
ఢిల్లీ: ఈపీఎఫ్‌వో చరిత్రలో తొలిసారిగా పీఎఫ్ విత్ డ్రా కోసం కేంద్రం సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. ఫోన్‌పే, గూగుల్‌పే వంటి యూపీఐ పేమెంట్స్, ఏటీఎంలలో ఈపీఎఫ్‌వో విత్‌డ్రా చేసుకునేలా ఉద్యోగులకు అవకాశం కల్పిస్తుంది. ఇందులో భాగంగా ఈపీఎఫ్‌వోలోని ఈ కీలక సంస్కరణలపై కేంద్రం కీలక ప్రకటన చేసింది.
యూపీఐ ద్వారా ఈపీఎఫ్‌వో విత్ డ్రా చేసుకునే వెసులు బాటు కల్పించాలన్న నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్‌సీపీఐ) ప్రతిపాదనను కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ఇదే అంశంపై ఆ శాఖ కార్యదర్శి సుమిత్రా దావ్రా తెలిపారు. ఉద్యోగులు ఈ సంవత్సరపు మే లేదా జూన్ నెల నుంచి తమ ఈపీఎఫ్‌వో విత్ డ్రాను యూపీఐ యాప్స్, ఏటీఎంల ద్వారా విత్ డ్రా చేసుకోవచ్చని వెల్లడించారు.
ఆటోమేటెడ్ సిస్టమ్ ద్వారా రూ.1 లక్ష వరకు తక్షణమే విత్‌డ్రా చేసుకోవచ్చు. కోరుకున్న బ్యాంక్ అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు. దీంతో పాటు క్షణాల్లో ఈపీఎఫ్‌వో బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment