తాగునీటి సమస్యలను పరిష్కరించాలంటూ రెంజల్ మండలం వీరన్నగుట్ట గ్రామ 5,6 వ వార్డు మహిళలు గురువారం ధర్నాకు దిగారు. కొన్ని రోజులుగా తాగునీరులేక తీవ్ర అవస్థలు పడుతున్నామని మహిళలు వాపోయారు. వెంటనే సమస్య పరిష్కరించాలని కోరుతూ ఖాళీ బిందెలతో రెంజల్ ఎంపీడీఓ కార్యాలయం ముందు నిరసన ప్రదర్శనకు దిగారు. సమస్య పరిష్కరించేంతవరకూ అక్కడి నుంచి కదలబోమని బీష్మించుకు కూర్చున్నారు.
తాగునీటి కోసం మహిళల ధర్నా
Published Thu, Mar 10 2016 1:05 PM | Last Updated on Sun, Sep 3 2017 7:26 PM
Advertisement
Advertisement