మృతురాలు కతీజా(ఫైల్)
సాక్షి, యశవంతపుర: బెంగళూరు సుద్ధగుంటెపాళ్య పరిధిలోని గురప్పనపాళ్యలో ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. వివరాలు... కతీజా కుబ్రా (29), మహబూబ్ షరీఫ్ దంపతులకు కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే అత్తింటి వారు తమ కూతుర్ని వేధించేవారని, హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని కతీజా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
కొట్టి ఉరి వేసినట్లు అనుమానం వ్యక్తం కావడంతో భర్త మహబూబ్ షరీఫ్, అతడి చెల్లిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. మహబూబ్‌కు మరో మహిళతో వివాహేతర సంబంధం ఉన్నట్లు ఆరోపించారు. తమ కుమార్తె మృతికి అత్తింటి వారే కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
చదవండి: (షూటింగ్ కోసం నెల్లూరుకు వెళ్లిన సందర్భంలో శారీరకంగా ఒక్కటై..)
Comments
Please login to add a commentAdd a comment