
కేసు నమోదు చేసిన పోలీసులు
హైదరాబాద్: ఏటీఎంలో డబ్బులు డ్రా చేసి అందులోనే మూత్ర విసర్జన ఘటన పంజగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. రాజ్‌భవన్ రోడ్డులో ఆర్‌బీఎల్ బ్యాంక్ ఏటీఎం ఉంది. అందులో డబ్బులు డ్రా చేసేందుకు ఈనెల 10న వ్యక్తి వచ్చాడు. డబ్బులు డ్రా చేసిన తర్వాత ఏటీఎం డబ్బులు తీసుకునే ప్రాంతంలో మూత్ర విసర్జన చేశాడు.
దీంతో ఏటీఎం సెన్సార్ పాడయ్యింది. ఇటీవల ఏటీఎం పరిశీలించేందుకు ఆర్‌బీఎల్ బ్యాంక్ ఆపరేషన్స్ మేనేజర్ రవికుమార్ రాగా సెన్సార్ పని చేయడం లేదని గ్రహించాడు. దీంతో సీసీ కెమెరాలు పరిశీలించగా ఓ వ్యక్తి ఉద్ధేశపూర్వకంగా మూత్రవిసర్జన చేసినట్లు గుర్తించారు. ఈ మేరకు రవికుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment