సాక్షి, తణుకు (పశ్చిమగోదావరి): తణుకులో సంచలనం రేకెత్తించిన దంపతుల ఆత్మహత్య వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలతో తణుకు పట్టణ ఎస్సై కె.గంగాధరరావును సస్పెండ్ చేస్తూ జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. పట్టణానికి చెందిన లక్ష్మీదుర్గ గతేడాది అక్టోబర్ 16న ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ కేసులో కేవలం అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన ఎస్సై గంగాధరరావు దర్యాప్తులో నిర్లక్ష్యం వహించారనే ఆరోపణలు ఉన్నాయి.
ఇదిలా ఉండగా తన భార్య మృతిపై దర్యాప్తు చేయాలని కోరుతూ భర్త వెంకటేష్ పోలీస్‌స్టేషన్ చుట్టూ తిరిగారు. అయితే న్యాయం చేయకపోగా సెటిల్‌మెంట్ చేసుకోవాలని పోలీసులు సూచించడంతో వెంకటేష్ ఇటీవల సెల్ఫీ సూసైడ్ వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై దళిత సంఘాలు ఆందోళనకు దిగడంతో ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. ఎస్సై నిర్లక్ష్యంగా వ్యవహరించారని ప్రాథమికంగా గుర్తించిన ఉన్నతాధికారులు ఆయనపై సస్పెన్షన్ వేటు వేశారు.
చదవండి: (ఎలాంటి బాధా లేకుండా చనిపోవడం ఎలా అని చర్చ..?.. అంతలోనే)
Comments
Please login to add a commentAdd a comment