్ద సంఖ్యలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నప్పటికీ అడ్డు చెప్పేవారే కరువయ్యారు. బోయిన్పల్లి చెక్‌పోస్టు సమీపంలో నాగ్‌పూర్ హైవేకు సంబంధించి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ సూచిక బోర్డు నిండా టీఆర్ఎస్ జెండాలే దర్శనమిస్తున్నాయి. సందర్భమేదైనా సరే.. కొన్ని నెలలుగా ఆ పార్టీ నేతలు తమ ఫ్లెక్సీలతో బోర్డును నింపేస్తున్నారు. తాజాగా ఓ నేత జన్మదినాన్ని పురస్కరించుకుని పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దారి పొడవునా కొంపల్లి వరకు పెద్ద సంఖ్యలో ఫ్లెక్సీలు, సైన్ బోర్డులు ఏర్పాటు చేశారు. దీంతో ఈ రహదారిపై వెళ్లే వారికి ఏ పట్టణం ఎంత దూరంలో ఉందో తెలుసుకునే అవకాశమే లేకుండా పోయింది. అంతే కాకుండా ఈదురు గాలులతో కూడిన వర్షాల సమయంలో ఫ్లెక్సీలు చిరిగిపోయి రోడ్డుపై వెళ్లే వాహనాలకు అడ్డు పడుతున్నాయి. ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా భారీ ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది. అయినప్పటికీ నేతల తీరు మారకపోవం గమనార్హం. -
కబేళాకు తరలిస్తున్న గోవులను రక్షించిన పోలీసులు
ఆవులను కబేళాకు తరలిస్తున్న డీసీఎం వాహనాన్ని మంగళవారం తొండపల్లి సమీపంలో పట్టుకున్నారు. తొండుపల్లి సమీపంలోని బెంగళూరు జాతీయ రహదారిపై డీసీఎం వాహనంలో ఆవులను తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఆవులను గోశాలకు పంపారు. -
రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ కు గాయాలు
మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోట మండలం కడుకుట్ల స్టేజీ సమీపంలో 44వ నంబర్ జాతీయ రహదారిపై ముందు వెళుతున్న లారీని ఓ బొలెరో ఢీకొంది. శుక్రవారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో బొలెరో డ్రైవర్ సాయినాథ్కు తీవ్ర గాయాలు అయ్యాయి. అతడ్ని చికిత్స కోసం వనపర్తి ఏరియా ఆస్పత్రికి రతలించారు. -
పెళ్లి బృందానికి ప్రమాదం.. ఇద్దరి మృతి
- మరో నలుగురికి తీవ్రగాయాలు ప్రత్తిపాడు(తూర్పుగోదావరి) తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు వద్ద 16వ నంబర్ జాతీయ రహదారిపై మంగళవారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. మరో తొమ్మిది మంది గాయపడ్డారు. కలప లోడుతో రాంగ్ రూట్లో వస్తున్న ట్రాక్టర్‌ను పెళ్లిబందం ప్రయాణిస్తున్న టాటా ఏస్ వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. కిర్లంపూడి మండలం వేలంక గ్రామానికి చెందిన కండెళ్ల రాజబ్బాయి (60) మూడో కుమార్తె గౌరి వివాహం గొల్లప్రోలు మండలం కొడవలి గ్రామంలో మంగళవారం ఉదయం జరిగింది. వివాహ అనంతరం పెళ్లి వారంతా టాటా ఏస్ మినీ వ్యాన్‌లో స్వగ్రామానికి తిరుగుపయనమైంది. రాచపల్లి అడ్డరోడ్డు సమీపానికొచ్చేసరికి రాంగ్రూట్లో కలప లోడుతో వస్తున్న ట్రాక్టర్‌ను ఈ వ్యాన్ ఢీకొంది. ఈ ప్రమాదంలో కండెళ్ల రాజబ్బాయి, బలసా సూర్యకాంతం (55) వాహనంలోనే ఇరుక్కుపోయి మృతి చెందారు. అంబులెన్సులో ప్రత్తిపాడు ప్రభుత్వ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలిస్తుండగా బలసా ధర్మరాజు (65), రాజాల రాజబాబు (బాలు) (14) మతి చెందారు. ఈ ప్రమాదంలో