Tanuku
-
అక్టోబర్ 2 నుంచి ఆకస్మిక తనిఖీలు
సాక్షి, భీమవరం: ఈ ఏడాది అక్టోబర్ రెండో తేదీ తర్వాత నుంచి రాష్ట్రమంతటా ఆకస్మిక తనిఖీలు చేపట్టనున్నట్లు సీఎం చంద్రబాబునాయుడు తెలిపారు. ఎక్కడికి వచ్చేదీ రెండు, మూడు గంటల ముందే తెలియజేస్తామని, ఎమ్మెల్యేలు పరుగెత్తాల్సి వస్తుందని చెప్పారు. స్వచ్ఛత లోపిస్తే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటానన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో శనివారం స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి హాజరైన చంద్రబాబు జెడ్పీ బాలుర హైస్కూల్ వద్ద జరిగిన ప్రజావేదికలో ప్రసంగించారు. స్వచ్ఛాంధ్ర లక్ష్య సాధనలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని, ఇళ్లతో పాటు పరిసరాలనూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. గత పాలకులు చెత్తపైనా పన్నువేస్తే తాము ఎత్తివేశామన్నారు. గత ప్రభుత్వం ఐదేళ్లలో కనీసం డ్రెయిన్లలో మట్టి కూడా తీయలేదని, 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను వారసత్వంగా ఇచ్చారని.. ఇందులో 51 లక్షల టన్నుల చెత్త తొలగింపు పూర్తయ్యిందని, అక్టోబర్ రెండో తేదీ నాటికి ఎక్కడా చెత్తలేకుండా చేస్తామని చెప్పారు. 2027 నాటికి 100 శాతం మురుగునీటిని శుద్ధిచేసి వ్యవసాయానికి వాడతామని తెలిపారు. విభాగాల వారీగా స్వచ్ఛాంధ్ర ర్యాంకింగ్‌లు..ఇక స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి విభాగానికీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్ ర్యాంకింగ్స్ తయారుచేశామని చంద్రబాబు వెల్లడించారు. మున్సిపల్ శాఖకు 20 పాయింట్లు, పంచాయతీరాజ్‌కు 28, విద్యాశాఖకు 14, టూరిజంకు 11, పరిశ్రమలకు 13, హాస్టళ్లకు 11, ఎండోమెంట్‌కు 11, ఆస్పత్రులకు 9, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్‌కు 5, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లకు 7, మార్కెట్లకు 9, హైవేలకు 3, పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు 7 పాయింట్లు చొప్పున ఇచ్చినట్లు తెలిపారు. అలాగే, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్‌లో కూడా జిల్లాల వారీగా పాయింట్లు ఇచ్చామన్నారు. అంతకుముందు.. తణుకు కూరగాయల హోల్‌సేల్ మార్కెట్‌ను చంద్రబాబు పరిశీలించారు. పారిశుద్ధ్య కార్మికులతో కలిసి ఎన్టీఆర్ పార్కులో చెత్తను ఊడ్చారు. ప్రజలతో ప్రతిజ్ఞ చేయించి పారిశుధ్య కార్మికులను సత్కరించారు. ఇదిలా ఉంటే.. చంద్రబాబుకు తమ గోడు చెప్పుకోవాలనుకున్న సామాన్యులకు మైక్ ఇవ్వకపోవడంతో వారు నిరాశ చెందారు. ఓ దశలో చంద్రబాబే స్వయంగా ఓ యువకుడిని కూర్చోమని గట్టిగా చెప్పారు. మరోవైపు.. ఎండలో దూరప్రాంతాల నుంచి వచ్చిన వారికి భోజనాలు లేకపోవడంతో వారు ఉసూరుమంటూ వెనుదిరిగారు. ఇక నరసాపురం నియోజకవర్గంలో గీత కార్మికులకు కేటాయించిన మూడు మద్యం దుకాణాలను శెట్టిబలిజ సామాజికవర్గం వారికి దక్కకుండా బినామీ పేర్లతో కొట్టేశారని మొగల్తూరు మండలానికి చెందిన కొందరు చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చి తమకు న్యాయంచేయాలని కోరారు. పోలీసు ఆంక్షలతో ప్రజల ఇక్కట్లు..ఇదిలా ఉంటే.. చంద్రబాబు పర్యటన సందర్భంగా పోలీస్ ఆంక్షలతో పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అలాగే ఇక్కడ నిత్యం జరుగుతున్న పశువధను నిరసిస్తూ కొద్దిరోజులుగా ఆందోళన నిర్వహిస్తున్న స్థానిక కొండాలమ్మ పుంత, మహాలక్ష్మినగర్ ప్రాంతాల ప్రజలను పోలీసులు హౌస్ అరెస్టుచేశారు. వారెవరూ బయటకు రాకుండా పోలీసులను కాపలా పెట్టారు. -
Tanuku: ఏపీ సీఎం చంద్రబాబు రోడ్ షోకు స్పందన కరువు
-
ఎస్సై ఆత్మహత్యకు ఆ ఫ్యాక్టరీయే కారణం: కారుమూరి
సాక్షి,పశ్చిమగోదావరిజిల్లా:తణుకు రూరల్ ఎస్సై మూర్తి తుపాకీతో కాల్చుకొని చనిపోవడం చాలా బాధాకరమని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కారుమూరి అన్నారు. ఈ విషయమై కారుమూరి ఆదివారం(ఫిబ్రవరి2) మీడియాతో మాట్లాడారు. ‘ఆ ఎస్సై చాలా మంచివాడు ధైర్యవంతుడు..కానీ అలా చేసుకోవడం బాధాకరం. దీనంతటికీ మూలకారణం తేతలిలో ఉన్న పశువధ ఫ్యాక్టరీనే అన్నది నూరు శాతం నిజం. కొన్ని నెలల క్రితం గేదెలు దొంగతనం జరిగిన ఘటనలో దొంగను పట్టుకొన్నారు ఎస్సై మూర్తి. గతంలో గేదెలు దొంగిలించినా గానీ దొరికేవి. ఇప్పుడు గేదెలు దొంగిలించిన ఐదు నిముషాల్లోనే తేతలి ఫ్యాక్టరీలో అమ్మేస్తున్నారు. ఫ్యాక్టరీ లోపలికెళ్లిన రెండునిముషాల్లో మాంసానికి మాంసం ఎముకలకు ఎముకలు చర్మానికి చర్మం వేరు చేసేస్తున్నారు.అలా గేదెలు దొంగను పట్టుకొన్నా కానీ అప్పటికే వాటిని ఫ్యాక్టరీలో అమ్మేశాడు. ఆ దొంగ నుంచి ఎమౌంట్ రికవరీ చేసి గేదెలు యజమానికి న్యాయం చేశారు ఎస్సై మూర్తి. గతంలో ఆ ఆరోపణలతో సస్పెండ్ అయినా ఎస్సై మూర్తి మనస్తాపంతో ఇలా బలవన్మరణం చెంది ఉండచ్చు. ఎస్సై ఆత్మహత్యకు కారణమైన పశువధ ఫ్యాక్టరీని ఇప్పటికైనా ఇక్కడి కూటమి ఎమ్మెల్యే మూయించాలి.ఇంకా ఎన్ని ప్రాణాలు బలికొంటారు. అక్కడ ప్రజలు అన్నం కూడా తినలేని పరిస్థితిలో అల్లాడిపోతున్నారు. కానీ ఇక్కడి కూటమి ఎమ్మెల్యే రాధాకృష్ణ ఉత్తర్ ప్రదేశ్ నుంచి వచ్చిన కసాయి వ్యాపారికి కొమ్ముకాస్తున్నాడు. పర్మిషన్లు లేని పశువధ శాలకు పోలీసులతో కాపలాకాయిస్తూ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాడు.ఆ ఫ్యాక్టరీకి ఎటువంటి పర్మిషన్లు లేవని మేం ఎన్నిసార్లు నిరూపించాలి. ఇక్కడి ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణకు డబ్బే ప్రధానమా ప్రజలు అక్కర్లేదా’అని కారుమూరి ప్రశ్నించారు. -
తణుకులో దారుణం
-
AP: తుపాకీతో కాల్చుకుని ఎస్ఐ ఆత్మహత్య
సాక్షి, పశ్చిమ గోదావరి: పశ్చిమ గోదావరి జిల్లాలో సర్వీస్ తుపాకీతో కాల్చుకున్ని ఎస్ఐ ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. ఈ ఘటనలో మృతిచెందిన ఎస్ఐను ఏజీఎస్ మూర్తిగా గుర్తించారు. కాగా, ఇటీవల ఎస్ఐ సస్పెండ్ అయిన కారణంగానే ఆయన ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది.వివరాల ప్రకారం.. పశ్చిమ గోదావరి జిల్లాలో తుపాకీతో కాల్చుకొని ఎస్ఐ ఏజీఎస్ మూర్తి శుక్రవారం ఉదయం ఆత్తహత్య చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన తణుకు రూరల్ ఎస్ఐగా పనిచేస్తున్నారు. కాగా, ఇటీవల ఏజీఎస్ మూర్తి పలు ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో ఆయనను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం పోలీసు స్టేషన్‌కు వచ్చిన ఆయన సర్వీస్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అనంతరం, సిబ్బంది 108 వాహనంలో ఎస్ఐ మృతదేహాన్ని తణుకు ఏరియా ఆసుపత్రికి తరలించారు. -
అబ్రకదబ్ర లోనూ ఆమె ముద్ర
‘నీపై నీకు నమ్మకం ఉంటే అద్భుతం సాధ్యం అవుతుంది’ అనే మాట మెజిషియన్ లక్ష్మికి తెలియనిదేమీ కాదు. ఆ నమ్మకం వల్లే గానం నుంచి ఇంద్రజాలం వరకు ఎన్నో విద్యల్లో ప్రావీణ్యం సాధించింది ‘ఆహా!’ అనిపిస్తుంది...అయిదు అంగుళాల పదునైన మేకును సుత్తితో ముక్కు లోనికి పంపుతూ లక్ష్మి చేసే సాహసం చూసి ప్రేక్షకుల ఒళ్లు గగుర్పొడుస్తుంది. అటూ ఇటూ కదులుతూ చేతిలోని గొడుగును ఆడిస్తూ ఒకదాని తరువాత ఒకటి చొప్పున అలవోకగా 30 కు పైగా గొడుగులు, స్వింగ్ఫ్లవర్స్ తీయడం చూస్తే ఔరా అనిపిస్తుంది. నంబర్స్‌తో మెంటలిజం మ్యాజిక్ చేసి అవాక్కు చేయడమే కాదు, వస్తువుల్ని మాయం చేయడం, పుట్టించడం, మనిషిని రెండు భాగాలు చేసినట్టు భ్రమింప చేయడం... ఇలా ఆమె చేసే ఇంద్రజాలం ప్రేక్షకులని కట్టిపడేస్తుంది.ఇంద్రజాలంతోనే కాదు తన గానంతో కూడా ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తోంది లక్ష్మి. పశ్చిమగోదావరి జిల్లా తణుకుకు చెందిన దండ లక్ష్మీప్రసన్నదేవి భర్త రాము సింగర్, డ్యాన్సర్, మిమిక్రీ ఆర్టిస్టు, మెజీషియ¯Œ , ఎంటర్టైనర్గా సుపరిచితుడు. భర్తతోపాటు ఎన్నో ప్రాంతాలకు వెళుతుండేది లక్ష్మి. అలా వెళ్లడం ద్వారా వివిధ కళా రూపాలకు ప్రేక్షకుల నుంచి వచ్చే అపురూప స్పందనను ప్రత్యక్షంగా చూసే అవకాశం వచ్చింది.రెండేళ్ల క్రితం భర్తతో కలిసి కేరళలో జరిగిన మ్యాజిక్పోటీలకు వెళ్లింది లక్ష్మి. ఆపోటీలలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఒక్క మహిళ కూడా లేకపోవడం గమనించింది. మహిళలు కనిపించని ఆ లోటే తనను మ్యాజిక్‌పై ఆసక్తి పెంచుకునేలా చేసింది. ‘నేను మ్యాజిక్ నేర్చుకోవాలనుకుంటున్నాను’ తన మనసులో మాటను భర్తకు చెప్పింది.అతడు ఎగతాళిగా నవ్వి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదోగానీ ‘భేషుగ్గా నేర్చుకోవచ్చు’ అనడమే కాదు ఇల్లే పాఠశాలగా ఇంద్రజాల విద్య నేర్పడం మొదలుపెట్టాడు. భర్త నుంచి మ్యాజిక్ ట్రిక్స్ నేర్చుకున్న లక్ష్మి చేసిన మొదటి మ్యాజిక్ షోకు మంచి స్పందన వచ్చింది. తనమీద తనకు నమ్మకం వచ్చింది.ఇక అప్పటి నుంచి ‘మ్యాజిక్’ తని ఇంటి పేరుగా మారింది. బర్త్‌డే పార్టీల నుంచి మ్యారేజ్ వరకు రకరకాల ఫంక్షన్లలో ఇప్పటివరకు వందకు పైగా ప్రదర్శనలు ఇచ్చింది. గుంటూరులో జరిగిన ‘అమరావతి మ్యాజిక్ ఫెస్టివల్’ రాష్ట్రస్థాయిపోటీల్లో ప్రథమ బహుమతిని గెలుచుకుంది. తాజ్ మ్యాజిక్ సొసైటీ ఆగ్రాలో నిర్వహించిన జాతీయస్థాయిపోటీల్లో ద్వితీయ బహుమతి గెలుచుకుంది.దేశవ్యాప్తంగా మేకు మ్యాజిక్ చేస్తున్న ఏడుగురు మెజిషీయన్లలో ఏకైక మహిళను తానే అంటుంది లక్ష్మి. పాటలు పాడటంలో నైపుణ్యాన్ని సాధించిన లక్ష్మి యాంకర్‌గా, సింగర్‌గా వెయ్యికి పైగా షోలు చేసింది. ‘ఇంకా ఎన్నో కళలు నేర్చుకోవాలని ఉంది. దేశవ్యాప్తంగా ప్రదర్శనలు ఇవ్వాలని ఉంది’ అంటుంది లక్ష్మీప్రసన్నదేవి.ఆ చప్పట్లు చాలు...ప్రేక్షకులలో ఒకరిగా ఎంతోమంది కళాకారుల ప్రదర్శనలను చూసి చప్పట్లు కొట్టాను. ఇప్పుడు నేను ప్రదర్శన చేస్తుంటే అలాంటి చప్పట్లు వినడం అపురూపంగా ఉంది. లక్షలు, కోట్లు అక్కర్లేదు. ఆ చప్పట్లు చాలు కళాకారుడిలో నిత్య ఉత్సాహం నింపడానికి. కళకు ప్రాంతం, జెండర్ అనే తేడా తెలియదు. కళాకారులలో ఏ కొంచెం ప్రతిభ ఉన్నా ప్రపంచం సొంతం చేసుకుంటుంది. గృహిణిగా బాధ్యతలు నిర్వహిస్తున్న నేను ‘ఇప్పుడు ఇవన్నీ ఎందుకు!’ అనుకోలేదు. ‘నేను ఎందుకు నేర్చుకోకూడదు’ అని మాత్రమే అనుకున్నాను. అలా అనుకోవడం వల్లే మెజీషియన్‌గా, సింగర్‌గా, యాంకర్‌గా నాకంటూ ఎంతో కొంత గుర్తింపు వచ్చింది. మరిన్ని కళలు నేర్చుకొని, దేశవ్యాప్తంగా మరిన్ని ప్రదర్శనలు ఇవ్వాలనుకుంటున్నాను.– దండ లక్ష్మీప్రసన్నదేవి – పెనుపోతుల విజయ్‌కుమార్, సాక్షి, భీమవరం ఫొటోలు: బడేటి తిరుపతి వెంకటేశ్వరరావు -
తీవ్ర విషాదం.. కరెంట్ షాక్‌తో నలుగురు యువకులు మృతి
సాక్షి,తూర్పుగోదావరి: ఉండ్రాజవరం మండలం తాటిపర్రులో విషాదం చోటుచేసుకుంది. పాపన్నగౌడ్ విగ్రహావిష్కరణ సందర్భంగా ప్లెక్సీలు కడుతుండగా కరెంట్ షాకుతో నలుగురు యువకులు మృతి మృతిచెందారు. మరో యువకుడు కోమటి అనుమంతురావు అనే వ్యక్తికి తీవ్రగాయాలు కాగా పరిస్థితి విషమంగా ఉంది. మృతులు గొల్ల వీర్రాజు, నాగేంద్ర, మణికంఠ, కృష్ణగా గుర్తించారు. కాగా, తాటి పర్రు విషాదంపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
తణుకు సంతలో ఏరులై పారుతున్న మద్యం..
-
అన్న క్యాంటీన్లో అపరిశుభ్రత.. వీడియో వైరల్!
పశ్చిమ గోదావరి, సాక్షి: తణుకులోని అన్న క్యాంటీన్లో అపరిశుభ్రమైన నీటితో తినేసిన ప్లేట్లు కడుగుతున్నట్లు ఓ వీడియో నిన్నటి నుంచి వైరల్ అవుతోంది. స్థానిక సొసైటీ రోడ్డులోని అన్న క్యాంటీన్లో ఈ ఘటన జరిగింది. ఈ నెల 19న జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఒక వ్యక్తి తన సెల్‌ఫోన్ ద్వారా వీడియో తీసినట్లు తెలుస్తోంది. అన్న క్యాంటీన్లో పేదలు ఉదయం టిఫిన్ తిన్న ప్లేట్లను వాష్ బేసిన్లో వేసి పూర్తి అపరిశుభ్రంగా ఉన్న నీటిలో కడుగుతున్న విషయం ఆ వీడియోలో ఉంది. తినేసిన ప్లేట్లను చేతులు కడుక్కునే వాష్ బేసిన్లో.. నిల్వ ఉన్న మురికి నీటిలో ఉంచి శుభ్రం చేస్తున్న విషయం ఆ వీడియోను చూస్తే అర్థమవుతోంది. #***Rs 5/- Anna Canteen in Tanuku***#This is how the KGF Taliban government treats poor People. Dirty water is used to clean the plates . YEllow goons can go now from HYD to check the quality of food ! @India_NHRC #AndhraPradesh #AnnaCanteen pic.twitter.com/gT9aF5b5uL— Howdy @ Murali Reddy ! ( Jagan కుటుంబం) (@Muralipmr) August 26, 2024 పేదలు తింటున్న అన్నం ప్లేట్లు ఎలా కడిగినా.. ఎవరు చూస్తారులే అనుకుంటూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై మున్సిపల్ కమిషనర్ బీవీ రమణను వివరణ కోరగా తినేసిన ప్లేట్లు సాధారణంగా వాష్ బేసిన్లో వేస్తుంటారని, అయితే ఆ రోజు ఒకేసారి తాకిడి రావడంతో మిగిలిన వ్యర్థాలు వాష్ బేసిన్లో ఉండిపోవడం వల్ల నీరు నిలిచిపోయి ఉండొచ్చని అన్నారు. అక్కడి నుంచి ప్లేట్లు తీసి వేరే చోట కడుగుతారని చెప్పారాయన. లోకేష్ స్పందనఇక తణుకు అన్న క్యాంటీన్ వీడియో వైరల్ కావడంపై ఎక్స్ వేదికగా మంత్రి నారా లోకేష్ స్పందించారు. అది తప్పుడు ప్రచారమని, ఉద్దేశపూర్వకంగా చేసి ఉంటారని ట్వీట్ చేశారు. -
చంద్రబాబు ఒక శాడిస్ట్: మంత్రి కారుమూరి
పశ్చిమ గోదావరి: ప్రజలు బాధపడితే చంద్రబాబు ఆనందపడతారని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వర రావు మండిపడ్డారు. చంద్రబాబును ఒక శాడిస్ట్‌గా వర్ణించించారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఆయన మీడియాతో మాట్లాడారు.‘ప్రజలు బాధపడితే చంద్రబాబు ఆనందపడతారు. చంద్రబాబు పాదం కూడా అంతే ఆయన ఉన్నంతకాలం వర్షాలు పాడేవి కాదు.. పంటలు పండేవి కాదు. కొనసాగుతున్న పథకాలకు డబ్బులు వేయద్దని ఈసీ చెప్పిందంటే.. చంద్రబాబు ఎంత కసరత్తు చేశాడో?. ఈసీ కూడా పక్షపాతి ధోరణిలో వ్యవహరిస్తోంది. గతంలో చంద్రబాబు ఎలక్షన్ ముందు పసుపు కుంకుమలు అంటూ పోస్ట్ డేటెడ్ చెక్కులు ఇస్తే అప్పుడు ఎందుకు ఆమోదించింది.తెలంగాణాలో అడ్డురాని సంక్షేమం ఇక్కడే ఎందుకు అడ్డు వచ్చింది. రైతులకు ఇప్పుడు అందించే సాయిం ఖరీఫ్ పంటల పెట్టుబడులకు మేలు చేస్తుంది. బడి విద్యార్థులు నూతన విద్యా సంవత్సరానికి ఇబ్బందులు పడతారు. ఈసీ మరొక్కసారి పునః పరిశీలన చేయాలి’అని కారుమూరి అన్నారు. -
పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో కాపు నేతల ఆత్మీయ సమావేశం
-
నాదెండ్లకు చుక్కలు చూపించి.. దాడికి యత్నం!
సాక్షి, పశ్చిమగోదావరి: జనసేనలో సీట్ల పంచాయితీ ‘ముష్టి’ యుద్ధానికి దారి తీస్తోంది. తాజాగా పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్‌కు జనసేన శ్రేణులు చుక్కలు చూపించాయి. ఆయన బస చేసిన చోట నిరసనకు దిగాయి. అక్కడితో ఆగకుండా బూతులు తిడుతూ నాదెండ్లపై దాడికి సైతం యత్నించాయి. తాడేపల్లిగూడెంలో ఈ నెల 28న జరగబోయే జనసేన టీడీపీ ఉమ్మడి బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్ల పరిశీలనకు సోమవారం నాదెండ్ల మనోహర్ వెళ్లారు. పెంటపాడు మండలం అలంపురంలోని జయా గార్డెన్స్‌లో రాత్రి బస చేశారాయన. సమాచారం అందుకున్న వెంటనే జనసేన ఇన్‌ఛార్జి విడివాడ రామచంద్రరావు, తన అనుచరులు, కొంతమంది కార్యకర్తలతో గెస్ట్‌హౌజ్ దగ్గర నిరసనకు దిగారు. రామచంద్రరావుకు అనుకూలంగా ఆయన అనుచరులు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో తాడేపల్లిగూడెం డీఎస్పీ భారీగా పోలీసులతో అక్కడ మోహరించగా.. ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరోవైపు బొలిశెట్టి శ్రీనివాస్, కందుల దుర్గేష్‌లు ఎంత సముదాయించిన రామచంద్రరావు మాట వినలేదు. ‘టికెట్ ఇవ్వకపోతే ప్రాణం తీసుకుంటా’ అంటూ బెదిరించారు. ఈ క్రమంలో బొలిశెట్టి వర్సెస్ విడివాడ వర్గాలుగా విడిపోయి జనసేన శ్రేణులు బాహాబాహీకి యత్నించాయి. బోలిశెట్టి సత్యనారాయణపై కొందరు కార్యకర్తలు భౌతిక దాడికి దిగారు. మనోహర్ బస చేసిన చోటే రచ్చ రచ్చ చేశారు. అదే సమయంలో కొందరు కార్యకర్తలు మనోహర్‌ను బూతులు తిడుతూ కనిపించారు. వారాహి యాత్రలో స్వయంగా పవన్ కల్యాణ్ ప్రకటించడంతో తణుకు సీటు జనసేనదేనని.. రామచంద్రరావు పోటీ చేయడం ఖాయమని అంతా అనుకున్నారు. అంతేకాదు.. పొత్తులో భాగంగా చాలా కాలం దాకా ఇరుపార్టీల ఉమ్మడి అభ్యర్థిగా విడివాడ రామచంద్రరావు పేరు బలంగా వినిపించింది. సీన్ కట్ చేస్తే.. ఉమ్మడి జాబితాలో రామచంద్రరావుకు ఘోర అవమానం జరిగింది. టికెట్ టీడీపీకి చెందిన అరిమిల్లి రాధాకృష్ణకు వెళ్లింది. దీంతో రామచంద్రరావు వర్గీయులు రగిలిపోతున్నారు. -
జన సంద్రమైన తణుకు
-
మైనార్టీలను టీడీపీ దూరం పెట్టింది..
-
నేడు తణుకులో సామాజిక జైత్రయాత్ర..
-
అందుకే మళ్లీ సీఎంగా వైఎస్ జగనే కావాలి: మంత్రి కారుమూరి
సాక్షి, పశ్చిమగోదావరి: సీఎం జగన్ సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేస్తున్నారని, అందుకే మళ్లీ సీఎంగా వైఎస్ జగనే కావాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. తణుకులో గురువారం ఆయన ‘వై ఏపీ నీడ్ జగన్’ కార్యక్రమంలో మాట్లాడుతూ, చంద్రబాబు హయాంలో 17వ స్థానంలో ఉన్న విద్యా వ్యవస్థ.. సీఎం జగన్ పాలనలో 3వ స్థానంలో ఉందని పేర్కొన్నారు. అవినీతి లేని పాలన సీఎం జగన్ అందిస్తున్నారు. కుల,మత, ప్రాంతాలకు అతీతంగా పాలన అందిస్తున్నందుకు మళ్లీ సీఎంగా జగన్ కావాలి. కరోనా కష్టకాలంలో అన్ని రాష్ట్రాలకన్నా మిన్నగా అందరికి మేలు చేశారు. జీడీపీ వృద్ధి రేటులో ఏపీని భారతదేశంలోనే నంబర్‌వన్‌గా నిలబెట్టారు. గతంలోలా మళ్లీ జన్మభూమి కమిటీలు వచ్చి ప్రజలను దోచుకు తినకుండా ఉండాలంటే మళ్లీ సీఎంగా జగనే కావాలి’’ అని మంత్రి కారుమూరి పేర్కొన్నారు. చదవండి: తెలంగాణలో టీడీపీని ఎందుకు మూసేశారు?: మంత్రి జోగి రమేష్ -
టిడిపి-జనసేన పొత్తుతో రెండు పార్టీల నేతల్లో గందరగోళం
-
Lanka Sita: బడుగు జీవుల దారిదీపం ఈ పెద్దక్క
లంక సీత వయసు 81. ఢిల్లీతో 61 ఏళ్ల అనుబంధం. ఢిల్లీలో ఉండనని ఏడ్చిన రోజులు... ఇంత నగరంలో ఎలా జీవించాలి... అనే ఆందోళన. జీవించడం ఎలాగో నేర్పిన గురువుది కూడా ఆ నగరమే. తెలుగుదనంతో ఢిల్లీలో అడుగుపెట్టిన నాటి తరం అమ్మాయి. తనలాగ ఎందరో... వాళ్లకు బతికే దారేది... అనుకుంది. అలాంటి అభాగ్యులకు అక్క అయింది... వారి జీవికకు దారి చూపిస్తోంది. ఆంధ్రప్రదేశ్, పశ్చిమగోదావరి జిల్లా, తణుకులో పుట్టిన లంక సీత దేశ రాజధానితో ముడివడిన తన జీవిత గమనాన్ని సాక్షితో పంచుకున్నారు. ‘‘నేను పుట్టింది అమ్మమ్మగారింట్లో తణుకులోనే, కానీ సొంతూరు నర్సాపురం. నాన్న ఉద్యోగరీత్యా నా చదువు కొంతకాలం నర్సాపురం, మరికొంత కాలం తణుకులో అమ్మమ్మగారింట్లో సాగింది. నాకు చదువంటే ఎంత ఇష్టమంటే ఇంగ్లిష్ పరీక్ష రాయడానికి టేబుల్ అందకపోతే నిలబడి పరీక్ష రాశాను తప్ప పరీక్ష మానలేదు. ఎస్ఎస్ఎల్సీ తర్వాత అనుకోకుండా పెళ్లి సంబంధం రావడం, మంచి సంబంధం, అబ్బాయికి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం అని పెళ్లి చేసి మా వారితోపాటు నన్ను ఢిల్లీకి పంపించారు మా వాళ్లు. పంజాబీల ఇంట్లో అద్దెకుండేవాళ్లం. ఇంగ్లిష్ అయితే నెగ్గుకొచ్చేదాన్ని, కానీ హిందీ అక్షరం కూడా మాట్లాడలేని పరిస్థితి. నాకు ఢిల్లీ అలవాటయ్యే లోపే భూకంపం వచ్చింది. మా ఓనర్ నన్ను గట్టిగా పిలుస్తూ పంజాబీలో, హిందీలో ఏదో చెప్తోంది. అర్థం చేసుకునేలోపు ఆవిడే వచ్చి బయటకు లాక్కువెళ్లింది. ఆ తర్వాత తెలిసింది నాకు అది భూకంపం అని. ఢిల్లీలో ఉండనని ఏడవడం అప్పుడు మొదలైంది. ఆ తర్వాత ఒక రోజు కడుపు నొప్పి కారణంగా మా వారిని హాస్పిటల్లో చేర్చారు. అది గుండెనొప్పి అని ఆయన దూరమైన తర్వాత తెలిసింది నాకు. కంపాషన్ గ్రౌండ్స్‌లో నాకు ఉద్యోగం ఇచ్చారు. ఉద్యోగంలో చేరిన తర్వాత ఇల్లు దాటి ఢిల్లీ వీథులు, సిటీ బస్సులతో నా జీవన యానం మొదలైంది. ఆఫీసులో ఉన్నా సరే నా కళ్లు వర్షించడానికి సిద్ధంగా ఉన్న నీలిమేఘాల్లా ఉండేవి. ఉద్యోగంలో పని నేర్చుకోవడం, ప్రైవేట్‌గా చదువుకోవడం మొదలు పెట్టిన తర్వాత నా మీద నాకు నమ్మకం కలిగింది. నా కళ్లు కన్నీళ్లను మరచిపోయాయి. ► మళ్లీ చదువు! ఇంటర్, బీఏ, ఎంఏ, ఆ తర్వత జర్నలిజం చేశాను. చైనా సామాజిక జీవనం పట్ల అధ్యయనం చేయాలనే ఉద్దేశంతో చైనీస్ భాష నేర్చుకోవడానికి లింగ్విస్టిక్స్‌లో చేరాను. కానీ ఉద్యోగంలో ప్రమోషన్ తర్వాత పని భారం కారణంగా ఇతర వ్యాపకాల మీద దృష్టి పెట్టలేకపోయాను. ఆర్థిక, సామాజిక పరిశోధన రంగంలో పని చేశాను. సీనియర్ రీసెర్చ్ ఆఫీసర్‌గా ఉన్న సమయంలో అమ్మ కోసం నాలుగేళ్ల ముందే రిటైర్మెంట్ తీసుకున్నాను. ఉద్యోగంలో నా పని సామాజిక స్థితిగతుల మీద అధ్యయనం కావడంతో 2002లో సైరస్ (సీత ఆల్ ఇండియా రీసెర్చ్ అండ్ సోషల్ సర్వీసెస్) స్థాపించి విశ్రాంత జీవితాన్ని సమాజం కోసమే అంకితం చేశాను. ► మహిళ పరిస్థితి మారలేదు! ప్రభుత్వ ఉద్యోగం ఉండి కూడా దేశ రాజధాని నగరంలో నన్ను నేను నిలబెట్టుకోవడానికి ఎంత కష్టపడాల్సి వచ్చిందో నాకు తెలుసు. నాలాగ తన కాళ్ల మీద తాము నిలబడాల్సిన స్థితిలో ఉన్న మహిళల కోసం ఏదైనా చేయాలనిపించింది. మహిళలు, యువకులు, వృద్ధులకు కూడా ఉపయోగపడేవిధంగా సైరస్ పేరుతో స్వచ్ఛంద సంస్థను స్థాపించాను. మహిళలకు ఉద్యోగ ప్రయత్నాల్లో సహాయం చేయడం, ఉపాధి మార్గాలను తెలియచేసి సహకారం అందించడం, తాగుబోతు భర్తల కారణంగా బాధలు పడుతున్న వాళ్లకు ఆసరాగా నిలవడం, మగవాళ్లకు కౌన్సెలింగ్ ఇచ్చి తాగుడుకు బానిసలు కాకుండా కుటుంబం పట్ల బాధ్యతగా వ్యవహరించే వరకు పర్యవేక్షిస్తూ ఆ కుటుంబాలను నిలబెట్టడం వంటి ప్రయత్నాలు మొదలుపెట్టాం. పిల్లలకు పోషకాహారం అందించడం, స్కూలుకి పంపేలా చూడడం, వృద్ధుల ఆరోగ్య సంరక్షణతోపాటు వారిని సమాజంలో ఉత్సాహంగా పాల్గొనేటట్లు చేయడం, యువతను చైతన్యవంతం చేయడం వంటి కార్యక్రమాలతో పని చేస్తోంది సైరస్. ► వర్తమానమే ప్రధానం! మా సైరస్ సంస్థలో పన్నెండు మందిమి ఉన్నాం. మేమందించే మా సేవలలో మాకు సహకరించే డాక్టర్లు, లాయర్లు, టీచర్లు, వాలంటీర్లున్నారు. మేము ఎవరి దగ్గరా ఆర్థిక సహకారం తీసుకోలేదు. మా కార్యక్రమాలకు వస్తురూపేణా సహకరించేవాళ్లున్నారు. నా పెన్షన్‌లో సగం ఈ సర్వీస్‌కే ఖర్చవుతుంది. నాకు పిల్లలు లేరు. పిల్లలతో కలిసి గడపడానికి ఎప్పుడూ ఏదో ఒక కార్యక్రమం చేస్తూ నా పిల్లలకే చేసినట్లు సంతోషపడుతుంటాను. సమాజానికి సేవ చేయడంతోపాటు తెలుగు కథలు, వ్యాసాలు రాయడం, అనేక ప్రదేశాల్లో పర్యటించడం, పరిశోధన వ్యాసాలు రాయడం నా హాబీలు. నేను నమ్మే తాత్వికత ఒక్కటే... ‘గతాన్ని మార్చలేం. అందుకే గతంలో జరిగిన చేదు సంఘటనల గుర్తు చేసుకుంటూ మనసు పాడు చేసుకోకూడదు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఊహించలేం. మనం వండుకున్న అన్నాన్ని తినే వరకు ఉంటామో లేదో మనకే తెలియదు. అలాంటప్పుడు భవిష్యత్తు కోసం ఆలోచిస్తూ ఉండడం వృథా. ఇక వర్తమానమే ప్రధానం. వర్తమానంలో జీవించాలి’ ఇదే నన్ను నడిపిస్తున్న చోదక శక్తి’’ అన్నారు లంక సీత. లెప్రసీ ఆశ్రమం దత్తత వైజాగ్‌లో వొకేషనల్ సెంటర్ ప్రారంభించి చదువు మానేసిన వాళ్లకు కుట్లు, అల్లికలతోపాటు టైలరింగ్, వెదురుతో కళాకృతుల తయారీ, టీవీ మెకానిజం, ఏసీ రిపేర్లలో సర్టిఫికేట్ కోర్సులు నిర్వహించాం. కరోనా వరకు నిరంతరాయంగా సాగాయి. ఇప్పుడు వాటిని తిరిగి గాడిలో పెట్టాలి. హైదరాబాద్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌లలో మెడికల్ క్యాంపులు పెట్టి అవసరమైన వారిని అనంతర చికిత్స కోసం ఉచితంగా వైద్యమందించే హాస్పిటల్స్‌తో అనుసంధానం చేస్తాం. రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే, గాంధీ జయంతి, చిల్డ్రన్స్ డే వంటి సందర్భాల్లో పిల్లలకు పోటీలు నిర్వహిస్తాం. ఢిల్లీలో అల్పాదాయ వర్గాలు నివసించే నాలుగు కాలనీలు, ఒక లెప్రసీ ఆశ్రమాన్ని దత్తత తీసుకున్నాం. దుస్తులు, పాత్రలు, బ్యాండేజ్ క్లాత్, మందులు పంపిణీ చేస్తాం. దత్తత తీసుకున్న కాలనీల పిల్లలకు స్కూలుకు వెళ్లడానికి అవసరమైన సమస్తం సమకూరుస్తున్నాం. – లంక సీత, ప్రెసిడెంట్, సైరస్ స్వచ్ఛంద సంస్థ – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి. -
‘ఏయ్ ఆగవయ్యా.. నువ్వాగు!’.. రైతులపై చంద్రబాబు అసహనం
తణుకు: ‘ఏయ్.. ఏం మాట్లాడుతున్నావ్. ఆగవయ్యా.. నువ్వాగు. ముందు నేను చెప్పేది వినవయ్యా’ అంటూ రైతులపై ప్రతిపక్ష నేత చంద్రబాబు మండిపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో రైతు పోరుబాట పేరుతో పాదయాత్ర నిర్వహించేందుకు గురువారం రాత్రి ఇరగవరం వచ్చిన చంద్రబాబు అక్కడ రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన రైతులు ఆయనను నిలదీస్తుండగా చంద్రబాబు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఓ యువరైతు మాట్లాడుతూ.. ‘మీరు సీఎంగా ఉన్నప్పుడు రైతులు నష్టపోతే వైఎస్ జగన్మోహన్రెడ్డి వారి పరిస్థితుల్ని చూసి చలించిపోయారు. రైతులు నష్టపోయిన విషయాన్ని అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. మీరు అలా ఎందుకు చేయట్లేదు’ అని ప్రశ్నించగా.. అతడిపై చంద్రబాబు కస్సుమన్నారు. ‘ఏయ్.. ఏం మాట్లాడుతున్నావ్ నువ్వు. ముందు నేను చెప్పేది వినవయ్యా’ అంటూ అసహనం ప్రదర్శించారు. ప్రభుత్వ యంత్రాంగం రైతుల నుంచి «ధాన్యం కొనుగోలు చేస్తున్న పరిస్థితులను వివరించేందుకు ప్రయత్నిస్తున్న రైతులను అడ్డుకున్న చంద్రబాబు తాను చెప్పేది మాత్రమే వినాలంటూ ఎప్పటిలా తన సొంత డబ్బా చెప్పుకొంటూ వెళ్లారు. రైతు బిడ్డల్ని కోటీశ్వరులను చేస్తానని, పేదలను ధనికులు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నానని చంద్రబాబు చెప్పుకొచ్చారు. తాను అధికారంలోకి వస్తే ధాన్యం కొనుగోలులో పాత విధానం తీసుకొస్తానని చంద్రబాబు చెప్పారు. మూడు రోజులపాటు గోదావరి జిల్లాల్లో పర్యటించి 72 గంటల్లో తడిసిన ధాన్యం, మొలకలు వచ్చిన ధాన్యం కొనుగోలు చేయాలని అల్టిమేటం ఇస్తే.. ఇప్పుడు తాను తిరుగుతున్న ప్రాంతాల్లో హడావుడిగా ధాన్యం కొనుగోలు చేస్తున్నారన్నారు. ‘సాక్షి’పై మరోసారి అక్కసు ఈ పర్యటన సందర్భంలో చంద్రబాబు ‘సాక్షి’పై మరోసారి అక్కసు వెళ్లగక్కారు. రైతులను పరామర్శించడానికి వచ్చి రైతులతో మాట్లాడుతుంటే కొందరు సైకో కార్యకర్తలను పంపి గందరగోళం సృష్టించాలని చూస్తున్నారని అన్నారు. దీనిని వక్రీకరిస్తూ ‘సాక్షి’ పేపర్లో ‘చంద్రబాబును అడ్డుకున్న రైతులు’ అని రాస్తారన్నారు. రైతుల ముసుగులో వైఎస్సార్సీపీ కార్యకర్తలు వస్తున్నారని, అప్రమత్తంగా ఉండాలని కోరారు. -
జనసేన నేత గుండాయిజం భూకబ్జాలు, దాదాగిరి..
-
ఈనాడు కథనాలను ఖండిస్తూ వాలంటీర్లు ధర్నా
-
ఆడు ఎదురొస్తే ‘తుపాను’ నడిచొచ్చినట్టు ఉంటది
సాక్షి, అమరావతి: పశ్చిమగోదావరి జిల్లా తణుకు పట్టణానికి చెందిన చీర్ల శ్రీనివాస్, గంగా భవానీల కుమారుడు చీర్ల నాగేంద్ర. 1996 నవంబర్ 7న జన్మించాడు. ఆ సమయంలో రాష్ట్రాన్ని పెను తుపాను కమ్మేసి ఉంది. ముసురు బట్టి రోజుల తరబడి వర్షం పడుతోంది. ఆ సమయంలో పుట్టినందున తల్లిదండ్రులు తమ కుమారుడు నాగేంద్రకు తుపాను అని ముద్దు పేరు పెట్టుకున్నారు. అప్పటి నుంచి తల్లిదండ్రులు, బంధువులు, ఇరుగు పొరుగు.. అదే పేరుతో పిలుస్తుండటంతో నాగేంద్ర పేరు తుపానుగానే స్థిరపడిపోయింది. తను కూడా తన పేరు నాగేంద్ర కన్నా.. తుపానుగానే ఎక్కువ ఫీలవుతాడు. అందుకే నాగేంద్రా.. అని పిలిచినదానికన్నా, తుపానూ.. అని పిలిచినప్పుడే ఎక్కువగా స్పందిస్తాడు. ఎనిమిదో తరగతి వరకు చదివిన తుపాను.. బైక్ మెకానిక్‌గా స్థిరపడ్డాడు. తన తమ్ముడు రామాంజనేయులు కూడా 1998వ సంవత్సరం వరదల సమయంలో పుట్టాడని తుపాను చెప్పాడు. ఇక తన ఇద్దరు కుమారులు పుట్టినప్పుడు కూడా ప్రత్యేకతలున్నాయన్నాడు. పెద్ద కుమారుడు మోహిత్ 2020 జూలైలో కరోనా సమయంలో, చిన్న కుమారుడు ఈ ఏడాది మేలో వచ్చిన అసనీ తుపాను సమయంలో పుట్టారని చెప్పారు. తన కుటుంబానికి ప్రకృతి విపత్తులకు విడదీయరాని అనుబంధం ఉందని.. తమది ప్రకృతి విపత్తుల నుంచి పుట్టుకొచ్చిన ఫ్యావిులీ.. అంటూ చమత్కరించాడు. -
బెడ్రూమ్లో అనుమానాస్పద స్థితిలో యువతి మృతి.. ఏం జరిగింది?
తణుకు (పశ్చిమ గోదావరి) : తణుకు మండలం ముద్దాపురం గ్రామంలో ఓ యువతి సజీవ దహనం ఘటన ఈ ప్రాంతంలో సంచలనం రేకెత్తించింది. ఇంజినీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్న గ్రామానికి చెందిన ముళ్లపూడి నాగహారిక (19) ఇంట్లో బెడ్రూమ్లో మంచంపైనే సజీవ దహనం అయ్యింది. అయితే, ఈ ఘటన ప్రమాదవశాత్తూ జరిగిందా లేక ఎవరైనా హత్య చేసి కాల్చివేశారా అనేది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన ముళ్లపూడి శ్రీనివాస్, రూపరాణి దంపతుల కుమార్తె నాగహారిక శుక్రవారం రాత్రి తన గదిలో నిద్రించింది. తెల్లారేసరికి నాగహారిక మంచంపై కాలి బూడిదై కనిపించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాగహారికకు రూపరాణి సవతి తల్లికాగా ఆమెకు తొమ్మిదేళ్ల మంజలిప్రియ అనే కుమార్తె ఉంది. ఇటీవల నూతనంగా ఇల్లు నిర్మించుకున్న వీరు మూడు నెలల క్రితం గృహప్రవేశం చేశారు. అయితే పూర్తిస్థాయిలో ఇంటి సామగ్రి తెచ్చుకోకపోవడంతో యజమాని ముళ్లపూడి శ్రీనివాస్ పాత ఇంటివద్దనేనిద్రిస్తున్నారు. శనివారం ఉదయం కొత్త ఇంటికి వచ్చి భార్యను నిద్రలేపే సమయంలో కుమార్తె నిద్రిస్తున్న గది నుంచి పొగలు రావడం గమనించారు. అప్పటికే నాగహారిక మంటల్లో కాలిపోయింది. తండ్రి ముళ్లపూడి శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ సీఐ సీహెచ్ ఆంజనేయులు, ఎస్సై రాజ్‌కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఫోరెన్సిక్ సిబ్బంది, డాగ్‌స్కా్వడ్ ఘటనా స్థలంలో పలు ఆధారాలను సేకరించారు. ఈ కేసులో పలువురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు నాగహారిక మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. -
టీడీపీ బినామీలు గోబ్యాక్
-
తణుకులో అమరావతి యాత్రకు నిరసనల సెగ
-
తణుకులో అమరావతి రైతుల పాదయాత్రకు నిరసన సెగ
-
జగనన్న ప్రగతి రథసారథి.. చంద్రబాబు రియల్టర్ల వారధి
సాక్షి, తణుకు: ప.గో.జిల్లా తణుకు నియోజకవర్గంలోకి ప్రవేశించిన అమరావతి రైతుల పాదయాత్రకు నిరసన సెగ తగిలింది. తణుకు నియోజకవర్గ వైసీపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. గో బ్యాక్ గో బ్యాక్ ఫేక్ యాత్రికులారా అంటూ వివిధ నినాదాలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అమరావతి పేరుతో టీడీపీ, చంద్రబాబు అండ్ కో చేస్తున్న కుతంత్రాలపై ఫ్లెక్సీలతో నిరసన వ్యక్తం చేశారు. తణుకు నియోజకవర్గంలోని పోస్టర్లలో నినాదాలు ఇలా ఉన్నాయి.. ► రియల్ ఎస్టేట్ వద్దు.. ఆంధ్రాస్టేట్ ముద్దు ► జగన్ ది స్టేట్ గురించి ఆలోచన.. చంద్రబాబుది రియల్ ఎస్టేట్ గురించి ఆలోచన ► జగన్ కోరుకొనేది అందరి అభివృద్ధి.. చంద్రబాబు కోరుకునేది అస్మదీయుల అభివృద్ధి ► జగన్ ది సమైక్యవాదం.. చంద్రబాబుది భ్రమరావతి నినాదం ► జగన్ ది అభివృద్ధి మంత్రం.. చంద్రబాబు ది రాజకీయ కుతంత్రం ► రాష్ట్రం కోసం జగన్ ఆరాటం.. 29 గ్రామాల కోసం బాబు నకిలీ పోరాటం ► మూడు రాజధానులకు ప్రజా ఆమోదం.. చంద్రబాబు అండ్ కో రియల్టర్లకు ఖేదం ► జగనన్న ప్రగతి రథసారథి.. చంద్రబాబు రియల్టర్ల వారధి ► చంద్రబాబు పార్టీ షేక్ పాదయాత్ర ఫేక్ ► అన్ని ప్రాంతాల అభివృద్ధి జగనన్న ఆకాంక్ష.. అయిన వారు బాగు కోసమే వికేంద్రీకరణకు బాబు వివక్ష ► వికేంద్రీకరణ ముద్దు.. ప్రాంతాల మధ్య వివక్ష వద్దు ► హైదరాబాద్ ప్రయోగం అన్యుల పాలు.. అమరావతి ప్రయోగం చంద్రబాబు అండ్ కోకే మేలు -
పశ్చిమగోదావరి జిల్లాలో విస్తరిస్తున్న నర్సరీలు
మల్లెలు, జాజుల గుబాళింపుతో నర్సరీలు స్వాగతం పలుకుతాయి. లిల్లీ, గులాబీల అందాలు రా..రమ్మని ఆహ్వానిస్తాయి. కనకాంబరాలు కలరింగ్‌తో పడేస్తాయి. హెల్కోనియా హ్యాంగింగ్స్ అబ్బుర పరుస్తాయి. గ్లాడియోలస్ అందాలు బాగున్నారా అంటూ పలుకరిస్తున్నట్టుగా అనిపిస్తూ ఆకర్షిస్తాయి. ఆర్కిడ్స్ విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించిపెడతాయి. అలహాబాద్ సఫేదీ, తైవాన్ జామ నర్సరీలు, కొబ్బరి నర్సరీలు రైతులకు దిగుబడుల లాభాలను పంచుతామంటూ ముందుకు వస్తాయి. సరిగ్గా దృష్టి సారిస్తే కడియం, కడియపు లంక మాదిరి పచ్చని పశ్చిమ గోదావరి జిల్లా కూడా నర్సరీల జిల్లాగా రూపాంతరం చెందేందుకు మార్గాలు అనేకం ఉన్నాయి. తాడేపల్లిగూడెం : ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాగా ఉన్న సమయంలోనే నర్సరీలు, ఫ్లోరీ కల్చర్, కొబ్బరి, జామ నర్సరీల అభివృద్ధికి పశ్చిమగోదావరిలో కృషి జరిగింది. ప్రస్తుతం రాజమహేంద్రవరం జిల్లాలోకి వెళ్లిన పెరవలి మండలం కాకరపర్రు పువ్వుల పల్లెగా పరిఢవిల్లింది. మెట్ట ప్రాంతాల్లో కూడా నర్సరీల పెంపకం పెరిగింది. విధానపరమైన నిర్ణయాలతో జిల్లా వేరువేరు ప్రాంతాలుగా విడిపోకముందు నర్సరీల అభివృద్ధిపై ఉద్యాన శాఖ క్షేత్రస్థాయిలో వివిధ ప్రాంతాల్లో ఉన్న నర్సరీల సమాచారం సేకరించింది. డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయ పరిధిలోని కృషి విజ్ఞాన కేంద్రం నర్సరీలు, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లోని నర్సరీల వివరాలను తీసుకుంది. నర్సరీలకు జిల్లా అనుకూలం తైవాన్, అలహాబాద్ సఫేది రకాలకు చెందిన జామ నర్సరీలు తాడేపల్లిగూడెం మండలం కడియద్దలో ఉన్నాయి. జిల్లాలోని తణుకు మండలం రేలంగి గ్రామంలో నర్సరీలను వృద్ధి చేస్తున్నారు. పాలకొల్లు మండలం అడవిపాలెంలో కొబ్బరి నర్సరీలను రైతులు పెంచుతున్నారు. తాడేపల్లిగూడెం మండలం ఇటుకలగుంటలో ఈస్టుకోస్టు హైబ్రీడ్ కోకోనట్ సెంటర్లో కొబ్బరి నర్సరీలను పెంచుతున్నారు. ఇక్కడే హెల్కోనియా హ్యాంగింగ్స్ వంటి అలంకరణ పుష్పాల మొక్కలను పెంచుతున్నారు. అంతేకాదు.. ప్రపంచ వ్యాప్తంగా థాయిలాండ్‌లోని నాంగ్నూచ్ గ్రామంలో ఏటా డిసెంబర్లో జరిగే కింగ్ షోకు వచ్చిన కొత్త విదేశీ రకాల మొక్కలను ఇక్కడికి తీసుకువచ్చి అభివృద్ధి చేసి విక్రయిస్తున్నారు. బంతి తోటల పెంపకం ఇటీవల కాలంలో జిల్లాలో ఊపందుకుంది. గోదావరి పరీవాహకంలో లంక ప్రాంతాలు ఉండటంతో ఈ మొక్కల పెంపకానికి, ఫ్లోరీకల్చర్ అభివృద్ధికి అవకాశాలు ఏర్పడ్డాయి. విదేశీ మారకద్రవ్యాన్ని ఆర్జించిపెట్టే పలు రకాల ఆర్కిడ్స్‌ను ఫ్లోరల్ ఎసెన్సు ఫారమ్స్ ప్రైవేటు లిమిటెడ్ ఆర్కిడ్స్ ఫార్మ్ తణుకులో పెంచుతున్నారు. డి.1075, ఎం.ఎల్లో, డి.997, వి.స్పాటెడ్ ఎల్లో, డి.999 వంటి ఆర్కిడ్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఆర్కిడ్స్తో పాటు అరుదైన పుష్ప రకాల పెంపకం విషయంలో రైతులకు బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, అటవీ, క్లైమేట్ ఛేంజ్ డెక్కన్ రీజియన్ హైద్రాబాద్ వారు మార్గదర్శనం చేస్తున్నారు. జిల్లా ఉద్యాన శాఖ కూడా నర్సరీల ప్రోత్సాహానికి ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా కార్యాచరణతో ముందుకు సాగుతోంది. నర్సరీలకు అక్రిడేషన్ జిల్లాలో ఏ రకం నర్సరీలను ఎక్కడెక్కడ రైతులు పెంచుతున్నారు.. ఏ ప్రామాణికాలు పాటిస్తున్నారనే విషయాలను అంచనా వేస్తూ, వాటికి చట్టబద్ధత కోసం ఉద్యాన శాఖ ద్వారా ఉమ్మడి జిల్లాలో అక్రిడేషన్ కోసం సమాచారం సేకరించారు. ఉద్యాన వర్సిటీ పరిధిలో ఉన్న నర్సరీల వివరాలు, విశిష్ట రక్షిత సాగు పద్ధతిలో పెంచుతున్న నర్సరీల వివరాలను తీసుకున్నారు. 2010లో నర్సరీ యాక్ట్‌కు అనుగుణంగా నర్సరీల పెంపకాన్ని గమనించడానికి వీలుగా సమాచారం తీసుకున్నారు. చట్టానికి లోబడి వచ్చిన నర్సరీల వివరాలకు అనుగుణంగా తదుపరి చర్యలు తీసుకోనున్నారు. ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. (క్లిక్: కొల్లేరుకు మహర్దశ.. ఉప్పుటేరుపై మూడు రెగ్యులేటర్లు) మేలైన మొక్కల కోసమే పశ్చిమ గోదావరి జిల్లా నర్సరీలకు అనువైన ప్రాంతం. పూల తోటలకు అనుకూలం. పండ్ల, కొబ్బరి, జామ నర్సరీలు ఇక్కడ ఊపందుకుంటున్నాయి. నర్సరీలకు కేరాఫ్‌గా ఉన్న కడియం, కడియపు లంక మాదిరంత కాకున్నా, ఇక్కడ నర్సరీలను పెంచవచ్చు. నర్సరీల ద్వారా పెంచే మొక్కల్లో నాణ్యత పాటించడానికి వీలుగా రూపొందించిన నర్సరీ చట్టాన్ని అనుసరించి వాటికి అక్రిడేషన్ ఇవ్వడానికి సమాచారం తీసుకున్నాం. దీనివల్ల నర్సరీలు పెంచే వారి బాధ్యత మరింత పెరిగి వినియోగదారులకు మంచి మొక్కలను అందించగలుగుతారు. – ఎ.దుర్గేష్ , జిల్లా ఉద్యాన అధికారి, పశ్చిమగోదావరి జిల్లా -
‘మూడు సబ్జెక్టుల్లో ఫెయిల్.. అమ్మా, నాన్నా క్షమించండి..’
తణుకు(పశ్చిమ గోదావరి): పరీక్షల్లో ఫెయిల్ అయ్యాను... అమ్మా, నాన్నా నన్ను క్షమించండి... నేను చనిపోతున్నాను అంటూ నర్సింగ్ విద్యార్థిని సూసైడ్ నోట్ రాసి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం తణుకు పట్టణంలో చోటు చేసుకుంది. పట్టణంలోని ఆపిల్ ఆసుపత్రికి అనుబంధంగా కొనసాగుతున్న నర్సింగ్ కళాశాలలో రెండో సంవత్సరం చదువుతున్న మాత్రపు షారోన్ కుమారి (21) సోమవారం మధ్యాహ్నం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆసుపత్రి మూడో అంతస్తు హాస్టల్ గదిలో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకుంది. చదవండి👉: బాలిక అదృశ్యం.. పాపం ఏమైందో? భీమడోలు మండలం పూళ్ల గ్రామానికి చెందిన షారోన్‌కుమారి మొదటి సంవత్సరం పరీక్ష ఫలితాలు ఇటీవల విడుదలయ్యాయి. మూడు సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యింది. మనస్తాపం చెందిన ఆమె ఇటీవల స్వగ్రామం వెళ్లి తిరిగి హాస్టల్‌కు చేరుకుంది. సోమవారం తోటి విద్యార్థులంతా తరగతులకు వెళ్లారు. తనకు ఆరోగ్యం బాగాలేదని చెప్పి ఆమె హాస్టల్ గదిలోనే ఉండిపోయింది. మధ్యాహ్నం సమయంలో స్వీపర్ వచ్చి చూసి ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించి యాజమాన్యానికి సమాచారం అందించారు. తణుకు సీఐ సీహెచ్ ఆంజనేయులు, ఎస్సై ఎం.వీరబాబు సంఘటనా స్థలానికి చేరుకుని మృతురాలి బంధువులు, ఆసుపత్రి యాజమాన్యం నుంచి వివరాలు సేకరించారు. సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
మంత్రి కారుమూరి ఔదార్యం
తణుకు అర్బన్: రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ కళాశాల విద్యార్థినికి వైద్యం చేయించి సొంత వాహనంలో సురక్షితంగా ఇంటికి చేర్చారు రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు. సోమవారం సాయంత్రం రేలంగిలో వలంటీర్ల సత్కార సభ ముగించుకుని తణుకు వస్తుండగా రోడ్డుపై పడి ఉన్న పాలి గ్రామానికి చెందిన విద్యార్థిని మీనాను ఆయన చూశారు. వెంటనే తన కాన్వాయ్‌ని నిలిపి ఆమెకు సపర్యలు చేసి రేలంగిలో వైద్యం అందించారు. అనంతరం తన వాహనంలో ఆమెను ఇంటికి పంపి ఔదార్యం చూపించారు. -
పనసల పదనిస.. ఒకటి, రెండు కాదు.. ఏకంగా 250 కాయలు
ఇంట్లో పనస పండు ఉంటే ఎంత దాచి పెట్టినా అందరికీ తెలిసిపోతుంది. దాని ఘుమఘుమ అలాంటిది. ఇక పనస తొనల మాధుర్యం చెప్పనలవే కాదు. అటువంటి పనస పండు ఇంట్లో ఒకటుంటేనే ఎంతో సంతోషం. అవే వందల సంఖ్యలో కనిపిస్తే ఆ ఆనందమే వేరు. పనస చెట్టుకు కాయలు కాయడం సాధారణమే. అలా కాకుండా ఆరు నుంచి ఎనిమిది కాయలతో గుత్తులు గుత్తులుగా కాస్తే నిజంగా విశేషమే! పెరవలి మండలం ఖండవల్లిలో రాజు గారి చేను వద్ద రోడ్డు పక్కన ఈ పనస చెట్టు ఉంది. ఇది ఒకటీ రెండూ కాదు.. ఏకంగా 250 కాయలు కాసింది. చెట్టు మొదలు నుంచి గుత్తులుగుత్తులుగా పై వరకూ ఉన్న కాయలు కాసిన ఈ చెట్టును అటుగా వెళ్తున్న వారు కన్నార్పకుండా చూసి, ఆనందిస్తున్నారు. ఇంతలా కాయలు కాసిన పనస చెట్టును చూడటం ఇదే మొదటిసారంటూ ఆశ్చర్యపోతున్నారు. ఈ చెట్టు ఏటా కాపు కాస్తుందని, ఈ ఏడాది ఇంతలా గుత్తులుగుత్తులుగా కాయటం విశేషమేనని రైతు రాజు చెప్పారు. – పెరవలి(తూర్పుగోదావరి) చదవండి: Seshachalam Hills: మాట వినం..తాట తీస్తాం! -
‘సమగ్ర విచారణ జరిపిస్తాం’
సాక్షి, అమరావతి: తణుకు టీడీఆర్ బాండ్ల వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా అక్కడి కమిషనర్, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ నిర్ణయం తీసుకున్నారనే విషయం తన దృష్టికి వచ్చిందని తెలిపారు. సచివాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘10 రోజుల క్రితం తణుకు ఎమ్మెల్యే ఈ విషయాన్ని నా దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే ఉన్నతాధికారులతో ప్రాథమిక విచారణ జరిపించాం. ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్ కింద బాండ్లు ఇచ్చారని తెలిసింది. రోడ్డు కోసం భూ సేకరణ చేయవచ్చు గానీ పార్కు కోసం చేయడం జీవోకు విరుద్ధమని చెప్పాం. దీనిపై సమగ్ర విచారణ జరిపించి.. మూడు, నాలుగు రోజుల్లో వివరాలు వెల్లడిస్తాం’ అని చెప్పారు. పీఆర్సీపై ఉద్యోగ సంఘాలతో మాట్లాడామని.. సోమవారం మరోసారి సమావేశం నిర్వహిస్తామన్నారు. -
తణుకు టీడీఆర్ బాండ్ల విషయంలో టీడీపీ హస్తం: మంత్రి బొత్స
సాక్షి, అమరావతి: తణుకు టీడీఆర్ బాండ్ల విషయంలో టీడీపీ హస్తం ఉందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఆయన గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద విలేకర్లతో మాట్లాడుతూ.. టీడీపీ సానుభూతిపరులు అధికారులతో కుమ్మక్కయ్యారని మండిపడ్డారు. ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావుపై టీడీపీ ఆరోపణలు అర్ధరహితమని అన్నారు. అక్రమాలకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకున్నామని చెప్పారు. తణుకు టీడీఆర్ బాండ్ల జారీ విషయంలో టీడీపీ నేతలు ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తణుకులో ఒకే సామాజిక వర్గానికి చెందిన టీడీపీ సానుభూతిపరులు అధికారులతో కుమ్మక్కయ్యారని మండిపడ్డారు. ఈ అక్రమాలపై తణుకు ఎమ్మెల్యే కారుమూరి పది రోజుల క్రితమే తనకు ఫిర్యాదు చేశారని గుర్తుచేశారు. కారుమూరిపై టీడీపీ ఆరోపణలు అర్ధరహితమని, అక్రమాలకి పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకున్నామని, పూర్తిస్ధాయి విచారణకి కూడా ఆదేశించామని పేర్కొన్నారు. మాట్లాడటానికి విషయం లేక అసెంబ్లీలో టీడీపీ నేతలు ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. మద్యపాన నిషేధం అమలు చేసింది ఎన్టీఆర్ అయితే దానికి తూట్లు పొడిచింది చంద్రబాబు కాదా? అని సూటిగా ప్రశ్నించారు. మద్య నిషేధం అమలు చేస్తామని తాము చెబుతున్న విధంగానే చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. సోమవారం సాయంత్రం ఉద్యోగ సంఘాలతో పెండింగ్ అంశాలపై మరోసారి చర్చించనున్నామని మంత్రి బొత్స తెలిపారు. గవర్నర్ ప్రసంగం రోజే..: అంబటి టీడీపీ సభ్యులు అసాధారణంగా ప్రవర్తించారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మండిపడ్డారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ సభ్యులు స్పీకర్ పట్ల అనుచితంగా ప్రవర్తించారని దుయ్యబట్టారు. టీడీపీ తీరు శాసనసభను కించపరిచే విధంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ ప్రసంగం రోజే టీడీపీ వైఖరి బయటపడిందని తెలిపారు. స్పీకర్ పట్ల దురుసుగా ప్రవర్తించిన వారిని సస్పెండ్ చేయకుండా ఏం చేస్తామని ప్రశ్నించారు. -
నా పులులతోపాటే నేనూ!
తణుకు: ఓ పక్క ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులు.. కళ్లెదుటే బాంబుల వర్షం.. ప్రాణాలు అరచేత పట్టుకుని గడుపుతున్న జనం.. ఈ పరిస్థితుల్లో రోజురోజుకూ అక్కడి పరిస్థితులు అధ్వానంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడకు చదువు కోసం, ఉద్యోగం కోసం వెళ్లిన భారతీయులంతా స్వదేశానికి చేరుకుంటున్నప్పటికీ.. పశ్చిమగోదావరి జిల్లా తణుకు పట్టణానికి చెందిన డాక్టర్ గిరిష్‌కుమార్ పాటిల్ మాత్రం స్వదేశానికి వచ్చేందుకు ససేమిరా అంటున్నారు. అందుకు కారణం.. తాను ప్రాణానికి ప్రాణంగా పెంచుకుంటున్న వన్యప్రాణులను వదిలి రాలేకపోవడమే. తణుకు పట్టణానికి చెందిన డాక్టర్ గిరికుమార్ 2007లో ఉక్రెయిన్‌లో మెడిసిన్ పూర్తి చేశారు. చదువు పూర్తయ్యాక సెవెరోగోనెట్కస్ నగరంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఆర్థోపెడిక్ సర్జన్ వద్ద అసిస్టెంట్ డాక్టర్‌గా పనిచేస్తున్నారు. జంతువులంటే ఇష్టపడే గిరికుమార్ దాదాపు రెండేళ్ల క్రితం ఒక జూలో గాయపడిన జాగ్వార్ (మచ్చలు కలిగిన చిరుతపులి)ను అధికారుల అనుమతితో దత్తత తీసుకున్నారు. దీనికి తోడుగా అర్నెళ్ల క్రితం బ్లాక్ పాంథర్ (నల్ల చిరుతపులి)ను పెంచుతున్నారు. ఇటాలియన్ మెష్టిఫ్ సంతతికి చెందిన మరో మూడు కుక్కలనూ పెంచుకుంటున్నారు. ఉక్రెయిన్‌లో యుద్ధం మొదలయ్యాక ఆరు రోజుల పాటు జంతువులతోపాటు బంకర్లో దాక్కున్న ఆయన ప్రస్తుతం తన ఇంటి వద్ద బేస్మెంట్లో ఉంటున్నారు. తాను నివాసం ఉంటున్న ప్రాంతాలను రష్యా సైనికులు తమ ఆధీనంలోకి తీసుకోవడంతో ప్రస్తుతం కర్ఫ్యూ కొనసాగుతోంది. ఈ పరిస్థితుల్లో బయటకు వెళ్లే అవకాశం లేకపోగా నాలుగైదు రోజులకు సరిపడా ఆహారం మాత్రం అందుబాటులో ఉన్నట్లు గిరికుమార్ ‘సాక్షి’తో చెప్పారు. ప్రముఖుల ఫోన్లకు బదులేమిచ్చారంటే.. గిరికుమార్‌తో ఇటీవల ఎంపీ విజయసాయిరెడ్డి ఫోన్లో మాట్లాడారు. పీఎం కార్యాలయం ప్రతినిధులతోపాటు మాజీ సీఎం చంద్రబాబు సైతం గిరికుమార్‌తో సంప్రదింపులు చేశారు. అయితే.. తాను పెంచుకుంటున్న జంతువులకు లైసెన్సులు ఇచ్చి.. ఆంధ్రప్రదేశ్‌లోని ఏజెన్సీ ప్రాంత సమీపంలోని గోకవరం వద్ద సఫారీ ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. అలా అయితేనే తాను స్వదేశానికి రావడానికి సిద్ధంగా ఉంటానని స్పష్టం చేసి.. జంతువులపై తనకున్న ప్రేమను చాటుకున్నారు. -
కోడి ధరకు రెక్కలు.. అమాంతం పెరిగిన ధర.. అమ్మో అంత రేటా?
తణుకు: చికెన్ ధరలు అమాంతం పెరిగాయి. సాధారణంగా ఎండాకాలం మొదలవగానే చికెన్ ధరలు తగ్గుతుంటాయి. అయితే ఒక్కసారిగా ఉత్పత్తి తగ్గడంతో ధర అమాంతం పెరిగింది. వారం రోజుల క్రితం వరకు కిలో స్కిన్లెస్ చికెన్ రూ.180, స్కిన్ చికెన్ రూ. 160 ఉండగా.. ప్రస్తుతం మార్కెట్లో కిలో స్కిన్ చికెన్ రూ.280కు విక్రయిస్తున్నారు. స్కిన్ లెస్ రూ.300 పలుకుతోంది. ఈ ధరలు చూసి కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ముందుకు రావడంలేదు. దాంతో వ్యాపారాలు మందగించినట్లు వ్యాపారులు చెబుతున్నారు. ఇటీవల మేత ధరలు విపరీతంగా పెరగడంతో కొత్త బ్యాచ్‌లు వేసేందుకు రైతులు వెనుకంజ వేస్తున్నారు. దీంతో బహుళజాతి సంస్థల నుంచి కోళ్లను దిగుమతి చేసుకుంటున్నారు. ఫలితంగా చికెన్ ధరలకు రెక్కలు వచ్చినట్లు వ్యాపారులు చెబుతున్నారు. మేత ధరల మోత జిల్లాలో సాధారణంగా రోజుకు 2 లక్షల కిలోల మేర చికెన్ వినియోగిస్తుండగా ఆదివారం, ఇతర పండుగల రోజుల్లో రెట్టింపు అమ్మకాలు జరుగుతుంటాయి. జిల్లా వ్యాప్తంగా దాదాపు 500 ఫారాల్లో 8 లక్షలకు పైగా బ్రాయిలర్ కోళ్లు పెరుగుతున్నాయి. సాధారణంగా ఎండలు పెరుగుతున్న సమయంలో చికెన్ ధర తగ్గుతుంది. ఈ సారి ధర పెరగడంతో అటు వ్యాపారులు, ఇటు సామాన్యులకు చికెన్ గుబులు పుట్టిస్తోంది. సాధారణంగా రెండు కిలోల కోడి తయారు కావడానికి 40 రోజులు సమయం పడుతుంది. ఎండాకాలంలో మేత సరిగ్గా తినకపోవడంతో 60 రోజులు పడుతోంది. ఈ పరిస్థితుల్లో మేత ధరలు అమాంతం పెరగడంతో కొత్త బ్యాచ్‌లు వేయడంలేదు. దీంతో అనుకున్న సమయానికి కోళ్లు ఉత్పత్తి కావడంలేదు. మరోవైపు పౌల్ట్రీ రైతులు నష్టాల బాట పడుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ధరలు పెంచుతున్నారు. బ్రాయిలర్‌తో పోల్చితే లేయర్ చికెన్ ధరలు పెద్దగా పెరగకపోవడం వినియోగదారులకు కొంత ఊరటనిస్తోంది. తగ్గిన బ్రాయిలర్ కోళ్ల పెంపకం ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ఇతరత్రా కారణాలతో కొద్ది రోజుల వ్యవధిలోనే మేత ధర పెరిగింది. స్థానిక ఉత్పత్తులు ఇతర దేశాలకు ఎగుమతి అవుతుండటం, కొత్త పంటలు మార్కెట్లోకి రాకపోవడం మేత ధర పెరుగుదలకు కారణంగా చెబుతున్నారు. బ్రాయిలర్ కోడి మేతలో ప్రధానమైన సోయాబీన్ ధర నెల రోజుల్లో కిలోకు ఏకంగా రూ. 35 నుంచి రూ.90కి పెరిగింది. మొక్కజొన్న కిలో రూ. 12 నుంచి రూ. 24కి పెరిగింది. ఈ పరిస్థితుల్లో బ్రాయిలర్ కోళ్ల పెంపకం సగానికిపైగా తగ్గిపోయింది. దీంతో ఉభయగోదావరి జిల్లాలతోపాటు తెలంగాణలోని బ్రాయిలర్ కంపెనీల నుంచి స్థానిక వ్యాపారులు కోళ్లను దిగుమతి చేసుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో బ్రాయిలర్ ధర మరింత పెరిగే అవకాశం ఉందని హోల్‌సేల్ వ్యాపారులు చెబుతున్నారు. (చదవండి: లైఫ్ ఈజ్ రయ్రయ్) డిమాండ్‌కు తగ్గ సరఫరా లేదు మేత ధరలు పెరిగిపోవడంతో రైతులు కొత్త బ్యాచ్‌లు వేసేందుకు ముందుకు రావడంలేదు. దీంతో జిల్లాలో డిమాండ్‌కు తగినట్లుగా కోళ్లు అందుబాటులో లేవు. దీంతో చికెన్ ధర పెరిగింది. మేత ధరలు గతంలో ఎప్పుడూ లేనంతగా కేవలం రెండు నెలల్లో మూడు రెట్లు పెరిగాయి. మేత ధరలు తగ్గి కొత్త బ్యాచ్‌లు వస్తేనే ధరలు తగ్గుతాయి. -బండి గణేష్, చికెన్ వ్యాపారి, తణుకు -
ఆకలితో బంకర్లలోనే బిక్కుబిక్కుమంటూ.. కనీసం తాగునీరు లేక..
సాక్షి, పశ్చిమగోదావరి(తణుకు టౌన్): ఓ పక్క యుద్ధం.. బాంబుల మోత.. మరోపక్క విమానాల రద్దు.. వెనక్కి వెళ్లే అవకాశం లేక బంకర్లో ఇరుక్కుని తెలుగు విద్యార్థులు ఉక్రెయిన్‌లో ప్రాణాలు అరచేత పట్టుకొని బిక్కుబిక్కుమంటున్నారు. మైనస్ 2 డిగ్రీల చలిలో, తాగునీరు సరిగా అందని పరిస్థితుల్లో తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. రెండు రోజులుగా కనీసం తాగునీరు కూడా లేక ఇబ్బందులు పడుతున్నామని ఉక్రెయిన్‌లో వైద్య విద్యనభ్యసిస్తున్న తణుకు పట్టణానికి చెందిన తమలం అభిజ్ఞ వాట్సప్ కాల్లో తెలిపింది. శుక్రవారం మధ్యాహ్నం తణుకులోని తన తల్లిదండ్రులు జయకుమార్, సత్య భారతితో వాట్సప్ కాల్లో మాట్లాడుతూ తమను స్వదేశాలకు పంపించాలని, ఆన్లైన్ ద్వారా పాఠాలు చెప్పాలని యూనివర్సిటీ వారిని కోరినా, వారు పట్టించుకోలేదని కన్నీటి పర్యంతమవుతూ చెప్పింది. 26న యుద్ధం జరగవచ్చని ముందుగా ప్రచారం జరిగిందని, ఈ నేపథ్యంలో 25 నాటికి విమానం టిక్కెట్ బుక్ చేయగా, 24నే రష్యా యుద్ధం ప్రారంభించిందని తెలిపింది. శుక్రవారం మధ్యాహ్నం నుంచి ఎంబసీ సిబ్బంది వాహనాల ద్వారా ఉత్తర ప్రాంతాలకు రావాలని తమకు సూచిస్తున్నారని, అసలే యుద్ధం జరుగుతున్నవేళ విదేశీయులు అక్కడి వాహనాల్లో సుమారు 60 కిలోమీటర్ల దూరం ప్రయాణించడమంటే ఎలా అని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ పిల్లలను స్వదేశానికి రప్పించాలని కోరుతున్నారు. చదవండి: (ఉక్రెయిన్‌లో చిక్కుకున్న ఏపీ విద్యార్థుల కోసం టాస్క్‌ఫోర్స్) ఆకలితో బంకర్లలోనే.. కార్కైవ్లోని మెట్రో రైల్వేస్టేషన్ బంకర్ వివిధ దేశాలకు చెందిన సుమారు 200 మంది ప్రజలతో కిక్కిరిసిపోయిందని, ఇక్కడ లైటింగ్ తప్ప ఫ్యాన్లు లేవని అభిజ్ఞ చెప్పింది. సెల్‌ఫోన్ చార్జింగ్ కోసం స్టేషన్ పైకి వెళ్లాల్సి వస్తోందని, మరుగుదొడ్లకు కూడా భయం భయంగా బంకర్ పైకి వెళ్లాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది. గురువారం రాత్రి తనకు సమీపంలోనే సైనికుని మృతదేహం పైనుంచి పడిందని, దానిని చూసి చాలా భయపడ్డామని వివరించింది. సురక్షితంగా రప్పిస్తాం ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన తెలుగు విద్యార్థులను స్వదేశానికి రప్పించేందుకు ముఖ్యమంత్రి అన్ని ప్రయత్నాలూ చేపట్టారని, విద్యాశాఖ మంత్రి, ఢిల్లీలోని ఆంధ్రాభవన్ అధికారులు, విదేశీ రాయబార కార్యాలయాల అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు చేస్తున్నారని ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు చెప్పారు. విమానాల రద్దుతో ఆందోళన తణుకు: తణుకు పట్టణానికి చెందిన సారిపల్లి తులసి ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయింది. ఆమె జపరంజియా స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో రెండో ఏడాది ఎంబీబీఎస్ చదువుతోంది. ప్రస్తుతం ఆ దేశంపై రష్యా దాడుల నేపథ్యంలో తులసి బిక్కుబిక్కుమంటూ గడుపుతోంది. స్వదేశానికి రావడానికి శుక్రవారం ఉదయం ఉక్రెయిన్ నుంచి టెకెట్ బుక్ చేసుకుంది. విమానాశ్రయానికి వచ్చేసరికి విమానం రాకపోకలు రద్దని చెప్పడంతో చేసేది లేక తిరిగి యూనివర్సిటీ హాస్టల్‌కు వెళ్లిపోయింది. విషయం తెలుసుకున్న తులసి తల్లిదండ్రులు శ్రీనివాసరావు, పార్వతి తమ కుమార్తె కోసం తల్లడిల్లిపోతున్నారు. అమ్మా.. నేను క్షేమం ఆకివీడు: సాఫ్ట్వేర్ ఉద్యోగం కోసం మూడు నెలల క్రితం ఉక్రెయిన్ వెళ్లిన ఆకివీడుకు చెందిన చుక్కా మోహన ప్రియ అక్కడ క్షేమంగా ఉన్నట్టు తల్లి విజయకు ఫోన్ ద్వారా తెలిపింది. -
సంచలనం రేకెత్తించిన దంపతుల ఆత్మహత్య.. తణుకు ఎస్సై సస్పెన్షన్
సాక్షి, తణుకు (పశ్చిమగోదావరి): తణుకులో సంచలనం రేకెత్తించిన దంపతుల ఆత్మహత్య వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలతో తణుకు పట్టణ ఎస్సై కె.గంగాధరరావును సస్పెండ్ చేస్తూ జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. పట్టణానికి చెందిన లక్ష్మీదుర్గ గతేడాది అక్టోబర్ 16న ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ కేసులో కేవలం అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన ఎస్సై గంగాధరరావు దర్యాప్తులో నిర్లక్ష్యం వహించారనే ఆరోపణలు ఉన్నాయి. ఇదిలా ఉండగా తన భార్య మృతిపై దర్యాప్తు చేయాలని కోరుతూ భర్త వెంకటేష్ పోలీస్‌స్టేషన్ చుట్టూ తిరిగారు. అయితే న్యాయం చేయకపోగా సెటిల్మెంట్ చేసుకోవాలని పోలీసులు సూచించడంతో వెంకటేష్ ఇటీవల సెల్ఫీ సూసైడ్ వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై దళిత సంఘాలు ఆందోళనకు దిగడంతో ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. ఎస్సై నిర్లక్ష్యంగా వ్యవహరించారని ప్రాథమికంగా గుర్తించిన ఉన్నతాధికారులు ఆయనపై సస్పెన్షన్ వేటు వేశారు. చదవండి: (ఎలాంటి బాధా లేకుండా చనిపోవడం ఎలా అని చర్చ..?.. అంతలోనే) -
సకల శాస్త్రాలకు మాతృక వేద విజ్ఞానమే
తణుకు టౌన్: సకల శాస్త్రాలకు మన ప్రాచీన వేదాలే మూలమని.. న్యాయశాస్త్రానికి కూడా వేద విజ్ఞానమే మాతృక అనిరాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యు.దుర్గాప్రసాదరావు చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం దువ్వ గ్రామంలోని శ్రీ పర్వత వర్దని సమేత నాగేశ్వరస్వామి ఆలయంలో నిర్వహించిన వేదశాస్త్ర పండిత సత్కార సభ 13వ వార్షికోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. చిర్రావూరి శ్రీరామచంద్రశర్మ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జస్టిస్ దుర్గా ప్రసాదరావు మాట్లాడుతూ.. వేదం శాస్త్రీయత కలిగిన శాస్త్రమని, ఇది మానవుని గురించి సమగ్రంగా చర్చించిన శాస్త్రమని చెప్పారు. వేదాలే ప్రపంచానికి మార్గనిర్దేశం చేశాయని, వేద విజ్ఞానంపై ప్రతి ఒక్కరూ గౌరవభావం పెంపొందించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా చిర్రావూరి శివరామకృష్ణ రాసిన ‘వేదవేదాంగ నివేదన’ పుస్తకాన్ని శృంగేరి విరూపాక్ష పీఠాధిపతి గంభీరానంద స్వామీజీ, హైకోర్టు జడ్జి దుర్గాప్రసాదరావు, హైకోర్టు అడ్వకేట్ జనరల్ సుబ్రహ్మణ్యం శ్రీరామ్, జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా, హైకోర్టు న్యాయవాదులు చల్లా ధనుంజయ, డాక్టర్ శాస్త్రి జంధ్యాల, వేద పండితులు కడియాల సీతారామ ఘనాపాటి, దోర్భల ప్రభాకరశర్మ, విశ్వనాథం గోపాలకృష్ణ, తహసీల్దార్ పీఎన్డీ ప్రసాద్, ఎంపీపీ రుద్రా ధనరాజు, గ్రామ సర్పంచ్ అడాడ బాబు, ఆలయ కమిటీ చైర్మన్ కోనాల మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. తొలుత శ్రీ పర్వత వర్దని సమేత నాగేశ్వరస్వామి వారిని జస్టిస్ దుర్గాప్రసాదరావు కుటుంబ సమేతంగా దర్శించుకుని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. -
ఆహారం మిగిలిందా.. మాకివ్వండి
తణుకు అర్బన్(పశ్చిమగోదావరి): శుభ కార్యాల్లో ఆహారం మిగిలిపోయిందా? హోటళ్లలో భోజనం, అల్పాహారం ఉండిపోయిందా.. అయితే ఆ ఆహారాన్ని మాకందించండి మీ తరపున పేదలకు అందిస్తాం అంటున్నాయి తణుకుకు చెందిన ఫీడ్ ద నీడ్ – గిఫ్ట్ ఎ మీల్ రిఫ్రిజరేటర్స్ కేంద్రాలు. పేదల ఆకలిని తీర్చేందుకు తణుకు ప్రభుత్వ ఆస్పత్రి ముఖద్వారంలో, తణుకు సొసైటీ రోడ్డులోని బాలగంగాధర తిలక్ ఆడిటోరియం ప్రాంతంలో ఈ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఏ ఒక్కరూ ఆకలితో పడుకోకూడదనే.. ఏ ఒక్కరూ కూడా ఆకలితో పడుకోకూడదనే లక్ష్యంతో ఫీడ్ ద నీడ్ ఫ్రిజ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మిగిలిపోయిన ఆహారాన్ని భద్రపరిచే ఆలోచనతో తణుకులో ఏర్పాటుచేసిన రెండు కేంద్రాలు ఇప్పుడు అన్నపూర్ణలుగా మారాయి. ఫీడ్ ద నీడ్ – గిఫ్ట్ ఏ మీల్ రిఫ్రిజరేటర్లను ఈనెల 21న ప్రారంభించారు. ఈ రెండు కేంద్రాలు పేదలకు ఆహారాన్ని అందించడంలో సేవలందిస్తున్నాయి. ఆకలి బాధను దిగమింగుకుంటూ అడుగులు వేస్తున్న పేద అవ్వా తాతలు, దివ్యాంగుల, అనాథల కడుపులు నింపుతున్నాయి. ఈ కేంద్రాల్లో మూడు షిఫ్టుల్లోను ముగ్గురు ,చొప్పున ఆరుగురు విధుల్లో ఉండి పేదలకు ఆహారాన్ని అందించేలా రూపకల్పన చేశారు. కేంద్రానికి వచ్చే ఆహార పదార్థాల్ని ఫ్రిజ్‌ల్లో భద్రపరచడం, ఆహారం కోసం వచ్చే పేదలకు ఆహారాన్ని అందించడం సిబ్బంది కర్తవ్యం. ఈ కేంద్రాల ఏర్పాటుపై ప్రజలు, ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గృహాలు, శుభకార్యాల్లో మిగిలిన ఆహారం గృహాలు, శుభకార్యాల్లోను మిగిలిపోయిన ఆహారాన్ని పారవేయకుండా ఔదార్యం ఉన్న మహానుభావులు ఈ కేంద్రాలకు తరలిస్తే వాటిని ఫ్రిజ్‌లలో ఉంచి పేదలకు అందించే విధంగా ఏర్పాటుచేశారు. మానవత్వం, సామా జిక స్పృహ కలిగిన ప్రతి ఒక్కరూ ఆహారాన్ని వృథాగా పారవేయకుండా ఈ కేంద్రాలకు అందచేయాలని నిర్వాహకులు కోరుతున్నారు. ఎమ్మెల్యే కారుమూరి, పట్టాభి ఫౌండేషన్ ఔదార్యం ఆపిల్ హోమ్ రియల్ నీడ్ ఇండియా ఫౌండేషన్ సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న ఫీడ్ ద నీడ్ ఫ్రిజ్ కేంద్రాల్లో ఒక కేంద్రం ఏర్పాటుకు తణుకు ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు రూ. 7 లక్షలు అందించగా, మరొక కేంద్రాన్ని తణుకుకు చెందిన పట్టాభి ఫౌండేషన్ సంస్థ ఏర్పాటుచేశారు. అంతేకాకుండా మునిసిపాలిటీ కూడా విద్యుత్ తదితర సౌకర్యాలు కల్పించారు. గుప్పెడు ఆహారం అందించడం కోసమే.. పేదలకు గుప్పెడు ఆహారం అందించాలనే లక్ష్యంతో ఫీడ్ ద నీడ్ ఫ్రిజ్ కేంద్రాలు ఏర్పాటుచేశాం. రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గానికి రెండు చొప్పున ఏర్పాటుచేయాలనే లక్ష్యంతో సంస్థ పనిచేస్తోంది. ఆహారం లేక ఖాళీ కడుపుతో ఏ ఒక్కరూ పడుకోకూడదనే ఉద్దేశ్యంతో ఈ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. తణుకు ఎమ్మెల్యే కారుమూరి, అధికారులు ఎంతగానో ప్రోత్సాహం అందించారు. – డాక్టర్ నీలిమ ఆర్య, ఆపిల్ హోమ్ రియల్ నీడ్ ఇండియా పేదలకు ఆహారం అందించాలనే లక్ష్యం నచ్చి.. వారసుల ఆదరణ కొరవడిన అవ్వా, తాతలు, అనాథలు, దివ్యాంగులు ఆహారం కోసం చాలా ఇబ్బందులు పడుతున్నారు. స్వతహాగా అన్నం పెట్టడమంటే నాకు చాలా ఇష్టం. పేదలకు ఆహారం అందాలనే లక్ష్యం నచ్చి ఆపిల్ హోమ్ రియల్ నీడ్ ఇండియా ఫౌండేషన్ ప్రతినిధి కేంద్ర ఏర్పాటుపై నా దృష్టికి తీసుకురాగానే వెంటనే నా వంతుగా సాయం చేశాను. ఆ కేంద్రాల ద్వారా పేదల ఆకలి తీరడం నాకు చాలా ఆనందంగా ఉంది. – కారుమూరి వెంకట నాగేశ్వరరావు, తణుకు ఎమ్మెల్యే -
జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం
-
పేదవాడికి మేలుచేస్తుంటే చూడలేకపోతున్నారు: సీఎం జగన్
-
సీఎం వైఎస్ జగన్ గ్రాండ్ ఎంట్రీ
-
మంచి చేస్తుంటే ఎందుకంత కడుపుమంట: సీఎం జగన్
సాక్షి, పశ్చిమగోదావరి జిల్లా: పేదవాడికి మంచి జరుగుతుంటే జీర్ణించుకోలేని వారిని నిలదీయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘నామ మాత్రపు ధరకు రిజిస్ట్రేషన్ చేయించి ఇస్తుంటే మీకెందుకు కడుపుమంట అని అడగండి. మా ఇళ్లను ఓటీఎస్ లేకుండా మార్కెట్ రేట్ల కొంటారా అని అడగండి. మా అన్న ప్రభుత్వం ఉచితంగా రిజిస్ట్రేషన్‌చేస్తుంటే మీకెందుకు కడుపుమంట అని చంద్రబాబు, రామోజీరావు, రాధాకృష్ణను ప్రశ్నించాలి’’ అని సీఎం అన్నారు. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు లేకపోతే మీరు కొంటారా? అని వారిని ప్రశ్నించాలన్నారు. ‘‘మీ ఆస్తులైతే రిజిస్ట్రేషన్లు అయి ఉంటాయి. పేదవాళ్లకైతే రిజిస్ట్రేషన్లు అవ్వకూడాదా? మంచి చేస్తుంటే చంద్రబాబు, రామోజీరావు, రాధాకృష్ణ జీర్ణించుకోలేపోతున్నారని’’ అని ముఖ్యమంత్రి జగన్ మండిపడ్డారు. వడ్డీ మాఫీ చేయమని ప్రతిపాదనలు ఐదు సార్లు పంపితే.. ఏదో ఒక వంకతో తిప్పి వెనక్కి పంపిన పెద్ద మనిషి చంద్రబాబు. రుణమాఫీ కాదు కాదా.. వడ్డీ మాఫీ చేయని పెద్ద మనుషులు వీరు’’ అని సీఎం దుయ్యబట్టారు. ఇల్లు అంటే ఇటుకలు, స్టీలుతో కట్టిన కట్టడం కాదని.. సుదీర్ఘకాలం పడిన కష్టానికి ప్రతి రూపం ఇల్లు అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. 50 లక్షల మంది కుటుంబాలకు లబ్ధిచేకూరే మరో మంచి కార్యక్రమానికి ఈ రోజు శ్రీకారం చుట్టామన్నారు. చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా సొంతింటి కల నెరవేస్తున్నామన్నారు. ఓటీఎస్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 50 లక్షలకు పైగా కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందన్నారు. చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా ఓటీఎస్ కార్యక్రమం చేపట్టామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 31 లక్షల ఇళ్ళ పట్టాలు ఇచ్చామన్నారు. ‘‘ఇప్పటికే 15.60 లక్షల ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇంటిపై సర్వహక్కులు కల్పనకే జగనన్న సంపూర్ణ గృహ పథకం. రాష్ట్రవ్యాప్తంగా 52 లక్షల మందికి సర్వ హక్కులతో రిజిస్ట్రేషన్. ఈ పథకం కింద దాదాపు రూ.10 వేల కోట్ల రుణమాఫీ. రూ.6 వేల కోట్ల రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ ఛార్జీల మినహాయింపు. 52 లక్షల మందికి ఇచ్చే ఆస్తి విలువ రూ.లక్షా 58 వేల కోట్లు. సొంతిల్లు ఉంటే అమ్ముకునే హక్కు కూడా ఉంటుందని’’ సీఎం అన్నారు. తణకులో ఇంటి మార్కెట్ విలువ రూ.30 లక్షల వరకు ఉంది. గతంలో కేవలం నివసించే హక్కు మాత్రమే ఉన్న లబ్ధిదారులను ఇవాళ్టి నుంచి పూర్తిస్థాయి యజమానులుగా మారుస్తున్నాం. కుటుంబ అవసరాల కోసం బ్యాంకుల్లోనూ తాకట్టు పెట్టుకోవచ్చు. ఈ పథకం కింద దాదాపు రూ.10వేల కోట్ల రుణమాఫీతో పాటు రూ.6వేల కోట్ల రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ ఛార్జీల మినహాయింపుతో దాదాపు రూ.16వేల కోట్ల మేర లబ్ధి చేకూరుతుందన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
రిజిస్ట్రేషన్ స్టాల్స్ పరిశీలిస్తున్న సీఎం వైఎస్ జగన్
-
CM YS Jagan: జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం ప్రారంభం
Time 1.20 PM జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తణుకులో లాంఛనంగా ప్రారంభించారు. ఇల్లు అంటే ఇటుకలు, స్టీలుతో కట్టిన కట్టడం కాదు: సీఎం జగన్ జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం ద్వారా ఈ రోజు మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అన్నారు. 'ఇప్పటి వరకు 31లక్షల ఇళ్ల పట్టాలను పంపిణీ చేశాం. చరిత్రలో కనీవినీ ఎరగని విధంగా సొంతింటి కల నెరవేరుస్తున్నాం. 50 లక్షల మంది కుటుంబాలకు మంచి జరిగే రోజు ఇది. ఇల్లు అంటే ఇటుకలు, స్టీలుతో కట్టిన కట్టడం కాదు. సుదీర్ఘకాలం పడిన కష్టానికి ప్రతిరూపం ఇల్లు. గతంలో నివసించే హక్కు స్థానంలో సర్వహక్కులతో రిజిస్ట్రేషన్ చేయించాము. 26వేల కోట్ల రూపాయల విలువైన 31 లక్షల ఇళ్లు మంజూరు చేశాము. ఈ పథకం కింద దాదాపు రూ.10వేల కోట్ల రుణమాఫీ చేశాము. రూ.6వేల కోట్ల రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ ఛార్జీల మినహాయింపు ఇచ్చాము. 52లక్షల మందికి ఇచ్చే ఆస్తి విలువ అక్షరాలా రూ.లక్షా 58వేల కోట్లు. అందరూ లబ్ధి పొందాలనే ఆలోచనలో భాగంగానే జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం ఉగాది వరకు పొడిగిస్తున్నాం' అని సీఎం జగన్ అన్నారు. పేదల గురించి ఆలోచించే వ్యక్తి సీఎం జగన్ మాత్రమే టీసీఎస్ ఉద్యోగి శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ.. ఓటీఎస్ పథకం మా కుటుంబానికి ఎంతో స్వాంతన కలిగించింది. రాష్ట్రంలో పేదల గురించి సీఎం జగన్ ఆలోచించినంతగా మరే వ్యక్తి ఆలోచించలేరు. ఈ పథకంపై టీడీపీ నాయకులు మా ఇంటికి వచ్చి ప్రభుత్వం వచ్చాక రూపాయి లేకుండా ఇంటి పట్టా ఇస్తామని చెప్పారు. ఆ విషయం వినగానే నాకు నవ్వొచ్చింది. నాతో మాట్లాడిన పాలకులే మూడేళ్ల కింద అధికారంలో ఉన్నారు. ఆనాడు ఏమీ చేయక ఇప్పుడు ఏదో చేస్తామని మభ్యపెట్టడం టీడీపీ నాయకులకే సాధ్యమని అన్నారు. లబ్ధిదారు సుజాత భావోద్వేగం ►సంపూర్ణ గృహ హక్కు పథకం లబ్ధిదారు సుజాత మాట్లాడుతూ.. 'ఈ పథకం పెట్టినందుకు మీకు ధన్యవాదాలు అన్న. 9 ఏళ్ల క్రితం నేను ఇళ్లు కట్టుకున్నా అయితే ఇప్పటిదాకా ఇంటికి సంబంధించి నాకు ఎటువంటి ఇంటి పత్రం లేదు. ఇప్పుడు ఈ పథకం క్రింద దాదాపు పది లక్షల రూపాయల ఆస్తిని నా చేతిలో పెడుతున్నారు. నాకు చాలా సంతోషంగా ఉందన్నా అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. ►తణుకు బహిరంగసభలో పాల్గొన్న సీఎం జగన్ 11:35AM ►తణుకు చేరుకున్న సీఎం వైఎస్ జగన్ 08:10AM సాక్షి, ఏలూరు/తణుకు అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకాన్ని మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తణుకులో లాంఛనంగా ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రి హోదా లో ఆయన తొలిసారి తణుకు రానుండటంతో అధి కార యంత్రాంగం, పార్టీ నాయకులు అట్టహాసంగా ఏర్పాట్లు చేశారు. లబ్ధిదారులకు గృహహక్కు పత్రాల పంపిణీని సీఎం వైఎస్ జగన్ లాంఛనంగా ప్రారంభించనున్నారు. తొలిరోజు జిల్లావ్యాప్తంగా సుమారు 25 వేల మందికి పత్రాలు పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు బాండ్లను ఆయా మండల కేంద్రాలకు పంపారు. భారీ స్వాగత ఏర్పాట్లు : తణుకు జెడ్పీ బాలుర హైస్కూల్లో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. పట్టణమంతా వైఎస్సార్సీపీ జెండాలతో రెపరెపలాడుతోంది. భారీ కటౌట్లు, స్వాగత ఫ్లెక్సీలు అలరిస్తున్నాయి. మరోవైపు సీఎం వైఎస్ జగన్ పుట్టినరోజు కూడా కావడంతో భారీఎత్తున స్వాగతం పలికేందుకు పార్టీ నాయకులు ఏర్పాట్లు చేశారు. పట్టణంలో సుమారు రూ.171.48 కోట్ల నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేయనున్నారు. ముస్తాబైన స్టాల్స్ : సభావేదిక ప్రాంతంలో గృహనిర్మాణ శాఖ, నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు, ఓటీఎస్ పథకం వంటి స్టాల్స్‌ను ముస్తాబుచేశారు. ఫొటో గ్యాలరీ, ఓటీఎస్ లబ్ధిదారులతో కలిసి ముఖ్యమంత్రి ఫొటో దిగే ప్రాంతాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. హెలికాప్టర్ ట్రయల్‌రన్ ముఖ్యమంత్రి ప్రయాణించనున్న హెలికాప్టర్ ట్రయల్‌రన్ నిమిత్తం తణుకు ఎస్‌కేఎస్‌డీ మహిళా కళాశాల సమీపంలోని హెలీప్యాడ్‌కు వచ్చింది. సీఎం ప్రోగ్రామ్స్ కో–ఆర్డినేటర్, ఎమ్మెల్సీ తలశిల రఘురాం హెలికాప్టర్లో వచ్చి స్వయంగా పరిశీలించారు. రూ.10 వేల కోట్ల భారం తగ్గింపు ఓటీఎస్ పథకం ద్వారా సంపూర్ణ గృహహక్కు కల్పించే దిశగా 22–ఏ తొలగింపు, స్టాంపు డ్యూటీ, ట్రాన్స్ఫర్ డ్యూటీ, యూజర్ చార్జీలను ప్రభుత్వం రద్దు చేసింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ చేసి డాక్యుమెంట్, ఫీల్డ్‌స్కెచ్ పత్రం, లోన్ క్లియరెన్స్ సర్టిఫికెట్లు జారీ చేస్తారు. రాష్ట్రవ్యాప్తంగా పేదలకు సుమారు రూ.10 వేల కోట్ల భారాన్ని తగ్గించే దిశగా ఓటీఎస్ పథకాన్ని రూపొందించి అమలుచేస్తున్నారు. జిల్లాలో 1.04 లక్షల మంది ముందుకు.. జిల్లాలో ఓటీఎస్ పథకానికి 1,43,072 మంది అర్హులు ఉండగా ఇప్పటివరకూ 1,04,524 మంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. వీరందరికీ శాశ్వత గృహహక్కు పత్రాలు అందించేందుకు జిల్లా అధికారులు చర్యలు తీసుకున్నారు. అధునాతన రీతిలో సభావేదిక హైస్కూల్ ఆవరణలో అధునాతన రీతిలో సభావేదిక, ప్రజలు కూర్చునే ప్రాంతాన్ని తీర్చిదిద్దారు. వేదికపై భారీ స్క్రీన్స్ ఏర్పాటుచేశారు. మంత్రి శ్రీరంగనాథరాజు, సీఎం ప్రోగ్రామ్స్ కో–ఆర్డినేటర్, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, తణుకు, నిడదవోలు ఎమ్మెల్యేలు కారుమూరి నాగేశ్వరరావు, జి.శ్రీనివా సనాయుడు, కలెక్టర్ కార్తికేయ మిశ్రా, ఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ, హౌసింగ్ ఎండీ భరత్‌గుప్తా, జేసీ హిమాన్షు శుక్లా ఏర్పాట్లను సోమవారం పరిశీలించారు. పోలీసులు, ప్రత్యేక బలగాలతో భారీ బందోబస్తు ఏర్పాట్లుచేశారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) సభావేదికపై ఏర్పాటుచేసిన స్క్రీన్ -
ఏడేళ్ల వయస్సులో ప్రపంచ రికార్డు సొంతం
తణుకు(ప.గో జిల్లా) : చిన్నారి వయస్సు కేవలం ఏడేళ్లు... అయితేనేం వరల్డ్ రికార్డు సొంతం చేసుకుంది. తణుకు పట్టణానికి చెందిన చిన్నారి వేగేశ్న జ్యోత్స్న సాత్విక ఫైర్ విత్ బ్లేడ్ లింబో స్కేటింగ్‌లో ప్రపంచ రికార్డు సొంతం చేసుకుంది. వజ్ర వరల్డ్ రికార్డ్స్, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ సంయుక్త ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన సాహసోపేతమైన ప్రదర్శనలో జ్యోత్స్న సాత్విక విజయం సాధించింది. 26 మీటర్లు పొడవునా 8 అంగుళాల ఎత్తులో స్టాండ్స్, బ్లేడ్స్ ఏర్పాటు చేసి మంటల కింద నుంచి నిర్వహించిన ప్రదర్శనలో చిన్నారి విజయం సాధించి ఫైర్ విత్ బ్లేడ్ లింబో స్కేటింగ్ వజ్ర వరల్డ్ రికార్డ్స్ సీఈవో తిరుపతిరావు, కిడ్స్ వరల్డ్ రికార్డ్స్ సీఈవో అరుణ్, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ కోఆర్డినేటర్ ప్రతాప్‌లు చేతుల మీదుగా అవార్డులు అందుకుంది. స్కేటింగ్‌పై ఆసక్తితో... అయిదేళ్ల వయస్సు నుంచి చిన్నారి జ్యోత్స్న సాత్వికకు స్కేటింగ్‌పై మక్కువ. సాత్విక తాడేపల్లిగూడెంలోని ప్రైవేటు స్కూలులో మూడో తరగతి చదువుతోంది. ఆమెలోని ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు స్కేటింగ్ కోచ్ లావణ్య వద్ద శిక్షణ నిమిత్తం చేర్పించారు. తండ్రి ఫణికుమార్ వ్యవసాయం చేస్తుండగా తల్లి మోహననాగసత్యవేణి గృహిణి. తల్లిదండ్రులు చిన్నారిని నిత్యం చదువుతోపాటు స్కేటింగ్‌లో శిక్షణ ఇచ్చేందుకు ప్రోత్సహిస్తున్నారు. సుమారు ఏడాదిన్నరపాటు శిక్షణ తీసుకుని అనంతరం కోవిడ్ కారణంగా నిలిపివేసింది. అనంతరం ఇటీవల మూడు నెలలుగా కఠోర శిక్షణ తీసుకున్న చిన్నారి ఫైర్ విత్ బ్లేడ్ లింబో స్కేటింగ్‌లో ప్రపంచ రికార్డు కైవసం చేసుకుంది. స్కేటింగ్‌లో ఇప్పటి వరకు ఎవరూ చేయని విధంగా భవిష్యత్తులో వినూత్నంగా చేసి ఒలింపిక్స్‌లో పతకం సాధించాలని చిన్నారి సాత్విక చెబుతోంది. -
రాకెట్ ఇంధనం తణుకు నుంచే...
తణుకు: ప్రపంచ పటంలో తణుకు పట్టణానికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. తణుకులోని ఆంధ్రాషుగర్స్ వల్ల ఆ గుర్తింపు లభించింది అంటే అతిశయోక్తి కాదు. అయితే భారతీయ అంతరిక్ష పశోధన సంస్థ (ఇస్రో) చేస్తున్న రాకెట్ ప్రయోగాల్లో ఆంధ్రాషుగర్స్ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ ప్రయోగాలకు కావాల్సిన ద్రవరూప ఇంధనాన్ని రూపొందించడంలో ఆంధ్రాషుగర్స్ విజయం సాధించింది. చదవండి: త్వరలో జగనన్న సంపూర్ణ గృహ హక్కు రిజిస్ట్రేషన్లు ఇస్రో-ఆంధ్రాషుగర్స్ సహకారం 1984లో ప్రారంభం కాగా 1985 మార్చిలో వాణిజ్య ఉత్పత్తి ప్రారంభానికి పైలెట్ ప్రాజెక్టు స్థాపనకు ఇస్రో ఆంధ్రాషుగర్స్ మధ్య ఒప్పందం ఖరారు అయ్యింది. 1988 జులై 24న ప్లాంటును జాతికి అంకితం చేశారు. అతి కీలకమైన అంతరిక్ష పరిశోధన రంగంలో స్వయం సమృద్ధి దిశగా భారతదేశం సాగిస్తున్న జైత్రయాత్రలో ఇస్రో-ఆంధ్రాసుగర్స్ మధ్య ఏర్పడిన సహకారం ఫలప్రదమైన పాత్ర నిర్వహిస్తోంది. రాకెట్ ఇంధనం తయారీ ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన చిత్రపటంలో భారతదేశానికి సముచిత స్థానం కల్పించడంలో ఆంధ్రాషుగర్స్ ముఖ్య పాత్ర పోషించింది. తణుకు ప్లాంట్‌లో ఉత్పత్తి చేసిన ద్రవరూప ఇంధనం భారత మొట్టమొదటి స్వదేశీ పరిజ్ఞనంతో నిర్మించిన బహుళ ప్రయోజన ఉపగ్రహాలు INSAT-IIA, PSLV- D2, PSLV-D3 లలో వినియోగించారు. ప్రస్తుతం తణుకు పరిశ్రమలో చక్కెర ఉత్పత్తి నిలిచిపోయినప్పటికీ రాకెట్ ఇంధన తయారీతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందుతోంది. చదవండి: Andhra Pradesh: ‘డిజిటల్ హెల్త్’కు నాంది -
రాక్షసుల పూజలందుకున్న కపర్దీశ్వరుడు
Tanuku Kapardheswara Temple Story: తణుకు పట్టణంలో స్వయంభూగా వెలిసిన శివలింగం కలిగిన కపర్దీశ్వర స్వామి ఆలయం గురించి తెలుసుకోవాలంటే చరిత్ర పుటల్లోకి వెళ్లాలి. తారకాపురంగా పిలువబడే తణుకు పట్టణాన్ని తారకాసురుడు అనే రాక్షసుడు పరిపాలించేవాడని చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆలయం ఉన్న ప్రాంతంలో ఉన్న చెరువు వద్ద తారకాసురుడు నిత్యం పూజలు చేసేవాడని ఇదే క్రమంలో ఆయన మెడలోని లింగాన్ని కుమార స్వామి సంహరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. సంహరణకు గురైన లింగం అయిదు ముక్కలుగా తెగిపడి పంచారామక్షేత్రాలుగా పిలువ బడుతున్న ప్రాంతాల్లో పడినట్లు చెబుతుంటారు. ఇవే పాలకొల్లు, భీమవరం, సామర్లకోట, అరమరావతి, ద్రాక్షారామం అని పిలువబడుతున్న పంచారామక్షేత్రాలు. అయితే పంచారామ క్షేత్రాలను దర్శించిన భక్తులు తణుకులోని కపర్దీశ్వర స్వామి వారిని దర్శించుకుంటూ ఉంటారు. అయితే రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఆలయ గోపురంపై పూర్తిగా రాక్షసుల బొమ్మలు ఉంటడం ఇక్కడ విశిష్టత. తణుకు పట్టణంలోని పాతవూరు మున్సిపల్ కార్యాలయం ఆనుకుని వైష్ణవులు నిర్మించిన దేవాలయంగా పేరొందిన పార్వతి కపర్దీశ్వర స్వామి ఆలయంలో ఉత్సవాలు, కల్యాణాలు, గ్రామోత్సవాలు జగరకపోవడం విశేషం. కపర్దీశ్వర స్వామి వారు నిత్యం తపస్సులోనే ఉంటారని ఆలయ అర్చకులు చెబుతున్నారు. కార్తీకమాసం సమీపిస్తుండటంతో నవంబరు 5 నుంచి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. అల్లవరపు శంకరశర్మ ఇక్కడి ఆలయానికి ప్రత్యేకత... రాష్ట్రంలోనే కాదు ఎక్కడా లేనివిధంగా ఆలయ గోపురంపై రాక్షసుల విగ్రహాలు ఉండటం కపర్దీశ్వర స్వామి ఆలయం ప్రత్యేకత. రాక్షసులు పూజలు అందుకున్న స్వామివారుగా ప్రసిద్ధి చెందారు. పంచారామక్షేత్రాలు వెళ్లిన వారు కపర్దీశ్వరస్వామివారికి దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. – అల్లవరపు శంకరశ్మ, అర్చకుడు, తణుకు -
అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి.. పొరుగింట్లో నివాసం ఉండే..
సాక్షి, తణుకు: పట్టణానికి చెందిన వివాహిత కొల్లి విజయదుర్గ (25) శనివారం అనుమానాస్పద స్థితిలో మృతిచెందినట్టు ఎస్ఐ కె.గంగాధరరావు తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. పట్టణంలోని శీనివారి వీధిలో నివాసం ఉంటున్న కొల్లి వెంకట్, విజయదుర్గ ఆరేళ్ల క్రితం కులాంతర వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. వెంకట్ సర్వీసింగ్ షెడ్ నిర్వహిస్తున్నాడు. రెండు రోజులుగా భార్యాభర్తల మధ్య మనస్పర్థలు చోటుచేసుకున్నాయి. దీంతో వెంకట్ ఇంటికి రావడం లేదు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం విజయదుర్గ ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న భర్త వెంకట్ ఆమెను ఆస్పత్రికి తరలించే లోపే మృతిచెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. పొరుగింట్లో నివాసం ఉంటున్న ఓ మహిళ తన చావుకు కారణమని పేర్కొంటూ మృతురాలు రాసిన లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తణుకు సీఐ డీఎస్ చైతన్యకృష్ణ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఎస్సై కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (భర్త ప్రైవేట్ భాగాలపై మరిగే నీరు పోసి హత్యాయత్నం చేసిన మూడో భార్య) -
గంట గంటకో ర్యాంక్.. వేల నుంచి లక్షల్లోకి..
తణుకు టౌన్: జేఈఈ మెయిన్ 2021 ఫలితాల్లో విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఓ విద్యార్థికి వెబ్సైట్లో గంటకో ర్యాంకు కనిపిస్తోంది. దీంతో అతడు జేఈఈ మెయిన్‌లో తనకు వచ్చిన కచ్చితమైన ర్యాంక్ ఏమిటో తెలియక ఆందోళన చెందుతున్నాడు. వివరాల్లోకెళ్తే.. తణుకు రూరల్ మండలం దువ్వకు చెందిన ముదునూరి పృథ్వీరాజు జేఈఈ మెయిన్ (అప్లికేషన్ నంబర్ 210310578634)లో నాలుగు సెషన్స్‌కు హాజరయ్యాడు. తాజాగా ప్రకటించిన ఫలితాలను వెబ్సైట్ నుంచి ప్రింట్ తీసుకున్నాడు. వెబ్సైట్లో చూసినప్పుడు వేర్వేరు సమయాల్లో వేర్వేరు పర్సంటైల్‌తో, వేర్వేరు ర్యాంకులు కనిపిస్తున్నాయి. దీంతో పృథ్వీరాజు, అతడి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పృథ్వీకి ఫిబ్రవరిలో 23.98, మార్చిలో 64.99, జూలైలో 91.26, ఆగస్టు సెషన్లో 93.361 పర్సంటైల్ వచ్చింది. నాలుగో సెషన్లో మరింత మెరుగైన పర్సంటైల్ వస్తుందని భావించాడు. దీంతో మరోసారి వెబ్సైట్లో పరిశీలించగా ఈసారి 87.36 పర్సంటైల్ వచ్చినట్టు చూపించింది. దీంతో ఆందోళనకు గురైన అతడు మరో గంట తర్వాత చూడగా 64.99 పర్సంటైల్ వచ్చినట్టు చూపింది. నాలుగో సెషన్లో ఫిజిక్స్ పర్సంటైల్ చూపించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. గంటల వ్యవధిలోనే పర్సంటైల్ మారిపోవడంతో ర్యాంక్ కూడా వేలల్లో నుంచి లక్షల్లోకి మారిపోయిందని ఆందోళన చెందుతున్నాడు. కాగా, పర్సంటైల్ 93.361 ఉన్నప్పుడు జాతీయ స్థాయిలో జనరల్‌లో 43,204 ర్యాంక్, ఈడబ్ల్యూఎస్ విభాగంలో 16,025 ర్యాంకు వచ్చాయి. పర్సంటైల్ 87.36 ఉన్నప్పుడు జనరల్‌లో 45,289, ఈడబ్ల్యూఎస్ విభాగంలో 14,323గా ర్యాంకులు ఉన్నాయి. పర్సంటైల్ 64.99గా ఉన్నప్పుడు జనరల్ విభాగంలో 3,39,234, ఈడబ్ల్యూఎస్ విభాగంలో 43,805గా ర్యాంకులు ఉన్నాయి. ఈ విషయమై స్థానిక పాలిటెక్నిక్ కళాశాలలో సంప్రదించగా.. తాడేపల్లిగూడెంలోని నిట్‌లో సంప్రదించాలని తెలిపినట్టు తల్లిదండ్రులు చెప్పారు. -
ఏసీబీ దాడులు: అదుపులో తణుకు ఇన్చార్జి సబ్ రిజిస్ట్రార్
సాక్షి, తణుకు: పశ్చిమగోదావరి జిల్లా తణుకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు శుక్రవారం రాత్రి తనిఖీలు నిర్వహించారు. కార్యాలయంలో అదనంగా డబ్బులు వసూలు చేయడంతో పాటు పలు అవకతవకలు జరుగుతున్నట్టు ఫిర్యాదులు అందడంతో ఏసీబీ డీఎస్పీ టీఎస్ఆర్కే ప్రసాద్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. ఇన్చార్జి సబ్ రిజిస్ట్రార్ పెచ్చెట్టి రాంబాబు వద్ద లెక్కలు చూపని నగదు రూ.54,100 స్వాధీనం చేసుకున్నారు. డబ్బుల వసూలుకు ప్రైవేటుగా కొందరు వ్యక్తులను నియమించుకున్నట్టు తమ విచారణలో వెల్లడైందని డీఎస్పీ తెలిపారు. మరోవైపు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో మూడు అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగినట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. దీనిపై విచారణ చేసి సంబంధిత అధికారులకు నివేదిస్తామన్నారు. ఇన్చార్జి సబ్ రిజిస్ట్రార్ పెచ్చెట్టి రాంబాబును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు చెప్పారు. రాత్రంతా తనిఖీలు కొనసాగుతాయని డీఎస్పీ వెల్లడించారు. ఈ దాడుల్లో ఏసీబీ ఇన్స్పెక్టర్లు కె.శ్రీనివాస్, కె.నాగేంద్రప్రసాద్, కె.ఏసుబాబు పాల్గొన్నారు. -
కంటైనర్‌లో పైన పైపులు.. కింద గంజాయి!
తణుకు: పీవీసీ పైపుల రవాణా మాటున భారీగా గంజాయిని తరలిస్తున్న ముఠా గుట్టు రట్టయ్యింది. విశాఖ జిల్లా పాడేరు నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్న 2 టన్నుల గంజాయిని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) అధికారులు, తణుకు సర్కిల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను తణుకు పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఆదివారం ఎస్ఈబీ అడిషనల్ ఎస్పీ జయరామరాజు మీడియాకు తెలిపారు. తణుకు జాతీయ రహదారిపై మహిళా కళాశాల సమీపంలో ఆదివారం వాహనాలు తనిఖీ చేస్తుండగా పీవీసీ పైపుల లోడుతో వెళుతున్న లారీని పోలీసులు తనిఖీ చేశారు. పైపుల కింది భాగంలో ప్రత్యేకంగా తయారుచేసిన కంటైనర్‌లో మొత్తం 85 సంచుల్లో నిషేధిత గంజాయిని గుర్తించారు. కర్నాటకలోని బీదర్ జిల్లా ఫరీదాబాద్‌కి చెందిన లారీ డ్రైవర్ రాజప్ప, గుల్బర్గా జిల్లా కుడుమూతికి చెందిన్ క్లీనర్ ఆనంద్‌లను అరెస్ట్ చేశారు. లారీతో పాటు వారి నుంచి రూ.40 లక్షల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. -
తరగతి గదిలో టీచర్‌పై హత్యాయత్నం
ఇరగవరం: ప్రభుత్వ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్న మహిళపై ఆమె భర్త హత్యాయత్నం చేసిన ఘటన ఇరగవరం మండలం కాకిలేరు గ్రామంలో శుక్రవారం జరిగింది. ఎస్సై జానా సతీష్ కథనం ప్రకారం నారాయణపురం గ్రామానికి చెందిన గుత్తుల నాగలక్ష్మికి జంగారెడ్డిగూడెం మండలం వేగవరానికి చెందిన కడలి రామ దుర్గాప్రసాద్‌కు 2016లో పెళ్లయింది. వీరికి మూడేళ్ల కుమార్తె ఉంది. కొంత కాలంగా భార్యాభర్తలు గొడవలు పడుతున్నారు. ఉపాధ్యాయురాలైన నాగలక్ష్మికి గతనెల 16న కాకిలేరు శివారు సింగోడియన్ పేటలోని ఎంపీపీ పాఠశాలకు బదిలీ అయింది. శుక్రవారం మధ్యాహ్నం ఆమె భర్త రామదుర్గా ప్రసాద్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వెంకటాచార్యులు వద్దకు వచ్చి నాగలక్ష్మి టీచర్‌ను కలవాలని అడిగాడు. ఆమె క్లాస్‌రూమ్‌లో ఉందని చెప్పడంతో క్లాస్ రూమ్‌కు వెళ్లి విద్యార్థులు చూస్తుండగానే జుట్టు పట్టుకుని నేల్ కట్టర్‌లోని చాకుతో వీపుపై, పక్కటెముకలపై దాడి చేశాడు. విద్యార్థులు గట్టిగా అరవడంతో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అక్కడకు చేరుకుని వెంటనే ఎంఈఓ ఎస్.శ్రీనివాసరావు ద్వారా పోలీసులకు సమాచారం అందించారు. గ్రామస్తుల సహకారంతో నాగలక్ష్మిని పెనుగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యం అందించిన తరువాత తణుకు ఏరియా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం తణుకులోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. రామ దుర్గాప్రసాద్‌పై జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్లో వరకట్నం వేధింపుల కేసు ఉందని, ప్రస్తుత ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. -
తణుకు మాజీ ఎమ్మెల్యే వైటీ రాజా మృతి
సాక్షి, తణుకు: పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మాజీ శాసన సభ్యులు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత వైటీ రాజా ఆదివారం తెల్లవారుజామున మృతి చెందారు. కరోనా వైరస్ సోకడంతో అనారోగ్యం పాలైన ఆయన్ని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ స్టార్ హాస్పటల్లో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న ఆయన ఇవాళ తెల్లవారుజామున మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. వైటీ రాజా1999 ఎన్నికల్లో టీడీపీ తరఫున తణుకు నుంచి గెలుపొంది ఐదేళ్ల పాటు సేవలందించారు. ఆయన మృతి పట్ల టీడీపీ నేతలు సంతాపం తెలిపారు. కాగా వైటీ రాజా సోదరిని ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబుకి ఇచ్చి వివాహం చేశారు. -
అసభ్య ప్రవర్తన.. నగ్నంగా నిందితుడి ఊరేగింపు
సాక్షి, తణుకు (పశ్చిమగోదావరి జిల్లా): తణుకు పట్టణంలో అమానుషం చోటు చేసుకుంది. మూడేళ్ల చిన్నారిపై అసభ్యంగా ప్రవర్తించాడో దుర్మార్గుడు. పాతూరు ఎనిమిదో వార్డులో నివాసం ఉంటున్న చిన్నారి ఆడుకుంటూ ఉండగా ఆమెపై అమానుషంగా ప్రవర్తించాడు. జంగారెడ్డిగూడేనికి చెందిన అడపా వీరబ్రహ్మం మంగళవారం పాతూరులోని బంధువుల ఇంటికి వచ్చాడు. ఫూటుగా మద్యం తాగి సమీపంలో ఆడుకుంటున్న చిన్నారితో అసభ్యంగా ప్రవర్తించాడు. దీనిని గమనించిన స్థానికులు అతడిని తాళ్లతో కట్టి దేహశుద్ధి చేశారు. కొట్టుకుంటూ నగ్నంగా మున్సిపల్ కార్యాలయం వరకు ఊరేగించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకుని పట్టణ పోలీసు స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు. చిన్నారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. -
‘ఉన్మాది, ఉగ్రవాదిలా వ్యాఖ్యలు చేస్తున్నారు’
సాక్షి, పశ్చిమ గోదావరి : నర్సాపురం పార్లమెంట్ ఓటర్లు ఎంపీ రఘురామ కృష్ణంరాజును మర్చిపోయారని తణుకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. కరోనా మొదలు ఇప్పటి వరకు ఎంపీ రఘురామ కృష్ణంరాజు పర్యటించలేదని, వరదల సమయంలోను ప్రజలను గాలికి వదిలేశారని మండిపడ్డారు. ఎమ్మెల్యే మట్లాడుతూ.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డినిరంతరం శ్రమిస్తున్నారన్నారు. కరోనా కట్టడి చర్యలో భాగంగా ఎవరి ఇంటిలో వారు వినాయకచవితి చేసుకోవాలని సూచిస్తే దానిని రఘురామ కృష్ణంరాజు వక్రీకరిస్తున్నారని విమర్శించారు. మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. (‘హైదరాబాద్.. ఢిల్లీలో ఉంటే ఏం తెలుస్తుంది’) పార్టీలు,మతాలకతీతంగా వైఎస్ జగన్ పాలన చేస్తుంటే ఆయనపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని హితవు పలికారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో హిందుదేవాలయాలు కూల్చి వేస్తే ఆనాడు బిజేపిలో ఉన్న రాఘురామ కృష్ణం రాజు ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. ఉన్మాది, ఉగ్రవాదిలాగా వ్యాఖ్యలు చేస్తున్నారని, చంద్రబాబు నాయుడు ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నావని విమర్శించారు. పుష్కరాలలో అంతమంది చనిపోతే ఎందుకు మాట్లాడలేదని, కులాలా మధ్య, మతాల మధ్య చిచ్చు పెడితే తనను కేంద్రమే జైలుకు పంపిస్తుందని నాగేశ్వరరావు హెచ్చరించారు. (ఆంధ్రజ్యోతి రాధాకృష్ణపై సోము సెటైర్లు) -
కరోనాపై అవగాహన కల్పిస్తున్న ప్రజాప్రతినిధులు
-
‘వారం రోజులు నాన్ వెజ్‌కు హాలీడే’
సాక్షి, పశ్చిమ గోదావరి : తణుకు నియోజకవర్గంలో ఓ వైరస్ కారణంగా ఫారాల్లోని కోళ్లన్నీ విపరీతంగా చనిపోతున్నాయని స్థానిక ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు తెలిపారు. చనిపోయిన వైరస్ కోళ్లను కాలువల్లో, రొడ్డు పక్కన వేయకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. మున్సిపల్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సిబ్బందిని అలర్ట్ చేశామని పేర్కొన్నారు. అదే విధంగా తణుకు నియోజకవర్గంలో రేపటి నుంచి వారం రోజులు చికెన్, మటన్ అమ్మకాలు నిలిపి వేస్తున్నామని తెలిపారు. ప్రజల ఆరోగ్యమే ప్రధానంగా భావించి వారం రోజులు నాన్ వెజ్ హాలీడేగా ప్రకటిస్తున్నామని పేర్కొన్నారు. -
ఆ వార్తల్లో నిజం లేదు: మండలి చైర్మన్
సాక్షి, తణుకు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తనను ప్రలోభాలకు గురిచేశారంటూ వస్తున్న వార్తలను శాసనమండలి చైర్మన్ షరీఫ్ తీవ్రంగా ఖండించారు. పశ్చిమగోదావరి జిల్లాలోని తణుకు నియోజకవర్గంలో ఆయన గురువారం పర్యటించారు. ఈ సందర్బంగా షరీఫ్ విలేకరులతో మాట్లాడుతూ.. బుధవారం శాసనమండలిలో జరిగిన పరిణామాలపై స్పందించారు. వైఎస్సార్సీపీ నాయకులు తనపై వ్యక్తిగత దూషణలు చేయలేదని స్పష్టం చేశారు. తనను మంత్రులు దుర్భాషలాడినట్టు వచ్చిన వార్తలను తోసిపుచ్చారు. అదేవిధంగా వారు తనని బెదిరించినట్లు వస్తున్న వార్తల్లో కూడా ఎంతమాత్రం నిజం లేదన్నారు. ఈ వార్తలు పూర్తిగా అవాస్తవమని ఆయన తెలిపారు. మూడు రాజధానులు రావాలా, అమరావతి ఒక్కటే ఉండాలా అన్నదానిపై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయనని తేల్చిచెప్పారు. శాసనమండలిని రద్దు చేయాలన్న ప్రతిపాదనపై స్పందిస్తూ.. అది ప్రభుత్వం ఇష్టమని వ్యాఖ్యానించారు. -
తాత.. నాన్న.. ఓ తణుకు అమ్మాయి
తణుకు అర్బన్: మూగ జీవాలపై ఆ బాలికకు విపరీతమైన ప్రేమ.. వాటికి ఎక్కడ ఏ కష్టం వచ్చిందని తెలిసినా వెంటనే అక్కడ వాలిపోతుంది. అక్కున చేర్చుకుని వాటిని ఆరోప్రాణంగా కాపాడుతుంది. ఆమే తణుకుకు చెందిన జనత హాస్పటల్ దంత వైద్యుడు డాక్టర్ దాట్ల సుందరరామరాజు, శ్రీలక్ష్మి దంపతుల కుమార్తె పావని వర్మ. ఈ వారసత్వం ఆమెకు తాతయ్య డాక్టర్ దాట్ల సత్యనారాయణరాజు(జనతా రాజు), నాన్న సుందరరామరాజుల నుంచి వచ్చిందని చెప్పవచ్చు. తణుకు లయన్స్‌క్లబ్ ప్రాంతంలోని నివాసం వద్ద అవుట్ హౌస్‌లో తాత, నాన్న, పావని ఎప్పటి నుంచో వివిధ రకాల కోళ్లు, బాతులు, కవుజు పిట్టలు, కుందేళ్లను సంరక్షిస్తున్నారు. పావని మరో అడుగు ముందుకేసి జంతు సంరక్షణ చేస్తూ యానిమల్ రెస్క్యూ టీంని సృష్టించేందుకు ప్రయతిస్తోంది. అకారణంగా ఏ జంతువును ఇబ్బంది పెట్టినా వారిపై సంబంధిత అ«ధికారులకు ఫిర్యాదుతో పాటు సదరు జంతువును రక్షించేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి స్ఫూర్తిగా వాలంటీర్లను నియమించేందుకు సమాయత్తమవుతోంది. ఇందుకు ఆమె సోషల్ మీడియాను వేదికగా చేసుకుంది. మూగజీవాల సంరక్షణకు ఇప్పటికే తణుకు ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావును స్థలం ఇప్పించాల్సిందిగా కోరిగా ఆయన సానుకూలంగా స్పందించినట్లు పావని చెప్పింది. తనకు మూగజీవాలంటే ఇష్టమని, అయితే చదువు పరంగా తాను ఐఏఎస్ కావాలన్నదే లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపింది. ప్రస్తుతం వీరి వద్ద చైనా కోళ్లు, పోలీస్ క్యాప్ కోళ్లు, కజానా బాతులు, గిరిరాజు కోళ్లు ఉన్నాయి. వీటి సంరక్షణకు సీసీ కెమెరాలతో పాటు సెయింట్ బెర్నాడ్ జాతికి చెందిన సింహాల్లాంటి మూడు శునకాలు కూడా గస్తీ నిర్వహించడం విశేషం. జంతువులంటే పిచ్చిప్రేమ కుక్కలు, గోవులతో పాటు ఇతర జంతువులంటే మా అమ్మాయికి ఎంతో ఇష్టం. వాటిని బాధించకూడదని తాపత్రయపడుతుంది. ఐదేళ్లుగా మా ఇంటి ఆవరణలో నాన్న సహకారంతో వివిధ రకాల కోళ్లు, బాతులు, కుందేళ్లు, కౌజు పిట్టలను సంరక్షిస్తున్నాను. వాటిని చూసిన మా అమ్మాయి చలించిపోయి యానిమల్స్ రెస్క్యూ టీంను ఏర్పాటుకు నాంది పలికింది. – డాక్టర్ దాట్ల సుందరరామరాజు, జనతా హాస్పటల్ వైద్యుడు -
తణుకులో పర్యటించిన మంత్రి, ఎంపీ
సాక్షి, పశ్చిమ గోదావరి : గృహనిర్మాణశాఖ మంత్రి శ్రీరంగనాథరాజులు శనివారం తణుకు నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. మంత్రితో పాటు స్థానిక ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు, ఎంపీ రఘురామ కృష్ణంరాజు కూడా ఈ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా వారు సుమారు రూ.50 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ క్రమంలో ఇరగవరం మండంలం రేలంగి గ్రామంలో ఇతర పార్టీలకు చెందిన సుమారు 500 మంది కార్యకర్తలు వైఎస్సార్సీపీలో చేరడానికి ముందుకు వచ్చారు. దీంతో వారందరికి ఎంపీ రఘురామ కృష్ణంరాజు, మంత్రి శీరంగనాథరాజులు పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. అలాగే తణుకులో వైఎస్సార్సీపీ అభిమానులు నడిపిస్తున్న రాజన్న క్యాంటీన్‌ను వారు సందర్శించారు. మండలంలోని తేతలి గ్రామంలో అంగన్వాడీ బిల్డింగ్‌ను మంత్రి ప్రారంభించగా, తణుకు బ్యాంకు కాలనీ నందు రహదారి నిర్మాణానికి ఎంపీ శంకుస్థాపన చేశారు. సమారు 12000 మంది గ్రామ వాలంటీర్లతో తణుకులోని పద్మశ్రీ ఫంక్షన్ హాలులో సమావేశమై, అక్కడి సమస్యలపై మంత్రి శీరంగనాథరాజు, ఎంపీ ఆరా తీశారు. సంక్షేమ పథకాలు అన్నీ లబ్ధిదారులకు చేరాలని వారు ఆదేశించారు. -
భళా రాజన్న క్యాంటీన్
సాక్షి, పశ్చిమగోదావరి(తణుకు) : తణుకులో రాజన్న క్యాంటీన్ నిర్వహణపై పేదల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు చొరవతో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ఈ క్యాంటీన్ నిర్వహిస్తున్నారు. రూ.ఐదుకే పేదల కడుపు నింపుతున్నారు. నిత్యం 250 మందికి నాణ్యమైన భోజనం పెడుతున్నారు. తొలుత ఎమ్మెల్యే కారుమూరి తన సొంత నిధులతో క్యాంటీన్ నిర్వహించడానికి ముందుకు వచ్చారు. అయితే ఆయనకు చేదోడువాదోడుగా నియోజకవర్గంలోని నాయకులు కూడా నిలిచారు. దీంతో రోజుకో దాత పేరుతో రాజన్న క్యాంటీన్ నిర్వహణ ప్రారంభించారు. రాబోయే రోజుల్లోనూ దీని నిర్వహణకు నిధులు సమకూరడంతో గతనెల 31 నుంచి ప్రారంభించిన క్యాంటీన్ విజయవంతంగా నడుస్తోంది. రాబోయే వంద రోజులకు సరిపడా నిధులను సమకూర్చిన వైఎస్సార్ సీపీ నాయకులు నిర్వహణ బాధ్యతలను భుజాలకు ఎత్తుకున్నారు. 18 మందితో కమిటీ తణుకు పట్టణంలో రాజన్న క్యాంటీన్ నిర్వహణకు 18 మంది పార్టీ నాయకులతో కమిటీని ఏర్పాటు చేశారు. నిత్యం 250 మందికి భోజనం అందించడానికి వీలుగా ప్రణాళికసిద్ధం చేశారు. మొదటి రోజు భోజనానికి అయ్యే ఖర్చును ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు భరించడంతో నియోజకవర్గంలోని కొందరు నాయకులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, దాతలు ముందుకు వచ్చారు. దీంతో సుమారు 100 రోజులకు సరిపడా నిధులు సమకూరాయి. ఇందుకు ప్రత్యేకంగా బ్యాంకు ఖాతాను ప్రారంభించిన కమిటీకి గౌరవాధ్యక్షులుగా కారుమూరి వెంకట నాగేశ్వరరావు, అధ్యక్షులుగా నార్గన సత్యనారాయణ, ఉపాధ్యక్షులుగా మారిశెట్టి శంకర్, కలిశెట్టి శ్రీనివాసు, చిక్కాల మోహన్ వ్యవహరిస్తున్నారు. తణుకు నియోజకవర్గంలో ఎవరైనా దాతలు లేదా పెళ్లిరోజు, పుట్టిన రోజు చేసుకునే వారు పేదలకు అన్నం పెట్టాలని భావిస్తే కమిటీని సంప్రదించాలని వారు కోరుతున్నారు. నాణ్యతతో కూడిన భోజనం అందించాలనే ఉద్దేశంతో పరిమితి లేకుండానే పేదలకు భోజనం వడ్డిస్తున్నారు. ప్రస్తుతం ఒక స్వీటు, మూడు రకాల కూరలు, సాంబారు, పెరుగుతో పేదలకు భోజనం అందజేస్తున్నారు. మరోవైపు దాతల పేర్లు ఆరోజు క్యాంటీన్లో ప్రదర్శించేలా ఏర్పాట్లు చేశారు. దాతల సహకారం అభినందనీయం పేదలకు అన్నం పెట్టేందుకు తణుకులో రాజన్న క్యాంటీన్ ప్రారంభించాం. దాతల సహకారంతో దీనిని మొదలుపెట్టాం. రూ. 5కే భోజనం పెట్టేందుకు వైఎస్సార్ సీపీ నాయకులకు తోడు దాతలు ముందుకు రావడం అభినందనీయం. ప్రస్తుతం 250 మందికి భోజనం పెడుతున్నాం. రాబోయే రోజుల్లో ఈ సంఖ్యను పెంచుతాం. – కారుమూరి వెంకటనాగేశ్వరరావు, ఎమ్మెల్యే, తణుకు సంతోషంగా ఉంది... ఎలాంటి లాభాపేక్ష లేకుండా పేదల కడుపు నింపాలనే ఉద్దేశంతో ప్రారంభించిన రాజన్న క్యాంటీన్‌కు మంచి స్పందన వచ్చింది. ఇప్పటికే 100 రోజులకు సరిపడా నిధులు సమకూరాయి. దాతలు తమ పేరున భోజనం పెట్టడానికి ముందుకు వస్తున్నారు. నియోజకవర్గంలో ఎవరైనా పెళ్లిరోజు, పుట్టిన రోజు చేసుకుని పేదలకు అన్నం పెట్టాలని భావిస్తే రాజన్న క్యాంటీన్ ద్వారా అవకాశం కల్పిస్తున్నాం. – మారిశెట్టి శివశంకర్, కమిటీ ఉపాధ్యక్షులు, తణుకు నాణ్యతలో రాజీపడం... పేదలకు అన్నం పెట్టే క్రమంలో నాణ్యతలో ఎలాంటి రాజీ పడబోం. పేదలకు ఉచితంగానే భోజనం అందించాలని భావిస్తున్నప్పటికీ నామమాత్రంగానే రూ.5 వసూలు చేస్తున్నాం. పరిమితి లేకుండా ఎంత భోజనం వడ్డించడానికి అయినా వెనుకాడటంలేదు. ఇలాంటి మంచి కార్యక్రమానికి మనసున్న దాతలు మరింత మంది ముందుకు రావాలి. – చిక్కాల మోహన్, కమిటీ సభ్యులు, తణుకు -
దేవుడు వరం ఇచ్చినా..!
సాక్షి, తణుకు(పశ్చిమగోదావరి) : దేవుడు వరం ఇచ్చినా పూజారి కనికరించడంలేదన్న చందంగా మారింది జూనియర్ కళాశాలల్లో కాంట్రాక్ట్ అధ్యాపకుల జీవితాలు. ఏటా రెన్యువల్ ఉత్తర్వుల కోసం కళ్లల్లో ఒత్తులు వేసుకుని చూస్తుంటడం.. మరోవైపు తమ ఉద్యోగాలు రెన్యువల్ చేయాలని సాగిస్తున్న పోరాటాలు.. వెరసి వీరి జీవితాలు దినదిన గండం నూరేళ్లు ఆయుష్షు అన్నట్లుగా మారింది. విద్యాసంవత్సరం ప్రారంభమై రెండు నెలలు గడిచినప్పటికీ ఒక పక్క రెన్యువల్ కాక మరోపక్క వేతనాలు దక్కక అర్ధాకలితో అలమటిస్తున్నారు. జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఏర్పడ్డాక పది రోజుల బ్రేక్‌తో 12 నెలల వేతనం ఇవ్వాలని అది కూడా ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచే అమలు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే అధికారుల మధ్య సమన్వయం లేకపోవడంతో కాంట్రాక్ట్ అధ్యాపకులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆదేశాలు ఉన్నప్పటికీ.. గత కొన్నేళ్లుగా రాష్ట్రవ్యాప్తంగా కాంట్రాక్ట్ అధ్యాపకులు తమ డిమాండ్ల సాధన కోసం తరగతి గదులు సైతం వదిలి రోడ్డు ఎక్కారు. ఎన్నో ధర్నాలు, ఆందోళనలు చేశారు. అయినా వారి కల సాకారం కాలేదు. అధికారంలోకి వస్తే కాంట్రాక్ట్ అధ్యాపకుల సమస్యలు పరిష్కరిస్తానని పాదయాత్రలో ఇచ్చిన హామీని జగన్మోహన్రెడ్డి నిలబెట్టుకున్నారు. ఇన్నాళ్లూ ఏడాదిలో కేవలం 10 నెలలు మాత్రమే వేతనాలు అందుకున్న కాంట్రాక్ట్ అధ్యాపకులు ఏడాది మొత్తం 12 నెలల పాటు పది రోజుల బ్రేక్‌తో వేతనాలు ఇవ్వాలని విద్యాశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరి ఆదిత్యనాధ్‌దాస్, ఆర్థికశాఖ ఉత్తర్వులు విడుదల చేసింది. దీంతో జిల్లాలోని మొత్తం 33 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విధులు నిర్వహిస్తున్న సుమారు 240 మంది జూనియర్ అధ్యాపకులకు లబ్ధి చేకూరుతుందని ఎంతో సంబరపడ్డారు. అయితే ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను కిందిస్థాయి అధికారులు మరుగున పడేయడంతో కాంట్రాక్ట్ అధ్యాపకుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. గత నెల 22న రాష్ట్ర జేఏసీ నాయకులు విద్యాశాఖ మంత్రి ఆదిమూలం సురేష్‌ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. దీంతో ఏప్రిల్, మే నెల వేతనాలతో పాటు పనిచేసిన జూన్, జూలై నెలలకు సంబంధించి వేతనాలు విడుదల చేయాలని గత నెల 25న జీఓ జారీ చేశారు. దీనిపై డీవైఈవోలు ప్రోసీడింగ్స్ ఇచ్చి తక్షణమే బిల్లులు ట్రెజరీలకు అందజేయాలని ప్రిన్సిపాల్స్‌ను కోరారు. అయితే నామమాత్రంగా బిల్లులు తయారు చేసిన ప్రిన్సిపాల్స్ ట్రెజరీ అధికారులకు సరైన సమాచారం ఇవ్వకపోవడంతో ఇప్పటికీ సమస్య పరిష్కారానికి నోచుకోలేదు. జిల్లాలోని కొన్ని కళాశాల ప్రిన్సిపాల్స్ కాంట్రాక్ట్ అధ్యాపకులకు సహకరించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని అధ్యాపకులు వాపోతున్నారు. భద్రత లేని ఉద్యోగం అసలే అరకొర జీతాలు.. రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా విధులు నిర్వహిస్తున్నా వారికి గుర్తింపు లేదు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులను పర్మినెంట్ చేస్తానని వారికి ఉద్యోగ భద్రత కల్పిస్తానని 2014 ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపర్చిన చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ ఊసెత్తడం మానేసింది. అయితే కాంట్రాక్ట్ అధ్యాపకులు పలు దఫాలుగా చేసిన ఆందోళన ఫలితంగా దిగొచ్చిన ప్రభుత్వం ఎన్నికలు సమీపించడంతో కేబినెట్లో చర్చించింది. దీని ప్రకారం కాంట్రాక్ట్ అధ్యాపకులకు డీఏతో కూడిన ఏంటీఎస్, 60 ఏళ్లు రిటైర్మెంట్ వయసు పెంపు, పది రోజుల విరామంతో 12 నెలలకు వేతనం, 180 రోజుల పాటు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు, ప్రతి పీఆర్సీలో రివైజ్డ్ పేస్కేలు వర్తింపు, హెల్త్‌కార్డులు మంజూరు, కాంట్రాక్ట్‌కు బదులు ఎంటీఎస్ హోదా వంటివి అమలు చేస్తున్నట్లు కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు ప్రస్తుతం పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులకు ఎంటీఎస్ హోదా రావడంతో రెన్యువల్ విధానం అవసరం లేదని అధికారులు చెబుతున్నప్పటికీ కిందిస్థాయి అధికారులు మాత్రం బాండ్ తప్పనిసరి అంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. జీతాలు లేక అల్లాడుతున్నాం గత ఇరవై ఏళ్లుగా కాంట్రాక్ట్ అధ్యాపకులుగా పనిచేస్తూ కుటుంబాలు పోషించుకుంటున్నాం. ఇన్నాళ్లూ ఏడాదిలో 10 నెలలు మాత్రమే వేతనాలు ఇస్తుండటంతో మిగిలిన రెండు నెలలు అర్థాకలితోనే కాలం వెళ్లదీస్తున్నాం. ఇప్పుడు పది రోజుల విరామంతో 12 నెలలు జీతాలు ఇవ్వాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ అధికారులు సమన్వయలోపం కారణంగా నాలుగు నెలలుగా వేతనాలు నిలిచిపోయాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలి. – జీఎస్కే విద్యాసాగర్, జిల్లా జేఏసీ నాయకుడు -
కుమారుడికి పునర్జన్మనిచ్చి అంతలోనే..
సాక్షి, తణుకు టౌన్: కిడ్నీ పాడై ప్రాణాపాయ స్థితిలో ఉన్న కుమారుడిని రక్షించుకునేందుకు ఒక తండ్రి చేసిన త్యాగం విషాదాంతంగా మారిన సంఘటన తణుకు పట్టణంలో శనివారం జరిగింది. తన కుమారుడిని రక్షించుకునే ప్రయత్నంలో కిడ్నీ దానం చేసిన తండ్రి ఆపరేషన్ అనంతరం తలెత్తిన అనారోగ్యం కారణంగా తనువు చాలించాల్సి వచ్చింది. తణుకు పాతూరుకు చెందిన కాకర్ల సంజీవరావు (సాల్మన్‌రాజు) (58) స్థానిక చర్చిలో పాస్టర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు ఇద్దరు కుమారులు కాగా వారిలో చిన్న కుమారుడు భరత్‌కుమార్‌కు రెండు కిడ్నీలు పాడైపోవడంతో కిడ్నీ మార్చాలని వైద్యులు సూచించారు. దీంతో బంధువులను, ఇతర దాతలను ప్రయత్నించినా ప్రయోజనం లేకపోవడంతో చివరికి తన కుమారుడికి తానే కిడ్నీ దానం చేసి బతికించుకుందామని సిద్ధపడ్డారు. ఈనెల 11న కిడ్నీ మార్పిడి ఆపరేషన్‌ను ఏలూరులోని ఆశ్రం ఆసుపత్రిలో నిర్వహించారు. సంజీవరావు కిడ్నీని అతని కుమారునికి మార్పిడి చేసి ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేశారు. కిడ్నీ దానం పొందిన కుమారుడు భరత్‌కుమార్ ప్రస్తుతం కోలుకుంటుండగా దానం చేసిన తండ్రి సంజీవరావు మాత్రం మూడు రోజులకు ఆపరేషన్ అనంతరం ఊపిరితిత్తులకు న్యూమోనియా కారణంగా శ్వాస తీసుకోవడం కష్టంగా మారి శనివారం ఉదయం మృతి చెందారు. ఆదాయం అంతంత మాత్రంగానే ఉన్న సంజీవరావు కుటుంబానికి తన కుమారుడి కిడ్నీ మార్పిడి ఆపరేషన్ భారంగా మారడంతో కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావును సంప్రదించి ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి సహాయం అందించాలని కోరారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి గత నెలలోనే కిడ్నీ మార్పిడి ఆపరేషన్‌కు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.4 లక్షలు మంజూరు చేయించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరు ఉత్తర్వులు అందగానే కిడ్నీ మార్పిడి ఆపరేషన్ ప్రారంభించారు. ఆపరేషన్ అనంతరం మూడు రోజుల తర్వాత న్యూమోనియా కారణంగా ఆసుపత్రిలోనే సంజీవరావు మృతి చెందాడు. ఆయన మృతి పట్ల తణుకులోని పాస్టర్లు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పట్టణానికి చెందిన పలువురు ప్రముఖులు సంజీవరావు కుటుంబ సభ్యులను పరామర్శించి తమ సంతాపాన్ని తెలిపారు. -
భర్త ముందే భార్యతో ఫోన్లో..
తణుకు : తన భార్యతో సన్నిహితంగా ఉంటున్నాడనే అనుమానంతో ఓ యువకుడిని ఓ వ్యక్తి హత్య చేసిన ఘటన ఇది. మద్యం తాగుదామని పిలిచి మద్యం షాపులోనే ఈ దారుణానికి పాల్పడ్డాడు. తణుకు మండలం దువ్వలో శుక్రవారం రాత్రి జరిగిన ఈ సంఘటనలో అదే గ్రామానికి చెందిన కామన బాలాజీ (24) అక్కడికక్కడే మృతి చెందాడు. కొవ్వూరు డీఎస్పీ కె.రాజేశ్వర్‌రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మొగల్తూరు గ్రామానికి చెందిన గుడాల శివరామకృష్ణ తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన రోజారమణితో కొన్నాళ్లుగా సహజీవనం చేస్తున్నాడు. వీరికి ఆరేళ్ల వయసున్న పాప ఉంది. రోజారమణి ద్వారా దువ్వకు చెందిన బాలాజీ అనే యువకుడు శివరామకృష్ణకు పరిచయమయ్యాడు. ఈ క్రమంలో బాలాజీతో తన భార్య సన్నిహితంగా ఉంటోందని శివరామకృష్ణ అనుమానం పెంచుకున్నాడు. ఈ విషయంలో గతంలోనే బాలాజీని హెచ్చరించినప్పటికీ ఫలితం లేకపోవడంతో రెండు నెలల క్రితం శివరామకృష్ణ రోజారమణిని ఉపాధి నిమిత్తం విదేశాలకు పంపించాడు. అయినప్పటికీ బాలాజీ ఆమెతో తరచూ ఫోన్లో మాట్లాడుతున్నట్లు శివరామకృష్ణ గమనించాడు. దీనిపై ఇటీవల రెండు పర్యాయాలు గట్టిగా అతడిని హెచ్చరించాడు. నెలరోజుల క్రితం శివరామకృష్ణ బాలాజీ ఇంటికి వెళ్లి అతడి కుటుంబ సభ్యులకు సైతం విషయాన్ని తెలిపాడు. ఇదిలా ఉంటే బాలాజీ శుక్రవారం రాత్రి శివరామకృష్ణకు ఫోన్ చేసి దువ్వ రావాలని మాట్లాడుకుని సమస్య పరిష్కరించుకుందామని చెప్పాడు. దీంతో దువ్వ గ్రామానికి వచ్చిన శివరామకృష్ణ.. మద్యం తాగేందుకు బాలాజీని తీసుకుని గ్రామంలోని సూర్య వైన్స్‌కు చేరుకున్నారు. అక్కడ ఇద్దరూ మద్యం తాగుతుండగా వారి మధ్య రోజారమణి విషయంపై మరోసారి ఘర్షణ తలెత్తింది. ఇదే సమయంలో బాలాజీ శివరామకృష్ణ భార్యకు ఫోన్ చేసి ఆమెతో మాట్లాడాడు. దీన్ని అవమానంగా భావించిన శివరామకృష్ణ తనతోపాటు తెచ్చుకున్న కత్తితో బాలాజీ గొంతులో పొడిచాడు. తీవ్ర గాయమైన బాలాజీ తనను కాపాడాలని పరిసర ప్రాంతాల్లో కలియతిరిగాడు. మద్యం షాపులోనే పనిచేస్తున్న బాలాజీ చిన్నాన్న కామన ఆంజనేయులు అతడిని కాపాడేందుకు ప్రయత్నించారు. శివరామకృష్ణ తన మోటారు సైకిల్‌ను అక్కడే వదిలి పారిపోయాడు. రక్తపు మడుగులో పడి ఉన్న బాలాజీ కొద్దిసేపటికే ప్రాణాలు వదిలాడు. సమాచారం తెలుసుకున్న తణుకు సర్కిల్ ఇన్స్పెక్టర్ డీఎస్ చైతన్యకృష్ణ, రూరల్ ఎస్సై ఎన్.శ్రీనివాసరావు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. హత్యకు ముందు ఫొటో.. బాలాజీని హత్య చేయడానికి ముందు శివరామకృష్ణ అతడితో కలిసి ఫొటో తీసుకున్నాడు. మద్యం తాగుతున్న స్థలంలోనే ఫొటో తీయించుకున్న శివరామకృష్ణ హత్య చేసిన అనంతరం పారిపోయేందుకు ప్రయత్నించాడు. స్థానికులు అతడిని వెంబడించి హైవేపై పట్టుకున్నారు. శివరామకృష్ణకు దేహశుద్ధి చేసిన స్థానికులు పోలీసులకు అప్పగించారు. మృతుడు బాలాజీ తండ్రి కామన రాముడు రెండేళ్ల క్రితం మృతి చెందగా ప్రస్తుతం తల్లి సత్యవతితో కలిసి ఉంటున్నాడు. ఇతనికి సోదరి ఉండగా ఆమెకు వివాహం చేశారు. బాలాజీ స్థానికంగా రాడ్‌బెండింగ్ పని చేస్తుంటాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. నిందితుడు శివరామకృష్ణ కూలీపనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. మృతదేహానికి స్థానిక ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బం«ధువులకు అప్పగించారు. నిందితుణ్ని అరెస్ట్ చేసి శనివారం కోర్టులో హాజరుపర్చగా 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. -
‘అది నిజంగా గొప్ప విషయం’
సాక్షి, పశ్చిమగోదావరి : యాభై రోజుల్లోనే అనేక హామీలు అమలు చేయటం ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి మాత్రమే సాధ్యమని బీసీ సంక్షేమ మంత్రి మాలగుండ్ల శంకర్ నారాయణ అన్నారు. తణుకు కృతజ్ఞత సభలో మంత్రి మాట్లాడుతూ శాశ్వత బీసీ కమిషన్ ఏర్పాటు చేసిన సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కమిషన్ ద్వారా బడుగు, బలహీన వర్గాలకు యాభై శాతం రిజర్వేషన్లు కల్పించటంతో రాజన్న రాజ్యం వచ్చిందన్నారు. చంద్రబాబు పేదల కష్టాల పట్ల అవగాహన లేని మనిషని ఆయన విమర్శించారు. మహిళలకు చంద్రబాబు చేసినంత ద్రోహం ఏ నాయకుడు చేయలేదని, బాబుకి కేవలం ఎన్నికలప్పుడే మహిళలు గుర్తుకొస్తారని మండిపడ్డారు. ‘ సీఎం జగన్ నిర్ణయాలు చరిత్రాత్మకం.. రాష్ట్రం లోటు బడ్జేట్‌లో ఉన్నప్పటికి మద్యపానం నిషేధం దిశగా అడుగులు వేయటం గొప్ప విషయం’ అన్నారు. టీడీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక ఆరోగ్యశ్రీ నుంచి బాబు అనేక జబ్బులను తొలగించారని పేర్కొన్నారు. సభ ముగిసిన ఆనంతరం పలువురు మంత్రులు.. మహిళలకు కుట్టు మిషన్లను, యువకులకు టూల్ కిట్లను పంపిణీ చేశారు. -
త్రుటిలో తప్పిన పెనుప్రమాదం
సాక్షి, తణుకు(పశ్చిమగోదావరి) : అందరూ నాలుగేళ్ల నుంచి పదేళ్ల లోపు చిన్నారులే.. అప్పటివరకు సరదాగా గడిపిన వారంతా... ఒక్కసారిగా హాహాకారాలతో భయభ్రాంతులకు గురయ్యారు.. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపు వారంతా షాక్‌లోకి వెళ్లిపోయారు.. తణుకు మండలం తేతలి గ్రామ పరి«ధిలోని స్టెప్పింగ్ స్టోన్స్ స్కూలు బస్సు ప్రమాదానికి గురైన సంఘటనలో 34 మంది చిన్నారులు సురక్షితంగా బయటపడ్డారు. బుధవారం ఉదయం విద్యార్థులను తరలిస్తున్న ఏపీ 37 టీడీ 8878 నెంబరు కలిగిన బస్సు స్కూలు సమీపంలోని పంట కాల్వలోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో చిక్కుకున్న చిన్నారులను స్థానికంగా పొలాల్లో పనిచేస్తున్న కూలీలు, రైతులు హుటా హుటిన చేరుకుని వారందరినీ బయటకు తీశారు. ఈ సంఘటనలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పుంత రోడ్డులోనే రాకపోకలు తణుకు మండలం తేతలి గ్రామ పరిధిలోని స్టెప్పింగ్ స్టోన్స్ స్కూలుకు చెందిన బస్సు పెరవలి, కాపవరం, కొత్తపల్లి, తూర్పువిప్పర్రు గ్రా మాల నుంచి 34 మంది విద్యార్థులను ఎక్కించుకుని బయల్దేరింది. వీరంతా ఎల్కేజీ నుంచి ఆరో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులే కావడం గమనార్హం. ఏఎస్ఆర్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఇంజినీరింగ్ కాలేజీ ఆనుకుని స్టెప్పింగ్ స్టోన్స్ స్కూలు నడుస్తోంది. అయితే స్కూలు బస్సులు రాకపోకలకు అత్తిలి కాల్వ ఆనుకుని పుంతరోడ్డునే యాజమాన్యం వినియోగించుకుంటోంది. ఈ క్రమంలో అత్తిలి కాల్వకు రోడ్డుకు మధ్యలో పంట కాల్వ ప్రవహిస్తోంది. అయితే పుంత రోడ్డు ఇరుకుగా ఉండటంతోపాటు ఇటీవల కురుస్తున్న వర్షాలకు గట్టు తెగిపోయింది. దీనిని గమనించని బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో బస్సు పంట కాల్వలోకి దూసుకెళ్లిపోయింది. ఈ సమయంలో విద్యార్థులు కేకలు వేయడంతో సమీపంలో రైతులు, కూలీలు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అయితే మధ్యలో పంట కాల్వ లేకపోతే నేరుగా పెద్ద కాల్వలోకే బస్సు వెళ్లిపోయేదని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఎమ్మెల్యే కారుమూరి ఆరా.. ప్రమాదం విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు సంఘటనపై ఆరా తీశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మట్టా వెంకటేష్, సరెళ్ల వీరతాతయ్యను తక్షణమే సంఘటనా స్థలానికి వెళ్లాలని ఆదేశించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే కారుమూరి స్కూలు యాజమాన్యంతో మాట్లాడి ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకుని విద్యార్థుల యోగక్షేమాలు తెలుసుకున్నారు. నాయకులు వెంకటేష్, వీరతాతయ్యలు సంఘటనా స్థలంలో సహాయక చర్యలను పర్యవేక్షించారు. సంఘటనా స్థలానికి మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్ సీహెచ్ సంపత్‌కుమార్ చేసుకుని వివరాలు సేకరించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన బస్సు డ్రైవర్, యాజమాన్యంపై రూరల్ ఎస్సై ఎన్.శ్రీనివాసరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. భయం వేసింది స్కూలులో తొమ్మిదో తరగతి చదువుకుంటున్నాను. కాపవరంలో ఉదయం బస్సు ఎక్కాను. అయితే రోజు కంటే ఆలస్యంగా బస్సు వచ్చింది. స్కూలు టైం అయిపోతోందనే ఆందోళనలో ఉన్నాం. మరికొద్ది సేపట్లోనే స్కూలుకు చేరుకుంటున్నాం అనగా పంట కాల్వలోకి బస్సు దూసుకెళ్లింది. దీంతో అందరికీ భయం వేసింది. –కట్టికూటి సుబ్రహ్మణ్యం, విద్యార్థి, కాపవరం డ్రైవర్‌ను మార్చారు నా ఇద్దరు పిల్లలు స్టెప్పింగ్ స్టోన్స్ స్కూలులోనే చదువుకుంటున్నారు. పెరవలి మండలం కాపవరం నుంచి బస్సులో స్కూలుకు వస్తున్నారు. అయితే ఇటీవల స్కూలు బస్సు డ్రైవర్‌ను మార్చారు. దీంతోపాటు రెండేసి ట్రిప్పులు వేస్తుండటంతో వేగంగా విద్యార్థులను తరలిస్తున్నారు. –కాకరపర్తి శ్రీలక్ష్మి, విద్యార్థుల తల్లి, కాపవరం -
సీబీఐ వలలో ఎక్సైజ్ అధికారి
సాక్షి, పశ్చిమ గోదావరి: లంచం తీసుకుంటున్న సెంట్రల్ ఎక్సైజ్ అధికారి బుధవారం సీబీఐకి చిక్కాడు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ గోదావరిలోని తణుకులో కొమ్మోజు హరికృష్ణ ఆదిత్య కమ్యూనికేషన్ పేరుతో ఐడియా సంస్థ సిమ్‌కార్డులు అమ్మటానికి కేంద్ర ప్రభుత్వ జిఎస్టి లైసెన్స్ తీసుకున్నారు. అయితే గత ఆరునెలలుగా వ్యాపారంలో వృద్ధి లేకపోవటంతో జిఎస్టి లైసెన్స్‌ను రద్దు చేయాల్సిందిగా దరఖాస్తు చేసుకున్నాడు. దరఖాస్తును పరిశీలించిన సెంట్రల్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సూపరింటెండెంట్ కళ్యాణ చక్రవర్తి రూ.2 వేల రూపాయల లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు హరికృష్ణ సీబీఐ అధికారులను ఆశ్రయించాడు. విషయం తెలుసుకున్న సీబీఐ అధికారులు రంగంలోకి దిగారు. హరికృష్ణ సెంట్రల్ ఎక్సైజ్ అధికారి కళ్యాణ చక్రవర్తి కి రెండు వేల రూపాయలు లంచం ఇస్తుండగా సిబిఐ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కేసు నమోదు చేసి కళ్యాణ చక్రవర్తిని సీబీఐ కోర్టుకు తరలించారు. కాగా అధికారి వేధింపులు భరించలేకే సీబీఐని ఆశ్రయించానని హరికృష్ణ తెలిపాడు. -
భర్త పారిపోయాడు.. కానీ భార్య మాత్రం..
సాక్షి, తణుకు (పశ్చిమ గోదావరి): ఫర్నిచర్ స్కీం పేరుతో ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసి ఆపై బోర్డు తిప్పేసిన సంఘటన తణుకు పట్టణంలో చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో వేల్పూరు రోడ్డులో శ్రీ ఫర్నీచర్ అండ్ ఎలక్ట్రానిక్స్ అధినేత కోర్ల శ్రీనివాసుపై పట్టణ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. శ్రీనివాస్ ఏజెంట్లు, లబ్ధిదారుల నుంచి రూ. కోటి పైగా వసూలు చేసి బోర్డు తిప్పేశాడు. కేవలం స్కీం పేరుతోనే కాకుండా పెద్ద ఎత్తున అప్పులు చేసి ఊరు వదిలి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి నిందితుడి ఆచూకీ కోసం అటు పోలీసులు ఇటు లబ్ధిదారులు గాలిస్తున్నారు. ఆదివారం రాత్రి శ్రీనివాసు భార్య ప్రసన్నను బాధితులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసు స్టేషన్ వద్ద ఉద్రిక్తత... దాదాపు రూ. కోటికి పైగా వసూళ్లకు పాల్పడి అనంతరం ఐపీ ప్రకటించిన కోర్ల శ్రీనివాసు అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఈ క్రమంలో ఆయన భార్య ప్రసన్న ఆదివారం రాత్రి స్థానిక తేతలి వైజంక్షన్ వద్ద హైదరాబాదు బస్సు ఎక్కే ప్రయత్నంలో బాధితులు ఆమెను చుట్టుముట్టారు. ఆమెతో ఘర్షణకు దిగిన బాధితులు ఆమెను తీసుకుని తణుకు రూరల్ పోలీసులకు అప్పగించారు. ఈ విషయం తెలుసుకున్న ఏజెంట్లు, బాధితులు పెద్ద సంఖ్యలో పోలీసు స్టేషన్‌కు చేరుకుని ఆందోళన వ్యక్తం చేశారు. కొందరు మహిళలు అయితే పెట్రోలు డబ్బా, పురుగుమందు డబ్బాలు చేతబట్టుకుని తాము ఆత్మహత్య చేసుకుంటామని బైఠాయించారు. ప్రసన్న ద్వారా నిందితుణ్ని అరెస్టు చేసి తమకు న్యాయం చేయాలంటూ పట్టుబట్టారు. దీంతో పట్టణ ఎస్సై డి.రవికుమార్ రంగంలోకి దిగి శ్రీనివాసు భార్య ప్రసన్నను అదుపులోకి తీసుకుని పట్టణ పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఇప్పటికే శ్రీనివాసుపై కేసు నమోదు చేశామని త్వరలో నిందితుణ్ని అరెస్టు చేస్తామని సీఐ చైతనక్యకృష్ణ తెలిపారు. రూ. 12 లక్షలు కట్టాను స్కీం పేరుతో ఫర్నీచర్ ఇతర వస్తువులు ఇస్తానని చెప్పడంతో నాతోపాటు మరికొందరితో స్కీంలో డబ్బులు కట్టించాను. ఇప్పటివరకు మొత్తం రూ. 12 లక్షలు శ్రీనివాసుకు చెల్లించాను. గత ఏప్రిల్‌లో బోర్డు తిప్పేసిన ఆయన ఊరు విడిచి వెళ్లిపోయాడు. దీంతో బాధితులంతా నాపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. నిందితుడి నుంచి సొమ్ములు రికవరీ చేసి ఆదుకోవాలి. – రామానుజం కోదండరాం, బాధితుడు ఆత్మహత్యే శరణ్యం ఎంతో నమ్మించి నా దగ్గర స్కీం కోసమని చెప్పి రూ. 3.80 లక్షలు కట్టించుకున్నారు. నేనే కాకుండా మా చుట్టుపక్కల మహిళలతోపాటు సొమ్ములు కట్టించాను. కట్టిన సొమ్ములకు ఎలాంటి ఫర్నీచర్ ఇవ్వలేదు. శ్రీనివాసు పారిపోయిన నాటి నుంచి నాపై ఒత్తిడి పెరుగుతోంది. అతని వద్ద నుంచి సొమ్ములు రికవరీ చేయాలి. లేకపోతే ఆత్మహత్యే శరణ్యం. – నమ్మి నాగలక్ష్మి, బాధితురాలు -
పశ్చిమలో టీడీపీకి షాక్..
సాక్షి, పశ్చిమ గోదావరి : రాష్ట్రంలో టీడీపీ పరిస్థితి మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్లు తయారవుతోంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్న ఆ పార్టీకి తాజాగా పశ్చిమ గోదావరిలో షాకింగ్ పరిణామం ఎదురయింది. తణుకు టీడీపీకి చెందిన ముగ్గురు కౌన్సిలర్లు తమ పదవులకు రాజీనామా చేశారు. అనంతరం రెండు వందల మంది కార్యకర్తలతో కలిసి తణుకు ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారి బాటలోనే.. మరో పదిహేను మంది కౌన్సిలర్లు కూడా వైఎస్సార్సీపీలో చేరేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే పార్టీలో చేరేవారు తమ కౌన్సిలర్ పదవులకు రాజీనామా చేసి రావాల్సిందిగా కారుమూరి కోరారు. ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి జరుగుతున్న పరిణామాణాలు టీడీపీకి మింగుడు పడటం లేదు. చంద్రబాబు ప్రకటించిన పార్లమెంటరీ పార్టీ పదవులపై విజయవాడ ఎంపీ కేశినేని నాని అలక వహించి ఫేస్బుక్లో వెటకారంగా పోస్టులు పెట్టడం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా పలువురు నేతలు పార్టీని వీడనున్నట్టు వార్తలు రావడం టీడీపీలో కలకలం రేపుతోంది. -
టీడీపీ గెలుపుపై పందెం; ప్రాణాపాయ స్థితిలో..
సాక్షి, పశ్చిమగోదావరి : ఎన్నికల ఫలితాలపై కాసిన పందెం ఓ యువకుడి ప్రాణాల మీదకు తెచ్చింది. పందెం ఓడిపోవడంతో ఎదుటి పార్టీ ఒత్తిడిని తట్టుకోలేని అతడు బలవన్మరణానికి యత్నించడం కలకలం రేపింది. ఈ విషాదకర ఘటన తణుకులో చోటుచేసుకుంది. తణుకుకు చెందిన ఇంటూరి సందీప్(30) ఈ ఎన్నికల్లో టీడీపీ గెలుస్తుందని రూ. 50 లక్షలు పందెం కట్టాడు. అయితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం నేపథ్యంలో అతడు పందెం ఓడిపోయాడు. దీంతో తన వద్ద రూ. 20 లక్షలు మాత్రమే ఉన్నాయని.. వాటితో సర్దుకోవాల్సిందిగా రెండవ పార్టీతో మొరపెట్టుకున్నాడు. కానీ వాళ్లు మొత్తం డబ్బులు చెల్లించాల్సిందిగా డిమాండ్ చేయడంతో ఒత్తిడి తట్టుకోలేక.. నిన్న రాత్రి పురుగుల మందు తాగాడు. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించగా ప్రస్తుతం ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. కాగా సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తుందని ప్రీ పోల్, ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడించిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ లగడపాటి రాజగోపాల్, యెల్లో మీడియా మాత్రం టీడీపీ గెలుపు ఖాయమంటూ తప్పుడు సర్వేలను ప్రజలపై రుద్దారు. దీంతో సందీప్ వంటి ఎంతో మంది వ్యక్తులు వీరి మాటలు నమ్మి..టీడీపీ విజయంపై పందేలు కాసి దారుణంగా నష్టపోయారు. ఇక ఈ ఎన్నికల్లో రికార్డు విజయం సొంతం చేసుకున్న వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. -
పక్కా ప్లాన్.. కానీ గేటుకు తాళం..!
తణుకు: ఒంటరిగా ఉన్న వృద్ధురాలి నుంచి బంగారాన్ని దోచుకోవాలని పన్నాగం పన్నారు.. అందుకు ప్రణాళిక సిద్ధం చేశారు.. ఆమె వద్ద ఉన్న బంగారాన్ని దోచుకుని ఆమెను హత్య చేయాలని ప్లాన్ చేశారు.. ఇందుకు మారణాయుధాలను సిద్ధం చేసుకుని పక్కా ప్లాన్ ప్రకారం ఇంట్లోకి చొరబడ్డారు. అయితే ప్లాన్ తిరగబడింది. అనుకోకుండా నిందితులంతా ఇంట్లో ఉండగానే వృద్ధురాలు గేటుకు తాళం వేసింది. అనూహ్యంగా పోలీసులకు చిక్కడంతో కథ అడ్డం తిరిగింది. చివరికి నలుగురు నిందితులు కటకటాలు లెక్కిస్తున్నారు. తణుకు పట్టణంలో ఈనెల 28వ తేదీ రాత్రి జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను తణుకు సర్కిల్ ఇన్స్పెక్టర్ డీఎస్ చైతన్యకృష్ణ వివరాలు వెల్లడించారు. ఆర్థిక ఇబ్బందులు ఆపై... తణుకు పట్టణంలోని ప్రభుత్వాసుపత్రి ఎదుట ఆంజనేయ కాంప్లెక్స్‌లో శ్రీనివాసా టీకార్నర్ నడుపుతున్న ఎన్ని శ్రీనివాసరావు అలియాస్ శ్రీను గత కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. గతంలో కొండూరి వారి వీధిలో వృద్ధురాలు నాగులకొండ శాంతకృష్ణవేణి ఇంట్లో పై అంతస్తులో శ్రీనివాసరావు కుటుంబం అద్దెకు ఉండేవారు. ఇదిలా ఉంటే కృష్ణవేణి నలుగురు కుమారులు బంగారం వ్యాపారం చేస్తుంటారు. ఈ క్రమంలో ప్రతి రోజు షాపులకు సంబంధించిన తాళాలు తల్లి ఇంట్లో ఉంచి ఉదయాన్నే తీసుకెళుతుంటారు. కృష్ణవేణి మాత్రం ఇంట్లో ఒంటరిగానే ఉంటుంది. అయితే ప్రతిరోజు బంగారు నగలు ఇంట్లో ఉంచుతున్నారని భ్రమ పడిన శ్రీనివాసరావు ఎలాగైనా బంగారాన్ని అపహరించుకుపోవాలని ప్రణాళిక చేశాడు. విజయవాడకు చెందిన తన మేనల్లుడు పిల్లా రామును సంప్రదించగా అతడి స్నేహితులు ఏలూరు ఖండ్రికగూడేనికి చెందిన దొండపాటి రాజు అలియాస్ చిన్నోడు, విజయవాడకు చెందిన ఇప్పిలి మురళితో కలిసి శ్రీనివాసరావు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఇందుకు ఒక్కొక్కరికి రూ.లక్ష ఇస్తానని శ్రీనివాసరావు నమ్మబలికాడు. ఈనెల 28న పిల్లా రాము తణుకు రైల్వేస్టేషన్ వద్ద ఉండగా మిగిలిన ముగ్గురు మూడు కత్తులు, నైలాన్ తాళ్లు తీసుకుని కృష్ణవేణి ఇంటికి వెళ్లారు. అడ్డం తిరిగిన కథ కృష్ణవేణి ఇంటి çపరిసరాలు అణువణువూ తెలిసిన శ్రీనివాసరావు తనతో పాటు రాజు, మురళిలను తీసుకుని రాత్రి 9 గంటలకే ఇంటిపైకి చేరుకున్నాడు. కృష్ణవేణి కుమారులు ఇంటికి వచ్చి తిరిగి వెళ్లే వరకు వేచి చూసిన వీరు కిందికి దిగి కృష్ణవేణి గది తలుపులు కొట్టారు. అయితే కృష్ణవేణితో పాటు మనవరాలు భావన కూడా ఇంట్లోనే ఉంది. కృష్ణవేణి అప్పటికే బయట గేటు తాళం వేయడంతో అసలు మీరు లోపలకు ఎలా వచ్చారని భావన ప్రశ్నించింది. దీంతో అయోమయంలో పడిన నిందితులు తలుపులు పగలగొట్టేందుకు ప్రయత్నించారు. కృష్ణవేణి తన కొడుకు నాగులకొండ బాలాజీకు ఫోన్ చేసి విషయం చెప్పడంతో పాటు పెద్దగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారంతా అక్కడకు చేరుకున్నారు. అదే సమయంలో వీరు పారిపోయేందుకు పై అంతస్తు నుంచి దూకేందుకు ప్రయత్నించారు. శ్రీనివాసరావు, మురళిలు తప్పించుకోగా రాజు స్థానికుల చేతికి చిక్కాడు. ఇతడిని స్థానికులు పోలీసులకు అప్పగించారు. దొండపాటి రాజును అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించగా అసలు విషయం చెప్పాడు. ఒకవేళ శ్రీనివాసరావును కృష్ణవేణి గుర్తుపడితే ఆమెను హత్య చేయడానికి సైతం తమతో పాటు కత్తులు, తాళ్లు తీసికెళ్లినట్లు విచారణలో నిందితులు అంగీకరించారు. నాగులకొండ బాలాజీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ డీఎస్ చైతన్యకృష్ణ ఆధ్వర్యంలో పట్టణ ఎస్సై డి.ఆదినారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నలుగురు నిందితులను సోమవారం అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పర్చగా రిమాండ్ విధించారు. నిందితులను అరెస్ట్ చేయడంలో సహకరించిన ఎస్సైలు కె.శ్రీనివాసరావు, పి.ప్రేమ్‌రాజు, క్రైం పార్టీ సిబ్బంది సత్యనారాయణ, అన్వర్, మహేష్, అక్బర్‌లాల్, వెలగేశ్వరరావులను జిల్లా ఎస్పీ ఎం.రవిప్రకాష్, కొవ్వూరు డీఎస్పీ ఎస్.వెంకటేశ్వరరావు అభినందించారు. -
మోసానికి మారు పేరు చంద్రబాబు
-
బాబుకు బుద్ధి చెప్పే రోజులు దగ్గరపడ్డాయ్: మంచు
తణుకు: కాళ్లు కడిగి కన్యాదానం చేసిన ఎన్టీఆర్ రామారావు చావుకు కారణమైన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడని నటుడు, వైఎస్సార్సీపీ నేత మంచు మోహన్ బాబు విమర్శించారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో ఎన్నికల ప్రచారంలో భాగంగా కారుమూరితో కలిసి మోహన్ బాబు రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ..ఎన్టీఆర్‌ని వెన్నుపోటు పొడిచి తెలుగుదేశం పార్టీని లాక్కున్న వ్యక్తి చంద్రబాబు అన్నారు.తెలుగు దేశం పార్టీ చంద్రబాబుది కాదని మహానటుడు అన్న ఎన్టీఆర్దని వ్యాఖ్యానించారు. చంద్రబాబుకి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరపడ్డాయన్నారు. టీడీపీ భూస్థాపితం ఖాయం ‘రాబోయే రోజుల్లో టీడీపీ భూస్థాపితం అవటం ఖాయం. అన్న ఎన్టీఆర్ శాపం ఫలిస్తుంది. ఎన్నికల సమయంలో మాత్రమే చంద్రబాబుకి డ్వాక్రా మహిళలు గుర్తొస్తారు. ఇప్పుడు పసుపు కుంకుమ పేరుతో వాళ్ల డబ్బులు వాళ్లకే ఇస్తున్నాడు. ఇన్నాళ్లు చంద్రబాబుతో పాటు ఆయన మంత్రులు కలసి ఇసుక, మట్టి దోచుకొని లక్షల కోట్ల రూపాయలు ఆర్జించారు. మరొక్కసారి బాబును కనుక నమ్మితే ఈసారి ప్రజల రక్తాన్నే పీల్చేస్తాడు. సరిగ్గా మాట్లాడటం రాని తన కొడుక్కి మూడు మంత్రి పదవులు కట్టబెట్టటం సమంజసమా’ అని మోహన్ బాబు ప్రశ్నించారు. 130 స్థానాల్లో విజయఢంకా మోగించటం ఖాయం ‘రాష్ట్రం మొత్తం వైఎస్ జగన్ వెంటే ఉంది. ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ 130 స్థానాల్లో విజయఢంకా మోగించటం ఖాయం. వైఎస్ జగన్‌పై కేసులు గురించి మాట్లాడే బాబుపైనా పదకొండు కేసులున్నాయి. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయి హైదరాబాద్ నుంచి రాత్రికి రాత్రే పారిపోయి వచ్చింది నువ్వు కాదా.. ప్రత్యేక హోదాపై చంద్రబాబు ఎన్ని నాలుకలతో మాట్లాడుతున్నాడో ప్రజలు గమనిస్తున్నారు. పోలవరం నిధుల గురించి కేంద్రం లెక్కలు అడిగితే చెప్పటం లేదు.. అదేమైనా బాబు తన అబ్బ మొగుడి సొమ్ము అనుకొంటున్నాడా. చంద్రబాబు లాంటి వ్యక్తిని వేరే దేశంలో అయితే ఉరి తీసేవారు. ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ లాంటి పథకాలతో వైఎస్సార్ ప్రజల హృదయాల్లో నిలిచిపోయార’ ని మోహన్ బాబు కొనియాడారు. -
బీజేపీతో కొనసాగుతోన్న టీడీపీ దోస్తీ
పశ్చిమ గోదావరి జిల్లా: బీజేపీతో టీడీపీ దోస్తీ పూర్తిగా తెగినట్లు కనబడటం లేదు. టీవీ చర్చా కార్యక్రమాల్లో టీడీపీ, బీజేపీ నాయకులు ఒకరినొకరు విమర్శలు చేసుకుంటున్నా కూడా ఎమ్మెల్యేలు మాత్రం టీడీపీ ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో బాహాటంగా పాల్గొంటున్నారు. బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ తీరు ప్రస్తుతం చర్చనీయాంశమైంది. తణుకు ఏరియా ఆసుపత్రిలో రూ.8.50 కోట్లతో నిర్మించిన మాతా శిశు విభాగాన్ని ఎమ్మెల్యే హోదాలో కామినేని ప్రారంభించారు. కామినేని మంత్రిగా కాకుండా ఎమ్మెల్యే హోదాలో వేరే జిల్లాలోని నియోజకవర్గ ప్రారంభోత్సవంలో పాల్గొనడంపై చర్చ జరుగుతోంది. ఈ విషయంపై బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్‌ను వివరణ అడగగా తణుకు టీడీపీ ఎమ్మెల్యే రాధాకృష్ణ ఆహ్వానం మేరకే ప్రారంభోత్సవం చేశానని చెబుతున్నారు. అయితే కామినేని పార్టీ మారతారనే గుసగుసలు కూడా వినిపిస్తోన్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ వస్తేగానీ ఎవరు ఏ పార్టీలోకి వెళ్లేది లేనిది తెలిసేలా లేదు. -
‘రాజధానిలో దోపిడీ చేశారు.. రాజధాని నిర్మించలేదు’
ప గో జిల్లా, తణుకు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిని నిర్మించాల్సిన పనిని వదిలేసిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. రాజధానిలో భూ దోపిడీ మాత్రం చేశారని వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు. శుక్రవారం తణుకు పట్టణ వైఎస్సార్సీపీ కార్యాలయంలో మాట్లాడిన సుబ్బారెడ్డి.. మళ్లీ మీరే రావాలని కోరటానికి అసలు బాబు రాష్ట్రానికి ఏమి చేశారో చెప్పాలని సవాల్ విసిరారు. ‘ఎంతో ప్రాముఖ్యత ఉన్న పోలవరం ప్రాజెక్ట్ కేంద్రం నిర్మిస్తామంటే దాన్ని నువ్ టేకప్ చేసి ప్రజలకు ప్రాజెక్ట్ కూడా లేకుండా చేసావ్. నీ పాలనలో మంత్రులు నుండి గ్రామస్థాయి నాయకులవరకూ అంతా దోపిడీకే పాల్పడ్డారు. నీ పాలనలో అర్హులైన వారికి పెన్షన్ లు అందాలన్నా కమీషన్ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి. ఎప్పుడెప్పుడు ఈ ప్రభుత్వానికి చరమగీతం పాడాలా అని ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. నీవు నీ స్వార్ధ ప్రయోజనాలకోసం రోజుకొకరితో కలుస్తావ్ ఎంతకైనా దిగజారతావు. మా పార్టీకి రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం. మేము ఎవ్వరితోనూ పొత్తు పెట్టుకోం. ఒంటరిగానే పోటికి దిగుతాం’ అని స్పష్టం చేశారు. -
అవినీతి@100కోట్లు
-
అతనో చిరుద్యోగి.. రూ. కోట్ల ఆస్తికి యజమాని..
తణుకు: అతనో చిరుద్యోగి.. రూ. కోట్ల ఆస్తికి ఆయన యజమాని.. అత్యంత విలాసవంతమైన జీవితం.. ఖరీదైన కార్లు... కళ్లు చెదిరిపోయే ఇల్లు.. సినిమా హాల్‌ను తలపించే భారీ తెర.. ఒక్కోటి రూ. లక్షలు విలువ చేసే చేతి గడియారాలు.. ఇలా అతని ఆర్థిక వ్యవహారాలను చూస్తే దిమ్మ తిరిగిపోవడం ఖాయం.. జిల్లా కేంద్రం ఏలూరులోని పంచాయతీరాజ్ శాఖ ఆర్డబ్ల్యూఎస్ విభాగంలో జూనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న రాంపల్లి సత్యఫణి దత్తాత్రేయ దివాకర్‌కు చెందిన అక్రమ ఆస్తులపై ఏసీబీ అధికారులు ఆదివారం దాడులు నిర్వహించారు. ఉండ్రాజవరం మండలం పాలంగి గ్రామంలోని దివాకర్ నివాసంతోపాటు తణుకులోని ఆయన కార్యాలయంలో, తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలోని ఆయన బంధువుల ఇంటిపైనా ఏకకాలంలో ఈ దాడులు నిర్వహించారు. ఏసీబీ డీజీ ఆర్పీ ఠాకూర్ ఆదేశాల మేరకు అడిషినల్ ఎస్పీ ఎ.రమాదేవి స్వయంగా ఈ దాడుల్లో పాల్గొన్నారు. ఈ దాడుల్లో దివాకర్‌తోపాటు అతని తల్లి రాంపల్లి వెంకట సుబ్బలక్ష్మి, సోదరుడు రాంపల్లి శ్రీనివాస రామకృష్ణ కిరణ్‌కుమార్ పేర్లపై సుమారు రూ. 100 కోట్లు ఆక్రమాస్తులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 2012 నుంచి 2017 వరకు ఐదేళ్ల వ్యవధిలోనే ఈ ఆస్తులు కూడబెట్టినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే ఏడాదిగా దివాకర్ సెలవులో ఉన్నట్లు తెలుస్తోంది. ఉద్యోగి నుంచి రియల్టర్‌గా... ఇరగవరం మండలం తూర్పువిప్పర్రు గ్రామానికి చెందిన దివాకర్ పంచాయతీరాజ్ శాఖ ఆర్డబ్ల్యూఎస్ విభాగం చింతలపూడిలో 2009 జూన్ 15న జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగంలో చేరారు. ఇతని తండ్రి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ మృతి చెందడంతో దివాకర్‌కు ఉద్యోగం ఇచ్చారు. అయితే కొద్ది కాలంలోనే రియల్టర్‌గా అవతారం ఎత్తిన దివాకర్ డెప్యూటేషన్‌పై ఏలూరు ఎస్ఈ కార్యాలయంలో విధుల్లో చేరారు. ఏడాదిగా సెలవులో కొనసాగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే అక్రమంగా పెద్ద ఎత్తున ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలు రావడంతో ఏసీబీ డీజీ ఆర్పీ ఠాకూర్ ఆదేశాలతో అడిషినల్ ఎస్పీ ఎ.రమాదేవి స్వయంగా రంగంలోకి దిగారు. ఆదివారం వేకువజామున పాలంగిలోని దివాకర్ నివాసానికి వచ్చిన ఏసీబీ అధికారులు ఇంట్లోని నగదు, బంగారు, వెండి ఆభరణాలు, అత్యంత ఖరీదైన చేతిగడియారాలు, విలాసవంతమైన ఐదు కార్లు, కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. తణుకులోని రాఘవేంద్ర రెసిడెన్సీలోని దివాకర్‌కు చెందిన కార్యాలయంలోనూ ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఏసీబీ గుర్తించిన అక్రమాస్తులు ఇవే... దివాకర్ కుటుంబానికి వ్యవసాయ భూమి 85.62 ఎకరాలు, బంగారం అరకిలో, వెండి 5 కిలోలు ఉన్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. హౌస్ ఫ్లాట్లు, 19, ఫామ్ హౌస్ 1, జీప్లస్2 నివాసగృహం 1, కమర్షియల్ జీప్లస్3 భవనం, గోదాం 1 ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. ఇంట్లో నగదు రూ. 6.25 లక్షలు, విదేశీ కరెన్సీ రూ. 60 వేలు, బ్యాంకు నిల్వ రూ. 3 లక్షలు, ఇంట్లోని ఫర్నీచర్ రూ. 30 లక్షలు, కార్లు 5, మోటారుసైకిళ్లు 2 ఉన్నట్టు గుర్తించారు. పెద్దలే బినామీలు ఆర్డబ్ల్యూఎస్ విభాగంలో జూనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న దివాకర్ అక్రమార్జనతోనే ఇన్ని ఆస్తులు కూడబెట్టారా? లేక ఎవరికైనా ఇతను బినామీగా వ్యవహరిస్తున్నారా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. కేవలం చిరుద్యోగిగా జీవితం ప్రారంభించిన దివాకర్ కొద్దికాలంలోనే పెద్ద ఎత్తున ఆస్తులు ఎలా కూడబెట్టారనే ప్రచారం జోరుగా సాగుతోంది. కొందరు అధికార పార్టీకి చెందిన నాయకులకు ఇతను బినామీగా ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. స్థానిక ప్రజాప్రతినిధి అత్యంత సమీప బంధువుతో ఇతను కొంతకాలంగా ఆర్థిక వ్యవహారాలు నడుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే వీరిద్దరి మధ్య ఇటీవల మనస్పర్థలు తలెత్తడంతోనే దివాకర్ ఆర్థిక వ్యవహారాలపై ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఆదివారం రాత్రి పొద్దుపోయే వరకు సోదాలు నిర్వహించారు. దివాకర్‌ను అరెస్టు చేశారు. సోమవారం విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు. ఈ దాడుల్లో ఏసీబీ సీఐలు బి.సుదర్శన్‌రెడ్డి, ఎల్.సన్యాసినాయుడు, భాస్కరరావు, మోహన్, సిబ్బంది పాల్గొన్నారు. -
అర్హతలేని వైద్యం.. ప్రాణసంకటం
పశ్చిమగోదావరి, తణుకు అర్బన్: వైద్య ఆరోగ్య శాఖలో బయటపడుతోన్న ఉదంతాలు జిల్లా వైద్య రంగాన్ని కుదిపేస్తున్నాయి. డబ్బు వ్యామోహంతో కొందరు వైద్యులు చేస్తోన్న అధర్మ వైద్యం జిల్లాలో తణుకును ముందు వరుసలో నిలిపింది. ప్రైవేటు రంగంలో ఇస్టానుసారంగా చేస్తోన్న సిజేరియన్లు, డెంగీ వ్యాధి పేరుతో వైద్యం వంటి అంశాలపై దృష్టి సారించిన వైద్య ఆరోగ్య శాఖ ఇప్పుడు తాజాగా అర్హత లేని వైద్యం చేస్తోన్న వైద్యుల భరతం పడుతోంది. గణపవరం మండలం జల్లి కొమ్మరలో ఇటీవల జరిగిన మరణంపై డీఎంహెచ్‌వో డాక్టర్ బండారు సుబ్రహ్మణ్యేశ్వరి విచారణ జరిపారు. అనంతరం ఆమె అర్హతలేని వైద్యం చేస్తున్నారంటూ తణుకులోని ఓ హాస్పటల్లో మత్తు వైద్యుడు డాక్టర్ డి.బిల్లీగ్రహంను నిలదీసిన విషయం తెలిసిందే. ఆస్పత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన ఆమె ఇటీవల కాలంలో జ్వరపీడితులు, ప్లేట్ లెట్స్ కౌంట్ తగ్గాయని చికిత్స చేయించుకున్న వారి కేస్ షీట్లు స్వాధీనం చేసుకున్నారు. ఆ కేస్ షీట్లలో జనరల్ ఫిజీషియన్కు బదులుగా సదరు బిల్లీగ్రహం వైద్యమే కనిపించడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రోగులు డాక్టర్ బిల్లీగ్రహం ఆస్పత్రిపై డీఎంహెచ్‌వో తనిఖీల నేపథ్యంలో సాక్షిలో వచ్చిన కథనానికి అనేకమంది బాధితులు బయటకు వచ్చి తమ ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నపాటి రుగ్మతలకు కూడా మా వద్ద వేలకు వేలు గుంజారంటూ వాపోయారు. పదేళ్లుగా వైద్యం చేస్తోన్న సదరు వైద్యుడు తన ఆస్పత్రిలో ఎక్కువగా పాయిజన్ కేసులు, ప్లేట్లెట్స్ కౌంట్ తగ్గిన కేసులు ఇతర అత్యవసర కేసులన్నిటికీ వైద్యం చేస్తున్నట్టు తణుకు వాసులు చెప్పారు. కేవలం మత్తు వైద్యుడు ఇన్ని రకాల అత్యవసర వైద్యం చేస్తుంటే వైద్యాధికారులు, ఐఎంఏ ప్రతినిధులు ఏం చేస్తున్నారనేది ప్రజానీకం ప్రశ్న. జిల్లావ్యాప్తంగా నకిలీ వైద్యులు, అర్హత లేని వైద్యులు, లేని డిగ్రీలు తగిలించించుకుని చేస్తోన్న వైద్యం తాలూకా వ్యవహారాలు రెండేళ్లుగా వెలుగులోకి వస్తున్నాయి. ప్రాణానికి డబ్బుతో ముడి 2015లో బయటపడ్డ నకిలీ వైద్యుడు బొల్లినేని శ్రీకాంత్ ఘటన జిల్లాను కుదిపేసిన విషయం తెలిసిందే. ఆ ఘటన తరువాత జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో నకిలీ వైద్యుల ఉదంతాలు బయటపడ్డాయి. ఇటీవల తణుకు ఏరియా ఆస్పత్రికి కూతవేటు దూరంలో ఉన్న ప్రైవేటు ఆస్పత్రిలో కాలుకు పుండు పడి చికిత్స పొందుతున్న వ్యక్తి అనుమానాస్పదంగా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు సంబంధించి వైద్యుడి నిర్వాకం కారణంగానే ప్రాణాలు పోయాయనే ఆరోపణలతో జిల్లాకు చెందిన ఒక మంత్రి కలుగచేసుకోవడంతో బాధిత కుటుంబానికి రూ. రూ.1.50 లక్షలు ఇచ్చి గొడవ లేకుండా సరిచేసుకున్నట్టు సమాచారం. వైద్యాన్ని వ్యాపారం చేసే క్రమంలో ఒక ఫార్మసిస్ట్ నడుపుతోన్న ఈ ఆస్పత్రిలో వైద్యులు గెస్ట్ రోల్ పోషిస్తున్నారని, ఆస్పత్రి నిర్వహణకు అనుమతులపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే క్రమంలో మరొక ఆస్పత్రిలో ఇటీవల మృతిచెందిన గర్భిణి ఉదంతం కూడా అనుమానాస్పదంగా ఉంది. డెంగీ అని ఆస్పత్రి వైద్యులు అంటుండగా, చేసిన పొరపాటును డెంగీ అని చెప్పి కప్పిపుచ్చుతున్నారని, గర్భిణికి మూడు నెలల ముందుగా శస్త్రచికిత్స చేయడం వలనే చనిపోయిందని వైద్యాధికారి చెబుతున్నారు. రెండు సార్లు జిల్లా వైద్యాధికారులు విచారణ చేసిన ఈ వ్యవహారం రాష్ట్ర వైద్యాధికారి చేతుల్లోకి వెళ్లినట్టు సమాచారం. వైద్యాధికారులపై చిందులు వేస్తున్న నేతలు తణుకులో ఇటీవల సిజేరియన్లు భారీగా చేస్తున్నారనే వ్యవహారంలో డీఎంహెచ్‌వో డాక్టర్ బండారు సుబ్రహ్మణ్యేశ్వరి దూకుడును అడ్డుకోవాలంటూ తణుకు ఐఎంఏ ప్రతినిధులు తణుకు, నిడదవోలు ప్రజాప్రతినిధులకు మొరపెట్టుకున్నారు. అంతేకాకుండా తాడేపల్లిగూడెం పర్యటనకు వచ్చిన ఒక మంత్రిని కలిసి వైద్యాధికారికి ఫోన్ చేయించారు. రూ.25 వేలు బిల్లు వేశారు డయేరియా లక్షణాలతో మా అమ్మను తణుకులోని డాక్టర్ డి.బిల్లీగ్రహం హాస్పటల్లో చూపించాను. పదిరోజులపాటు వైద్యం చేసి రూ.25 వేలు బిల్లు వేశారు. రక్త పరీక్షలు అక్కడ మాత్రమే చేయించుకోవాలని, మందులు ఆస్పత్రి డిస్పెన్సరీలోనే తీసుకోవాలనే నిబంధనలు పెట్టారు. రెండు రోజుల ట్రీట్మెంట్ పదిరోజులు సాగదీశారు. ఆఖరుకు రూ.1500 మాత్రమే తగ్గించి బిల్లు చెల్లించాం. –ఎం.లక్ష్మణ్, పైడిపర్రు -
నారావారిది నరకాసుర పాలన
తణుకు: మహిళలంటే గౌరవం లేని, మహిళలకు రక్షణ లేని, మహిళా సాధికారత గురించి ఆలోచన లేని, మహిళా వ్యతిరేక పాలనలో మనం జీవిస్తున్నామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, నగరి ఎమ్మెల్యే ఆర్.కె.రోజా పేర్కొన్నారు. అధికారంలోకి రావడానికి రాష్ట్రంలోని మహిళల చేతులను పట్టుకుని అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఏరుదాటాక తెప్ప తగలేసిన చందంగా ప్రజలను మోసం చేశారని దుయ్యబట్టారు. తణుకు పట్టణంలోని స్థానిక జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో శనివారం నిర్వహించిన జిల్లా స్థాయి మహిళా సదస్సులో ఆమె ముఖ్యఅతిధిగా పాల్గొని మాట్లాడారు. నియోజకవర్గ కోఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో రోజా మాట్లాడుతూ రైతులకు, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి ఇప్పుడు వారిని అప్పులపాల్జేసి బ్యాంకుల్లో బ్లాకులిస్టులో పెట్టిన ఘనత చంద్రబాబుదే అన్నారు. అధికారంలోకి వచ్చాక బాధితులు ఫోన్ చేసిన అయిదు నిమిషాల్లో వచ్చి తాట తీస్తానని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు పత్తా లేకుండా పోయాడన్నారు. కళ్లెదుటే అన్యాయం జరుగుతున్నా, తన ప్రజాప్రతినిధులే మహిళలపై దాడులకు తెగబడుతున్నా పల్లెత్తుమాట మాట్లాడకుండా వారిని వెనుకేసుకొస్తున్నారని విమర్శించారు. నిజాయితీ కలిగిన తహసీల్దార్ వనజాక్షిపై దాడి చేసిన చింతమనేని ప్రభాకర్ వ్యవహారాన్ని చంద్రబాబు సెటిల్మెంట్ చేయడం సిగ్గుచేటన్నారు. అంతేకాకుండా ఆయనకు ప్రభుత్వ విప్ పదవి కట్టబెట్టడం చంద్రబాబుకే చెల్లిందన్నారు. దీన్ని ఆసరాగా తీసుకున్న అధికార పార్టీ ఎమ్మెల్యేలు రెచ్చిపోతున్నారని విమర్శించారు. స్థానిక ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ సైతం ఒక ఎస్సై, హెడ్ కానిస్టేబుల్‌ను కింద కూర్చోబెడితే ఎస్సైను బదిలీ చేశారు తప్ప ఎమ్మెల్యేపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ఇరగవరం మండలంలో ఇళ్లస్థలాల కోసం ప్రశ్నించిన మహిళల చాతీపై నెట్టివేసిన ఎమ్మెల్యేపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని గుర్తు చేశారు. నరసాపురంలో శ్రీగౌతమి హత్య కేసులో సైతం పక్కదోవ పట్టించిన ప్రజాప్రతినిధులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. జిల్లాలోని తుందుర్రు ఆక్వా ఫ్యాక్టరీ నిర్మాణాన్ని అడ్డుకున్న మహిళలపై లాఠీఛార్జి చేయించి వారిని జైలులో పెట్టించిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిదని విమర్శించారు. పేదలకు చెందాల్సిన 7.26 ఎకరాల ఇరిగేషన్ భూమిని తెలుగుదేశం పార్టీ నేతలకు లాభం చేకూర్చేవిధంగా వారికి కట్టబెట్టారని చెప్పారు. దండి మార్చి విగ్రహాలను సైతం వేరే ప్రాంతానికి తరలించి అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేయడం దారుణమన్నారు. కేబినెట్లో కాలకేయులు చంద్రబాబు కేబినేట్లో ఇద్దరు కాలకేయులు ఉన్నారని రోజా ఎద్దేవా చేశారు. అచ్చెన్నాయుడు, దేవినేని ఉమతోపాటు జిల్లాకు చెందిన చింతమనేని ప్రభాకర్ కూడా ఉన్నారని విమర్శించారు. నారావారి నరకాసుర పాలనకు ప్రజలు చరమగీతం పాడే రోజులు దగ్గరపడ్డాయని పేర్కొన్నారు. రాజధాని భూములు, ఇసుక, మట్టి, ప్రాజెక్టులు ఇలా ఏదీ అవినీతికి అనర్హం కాదనే రీతిలో తెలుగుదేశం ప్రభత్వంలోని ప్రజాప్రతినిధులు దోచుకుని దాచుకుంటున్నారని అన్నారు. రేషన్, పింఛన్, ఇల్లు ఇలా ఏది కావాలన్నా జన్మభూమి కమిటీలకు లంచం ఇచ్చుకోవాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రజల రక్తం పీల్చే జలగల్లా మారిపోయారని ఆరోపించారు. ఇక్కడ అ«ధికారంలో ఉండి ఏ ఒక్క హామీను అమలు చేయని చంద్రబాబు తెలంగాణ రాష్ట్రంలో తిరుగుతూ అధికారంలోకి వస్తే అన్నీ చేసేస్తాం అంటూ మాట్లాడుతున్నారని అన్నారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పుట్టిన తెలుగుదేశం పార్టీని ఇప్పుడు కాంగ్రెస్‌పార్టీలో కలిపేసిన ఘనత చంద్రబాబుదే అన్నారు. సిగ్గులేకుండా ఇప్పుడు చారిత్రాత్మక అవసరం అంటూ రాహుల్‌గాంధీతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాడని విమర్శించారు. సదస్సుకు అధ్యక్షత వహించిన కారుమూరి వెంకట నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందన్నారు. ఓటు వేశాం కాబట్టి శాపగ్రస్తుల్లా బతకాల్సిన దుస్థితి తలెత్తిందని పేర్కొన్నారు. అధికార పార్టీలోని ఎమ్మెల్యేలందరూ చట్టానికి చుట్టాలుగానే వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పార్టీ నేత జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ ఎక్కడ చూసినా అరాచకం, అన్యాయం జరుగుతోందని ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని దోచుకో దాచుకో అన్నచందంగా అధికార పార్టీ నేతలు వ్యవహరిస్తున్నారని అన్నారు. నరసాపురం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు ముదునూరి ప్రసాదరాజు మాట్లాడుతూ మళ్లీ రాజన్న రాజ్యం రావాలంటే జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావాలన్నారు. అనంతరం రోజాను పార్టీ నేత కారుమూరి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రీజనల్ మహిళా కోఆర్డినేటర్ పిళ్లంగోళ్ల శ్రీలక్ష్మి, జిల్లా మహిళా అధ్యక్షురాలు గూడూరు ఉమాబాల, సాయిబాలపద్మ, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, గోపాలపురం, నిడదవోలు కోఆర్డినేటర్లు కొట్టు సత్యనారాయణ, గుణ్ణం నాగబాబు, తలారి వెంకట్రావు, జి.శ్రీనివాసనాయుడు, మున్సిపల్ మాజీ ఛైర్మన్ బలగం సీతారామం, నియోజకవర్గ మహిళా అ«ధ్యక్షురాలు మెహర్ అన్సారీ, పట్టణ మహిళా అధ్యక్షురాలు నూకల కనకదుర్గ, పార్టీ నాయకులు ఎస్.ఎస్. రెడ్డి, బోడపాటి వీర్రాజు, పి.సత్యనారాయణ, కొప్పిశెట్టి దుర్గాప్రసాద్, మారిశెట్టి శేషగిరి, బలగం బాబి తదితరులు పాల్గొన్నారు. -
ఇద్దరు మంత్రులకు అ, ఆ లు కూడా రావు: రోజా
తణుకు: ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు క్యాబినేట్లో ఉన్న ఇద్దరు మహిళా మంత్రులకు అ, ఆ లు కూడా రావని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఎద్దేవా చేశారు. శనివారం పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో జరిగిన మహిళా సదస్సులో రోజా మాట్లాడుతూ..చింతమనేని రౌడీయిజంపై సీఎం చంద్రబాబు ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. ఎమ్మార్వో వనజాక్షిపై చింతమనేని ప్రభాకర్ దాడి చేస్తే సీఎం చంద్రబాబు సెటిల్ మెంట్ చేసి సెటిల్మెంట్ మినిస్టర్ అనిపించుకున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో మహిళలపై అరాచకాలు జరుగుతున్నా ఇద్దరు మహిళా మంత్రులు కూడా మాట్లాడలేని దద్దమ్మల్లా మిగిలిపోయారని తూర్పారబట్టారు. అచ్చెన్నాయుడు, దేవినేని ఉమా లాంటి కాలకేయులు చంద్రబాబు క్యాబినేట్లో ఉన్నారని, అది కాలకేయుల క్యాబినేట్ అని దుయ్యబట్టారు. ఏపీలో ఇసుక నుంచి మట్టి వరకు అన్నింటా దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. జన్మభూమి కమిటీలకు లంచం ఇవ్వనిదే ప్రజలకి ఏ పనీ జరగడం లేదని ధ్వజమెత్తారు. ఏపీలో సమస్యలను గాలికి వదిలేసి తెలంగాణ ఎన్నికలలో చంద్రబాబు తిరుగుతున్నారని అన్నారు. ఏపీని విభజించి నాశనం చేసిన కాంగ్రెస్‌తో కలిసిపోయిన సిగ్గుమాలిన నేత చంద్రబాబు అని తీవ్రంగా విమర్శించారు. ఏపీని నాశనం చేసిన కాంగ్రెస్‌తో చంద్రబాబు ఎందుకు పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం వచ్చిందో చెప్పాలన్నారు. దేశంలోనే అత్యంత అవినీతిపరుడైన సీఎం చంద్రబాబు అని జూన్‌లో కాంగ్రెస్ నాయకులు చార్జిషీటు విడుదల చేశారు..ఇప్పుడు అదే అవినీతి సీఎం చంద్రబాబును కాంగ్రెస్ కలుపుకోవడం చూస్తుంటే రాహుల్ ఎంత రాజకీయ అజ్ఞానో అర్ధమవుతుందన్నారు. చంద్రబాబుని రాష్ట్రం నుంచి తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. పోలీసులు అధికార పార్టీకి బౌన్సర్లుగా మారారని, తణుకులో ఎస్ఐ స్థాయి అధికారిని ఎమ్మెల్యే రాధాకృష్ణ నేలపై కూర్చోబెట్టి దౌర్జన్యం చేస్తే ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోకుండా ఎస్ఐని బదిలీ చేయడం నిజం కాదా అని ప్రశ్నించారు. వైఎస్ జగన్‌పై హత్యాయత్నం వెనక ఎవరున్నారో అందరికీ అర్ధమైందని చెప్పారు. నారా వారి నరకాసుర పాలనకు పుల్‌స్టాప్ పెట్టే రోజు వచ్చిందని, మిమ్మల్ని బంగాళా ఖాతంలో కలపడానికి మహిళలు సిద్ధంగా ఉన్నారని వ్యాక్యానించారు. -
వైద్యులు ఇద్దరు.. సేవలు అరకొరే!
పశ్చిమగోదావరి, తణుకు అర్బన్: వైద్యులు ఇద్దరు.. సేవలు పూజ్యం అన్నట్టుంది తణుకు ఏరియా ప్రభుత్వ ఆస్పత్రిలోని జనరల్ సర్జరీ విభాగ వైద్యసేవలు. గతంలో తణుకు ఏరియా ప్రభుత్వ ఆస్పత్రి రాష్ట్ర ఉత్తమ ఆస్పత్రిగా ఐదుసార్లు అవార్డు దక్కించుకోవడంలో జనరల్ సర్జరీ విభాగం కీలకపాత్ర పోషించింది. ఐతే ఇటీవల కొన్ని శస్త్రచికిత్సలకే ఈ జనరల్ సర్జరీ విభాగం పరిమితమైందని రోగులు ఆరోపిస్తున్నారు. ఏలూరు జిల్లా ఆస్పత్రికి ధీటుగా, జిల్లాలో మిగిలిన ఆస్పత్రులకన్నా మెరుగైన సేవలందించే 100 పడకల తణుకు ఆస్పత్రికి నిత్యం 70కి పైగా జనరల్ సర్జన్ విభాగ ఓపీకి రోగులు వస్తుంటారు. వీరిలో కొందరికి శస్త్రచికిత్సలు అవసరం ఉండే పరిస్థితి ఉంది. వీరు వైద్య సేవల కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మూడేళ్ల క్రితంతో పోల్చుకుంటే ఈ రెండేళ్లు జనరల్ సర్జరీ విభాగంలో 50 శాతం వైద్యసేవలు కుంటుపడ్డాయని తెలుస్తోంది. ఓపీకే పరిమితం జనరల్ సర్జరీ విభాగంలో రెండేళ్ల నుంచి సీనియర్ వైద్యుడు అందుబాటులో ఉండగా, రెండు నెలల క్రితం మరో జనరల్ సర్జన్ కాంట్రాక్ట్ బేసిక్‌పై అందుబాటులోకి వచ్చారు. ఆయనకు పూర్తిస్థాయిలో విధులు నిర్వర్తించే అవకాశం ఇవ్వడంలేదనే ఆరోపణలు వస్తున్నాయి. జనరల్ సర్జన్ విభాగంలో కూర్చోనివ్వకుండా ఆర్ధోపెడిక్ వైద్యుడి ఓపీ విభాగంలో సదరు వైద్యుడిని కూర్చోబెట్టి మందులు రాసిపంపే విధులకే పరిమితం చేశారు. అధికారం ఉన్నా వైద్యాధికారి అలసత్వం కారణంగా జనరల్ సర్జన్ సేవలు వినియోగంలోకి రావడంలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వారానికి మూడు రోజులు సోమ, బుధ, శుక్ర వారాల్లో మాత్రమే అవుట్ పేషెంట్స్ చూస్తుండగా మిగిలిన రోజులు శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం అదనపు వైద్యుడు ఉన్నప్పటికీ పాతపద్ధతే కొనసాగుతోంది.కొత్త వైద్యుడిని సీనియర్ వైద్యుడు తన విభాగంలో కూర్చునేందుకు కూడా ససేమిరా అన్నారని తెలుస్తోంది. సీనియర్ వైద్యుడి వైద్య సేవలు కూడా అంతంత మాత్రంగానే అందుతున్నాయని, ఒక మోస్తరు కేసులు తప్ప పెద్ద కేసులు జాయిన్ చేయరని వైద్యవర్గాలు, రోగులు చెబుతున్నారు. శస్త్రచికిత్సలివి శస్త్ర చికిత్సల విభాగంలో పసరతిత్తి తొలగింపు, థైరాయిడ్, 24 గంటల నొప్పి (అపెండిసైటీస్) హెర్నియా, హైడ్రోసిల్, ఫైల్స్, కణితులు వంటి శస్త్ర చికిత్సలు గతంలో పెద్ద ఎత్తున జరిగేవి. ప్రస్తుతం పసరతిత్తి తొలగింపు, థైరాయిడ్ కేసుల్లో శస్త్ర చికిత్సలు పూర్తిగా నిలిచిపోగా అపెండిసైటీస్ అడపాదడపా మాత్రమే చేస్తున్న దుస్థితి. ప్రస్తుతం ఈ శస్త్ర చికిత్సలకు రోగులను కాకినాడ, ఏలూరు రిఫరల్ చేస్తుండగా, కొన్ని కేసుల్లో బీపీ, తదితర కారణాలు చూపించి శస్త్ర చికిత్సలు వాయిదా వేస్తుండడంతో ప్రైవేటు వైద్యులను ఆశ్రయించాల్సి వస్తోందని రోగులు వాపోతున్నారు. ఎన్టీఆర్ వైద్యసేవలో చేసే శస్త్ర చికిత్సల్లో వైద్యుడు, సిబ్బందితోపాటు ఆస్పత్రి అభివృద్ధి కమిటీకి కూడా నిధులు జమవుతాయి. ఇటీవల శస్త్రచికిత్సల కేసులు తగ్గడంతో ఆస్పత్రికి ఆదాయం కూడా తగ్గిన దుస్థితి నెలకొంది. ఆ వైద్యుడు చేయరు.. వేరొకరిని చేయనివ్వరు థైరాయిడ్‌తో గొంతువాపు వచ్చి ఇబ్బందులు పడుతున్నాను. ఆరు నెలల క్రితం తణుకు ఆస్పత్రిలో చూపిస్తే కాకినాడ వెళ్లమన్నారు. మా అబ్బాయి హనుమంతు తణుకులోని ఓ ప్రైవేటు వైద్యుడిని బతిమలాడితే ప్రభుత్వ ఆస్పత్రిలో జాయినయితే నేను అక్కడకు వచ్చి ఉచితంగానే ఆపరేషన్ చేస్తానని దేవుడిలా వరమిచ్చారు. కానీ ప్రభుత్వ ఆస్పత్రిలోని వైద్యుడు నన్ను జాయిన్ చేసుకునేందుకు ఒప్పకోలేదు. దీంతో నేను ఇప్పటికీ ఆపరేషన్ చేయించుకోలేకపోయాను. ప్రైవేటు వైద్యుడు చేసేది ఈ డాక్టరు ఎందుకు చేయలేరు.– పల్లి పాప, సిద్ధాంతం -
నిశిరాత్రిలో పెను విషాదం
పశ్చిమగోదావరి: తణుకు మండలం తేతలి సమీపంలో 16వ నంబర్ జాతీయ రహదారిపై ఆదివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృత్యువాతపడగా నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండగా మరో ఐదుగురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఉంగుటూరు నుంచి విజయనగరం జిల్లా బొబ్బిలిలోని చెరువుల్లో చేపలను పట్టేందుకు 11 మంది కూలీలు, డ్రైవర్‌తో కలిసి లారీలో వెళుతుండగా ముందుగా వెళుతున్న కాంక్రీటు మిక్సర్ ట్యాంకర్‌ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతులు, క్షతగాత్రులు ఉంగుటూరు మండలానికి చెందిన వారు కావడంతో ఆ ప్రాంతంలో విషాదచాయలు అలుముకున్నాయి. -
మరోసారి సీబీఐ
తణుకు: ఉత్తరప్రదేశ్ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ (వెస్ట్ మీరట్)గా పనిచేసిన ఐఎఫ్ఎస్ మాజీ అధికారి ముత్యాల రాంప్రసాద్‌రావు వ్యవహారంలో సీబీఐ మరోసారి సోదాలు చేపట్టింది. ఈ వ్యవహారంలో వారం రోజులుగా తణుకు పరిసర ప్రాంతాల్లో ఆయనకు సంబంధించిన బినామీలు, ఆస్తులు విక్రయించిన వారిపై దృష్టి సారించి వారిని విచారిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. తణుకుకు చెందిన ఐఎఫ్ఎస్ మాజీ అధికారి ముత్యాల రాంప్రసాదరావు ఇంటిలో గతేడాది అక్టోబరులో సోదాలు నిర్వహించిన సీబీఐ అధికారులు ఆయనతోపాటు ఆయన భార్య ఆకుల కనకదుర్గపైనా కేసులు నమోదు చేశారు. అనంతరం ఈ ఏడాది మార్చిలో తణుకుకు చెందిన పలువురు రియల్ ఎస్టేట్ వ్యాపారులతోపాటు బినామీలు, ఆస్తులు విక్రయించిన వారికి నోటీసులు జారీ చేసి వారినీ విశాఖలోని సీబీఐ కార్యాలయంలో విచారించారు. చాలాకాలం తర్వాత మరోసారి సీబీఐ అధికారులు ఇటుగా దృష్టి సా రించారు. తాజాగా రాంప్రసాదరావు నివాసముంటున్న రెండు ఇళ్లతోపాటు బినామీలుగా వ్యవహరించిన పలువురి నివాసాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. అక్రమాస్తుల వ్యవహారంలో ఆస్తులు విక్రయించిన వారితోపాటు సాక్షులుగా వ్యవహరించిన, బినామీలుగా ఉన్న వ్య క్తులకు సైతం ఇటీవల నోటీసులు జారీ చేసిన అధికారులు మరోసారి తనిఖీలు చేపట్టారు. వారం రోజులుగా చేస్తున్న సోదాల్లో కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. గతేడాది కేసు నమోదు కేంద్ర అటవీశాఖ అభివృద్ధి సంస్థ జనరల్ మేనేజర్, ఉత్తరప్రదేశ్ క్యాడర్ ఐఎ ఫ్ఎస్ అధికారిగా ముత్యాల రాంప్రసాదరావు పనిచేస్తున్న సమయంలోనే సీబీఐ అధికారులు తణుకులోని ఆయన నివా సంపై దాడి చేసి గతేడాది అక్టోబర్ 11న కేసు నమోదు చేశారు. ఆయన గతంలో ఎన్టీపీసీలో చీఫ్ విజిలెన్స్ అధికారిగా పనిచేసిన సమయంలో ఆదాయానికి మించి అక్రమ ఆస్తులు కూడబెట్టినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తణుకు, విశాఖ, న్యూఢిల్లీ, మీరట్‌లో ఏ కకాలంలో దాడులు చేశారు. సుమారు రూ.10.72 కోట్ల విలువైన చర, స్థిరాస్తి డాక్యుమెంట్లతోపాటు రూ. 37.25 లక్షల నగదు, బంగారం, వెండి ఆభరణాలను అప్పట్లో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి మార్కెట్ విలువ సుమారు రూ.150 కోట్లు ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేశారు. రాంప్రసాదరావు భార్య ఆకుల కనకదుర్గ తణుకు పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఆస్తులు కూడబెట్టినట్టు వచ్చిన సమాచారంతో రాంప్రసాదరావు, కనకదుర్గపై అధికారులు కేసు నమోదు చేశారు. అప్పట్లో ప్రధాని పేషీకు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా దాడులు చేశారు. కనకదుర్గ భారీస్థాయిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఆమెకు బినామీలుగా ఉన్న రియల్ఎస్టేట్ వ్యాపారులపైనా దృష్టి సారిం చిన అధికారులు మరోసారి సోదాలు ని ర్వహిస్తుండటం చర్చనీయాంశంగా మా రింది. అధికారులు రాజమండ్రి సీబీఐ కార్యాలయంలో వీరిని విచారిస్తున్నట్టు తెలుస్తోంది. తణుకు రాష్ట్రపతి రోడ్డులో రాంప్రసాదరావు నివాసముంటున్న అ పార్ట్మెంట్లోని అన్ని ఫ్లాట్లలో సోదాలు జరిపినట్టు తెలిసింది. -
తణుకులో దారుణం
తణుకు: పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం దువ్వ గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. కన్నకుమారుడే తండ్రి పాలిట కాలయముడయ్యాడు. మద్యం మత్తులో ఉన్న తండ్రి నూతంగి సూరయ్య(45)ను కుమారుడు నూతంగి వెంకటేశ్ కొట్టి చంపాడు. కర్రతో తలపై బలంగా కొట్టడంతో సూరయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. నిత్యం తాగి వచ్చి తన తల్లిని కొడుతున్నాడని, ఆవేశంలో తండ్రిని హతమార్చానని పోలీసుల ఎదుట ఒప్పుకున్నాడు. నిందితుడు నూతంగి వెంకటేశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బలవంతంగా డ్వాక్రా మహిళల తరలింపు
తణుకు : ధర్మపోరాట దీక్ష పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో శనివారం తాడేపల్లిగూడెంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ అన్ని వర్గాలను ఇబ్బందులపాల్జేసింది. జిల్లా వ్యాప్తంగా డ్వాక్రా మహిళలను భారీగా తరలించాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. అందుకు అనుగుణంగానే డ్వాక్రా మహిళలను నయానో భయానో బెదిరించి ఆర్టీసీ, స్కూల్ బస్సులు ఏర్పాటు చేసి బలవంతంగా వారిని సభాస్థలికి తరలించారు. అయితే చాలామంది మహిళలు సభాస్థలికి వెళ్లకుండానే బస్సుల్లోనే సేదతీరారు. మండుటెండలో ఇదేం ఖర్మరాబాబూ అనుకుంటూ తిరిగి ఇంటిముఖం పట్టారు. డ్వాక్రా సంఘాల్లోని మహిళలను భారీఎత్తున తరలించాలని అధికారులు మొదట్నుంచీ ప్రణాళికలు తయారు చేశారు. ఆయా గ్రామాలు, వార్డుల్లోని మహిళలను సంఘాలు వారీగా సమన్వయం చేసి వారికి మధ్యాహ్నం భోజన ఏర్పాట్లు చేశారు. వీరిని ప్రభుత్వం ఏర్పాటు చేసిన బస్సుల్లో తాడేపల్లిగూడెంలోని సభాస్థలికి తరలించారు. తిరుగు ప్రయాణం నరకం ధర్మపోరాట దీక్షలో చంద్రబాబు మాట్లాడుతుండగానే మహిళలు బయటకు వచ్చి వారిని తీసుకువచ్చిన బస్సులను వెతుక్కునే పనిలో పడ్డారు. తణుకువైపు నుంచి వెళ్లిన బస్సులను ప్రత్తిపాడు జంక్షన్ వద్ద నిలిపివేశారు. అయితే అక్కడి నుంచి హైవే వెంబడి అలంపురం వరకు బస్సులను నిలిపివేయడంతో వారిని తీసుకువచ్చిన బస్సులు ఎక్కడ ఉన్నాయో తెలియక మహిళలు దిక్కుతోచని స్థితిలో నడిరోడ్డుపై పడిగాపులు పడ్డారు. సభాస్థలి నుంచి కిలోమీటర్లు మేర నడిచిన మహిళలు తమ వాహనాలు వెతుక్కునేందుకు అవస్థలు పడ్డారు. అయితే కొన్ని వాహనాలు కనిపించకపోవడంతో కార్యకర్తలు, మహిళలు చీకట్లోనే నడుచుకుంటూ గమ్యస్థానాలకు బయల్దేరారు. మరోవైపు సాధారణ ప్రయాణికులు సైతం తీవ్ర అవస్థలు పడ్డారు. మహిళలు, కార్యకర్తలను తరలించేందుకు వచ్చిన బస్సులు ఎక్కడికక్కడే నిలిపివేయడంతో హైవేపై ట్రాఫిక్ భారీగా స్తంభించిపోయింది. ప్రత్తిపాడు నుంచి తణుకు మండలం దువ్వ గ్రామం వరకు ట్రాఫిక్ నిలిచిపోవడంతో లారీలు, ఆర్టీసీ బస్సులు, కారులు పెద్ద ఎత్తున నిలిచిపోయాయి. బస్సుల్లోని చిన్నారులు, వృద్ధులు, గర్భిణులు తీవ్ర అవస్థలు పడ్డారు. తాడేపల్లిగూడెం నుంచి తణుకు రావడానికి గంటన్నర సమయం పట్టడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. -
సదా మీ సేవలో
తణుకు: తపాలా కార్యాలయాలు.. ఒకప్పుడు సమాచార వ్యవస్థలో కీలకం. కొరియర్లు, మొబైల్ వ్యవస్థ అందుబాటులోకి రావడంతో తపాలాశాఖ వెనుకబడింది. ప్రస్తుత పోటీ ప్రపంచంలో పరుగెత్తలేక చేతులెత్తేయడంతో తపాలాశాఖ పేరు మర్చిపోయే పరిస్థితికి వచ్చింది. తమ మనుగడ కాపాడుకునేందుకు తంటాలు పడుతోంది. ఈ పరిస్థితుల్లో బ్యాంకులతో పోటీ పడేందుకు సిద్ధమైంది. బ్యాంకులకు సవాలు విసిరేలా తపాలాశాఖ అడుగులు వేస్తోంది. ఇప్పటికే బ్యాంకుల తరహాలో ఏటీఎం కార్డులు, నగదు జమ, డిపాజిట్ వంటి సేవలను అందిస్తుండగా తాజాగా మరో అడుగు ముందుకు వేసి బ్యాంకుల మాదిరిగా తమ ఖాతాదారులను సైతం అన్నిరకాల చెల్లింపులు చేసుకునేలా కొత్త తరహా సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు (ఐపీపీబీ) ద్వారా జీరో ఎక్కౌంట్లను తెరవడమే కాకుండా అన్నిరకాల చెల్లింపులు, ఇతర సేవలకు నామమాత్రపు రుసుములతో అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ నెల 1న దేశవ్యాప్తంగా ప్రారంభించిన ఈ విధానంలో తొలుత జిల్లాలోని ఏలూరు, భీమవరం డివిజన్లలో ఈ సేవలను ప్రారంభించారు. సేవలు విస్తృతం బ్యాంకు వ్యక్తిగత ఖాతాలో నగదు తీయాలన్నా, వేయాలన్నా ఆ వివరాలు రాసిన ఓచర్ బ్యాంకులో అందజేయడం తప్పనిసరి. దీంతో ఆ అవసరం లేని సేవలు తపాలాశాఖ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఐపీపీబీ పేరుతో సెప్టెంబరు 1 నుంచి అందుబాటులోకి వచ్చిన ఈ సేవల ముఖ్య ఉద్దేశం వృద్ధులు, విద్యార్థులు, గృహిణులు, పట్టణాలకు వచ్చే వలసదారులు, రైతులు, వివిధ పథకాల లబ్ధిదారులు, చిన్న వ్యాపారులకు ప్రయోజనం చేకూర్చడమేనని తపాలాశాఖ అధికారులు చెబుతున్నారు. కేవలం ఆధార్‌కార్డు ఆధారంగా పొదుపు ఖాతాను జీరో బ్యాలెన్స్‌తో తెరుచుకునే వెసులుబాటు కల్పించారు. వ్యాపారులు, సంస్థలకు అవసరమైన కరెంట్ ఖాతాలను సైతం పొందవచ్చు. అన్నిరకాల చెల్లింపులు, నగదు బదిలీలు, అన్నిరకాల బిల్లులు, వినియోగ ఛార్జీలు, వ్యాపార లావాదేవీలు చేసుకునే వెసులుబాటు ఉంది. ఇదే సందర్భంలో ఖాతాలో రూ. లక్షకు మించి నిల్వ ఉండటానికి వీలుండదు. లావాదేవీల చెల్లింపులకు పొదుపు ఖాతాదారుల నుంచి ఎలాంటి రుసుం వసూలు చేయరు. బ్యాంకులకు రాలేని స్థితిలో ఉన్నప్పటికీ, తీరిక లేకున్నా ఖాతాదారుని ఇంటివద్దకు వచ్చి మరీ సేవలు అందించడం విశేషం. ఇలాంటి సందర్భాల్లో మాత్రం పరిమితంగానే ఛార్జీలు వసూలు చేస్తారు. తాపాలా బ్యాంకులకు రాలేని వారు మొబైల్ నుంచి మెసేజ్ పంపినా, మిస్డ్ కాల్ చేసినా రూ.10 వేలకు మించని లావాదేవీలు నేరుగా ఇంటికే వెళ్లి అందజేస్తారు. ఇందుకు సంబంధించి ప్రతి ఖాతాదారుడికి ఒక క్యూఆర్ (క్విక్ రెస్పాన్స్ కోడ్) ఉన్న డెబిట్ కార్డును అందజేస్తారు. దీని ద్వారా ప్రస్తుతం మార్కెట్లో వినియోగంలో ఉన్న పేటీఎం మాదిరిగా విద్యుత్ బిల్లులు, పెట్రోలు కొనుగోళ్లు, దుకాణాలు, షాపింగ్ మాల్స్‌లో చెల్లింపులు చేసేందుకు అవకాశం ఉంటుంది. మొబైల్ నెట్ బ్యాంకింగ్ సదుపాయాన్ని సైతం వినియోగించుకునే వెసులుబాటు ఉంది. బయోమెట్రిక్‌తోనే.. సాధారణంగా బ్యాంకు ఖాతాలను ప్రారంభించాలంటే నాలుగైదు ఫొటోలు, అన్ని ఆధారాలు ఇవాల్సి ఉంటుంది. దరఖాస్తు పత్రాలను నింపడం పెద్ద ప్రక్రియ. ఎంతో సమయం ఇందుకు వెచ్చించాలి. బ్యాంకర్లకు ఏమైనా సందేహాలు వస్తే ఇక అంతే. అయితే ఐపీపీబీలో మాత్రం దరఖాస్తుదారుడి వద్ద ఆధార్‌కార్డు ఉంటే చాలు. దాని ఆధారంగా వివరాలను నమోదు చేసుకుని బయోమెట్రిక్ తీసుకుంటారు. ఆ వెంటనే ఖాతాను ప్రారంభిస్తారు. ఆ సమయంలో క్యూఆర్ కోడ్‌తో కూడిన కార్డును అందజేస్తారు. ఎలాంటి పత్రాలను నింపాల్సిన అవసరం లేకుండానే వేలిముద్ర ద్వారా ఖాతాను నిర్వహించుకోవచ్చు. ఇది నిరక్ష్యరాస్యులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో తపాలా సేవలు అందించే తపాలా కార్యాలయాలు, పోస్ట్‌మేన్‌లే బ్యాంకింగ్ సేవలను అందించే వనరులగా మారనున్నారు. ఇప్పటికే తపాలా కార్యాలయాల్లో పనిచేసే వారికే శిక్షణ ఇచ్చి సేవలకు వినియోగించుకుంటున్నారు. ఐపీపీబీ సేవలను తొలుత జిల్లాలో ఏలూరు, భీమవరం డివిజన్లో ప్రారంభించగా దశలవారీగా జిల్లావ్యాప్తంగా అన్ని కేంద్రాల్లో విస్తరిస్తారు. ఖాతాదారుల ప్రయోజనాల కోసమే ఏర్పాటు ఖాతాదారుల ప్రయోజనాలే లక్ష్యంగా సేవలు అందించాలనే ఉద్దేశంతో ఐపీపీబీ అందుబాటులోకి తీసుకువచ్చింది. పూర్తిస్థాయిలో విజయవంతం చేయడానికి కృషి చేస్తున్నాం. – రమణయ్య, ఎస్ఎస్, తపాలాశాఖ, భీమవరం డివిజన్ -
ఆదాయార్జనే లక్ష్యంగా ఆపరేషన్లు
అమ్మ అనే పదం అద్భుతం.. అమ్మ అనిపించుకోవడమే స్త్రీ జీవితానికి సార్థకం.. నవమోసాలు మోసి పురిటినొప్పులు భరించి శిశువును ఈ ప్రపంచానికి పరిచయం చేసే క్షణాలు ఆమెకు జన్మాంతం గుర్తుండే మధుర స్మృతులు.. ఇంతటి మహత్తర ఘట్టం కాసుల కోసం కర్కశానికి గురవుతోంది.. అమ్మా.. అనిపించుకోవడం కోసం కడుపు ‘కోత’లు మిగులుస్తోంది.. ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు ఆదాయ ఆర్జనే లక్ష్యంగా ఇష్టారాజ్యంగా సిజేరియన్లు చేసేస్తున్నారు. తణుకు : పురిటినొప్పులతో ఆస్పత్రులకు వెళ్లే గర్భిణులకు కడుపు‘కోత’ తప్పడం లేదు. ముఖ్యంగా ప్రైవేట్ ఆస్పత్రుల్లో పలురకాలుగా మభ్యపెట్టి.. వారిచేత ఒప్పించి.. తర్వాత వేలకు వేలు గుంజు తున్నారు. ఈ వ్యాపారం జిల్లాలో యథేచ్ఛగా సాగుతోంది. అత్యధిక ఆస్పత్రులు సిజేరియన్ల ఆదాయంతోనే వృద్ధి చెందుతున్నాయన్న ప్రచారం ఉంది. కాస్తంత ప్రయత్నిస్తే సాధారణ ప్రసవాలకు అవకాశం ఉన్నా బిల్లుల కోసం సిజేరియన్లు వైపు వైద్యులు మొగ్గు చూపుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రతి వంద ప్రసవాల్లో సిజేరియన్లు (ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీయడం) 10 నుంచి 15 శాతం మించకూడదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) చెబు తోంది. అయితే జిల్లాలోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో మాత్రం 70 శాతం దాటుతోంది. మరోవైపు ప్రభుత్వ ఆస్పత్రుల్లో సైతం సిజేరియన్లు 50 శాతానికి చేరువ కావడం ఆందోళన కలిగిస్తోంది. ఇలా చేయడం వల్ల తలెత్తుతున్న దుష్ఫలితాలను ఎవరూ గుర్తించడం లేదు. కేవలం కాసుల కోసమే సుఖప్రసవాలు జరిగే కేసుల్లోనూ వైద్యులు సిజేరియన్లు చేస్తున్నారు. ఇందుకు గాను అయినకాడికి దోచుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వచ్చిందే తడవుగా.. ప్రైవేట్ ఆస్పత్రులకు గర్భిణి ప్రసవానికి వచ్చిందే తడవుగా కనీసం గంట కూడా నిరీక్షించకుండా సిజేరియన్ చేసేస్తున్నారు. కడుపులో బిడ్డ ఉమ్మనీరు తాగిందని అత్యవసరంగా ఆపరేషన్ చేయాలని, లేదంటే తల్లీబిడ్డకు ప్రమాదమని చెప్పి గర్భిణుల బంధువులను భయపెట్టేస్తున్నారు. వైద్యులు చెప్పినట్టు చేయకపోతే తల్లీబిడ్డకు ఏమవుతుందోనని భయంతో వారు చెప్పినట్టు తలాడిస్తూ చేతి చము రు వదిలించుకుంటున్నారు తల్లిదండ్రులు. కొన్ని ప్రైవేట్ ఆస్పత్రుల్లో వైద్యులు ఒకడుగు ముందుకు వేసి ముహూర్తం పేరుతో గర్భిణులు కోరుకున్న తేదీకి సిజేరియన్ చేస్తున్నారు. ఇలా గర్భిణుల బం ధువుల నమ్మకాన్ని సొమ్ము చేసుకుంటున్నారు. సా ధారణ ప్రసవానికి రూ.10 వేల నుంచి రూ.15 వేలు వసూలు చేస్తుండగా సిజేరియన్‌కు రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఈనేపథ్యంలో సిజేరియన్లపై జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ దృష్టి సారించింది. సిజేరియన్లు తగ్గించాలని నర్సింగ్ హోమ్‌లు, ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులకు ఆదేశాలు జారీ చేసింది. తాజాగా కొన్ని ఆస్పత్రులకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్టు అధికారులు చెబుతున్నారు. దుష్ఫలితాలు.. కోకొల్లలు సాధారణ ప్రసవమైనప్పుడు ఆ తల్లి మాతృత్వ అనుభూతి పొందగలుగుతుంది. ఆ అనుభూతి విలువ కట్టలేనంత గొప్పది. శస్త్రచికిత్స సమయంలో మత్తు ఇవ్వడం, ఇతరత్రా మందుల వల్ల కాన్పు అనంతరం దుష్పరిణామాలు తలెత్తే ప్రమాదం ఉంది. ఒకసారి సిజేరియన్ చేస్తే రెండో కాన్పు కూడా సిజేరియన్ తప్పనిసరిగా చేయాల్సిందే. సిజేరియన్ చేయడం వల్ల మహిళలు నడుం నొప్పి, కాళ్ల నొప్పులు వంటి సమస్యలు ఎదుర్కోవాల్సి ఉం టుందని నిపుణులు చెబుతున్నారు. సాధారణ ప్రసవానికి రక్తస్రావం తక్కువగా ఉండగా సిజేరియన్‌కు ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల మహిళలు రక్తహీనతకు లోనయ్యే ప్రమాదం ఉంది. సిజేరియన్ కారణంగా బిడ్డకు ఉబకాయం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 20 శాతం కేసుల్లో బిడ్డకు మధుమేహం వచ్చే అవకాశాలు ఎక్కువగాను, రోగ నిరోధిక శక్తి తక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు జిల్లాలో సాధారణ ప్రసవాల కంటే సిజేరియన్లు ఎక్కువగా చేస్తున్నారనే ఫిర్యాదులు ఉన్నాయి. నిబంధనలు ప్రకారం కేవలం సాధారణ ప్రసవాలకే ప్రయత్నించాలి. అయితే జిల్లాలోని ఎ క్కువ శాతం వైద్యులు సిజేరియన్లకు ప్రాధాన్యమిస్తున్నారు. ఇలా చేస్తే సంబంధిత ఆస్పత్రులపై చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే కొన్ని ఆస్పత్రులకు షోకాజ్ నోటీసులు జారీ చేశాం. – వి.సుబ్రహ్మణ్యేశ్వరి, డీఎంహెచ్ఓ, ఏలూరు -
వెంకట్రాయ చిట్‌ఫండ్ మోసం; చంద్రబాబు కుట్ర
సాక్షి, హైదరాబాద్: ప్రజల్ని నిలువునా ముంచేసిన వెంకట్రాయ చిట్‌ఫండ్ మోసం వ్యవహారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రభుత్వ యంత్రాంగం దొడ్డిదారి వ్యవహారాలకు తెరలేపిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ ఆరోపిచారు. మోసం చేసిన సంస్థకు సంబంధించిన ఆస్తుల వేలాన్ని కుట్రపూరితంగా అడ్డుకుంటున్నారని, తద్వారా టీడీపీ నాయకుల అక్రమాలకు ముఖ్యమంత్రి వెన్నుదన్నుగా నిలుస్తున్నారని మండిపడ్డారు. సోమవారం హైదరాబాద్‌లోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. బాధితులకు ప్రభుత్వమే డిపాజిట్లు ఇస్తుందా?: ‘‘అగ్రిగోల్డ్ కుంభకోణం కేసులో ఆ సంస్థ ఆస్తులను అమ్మేసి, తద్వారా వచ్చిన డబ్బును బాధితులకు ఇస్తున్నారు. మరి వెంకట్రాయ చిట్‌ఫండ్ కేసులో మాత్రం ఎందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు? డీజీపీ ఉత్తర్వుల ద్వారా వెంకట్రాయ ఆస్తుల వేలాన్ని ప్రభుత్వం ఎందుకు నిలుపుదల చేయించింది? వెంకట్రాయ సంస్థ టీడీపీ నాయకులకు చెందిందనే కదా! ఖాతాదారుల ఫిర్యాదు మేరకు అప్పటి ప్రభుత్వం వెంకట్రాయ చిట్‌ఫండ్ కుంభకోణంపై కమిటీ వేసింది.. దొడ్డి దారిన తన ఆస్తుల్ని అమ్ముకుంటున్నట్లు గుర్తించిన వెంటనే సంస్థ ఆస్తుల్ని స్వాధీనం చేసుకుంది. కానీ ఇప్పుడు.. ఆ ఆస్తుల వేలానికి టీడీపీ ప్రభుత్వం అడ్డుపడుతోంది. ఇలా చేస్తే ఖాతాదారులకు డిపాజిట్లను ఎవరు చెల్లించాలి, ప్రభుత్వమే చెల్లిస్తుందా, జనం గోస మీకు పట్టదా?’’ అని బొత్స నిలదీశారు. వెంకట్రాయ, అగ్రిగోల్డ్ బాధితులకు వైఎస్సార్సీపీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. తోడుదొంగలు టీడీపీ-బీజేపీ ఇంకా కలిసే ఉన్నారు: బీజేపీతో తెగదెంపులు చేసుకున్నామని టీడీపీ పైకి చెబుతున్నా వారింకా కలిసే ఉన్నారనడానికి బోలెడు ఉదాహరణలున్నాయని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. ‘‘కర్ణాటక ఎన్నికలు అయిపోగానే చంద్రబాబుపై బీజేపీ కేసులు పెడుతుందని, ప్రజలంతా అండగా ఉండాలని టీడీపీ ప్రచారం చేసుకుంది. కర్ణాటక ఎన్నికలు ముగిసి 40 రోజులు కావొస్తోంది. మరి ఆ కేసులేమైనట్లు? ఇది ఆ రెండు పార్టీల కుమ్మక్కు రాజకీయానికి నిదర్శనం కాదా? ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో ప్రధాని మోదీకి సీఎం చంద్రబాబు వంగివంగి దండాలు పెట్టి దాదాపు 10రోజులైంది. దానిపై వివరణలేకపోగా, కేంద్రానికి లేఖలంటూ చంద్రబాబు కొత్త నాటకాలు మొదలుపెట్టారు. పదవీకాలం వారంలో ముగుస్తుందనగా కేంద్ర మంత్రి భర్త.. ఏపీ ప్రభుత్వ సలహాదారు పదవికి రాజీనామా చేశారు, మరి టీటీడీ పాలక మండలి సభ్యురాలిగా ఉన్న మహారాష్ట్ర బీజేపీ మంత్రి భార్య రాజీనామా చేయకపోవడానికి గల కారణాలేమిటి? టీడీపీ సర్కార్ అసమర్థత, కమిషన్ల కక్కుర్తి వల్లే కడప స్టీల్‌ప్లాంట్ ఏర్పాటుకాలేదన్నది పచ్చి వాస్తవం. టీడీపీ-బీజేపీ కుమ్మక్కు రాజకీయాలు రాష్ట్రాన్ని పదేళ్లు వెనక్కి తీసుకెళ్లాయి. వీళ్ల డ్రామాలను ప్రజలకు తెలియజెప్పడానికే ఈ నెల 30న అనంతపూర్‌లో వైఎస్సార్సీపీ దీక్ష చేయబోతున్నాం’’ అని బొత్స వివరించారు. విభజన హామీల అమలు, ప్రత్యేక హోదా సాధన దిశగా ప్రజలను సమాయత్తం చేయడంలో భాగంగా వైఎస్సార్సీపీ అన్ని జిల్లాల్లో దీక్షలు చేస్తున్న సంగతి తెలిసిందే. వెంకట్రాయ బాధితుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం: కారుమూరి వేలమంది డిపాజిటర్లను మోసం చేసిన వెంకట్రాయ చిట్‌ఫండ్ కంపెనీ ఆస్తులను వేలం వేయనీయకుండా ప్రభుత్వం అడ్డుకోవడం దారుణమని తణుకు నియోజకవర్గం వైఎస్సార్సీపీ కోఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో మీడియాతో మాట్లాడిన ఆయన.. చిట్‌ఫండ్ బాధితుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి అవలంభిస్తున్నదని వాపోయారు. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతోనే వెంకట్రాయ ఆస్తుల విక్రయాలను ప్రభుత్వం నిలిపేసిందని.. అగ్రిగోల్డ్ పట్ల ఒక రకంగా, వెంకట్రాయ చిట్ ఫండ్ పట్ల ఇంకో రకంగా వ్యవహరిస్తున్నారని, అనుకూలంగా ఉండే వ్యక్తులను మాత్రమే విచారించి కేసును మూసేయడం కుట్రపూరితంగా జరిగిందేనని ఆరోపించారు. ఈ కుంభకోణంపై తక్షణమే సీబీఐ విచారణ చేసి బాధితులకు న్యాయం చేయాలని కారుమూరి డిమాండ్ చేశారు. బాధితుల పక్షాన వైఎస్సార్సీపీ నిరంతరాయంగా పోరాడుతుందని తెలిపారు. -
182వ రోజు ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర
-
భారీ వర్షంలోనే వైఎస్ జగన్ పాదయాత్ర ప్రారంభం
సాక్షి, తణుకు (పశ్చిమ గోదావరి) : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర పశ్చిమగోదావరి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. వైఎస్ జగన్ బుధవారం ఉదయం తణుకు శివారు నుంచి 182వ రోజు పాదయాత్రను ప్రారంభించారు. ఈ ఉదయం నుంచి తణుకులో భారీ వర్షం కురుస్తోంది. ఎంతకీ తగ్గకపోవడంతో భారీ వర్షంలోనే వైఎస్ జగన్ పాదయాత్రకు బయలుదేరారు. ఆయన వెంట నడిచేందుకు వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ప్రజాసమస్యలు తెలుసుకుంటూ జననేత ముందుకు సాగుతున్నారు. తణుకు శివారు నుంచి పాదయాత్ర నిడదవోలు నియోజకవర్గంలోకి ప్రవేశిస్తుంది. ఉండ్రాజవరం మండలం పాలంగి, ఉండ్రాజవరం మీదుగా చిలకపాడు క్రాస్ రోడ్డు చేరుకున్న తర్వాత వైఎస్ జగన్ భోజన విరామం తీసుకుంటారు. తర్వాత మోర్తా, దమ్మెన్ను మీదుగా నడిపల్లి కోట చేరుకున్న తర్వాత ఈరోజు పాదయాత్ర ముగుస్తోంది. జననేత రాత్రికి అక్కడే బస చేస్తారు. -
`అవునండీ బాబుగారికి దైర్యం ఎక్కువ' జగన్ చెప్పిన కథ
-
19 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితుల ఘోష పట్టదా?
-
వైఎస్ జగన్‌ను కలిసిన ఆటో డ్రైవర్లు
-
వైఎస్ జగన్ పాదయాత్ర చరిత్రాత్మకం
-
ప్రజాసంకల్పయాత్ర చరిత్రాత్మకం : మంచు విష్ణు
సాక్షి, పశ్చిమ గోదావరి : ఆంధ్రప్రదేశ్ ప్రజల సమస్య తెలుసుకునేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర చరిత్రాత్మకమని హీరో మంచు విష్ణు వర్ధన్ అభిప్రాయపడ్డారు. పాదయాత్ర చేసిన ఎవరూ ఇప్పటివరకూ అపజయం పాలుకాలేదని, రాజుల కాలం నాటి నుంచి ఇదే రివాజుగా వస్తోందన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా పాదయాత్ర చేసిన తర్వాత విజయం సాధించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. వీటన్నింటిని పక్కనబెడితే రోజుకు ఐదు కిలోమీటర్లు పరిగెత్తడానికి తాను చాలా ఆయాస పడతానని, అలాంటిది 2 వేల కిలోమీటర్ల పాటు పాదయాత్ర చేయడం మామూలు విషయం కాదన్నారు. శుక్రవారం తణుకులోని స్ప్రింగ్ బోర్డు పాఠశాలలో మంచు విష్ణు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఏపీలో ప్రస్తుత విద్యావ్యవస్థలో మార్పులు రావాల్సివుందని, విద్యార్థికి ర్యాంకులు, మార్కులే ప్రామాణికం కాదని అభిప్రాయపడ్డారు. విద్యార్థి దశ నుంచి పిల్లలకు విలువలు నేర్పడం వల్ల వారు భవిష్యత్‌లో ఉన్నత శిఖరాలను చేరుకోగలుగుతారని చెప్పారు. కాగా, మంచు విష్ణు తర్వాతి చిత్రం ‘ఓటర్’ఆంధ్రప్రదేశ్‌లోని ప్రస్తుత రాజకీయాలను ప్రతిబింబించేలా తెరకెక్కనుంది. -
పాముకు అరుదైన శస్త్ర చికిత్స
తణుకు టౌన్: ఆధునిక సాంకేతిక యుగంలో విష సర్పాలకు కూడా మెరుగైన వైద్య విధానం అందుబాటులోకి వచ్చింది. తణుకులో రాష్ట్ర పశు వైద్యశాలలో శనివారం సాయంత్రం నాగు పాముకు అరుదైన శస్త్ర చికిత్స చేశారు. ఆసుపత్రి అసిస్టెంట్ పశు శస్త్ర చికిత్సా నిపుణుడు డాక్టర్ ఆర్.శ్రీధర్ సమాచారం ప్రకారం.. తాడేపల్లిగూడెం మండలం కృష్ణాయపాలెంలో గత నాలుగు రోజులుగా తెల్ల తాచు పాము కదల్లేని పడి స్థితిలో వుండగా గ్రామానికి చెందిన రైతులు జంగారెడ్డిగూడెం స్నేక్ సేవియర్ సంస్థకు సమాచారం అందించారు. దీనితో జంగారెడ్డిగూడెం ప్రాంతానికి చెందిన స్నేక్ సేవియర్ చదలవాడ క్రాంతి కృష్ణాయపాలెం పొలంలో కదల్లేని స్థితిలో వున్న తెల్ల తాచు పామును శనివారం మధ్యాహ్నం తణుకు పాలి క్లీనిక్‌కు తరలించారు. అక్కడ వైద్యుల సూచన మేరకు పాముకు ఎక్స్ రే తీయించగా పాము మెడ భాగంలో బలమైన పశువు తొక్కడంతో పాము మెడ భాగంలో ఎముక విరిగిపోయిందని, దీంతో పాము ఆహారం తీసుకోకపోవడంతో చలనం లేకుండా పడి వుందని వైద్యులు తెలిపారు. అనంతరం వైద్యుల పర్యవేక్షణలో పాముకు ఆహారం అందించి, మెడ చుట్టూ స్లి్పంకర్లు వేసి చికిత్స చేసినట్లు వారు తెలిపారు. ప్రస్తుతం పాముకు వారం రోజుల సరిపడా ఆహారం అందించామని డాక్టర్ శ్రీధర్ తెలిపారు. తమ సంస్థ ఆధ్వర్యంలో ఇప్పటి వరకూ 10,880 ఆపదలో వున్న పాములను రక్షించి అటవీ ప్రాంతంలో వదిలినట్లు క్రాంతి తెలిపారు. -
ప్రియుడి ఇంటి ముందు యువతి బైఠాయింపు
తణుకు: ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేసి తనను శారీరకంగా అనుభవించి ముఖం చాటేస్తున్నాడని ఆరోపిస్తూ యువతి తన ప్రియుడి ఇంటి ముందు బైఠాయించింది. తణుకు మండలం దువ్వ గ్రామానికి చెందిన జవ్వాది మాధురినాగనవ్య అనే యువతి అదే గ్రామానికి చెందిన లంకదాసు శివగణేష్ ఏడాదిగా ప్రేమించుకుంటున్నారు. తణుకులోని ఒక సెల్ దుకాణంలో వీరిద్దరూ పనిచేస్తుండగా వీరి మధ్య ప్రేమ చిగురించింది. అయితే పెళ్లి చేసుకోవడానికి నిరాకరిస్తున్నాడనే నెపంతో ఫిబ్రవరిలో శివగణేష్‌పై తణుకు రూరల్ పోలీసుస్టేషన్లో ఆమె ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు గణేష్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇటీవల బెయిల్‌పై వచ్చిన గణేష్ కేసు వాపసు తీసుకోకపోతే చంపేస్తానని బెదిరిస్తున్నాడంటూ యువతి ఆరోపిస్తోంది. శీతలపానీయాల్లో మత్తుమందు కలిపి తనను శారీరకంగా అనుభవించాడని ఆమె ఆరోపణలు చేస్తోంది. గణేష్ తండ్రి బాబూరావు సైతం పెళ్లి చేస్తానని మాట ఇచ్చి ఇప్పుడు మాటతప్పారని చెబుతోంది. మరోవైపు గ్రామానికి చెందిన ఓ టీడీపీ నాయకుడు సైతం తనకు ఫోన్ చేసి చంపేస్తానని బెదిరిస్తున్నాడని బాధితురాలు కన్నీటి పర్యంతమవుతోంది. తనకు ప్రాణహాని ఉందని తనకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తానని ఆమె స్పష్టం చేస్తోంది. తణుకు సర్కిల్ ఇన్స్పెక్టర్ కేఏ స్వామి, రూరల్ ఎస్సై సీహెచ్‌వీ రమేష్‌లు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితురాలి నుంచి వివరాలు సేకరించారు. గణేష్ కుటుంబసభ్యులు అందుబాటులో లేరు. -
కొబ్బరిమట్టతో కొట్టి చంపేశారు!
సాక్షి, తణుకు: బైక్ దొంగలించాడనే నెపంతో ఓ యువకుడిని ఆరుగురు యువకులు కొబ్బరిమట్టలతో చితకబాది హతమార్చారు. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం వేల్పూరు గ్రామంలో మంగళవారం జరిగింది. వేల్పూరు గ్రామానికి చెందిన పుట్టా అభిలాష్ (20) తల్లిదండ్రులు మృతి చెందడంతో తన సోదరుడు చందుతో కలిసి అమ్మమ్మ జాస్తి నాగమణి వద్దనే ఉంటున్నాడు. నాగమణి గ్రామంలోనే కూలిపనులు చేసుకుంటూ జీవిస్తుండగా అభిలాష్, చందులు ఆమెకు చేదోడువాదోడుగా ఉంటున్నారు. సోమవారం రాత్రి గ్రామంలోని జాతర సందర్భంగా ఆలస్యంగా వచ్చిన అభిలాష్ భోజనం చేసి పడుకున్నాడు. తిరిగి మంగళవారం ఉదయం బయటకు వెళ్లిపోయాడు. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో మృతుడి సోదురుడు చందుకు గ్రామానికి చెందిన ఒక వ్యక్తి ఫోన్ చేసి మీ తమ్ముడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడని చెప్పడంతో హుటాహుటిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి చేరుకున్నారు. అభిలాష్‌ను అదే గ్రామానికి చెందిన ఆరుగురు యువకులు తీసుకెళ్లి చితకబాదడంతోనే మృతి చెందాడని తెలుసుకున్న వారు పోలీసులకు సమాచారం అందించారు. కొబ్బరి మట్టలతో చితకబాది... గ్రామానికి చెందిన పుట్టా అభిలాష్ ఏ బాధ్యత లేకుండా తిరుగుతుంటాడు. ఈ క్రమంలో చిన్నచిన్న చోరీలు చేస్తుంటాడని పోలీసులు చెబుతున్నారు. గత నెల 10న గ్రామానికి చెందిన నూనె సురేష్ బైక్‌ను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. తన బైక్‌ను అభిలాష్ చోరీ చేశాడని భావించిన సురేష్ గ్రామానికి చెందిన నూనె నరేష్, పారిచర్ల సాయికృష్ణ, గుణ్ణం సతీష్, లక్కోజు సాయిధన చంద్రశేఖర్, బోడపాటి మనోజ్‌కుమార్ అనే డిమ్ములుతో కలిసి అభిలాష్‌ను మంగళవారం గ్రామశివారుకు తీసుకెళ్లారు. వారంతా అభిలాష్‌ను కొబ్బరి మట్టలతో తీవ్రంగా చితకబాదారు. బాధితుడు అపస్మారక స్థితికి చేరడంతో తణుకులోని ఆపిల్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ అతను చికిత్స పొందుతూ అభిలాష్ మృతి చెందడంతో మృతుడి అమ్మమ్మ నాగమణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తణుకు సీఐ కేఏ స్వామి, పట్టణ, రూరల్ ఎస్సైలు డి.ఆదినారాయణ, సీహెచ్‌వీ రమేష్‌లు మృతదేహాన్ని పరిశీలించారు. నాగమణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ ఎస్ఐ సీహెచ్‌వీ రమేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తణుకు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
పోలీసు పేరుతో వరుస చోరీలు
తణుకు : పోలీసు శాఖలో పని చేసిన అనుభవం... హోంగార్డుగా కొన్నేళ్ల పాటు పని చేసిన అతడు వ్యసనాలకు అలవాటు పడ్డాడు... దీంతో ఉద్యోగం నుంచి బయటకు వచ్చి విద్యార్థులు, ఒంటరిగా ఉన్న యువకులను బెదిరించి వారి నుంచి బంగారు ఆభరణాలను అపహరించుకుపోవడమే ప్రవృత్తిగా మరల్చుకున్నాడు. విజయవాడ గాంధీనగర్‌కు చెందిన కాళిదాసు విజయకృష్ణ 2004 వరకు హోంగార్డుగా పని చేసి మానేశాడు. అనంతరం సెక్యూరిటీగా పని చేశాడు. ఆ సమయంలో ఒక యువతిని మోసం చేసి పెళ్లి చేసుకున్న ఘటనలో అతడిపై కిడ్నాప్ కేసు నమోదైంది. ఈ కేసులో జైలుశిక్ష అనుభవించి 2010లో పలు చోరీలకు పాల్పడి మరోసారి జైలుకు వెళ్లాడు. 2016లో జైలు నుంచి బయటకు వచ్చిన అతడు ఏలూరులో మరో మహిళను వివాహం చేసుకుని జీవిస్తున్నాడు. ఈ క్రమంలో కళాశాల విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని వారి నుంచి చాకచక్యంగా బంగారు ఆభరణాలను అపహరించుకుపోతున్నాడు. ఇలా తణుకు, భీమవరం, వీరవాసరం, తాడేపల్లిగూడెం తదితర ప్రాంతాల్లో పలు నేరాలకు పాల్పడిన అతడిని మంగళవారం పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి రూ.2 లక్షలు విలువైన 84 గ్రాముల బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. ఈ మేరకు తణుకు సర్కిల్ ఇన్స్పెక్టర్ కేఏ స్వామి విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. -
గర్భిణుల పోషకాహారానికి ప్రోత్సాహక నగదు
తణుకు అర్బన్ : ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచి, మాతా శిశు సంరక్షణకు పోషకాహారం అందించాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన (పీఎంఎంవీవై) కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం రూపొందిం చింది. ఈ ఏడాది జనవరి ఒకటో తేదీ నుంచి గర్భం దాల్చిన మొదటి కాన్పు గర్భిణులకు మూడు దఫాలుగా రూ.5 వేలు, జననీ సురక్ష యోజన కార్యక్రమంలో భాగంగా రూ.1,000 అందిస్తుంది. ఈ పథకాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు జిల్లావ్యాప్తంగా వైద్యాధికారులు క్షేత్రస్థాయిలో వైద్య సిబ్బందితో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటికే గ్రామాల్లో వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి తెలుపుతున్న ఈ పథకం ఇప్పుడు పట్టణాల్లో కూడా ఊపందుకుంది. అంగన్వాడీల్లో గర్భిణులు, బాలింతలకు అందుతున్న పౌష్టికాహారానికి తోడు గర్భిణి తనకు కావాల్సిన పోషకాలను కొనుగోలు చేసుకునే వీలుగా ప్రభుత్వం ఈ నగదు ప్రోత్సాహకాన్ని అందిస్తుందని వైద్యాధికారులు చెబుతున్నారు. పథకంలో నగదు పంపిణీ ఇలా.. గర్భిణిగా రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత రూ. 1,000 గర్భిణి సొంత బ్యాంకు ఖాతాలో వేస్తారు. ఆరో నెలలో వైద్యాధికారిచే వైద్య పరీక్షలు చేయించుకున్న పిదప బ్యాంకు ఖాతాలో రూ.2 వేలు జమ వేస్తారు. బిడ్డ పుట్టిన తర్వాత మూడో డోసు వ్యాధి నిరోధక టీకాలు వేయించుకున్న తర్వాత రూ.2 వేలు బ్యాంకు ఖాతాలో జమచేస్తారు. అర్హతలివే.. ఈ ఏడాది జనవరి ఒకటో తేదీ తర్వాత గర్భం దాల్చి ఉండి 12 వారాల్లోపు సమీపంలోని ఆరోగ్య కేంద్రాల్లో నమోదు చేయించుకోవాలి.మాతా శిశు ఆరోగ్య రక్షణ వివరాల కార్డు గర్భిణి ఆధార్ కార్డు గర్భిణి పేరుతో ఉండి ఆధార్ అనుసంధానం అయిన బ్యాంకు, పోస్టాఫీసు అకౌంట్ బుక్ గర్భిణి మొబైల్ నంబర్ భర్త వివరాలు, ఆధార్ నంబర్ పూర్తి చిరునామా బిడ్డ జనన ధ్రువీకరణ పత్రం 3 నెలల్లో రూ.3.42 కోట్లు పంపిణీఇప్పటివరకు జిల్లాలోని 8 మున్సిపాలిటీల్లోను, గ్రామాల్లోను 18,761 మంది గర్భిణులు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఈ పథకంలో భాగంగా ఇప్పటివరకు రూ.3.42 కోట్లు ఆన్లైన్ ద్వారా వారి ఖాతాలకు జమచేసినట్టు వైద్యాధికారులు చెబుతున్నారు. గర్భిణులకు ఈ పథకంలో ఏమైనా సందేహాలు ఉంటే ఆ ఏరియా ఆరోగ్య కార్యకర్తను, సమీపంలోని ఆరోగ్య కేంద్రంలో సంప్రదించాలని చెబుతున్నారు. గర్భిణులకు భరోసా.. ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన పథకం పేద గర్భిణులకు భరోసాగా నిలుస్తుంది. ఈ పథకం ద్వారా గర్భిణికి దఫదఫాలుగా రూ.5 వేలు అందిస్తుండగా, జననీ శిశు సురక్ష ద్వారా మరో రూ.1,000 అందిస్తున్నాం. ఈ ఏడాది జనవరి 1వ తేదీ తర్వాత గర్భం దాల్చి ఉండి మొదటి కాన్పు గర్భిణి ఈ పథకం వర్తిస్తుంది. – డాక్టర్ సుబ్రహ్మణ్యేశ్వరి, డీఎంహెచ్‌వో, ఏలూరు వైద్య సిబ్బందిని అప్రమత్తం చేశాం.. పేద గర్భిణులు అంతా ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకునేలా వైద్య సిబ్బందిని అప్రమత్తం చేశాం. ఇంటింటికి వెళ్లి గర్భిణులను నమోదు చేయడంతోపాటు వారితో దరఖాస్తు చేయిస్తున్నాం. – డాక్టర్ బి.దుర్గామహేశ్వరరావు, తణుకు పీపీ యూనిట్ వైద్యాధికారి -
గోల్డెన్ డే
తణుకు: నీ ఇల్లు బంగారం గానూ.. అని ఎవరైనా అంటే ఎంతో ఆనందం కలుగుతుంది. ఆ దీవెన నిజమవుతుందన్న నమ్మకమే అక్షయ తృతీయ. పసిడి పండుగగా పేరొందిన ఈ రోజున మహిళలంతా తమ శక్తి కొద్దీ బంగారాన్ని కొనుగోలు చేస్తుంటారు. ఆనవాయితీగా వస్తున్న బంగారం కొనుగోళ్లు మహిళల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుండటంతో పాటు పుత్తడి అమ్మకాలు ఊపందుకునేలా చేస్తున్నాయి. అయితే ఈ సారి పెళ్లిళ్ల ముహూర్తాలు కూడా కలిసి రావడంతో కొనుగోలు దారుల్ని ఆకర్షించేందుకు జిల్లాలోని అన్ని దుకాణాలు ఆఫర్లతో ఆకట్టుకుంటున్నాయి. అక్షయం అంటే...అక్షయ తృతీయ రోజున పిసరంత బంగారమైనా కొంటే... లక్ష్మీదేవి ఆ ఇంట్లో కొలువై ఉంటుందని చాలా మంది విశ్వసిస్తారు. అక్షయం అంటే ఎప్పుడు తరగనిది అని అర్థం. అక్షయ తృతీయ రోజున బంగారాన్ని కొనుగోలు చేస్తే తరిగిపోని సంపదగా ఉంటుందని నమ్మకం. ఈ పండుగ ఎన్నో కథనాలు ప్రచారంలో ఉన్నాయి. పాల సముద్రం నుంచి మహాలక్ష్మి ఉద్భవించిన సువర్ణమైన రోజని కొందరు చెబుతారు. అందువల్లనే కొంతైనా బంగారాన్ని కొనుగోలు చేయడం సెంటిమెంట్‌గా వచ్చిందని అంటారు. పాండవులు అక్షయపాత్ర పొందిన శుభదినంగా మరి కొందరు అభివర్ణిస్తారు. పరశురాముడు పుట్టిన రోజని, సూర్యచంద్రుడు అత్యంత ప్రకాశవంతంగా ఉండే రోజని ఇంకొందరు చెబుతుంటారు. త్రేతాయుగం అక్షయ తృతీయ రోజే మొదలైందని పెద్దలు చెబుతారు. ఈ రోజు ఏ పనైనా ముహూర్తం చూడకుండానే ప్రారంభించుకోవచ్చని చెబుతుంటారు. ఆఫర్ల జోరు.. బంగారం కొనుగోలు చేసేవారికి కొండెక్కిన ధర భారంగా మారింది. 10 గ్రాముల 24 కా>్యరెట్లు బంగారం రూ.32,400 పలుకుతుండగా 22 క్యారెట్లు బంగారం రూ.29,800 పలుకుతోంది. మహిళలు సెంటిమెంటుగా ఎంతోకొంత బంగారాన్ని కొనుగోలు చేయాలనే లక్ష్యంతో కనీసం రెండు, మూడు గ్రాములైనా కొనుగోలు చేయడానికి మహిళలు ఉత్సుకత చూపిస్తున్నారు. జిల్లాలోని ప్రధానంగా నరసాపురం, భీమవరం, ఏలూరు, తణుకు, తాడేపల్లిగూడెం పట్టణాల్లో అన్ని పసిడి దుకాణాల్లో ఆఫర్లతో ఆకర్షిస్తున్నాయి. పెళ్లిళ్ల సీజన్ ఒకవైపు.. అక్షయ తృతీయ మరోవైపు.. రెండింటినీ ముడి పెడుతూ దుకాణాలు సరికొత్త ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. కొన్ని ప్రముఖ దుకాణాల్లో మేకింగ్ చార్జీల్లో తగ్గింపు, బంగారం కొంటే వెండి ఉచితం, పలు బ్యాంకు క్రెడిట్, డెబిట్ కార్డులు వినియోగిస్తే.. క్యాష్ బ్యాక్ వంటి ఆఫర్లు ప్రకటించారు. సాధారణంగా రోజువారీ అమ్మకాలతో పోల్చి చూస్తే.. అక్షయ తృతీయ రోజున ప్రతి దుకాణంలో 100 నుంచి 150 శాతం అదనపు అమ్మకాలు జరుగుతాయి. -
8 కిలోల కణితి తొలగింపు
సాక్షి,తణుకు : తణుకులోని సాయిశ్వేత సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రిలో ఓ మహిళకు అరుదైన శస్త్రచికిత్స చేసి సుమారు 8 కిలోల బరువున్న కణితిని తొలగించారు. తాడేపల్లిగూడెంకు చెందిన మహిళ అనారోగ్యంగా ఉండటంతో వైద్యురాలు డాక్టర్ ఉషారాణిని సంప్రదించింది. స్కానింగ్ చేసి కడుపులో కణితి ఉందని గుర్తించారు. డాక్టర్ ఉషారాణి, సత్యనారాయణలతో పాటు మత్తు వైద్యనిపుణులు నారాయణరావు పర్యవేక్షణలో శస్త్రచికిత్స నిర్వహించి కణితిని తొలగించారు. 15 ఏళ్ల క్రితమే గర్భసంచిని తొలగించే ఆపరేషన్ జరిగిందని, అప్పటి నుంచి శరీరం పెరుగుతోందనే ఉద్దేశంతోనే రోగి నిర్లక్ష్యం వహించిందని వైద్యురాలు చెప్పారు. -
కాలువలో పడి యువతి మృతి
పెరవలి : తెల్లవారుజామునే గుడికి వెళ్లిన ఓ యువతి కాలువలో కాళ్లు కడుగుదామని దిగి ప్రమాదవశాత్తూ పడిపోయి మృతి చెందింది. ఈ ఘటన ఉండ్రాజవరం మండలం వేలివెన్నులో చోటుచేసుకుంది. పెరవలి ఎస్సై పి.నాగరాజు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గురువారం ఉదయం పెరవలి మండలం కాకరపర్రు వద్ద కాలువలో యువతి మృతదేహం తేలింది. మృతదేహాన్ని చూసిన స్థానికులు హడలిపోయారు. వెంటనే పెరవలి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడకు చేరుకుని తణుకు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇచ్చారు. వారు హుటాహుటిన చేరుకుని కాలువలోని యువతి మృతదేహాన్ని బయటకు తీశారు. అయితే ఆ యువతి ఎవరనేది తెలియక పోవడంతో పోలీసులు కాలువ పరీవాహక ప్రాంతంలోని అన్ని పోలీస్స్టేషన్లకు సమాచారం ఇచ్చారు. చివరికి మధ్యాహ్నానికి మృతురాలి వివరాలు తెలిశాయి. ఉండ్రాజవరం మండలం వేలివెన్ను గ్రామానికి చెందిన గారపాటి శ్రీ వెంకట జ్యోతి (18)గా ఆమెను గుర్తించారు. తెల్లవారుజామునే గుడికి వెళ్లి వస్తానని ఇంట్లో చెప్పి వెళ్లిందని, కాలువలో కాళ్లు కడుక్కునేందుకు దిగి కాలు జారి మునిగిపోయినట్టు తెలిసింది. మృతదేహం కాకరపర్రు లాకుల వరకు కొట్టుకొచ్చింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తణుకు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంటర్ తప్పుతాననే భయంతోనే? మృతురాలు శ్రీ వెంకట జ్యోతి ఇంటర్ చదువుతోంది. ఆమె తల్లి చనిపోవడంతో వేలివెన్నులోని అమ్మమ్మ, తాతయ్య దగ్గర ఉంటూ చదువుకుంటోంది. తండ్రి వరప్రసాద్ వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. ఇంటర్ పరీక్ష ఫలితాలు గురువారం విడుదల కావడంతో పరీక్ష ఫెయిల్ అవుతాననే భయంతో ఆమె కావాలనే కాలువలో పడినట్టు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. అయితే పరీక్షా ఫలితాల్లో ఆమె ఇంటర్ పాస్ అవడం గమనార్హం. ఆమె మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. -
రెప్పపాటులో మాయం
తణుకు: సార్.. నేను షాపింగ్‌మాల్‌కు వెళ్లి వచ్చేసరికి నా బైక్ మాయమైంది.. పార్కింగ్ ప్రాంతంలో ఉంచిన మోటారుసైకిల్ లోనికి వెళ్లి వచ్చేంతలోనే కనపడకుండా పోయింది.. బ్యాంకులోకి అలా వెళ్లి వచ్చేసరికి ఎవరో నా మోటారుసైకిల్ ఎత్తుకెళ్లారు.. ఇలాంటి ఫిర్యాదులు ఇటీవల కాలంలో ఆయా పోలీస్స్టేషన్లలో పెరిగిపోయాయి. తణుకు సర్కిల్ పరిధి లో నెలకు 10 నుంచి 15 మోటారు సైకిళ్లు చోరీకు గురవుతున్నట్టు అంచనా. పోలీసు సిబ్బంది సైతం వాహనాల చోరీ ఉదంతాలను తేలిగ్గా తీసుకుంటున్నారు. దీం తో మోటారుసైకిళ్లు చోరీ చేసే అగంతకులు రెచ్చిపోతున్నారు. తణుకు పట్టణ పరిధిలోని సీసీ కెమేరాలు ఏర్పాటు చేసినప్పటికీ ఆయా ప్రాంతాల్లో వాహనాలను అగంతకులు దొంగిలించుకుపోతున్నారు. అసలేమవుతున్నాయ్..? తణుకు సర్కిల్ పరిధిలో అపహరణకు గురవుతున్న వాహనాల్లో 30 శాతం వ రకు పోలీసులు రికవరీ చేస్తున్నారు. మో టారు సైకిళ్లను అపహరించే వ్యక్తులు వా టిని లభించిన ధరకు తెగనమ్మేస్తున్నారు. ఆ డబ్బుతో జల్సాలు చేస్తున్నట్లు తెలు స్తోంది. తక్కువ ధరకు కొనుగోలు చేసిన వాహనాలను పట్టణంలోని కొందరు సెకండ్ హ్యాండ్ వాహనాల వ్యాపారం చేస్తున్న వారు కొనుగోలు చేసి నకిలీ పత్రాలు సృష్టించి జిల్లాలు దాటిస్తున్నట్టు తెలుస్తోంది. మరికొన్ని వాహనాలను పాత సామాన్లు కొనుగోలు చేసే వ్యక్తులు కొనుగోలు చేసి ఆయా భాగాలను విడదీసి మరమ్మతులు చేసే షాపుల్లో విక్రయిస్తున్నట్టు సమాచారం. పార్కింగ్ ప్రదేశాల్లో రక్షణ ఏదీ..? కార్యాలయాలకు, షాపింగ్‌కు వచ్చే వినియోగదారులే తమ వాహనాలపై నిఘా ఉంచాల్సిన పరిస్థితి. పట్టణంలోని రైల్వేస్టేషన్, బస్టాండ్, సినిమా హాళ్లు తదితర ప్రాంతాల్లో పార్కింగ్ ప్రదేశాల్లో రుసుం తీసుకుని వాహనాలకు భద్రత కల్పిస్తున్నారు. మిగిలిన ప్రాంతాల్లో అం టే ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక మా ర్కెట్, హోటళ్లు వంటి ప్రాంతాల్లో ఇలాం టి ఏర్పాట్లు లేవు. ముఖ్యంగా కల్యాణ మండపాలు, సినిమా హాళ్లు, బహిరంగ సభలు జరిగే ప్రాంతాల్లో నిఘా లేకపోవడంతో ఇక్కడ మోటారుసైకిళ్లు తరచూ చోరీకు గురవుతున్నాయి. అపార్టుమెం ట్లలో కార్యాలయాల నుంచి రూ.వేలు ని ర్వహణ ఖర్చులను వసూలు చేస్తున్నారు. అయినా కాపలా సిబ్బందిని మాత్రం అన్నిచోట్ల నియమించడం లేదు. ఫలితంగా ఆయా ప్రాంతాల పార్కింగ్ ప్రదేశాల్లో నిలిపి ఉంచిన వాహనాలు చోరీకు గురికావడం, వాటి యాజమానులు పో లీసులకు ఫిర్యాదు చేయడం పరిపాటిగా మారింది. ముఖ్యంగా పెద్ద ఎత్తున వ్యా పారాలు చేసే కొన్ని మద్యం దుకాణాలు, బార్లు ముందు వాహనాల రక్షణకు సిబ్బందిని నియమించకపోవడంతో తర చూ వాహనాల చోరీ ఫిర్యాదులు పోలీసులకు అందుతున్నాయి. చాలా సందర్భాల్లో కేసులు నమోదు చేయడానికి నిరాకరిస్తున్నట్టు బాధితులు చెబుతున్నారు. ఇలా చేయాలి.. అనివార్య పరిస్థితుల్లో ఆరుబయట, రోడ్ల వెంబడి, వ్యాపార ప్రాంతాల్లో వాహనాలను నిలిపి ఉంచడానికి కొన్ని చిట్కాలు పాటించాలని పోలీసులు సూచిస్తున్నారు. వాహనానికి అందించే తాళాలు కొన్నాళ్లకు అరిగిపోతాయి. ఆటో మొబైల్ షాపుల్లో రూ.150 నుంచి రూ.300 వెచ్చిస్తే వెనుక చక్రానికి తాళం వేయడానికి వీలుగా ప్రత్యేక తాళం ఇస్తారని, వీటిని వేస్తే కొంత మేర భద్రత ఉంటుందని చెబుతున్నారు. ఇళ్ల బయట పార్కింగ్ చేసేవారు కిటికీలకు గట్టి ఇనుప గొలుసుతో వాహనానికి లాక్ చేయడం మంచిదని సూచిస్తున్నారు. వాహనాలకు బీమా ఉండటం వల్ల ఫిర్యాదు చేసిన మూడు నెలల వరకు వాహనం దొరక్కపోతే ఆయా సం స్థల నుంచి బీమాను పొందవచ్చని, ఇందుకు సంబంధిత పోలీసుస్టేషన్ల నుంచి చివరి నివేదిక తీసుకుని దరఖాస్తు చేసుకోవచ్చని పోలీసులు సూచిస్తున్నారు. నిఘా ఉంచాం ఇటీవల కాలంలో మోటారుసైకిళ్లు చోరీకు గురవుతున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి. ముఖ్యంగా పట్టణంలోని ప్రధాన కూడళ్లలో ప్రత్యేక నిఘా ఉంచాం. వాహనదారులు సైతం వాహనంతోపాటు వచ్చే తాళంతోపాటు మరొకటి కూ డా బైకులకు తప్పకుండా వేసుకో వాలి. అపార్టుమెంట్ నిర్వాహకులు విధిగా కాపలా సిబ్బందిని నియమించుకోవాలి. వాహనదారులు సైతం స్వయంగా ప్రత్యేక నిఘా ఉంచుకోవాలి. – కేఏ స్వామి, సీఐ తణుకు -
కేంద్ర మాజీమంత్రి బోళ్ల బుల్లిరామయ్య మృతి
సాక్షి, ఏలూరు : కేంద్ర మాజీమంత్రి, తణుకు ఆంధ్రా షుగర్స్ ఎండీ బోళ్ల బుల్లిరామయ్య (91) మృతి చెందారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. బుధవారం ఉదయం బోళ్ల బుల్లిరామయ్య మరణించారు. 1926 జులై 9న తూర్పుగోదావరి జిల్లా తాటిపాకలో జన్మించిన ఆయన 1984, 1991, 1996, 1999లో ఏలూరు నుంచి ఎంపీగా పనిచేశారు. 1996-98 మధ్య బుల్లిరామయ్య కేంద్ర వాణిజ్య శాఖ సహాయమంత్రిగా పనిచేశారు. ఆయన మృతిపట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్చార్జ్ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సంతాపం తెలిపారు. తెలుగుదేశం పార్టీకి, ప్రజలకు బుల్లిరామయ్య చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే ఏపీ రాష్ట్ర మంత్రులు పితాని సత్యనారాయణ, పైడికొండల మాణిక్యాలరావు, కెఎస్ జవహర్ తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. రేపు మధ్యాహ్నం పెదపట్నం అగ్రహారంలో బోళ్ల బుల్లిరామయ్య అంత్యక్రియలు జరగనున్నాయి. -
షాక్: కోడిపందేల రాయుళ్లకు జైలు
సాక్షి, తణుకు: కోడిపందేల రాయుళ్లకు న్యాయస్థానం ఊహించని షాక్ ఇచ్చింది. జైలు శిక్ష, జరిమానా విధించింది. సంక్రాంతి పండుగ పురస్కరించుకుని పశ్చిమగోదావరి జిల్లా తణుకు సర్కిల్ పరిధిలో కోడిపందేలు నిర్వహించిన 93 మందిని పోలీసులు సోమవారం కోర్టులో హాజరు పరిచారు. వీరికి న్యాయమూర్తి ఒకరోజు జైలుశిక్ష, రూ. 200 చొప్పున జరిమానా విధించించారు. నిందితులను తణుకు సబ్ జైలుకు పోలీసులు తరలించారు. కోడిపందేలపై పోలీసులు దాడి పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలం మంగపతిదేవిపేట గ్రామంలో కోడిపందేలపై పోలీసులు దాడి చేసి ఐదుగురిని అరెస్ట్ చేశారు. రూ. 2010 నగదు, 2 కోళ్లు, 2 కత్తులును స్వాధీనం చేసుకున్నారు. -
ప్రాణం తీసిన నిర్లక్ష్యం
తణుకు: డ్రైవింగ్‌లో అలసట.. కంటి మీ ద కునుకు లేకుండా చేసిన డ్రైవింగ్ ఒకరి ప్రాణాలను తీసింది.. మరో ఇద్దరిని తీవ్ర గాయాలపాలు చేసింది. తణుకు పట్టణ పరిధిలోని శర్మిష్ట సెంటర్లో జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందగా మరో ఇద్దరు తీవ్రగాయాలతో ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కాకినాడ నుంచి గుంటూరు వెళుతున్న బొలేరో ట్రక్కు వాహనం తణుకు శర్మిష్ట సెంటర్ వద్ద రెండు వేర్వేరు మోటారు సైకిళ్లపై వెళుతున్న ముగ్గుర్ని ఢీకొట్టింది. పైడిపర్రు గ్రామానికి చెందిన బెల్లం కమీషన్ వ్యాపారులు పోతుల శ్రీను (54), పంగం సాంబశివరావు మోటారు సైకిల్‌పై బెల్లం మార్కెట్ నుంచి స్వగ్రామానికి వెళుతున్నారు. ఇదే సమయంలో పాతూరుకు చెందిన చలమలశెట్టి శ్రీనివాస్ మరో వాహనంపై తణుకు వైపు వెళుతున్నాడు. రెండు వాహనాలు జాతీయ రహదారిపై రోడ్డు పక్కనే వెళుతుండగా కాకినాడ నుంచి గుంటూరు వెళుతున్న బొలేరో ట్రక్కు వెనుక నుంచి వీరిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వాహనాలను సుమారు 100 మీటర్లు మేర ఈడ్చుకెళ్లిపోవడంతో శరీరాలు నుజ్జయ్యాయి. పోతుల శ్రీను అక్కడిక్కడే మృతిచెందగా తీవ్రగాయాలపాలైన సాంబశివరావు, శ్రీనివాసును చికిత్స నిమిత్తం తణుకు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వీరి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో మెరుగైన చికిత్స నిమిత్తం స్థానికంగా ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. బాధితులు ఇచ్చిన ఫిర్యా దు మేరకు పట్టణ ఎస్సై డి.ఆదినారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బెల్లం కమీషన్ వ్యాపారులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన పో తుల శ్రీను, తీవ్ర గాయాలపాలైన పంగం సాంబశివరావు స్నేహితులు. పైడిపర్రు గ్రామానికి చెందిన వీరు వ్యాపారంలోనే కాకుండా ఎంతో అన్యోన్యంగా ఉంటారు. వీరిద్దరు బెల్లం కమీషన్ వ్యాపారం చేస్తున్నారు. ఇద్దరు ఒకే మోటారుసైకిల్‌పై బెల్లం మార్కెట్ నుంచి ఇంటికి వెళుతుండగా అనుకోని రీతిలో దూసుకొచ్చిన బొలేరో ట్రక్కు వాహనం వీరిని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీను అక్కడిక్కడే మృతి చెందగా సాంబశివరావు రెండు కాళ్లకు తీవ్రగాయాలయ్యాయి. తలకు కూడా బలమైన గాయాలు కావడంతో ప్రస్తుతం అపస్మారక స్థితికి చేరుకున్నాడు. రెండు కాళ్లు నుజ్జుకావడంతోపాటు ఎముకలు బయటకు రావడం చూపరులను కలచివేసింది. మృతుడు శ్రీనుకు భార్య దుర్గ, ఇద్దరు కుమారులు ఉన్నారు. సాంబశివరావుకు భార్య వెంకటలక్ష్మి, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇదే ప్రమాదంలో శ్రీనివాస్ తలకు బలమైన గాయాలు కావడంతోపాటు పక్కటెముకలు విరిగి పోయినట్లు వైద్యులు చెబుతున్నారు. వీరిద్దరి పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని వారంటున్నారు. పోలీసుల అదుపులో డ్రైవర్ గుంటూరు నుంచి కాకినాడకు బొలేరో ట్రక్కు వాహనంలో కూరగాయలు ఎగుమతి చేసి తిరిగి వెళుతున్న క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం రాత్రి కూరగాయల లోడుతో కాకినాడకు వెళ్లిన డ్రైవర్ పోపూరి మరియదాసు విశ్రాంతి లేకుండా తిరిగి గుంటూరు వెళుతున్న క్రమంలోనే ఈ ప్రమాదం జరిగింది. నిద్ర వచ్చి రెప్ప వాల్చడంతోనే ప్రమాదం జరిగినట్లు డ్రైవర్ మరియదాసు చెబుతున్నారు. ప్రస్తుతం డ్రైవర్ తణుకు పట్టణ పోలీసుల అదుపులో ఉన్నాడు. -
సస్పెన్షన్ల సర్కిల్
తణుకు అర్బన్ : తణుకు సర్కిల్ పోలీస్ స్టేషన్.. సస్పెన్షన్ల సర్కిల్‌గా పోలీస్ వర్గాల్లో పేరుగాంచింది. పోలీస్ అధికారులు ఇక్కడకు వచ్చేటప్పుడు ఎంత హుషారుగా వస్తారో ఆ తర్వాత ఏదో ఒక వివాదం చుట్టుముట్టుకుని వెళ్లేటప్పుడు వివాదాస్పదంగా బయటకు వెళుతుంటారు. గత కొన్నేళ్లుగా వరుసగా అధికారులు సస్పెండ్ అయి వెళ్లడమే ఇందుకు కారణం. ఇక్కడ పనిచేసిన సీఐలు రాజకీయ పలుకుబడిని ఉపయోగించుకుని కావాలని మరీ వచ్చిన వారే అత్యధికం. తీరా ఇక్కడకు వచ్చాక ఏదో ఒక వివాదంలో ఇరుక్కోవడం సస్పెండ్ కావడం పరిపాటిగా మారింది. దీంతో ఇప్పుడు తణుకు సర్కిల్ అంటే అధికారులు భయపడుతున్నారు. గడిచిన తొమ్మిదేళ్లలో నలుగురు అధికారులు సస్పెండ్ అయి వెళ్లగా తాజాగా ఈ నెల 31న తణుకు సీఐ చింతా రాంబాబు బదిలీపై వీఆర్‌కు వెళ్లడం కూడా చర్చనీయాంశమైంది. అయితే ఈయన ఇక్కడ రెండేళ్లు ఉద్యోVýæ జీవితం పూర్తి చేసుకున్నారు. ఆర్థికంగా బలమైన సర్కిల్ జిల్లాలో ఎక్కువ క్రైమ్ రికార్డు ఉండడంతో పాటు ఆర్థిక వనరులు కూడా బలంగా ఉండడం తణుకు సర్కిల్ స్టేషన్ ప్రత్యేకత. పట్టణం వ్యాపార, వాణిజ్య రంగాల్లో దినదినాభివృద్ధి చెందుతుండడం కూడా ఇందుకు కారణం. దీంతో తణుకు వచ్చేందుకు అధికారులు ఉత్సాహం చూపించేవారు. తణుకు సర్కిల్ కార్యాలయానికి సంబంధించి తణుకు, తణుకు, రూరల్, తణుకు ట్రాఫిక్, ఉండ్రాజవరం, పెరవలి, అత్తిలి స్టేషన్లు ఉన్నాయి. 2009 నుంచి అధికారులకు ఎదురుదెబ్బలే 2009 నుంచి పనిచేసిన సర్కిల్ అధికారుల్లో ఒక్కరు తప్ప మిగిలినవారంతా ఏదో ఒక వివాదంలో చిక్కుకుని సస్పెండ్ అయి వెళ్లినవారే. 2011, 2012, 2014, 2016 సంవత్సరాల్లో ఇక్కడ పనిచేసిన సీఐలు వివిధ వివాదాల్లో ఇరుక్కుని సస్పెండ్ అయ్యారు. 2013లో తణుకు సర్కిల్ అధికారిగా వచ్చిన జి.మధుబాబు ఒక్కరే బదిలీపై వెళ్లారు. తాజాగా తణుకు సీఐ చింతా రాంబాబు కూడా ఇటీవల కాలంలో ఇటు రాజకీయం గానూ అటు డిపార్ట్మెంట్లోనూ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇరగవరం మండలం రేలంగిలో దళితవర్గాల మధ్య ఏర్పడిన తగాదాలో స్థానిక ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పోలీసులపై దురుసుగా ప్రవర్తించారనే వివాదం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో సీఐ పాత్రపై రాజకీయంగా గుర్రుగా ఉన్నా అధికారిని బదిలీ చేయిస్తే ఇబ్బందులు వస్తాయనే ఉద్దేశంతో అప్పట్లో వేటు పడలేదు. మరోవైపు ఆయన వ్యవహార శైలిపై స్వయంగా పోలీస్ సిబ్బందే ఉన్నతాధికారికి ఫిర్యాదులు అందాయి. దీంతో ఆయనను వీఆర్‌లో ఉంచారు. రెండేళ్లు పదవీకాలం పూర్తికావడం కూడా ఆయన బదిలీకి కారణంగా కనిపిస్తోంది. స్టేషన్‌కు వాస్తు దోషం సర్కిల్ అధికారులంతా వరుసగా సస్పెండ్ అవుతున్నారనే ఉద్ధేశంతో గతంలో నెమ్మదస్తుడు, అందరివాడని ముద్రపడిన ఒక అధికారిని ఇక్కడకు బదిలీ చేశారు. ఆయన వచ్చిన తర్వాత తణుకు సర్కిల్ కార్యాలయ ఆవరణలో ఎదురుగా ఉన్న సిగ్నల్ టవర్‌ను వాస్తు దోషానికి మూలంగా ఉందని పెద్ద మొత్తం వెచ్చించి మరీ స్టేషన్ వెనుక వైపునకు మార్పించారు. కానీ తరువాత వచ్చిన ఇద్దరు అధికారులు కూడా తిరిగి ఇక్కడ నుంచి సస్పెండ్ అయి వెళ్లాల్సి వచ్చింది. దీంతో ఇప్పుడు మళ్లీ వాస్తుదోషంపై గుసగుసలాడుకుంటున్నారు. -
నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్య
తణుకు: పట్టణంలోని ఒక ప్రైవేటు నర్సింగ్ స్కూలుకు చెందిన విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఇరగవరం మండలం అర్జునుడుపాలెం గ్రామానికి చెందిన మల్లిపూడి హెప్సిబారాణి (18) తణుకులోని నర్సింగ్ స్కూల్లో చదువుతోంది. ఈమె కొంతకాలంగా అదే గ్రామానికి చెందిన ఒక వ్యక్తితో ప్రేమ వ్యవహారం నడుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మనస్తాపం చెందిన హెప్సిబారాణి ఆదివారం తన హాస్టల్ గదిలోని నరానికి మత్తు ఇంజక్షన్ చేసుకుంది. కొద్దిసేపటికి కుప్పకూలిపోవడంతో ఆమెను చికిత్స నిమిత్తం ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందింది. హెప్సిబారాణికి తల్లిదండ్రులు లేకపోవడంతో అదే గ్రామానికి చెందిన పాస్టర్ సంరక్షిస్తున్నారు. తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టణ ఎస్సై డి.ఆదినారాయణ అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
ఐఎఫ్ఎస్ అధికారి ఇంట్లో సీబీఐ తనిఖీలు
తణుకు: ఉత్తరప్రదేశ్ ఫారెస్ట్ కార్పొరేషన్ జనరల్ మేనేజర్(వెస్ట్ మీరట్)గా పని చేస్తున్న ముత్యాల రాంప్రసాదరావు నివాసంలో సీబీఐ అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకు పట్టణంలోని ఆయన ఇంటిపైనా, సమీప బంధువుల ఇళ్లల్లో సోదాలు నిర్వహించారు. గతంలో ఎన్టీపీసీలో చీఫ్ విజిలెన్స్ అధికారిగా పని చేసిన కాలంలో పెద్దఎత్తున అక్రమ ఆస్తులు కూడబెట్టినట్టు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ దాడులు నిర్వహించారు. ఈయన సంపాదించిన అక్రమ ఆస్తులతో ఆయన భార్య కనకదుర్గ తణుకులో పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే తణుకులో రాంప్రసాదరావుకు చెందిన ఇళ్లలో సోదాలు నిర్వహించారు. కనకదుర్గకు సహాయకుడిగా ఉన్న ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్న సీబీఐ అధికారులు అతని ద్వారా కీలక సమాచారాన్ని రాబట్టినట్టు విశ్వసనీయ సమాచారం. -
డీజీపీ సాంబశివరావుకు తప్పిన ప్రమాదం
ఏలూరు : ఆంధ్రప్రదేశ్ డీజీపీ సాంబశివరావుకు తృటిలో ప్రమాదం తప్పింది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు వద్ద ఆయన ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. తణుకు పదహారో నెంబరు జాతీయ రహదారిపై డీజీపీ సాంబశివరావు కాన్వాయి ప్రమాదానికి గురైంది. ఎదురుగా వెళుతున్న లారీ సడన్ బ్రేక్ వేయడంతో వెనుక వచ్చిన కాన్వాయ్ ఢీకొట్టింది. డీజీపీ వాహనం సహా కాన్వాయ్‌లోని రెండు వాహనాలు ఒకదాని వెనుక ఒకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో అదృష్టవశాత్తూ ఎవరూ గాయపడలేదు. డీజీపీ సాంబశివరావు వేరే వాహనంలో విజయవాడ వెళ్లిపోయారు. కాకినాడ నుంచి విజయవాడ వెళుతుండగా ఈ ఘటన జరిగింది. -
హత్యకేసులో ఆటోడ్రైవర్‌కు జీవిత ఖైదు
తణుకు: ఉండ్రాజవరం మండలం పాలంగి గ్రామంలో 2014లో జరిగిన హత్య కేసులో తణుకుకి చెందిన ఆటో డ్రైవర్‌కు జీవిత ఖైదు విధిస్తూ సోమవారం న్యాయమూర్తి తీర్పు చెప్పారు. తణుకు సీఐ చింతా రాంబాబు తెలిపిన వివరాల ప్రకారం.. పాలంగి గ్రామానికి చెందిన బొద్దాని ఆదినారాయణ అలియాస్ బుజ్జి 2014 నవంబర్ 16 వేకువజామున 4 గంటల సమయంలో ఇంటి గుమ్మం వద్ద తీవ్రగాయాలతో పడి ఉన్నాడు. గమనించిన తల్లి బొద్దాని సీతామహాలక్ష్మి గ్రామానికి చెందిన పీఎంపీ సాయంతో తణుకు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. తన కుమారుడు గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేయడంతోనే మృతి చెందినట్టు తల్లి ఉండ్రాజవరం పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసింది. తణుకుకి చెందిన పల్లా వెంకటేష్ అలియాస్ ఆటో వెంకీ, పాలా రామకృష్ణ అనే వ్యక్తులపై అనుమానం ఉందని ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై అప్పటి ఎస్సై పీవీ రమణ కేసు నమోదు చేసి సీఐ జి.మధుబాబు ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టారు. అనంతరం అప్పటి సీఐ ఆర్.అంకబాబు పల్లా వెంకటేష్ అలియాస్ ఆటో వెంకీపై చార్జిషీటు దాఖలు చేసి నవంబర్ 11న రిమాండ్‌కు తరలించారు. కేసు విచారణ అనంతరం నేరం రుజువు కావడంతో తణుకు నాలుగో అదనపు జిల్లా సెషన్స్ జడ్జి జీజీ కేశవరావు నిందితుడికి జీవిత ఖైదు ఖరారు చేసి రూ. 2 వేలు జరిమానా విధించారు. జరిమానా చెల్లించని పక్షంలో మరో ఆరు నెలలు శిక్ష అనుభవించాలని తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ తరఫున ఏపీపీ కేఎస్ఎల్ఎన్ ప్రసాద్ వాదించగా తణుకు సీఐ చింతా రాంబాబు, ఉండ్రాజవరం ఎస్సై కె.గంగాధరరావు, కానిస్టేబుల్ జీఎస్ఆర్కే పరమహంస సహకరించారు. -
విత్తన దుకాణాలపై విజి‘లెన్స్’
తణుకు : తణుకు పట్టణంలోని విత్తనాలు విక్రయించే దుకాణాలపై విజిలెన్స్ అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు. విజిలెన్స్ జిల్లా ఎస్పీ కె.బాలవెంకటేశ్వరరావు ఆదేశాల మేరకు డీఎస్పీ కె.అనిల్‌కుమార్, సీఐ ఎస్.వెంకటేశ్వరరావుల ఆధ్వర్యంలో ఈ దాడులు నిర్వహించారు. రాష్ట్రపతి రోడ్డులోని గ్రంధి సీతయ్య సీడ్స్, గ్రంధి చలమయ్య సీడ్స్ దుకాణాల్లో తనిఖీలు నిర్వహించి రికార్డులు, నిల్వలకు భారీ వ్యత్యాసాలు ఉన్నట్టు గుర్తించారు. గ్రంధి చలమయ్య సీడ్స్‌లో రూ.4.64 లక్షలు, గ్రంధి సీతయ్య సీడ్స్‌లో రూ.3 లక్షల విలువైన విత్తనాలు సీజ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన నకిలీ విత్తనాల వ్యవహారంతో తణుకులో విత్తనాల దుకాణాలపై ఈ దాడులు నిర్వహించారు. గతంలో సైతం తణుకులో కొనుగోలు చేసిన విత్తనాలు నకిలీవిగా తేలడంతో పెద్ద ఎత్తున రైతులు ఏపీ సీడ్స్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. జిల్లాలోనే పెద్ద మొత్తంలో విత్తనాల వ్యాపారం జరిగే తణుకు పట్టణంలో నిర్వహించిన విజిలెన్స్ దాడులు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మరోవైపు నకిలీ విత్తనాల అంశాన్ని పరిశీలించాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. పలు బ్రాండ్లకు చెందిన విత్తనాల ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నామని వీటిని నకిలీవా లేక అసలువా తేల్చేందుకు లాబొరేటరీకి పంపించాల్సి ఉందన్నారు. దుకాణాల యజమానులు జీవీఎన్ భూషణం, జి.వెంకటేశ్వరరావులపై కేసు నమోదు చేసినట్టు డీఎస్పీ అనిల్‌కుమార్ తెలిపారు. ఈ దాడుల్లో విజిలెన్స్ ఎస్సై కె.సీతారాం, ఏసీటీవో డీడీ రాజేంద్రప్రసాద్, ఏజీ జయప్రసాద్, ఏవో ఎం.శ్రీనివాస్‌కుమార్, మండల వ్యవసాయాధికారి బి.ప్రియదర్శిని, హెడ్‌కానిస్టేబుళ్లు పి.రాధాకృష్ణ, కె.నాగరాజు, వైఎన్ మూర్తి, నాగబాబు పాల్గొన్నారు. -
‘నవనిర్మాణ దీక్ష కాదు.. నయవంచన దీక్ష’
తణుకు: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసేది నవ నిర్మాణ దీక్ష కాదని, అది నయవంచన దీక్ష అని పశ్చిమ గోదావరి జిల్లా వైఎస్ఆర్ సీపీ నేతలు విమర్శించారు. ఆదివారం తణుకు నియోజకవర్గ ప్లీనరీ సమావేశంలో పాల్గొన్న వైఎస్ఆర్ సీపీ నేతలు పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల నాని, ముదునూరి ప్రసాదరాజు, కారుమురు నాగేశ్వరరావు మాట్లాడుతూ.. చంద్రబాబు మూడేళ్ల పాలనలో చేసిందేమీ లేదని అన్నారు. రెండేళ్ల తర్వాత ఓడిపోతామని తెలిసి దోపిడి రాజ్యంగా మార్చారని వైఎస్ఆర్ సీపీ నేతలు విమర్శించారు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. ప్లీనరీ సమావేశంలో కొట్టు సత్యనారాయణ, తెల్లం బాలరాజు, పాతపాటి సర్రాజు, మేకా శేషుబాబు, పీ. వాసుబాబు, కే. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
ఆరిమిల్లి వివాదంపై అమరావతిలో పంచాయితీ
సాక్షి ప్రతినిధి, ఏలూరు : తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పోలీసు అధికారులను నిర్బంధించిన వివాదంపై మంగళవారం అమరావతిలో పంచాయితీ జరగనుంది. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇది చాలా చిన్న పంచాయితీ అని, దీన్ని పరిష్కరిస్తానని ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు సోమవారం పోలవరంలో ప్రకటించారు. జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుంటే కొందరు ఈ విధంగా వివాదాలకు దిగడం సరికాదన్నారు. పశ్చిమ గోదావరి రాష్ట్రంలోనే ప్రశాంతంగా ఉండే జిల్లా అని, ఇక్కడ పనిచేసిన కలెక్టర్లు, ఎస్పీలు తమ అనుభవాలను గొప్పగా చెప్పుకుంటారని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. అధికారులతో వివాదం మంచిది కాదని, ఎమ్మెల్యేలు కొత్తగా ఎన్నికైన వారు కావడం, ఎస్పీ యువకుడు, కొత్తవాడు కావడంతో ఈ వివాదం వచ్చిందన్నారు. దీనిని తాను పరిష్కరిస్తానని చెప్పారు. ఆదివారం నిర్వహించిన జిల్లా టీడీపీ విస్త్రత స్థాయి సమావేశంలో ఎమ్మెల్యేలంతా ఎస్పీని టార్గెట్ చేయడం, ఆ తర్వాత సమన్వయ కమిటీ సమావేశంలోనూ జిల్లా కమిటీ ఏర్పాటుపై చర్చించకుండా ఎస్పీని బదిలీ చేయాలనే అంశంపై రచ్చ చేయడంపై చంద్రబాబు సీరియస్ అయినట్టు సమాచారం. సంస్థాగత ఎన్నికలపై దృష్టి పెట్టమంటే ఒక రోజంతా ఒక అధికారి గురించి చర్చిస్తారా అని జిల్లా నేతలపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. తన పర్యటనకు ఎమ్మెల్యేలు ఎవరూ రావద్దని జిల్లా కమిటీ, అనుబంధ కమిటీలపై చర్చించి ఖరారు చేయాలని ఆదేశించారు. మంగళవారం అమరావతికి వస్తే ఈ విషయంపై చర్చిద్దామని ముఖ్యమంత్రి జిల్లా నేతలకు సూచించారు. దీంతో మంత్రులు పైడికొండల మాణిక్యాలరావు, పితాని సత్యనారాయణ, పోలవరం ఎమ్మెల్యే మొడియం శ్రీనివాస్ మాత్రమే ముఖ్యమంత్రి పర్యటనకు హాజరయ్యారు. మిగిలినవారంతా ఏలూరులో సమావేశమై జిల్లా కమిటీ ఏర్పాటుపై చర్చించారు. డీజీపీ చెంతకు పోలీస్ అధికారుల సంఘం మరోవైపు పోలీసు అధికారుల సంఘం ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుంది. ఎస్సై, రైటర్‌ను నిర్బంధించడమే కాకుండా, ఎస్పీని బదిలీ చేయాలని ప్రజాప్రతినిధులు పట్టుపట్టడంపై అసోసియేషన్ నేతలు గుర్రుగా ఉన్నారు. ఈ అంశాన్ని డీజీపీ దృష్టికి తీసుకువెళ్లేందుకు అమరావతి వెళ్లగా, డీజీపీ ఆంధ్రా, ఒడిశౠ బోర్డర్లో ఉండటంతో కలవడం కుదరలేదు. ముఖ్యమంత్రితోపాటు, అసెంబ్లీ స్పీకర్‌ను కూడా కలవాలని పోలీస్ అసోసియేషన్ భావిస్తోంది. -
ఐపీఎల్ బెట్టింగ్: బుకీ అరెస్టు
తణుకు: ఐపీఎల్ సందర్భంగా క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడుతున్న ఓ బుకీని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి లక్ష రూపాయల నగదుతో పాటు 5 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో బెట్టింగ్ నిర్వహిస్తున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు దాడులు నిర్వహించి బుకీని అదుపులోకి తీసుకున్నారు.. దీని వెనుక ఎవరెవరు ఉన్నారో కనుక్కోవడానికి ప్రస్తుతం అతన్ని విచారణ చేపడుతున్నారు. -
మహిళ కంట్లో కారం, మైదాపిండి చల్లి..
తణుకు : ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళ కంట్లో కారం, మైదాపిండి చల్లి ఇంట్లో బంగారం అపహరించుకుపోయిన ఘటన తణుకులో చోటు చేసుకుంది. సజ్జాపురంలోని స్వాతి అపార్ట్మెంటులో మాకిన శ్రీరామ్మూర్తి ఆయన భార్య మాకిన సత్యవతి భార్యభర్తలు నివాసం ఉంటున్నారు. రాత్రి శ్రీరామ్మూర్తి టిఫిన్ చేసి బయటకు వెళ్లి వస్తానని చెప్పి వెళ్లారు. తలుపు గడియ పెట్టుకుని ఆ మహిళ ఇంట్లో పడుకుంది. సుమారు రాత్రి 11 గంటల సమయంలో కాలింగ్ బెల్లు మోగడంతో తలుపు తీసింది. గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు వచ్చి ఇదే అపార్టుమెంటులో తాము నివాసం ఉంటున్నామని, అయితే తమకు కరెంటు లేదని మీకు ఉందా అంటూ అడిగారు. తమకు కరెంటు ఉందని ఇంట్లో విద్యుత్ మీటర్ చూపించేందుకు లోపలకు రమ్మని చెప్పింది. ఇదే అదనుగా ఆమెపై దాడిచేసిన అగంతకులు ఆమె కళ్లల్లో కారం, మైదా పిండి చల్లడంతో అపస్మారక స్థితికి చేరుకుంది. అనంతరం బీరువాలో దాచుకున్న సుమారు 20 కాసుల బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు. అయితే బాధితురాలు సత్యవతి పొంతన లేని సమాధానాలు చెబుతుండటంతో పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. కంట్లో కారం చల్లారని ఒకసారి... అపస్మారక స్థితికి వెళ్లానని మరోసారి ఇలా చెబుతోంది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పట్టణ రెండో ఎస్సై రుక్మంగధరావు కేసు నమోదు చేశారు. ఘటనా స్థలాన్ని కొవ్వూరు ఇన్చార్జి డీఎస్పీ నున్న మురళీకృష్ణ, తణుకు సీఐ సీహెచ్ రాంబాబు, పట్టణ ఇన్చార్జి ఎస్సై వి.జగదీశ్వరరావు పరీశీలించారు. ఏలూరు నుంచి వేలిముద్రల నిపుణులు, డాగ్‌స్క్వాడ్ రప్పించి ఆధారాలు సేకరించారు. -
మహిళ కళ్లలో కారం కొట్టి చోరీ
-20 కాసుల బంగారం అపహరణ తణుకు : ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళ కంట్లో కారం, మైదాపిండి చల్లి ఇంట్లో బంగారం అపహరించుకుపోయిన ఘటన తణుకులో చోటు చేసుకుంది. సజ్జాపురంలోని స్వాతి అపార్ట్మెంటులో మాకిన శ్రీరామ్మూర్తి ఆయన భార్య మాకిన సత్యవతితో కలిసి నివాసం ఉంటున్నారు. రాత్రి శ్రీరామ్మూర్తి టిఫిన్ చేసి బయటకు వెళ్లి వస్తానని చెప్పి వెళ్లారు. ఈ సమయంలో సత్యవతి తలుపు గడియ పెట్టుకుని ఇంట్లో పడుకుంది. సుమారు రాత్రి 11 గంటల సమయంలో కాలింగ్ బెల్లు మోగడంతో తలుపు తీసింది. గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు వచ్చి ఇదే అపార్టుమెంటులో తాము నివాసం ఉంటున్నామని, అయితే తమకు కరెంటు లేదని మీకు ఉందా అంటూ అడిగారు. ఇదే అదనుగా అగంతకులు ఆమె కళ్లల్లో కారం, మైదా పిండి చల్లడంతో అపస్మారక స్థితికి చేరుకుంది. అనంతరం బెడ్రూములోని బీరువాలో దాచుకున్న సుమారు 20 కాసుల బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు. అయితే ఈసంఘటనపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. కంట్లో కారం చల్లారని ఒకసారి... అపస్మారక స్థితికి వెళ్లానని సత్యవతి చెబుతోంది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పట్టణ రెండో ఎస్సై రుక్మంగధరావు కేసు నమోదు చేశారు. ఘటనా స్థలాన్ని కొవ్వూరు ఇన్చార్జి డీఎస్పీ నున్న మురళీకృష్ణ, తణుకు సీఐ సీహెచ్ రాంబాబు, పట్టణ ఇన్చార్జి ఎస్సై వి.జగదీశ్వరరావు పరీశీలించారు. ఏలూరు నుంచి వేలిముద్రల నిపుణులు, డాగ్‌స్క్వాడ్ రప్పించి ఆధారాలు సేకరించారు. -
క్రికెట్ ఆడనివ్వలేదని బ్యాట్‌తో కొట్టి చంపేశాడు
-
క్రికెట్ ఆడనివ్వలేదని బ్యాట్‌తో కొట్టి చంపేశాడు
తణుకులో బాలుడు మృతి తణుకు: క్రికెట్ ఆడనివ్వకపోవడంతో పాటు ఇంటికొచ్చి తన తల్లిదండ్రులుకు ఫిర్యాదు చేశాడన్న కోపంతో ఓ బాలుడు మరో బాలుడ్ని బ్యాట్‌తో కొట్టి చంపేశాడు. ఈ ఘటన శుక్రవారం పశ్చిమగోదావరి జిల్లా తణుకులో చోటుచేసుకుంది. వివరాలు.. తణుకులోని కొమ్మాయి చెరువుగట్టులో ఉన్న కమ్యూనిటీ హాల్ వద్ద శుక్రవారం కొందరు పిల్లలు క్రికెట్ ఆడుకుంటున్నారు. అయితే తనను ఆటకు తీసుకోలేదన్న కోపంతో సూరవరపు గణేశ్(16) వికెట్లు పడేశాడు. దీంతో సప్పా సంజీవ్‌కుమార్(16), మరికొందరు పిల్లలు గణేశ్ ఇంటికి వెళ్లి.. అతని తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశారు. అనంతరం గ్రౌండ్‌కు వచ్చి మళ్లీ క్రికెట్ ఆడుకుంటుండగా.. గణేశ్ పట్టరాని ఆగ్రహంతో వచ్చి సంజీవ్‌కుమార్ మెడపై క్రికెట్ బ్యాట్‌తో బలంగా కొట్టాడు. దీంతో సంజీవ్‌కుమార్ అక్కడికక్కడే కూలబడ్డాడు. ఇది గమనించిన స్థానికులు వెంటనే సంజీవ్‌ను తణుకు ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు నిర్థారించారు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్సై శ్రీనివాసరావు కేసు నమోదు చేశారు. -
తణుకులో భారీ చోరీ
తణుకు: తణుకులోని ఓ అపార్ట్మెంట్ ఫ్లాట్‌లో చోరీ జరిగింది. తాళాలు పగులగొట్టి లోనికి ప్రవేశించిన దొం గలు అరవై రెండున్నర కాసుల బంగారు ఆభరణాలు, నాలుగు కిలోల వెండి వస్తువులు అపహరించారు. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. సజ్జాపురంలోని హరిశ్చంద్ర టవర్స్ ఫేజ్–2లోని 405 ఫ్లాట్‌లో చిరుకూరి సుధ కుటుంబంతో నివాసం ఉంటున్నారు. ఆమె భర్త ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తుండగా ఈనెల 17న కుటుంబ సభ్యులంతా పుట్టపర్తి వెళ్లారు. ఇదే అదనుగా దొంగలు చొరబడ్డారు. గురువారం రాత్రి 11 గంటల తర్వాత గుర్తు తెలియని వ్యక్తులు అపార్టుమెంటులోకి చొరబడి ఫ్లాట్ తాళం పగులగొట్టి లోనికి ప్రవేశించారు. బీరువాలోని అరవై రెండున్నర కాసుల బంగారు ఆభరణాలతోపాటు నాలుగు కిలోల వెండి వస్తువులు దోచుకుపోయారు. ఇంటి ప్రధాన గుమ్మం గొళ్లెం విరగ్గొట్టిన దుండగులు చాకచక్యంగా లోనికి ప్రవేశించి ఇనుప బీరువాను మంచంపై పడుకోబెట్టి మరీ పగులగొట్టారు. ముందుగానే రెక్కీ నిర్వహించుకుని చోరీకి పాల్పడినట్టు పోలీసులు భావిస్తున్నారు. అదను చూసి దోచేశారు కుటుంబ యజమానికి బ్యాంకు లాకర్ ఉండటంతో కొన్ని బంగారు ఆభరణాలు బ్యాంకులో దాచుకున్నారు. మిగిలిన ఆభరణాల కోసం మరో లాకర్ అడగటంతో సోమవారం ఇస్తామని బ్యాంకు అధికారులు చెప్పినట్టు తెలుస్తోంది. ఈ ఆభరణాలను ఇంట్లో ఉంచి పుట్టపర్తి వెళ్లడం దొంగలకు అదనుగా మారింది. సంఘటనా స్థలాన్ని సీఐ చింతా రాంబాబు, పట్టణ ఎస్సై జి.శ్రీనివాసరావు పరిశీలించి బా«ధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. క్లూస్ టీంతో పాటు డాగ్ స్క్వాడ్ పరిశీలించి ఆధారాలు సేకరించారు. వాచ్మెన్ ఉన్నా.. సజ్జాపురంలోని హరిశ్చంద్ర టవర్స్‌లోకి ప్రవేశించా లంటే ముందు ఉన్న హరిశ్చంద్ర టవర్స్ ఫేజ్–1 పక్క నుంచి వెళ్లాలి. అపార్టుమెంట్‌కు వాచ్మెన్ ఉన్నా దుండగులు చాకచక్యంగా మెట్లదారి గుండా ప్రవేశించినట్టు తెలుస్తోంది. అయితే గతంలో ఇదే అపార్టుమెంట్లో పట్టణ పోలీసులు సమావేశం ఏర్పాటు చేసి చోరీలపై అవగాహన కల్పించి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించినా కెమెరాలు లేవు. ఇంట్లో అంతా నిద్రిస్తుండగా.. కొవ్వూరు: కొవ్వూరు మండలంలోని ఆరికిరేవులలో మల్లిపూడి పెరుమళ్లరావు అనే వ్యక్తి ఇంట్లో గురువా రం రాత్రి దొంగలు పడ్డారు. రెండు కాసుల బంగారు ఉంగరాలు, 15 తులాల వెండి సామగ్రి దోచుకుపోయారు. వివరాలిలా ఉన్నాయి.. పెరుమళ్లరావు తన చిన్నాన్నతో కలిసి రాత్రి కొవ్వూరు సినిమాకి వెళ్లారు. ఆ సమయంలో అతని తల్లిదండ్రులు ఇంట్లోనే నిద్రిస్తున్నారు. సినిమా చూసి రాత్రి 12.30 గంటల సమయంలో ఇంటికి తిరిగి వచ్చారు. ఉదయం నిద్రలేచి చూ సేసరికి బీరువా తలుపులు తెరిచి ఉండటంతో చోరీ జరిగినట్టు గుర్తించారు. బీరువాలోని రెండు బంగారు ఉంగరాలు, 15 తులాల వెండి సామగ్రి కనిపించడం లేదని పెరుమళ్లరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్సై డి.గంగాభవాని తెలిపారు. -
బాణసంచా పేలుడు.. దంపతుల సజీవదహనం
తణుకు: తణుకు మండలం దువ్వలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వేగిరౌతు మణికుమారి(50), సత్యనారాయణ(55) అనే భార్యా భర్తలు మంగళవారం సజీవదహనమయ్యారు. ఇంట్లో ఉంచిన బాణసంచా ఒక్కసారిగా పేలి తాటాకు ఇంటికి మంటలు అంటుకున్నాయి. దంపతులిద్దరూ బయటికి రాలేక ఇంట్లోనే సజీవ దహనమయ్యారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కౌన్సిలర్ ఉపఎన్నిక ఏకగ్రీవం
తణుకు : తణుకు పురపాలక సంఘం 3వ వార్డు ఉప ఎన్నిక ఏకగ్రీవమైంది. స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన గుబ్బల నాగలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు అధికారులు ప్రకటించారు. కౌన్సిలర్ పదవికి ఆరుగురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా శనివారం నామినేషన్ల ఉపసంహరణలో భాగంగా ఐదుగురు అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను ఉపసంహరించుకున్నారు. దీంతో నాగలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు తెలిపారు. ఎన్నికల కమిషన్దృష్టికి తీసికెళ్లిన అనంతరం ఆమె ఎన్నికను అధికారికంగా ప్రకటించనున్నట్టు ఎన్నికల అధికారి, మున్సిపల్ ఇన్‌ఛార్జి కమిషనర్ సీహెచ్ శ్రీనివాసరావు తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి కౌరు వెంకటేశ్వర్లు, గుబ్బల నాగలక్ష్మి, టీడీపీ నుంచి గుబ్బల శ్రీనివాసు, పంపన నాగపద్మారావు, కాంగ్రెస్ పార్టీ నుంచి పంపన సుబ్బారావు తమ నామినేషన్‌పత్రాలను ఉపసంహరించుకున్నారు. అంతకుముందు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ, టీడీపీ నాయకులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావుతో చర్చలు జరిపి ఆయన అంగీకారం తీసుకున్నారు. మృతి చెందిన గుబ్బల రామారావు కుటుంబ సభ్యులు ఎవరైనా ఇండిపెండెంట్‌గా నామినేషన్ దాఖలు చేస్తే ఏకగ్రీవానికి సహకరిస్తామని ఇచ్చిన మాటకు కట్టుబడిన కారుమూరి నామినేషన్ల ఉపసంహరణకు అంగీకారం తెలిపారు. ఎన్నికైన గుబ్బల నాగలక్షి్మని కారుమూరి వెంకట నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే వైటీ రాజా, మున్సిపల్ చైర్మన్ పరిమి వెంకటేశ్వరరావు, వైస్ చైర్మన్ మంత్రిరావు వెంకటరత్నం, మునిసిపల్ మాజీ చైర్మన్ డాక్టర్ దొమ్మేటి వెంకట సుధాకర్ తదితరులు అభినందించారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం : కారుమూరి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిబంధనలకు అనుగుణంగా ఇచ్చిన మాటకు కట్టుబడి కౌన్సిలర్ ఉప ఎన్నికలో ఏకగ్రీవానికి తమ వంతు సహకారం అందించామని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కారుమూరి నాగేశ్వరరావు పేర్కొన్నారు. శనివారం విలేకరులతో మాట్లాడుతూ గుబ్బల రామారావు మృతి చెందడంతో ఆయన కుటుంబ సభ్యుల నుంచి ఇండిపెండెంట్‌గా ఎవరైనా పోటీ చేస్తే తాము ఏకగ్రీవానికి సహకరిస్తామని గతంలో మాట ఇచ్చామన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి తమ అభ్యర్థులు ఉపసంహరించుకున్నారని చెప్పారు. తమ పార్టీ నుంచి నామినేషన్లు సమర్పించిన గుబ్బల నాగలక్షి్మకి 3వ వార్డు ఇన్చార్జిగా బాధ్యతలతో పాటు పార్టీ మహిళా ఉపాధ్యక్షురాలిగా నియమిస్తున్నట్టు కారుమూరి ప్రకటించారు. మునిసిపల్ మాజీ చైర్మన్ బలగం సీతారామ్, పట్టణ గౌరవాధ్యక్షుడు ఎస్ఎస్ రెడ్డి, సమన్వయకర్త కలిశెట్టి శ్రీనివాసు, మహిళా అధ్యక్షురాలు గుర్రాల నాగేంద్ర, సీడీసీ చైర్మన్ బోడపాటి పాల్గొన్నారు. -
నాణ్యమైన ఉత్పత్తులతోనే మేక్ ఇన్ ఇండియా
తణుకు టౌన్: నాణ్యమైన వస్తు ఉత్పత్తుల ద్వారానే మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియాగా అవుతుందని రాష్ట్ర ఆర్థిక సంఘం సభ్యుడు ప్రొఫెసర్ ఆర్.సుదర్శనరావు అన్నారు. తణుకు ఎస్‌కేఎస్‌డీ మహిళా కళాశాల అర్ధశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ‘మేక్ ఇన్ ఇండియా ఉపాధి అవకాశాలు–సవాళ్లు’ అంశంపై జరుగుతున్న జాతీయ సదస్సులో రెండో రోజు గురువారం ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. సరళీకరణ విధానాలతో ఉత్పాదక రంగం అభివృద్ధి చెందడం ద్వారా వృద్ధి రేటు పెరుగుతుందని ఆయన అన్నారు. ఇందుకు వ్యవసాయ రంగంలో వాటా కూడా పెరగాలన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఉత్పాదక రంగంలో ప్రోత్సాహం లభించినా నాణ్యమైన వస్తువులను ఉత్పత్తి చేసినప్పుడే మేక్ ఇండియా సవాళ్లను ఎదుర్కొనగలమని చెప్పారు. ఎస్డీ కళాశాల డైరెక్టర్ జె.చంద్రప్రసాద్ మాట్లాడుతూ ప్రపంచీకరణ నేపథ్యంలో నాణ్యతా ప్రమాణాలు పాటించనిదే మేక్ ఇన్ ఇండియా సాధ్యం కాదన్నారు. విదేశీ పెట్టుబడులతో సందేహస్పదమే.. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఎకనామిక్స్ చీఫ్ ఎడిటర్ పీవీ రమణ మాట్లాడుతూ ప్రపంచీకరణ నేపథ్యంలో 1947 నుంచి 2016 వరకూ ఎంత వృద్ధి సాధించామని పరిగణనలోకి తీసుకుంటే మేక్ ఇన్ ఇండియా ద్వారా వచ్చే విదేశీ పెట్టుబడులతో మేడ్ ఇన్ ఇండియా సాధిస్తామనేది సందేహస్పదమేనన్నారు. ప్రిన్సిపాల్ పి.అరుణ, కన్వీనర్ కె.రాధాపుష్పావతి, కళాశాల కోశాధికారి నందిగం సుధాకర్, బి.నాగపద్మావతి, రాజులపూడి శ్రీనివాస్, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ మల్లిన రాజేంద్రప్రసాద్, ఐటీ కళాశాల ప్రిన్సిపాల్ సత్యనారాయణరెడ్డి, యూనివర్సిటీలకు చెందిన రీసెర్చ్ స్కాలర్స్, అధ్యాపకులు పాల్గొన్నారు -
రూ.2.50 కోట్ల విలువైన బంగారం స్వాధీనం!
తణుకు : పెద్దనోట్ల రద్దు తర్వాత జిల్లాలో బంగారం కొనుగోళ్లపై దృష్టి సారించిన అధికారులు రూ.2.50 కోట్ల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. ఈనెల 9న తణుకు పట్టణంలో కస్టమ్స్, సెంట్రల్ ఎక్సైజ్, సర్వీస్ ట్యాక్స్ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించినట్టు సమాచారం. పలువురు రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఇళ్లలో సోదాలు నిర్వహించినట్టు తెలుస్తోంది. ఓ వ్యాపారికి చెందిన బినామీ ఇంటిపై దాడిచేసి సుమారు రూ.2.50 కోట్ల విలువైన బంగారం బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఆ బంగారం తనది కాదని, పట్టణానికి చెందిన రియల్ వ్యాపారిది అని ఆ బినామీ వ్యక్తి చెప్పడంతో అధికారులు ఓ వ్యాపారి ఇంట్లో సోదాలు నిర్వహించారు. బంగారం విషయమై వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని కోరినట్టు సమాచారం. -
పంటకు తంటా
వంతులవారీ విధానంతో కష్టాలు చేలకు నీరందక అన్నదాతల అవస్థలు దువ్వ చానల్లో పేరుకుపోయిన కర్ర నాచు తణుకు టౌన్ : వంతులవారీ విధానం రైతులకు కష్టాలు తెచ్చిపెడుతోంది. గోదావరిలో పూర్తిస్థాయిలో నీరు అందుబాటులో లేకపోవడంతో జల వనరుల శాఖ అధికారులు వంతులవారీ విధానంలో కాలువలకు నీరందిస్తున్నారు. కాలువల్లో కర్ర నాచు పెరిగిపోవడం, నీటిమట్టాలు దిగువ స్థాయిలో ఉండటంతో దాళ్వా పంటకు వంతు సమయంలోనూ నీరందటం లేదు. ముఖ్యంగా అత్తిలి, జీ అండ్ వీ కెనాల్ ఆయకట్టు పరిధిలో పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. తణుకు నియోజకవర్గంలో దువ్వ చానల్ ద్వారా తణుకు మండలం దువ్వ, అత్తిలి మండలం వరిఘేడు, తిరుపతిపురం, బి.కొందేపాడు, ఎగువన ఉండ్రాజవరం మండలంలోని పసలపూడి, సూర్యారావుపాలెం ఆయకట్టు పొలాలకు సాగునీరు అందటం లేదు. ఈ కాలువకు ఇచ్చిన వంతు సమయంలో అతి స్వలంగానే చేలకు నీరు వచ్చింది. జనవరి 27నుంచి వంతు ముగియడంతో ఈ కాలువ ఆయకట్టు పరిధిలోని చేలు తడారి ఎండిపోతున్నాయి. కర్ర నాచుతో అవస్థలు సాగుకు సమాయత్తం కార్యక్రమం పేరిట పశ్చిమ డెల్టాలో పలు కాలువల్లో పూడిక తొలగింపు పనులు చేపట్టినా దువ్వ కాలువను పూర్తిగా వదిలేశారు. పూడిక పేరుకుపోవడం, కర్రనాచు పెరగడంతో ఈ కాలువలో నీటి ప్రవాహం ముందుకు సాగడం లేదు. ఫలితంగా శివారు ప్రాంతాలైన వరిఘేడు, తిరుపతిపురం, బి.కొండేపాడు ఆయకట్టులోని పొలాలకు నీరందక ఎండుతున్నాయి. ఽ రైతులపైనే భారం పూడిక, కర్రనాచు తొలగింపు పనులను జల వనరుల శాఖ చేపట్టాల్సి ఉండగా.. అధికారులు గాలికొదిలేశారు. ప్రజాప్రతినిధులు సైతం ఈ విషయాన్ని పట్టించుకోలేదు. దిక్కులేని పరిస్థితుల్లో వరిఘేడు, తిరుపతిపురం, బి.కొండేపాడు నీటి సంఘాల బాధ్యుల ఆధ్వర్యంలో సుమారు 500 మంది రైతులు కాలువలోని కర్రనాచును స్వచ్ఛందంగా తొలగించే పనులకు శ్రీకారం చుట్టారు. పసలపూడిలో గొడిచర్ల లాకుల నుంచి ఈ పనులు చేపట్టారు. దువ్వ, తిరుపతిపురం, వరిఘేడు, బి.కొండేపాడు గ్రామాలకు చెందిన రైతులు వ్యయప్రయాసలతో కర్ర నాచు తొలగింపు పనుల్లో నిమగ్నమయ్యారు. డెల్టాలో నవంబర్‌లో చేపట్టిన కాలువల తవ్వకం, నాచు తొలగింపు పనులను ఈ కాలువ పరిధిలో చేయకపోవడం వల్ల తమకు ఈ కష్టాలొచ్చాయని రైతులు వాపోతున్నారు. ఈ కాలువలో పనులు చేపట్టకపోవడం వల్ల సుమారు 5 వేల ఎకరాల్లో వరి పంట దెబ్బతినే పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారు. వరినాట్లు పూర్తిచేసి నెల రోజులైనా ఇప్పటికీ మొదటి విడత ఎరువులు వేయలేదని, ప్రస్తుతం రెండవ విడత ఎరువులు వేయాల్సి ఉన్నా నీరు సక్రమంగా అందకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఆందోళన చెందుతున్నారు. ఓ వైపు చేలు ఎండిపోవడం, మరోవైపు కలుపు పెరిగిపోవడంతో పంటల్ని కాపాడుకునేందుకు అంతా కలిసి కాలువను ప్రక్షాళన చేసే పనుల్లో నిమగ్నమయ్యారు. చేలు ఎండిపోతున్నాయ్ వరినాట్లు వేసి నెల రోజులు గడుస్తున్నా కొన్ని చేలలో మొదటి విడత ఎరువులు చల్లలేదు. కొన్ని పొలాల్లో ఎరువులు వేసినా.. సాగు నీరందక కలుపు విపరీతంగా పెరిగిపోయింది. మొదట్లోనే ఈ కాలువలో పూడిక తీయిస్తే ఈ రోజున ఇబ్బందులు వుండేవి కాదు. బోడపాటి వెంకట సూర్యనారాయణ, నీటి సంఘం డైరెక్టర్, వరిఘేడు, అత్తిలి మండలం నీరందట్లేదు వరి చేలకు సాగు నీరందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. దాళ్వా పంటకు ఇప్పుడే ఇలా వుంటే మున్ముందు ఇంకెన్ని కష్టాలు పడాలోనని భయంగా ఉంది. సాగు నీటి కోసం రాత్రి పగలు తేడా లేకుండా కాలువ గట్ల వెంట తిరిగినా ఫలితం ఉండటం లేదు. దువ్వ చానల్లో నీటిమట్టం తక్కువగా రావడంతో చేలకు నీరు సరిపోవడం లేదు. కాలువలో పెరిగిపోయిన కర్ర నాచు వల్ల నీటి ప్రవాహం ముందుకు సాగడం లేదు. దొంగ వెంకటేశ్వరరావు, నీటి సంఘం డైరెక్టర్, తిరుపతిపురం, అత్తిలి మండలం దువ్వ కాలువపై నిర్లక్ష్యం వరి పంటకు సాగు నీరందించే విషయంలో అధికారులు దువ్వ కాలువను నిర్లక్ష్యం చేస్తున్నారు. వంతులవారీ విధానంలో నీరిచ్చనా.. నాలుగు రోజులుగా నీటిమట్టం పూర్తిగా తగ్గిపోయింది. మొదటి నుంచీ ఈ కాలువలో పూర్తిస్థాయి నీటి ప్రవాహం లేదు. పొలాలు అరకొరగానే తడుస్తున్నాయి. కొన్నిచోట్ల బీటలు వారుతున్నాయి. అధికారులు స్పందించి కాలువలో ఉన్న కర్ర నాచును పూర్తి స్థాయిలో తొలగించాలి. అరిగెల బాబి, వైఎస్సార్ సీపీ నాయకుడు, దువ్వ సాగు ఆలస్యమవుతుందని.. దువ్వ చానల్లో పేరుకుపోయిన కర్ర నాచును తొలగించడానికి.. కాలువ తవ్వడానికి ప్రతిపాదనలు చేశాం. అయితే, సాగు ఆలస్యమవుతుందని రైతులు అభ్యంతరం చెప్పడంతో ఆ పనులు చేపట్టలేదు. ప్రస్తుత వంతులవారీ విధానంలో నీటిమట్టం తగ్గడంతో శివారు పొలాలకు సాగు నీరందడం కష్టంగా ఉంది. రైతులు కర్ర నాచు తొలగించుకుంటున్నారు కాబట్టి ఇబ్బందులు తొలగిపోతాయి. జీఎస్ హరికిషన్, ఇరిగేషన్ ఏఈ, తణుకు -
ప్రకృతి వ్యవసాయంతోనే మంచి ఆహారం
తణుకు టౌన్ : ప్రకృతి వ్యవసాయంలో రసాయనాలకు బదులుగా కషాయాలతో కీటకాలను నిర్మూలించడం ద్వారా మంచి ఆహార పదార్థాలను అందించవచ్చని గుంటూరు రైతునేస్తం ఫౌండేషన్ అధ్యక్షుడు వై.వెంకటేశ్వరరావు చెప్పారు. మంగళవారం ఎస్‌కేఎస్‌డీ మహిళా కళాశాల లైఫ్ సైన్స్ విభాగం ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయంపై రాష్ట్రస్థాయి సదస్సు జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయంలో ఆవు ప్రధాన భూమిక కలిగి ఉంటుందని, ఒక ఆవుతో ఐదు ఎకరాలను సాగు చేయవచ్చన్నారు. ఈ విధానంలో ఎకరానికి 65 నుంచి 70 బస్తాల ధాన్యాన్ని పండించవచ్చన్నారు. ప్రకృతి వ్యవసాయంలో ప్రతి రోజూ రైతు పంటను పర్యవేక్షిస్తూ ఉండాలన్నారు. ఈ విధానంలో పండించిన పంటను కూడా రైతే స్వయంగా మార్కెటింగ్ చేసుకోవడం ద్వారా లాభాలను పొందవచ్చని చెప్పారు. ప్రకృతి వ్యవసాయంలో పండిన పంటలను కొనుగోలు చేసేందుకు ఇటీవల విజయవాడలో ఒక సొసైటీ ఏర్పాటు చేసినట్టు వెంకటేశ్వరరావు తెలిపారు. గుంటూరులో తమ ఫౌండేషన్ ద్వారా ప్రకృతి వ్యవసాయంపై ప్రతి ఆదివారం రైతులకు శిక్షణ ఇస్తున్నామన్నారు. సదస్సుకు అధ్యక్షత వహించిన చిట్టూరి సుబ్బారావు మాట్లాడుతూ ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించాలనే లక్ష్యంతో ఎరువులు, పురుగు మందులను ఎక్కువగా ఉపయోగించడం వల్ల ఆహార పదార్థాలు కల్తీ అవుతున్నాయన్నారు. ప్రకృతి వ్యవసాయ నిపుణుడు అశోక్‌కుమార్ మాట్లాడుతూ విచ్చలవిడిగా రసాయనాలు వాడటం వల్ల భూములు సారాన్ని కోల్పోయాయన్నారు. వాటిని మళ్లీ వృద్ధి చేసేందుకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ వారు పరిశోధనలు చేస్తున్నట్టు తెలిపారు. మదనపల్లి ప్రకృతి వనం వ్యవస్థాపకులు ఎంసీవీ ప్రసాద్ మాట్లాడుతూ ఆరోగ్యంగా ఉండాలంటే ఫాస్ట్‌ఫుడ్‌కు దూరంగా ఉండాలన్నారు. నువ్వులు, బెల్లం, వేరుశనగ, జొన్నలు, సజ్జలు ఎక్కువ ఆహారంగా తీసుకోవాలన్నారు. ప్రకృతి వ్యవసాయ రైతు భూపతిరాజు రామకృష్ణంరాజు మాట్లాడుతూ జిల్లాలోని నాచుగుంటలో చేపట్టిన ప్రకృతి వ్యవసాయం ద్వారా ఎకరానికి సంవత్సరానికి రూ.72,500 లాభం ఆర్జిస్తున్నట్టు చెప్పారు. ఈ సదస్సులో రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన 110 మంది రైతులు పాల్గొన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి.అరుణ, ఏవో డాక్టర్ డాక్టర్ డి.సుబ్బారావు, కళాశాల కమిటీ సభ్యురాలు చిట్టూరి సత్య ఉషారాణి, ప్రిన్సిపాల్ ఎం.రాజేంద్రప్రసాద్, వీవీవీ సత్యనారాయణరెడ్డి, బి.నాగపద్మావతి, కె. రాధాపుష్పావతి పాల్గొన్నారు. -
ఆటోవాలా.. ఇలాగైతే దివాళా
సర్కారు తీరుపై ఆటోవాలాలు సమర శంఖం పూరించారు. ఆటో కార్మికుల్ని సంక్షోభంలోకి నెట్టివేసే 894 జీవో రద్దు కోరుతూ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో సోమవారం ఆందోళనలకు దిగారు. ర్యాలీలు, ధర్నాలతో హోరెత్తించారు. కదం తొక్కిన ఆటో కార్మికులు తణుకు అర్బన్: ఆటో కార్మిక రంగాన్ని కుదేలుచేసే 894 జీవో రద్దుకోరుతూ తణుకులో ఆటో కార్మికులు కదం తొక్కారు. ఏఐటీయూసీ, సీఐటీయూ కార్మిక యూనియన్ల ఆధ్వర్యంలో పట్టణంలోని ఆర్వోబీ నుంచి ప్రారంభమైన ర్యాలీ మున్సిపల్ కార్యాలయం మీదుగా రవాణా శాఖ కార్యాలయం వద్దకు చేరుకుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఆటో కార్మికులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు ముజుఫర్ అహ్మద్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ సంస్థలకు కొమ్ముకాస్తూ కార్మికుల పొట్టకొడుతున్నాని విమర్శించారు. ఇటీవల ఆటో వాహనాలపై విపరీతంగా ఫీజులు పెంచడంతో పాటు ఫిట్నెస్ చేయించుకోని ఆటోలపై రోజుకు రూ.50 అపరాధ రుసుం విధించేలా జీవోను తీసుకురావడం దారుణమన్నారు. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోనాల భీమారావు మాట్లాడుతూ ఆటో కార్మికుల సంక్షేమానికి నిధులు కేటాయించకపోగా వారిని అప్పులపాలుచేసేలా జీవోలు తేవడం సరికాదన్నారు. ఆటో ఓనర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు పంగం రాంబాబు మాట్లాడుతూ జీవోల పేరుతో అధికారులు కార్మికులను వేధిస్తే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఏఐటీయూసీ తణుకు ఏరియా నాయకులు బొద్దాని నాగరాజు, వైస్సార్ సీపీ ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కౌరు వెంకటేశ్వర్లు, సీఐటీయూ నాయకులు పీవీ ప్రతాప్, కేతా గోపాలన్, సబ్బిత లాజర్, పైబోయిన సత్యనారాయణ తదితరులు మట్లాడారు. అనంతరం మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్ నెక్కంటి శ్రీనివాస్‌కు నాయకులు, కార్మికులు వినతిపత్రాన్ని అందజేశారు. తణుకు, తణుకు మండలం, ఉండ్రాజవరం, అత్తిలి, ఇరగవరం, పెరవలి, పెనుమంట్ర మండలాల నుంచి 30 యూనియన్లకు చెందిన ఆటో కార్మికులు భారీగా తరలివచ్చారు. -
హోదా హోరు
తణుకు టౌన్ : రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ తణుకులోని ప్రభుత్వ కళాశాలలకు చెందిన విద్యార్థినీ విద్యార్థులు నిరసన ర్యాలీ, మానవహారాలు నిర్వహించారు. శనివారం తణుకులోని శ్రీచిట్టూరి ఇంద్రయ్య మెమోరియల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన డిగ్రీ, పీజీ విద్యార్థులు, శ్రీనడింపల్లి వర్దనమ్మ తిరుపతిరాజు ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు చెందిన విద్యార్థినీ విద్యార్థులు పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ తణుకు రాష్ట్రపతి రోడ్డులోని వెంకటేశ్వర థియేటర్, నరేంద్ర సెంటర్ మీదుగా కేశవస్వామి గుడి వరకూ సాగింది. ప్రత్యేక హోదా బ్యానర్లు, నినాదాలతో సుమారు 400 మంది విద్యార్థులు ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తణుకులోని నరేంద్ర సెంటర్లో విద్యార్థినీ, విద్యార్థులు మానవహారం నిర్వహించారు. వెంకటేశ్వర థియేటర్ వద్ద, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎదుట విద్యార్థులు ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. పార్టీలకతీతంగా విద్యార్థులు ఉద్యమించాలి రాష్ట్రంలోని విద్యార్థుల భవిష్యత్ కోసం ప్రత్యేక హోదా అవసరమని, దానిని సాధించేందుకు రాష్ట్రంలోని విద్యార్థులంతా పార్టీలకతీతంగా పోరాడాలని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే, తణుకు నియోజకవర్గ సమన్వయకర్త, డాక్టర్ కారుమూరి వెంకట నాగేశ్వరరావు కోరారు. శనివారం ఆయన మాట్లాడుతూ దేశ భవిష్యత్ యువత చేతుల్లో ఉందని, మన రాష్ట్రంలో యువత ఉపాధికి అవసరమైన పరిశ్రమలు ఏర్పాటు చేస్తేనే సాధ్యమవుతుందని చెప్పారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఉంటే పరిశ్రమలు ఎక్కువగా స్థాపిస్తారని, తద్వారా యువతకు ఉపాధి దొరుకుతుందన్నారు. భవిష్యత్ తరాల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకునే వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక హోదా కోసం మొదటి నుంచీ పోరాటం చేస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలోని ప్రతిపక్షాలు చేస్తున్న పోరాటం అంతా యువత ఉపాధి, ఉద్యోగ అవకాశాల కోసమేనని చెప్పారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యార్థిలోకం ఏకం కావాలని కోరారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే వరకూ విద్యార్థులు పోరాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు బోడపాటి వీర్రాజు, న్యాయవాదులు కౌరు వెంకటేశ్వర్లు, వానపల్లి శ్రీనగేష్, ఎంఎం రావు, కడియాల సూర్యనారాయణ, అంబటి రాఘవ, వి.సీతారామ్ తదితరులు పాల్గొన్నారు. -
చోరీ బంగారం రికవరీలో రగడ
తణుకు : చోరీకి గురైన బంగారం రికవరీలో రగడ జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. విశాఖపట్నానికి చెందిన ఓ మహిళా నిందితురాలు తాను చోరీ చేసిన సుమారు 300 గ్రాముల బంగారాన్ని తణుకు పట్టణంలోని సురేంద్ర జ్యూయలరీలో మూడునెలల క్రితం తాకట్టు పెట్టింది. ఆమెను అదుపులోకి తీసుకున్న విశాఖ పోలీసులకు ఈ విషయాన్ని చెప్పింది. దీంతో ఈనెల 18న విశాఖపట్నం నుంచి వచ్చిన పోలీసులు 150 గ్రాముల బంగారాన్ని రికవరీ చేశారు. మళ్లీ సోమవారం రాత్రి వచ్చి మిగిలిన 150 గ్రాముల బంగారాన్ని అప్పగించాలని పట్టుబట్టారు. దీంతో షాపు యజమాని వాగ్వాదానికి దిగారు. గతంలోనే రికవరీ చేసి తీసుకెళ్లారు కదా మళ్లీ ఎలా ఇవ్వగలమని ప్రశ్నించారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. సీఐ సీహెచ్ రాంబాబాబు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దేందుకు యత్నించారు. ఇదిలా ఉంటే తమ వద్ద తాకట్టు పెట్టింది 35 గ్రాములేనని బంగారంషాపు యజమాని చెబుతుండటం కొసమెరుపు. ఈ సమయంలో పోలీసులకు వ్యతిరేకంగా స్థానిక బంగారు దుకాణాల యజమానులు నినాదాలు చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. సురేంద్ర బంగారు నగల దుకాణం యజమానిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. -
చిత్రలేఖనంలో బంగారు పతకం
తణుకు : ఇటీవల గుంటూరులో నిర్వహించిన రాష్ట్రస్థాయి చిత్రలేఖనం పోటీల్లో పట్టణానికి చెందిన రాయసం రాజ్యలక్ష్మి సంగీత నృత్య కళాశాలకు చెందిన విద్యార్థి గంటా వెనీషా శ్రీ తన్మయ బంగారు పతకం సాధించింది. క్రియేటివ్ ఫైన్ ఆర్ట్స్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల్లో విజయం సాధించినట్టు ప్రిన్సిపాల్ భమిడి కమలాదేవి తెలిపారు. విద్యార్థికి శిక్షణ ఇచ్చిన అధ్యాపకురాలు సీహెచ్వైఎన్ లక్ష్మి, విద్యార్థినిని ప్రిన్సిపాల్ తదితరులు అభినందించారు. -
ఆంధ్రా బిర్లా ముళ్లపూడి విగ్రహావిష్కరణ
తణుకు : పశ్చిమగోదావరి జిల్లా తణుకు మునిసిపల్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన దివంగత పారిశ్రామికవేత్త, ఆంధ్రాబిర్లా డాక్టర్ ముళ్లపూడి హరిశ్చంద్రప్రసాద్ కాంస్య విగ్రహాన్ని రాష్ట్ర శాసనసభాపతి డాక్టర్ కోడెల శివప్రసాద్ ఆదివారం ఆవిష్కరించారు. మునిసిపల్ చైర్మన్ డాక్టర్ దొమ్మేటి వెంకటసుధాకర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో స్పీకర్ మాట్లాడుతూ ఎంతో ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపిన ముళ్లపూడి ఎందరికో మార్గదర్శి అని కొనియాడారు. కార్యక్రమంలో రాష్ట్ర స్త్రీశిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ నన్నపనేని రాజకుమారి, ఎమ్మెల్యేలు ఆరిమిల్లి రాధాకృష్ణ, వి.శివరామరాజు, పితాని సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
వ్యాపారులతో ఎస్బీఐ అధికారుల కుమ్మక్కు
► ఒకేరోజు రూ. 2.49 కోట్లు.. ► నిబంధనలకు విరుద్ధంగా బ్యాంక్ నుంచి విత్‌డ్రా ► వ్యాపారులతో ఎస్బీఐ అధికారుల కుమ్మక్కు ► ప.గో. జిల్లా తణుకులో బయటపడిన నిర్వాకం ► ఏజీఎంసహా ఐదుగురు ఉద్యోగులు, మరో 9 మందిపై సీబీఐ కేసు ► నిందితుల ఇళ్లల్లో సోదాలు.. ► రూ.2.11 లక్షలు స్వాధీనం సాక్షి, విశాఖపట్నం: పెద్ద నోట్ల రద్దు తర్వాత బ్యాంకుల్లో ఉన్న నగదును విత్‌డ్రా చేసుకోవాలంటే సవాలక్ష నిబంధనలు, పరిమితులతో దేశవ్యాప్తంగా జనం అల్లాడారు. కానీ ఆ వ్యాపారులకు అలాంటి నిబంధనలు, పరిమితులు అడ్డురాలేదు. బ్యాంకు అధికారుల సహకారంతో ఒకేరోజు ఏకంగా రూ. 2.49 కోట్లు విత్‌డ్రా చేసుకున్నారు. ఈ ఉదంతం పశ్చిమగోదావరి జిల్లా తణుకు స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) శాఖలో చోటు చేసుకుంది. కొందరు వ్యాపారులతో బ్యాంకు అధికారులు కుమ్మకై నిబంధనలకు విరుద్ధంగా విత్ర్‌డాకు సహకరించారు. ఈ వ్యవహారాన్ని సీబీఐ పసిగట్టింది. తప్పుచేసిన ఐదుగురు బ్యాంకు అధికారులతోపాటు 8 మంది వ్యాపారులపై కేసు నమోదు చేసింది. వివరాల్ని సీబీఐ ఎస్పీ ఆర్.గోపాలకృష్ణ బుధవారం వెల్లడించారు. కేంద్రం రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేశాక నగదు ఉపసంహరణపై కొన్ని పరిమితులు విధించడం తెలిసిందే. అయితే తణుకు ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ ఏజీఎం కె.వి.కృష్ణారావు, అసిస్టెంట్ మేనేజర్ ఎస్.బాలాజీ, డిప్యూటీ మేనేజర్లు జి.ఇజ్రాయిల్‌రాజు, ఎల్.వి.నవీన్, రామచంద్రరాజులు ఈ నిబంధనలను తుంగలో తొక్కారు. డబ్బు ఆశతో అడ్డదారి తొక్కారు. శ్రీ రామకృష్ణ రా అండ్ పార్బాయిల్డ్ రైస్‌మిల్, పట్టాభి ఆగ్రో ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, విజయశ్రీ ఫుడ్స్, గౌతమ్ కన్స్ట్రక్షన్స్, మహేశ్వరి కోకోనట్ కంపెనీ, రవళి స్పెన్సర్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇండియన్ హెయిర్ లిమిటెడ్, హేమాద్రి రైస్‌మిల్, నిషి ఎగ్ పౌల్ట్రీ ప్రొడక్ట్ ప్రైవేట్ లిమిటెడ్‌లకు చెందిన రూ.2.49 కోట్ల ధనాన్ని ఒక్కరోజులో విత్‌డ్రా చేయించారు. విషయం సీబీఐకి చేరడంతో ప్రాథమిక విచారణ జరిపి నిర్ధారించుకున్నారు. అనంతరం మొత్తం 14 మందిపై కేసు నమోదు చేశారు. నిందితుల నివాసాల్లో సోదాలు నిర్వహించి పలు డాక్యుమెంట్లు, రూ.2.11 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. వీరేగాక మరికొందరు ప్రభుత్వాధికారులూ నిబంధనలకు విరుద్ధంగా ఇదే బ్రాంచ్‌లో నగదు ఉపసంహరణ చేసుకున్నట్లు సీబీఐ గుర్తించింది. ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐ లోతుగా విచారణ జరుపుతోంది. -
బ్యాంకుల మెడకు ఆర్బీఐ ఉచ్చు
తణుకు : బ్యాంకు అధికారుల మెడకు ఆర్బీఐ ఉచ్చు బిగుసుకుంటోంది. తణుకు ఎస్బీఐ కేంద్రంగా సాగిన అక్రమ లావాదేవీలు ఇటీవల వెలుగు చూడగా.. కీలక బాధ్యుడిగా భావించి అసిస్టెంట్ జనరల్ మేనేజర్ కేవీ కృష్ణారావుపై వేటు వేసిన ఆర్బీఐ అధికారులు తనిఖీలను ముమ్మరం చేశారు. సోమవారం తణుకు పట్టణంలో విస్తృతంగా సోదాలు నిర్వహించారు. 5 బృందాలుగా విడిపోయి సోమవారం వేకువజామునుంచి సోదాలు చేపట్టారు. కొందరు బ్యాంకు మేనేజర్లు ఇళ్లపైనా దాడులు నిర్వహించారు. తణుకు మండలం వేల్పూరు గ్రామానికి చెందిన ఒక బ్యాంక్ మేనేజర్ నివాసంలో అధికారులు గంటల కొద్దీ సోదాలు నిర్వహించి వారినుంచి వాంగ్మూలం సేకరించారు. బొమ్మల వీధిలో నివాసం ఉంటున్న మరో బ్యాంకు మేనేజర్ నివాసంలోనూ తనిఖీలు నిర్వహించిన అధికారులు ఆయనను తమతో తీసుకెళ్లినట్టు విశ్వసనీయ సమాచారం. తణుకు ఎస్బీఐ శాఖలోని కొందరు సిబ్బందిని సైతం సోమవారం పొద్దుపోయేవరకు విచారించినట్టు తెలుస్తోంది. సోదాలకు వచ్చిన అధికారులు మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు. -
బ్యాంకుల్లో కొనసాగుతున్న సోదాలు
అక్రమ లావాదేవీలపై కూ ఇద్దరు ఎమ్మెల్యేల పాత్రపై ఆరా తణుకు : పాతనోట్ల మార్పిడి వ్యవహారం నేపథ్యంలో ఆర్బీఐ అధికారులు బ్యాంకుల్లో సోదాలు కొనసాగిస్తున్నారు. ఈ తనిఖీల్లో అక్రమార్కుల వివరాలు బయటపడుతున్నట్టు సమాచారం. ఈ వ్యవహారంలో తణుకు ఎస్బీఐ ఏజీఎం కృష్ణారావుపై సస్పెన్షన్ వేటు వేసిన ఆర్బీఐ అధికారులు తాజాగా తణుకులోనే మరో రెండు జాతీయస్థాయి బ్యాంకుల్లోనూ అవకతవకలు జరిగినట్టు గుర్తించినట్టు సమాచారం. వీటిల్లోనూ వారంగా తనిఖీలు చేస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి సీసీ ఫుటేజీలను స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. ఇద్దరు ఎమ్మెల్యేల పాత్రపై ఆరా ఎస్బీఐ ఏజీఎం సస్పెన్షన్ వ్యవహారం వెనుక పెద్దమొత్తంలో నల్లధనం తెల్లగా మారినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ వ్యవహారంలో పట్టణానికి చెందిన పలువురు ప్రముఖుల పేర్లు బయటకు రాగా, వీరితోపాటు ఇద్దరు ఎమ్మెల్యేల పాత్ర కూడా ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై ఆర్బీఐ అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. డెల్టా ప్రాంతానికి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు బినామీ పేర్లుతో ఖాతాలు తెరిచి వారి ద్వారా పెద్ద మొత్తంలో రూ. 500, రూ. 1000 నోట్లు మార్చినట్టు సమాచారం. ఈ వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరించిన ఇద్దరు బ్యాంకు మేనేజర్లపైనా ఆర్బీఐ అధికారులు నిఘా ఉంచినట్టు తెలుస్తోంది. వీరు సెలవుపై వెళ్లేందుకు యత్నించినా.. ఉన్నతాధికారులు మాత్రం ససేమిరా అన్నట్టు విశ్వసనీయ సమాచారం. -
రోడ్డు ప్రమాదంలో అంబులెన్స్ దగ్ధం
తాడేపల్లిగూడెం: ద్విచక్రవాహనాన్ని తప్పించబోయి డివైడర్‌ను ఢీకొన్న ఓ ప్రైవేటు అంబులెన్స్ ఒక్కసారిగా దగ్ధమైంది. ఈ ప్రమాదం పశ్చిమ గోదావరి జిల్లా పెద్దతాడేపల్లి శివారులో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. దాంతో అప్రమత్తమైన సిబ్బంది అంబులెన్స్‌లోని వారిని సురక్షితంగా కిందికి దించి మరో వాహనంలో వైద్య చికిత్స నిమిత్తం తణుకు తరలించారు. ఈ సంఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం సంభవించలేదని పోలీసులు తెలిపారు. కానీ ఈ ఘటనలో అంబులెన్స్ మాత్రం పూర్తిగా కాలిపోయింది. -
ఆటోలో మహిళ వద్ద 13 కాసుల బంగారం చోరీ
తణుకు : ఆటోలో ప్రయాణిస్తున్న ఓ మహిళ బ్యాగులో నుంచి బంగారు ఆభరణాలను గుర్తుతెలియని వ్యక్తులు కాజేసిన ఘటన తణుకులో మంగళవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. ఏలూరుకు చెందిన దొంగ నాగలక్ష్మి ఇటీవల బంధువుల ఇంటికి పోడూరు మండలం కవిటం వచ్చింది. మంగళవారం తిరుగు ప్రయాణంలో నాగలక్ష్మి కవిటంలో తణుకు వెళ్లే ఆటో ఎక్కింది. బంగారు ఆభరణాలు ధరిస్తే ఎవరైనా దొంగిలిస్తారన్న భయంతో 13 కాసుల బంగారు, 15 తులాల వెండి ఆభరణాలు బ్యాగులో పెట్టుకుంది. తణుకు బస్టాండు వద్ద ఆటో దిగిన ఆమె బ్యాగ్ కత్తిరించి ఉండటంతో అనుమానం వచ్చి తెరిచి చూసింది. బ్యాగులో ఉంచిన బంగారం, వెండి ఆభరణాలు కనిపించకపోవడంతో లబోదిబోమంటూ పట్టణ పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
తలుపులు మూసి ఉపన్యాసం
తణుకు: తెలుగుదేశం ప్రభుత్వం మహిళా సాధికారత కోసం కృషి చేస్తోందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పుకొచ్చారు. సోమవారం స్థానిక కమ్మ కల్యాణ మండపంలో నియోజకవర్గంలోని డ్వాక్రా గ్రూపులకు రెండో విడత పెట్టుబడి నిధి రూ. 13.65 కోట్లు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మహిళలను ఉద్దేశించి ఉపన్యసించారు. తెలుగుదేశం ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబుపై ప్రశంసల జల్లు కురిపిస్తూ.. ఉండడంతో నీరసించిన మహిళలు బయటకు వెళ్లిపోయేందుకు యత్నించారు. అయితే సమావేశం అయ్యేంత వరకూ కదలడానికి వీల్లేదని స్థానిక నేతలు హుకుం జారీచేశారు. తలుపులు మూసివేశారు. దీంతో చేసేది లేక మహిళలు కూర్చుండిపోయారు. రెండు గంటల తర్వాత ప్రసంగం పూర్తికావడంతో హమ్మయ్య బతుకుజీవుడా.. అంటూ బయటపడ్డారు. అంతకు ముందు యనమల తణుకు పట్టణంలో రూ. 16 లక్షలతో నిర్మించిన స్వాగత ముఖద్వారం, హౌసింగ్ బోర్డు కాలనీలో స్విమ్మింగ్ పూల్, ఎనిమిదో వార్డులో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మునిసిపల్ చైర్మన్ డాక్టర్ దొమ్మేటి వెంకటసుధాకర్, ఏఎంసీ చైర్మన్ బసవా రామకృష్ణ, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వావిలాల సరళాదేవి తదితరులు పాల్గొన్నారు. ఆ తర్వాత పట్టణంలోని ఎనిమిదో వార్డలో మంత్రులు యనమల, చినరాజప్ప జనచైతన్య యాత్ర మొక్కుబడిగా నిర్వహించారు. వార్డులోని మహిళలను ఒక చోటకు చేర్చి వారితో మాట్లాడారు. అయితే వారికి సమస్యలను చెప్పుకునే అవకాశం ఇవ్వలేదు. దీంతో మహిళలు అసహనం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే హౌసింగ్‌బోర్డు కాలనీలో ప్రారంభించిన స్విమ్మింగ్ పూల్‌లో నీళ్లు పసర్లు తేలి ఉన్నాయని, ఇలా అయితే ఎలా అని మంత్రి యనమల మునిసిపల్ కమిషనర్‌ను ప్రశ్నించారు. పచ్చరంగులో టైల్స్ వేయించారా అంటూ ఛమత్కరించారు. -
తణుకులో బంగారు బిస్కెట్లు స్వాధీనం
తణుకు: పెద్ద నోట్ల రద్దు తర్వాత బంగారు వ్యాపారులపై కస్టమ్స్ అధికారులు నిఘా పెంచారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో ఓ బంగారు వ్యాపారి ఇంట్లో సోదాలు నిర్వహించిన కస్టమ్స్ అధికారులు 6 బంగారు బిస్కెట్లు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. స్వాధీనం చేసుకున్న బిస్కెట్ల విలువ సుమారు రూ. 17,80,000 ఉంటుందని అధికారులు తెలిపారు. -
‘గోల్డ్’ స్ట్రైక్స్
తణుకు : పెద్ద నోట్ట రద్దుతో కుబేరులకు ఊపిరి ఆడటం లేదు. దాచుకున్న నల్లధనాన్ని మార్చేందుకు బంగారం కొనుగోళ్లపై దృష్టి సారించారు. సందట్లో సడేమియా అన్నట్టుగా వ్యాపారులు సైతం ప్రభుత్వానికి లెక్క చూపని బంగారాన్ని వదిలించుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఇలాంటి వ్యవహారాలపై దృష్టి సారించిన కస్టమ్స్, టాస్క్‌పోర్స్, ఆదాయ పన్ను శాఖల అధికారులు ముప్పేట దాడులకు దిగుతున్నారు. తణుకు పట్టణంలోని వేల్పూరు రోడ్డులో బంగారాన్ని కరిగించే ఇద్దరు వ్యక్తుల నుంచి శనివారం రాత్రి సుమారు కేజీ బంగారం స్వాధీనం చేసుకున్న అధికారులు, ఆదివారం కూడా దాడులను కొనసాగించారు. పలు దుకాణాలతోపాటు, కొందరు వ్యక్తుల ఇళ్లల్లో తనిఖీలు చేశారు. ఓ వ్యక్తి నుంచి రూ.17.80 లక్షల విలువ చేసే 6 బంగారం బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. నాలుగు రోజులుగా తణుకులోనే.. తణుకు పట్టణంలో నల్లధనం మార్పిడి, బంగారం కొనుగోళ్లపై దృష్టి సారించిన వివిధ శాఖల అధికారులు నాలుగు రోజులుగా తణుకులో మకాం వేసినట్టు తెలుస్తోంది. గుంటూరు జిల్లాకు చెందిన ఆదాయపు పన్ను శాఖ అధికారులు సామాన్యుల మాదిరిగా వీధుల్లో ఆటోల్లో తిరుగుతూ నల్లధనం ప్రవాహ మూలాలను వెతికే పనిలో నిమగ్నమయ్యారు. ఆదివారం పట్టణంలోని కొందరి నివాసాలకు వెళ్లి సోదాలు జరిపారు. ఇదిలా ఉంటే టీడీపీకి చెందిన ఓ వార్డు కౌన్సిలర్‌ను అదుపులోకి తీసుకున్న కస్టమ్స్ అధికారులు ఆయన నుంచి వాంగ్మూలం తీసుకుని విడిచిపెట్టినట్టు విశ్వసనీయ సమాచారం. శనివారం రాత్రి టాస్క్‌ఫోర్స్, ఐటీ శాఖ అధికారులు వేల్పూరు రోడ్డులోని ఒక దుకాణానికి వెళ్లి బంగారం కావాలని అడిగారు. అక్కడి వ్యాపారి సుమారు పది బంగారం బిస్కెట్లను బయటకు తీయడంతో దానికి లెక్కలు అడిగారు. నోరెళ్లబెట్టడంతో మహంతి శ్రీరాములు, కలిశెట్టి సూరిబాబు అనే యువకులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. వ్యాపారుల గుండెల్లో రైళ్లు కస్టమ్స్, టాస్క్‌ఫోర్స్, ఆదాయ పన్ను శాఖ అధికారులు తణుకులో మకాం వేయడంతో జిల్లాలోని బంగారం వ్యాపారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇన్నాళ్లు లెక్కలేని విధంగా వ్యాపారం చేసిన బంగారు బాబులు అధికారుల దాడులతో బెంబేలెత్తిపోతున్నారు. దీంతో అధిక శాతం వ్యాపారులు ఆదివారం దుకాణాలు తెరవలేదు. మరోవైపు సీసీ కెమెరాలు లేని దుకాణాల్లో బంగారు ఆభరణాలను కొందరు కొనుగోలు చేస్తున్నట్టు తెలుస్తోంది. వాటిని బంధులు, నమ్మకస్తుల వద్ద అనుమానం రాని ప్రాంతాల్లో ఉంచుతున్నట్టు సమాచారం. -
నీకెంత.. నాకెంత..?
–మార్కెట్లో ’వైట్ ఫైట్’ ప్రత్యామ్నాయాలపై నల్లదొరల దృష్టి –తణుకులోనే రూ. వందల కోట్లు! తణుకుః నిన్న మొన్నటి వరకు పెద్ద నోట్లు రూపంలో కూడబెట్టుకున్న నల్ల కుబేరులు ఇప్పుడు మోదీ దెబ్బతో కలుగులో ఎలక మాదిరిగా బయటకు వస్తున్నారు. తమ వద్ద మూలుగుతున్న నలుపును తెలుపు చేసుకునేందుకు ప్రత్యామ్నాయాలు వెదుకుతున్నారు. జిల్లాలో సుమారు రూ. 50 వేల కోట్లు మేర నల్లధనం మూలుగుతోందని సమాచారం. అయితే ఇదంతా ఇప్పుడు వైట్‌మనీ చేసుకునేందుకు ఇప్పటికే బ్రోకర్లను రంగంలోకి దించారు. నీకెంత... నాకెంత...? అంటూ బహిరంగంగానే బేరాలు కుదుర్చుకుంటున్నారు. నాదగ్గర రూ. 3 కోట్లు బ్లాక్ ఉంది... ఎంత వైట్ ఇస్తావ్...? ఎంత కమిషన్ కావాలి..? నాకెంత ఇస్తావ్..? అంటూ మధ్యవర్తుల సాయంతో ఇప్పుడు మార్కెట్లో ’వైట్ఫైట్’ మొదలు పెట్టారు. 20 నుంచి 30 శాతం వరకు కమిషన్‌తో పెద్ద ఎత్తున కరెన్సీ చేతులు మారుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. మరోవైపు తమ వద్ద ఉన్న బ్లాక్ మనీను ఎంత మేర బ్యాంకుల్లో వేసుకోవచ్చు...? మిగిలిన డబ్బును ఏం చేయాలంటూ కొందరు ఆడిటర్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. దీంతో జిల్లాలోని ఆడిటర్లు... వారి శిష్యులు సైతం బిజీ బిజీగా గడుపుతున్నారు. కనీసం ఫోనులో కూడా అందుబాటులోకి రావడం లేదు. ఖాతాల్లోకి చేరుతున్న డిపాజిట్లు... తమ వద్ద ఉన్న నల్లధనాన్ని ఇటీవల జీరో ఖాతాతో ప్రారంభించిన జన్‌ధన్ సేవింగ్ ఖాతాలను ఉపయోగించుకునేందుకు పావులు కదుపుతున్నారు. పాసు పుస్తకాలు కలిగిన పేద, మధ్యతరగతి వర్గాలను లక్ష్యంగా చేసుకుంటున్న కొందరు బడాబాబులు వారికి కమిషన్ ముట్టచెబుతూ వారిఖాతాల్లో జమ చేస్తున్నారు. ఆదాయపన్ను చెల్లించే వ్యాపారులు రూ. 10 నుంచి రూ. 20 లక్షల వరకు డిపాజిట్ చేసుకునే వెసులుబాటు ఉంది. ఇలాంటి వారి వివరాలు సైతం సేకరిస్తున్నట్లు సమాచారం. మరికొందరు రూ. 4 వేలు చిల్లర మార్చి ఇస్తే రూ. 200 నుంచి రూ. 300 వరకు కమిషన్ ఇస్తున్నారు. మరోవైపు నల్ల«ధనాన్ని కాపాడుకునే ప్రయత్నంలో కొందరు బంగారం కొనేందుకు మొగ్గు చూపుతున్నారు. నల్లధనం పరవళ్ల కారణంగా ఇప్పటికే బంగారం ధర రూ. 40 వేలకు చేరింది. ఇటీవల తణుకు పట్టణానికి చెందిన మహిళా రియల్ వ్యాపారి, బంగారం వ్యాపారికి మధ్య తలెత్తిన వివాదం రోడ్డెక్కిన హవాలా వ్యవహారంపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. ఇప్పటికే బంగారం వ్యాపారి లావాదేవీలపై ఐటీ శాఖ అధికారులు దృష్టి సారించనట్లు విశ్వసనీయ సమాచారం. తాజాగా అర్థరాత్రి సమయంలో కమర్షియల్ టాక్స్ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేసినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. మరోవైపు మహిళా వ్యాపారి వద్ద సైతం వందల కోట్లు మేర నల్లధనం మూలుగుతున్నట్లు తెలుస్తోంది. ఒకట్రెండు రోజుల్లో ఐటీ శాఖ అధికారులు దాడులు చేయవచ్చని తెలియడంతో ఒక ప్రయివేటు రంగ సంస్థకు చెందిన బ్యాంకు ద్వారా లావీదేవీలు చేసుకునేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
తణుకు: తణుకు పట్టణ పరిధిలోని 16వ నంబర్ జాతీయ రహదారిపై శనివారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందగా ఏడుగురు గాయపడ్డారు. పట్టణ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కృష్ణాజిల్లా తొట్లవల్లూరు మండలం తోడేలుదిబ్బ గ్రామానికి చెందిన లొక్కా వెంకటేశ్వరరావు కుటుంబసభ్యులు, బంధువులు మరో ఎనిమిది మంది రావులపాలెం మండలం మందపల్లి శనీశ్వరాలయానికి టాటా మేజిక్ వాహనంలో శుక్రవారం రాత్రి బయలుదేరారు. పట్టణ పరిధిలోని పాతటోల్గేటు సమీపంలోకి వచ్చేసరికి వాహనం అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెంకటేశ్వరరావు తండ్రి లొక్కా పూర్ణచంద్రరావు (60) అక్కడిక్కడే మృతి చెందగా వాహనంలో ప్రయాణిస్తున్న పడమటి కృష్ణారావు, పర్సా వెంకటేశ్వరరావు, పర్సా వరలక్ష్మి, సోలిశెట్టి నాంచాలమ్మ, గంగిశెట్టి అనురాధ, గంగిశెట్టి సాంబశివరా వు, లొక్కా విజయలక్ష్మి గాయపడ్డారు. పూర్ణచంద్రరావు మృతదేహానికి పోలీసులు పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. క్షతగాత్రులు తణుకు ప్రభుత్వాసుపత్రితోపాటు ప్రై వేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పట్టణ ఎస్సై జి.శ్రీనివాసరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
డయాలసిస్ యూనిట్ సేవలు ప్రారంభం
తణుకు: తణుకు ఏరియా ఆసుపత్రిలో లయన్స్ ఆధ్వర్యంలో వంక సత్యనారాయణ, నాగమణి డయాలసిస్ యూనిట్ సేవలు ప్రారంభించినట్లు ముఖ్యదాత, సెకండ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ వంక రవీంద్రనా«ద్ తెలిపారు. ఈ మేరకు శనివారం డయాలసిస్ కేంద్రాన్ని పరిశీలించి రోగులను పరామర్శించారు. తణుకు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న కిడ్నీ రోగులు వారి రక్తశుద్ధి కోసం ఈ నూతన కేంద్రానికి వచ్చి డయాలసిస్ చేయించుకుంటున్నారని చెప్పారు. అత్యాధునిక పది డయాలసిస్ యంత్రాలతో ఇటీవల లయన్స్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ విజయకుమార్‌రాజు చేతుల మీదుగా ఈ కేంద్రం ప్రారంభించినట్లు తెలిపారు. మిషన్లు అన్ని సక్రమంగా పని చేసి రోగులకు పూర్తి సంతృప్తి ఇచ్చే విధంగా ఈ కేంద్రాన్ని తీర్చిదిద్దుతామన్నారు. ఒక సారి డయాలసిస్ చేయించుకోవాలంటే రూ. 800 చెల్లిస్తే సరిపోతుందని ఇతర మందులు, పరికరాలు కూడా పూర్తిస్థాయిలో తగ్గింపు ధరల్లో తీసుకుంటామని వివరించారు. డయాలసిస్ చేయించుకునే రోగులు గతంలో ఏలూరు, భీమవరం వెళ్లేందుకు ప్రయాసపడేవారన్నారు. అయితే అధిక వ్యయప్రయాసలకయ్యే పని ఇక్కడ కేంద్రం ఉండటం కారణంగా సమయం వృధా కాకుండా తక్కువ ధరకు డయాలసిస్ పొందగలుతున్నారన్నారు. మునిసిపల్ మాజీ ఛైర్మన్ వంక రాజకుమారి రోగులందరినీ వ్యక్తిగతంగా పలకరించి డయాలసిస్ పొందుతున్నప్పుడు వారి అనుభవాలను తెలుసుకుని నిర్వహకులకు సూచనలు ఇచ్చారు. ఈ క ఆర్యక్రమంలో పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎం.బాబూరావు, డిస్ట్రిక్ట్ జిల్లా జిల్లా లయన్స్ నాయకులు దామెర రంగారావు, డాక్టర్ జీవీవీ సత్యనారాయణ, ఏలూరి శ్రీమన్నారాయణ, కల్లూరి త్రిమూర్తులు పాల్గొన్నారు -
నకిలీ నోట్లతో ఖంగుతింటున్న ప్రజలు
తణుకు టౌన్: కేంద్రప్రభుత్వం తీసుకున్న రూ. 500లు, వెయ్యి నోట్ల రద్దుతో పాత నోట్లను మార్పి సమయంలో బ్యాంక్‌ల వద్ద నకిలీ నోట్లుగా గుర్తించడంతో ప్రజలు ఖంగుతింటున్నారు. పెద్ద నోట్లను మార్పిడి చేసుకునేందుకు వచ్చిన ప్రజలకు నకిలీ నోట్లని బ్యాంక్ అధికారులు చెప్పడంతో నోట్లను కలిగిన వారు గత మూడు రోజులుగా బ్యాంక్‌లు వద్ద గుమిగూడుతున్న జన ంలో కొంతమంది తీసుకుకొచ్చిన నోట్లలో కొన్ని నకిలీ కావడంతో పెద్ద నోట్లను చిల్లరగా మార్చుకునేందుకు వచ్చిన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు రద్దుకు ముందే వివిద మార్గాలల్లో వచ్చిన నోట్లను ఇప్పుడు మార్పిడీ చేసే సమయంలో నకిలీవని తేలడం చాలా బాదగా వుందని పేర్కొంటున్నారు. ఈనెల 11వ తేదీ నుంచి బ్యాంక్ ఏటియంల నుంచి నగదు తీసుకునేందుకు వీలు కల్పిస్తామని చెప్పిన ప్రభుత్వం అందుకు పట్టణంలో మాత్రం ఇంకా ఏటీయం నుంచి నగదును విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదని వినియోగదారులు పేర్కొంటున్నారు. పాత నోట్లను వివిద ప్రభుత్వ పన్నులు, బిల్లులు చెల్లించవచ్చని ప్రభుత్వ ఆదేశాలున్నా అమలులో మాత్రం అందుకు విరుద్దంగా జరుగుతుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ముఖ్యంగా విద్యుత్ బిల్లులు, కుళాయి పన్నులు, ఇంటి పన్నుల వంటి చెల్లింపులలో రూ. 500,1000లను రౌండ్ ఫిగర్ల మొత్తాలనే తీసుకుంటున్నారు. రూ. 200, 300, 1200లు వున్న బిల్లులకు 500, 1000 తీసుకుని మిగిలిన మొత్తాను వచ్చేలకు అడ్వాన్సులు చూపిస్తున్నారని, చిల్లర అడిగితే బిల్లుల తీసుకోకుండా మీరే చిల్లర తెచ్చుకోండి తిరస్కరిస్తున్నారు. దీనితో తమకు మిగిలిన ఖర్చులకు డబ్బులు ఎలా? ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నోట్లు రద్దు చేసేముందు అందుకు ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు పేర్కొంటున్నారు. వారానికి రూ. 4 వేలు విత్ డ్రా చేసుకుని ఎలా బ్రతకాలని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొలం అమ్మితే వచ్చిన నోట్లే అయినా.. నెల క్రితం పొలం అమ్మగా వచ్చిన రూ వెయ్యి నోట్లలో మిగిలిన నోట్ల మార్చుకునేందుకు బ్యాంక్ వెళ్లే అందులో ఒకటి నకిలీదన్నారు. దీనితో ఏమీ చేయాలో తెలియడంలేదు. ఈసొమ్ము ఇప్పుడు తీసుకున్నది కాదు. పొలం అమ్మిన సొమ్మును ముగ్గురం పంచుకున్నాం. నాకు వాటాకు అన్ని రూ. 1000 నోట్లే వచ్చాయి. అందులో ఒక నోటు నకిలీదంటుందన్నారు. ఈనోటును బ్యాంక్ వారు తీసుకోమంటున్నారు. తణుకు పెద సత్యం, తణుకు. కొత్తనోటకూ చిల్లర కరువే ప్రభుత్వం ప్రవేశపెటì ్టన రూ. 2000, 500ల నోట్లకు మార్కెట్లో చిల్లర దొరకడం కష్టంగా వుంది. నోట్ల పెద్ద రద్దు చేసినప్పుడు మార్కెట్లో తగినంత చిల్లర వుండే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా రద్దు చేయడం ఎంత నష్టమో పెద్ద నోట్లను మార్కెట్లో విడుదల చేసే ముందు కూడా చిల్లరను విడుదల చేయడం అవసరం. కానీ ఈరెండు చేయకుండా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తుంది. ఎంఎస్ రామారావు, పెన్షన్ దారుడు, తణుకు. -
ఎరక్కపోయి వచ్చాము.. ఇరుక్కుపోయాము..
తణుకు అర్బన్ : పుణ్యం కోసం భగవంతుడి వద్దకు వెళితే పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని తణుకువాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం మంగళవారం అర్ధరాత్రి నుంచి రూ.500, రూ.1000 నోట్లు రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 4వ తేదీన తణుకు నుంచి కోడూరి మురళీకృష్ణ (గోల్డ్‌స్పాట్ మురళి), చిట్టూరి అచ్యుతరామ ప్రసాద్, వట్టికూటి నాగ మోహనరావు, ఫణి, సత్యప్రసాద్ కాశీకి వెళ్లారు. బుధవారం ఉదయం వారణాసిలో భగవంతుడిని దర్శించుకుని వచ్చే సందర్భంలో హోటల్లో రూ.500 నోటు చెల్లదని చెప్పడంతో విస్తుబోయినట్టు ఫోన్ ద్వారా మురళి, ఫణి ఇక్కడ బంధువులకు ఫోన్లో తెలిపారు. చిల్లర సమస్యతో కాశీలో చిక్కుకున్న వారి ఆవేదన వారి మాటల్లోనే.. ’రాత్రికి రాత్రే పెద్ద నోట్లు రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఇక్కడ తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ఆంధ్రప్రదేశ్ నుంచి వేల సంఖ్యలో తెలుగు వారు ఇక్కడకు వచ్చి ఉన్నారు, వారంతా ఆటో కిరాయిలు, హోటల్లో భోజనం కొనుగోలుకు చిల్లర లేక అవస్థపడుతున్నారు. రూ.500 నోటుకు రూ.200 తీసుకుని రూ.300 ఇవ్వమన్నా కుదరదంటున్నారు. కొనుక్కునే స్తోమత ఉన్నా చిల్లర మారక ఇబ్బందులు పడుతున్నాం. ఉన్న చిల్లర నోట్లు ఖర్చయి పోగా మా వద్ద ప్రస్తుతం రూ.500, రూ.1000 నోట్లు మాత్రమే మిగిలాయి. గురువారం మధ్యాహ్నానికి ముందుగానే ఫ్లైట్ బుక్ చేసుకున్నాం, కానీ అప్పటివరకు వాటర్ బాటిల్‌కు కూడా తికానా లేని పరిస్థితి. ప్రధానమంత్రి నియోజకవర్గమైన వారణాసిలో ప్రస్తుతం రూం తీసుకుని ఉన్నాం. పస్తులుండి ఫ్లైట్‌లో హైదరాబాద్‌కు చేరుకున్నా అక్కడ నుంచి రావడం కూడా కష్టం. ఏదో కరువు వచ్చినట్టుగా ఇక్కడంతా అల్లకల్లోలంగా ఉంది.’ -
లోకేష్‌ను అడ్డుకున్న బీసీ నేతలు
తణుకు : పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మునిసిపల్ చైర్మన్ డాక్టర్ దొమ్మేటి వెంకటసుధాకర్కు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ నెరవేర్చాలంటూ బీసీ సంఘాల నాయకులు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను బుధవారం అడ్డుకున్నారు. తణుకు నియోజకవర్గంలో పర్యటించేందుకు వచ్చిన ఆయన వేల్పూరు నుంచి అత్తిలి మార్గంలో వెళుతుండగా కేఎస్ గట్టు గ్రామం వద్ద అడ్డుకున్నారు. వెంకట సుధాకర్‌కు మునిసిపల్ చైర్మన్ పదవి కట్టబెట్టే సమయంలో రెండున్నరేళ్ల అనంతరం ఎమ్మెల్సీ పదవికి నామినేట్ చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. శెట్టిబలిజ వర్గం నుంచి ఆయనను ఎమ్మెల్సీ పదవికి నామినేట్ చేయాలని డిమాండ్ చేస్తూ లోకేష్ ఎదుట ఆందోళన చేపట్టారు. దీనిపై లోకేష్ వివరణ ఇస్తూ కొన్ని పార్టీలు కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయని ప్రతిపక్ష పార్టీపై ధ్వజమెత్తేందుకు లోకేష్ ప్రయత్నించగా, శెట్టిబలిజ సంఘం నాయకులు అడ్డుకున్నారు. దీనికి కులాలు, పార్టీల రంగు పులమవద్దని హితవు పలికారు. పార్టీ పెద్దలు అప్పట్లో ఇచ్చిన హామీని నెరవేర్చాలని మాత్రమే తాము డిమాండ్ చేస్తున్నామని స్పష్టం చేశారు. సాధ్యాసాధ్యాలను పరిశీలించి పార్టీ నాయకత్వం దృష్టికి తీసికెళతానని లోకేష్ హామీ ఇవ్వడంతో బీసీ నేతలు శాంతించారు. -
ఎరక్కపోయి వచ్చాము.. ఇరుక్కుపోయాము..
తణుకు అర్బన్ : పుణ్యం కోసం భగవంతుడి వద్దకు వెళితే పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని తణుకువాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం మంగళవారం అర్ధరాత్రి నుంచి రూ.500, రూ.1000 నోట్లు రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 4వ తేదీన తణుకు నుంచి కోడూరి మురళీకృష్ణ (గోల్డ్‌స్పాట్ మురళి), చిట్టూరి అచ్యుతరామ ప్రసాద్, వట్టికూటి నాగ మోహనరావు, ఫణి, సత్యప్రసాద్ కాశీకి వెళ్లారు. బుధవారం ఉదయం వారణాసిలో భగవంతుడిని దర్శించుకుని వచ్చే సందర్భంలో హోటల్లో రూ.500 నోటు చెల్లదని చెప్పడంతో విస్తుబోయినట్టు ఫోన్ ద్వారా మురళి, ఫణి ఇక్కడ బంధువులకు ఫోన్లో తెలిపారు. చిల్లర సమస్యతో కాశీలో చిక్కుకున్న వారి ఆవేదన వారి మాటల్లోనే.. ’రాత్రికి రాత్రే పెద్ద నోట్లు రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఇక్కడ తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ఆంధ్రప్రదేశ్ నుంచి వేల సంఖ్యలో తెలుగు వారు ఇక్కడకు వచ్చి ఉన్నారు, వారంతా ఆటో కిరాయిలు, హోటల్లో భోజనం కొనుగోలుకు చిల్లర లేక అవస్థపడుతున్నారు. రూ.500 నోటుకు రూ.200 తీసుకుని రూ.300 ఇవ్వమన్నా కుదరదంటున్నారు. కొనుక్కునే స్తోమత ఉన్నా చిల్లర మారక ఇబ్బందులు పడుతున్నాం. ఉన్న చిల్లర నోట్లు ఖర్చయి పోగా మా వద్ద ప్రస్తుతం రూ.500, రూ.1000 నోట్లు మాత్రమే మిగిలాయి. గురువారం మధ్యాహ్నానికి ముందుగానే ఫ్లైట్ బుక్ చేసుకున్నాం, కానీ అప్పటివరకు వాటర్ బాటిల్‌కు కూడా తికానా లేని పరిస్థితి. ప్రధానమంత్రి నియోజకవర్గమైన వారణాసిలో ప్రస్తుతం రూం తీసుకుని ఉన్నాం. పస్తులుండి ఫ్లైట్‌లో హైదరాబాద్‌కు చేరుకున్నా అక్కడ నుంచి రావడం కూడా కష్టం. ఏదో కరువు వచ్చినట్టుగా ఇక్కడంతా అల్లకల్లోలంగా ఉంది.’ -
రేపు జిల్లాకు లోకేష్ రాక
ఏలూరు (ఆర్ఆర్ పేట) : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు బుధవారం జిల్లాలో పర్యటించనున్నట్టు ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మంగళవారం రాత్రి తణుకు చేరుకుని బస చేస్తారని, 9వ తేదీ తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ నివాసంలో స్థానిక నాయకులతో సమావేశం నిర్వహిస్తాన్నారు. ఉదయం 9.30 గంటల నుంచి 10.30 గంటల వరకూ జిల్లాలో ప్రమాద బీమా పొందిన కార్యకర్తల కుటుంబాలతో సమావేశమౌతారని తెలిపారు. అనంతరం అత్తిలిలో జరిగే జనచైతన్య యాత్రలో పాదయాత్ర చేస్తారన్నారు. అనంతరం ఏలూరు సీఆర్ రెడ్డి కాలేజీలో యువచైతన్య యాత్రలో భాగంగా విద్యార్థులతో సమావేశమవుతారని పేర్కొన్నారు. సాయంత్రం టీడీపీ జిల్లా సమన్వయ కమిటీ సమావేశంలో పాల్గోనున్నారు. -
25న కుమ్మరి శాలివాహన సంఘం జిల్లా సమావేశం
తణుకుః కుమ్మరి శాలివాహన సంక్షేమ సంఘం జిల్లా సమావేశం ఈనెల 25న తణుకులో ఏర్పాటు చేసినట్లు జిల్లా మాజీ కార్యదర్శి బిరుదుకోట చింతన్న తెలిపారు. స్థానిక కష్ణా ఫంక్షన్ హాలులో నిర్వహించే ఈ సమావేశంలో జిల్లా కమిటీను ఎన్నుకోనున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు, ఫెడరేషన్ ఛైర్మన్ తుగ్గలి నాగేంద్ర విచ్చేస్తున్నందున్న జిల్లా కుమ్మరి శాలివాహన సంఘం నాయకులు, ఆయా మండలాల అధ్యక్షులు, కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు హాజరు కావాలని కోరారు.