
తాగునీటి కోసం స్థానికుల ధర్నా
కమ్మర్‌పల్లి మండలకేంద్రంలోని హతకొత్తూరు క్రాస్ రోడ్డు వద్ద జాతీయరహదారిపై స్థానికులు రాస్తారోకోకు దిగారు. తాగునీటి సమస్య తీర్చాలని ఆందోళనకు దిగారు. దీంతో వాహన రాకపోకలు 2 కి.మీ మేర నిలిచిపోయాయి. పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. నీటిని సరఫరా చేసేవిధంగా చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.