గాయపడిన మేడపాడుకు చెందిన తండ్రీ కొడుకులు రాయి కాశీ, సాయి మణికంఠ, వేలంక గ్రామానికి చెందిన కండెళ్ల సన్యాసమ్మ, విజయకుమారి, నీలాంజలి, ఏడిద భూషణం, టాటా ఏస్ డ్రైవర్ బచ్చల సూరిబాబులను ప్రత్తిపాడు సీహెచ్‌సీకి.. వేమగిరి రాణి, చిక్కాల వేగులమ్మలను స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం చిక్కాల వేగులమ్మ మినహా మిగిలిన ఎనిమిది మందినీ కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రత్తిపాడు సీఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో ఎస్సై ఎం.నాగదుర్గారావు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. -
కారు, బైక్ ఢీ: ఇద్దరి పరిస్థితి విషమం
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుమ్మలూరు గ్రామ పరిధిలోని శ్రీశైలం హైవేపై కారు, బైక్ ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మహబూబ్‌నగర్ జిల్లా చెట్టుపల్లి గ్రామానికి చెందిన ఒక వ్యక్తి తన కొడుకును హైదరాబాద్‌లో జరిగే పాలిసెట్ రాయించేందుకు బైక్‌పై బయలుదేరాడు. వారి వాహనాన్ని అవేర్ గేట్ వద్ద ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై ఉన్న ఇద్దరూ తీవ్రంగా గాయపడి, స్పృహ కోల్పోయారు. అలాగే, కారులో ఉన్న ఇద్దరిలో ఒక మహిళ తీవ్ర గాయాలపాలైంది. అపస్మారక స్థితిలో ఉన్న ముగ్గురినీ 108 వాహనంలో ఆస్పత్రికి తరలించారు. తండ్రి, కొడుకు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. -
తాగునీటి కోసం స్థానికుల ధర్నా
కమ్మర్పల్లి మండలకేంద్రంలోని హతకొత్తూరు క్రాస్ రోడ్డు వద్ద జాతీయరహదారిపై స్థానికులు రాస్తారోకోకు దిగారు. తాగునీటి సమస్య తీర్చాలని ఆందోళనకు దిగారు. దీంతో వాహన రాకపోకలు 2 కి.మీ మేర నిలిచిపోయాయి. పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. నీటిని సరఫరా చేసేవిధంగా చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. -
ధాన్యం కాంటా వేయాలని రైతుల రాస్తారోకో
మార్కెట్‌కు తీసుకువచ్చిన ధాన్యానికి వెంటనే కాంటా వేయాలని డిమాండ్ చేస్తూ నల్లగొండ జిల్లా సూర్యాపేటలో రైతులు నిరసకు దిగారు. కాంటా కూలీ రేట్లు పెంచాలని డిమాండ్ చేస్తూ సూర్యాపేట మార్కెట్ యార్డులో హమాలీలు సోమవారం ఉదయం నుంచి కాంటా నిలిపివేశారు. దీంతో మధ్యాహ్నం వరకు వేచి చూసిన రైతుల్లో సహనం నశించింది. అధికారులు పట్టింపులేకుండా వ్యవహరిస్తున్నారని, కాంటాలు ప్రారంభించి కార్యకలాపాలను వెంటనే మొదలయ్యేలా చర్యలు తీసుకోవాలని సాయంత్రం 3 గంటల నుంచి రైతులంతా కలసి జాతీయరహదారిపై రాస్తారోకోకు దిగారు. ఆందోళన కొనసాగుతోంది. -
పగిలిన కారు టైరు 11 మంది దుర్మరణం
♦ బైక్‌ను ఢీకొట్టడంతో లారీ కిందకు దూసుకెళ్లిన కారు ♦ విశాఖ జిల్లా నక్కపల్లి వద్ద జాతీయ రహదారిపై దుర్ఘటన ♦ దుర్ఘటనపై సీఎం చంద్రబాబు, విపక్ష నేత జగన్ దిగ్భ్రాంతి నక్కపల్లి: విశాఖపట్నం జిల్లా నక్కపల్లి సమీపంలో చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారిపై ఆదివారం మధ్యాహ్నం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం 11 మంది ప్రాణాలను బలిగొంది. విశాఖ నుంచి తుని వైపు వేగంగా వెళుతున్న ఓ కారు.. టైర్ పంక్చరవడంతో అదుపు తప్పి ముందు వెళుతున్న ఓ ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడమేగాక.. దాన్ని ఈడ్చుకుంటూ వెళ్లి ఎదురుగా వస్తున్న ఓ లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న తొమ్మిది మందితోపాటు బైక్‌పై ఉన్న తండ్రీకొడుకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులున్నారు. కారులో ప్రయాణిస్తున్నవారిని విశాఖపట్నం సమీపంలోని బుచ్చిరాజుపాలేనికి చెందినవారుగా గుర్తించారు. మృత్యువాత పడిన తండ్రీకొడుకులు ఎస్.రాయవరం మండలం చినగుమ్ములూరువాసులు. ఈ ప్రమాదంతో రెండు కుటుంబాల్లోనూ తీవ్ర విషాదం నెలకొంది. ఈ దుర్ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దైవదర్శనంకోసం బయల్దేరి.. విశాఖపట్నం సమీపంలోని బుచ్చిరాజుపాలేనికి చెందిన నక్కా వెంకటలక్ష్మి కుటుంబం తుని సమీపంలోని తలుపులమ్మలోవ దర్శనానికి కారులో బయలుదేరింది. కారు వేగంగా వెళుతున్న సమయంలో నక్కపల్లి సమీపంలోకి రాగానే టైరు పంక్చరైంది. దీంతో అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొంది. తరువాత ముందు వెళుతున్న బైక్‌ను ఢీకొట్టింది. అదే వేగంతో బైక్‌ను ఈడ్చుకుంటూ వెళ్లి ఎదురుగా వస్తున్న లారీనీ ఢీకొని దాని కిందభాగంలోకి దూసుకుపోయింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న తొమ్మిదిమంది అక్కడికక్కడే మరణించారు. వీరిలో నక్కా వెంకటలక్ష్మి (60), ఆమె పెద్ద కుమార్తె పద్మ(43), పద్మ పిల్లలు కుమార్(20), సాయి(16), వెంకటలక్ష్మి రెండో కుమార్తె ఈదరదేవి(35), అల్లుడు ఈదర శ్రీను(42, కారు నడుపుతున్న వ్యక్తి), వారి పిల్లలు సాయి(11) దుర్గా అపర్ణ(6) పవన్(7) ఉన్నారు. కారు నుజ్జునుజ్జవడంతో వీరంతా సీట్లలో ఇరుక్కుపోయారు. బైక్‌పై వెళ్తున్న ఎస్.రాయవరం మండలం చినగుమ్ములూరుకు చెందిన తండ్రీకొడుకులు దాట్ల చిరంజీవిరాజు(41), ఆయన కుమారుడు ఆనంద్ సాగర్ వర్మ(6) కూడా ప్రమాదంలో అక్కడికక్కడే మృతిచెందారు. దాట్ల చిరంజీవిరాజు హెటెరో డ్రగ్స్‌లో ఉద్యోగిగా పనిచేస్తున్నట్లు గుర్తించారు. ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై చాలాసేపు వాహనాల రాకపోకలు నిలచిపోయాయి. నుజ్జునుజ్జయిపోయిన కారు.. అందులోని మృతదేహాలు, ధ్వంసమైన బైకు, చెల్లాచెదురుగా పడిన మృతదేహాలతో ఆ ప్రాంతం భీతావహంగా తయారైంది. దైవదర్శనం కోసం బయల్దేరిన కుటుంబం శాశ్వతంగా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడం స్థానికులను కంటతడి పెట్టించింది. ప్రమాద విషయం తెలియడంతో రెవెన్యూ, పోలీసు అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయచర్యలు చేపట్టారు. క్రేన్లు, హైవే సిబ్బంది సహాయంతో మృతదేహాలను బయటకు తీయించి.. పోస్టుమార్టం కోసం నక్కపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించారు. విషయం తెలియడంతో మృతుల బంధువులు నక్కపల్లి ఆస్పత్రికి పెద్దసంఖ్యలో చేరుకోవడంతో రోదనలు మిన్నంటాయి. ప్రమాద స్థలాన్ని విశాఖ రేంజ్ డీఐజీ రవిచంద్ర, ఎస్పీ కోయ ప్రవీణ్, ఏఎస్పీ రస్తోగి తదితరులు పరిశీలించారు. సంఘటనపై సీఎం ఆరా ఘోర రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబునాయుడు దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. జిల్లా కలెక్టర్ యువరాజ్‌కు ఫోన్ చేసి ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సంఘటనపై జిల్లా మంత్రులు చింతకాయల అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు విచారం వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు లక్ష రూపాయల వంతున ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తామని మంత్రి గంటా తెలిపారు. -
టిప్పర్ ఢీకొని ఇద్దరు మహిళల మృతి
వేగంగా వెళ్తున్న టిప్పర్ ఢీకొని రోడ్డు దాటుతున్న ఇద్దరు మహిళలు మృతిచెందారు. ఈ సంఘటన కృష్ణాజిల్లా గన్నవరం సమీపంలోని జాతీయ రహదారిపై బుధవారం చోటుచేసుకుంది. రోడ్డు దాటుతున్న ఇద్దరు మహిళలను టిప్పర్ ఢీకొనడంతో.. వారు అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
లారీ, కారు ఢీ.. ఇద్దరికి తీవ్ర గాయాలు
ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి, ఈ సంఘటన మహబూబ్ నగర్ జిల్లా కొత్తకోట మండలం పాలెం సమీపంలో 44వ జాతీయ రహదారిపై ఆదివారం చోటుచేసుకుంది. వేగంగా వస్తున్న కారు కంటైనర్ వాహనాన్ని ఢీకొట్టడంతో కారులో ఉన్న ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. -
కారు-బస్సు ఢీ.. నలుగురికి గాయాలు
ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో నలుగురికి తీవ్ర గాయాల య్యాయి. ఈ సంఘటన కృష్ణా జిల్లా కంచికచర్ల సమీపంలోని వ్యవసాయ మార్కెట్ ఎదురుగా సోమవారం చోటుచేసుకుంది. 65వ నెంబర్ జాతీయ రహదారిపై నుంచి సర్వీస్ రోడ్డులోకి వస్తున్న బస్సును వేగంగా దూసుకొచ్చిన కారు ఢీకొట్టింది. దీంతో బస్సులో ఉన్న నలుగురికి తీవ్ర గాయాల య్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. -
కరువు జిల్లాగా ప్రకటించాలని రాస్తా రోకో
ఖమ్మం జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం రాస్తా రోకో నిర్వహించింది. జిల్లా వ్యాప్తంగా సోమవారం ఉదయం రహదారుల దిగ్బంధం కార్యక్రమం జరిగింది. కార్యకర్తలు కూసుమంచి మండలం నాయకర్ గూడెం వద్ద సుమారు గంటన్నరపాటు జాతీయ రహదారిని దిగ్బందించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి సుదర్శన్, డివిజన్ కార్యదర్శి లెనిన్, మండల కార్యదర్శి వెంకటరెడ్డి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. -
జోగిపేటలో ఉద్రిక్తత
జోగిపేట - సంగారెడ్డి జాతీయ రహదారి పక్కన మార్కెట్ కమిటీ ముందు ఉన్న వడ్డెరుల గుడిసెల తొలగింపు ఉద్రిక్తతకు దారి తీసింది. సోమవారం ఉదయం పోలీసు, రెవెన్యూ, మార్కెటింగ్ శాఖ అధికారుల ఆధ్వర్యంలో గుడిసెల తొలగింపు జరిగింది. దీంతో నిరాశ్రయులైన 30 కుటుంబాలు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. తమకు ప్రత్యామ్నయ స్థలం చూపించకుండా.. తమ గుడిసెలు కూల్చేశారంటూ మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే.. వీరికి వేరొక చోట స్థలాలు చూపించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తహశీల్దార్ హామీ ఇచ్చారు. భారీ పోలీసు పహారా.. రెండు జేసీబీలు కార్యక్రమంలో పాల్గొనటంతో.. పెద్ద ఎత్తున రహదారిపై రాకపోకలకు అంతరాయం కలిగింది. -
శ్రీవారిని దర్శించుకుని వెళుతుండగా..
తిరుమల వెంకటేశ్వరుడిని దర్శించుకుని మహారాష్ట్రకు తిరుగు ప్రయాణమైన ఓ భక్త బృందం శనివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదంలో చిక్కుకుంది. వారు ప్రయాణిస్తున్న స్కార్పియో వాహనాన్ని కడప జిల్లా ఓబులవారిపల్లె మండలం కిన్నెవోరంపాడు పంచాయతీ పరిధిలోని కమ్మపల్లి వద్ద జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొని వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో స్కార్పియోలో ఉన్న ఇద్దరు మృతి చెందారు. మరో నలుగురికి గాయాలు అయ్యాయి. వారిని తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను రాజంపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. -
బస్సు, కారు ఢీ: ఇద్దరి దుర్మరణం
బస్సు, కారు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా గంగవరం వద్ద జాతీయరహదారిపై మంగళవారం ఉదయం జరిగింది. బెంగళూరుకు చెందిన కొందరు భక్తులు కారులో తిరుపతికి వెళ్తుండగా గంగవరం సమీపంలో ఎదురుగా వస్తున్న కర్ణాటక ఆర్టీసీ బస్సు వీరిని ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న ఇద్దరు అక్కడికక్కడే చనిపోగా ఐదుగురు గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని పలమనేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా, బస్సులోని 12 మంది ప్రయాణికులకు కూడా స్వల్ప గాయాలయ్యాయి. -
పల్లెలకు ఎల్ఈడీలు!
వీధిదీపాలకు పొదుపు మంత్రం సీఎస్ఆర్ కింద పంపిణీకి ఎన్టీపీసీ సంసిద్ధత విశాఖపట్నం: విద్యుత్తు వాడకాన్ని తగ్గించే ఎల్ఈడీ దీపాలు విశాఖ నగరంలో విజయవంతం కావడంతో అదే రీతిలో గ్రామాల్లోనూ ఏర్పాటు కానున్నాయి. కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కార్యక్రమం కింద జిల్లాలోని అన్ని పంచాయతీలకు అందించడానికి ఎన్టీపీసీ ముందుకు వచ్చింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించింది. వీటిపై త్వరలోనే ఒక నిర్ణయం తీసుకోవచ్చని అధికారవర్గాల సమాచారం. విశాఖనగరంలో జాతీయ రహదారి, బీఆర్టీఎస్ రహదారితో పాటు వీధిదీపాలకు ఎల్ఈడీ లైట్లను వినియోగిస్తున్నారు. వీటితో విద్యుత్తు పొదుపు సాధ్యమైంది. దీంతో జిల్లాలోని 925 పంచాయతీల్లోనూ వీధిదీపాలకు ఎల్ఈడీ లైట్లను వినియోగించాలనే సూచనలు వచ్చాయి. ఈమేరకు సీఎస్ఆర్ కింద ఎల్ఈడీ దీపాలను అందించేందుకు ఎన్టీపీసీ సింహాద్రి యాజమాన్యం ముందుకొచ్చింది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించింది. ఎన్ని దశల్లో, ఏయే పంచాయతీల్లో ఎప్పుడెప్పుడు... ఎన్నెన్ని ఏర్పాటు చేయాలనే విషయమై ప్రభుత్వం నుంచి అనుమతి రావాల్సి ఉంది. ఎన్టీపీసీకి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇస్తే... త్వరలోనే గ్రామాల్లోనూ తెల్లని ఎల్ఈడీ వెలుగులు విరబూస్తాయి. -
‘యాదాద్రి’కి నాలుగు లేన్ల రహదారి
జాతీయ రహదారితో అనుసంధానం రూ.110 కోట్లకు నేడు పరిపాలన అనుమతి జారీ! సాక్షి, హైదరాబాద్: యాదాద్రి అభివృద్ధిలో భాగంగా జాతీయ రహదారి నుంచి యాదగిరిగుట్ట వరకు నాలుగు వరసల రోడ్డు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్ నుంచి వరంగల్ వరకు జాతీయ రహదారిని నాలుగు లేన్లుగా అభివృద్ధి చేసే క్రమంలో ప్రస్తుతం పనులు రాయగిరి వరకు పూర్తయ్యాయి. రాయగిరి నుంచి యాదగిరిగుట్ట వరకు ప్రస్తుతం రెండు లేన్ల రోడ్డే ఉంది. ఇప్పుడు దాన్ని నాలుగు లేన్లుగా అభివృద్ధి చేయనున్నారు. వంగపల్లి, తుర్కపల్లితోపాటు మరో వైపు నుంచి యాదగిరిగుట్టకు ఉన్న సింగిల్ రోడ్లను డబుల్ రోడ్లుగా మార్చాలని నిర్ణయించారు. రోడ్లు,భవనాల శాఖ రూ. 110 కోట్లతో అంచనాలు రూపొందించి ఆ ప్రతిపాదనను ప్రభుత్వానికి అందజేసింది. దీనికి మంగళవారం పరిపాలన అనుమతులు రానున్నాయి. ఆర్నెలల్లో ఈ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. నాలుగు లేన్లుగా ఫ్లైఓవర్ ప్రస్తుతం రాయగిరి వద్ద రైల్వేలైన్‌పై రెండు లేన్ల ఫ్లైఓవర్ నిర్మాణంలో ఉంది. ఇప్పుడా రోడ్డును నాలుగు లేన్లుగా అభివృద్ధి చేయనున్నందున ఫ్లైఓవర్‌ను కూడా నాలుగు వరసలుగా మార్చబోతున్నారు. కాగా, గతంలో నగరంలోని ఎల్బీనగర్లో రూ. 90 కోట్లు, నర్సాపూర్ కూడలిలో రూ. 73 కోట్లతో రెండు ఫ్లైఓవర్లకు రోడ్లు,భవనాల శాఖ పరిపాలన అనుమతులు జారీ చేసింది. ఇటీవల ఈ రెండు రోడ్లు జీహెచ్ఎంసీకి బదలాయించడంతో మంజూరైన పరిపాలన అనుమతులు రద్దు చేసి వాటి స్థానంలో యాదగిరిగుట్ట రోడ్ల నిర్మాణానికి జారీ చేయనున్నారు. -
పెళ్లి చూపులకు వెళ్లి ..
ఆర్టీసీ బస్సు ఢీకొని ఒకరి మృతి మరొకరి పరిస్థితి విషమం చింతకొమ్మదిన్నె: పెళ్లి చూపులకోసం వచ్చిన ఓ వ్యక్తి ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో మృతి చెందిన సంఘటన బుధవారం సాయంత్రం కర్నూలు-చిత్తూరు జాతీయ రహదారిలోని మూలవంక గ్రామ సమీపంలో జరిగింది. వీరపునాయునిపల్లె అలిదినె ఓబాయపల్లెకు చెందిన వై. శ్రీనివాసులు(52) తదితరులు చింత కొమ్మదిన్నె మండలం రాజుల తాతయ్యగారిపల్లెలో పెళ్లి చూపుల కోసం వచ్చారు. ఈ తంతు ముగిసిన తర్వాత కె.పెద్దసుబ్బరాయుడు అనే వ్యక్తిని కడపలో వదిలేందుకు శ్రీనివాసులు మోటార్ బైక్‌పై బయలుదేరాడు. మూలవంక వద్దకు రాగానే ద్విచక్ర వాహనాన్ని ఏపీ04 జెడ్ 0091 నెంబరు గల ఆర్టీసీ అద్దె బస్సు వెనుక భాగం నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంలో వెళుతున్న వై.శ్రీనివాసులు(52) అక్కడికక్కడే మృతి చెందగా కె.పెద్ద సుబ్బరాయుడు తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతన్ని కడప రిమ్స్‌కు తీసుకెళ్లగా వైద్యుల సూచన మేరకు తిరుపతికి తరలించారు. మృతుడికి ఇద్దరు కుమారులు, నలుగురు కుమార్తెలు ఉన్నట్లు తెలిసింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసినట్లు వారు తెలిపారు. -
'ఇలాంటి నష్టం భవిష్యత్‌లో ఏ వ్యక్తికి రాకూడదు'
హైదరాబాద్ : జాతీయ రహదారుల విధానంలో మార్పులు రావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రధాని మోదీ ఆధ్వర్యంలో జరగనున్న ముఖ్యమంత్రుల సదస్సులో పాల్గొనేందుకు చంద్రబాబు ఆదివారం ఉదయం ఢిల్లీ బయల్దేరారు. ఈ సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడుతూ డివైడర్లు, ఎన్హెచ్లను ఆనుకుని ఉన్న దారులను ప్రక్షాళన చేయాలన్నారు. జాతీయ రహదారుల వ్యవస్థ సరిగా లేకుంటే మరెన్నో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. హరికృష్ణ కుటుంబానికి శాంతి కలగాలని ఆకాంక్షిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. ఇలాంటి నష్టం భవిష్యత్తులో ఏ వ్యక్తికీ రాకూడదని ఆయన అన్నారు. కాగా నల్గొండ జిల్లాలో శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో నందమూరి హరికృష్ణ తనయుడు జానకిరామ్ దుర్మరణం చెందిన విషయం తెలిసిందే.