
సాక్షి, తణుకు: పట్టణానికి చెందిన వివాహిత కొల్లి విజయదుర్గ (25) శనివారం అనుమానాస్పద స్థితిలో మృతిచెందినట్టు ఎస్‌ఐ కె.గంగాధరరావు తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. పట్టణంలోని శీనివారి వీధిలో నివాసం ఉంటున్న కొల్లి వెంకట్, విజయదుర్గ ఆరేళ్ల క్రితం కులాంతర వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. వెంకట్ సర్వీసింగ్ షెడ్ నిర్వహిస్తున్నాడు.
రెండు రోజులుగా భార్యాభర్తల మధ్య మనస్పర్థలు చోటుచేసుకున్నాయి. దీంతో వెంకట్ ఇంటికి రావడం లేదు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం విజయదుర్గ ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న భర్త వెంకట్ ఆమెను ఆస్పత్రికి తరలించే లోపే మృతిచెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు.
పొరుగింట్లో నివాసం ఉంటున్న ఓ మహిళ తన చావుకు కారణమని పేర్కొంటూ మృతురాలు రాసిన లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తణుకు సీఐ డీఎస్ చైతన్యకృష్ణ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఎస్సై కేసు దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: (భర్త ప్రైవేట్ భాగాలపై మరిగే నీరు పోసి హత్యాయత్నం చేసిన మూడో భార్య)
Comments
Please login to add a commentAdd a comment