నకిలీ నోట్లతో ఖంగుతింటున్న ప్రజలు
నకిలీ నోట్లతో ఖంగుతింటున్న ప్రజలు
Published Sat, Nov 12 2016 6:21 PM | Last Updated on Mon, Sep 4 2017 7:55 PM
తణుకు టౌన్: కేంద్రప్రభుత్వం తీసుకున్న రూ. 500లు, వెయ్యి నోట్ల రద్దుతో పాత నోట్లను మార్పి సమయంలో బ్యాంక్‌ల వద్ద నకిలీ నోట్లుగా గుర్తించడంతో ప్రజలు ఖంగుతింటున్నారు. పెద్ద నోట్లను మార్పిడి చేసుకునేందుకు వచ్చిన ప్రజలకు నకిలీ నోట్లని బ్యాంక్ అధికారులు చెప్పడంతో నోట్లను కలిగిన వారు గత మూడు రోజులుగా బ్యాంక్‌లు వద్ద గుమిగూడుతున్న జన ంలో కొంతమంది తీసుకుకొచ్చిన నోట్లలో కొన్ని నకిలీ కావడంతో పెద్ద నోట్లను చిల్లరగా మార్చుకునేందుకు వచ్చిన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు రద్దుకు ముందే వివిద మార్గాలల్లో వచ్చిన నోట్లను ఇప్పుడు మార్పిడీ చేసే సమయంలో నకిలీవని తేలడం చాలా బాదగా వుందని పేర్కొంటున్నారు. ఈనెల 11వ తేదీ నుంచి బ్యాంక్ ఏటియంల నుంచి నగదు తీసుకునేందుకు వీలు కల్పిస్తామని చెప్పిన ప్రభుత్వం అందుకు పట్టణంలో మాత్రం ఇంకా ఏటీయం నుంచి నగదును విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదని వినియోగదారులు పేర్కొంటున్నారు. పాత నోట్లను వివిద ప్రభుత్వ పన్నులు, బిల్లులు చెల్లించవచ్చని ప్రభుత్వ ఆదేశాలున్నా అమలులో మాత్రం అందుకు విరుద్దంగా జరుగుతుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ముఖ్యంగా విద్యుత్ బిల్లులు, కుళాయి పన్నులు, ఇంటి పన్నుల వంటి చెల్లింపులలో రూ. 500,1000లను రౌండ్ ఫిగర్‌ల మొత్తాలనే తీసుకుంటున్నారు. రూ. 200, 300, 1200లు వున్న బిల్లులకు 500, 1000 తీసుకుని మిగిలిన మొత్తాను వచ్చేలకు అడ్వాన్సులు చూపిస్తున్నారని, చిల్లర అడిగితే బిల్లుల తీసుకోకుండా మీరే చిల్లర తెచ్చుకోండి తిరస్కరిస్తున్నారు. దీనితో తమకు మిగిలిన ఖర్చులకు డబ్బులు ఎలా? ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నోట్లు రద్దు చేసేముందు అందుకు ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు పేర్కొంటున్నారు. వారానికి రూ. 4 వేలు విత్ డ్రా చేసుకుని ఎలా బ్రతకాలని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పొలం అమ్మితే వచ్చిన నోట్లే అయినా..
నెల క్రితం పొలం అమ్మగా వచ్చిన రూ వెయ్యి నోట్లలో మిగిలిన నోట్ల మార్చుకునేందుకు బ్యాంక్ వెళ్లే అందులో ఒకటి నకిలీదన్నారు. దీనితో ఏమీ చేయాలో తెలియడంలేదు. ఈసొమ్ము ఇప్పుడు తీసుకున్నది కాదు. పొలం అమ్మిన సొమ్మును ముగ్గురం పంచుకున్నాం. నాకు వాటాకు అన్ని రూ. 1000 నోట్లే వచ్చాయి. అందులో ఒక నోటు నకిలీదంటుందన్నారు. ఈనోటును బ్యాంక్ వారు తీసుకోమంటున్నారు.
తణుకు పెద సత్యం, తణుకు.
కొత్తనోటకూ చిల్లర కరువే
ప్రభుత్వం ప్రవేశపెటì ్టన రూ. 2000, 500ల నోట్లకు మార్కెట్‌లో చిల్లర దొరకడం కష్టంగా వుంది. నోట్ల పెద్ద రద్దు చేసినప్పుడు మార్కెట్లో తగినంత చిల్లర వుండే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా రద్దు చేయడం ఎంత నష్టమో పెద్ద నోట్లను మార్కెట్‌లో విడుదల చేసే ముందు కూడా చిల్లరను విడుదల చేయడం అవసరం. కానీ ఈరెండు చేయకుండా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తుంది.
ఎంఎస్ రామారావు, పెన్షన్ దారుడు, తణుకు.
Advertisement