ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) తన కోట్లాది మంది సభ్యులకు గొప్ప వార్తను అందించింది. ప్రభుత్వం ప్రకారం.. పీఎఫ్ కొత్త విధానం వచ్చే జూన్ నాటికి అమలులోకి వస్తుంది. కొత్త విధానం ప్రకారం.. ఏటీఎం (ATM) నుండి పీఎఫ్ డబ్బును విత్‌డ్రా చేసుకునేందుకు కొత్త యాప్, ఇతర ఏర్పాట్లు ఉంటాయి.
ఈపీఎఫ్‌వో కొత్త సాఫ్ట్‌వేర్ సిస్టమ్ EPFO 3.0 ఈ సంవత్సరం ప్రారంభమవుతుందని కేంద్ర కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవియా ప్రకటించారు. ఈ కొత్త వ్యవస్థ ఉద్యోగులకు అనుకూలమైన, యూజర్ ఫ్రెండ్లీ అనుభవాన్ని అందిస్తుంది. ఈ ప్రక్రియలో మానవ జోక్యం ఉండదు. అంటే ఏ అధికారి క్లియరెన్స్ లేకుండానే పీఎఫ్ నుంచి డబ్బు విత్‌డ్రా అవుతుంది. ఈ సిస్టమ్ సభ్యులు తమ క్లెయిమ్‌లను ఒకే క్లిక్‌తో సెటిల్ చేసుకోవడానికి అనుమతిస్తుంది.
ఈపీఎఫ్‌ఓ ఏటీఎం కార్డ్ సర్వీస్
ఈపీఎఫ్‌ఓ 3.0 కింద సభ్యులందరికీ ఏటీఎం కార్డులు ఇస్తారు.ఈ కార్డ్ ద్వారా ఉద్యోగులు తమ ప్రావిడెంట్ ఫండ్ (PF) ఖాతా మొత్తాన్ని సులభంగా విత్‌డ్రా చేసుకోవచ్చు. ముఖ్యంగా ఆర్థిక అత్యవసర సమయాల్లో ఈ సర్వీస్ సహాయపడుతుంది. వెబ్‌సైట్, సిస్టమ్‌లో ప్రాథమిక మెరుగుదలలు ఈ నెలలోపు పూర్తవుతాయని కేంద్ర మంత్రి మాండవ్య తెలిపారు. దీని తరువాత, ఈపీఎఫ్‌ఓ 3.0 దశలవారీగా అమలవుతుంది.
కొత్త మొబైల్ యాప్
ఈపీఎఫ్‌ఓ కొత్త మొబైల్ యాప్, ఇతర డిజిటల్ సేవలు కూడా ఈపీఎఫ్‌ఓ 3.0 కింద ప్రారంభమవుతాయి. 2025 జూన్ నాటికి కొత్త యాప్, ఏటీఎం కార్డ్, అధునాతన సాఫ్ట్‌వేర్‌ను అందుబాటులోకి తెస్తామని.. దీంతోపాటు 12 శాతం కంట్రిబ్యూషన్ పరిమితిని తొలగించాలని కార్మిక మంత్రిత్వ శాఖ యోచిస్తోందని కేంద్ర మంత్రి మాండవ్య తెలిపారు. ఉద్యోగులు తమ పొదుపు ప్రణాళికలకు అనుగుణంగా పీఎఫ్‌కి డబ్బు జమ చేసుకోవచ్చు. అలాగే ఉద్యోగి సమ్మతితో ఈ మొత్తాన్ని పెన్షన్‌గా మార్చే ప్రతిపాదన కూడా ఉంది.
ఈపీఎఫ్‌ఓ 3.0 ఉద్దేశం
డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించి సేవలను సరళంగా, వేగంగా, పారదర్శకంగా చేయడమే ఈపీఎఫ్‌ఓ 3.0 ఉద్దేశం. ఈ చొరవ సభ్యుల అనుభవాన్ని మెరుగుపరచడమే కాకుండా ఉద్యోగుల ఆర్థిక నిర్వహణను కూడా మెరుగుపరుస్తుంది. ఈపీఎఫ్‌ఓ కొత్త చొరవ కోట్లాది మంది ఉద్యోగులకు సురక్షితమైన పీఎఫ్ నిర్వహణ అవకాశాన్ని కల్పిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment