రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
Published Sun, Nov 13 2016 2:10 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
తణుకు: తణుకు పట్టణ పరిధిలోని 16వ నంబర్ జాతీయ రహదారిపై శనివారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందగా ఏడుగురు గాయపడ్డారు. పట్టణ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కృష్ణాజిల్లా తొట్లవల్లూరు మండలం తోడేలుదిబ్బ గ్రామానికి చెందిన లొక్కా వెంకటేశ్వరరావు కుటుంబసభ్యులు, బంధువులు మరో ఎనిమిది మంది రావులపాలెం మండలం మందపల్లి శనీశ్వరాలయానికి టాటా మేజిక్ వాహనంలో శుక్రవారం రాత్రి బయలుదేరారు. పట్టణ పరిధిలోని పాతటోల్‌గేటు సమీపంలోకి వచ్చేసరికి వాహనం అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెంకటేశ్వరరావు తండ్రి లొక్కా పూర్ణచంద్రరావు (60) అక్కడిక్కడే మృతి చెందగా వాహనంలో ప్రయాణిస్తున్న పడమటి కృష్ణారావు, పర్సా వెంకటేశ్వరరావు, పర్సా వరలక్ష్మి, సోలిశెట్టి నాంచాలమ్మ, గంగిశెట్టి అనురాధ, గంగిశెట్టి సాంబశివరా వు, లొక్కా విజయలక్ష్మి గాయపడ్డారు. పూర్ణచంద్రరావు మృతదేహానికి పోలీసులు పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. క్షతగాత్రులు తణుకు ప్రభుత్వాసుపత్రితోపాటు ప్రై వేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పట్టణ ఎస్సై జి.శ్రీనివాసరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Advertisement
Advertisement