రోడ్డు ప్రమాదంలో కారు డ్రైవర్‌ దుర్మరణం | road accident.. driver dead | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో కారు డ్రైవర్‌ దుర్మరణం

Published Thu, Sep 22 2016 1:44 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

road accident.. driver dead

తాడేపల్లిగూడెం రూరల్‌ : రోడ్డు ప్రమాదంలో ఓ కారు డ్రైవర్‌ దుర్మరణం పాలయ్యాడు. కొండ్రుప్రోలు కె.ఎస్‌.ఎస్‌.కాలనీ సమీపంలో బుధవారం జరిగిన ఈ దుర్ఘటనలో కారు యజమానికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం.. విజయనగరం నుంచి బెంగళూరు ఆనందపురానికి టైల్స్‌ లోడుతో వెళ్తున్న లారీని వెనుక నుంచి కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్‌ మేడబలిమి నరసింహారావు (30) మృతి చెందగా, కారు యజమాని అచ్యుత రామసుబ్బారావు గాయపడ్డారు. ఆయనను ఏలూరు ఆశ్రం ఆస్పత్రికి పోలీసులు తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో కారును యజమాని అచ్యుత రామసుబ్బారావు డ్రైవ్‌ చేస్తున్నారు. మృతుడు నరసింహారావు గుంటూరు జిల్లా చవల్సాపురం గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు రూరల్‌ ఎస్‌ఐ వి.చంద్రశేఖర్‌ కేసు నమోదు చేసి దర్యాప్త చేస్తున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement