Married Woman Found Suspicious Death In Kamareddy District, Details Inside - Sakshi
Sakshi News home page

Kamareddy: షాకింగ్‌ ఘటన.. పారిపోయిన అల్లుడు.. అసలేం జరిగింది?

Dec 22 2022 11:15 AM | Updated on Dec 22 2022 11:33 AM

Married Woman Suspicious Death In Kamareddy District - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

బాన్సువాడ రూరల్‌(కామారెడ్డి జిల్లా): నస్రుల్లాబాద్‌ మండలం అంకోల్‌ తండాలో గురువారం మాలోత్‌ సోని (20) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మృతురాలి తండ్రి తెలిపిన వివరాలు.. చందూర్‌ మండలం కారేగాం తండాకు చెందిన రమావత్‌ చంద్రుకు నలుగురు కూతుర్లు. చిన్న కుతూరు సోనికి అంకోల్‌తండాకు చెందిన మాలోత్‌ రాంచందర్‌తో ఏడాదిన్నర క్రితం వివాహమైంది.

రాంచందర్‌ భార్యతో కలిసి మహబూబ్‌నగర్‌ వెళ్లాడు. అక్కడ రాంచందర్‌ భార్యను అనుమానిస్తూ వేధించేవాడు. ఈ క్రమంలో పలుమార్లు కులపెద్దలు పంచాయతీ పెట్టిన రాంచందర్‌ తీరు మార్చుకోలేదు. దీంతో భర్త వేధింపులు భరించలేక ఇటీవల సోని కారేగాం తండాలోని తల్లిగారింటికి వచ్చింది. భార్యను కొట్టనని, మంచిగా చూసుకుంటానని రాంచందర్‌ వచ్చి చెప్పడంతో ఈ నెల 17న అంకోల్‌ సోనీని తల్లిదండ్రులు అంకోల్‌ తండాకు పంపించారు. 
చదవండి: పెళ్లి కుమార్తె రవళి ఆత్మహత్య కేసులో బిగ్‌ ట్విస్ట్‌..

కాగా గురువారం తన కూతురు చనిపోయినట్లు సమాచారం రావడంతో వెళ్లి చూడగా అల్లుడు పారిపోయాడని చంద్రూ చెప్పారు. రాంచందర్‌ తన కూతురు మనికట్టు వద్ద కోసి తాడుతో ఉరివేసి చంపేసినట్లు ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రంజిత్‌రెడ్డి తెలిపారు.

  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement