husband and wife Suicide
-
పిల్లలను హతమార్చిన దంపతుల ఆత్మహత్య
మహబూబాబాద్ జిల్లా: నెల రోజుల క్రితం పిల్లలకు పాలల్లో విషం ఇచ్చి చంపి పరారైన తల్లిదండ్రులు అడవిలో అస్తి పంజరాలయ్యారు. భార్యాభర్తలు ఒకే చెట్టుకు ఉరి వేసుకున్నారు. భర్త మృతదేహం అస్తిపంజరమై చెట్టుకు వేలాడుతుండగా, భార్య మృతదేహాన్ని అడవి జంతువులు పీక్కుతిన్నాయి. దీంతో కేవలం ఆమె పుర్రె మాత్రమే మిగిలింది. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం నగరం గ్రామ సమీపంలో శుక్రవా రం ఈ అస్తిపంజరాలు వెలుగు చూశాయి. గార్ల బయ్యారం సీఐ బి.రవికుమార్ కథనం ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం అంకన్న గూడెంకు చెందిన పెండకట్ల అనిల్‌కుమార్, దేవి దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు సంతానం. ఈ ఏడాది మార్చి 10న ఇద్దరు చిన్నపిల్లలకు పాలల్లో విషం ఇచ్చి చంపిన తలిదండ్రులు బైక్‌పై పరార య్యారు. నాటి నుంచి పోలీసులు భార్యాభ ర్తల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లేకపోయింది. నగరం గ్రామ సమీప అటవీ ప్రాంతంలోని పొదల్లో బైక్ ఉండటాన్ని ఓ వ్యక్తి గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో భార్యాభర్తలు ఇదే ప్రాంతంలో ఉంటారని భావించి బైక్ దొరికిన ప్రాంతంలో పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో నగరం గ్రామ సమీ పం గుట్టమీద నుంచి దుర్వాసన రావడంతో దగ్గరికి వెళ్లి చూడగా చెట్టుకు ఓ మృతదే హం వేలాడుతూ కని పించింది. పోలీసులు వెంటనే అనిల్‌కుమార్ తండ్రి వెంకన్నను ఘటనా స్థలానికి తీసుకొచ్చి మృతదేహాన్ని చూపించగా ఇది తన కొడుకుదేనని చెప్పాడు. దేవి మృతదేహం కోసం వెతుకగా పక్కనే పుర్రె, ఎముకలు, చీర లభించాయి. అడవి జంతువులు మృతదేహాన్ని తిని ఉంటాయని పోలీసులు భావించారు. మృతుడి తండ్రి వెంకన్న ఫిర్యాదు మేరకు గుట్టపైకి డాక్టర్‌ను తీసుకొచ్చి అస్తిపంజరాలకు అక్కడే పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు సీఐ రవికుమార్ తెలిపారు. గుట్టపైనే కుటుంబసభ్యులు అంత్య క్రియలు నిర్వహించారు. కాగా, భార్యాభర్తలు ఎందుకు పిల్లలకు విషమిచ్చి చంపారు.. అసలు వాళ్లు ఎందుకు బలవన్మరణానికి పాల్పడ్డారనే కారణాలు ఇప్పటివరకు తెలియలేదు. పోలీసులు కూడా ఇదొక మిస్టరీలా ఉందని, ఇంకా కారణాలు తెలియలేదని చెబుతున్నారు. -
భార్య ప్రాణాలు తీసుకున్న మర్నాడే భర్త బలవన్మరణం
అనంతపురం: భార్య ఆత్మహత్య చేసుకున్న 24 గంటలు గడవకనే భర్త కూడా భర్త కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన మేరకు.. సోమవారం సాయంత్రం చిన్నపొడమల గ్రామానికి చెందిన రమాదేవి (24) తాడిపత్రి సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. భార్య ఆత్మహత్యకు పాల్పడిన కొన్ని గంటలకే భర్త మంజునాథ (25) మంగళవారం తెల్లవారుజామున తాడిపత్రి రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలపై పడుకుని రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనలో మొండెం నుంచి తల వేరైంది. ఎడమ చెయ్యి మణికట్టు వరకు తెగింది. పెళ్లైన ఐదున్నర నెలల్లోనే దంపతులిద్దరూ ఆత్మహత్య చేసుకోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అన్యోన్యంగా ఉండే ఇద్దరూ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారో అర్థం కావడంలేదని గ్రామస్తులు అన్నారు. అయితే రమాదేవి ఆత్మహత్య అనంతరం అత్తింటి వారి అదనపు కట్నపు వేధింపులే కారణమంటూ రైల్వే పోలీసులకు మృతురాలి తల్లిదండ్రులు లక్ష్మీదేవి, రామాంజినేయులు ఫిర్యాదు చేశారు. కొన్ని గంటలకే మంజునాథ్ కూడా ఆత్మహత్య చేసుకోవడంతో అత్త, మామ వేధింపులు తాళలేక తమ ఒక్కగానొక్క కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడంటూ రైల్వే పోలీసులకు మృతుడి తల్లిదండ్రులు ఓబుళమ్మ, బాల కుళ్లాయప్ప ఫిర్యాదు చేశారు. పరస్పర ఫిర్యాదుల మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు జీఆర్పీ సీఐ నగేష్ తెలిపారు. -
చిన్నపాటి ఘర్షణ.. భార్య ఆతహత్య.. సాగర్ కాల్వలో దూకిన భర్త?
సాక్షి, మిర్యాలగూడ: క్షణికావేశంలో ఓ ఇల్లాలు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మిర్యాలగూడ పట్టణంలోని ఇందిరమ్మ కాలనీలో చోటు చేసుకుంది. వన్‌టౌన్ పోలీసులు తెలిపిన వి వరాల ప్రకారం.. ఇందిరమ్మకాలనీకి చెందిన గుంటి శివరామకృష్ణ, యామిని భార్యాభర్తలు. వీరికి 11ళ్ల క్రితం వివాహం కాగా పట్టణంలోని రాజీవ్‌చౌక్ సమీ పంలో మీసేవా కేంద్రం నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. వీరికి 9ఏళ్ల కుమారుడు ఉన్నాడు. శుక్రవారం సాయంత్రం ఇంట్లో భార్యాభర్తల మధ్య కొద్దిపాటి ఘర్షణ చోటుచేసుకోగా శివరామకృష్ణ తన సెల్‌ఫోన్‌ను ఇంట్లోనే వదిలేసి ఆవేశంగా బయటకు వెళ్లిపోయాడు. అనంతరం యామిని ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కొద్దిసేపటి తర్వాత కింద పోర్షన్లో ఉన్న అత్తామామ పైకి వెళ్లి తలుపు తెరిచి చూడగా యామిని చున్నీతో ఉరేసుకుని ఉండటం గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న వన్‌టౌన్ ఎస్ఐ శ్రీనునాయక్ ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు. కాగా భార్య యామిని మృతిచెందిన విషయాన్ని తెలుసుకున్న శివరామకృష్ణ మనస్తాపంతో నందిపాడు సమీపంలోని సాగర్ కాల్వలో దూకినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కాల్వ కట్ట వద్ద శివరామకృష్ణకు బైక్ ఉండటంతో వారి అనుమానాలకు బలం చేకూరుస్తోంది. కాగా భార్యాభర్తలు ఇద్దరూ సెన్సిటివ్‌గా ఉంటారని, క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయంతో వారి కుమారుడు ఒంటరి వాడయ్యాడని కాలనీవాసులు పేర్కొన్నారు. చదవండి: Medak: చేపల కూరతో భోజనం.. నాలుగేళ్లు నరకం చూపిన చేపముల్లు · -
యువ దంపతుల ఆత్మహత్య.. ‘దేవుడి తీర్థం రా తాగు’ అంటూ
దంపతులిద్దరూ పని కోసం నగరానికి వలసొచ్చారు. ఆభరణాల తయారీతో జీవితం మారుతుందనుకున్నారు. ఎన్నో ఆశలతో బతుకు ప్రయాణం మొదలెట్టారు. చేతినిండా పని దొరకలేదు.. జేబులో గవ్వ నిలవలేదు! చుట్టూ ఆర్థిక చీకట్లు అలుముకున్నాయి. చావొక్కటే మార్గంలా కనిపించింది.. ఆభరణాలకు మెరుగుపట్టే సైనేడ్ తీపి పాయసమైంది భార్యాభర్తలిద్దరూ గుండెనిండా దుఃఖంతో మింగారు. ఈలోకం విడిచి వెళ్లారు. పిల్లలు, వృద్ధులను ఒంటరి వాళ్లను చేశారు. ఇప్పుడు వీరికి దిక్కెవరు? సాక్షి, వరంగల్: బంగారం వ్యాపారానికి వరంగల్ నగరం అడ్డా. ఇక్కడ ఎంతోమంది స్వర్ణకారులు వివిధ ప్రాంతాలనుంచి వచ్చి ఉపాధి పొందుతుంటారు. విశ్వకర్మ వీధిలో బంగారు ఆభరణాలు తయారు చేస్తూ జీవనం సాగిస్తుంటారు. ఇలానే తన జీవితాన్ని బంగారుమయం చేసుకుందామని జగిత్యాల జిల్లాకు చెందిన ఉప్పల సతీశ్ అలియాస్ నవధన్ (33) భార్య స్రవంతి(28)తో కలిసి నగరానికి వచ్చాడు. పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు విరాట్, విహార్. కరోనా.. ఆతరువాత అంతో ఇంతో కోలుకున్నా.. రానురానూ పని దొరకడం కష్టమైంది. కుటుంబ పోషణ భారమై.. ఇటీవల కొద్ది రోజుల నుంచి పని దొరకడం లేదు. చేతిలో డబ్బులు ఉండడం లేదు. ఇంట్లో వృద్ధాప్యంలో కాలు విరిగిన నాన్న, అమ్మ. భార్యా, ఇద్దరు పిల్లలు.. కుటుంబ పోషణ కష్టమైంది. తెలిసిన వారి దగ్గర, ప్రైవేట్ ఫైనాన్స్‌లో అప్పు తెచ్చి బతుకు బండిని నెట్టుకొచ్చాడు. అప్పులిచ్చిన వాళ్లు తిరిగి చెల్లించాలని అడగడం మొదలెట్టారు. ఇంటి అద్దె కూడా కట్టలేని దైన్యం. దంపతులకు రూ. 10లక్ష నుంచి రూ.20లక్షల వరకు అప్పు ఉన్నట్లు తెలిసింది. అప్పులు తీర్చేదారి కని పించక సతీశ్ మానసికంగా కుంగిపోయాడు. రో జూ భార్యతో చెబుతూ బాధపడేవాడు. నాలుగు రోజులక్రితం తన తండ్రి మోహన్‌తో తన గోస చెప్పి చావే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేయగా, ఏమీ కాదు.. అన్ని సర్దుకుంటాయని మనోధైర్యం కల్పించారు. కానీ అప్పటికే పరిస్థితి చేయిదాటింది. చదవండి: Malla Reddy: మల్లారెడ్డి ఇంటిపై ఐడీ దాడుల్లో కొత్త ట్విస్ట్.. ప్రాణాలతో బయటపడిన విరాట్, సైనేడ్‌ను నీళ్లతో కలుపుకొని తాగిన బాటిళ్లు నాన్నా.. ఇది దేవుడి తీర్థం రా.. ఆత్మహత్య చేసుకుందామని నిర్ణయించుకున్న సతీశ్, స్రవంతిలు.. గురువారం రాత్రి చిన్న కుమారుడు నానమ్మ, తాతయ్య దగ్గర ఆడుకుంటుండగా పెద్దకుమారుడు విరాట్‌ను తీసుకుని బెడ్రూంలోకి వెళ్లారు. బంగారు, వెండి ఆభరణాలకు మెరుగుపెట్టే సైనేడ్‌ను వాటర్‌బాటిళ్లలో కలుపుకుని భార్యాభర్తలిద్దరూ తాగారు. పెద్దకుమారుడికి ‘దేవుడి తీర్థం రా తాగు’ అంటూ నోట్లో పోశారు. వెంటనే బాలుడు బయటికి ఉమ్మి వేశాడు. దీంతో బాలుడు ప్రాణాలతో బయటపడగా, దంపతులిద్దరూ చనిపోయారు. కొడుకు ఇంత పనిచేస్తాడనుకోలేదు.. చేతికొచ్చిన కొడుకు తమను సాకుతాడని భావించిన తండ్రి ఆకొడుకు కన్న పిల్లల బాధ్యత చూడాల్సి రావడంతో కన్నీరుమున్నీరుగా విలపించారు. ‘కొడుకా.. ఇంత పనిచేస్తావనుకోలేదు’అంటూ ఆ వృద్ధ దంపతులు రోదిస్తున్న తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. స్వర్ణకారులు, బంధువులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో గిర్మాజీపేటలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
దంపతుల ఆత్మహత్య
మల్కాజిగిరి: కుటుంబ సమస్యల కారణంగా దంపతులు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ జగదీశ్వర్‌రావు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.మల్కాజిగిరి బృందావన్ కాలనీకి చెందిన కామిశెట్టి సాయిదాసు(65),విజయలక్షి్మ(60) దంపతులకు సంతానం లేదు. గత కొంత కాలంగా ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారు. ఈ నెల 26న తమ బంధువు పోతన శ్రీనివాసరావుకు ఫోన్ చేసి ఒకసారి ఇంటికి వచ్చి వెళ్లమని చెప్పారు. 27న ఉదయం అతను సాయిదాసు ఇంటికి వెళ్లి పిలిచినా పలకక పోవడంతో తలుపులు పగులగొట్టి చూడగా దంపతులిద్దరూ ఉరి వేసుకొని కనిపించారు. ఆనంద్‌బాగ్‌లో నివాసముంటున్న సాయిదాసు సోదరుడు మెహర్ ఓంకార్‌కు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్ధలానికి చేరుకొని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారి నుంచి సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. (చదవండి: మహిళలను వేధించే పోకిరీలకు చెక్!:.. 10 వారాల్లో 106 మంది అరెస్టు) -
దంపతుల ఆత్మహత్య.. కుమారుడు లేని లోకంలో ఉండలేక..
జి.కొండూరు (మైలవరం)\కృష్ణా జిల్లా: చేతికి అందివచ్చిన కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఆ తల్లిదండ్రులు తీవ్ర మనోవేదనకు లోనై ఆత్మహత్యకు పాల్పడ్డారు. జి.కొండూరు మండలంలో చిన్ననందిగామలో ఆదివారం జరిగిన ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. పోలీసుల కథనం మేరకు.. చిన్ననందిగామ గ్రామానికి చెందిన ఆరేపల్లి సాంబశివరావు(43), ఆరేపల్లి విజయలక్ష్మి(38) దంపతులకు కుమార్తె దీపిక, కుమారుడు జగదీష్‌పవన్ ఉన్నారు. చదవండి: లోకం తెలియని చిన్నారులు.. రోజూ నరకమే.. అందుకే వచ్చేశాం.. పదేళ్ల కిందట సాంబశివరావు తాటిచెట్టుపై నుంచి పడి నడుము విరగడంతో దివ్యాంగుడిగా మారాడు. అయినప్పటికీ భార్యతో వ్యవసాయ పనులు చేయిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. పదో తరగతి పూర్తి చేసిన కుమారుడు జగదీష్‌పవన్ మైలవరంలోని ఓ టీవీ షాపులో మెకానిక్‌గా చేరాడు. గత మార్చి 29వ తేదీన రాత్రి విధులు ముగించుకుని బైకుపై ఇంటికి వస్తూ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు విడిచాడు. కుమారుడి మృతిని జీర్ణించుకోలేని తల్లిదండ్రులు విజయలక్ష్మి, సాంబశివరావు రెండు నెలల నుంచి తీవ్ర మనోవేదనకు గురయ్యారు. ఆదివారం తెల్లవారుజామున ఐదు గంటల సమయంలో వంట గదిలో రేకుల షెడ్డుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఉదయాన్నే నిద్ర లేచిన కూతురు దీపికకు వారు వంటగదిలో విగతజీవులుగా కనిపించడంతో భయపడిపోయింది. బంధువులు వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ ధర్మరాజు తెలిపారు. -
ఎడబాటు భరించలేక.. బదిలీ యత్నం ఫలించక.. సూసైడ్ నోట్ రాసి..
నగరి(చిత్తూరు జిల్లా): మానసిక ఒత్తిళ్లు, ఆర్థిక ఇక్కట్లతో దంపతులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నగరి పట్టణంలో సోమవారం వెలుగుచూసింది. స్థానిక ఆనం లలితా లేఅవుట్లో నివసిస్తున్న గౌరీ యూనియన్ బ్యాంక్‌లో క్యాషియర్‌గా పనిచేస్తోంది. భర్త శివనాగభాస్కర్ రెడ్డితో కలిసి ఇక్కడే ఉంటోంది. వీరిద్దరూ ఇంట్లోనే ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. సోమవారం ఆమె డ్యూటీకి రాకపోవడంతో ఇంటి వద్ద చూసిరావాలని సిబ్బందిని పంపగా ఆత్మహత్య ఘటన వెలుగులోకి వచ్చింది. మేనేజర్ సమాచారం మేరకు డీఎస్పీ యశ్వంత్, సీఐ మద్దయ్య ఆచారి, ఎస్ఐలు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. చదవండి: సర్ప్రైజ్ అంటూ కళ్లు మూసుకోమని కాబోయే భర్త గొంతు కోసి.. ఉద్యోగాల రీత్యా పెళ్లయిన ఆరు నెలల నుంచి కలిసి కాపురం చేయలేకపోతున్నామనే ఆవేదన, బదిలీకి ప్రయతి్నంచినా నాలుగేళ్లుగా సఫలీకృతం కాలేదనే బాధ, బిజీగా ఉంటే కష్టాలు మరచిపోవచ్చంటూ చిట్టీలు ప్రారంభిస్తే కోవిడ్ లాక్‌డౌన్‌తో రెట్టింపైన కష్టాలు.. బాకీలు తీర్చాలంటూ బకాయి పడ్డవారి బెదిరింపులు, బ్యాంకు రుణం మంజూరుచేసి రుణ విముక్తి కల్పించలేదంటూ బ్యాంకు అధికారులపై కోపం వెరసి దంపతులను ఆత్మహత్యకు ప్రేరేపించినట్లుగా సూసైడ్ నోట్ ద్వారా తెలుస్తోంది. కడప జిల్లా ఎర్రగుంట్లలో కూలీల కుటుంబంలో పుట్టిన గౌరీ(25) కష్టపడి చదివి బ్యాంకు ఉద్యోగం సాధించింది. ఆమెకు కడప జిల్లా వీరప్పనాయనిరెడ్డి పాళెంకు చెందిన శివనాగభాస్కర్ రెడ్డి(32)తో వివాహమై ఐదేళ్లయింది. ఇతను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసేవాడు. వివాహమైన ఆరు నెలలకే గౌరీకి యూనియన్ బ్యాంక్(ఆంధ్రబ్యాంక్) నగరి బ్రాంచ్‌కు బదిలీ అయింది. ఇక్కడ ఉద్యోగంలో చేరి లలితా లేఅవుట్లో అద్దె ఇంట్లో ఉన్నారు. అప్పటి నుంచి భార్యా భర్తలు వేర్వేరు ప్రాంతాల్లోనే ఉంటూ కాపురం నెట్టుకొచ్చారు. ఈ అంశం వారిద్దరినీ మానసికంగా ఆవేదనకు గురిచేసింది. నాలుగేళ్లుగా బదిలీ కోసం బ్యాంకు ఉన్నతాధి కారులకు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోయింది. ఇలా కాలం వెళ్లదీస్తున్న క్రమంలో కృత్తిక(4), కుసుమంత్ రెడ్డి(1) అనే ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు. కృత్తిక స్థానిక ప్రైవేటు పాఠశాలలో ఎల్కేజీ చదువుతోంది. తల్లిదండ్రులు ఇద్దరూ కలిసి పిల్లల్ని చూసుకోలేకపోతున్నామనే బాధ వారిని వేధించింది. అప్పుల ఊబిలో.. ఈ కష్టాలు మరిచిపోవాలంటే బిజీగా ఉండాలని తలచిన శివనాగభాస్కర్ రెడ్డి హైదరాబాద్‌లో చిట్టీల వ్యాపారం ప్రారంభించాడు. ఈ దశలో కోవిడ్ లాక్డౌన్ రావడంతో చిట్టీల నిర్వహణ అస్తవ్యస్తమై ఆర్థికపరమైన సమస్యల్లో కూరుకుపోయాడు. కృష్ణారెడ్డి అనే వ్యక్తి వద్ద భూముల దస్తావేజులు ఉంచి రూ.2 లక్షలు అప్పు చేశాడు. ఆర్థిక బాధలు తట్టుకోలేక ఏడాది క్రితం నగరికి వచ్చి ఇక్కడే ఉంటున్నాడు. చిట్టీల్లో బకాయి ఉండడంతో వారంతా అతన్ని వెతుక్కుంటూ నగరికి రావడం మొదలుపెట్టారు. బ్యాంకుకు వెళ్లి గౌరీని కూడా బెదిరించారు. బ్యాంకులో రుణం తీసుకుని ఆర్థిక ఇబ్బందుల ఊబి నుంచి బయటపడదామనుకుంటే అక్కడా నిరాశే ఎదురైంది. ఈ పరిస్థితుల్లో జీవితంపై విరక్తి చెందారు. ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుని పిల్లలను పది రోజుల క్రితమే కడప జిల్లా పర్వరాజపేటలోని మేనత్త ఇంటికి పంపించేశారు. చివరకు ఆదివారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడి ఇద్దరూ తనువు చాలించారు. పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
బతుకు బాటలో కలిసి నడిచి.. కష్టంలోనూ ఒక్కటిగా
సాక్షి, శ్రీకాకుళం(పాలకొండ రూరల్): రెక్కల కష్టం నమ్ముకొని జీవించే కుమ్మరి దంపతుల కుటుంబం అప్పులు ఊబిలో కూరుకుపోయింది. కరోనా కష్ట సమయంలో తాము నమ్ముకున్న ఇటుక బట్టీ నడవక పోవటంతో దొరికిన చోటల్లా అప్పులు చేసి కుటుంబాన్ని నెట్టుకొచ్చారు. అయితే కోవిడ్ తగ్గుముఖం పట్టినా వారు చేసిన అప్పులు అలాగే ఉండిపోయాయి. ఇటుకల బట్టీ సక్రమంగా నడవకపోవటంతో అప్పు ఇచ్చినవారికి ముఖం చూపించలేని పరిస్థితి దాపురించింది. ఏమి చేయాలో పాలుపోక చావే శరణ్యమని భావించారు. గడ్డి నివారణ మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ఒడికట్టారు. బతుకు బాటలో కలిసి నడిచిన వారు కష్టంలోనూ ఒక్కటిగా తనువులు చాలించాలనే కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఈ విషాద ఘటనలో భర్త మరణించగా భార్య మృత్యువుతో పోరాడుతోంది. ఈ సంఘటన పాలకొండ మండలం చిన్నమంగళాపురం గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన నాగవరపు రామారావు (47), తవిటమ్మ దంపతులు. వృత్తిరీత్యా కుమ్మరులు కావటంతో గ్రామ సమీపంలో ఇటుక బట్టీ నిర్వహిస్తున్నారు. కుమార్తెకు వివాహం చేయగా కుమారుడు గౌరితో కలసి ఉంటున్నారు. కరోనా కారణంగా రెండేళ్లుగా ఇటుకల తయారీ పనులు నిలిచిపోవడంతో ఆర్థిక సమస్యలు వెంటాడాయి. ఇల్లు గడవడం భారంగా మారింది. దీంతో చేసేది లేక తెలిసిన వారివద్ద, దొరికినచోటల్లా అప్పులు చేసి కాలం నెట్టుకొచ్చారు. అయితే పనుల్లేక.. చేసిన అప్పులు తీర్చే దారిలేక లోలోన కుంగిపోయారు. చేసేది లేక ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. సోమవారం అందరితో కలివిడిగా ఉన్న వీరు ఆ రాత్రి గడ్డి నివారణకు వాడే మందును ఇంట్లోనే తాగేసి అపస్మారక స్థితికి చేరుకున్నారు. రాత్రి ఒంటిగంట సమయంలో కుమారుడు గౌరి నీరు తాగేందుకు ఇంట్లోకి వెళ్లగా తల్లిదండ్రులు స్పృహతప్పి పడిపోయి ఉండటాన్ని గుర్తించాడు. చదవండి: (విషాదం: బిడ్డ మరణాన్ని తట్టుకోలేక...) చుట్టపక్కల వారికి తెలియజేయటంతో వారు వచ్చి రామారావు, తవిటమ్మలను పాలకొండ ఏరియా ఆస్పత్రికి తీసుకొచ్చారు. అయితే అప్పటికే రామారావు మరణించగా తవిటమ్మ మృత్యువుతో పోరాడుతోంది. ఆమెను మెరుగైన వైద్యం కోసం వైద్యులు శ్రీకాకుళం రిఫర్ చేయగా ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని గ్రామస్తులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న సీఐ జి.శంకరరావు, ఎస్సై సీహెచ్ ప్రసాద్‌లు మంగళవారం చిన్నమంగళాపురం వెళ్లి దర్యాప్తు చేపట్టారు. రామారావు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. కుమారుడు గౌరి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. తవిటమ్మ వద్ద వీడియో రూపంలో వాంగ్మూలం సేకరించగా అప్పులు బాధలే కారణమని ఆమె తెలిపినట్లు పోలీసులు స్పష్టం చేశారు. అందరితో కలివిడిగా ఉండే దంపతులు తీసుకున్న నిర్ణయంతో చిన్నమంగళాపురంలో విషాదఛాయలు అలముకున్నాయి. -
సంచలనం రేకెత్తించిన దంపతుల ఆత్మహత్య.. తణుకు ఎస్సై సస్పెన్షన్
సాక్షి, తణుకు (పశ్చిమగోదావరి): తణుకులో సంచలనం రేకెత్తించిన దంపతుల ఆత్మహత్య వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలతో తణుకు పట్టణ ఎస్సై కె.గంగాధరరావును సస్పెండ్ చేస్తూ జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. పట్టణానికి చెందిన లక్ష్మీదుర్గ గతేడాది అక్టోబర్ 16న ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ కేసులో కేవలం అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన ఎస్సై గంగాధరరావు దర్యాప్తులో నిర్లక్ష్యం వహించారనే ఆరోపణలు ఉన్నాయి. ఇదిలా ఉండగా తన భార్య మృతిపై దర్యాప్తు చేయాలని కోరుతూ భర్త వెంకటేష్ పోలీస్‌స్టేషన్ చుట్టూ తిరిగారు. అయితే న్యాయం చేయకపోగా సెటిల్మెంట్ చేసుకోవాలని పోలీసులు సూచించడంతో వెంకటేష్ ఇటీవల సెల్ఫీ సూసైడ్ వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై దళిత సంఘాలు ఆందోళనకు దిగడంతో ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. ఎస్సై నిర్లక్ష్యంగా వ్యవహరించారని ప్రాథమికంగా గుర్తించిన ఉన్నతాధికారులు ఆయనపై సస్పెన్షన్ వేటు వేశారు. చదవండి: (ఎలాంటి బాధా లేకుండా చనిపోవడం ఎలా అని చర్చ..?.. అంతలోనే) -
భార్య వివాహేతర సంబంధం.. తట్టుకోలేక భర్త ఆత్మహత్య.. 12 గంటల్లోనే
వివాహేతర సంబంధం రెండు నిండు ప్రాణాలను బలి తీసుకుంది. కట్టుకున్న భార్య వివాహేతర సంబంధాన్ని తట్టుకోలేని భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భర్త చనిపోయిన వార్త తెలిసిన 12 గంటల్లోనే భార్య సైతం బలవన్మరణానికి పాల్పడింది. తల్లిదండ్రుల ఆత్మహత్యతో నాలుగేళ్ల బిడ్డ అనాథగా మారిపోయింది. ఈ ఘోర ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. భోపాల్‌లోని టీటీ నగర్‌కు చెందిన 25 ఏళ్ల గొల్లు బలన్ అనే వ్యక్తికి 22 ఏళ్ల సుధతో మహిళతో ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి నాలుగేళ్ల కొడుకు ఉన్నాడు. చదవండి: ‘నేను ఐపీఎస్ అధికారిని.. తొలిచూపులోనే నచ్చావ్.. పెళ్లి చేసుకుందాం’ అయితే ఇటీవల మహిళకు మరో వ్యక్తి సాగర్‌బాబాతో అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. భార్య, సాగర్ల మధ్య స్నేహం వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం భర్తకు తెలియడంతో భార్యభర్తలిద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. దీంతో వివామిత తన తల్లిగారింటికి వెళ్లింది. అయితే ఈ గొడవను పరిష్కరించుకునేందుకు భర్త ఎంత ప్రయత్నించినా సర్ధుమనగలేదు. దీంతో భర్త ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భర్త చనిపోయిన విషయం తెలియగానే భార్య సైతం పెట్రోల్ పోసుకొని నిప్పటించుకొని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే ఇంట్లో దొరికిన సుసైడ్ నోట్, కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు సాగర్‌పై కేసు నమోదైంది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. చదవండి: తప్పతాగి వేరే వాళ్ల ఇంటికి వెళ్లి గొడవ.. మాజీ ఎంపీని చితకబాదిన ఓనర్ -
విషాదం: మహబూబ్‌నగర్ జిల్లాలో దంపతుల ఆత్మహత్య
సాక్షి, మహబూబ్ నగర్: పట్టణంలోని మధురానగర్ కాలనీలో దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ధర్మాపూర్ గ్రామానికి చెందిన నర్సింహారెడ్డి, లత దంపతులు మధురానగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. అయితే గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న దంపతులు జీవితంపై విసుగుచెంది ఉదయం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. వారికి కూమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు భరత్ కుమారెడ్డి ఉన్నత చదువుల కోసం ఆగస్టు నెలలో అమెరికా వెళ్లాడు. కూతురు సుష్మ ఇటీవలే సాప్ట్ ఉద్యోగంలో చేరింది. దంపతుల ఆత్మహత్యతో కాలనీలో విషాదఛాయలు అలముకున్నాయి. కాగా ఉదయం తాను జిమ్ కోసం వెళ్లివచ్చే సరికే ఉరేసుకున్నారని సుష్మ కన్నీటి పర్యంతమయ్యింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (వైరల్: ధవణి దీనంగా.. ప్లీజ్ సీఎం తాతా వాటిని పూడ్చండి..) -
కరస్పాండెంట్ దంపతులను కాటేసిన అప్పులు
కోవెలకుంట్ల(కర్నూలు జిల్లా): అప్పులు తీర్చే మార్గం కానరాక కోవెలకుంట్ల పట్టణంలోని లైఫ్‌ఎనర్జీ స్కూల్ కరస్పాండెంట్ దంపతులు సుబ్రమణ్యం(34), రోహిణి(28) ఆదివారం బలవన్మరణానికి పాల్పడ్డారు. స్థానికులు అందించిన సమాచారం మేరకు.. పట్టణానికి చెందిన రాధాకృష్ణమూర్తి స్థానిక వాసవీ బొమ్మిడాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్‌గా పనిచేసి ఎనిమిది సంవత్సరాల క్రితం పదవీ విరమణ పొందారు. ఈయన కుమారుడు సుబ్రమణ్యం ఇదే కళాశాలలో కొంతకాలం కాంట్రాక్ట్ బేసిక్‌పై కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేశాడు. ఉద్యోగానికి రాజీనామా చేసి పట్టణంలో 2017 నుంచి సొంతంగా ప్రైవేట్ పాఠశాల నడుపుతున్నాడు. ఈ క్రమంలో ప్రైవేట్ వ్యక్తుల వద్ద రూ. 2.50 కోట్ల అప్పులు చేశాడు. కరోనాతో ఏడాదిన్నర కాలంగా పాఠశాల సక్రమంగా నడవకపోవడంతో అప్పులు చెల్లించలేకపోయాడు. అప్పుదారులు ఒత్తిడి తీసుకురావడంతో మనస్తాపం చెందిన భార్యాభర్తలు ఆదివారం ఉదయం ఇంట్లో నుంచి భార్య స్వగ్రామమైన ఆత్మకూరుకు బయలుదేరారు. అప్పుదారుల వేధింపులతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు మార్గమధ్యలో వాట్సాప్ స్టేటస్ పెట్టి మొబైల్ ఫోన్స్ స్విచ్ఆఫ్ చేసుకున్నారు. ఆత్మకూరు దగ్గర లక్ష్మీ నరసింహస్వామి ఆలయం సమీపంలో నిద్రమాత్రలు మింగి అపస్మారక స్థితికి చేరుకున్నారు. అటుగా వెళుతున్న వ్యక్తులు గమనించి ఆత్మకూరు పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించగా అక్కడ చికిత్స పొందుతూ సుబ్రమణ్యం మృతి చెందాడు. రోహిణికి ప్రాథమిక చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తరలిస్తుండగా మృతి చెందింది. విషయం తెలియడంతో మృతుని తండ్రి, బంధువులు హుటాహుటినా ఆత్మకూరుకు బయలుదేరి వెళ్లారు. -
కలహాల కాపురం? విషం సేవించిన భార్యాభర్తలు
జయపురం: నవరంగపూర్ జిల్లా రాయిఘర్ సమితి కచరాపర-2 గ్రామానికి చెందిన భార్యాభర్తలు కుటుంబంలో తగవుల కారణంగా ఆస్పత్రి పాలైనట్లు అనుమానిస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన మనోరంజన్‌కు ఉమ్మరకోట్ సమితి గుబురి గ్రామానికి చెందిన జయంతితో 15 యేళ్ల కిందట వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమారులు ఒక కుమార్తె. శుక్రవారం జయంతి విషం తాగి వాంతులు చేసుకుంటుండడం చూసిన భర్త, గ్రామస్తులు వెంటనే రాయిఘర్ కమ్యూనిటీ ఆస్పత్రికి తీసుకువెళ్లగా డాక్టర్లు పరీక్షించి మందులు ఇచ్చారు. కొంతసేపటికి ఆరోగ్యం కుదుటపడుతున్న సమయంలో జయంతి తండ్రి హిరెన్ మండల్, మరి కొంతమంది బంధువులతో హాస్పిటల్‌కు వచ్చి తన కుమార్తె పరిస్థితికి భర్తే కారకుడని ఆరోపించి దాడి చేసి కొట్టారు. ఈ దెబ్బలకు మనోరంజన్ అక్కడే సృహ కోల్పోవడంతో వెంటనే నవరంగపూర్ జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. కుటుంబకలహాలే ఈ పరిస్థితికి కారణమని పోలీసులు, బంధువులు, గ్రామస్తులు అనుమానిస్తున్నారు. ఈ విషయం తెలిసిన రాయిఘర్ పోలీసు అధికారి ఠంకుగిరి భొయి సిబ్బందితో రాయిఘర్ ఆస్పత్రికి చేరుకుని సంఘటనపై కేసు నమోదు చేశారు. భార్యాభర్తలు వేర్వేరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. దీనిపై కేసు నమోదు చేశామని, వారిని విచారణ చేస్తామని వెల్లడించారు. -
భరించరాని నొప్పి.. చెప్పుకోలేని బాధ
సాక్షి, బెల్లంపల్లి: పన్నెండేళ్లపాటు ప్రేమించి, పెళ్లి చేసుకున్న వారి జీవనప్రయాణం పదినెలల్లోనే అర్ధాంతరంగా ముగిసింది. బెల్లంపల్లిలోని సుభాష్‌నగర్‌కు చెందిన మోసం మల్లేష్‌కుమార్ (36), బాబుక్యాంపు బస్తీకి చెందిన నర్మద (28) చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్రంగా కలిచివేసింది. నర్మద మందమర్రి గురుకులంలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. మల్లేష్ ఓ ప్రైవేట్ టీవీ ఛానల్లో రిపోర్టర్. పెళ్లయిన కొద్ది నెలలకే దంపతులిద్దరికీ అనారోగ్య సమస్యలు ఏర్పడ్డాయి. వాటిని ఎలా భరించాలో తెలియక.. చనిపోదామనే నిర్ణయించుకున్నారు. గురువారం అర్ధరాత్రి దాటాక (12.40 గంటల ప్రాంతంలో) మల్లేశ్ తన సన్నిహితులైన కొందరికి వాట్సాప్ మెసేజ్ చేశాడు. పోచమ్మ చెరువు కట్ట వద్దకు బైక్ వచ్చి అందులో దూకారు. కొద్దిసేపటికి మిత్రులు మెసేజ్ చూసి వారికోసం వెదకడం ప్రారంభించారు. చెరువు కట్ట వద్ద బైక్ కనిపించడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు నిర్ధారణకు వచ్చారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో శుక్రవారం ఉదయం ఏసీపీ ఎంఏ రహమాన్, వన్‌టౌన్ ఎస్హెచ్ఓ రాజు, తహసీల్దార్ కుమారస్వామి గజ ఈతగాళ్లను రప్పించారు. మల్లేశ్ మృతదేహం 11 గంటలకు బయటపడగా.. నర్మద మృతదేహం కోసం గజ ఈతగాళ్లు శ్రమించాల్సి వచ్చింది. చివరకు సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో ఆమె మృతదేహాన్ని బయటకు తీయించారు. వారి మృతదేహాలను చూసి ఇరు కుటుంబాలు బోరున విలపించాయి. మిత్రులు, సన్నిహితులు కన్నీరుపెట్టుకున్నారు. చదవండి: (పెళ్లంటూ ఎర... గిఫ్టంటూ టోకరా! ) కలచివేసిన సూసైడ్ నోట్ “నా కుటుంబ సభ్యులను, నా ప్రాణమిత్రులను, అందరిని వదిలి వెళ్తున్నందుకు చాలా బాధగా ఉంది. రోజురోజుకూ నా ఆరోగ్య సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. రోజు నరకం చూస్తున్న. భరించరాని నొప్పి. చెప్పుకోలేని బాధ. ఈ లోకాన్ని వదిలి వెళ్లడం తప్ప వేరే మార్గం లేదు. కడుపునొప్పితో రోజూ నరకం చూస్తోంది. ఇలా బతకడం కంటే చావడం మేలని ఈ నిర్ణయం తీసుకుంటున్నాం. నా నిర్లక్ష్యం, జర్నలిజం వృత్తియే నా అనారోగ్యానికి కారణం అనుకుంటున్న. సమయానికి తినక ఎన్నోసార్లు టెన్షన్‌కి గురయ్యాను. నా ప్రాణమిత్రులు, విలేకరులు నాకుటుంబానికి బాసటగా నిలవాలని వేడుకుంటున్న. అని సూసైడ్ నోట్లో రాసి ఉంది. “అమ్మను, అన్నయ్యను, అక్కలను మంచిగా సూసుకో, నీదే బాధ్యత, నీకు కొడుకుగానో, బిడ్డగానో పుడుత’ అని తన తోబుట్టువు శ్రీనివాస్‌ను ప్రాధేయపడిన తీరు కలిచివేసింది. అలాగే వారు తీసుకున్న అప్పులు.. తమ వద్ద అప్పు తీసుకున్నవారి వివరాలను కూడా అందులో రాసి పెట్టారు. -
ప్రభుత్వ ఉద్యోగ దంపతుల ఆత్మహత్య
సాక్షి, చిలకలగూడ : కుటుంబ సమస్యల కారణంగా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్నారు. భార్య బాత్రూంలో ఆత్మహత్యకు పాల్పడగా, బెడ్రూంలో బలవన్మరణం పొందాడు. ఈ సంఘటన చిలకలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బౌద్ధనగర్ డివిజన్ అంబర్‌నగర్‌లో గురువారం జరిగింది. పోలీసులు, కుటుంబసభ్యులు తెలిపిన మేరకు.. సికింద్రాబాద్ అంబర్‌నగర్‌కు చెందిన తిరుమల వెంకటేష్ (30), దండె భార్గవి (24) భార్యాభర్తలు. 2015లో వీరికి వివాహమైంది. వీరికి నాలుగేళ్ల కుమార్తె మోక్షశ్రీ, మూడు నెలల కుమారుడు అన్విక్లున్నారు. పుత్లిబౌలిలోని విద్యుత్ కార్యాలయంలో సబ్ ఇంజనీర్‌గా వెంకటేష్, కృష్ణజిల్లా జగ్గయ్యపేట పోస్ట్‌ఆఫీస్‌లో పోస్ట్‌ఉమెన్‌గా భార్గవి పనిచేస్తున్నారు. వెంకటేష్ తల్లి మృతి చెందడంతో తండ్రి బాలకృష్ణ మరో పెళ్లి చేసుకున్నాడు. బాలకృష్ణకు ఇద్దరు కుమార్తెలు, నలుగురు కుమారులు. వీరిలో పెద్దకుమారుడు వెంకటేష్. తన భార్య పిల్లలతో కలిసి తండ్రి ఇంటి ఎదురుగానే మరో ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న ఇద్దరు నెలవారీ జీతాలను తనకే ఇవ్వాలని, కుటుంబ పోషణ భారమవుతుందని తండ్రి బాలకృష్ణ తరచూ గొడవపడేవాడు. గతనెల 31వ తేదిన వెంకటేష్ తన పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకున్నాడు. తనకు ఇవ్వకుండా జల్సాలు చేస్తున్నాడని భావించిన తండ్రి డబ్బు కోసం మరింత ఒత్తిడి తెచ్చాడు. దీంతో భార్యభర్తలు తీవ్ర మానసిన వేదనకు గురయ్యారు. నేను నమ్మిన వాళ్లే నన్ను మోసం చేశారు. అమ్మా నన్ను క్షమించి, పిల్లలను బాగా చూసుకో అని భార్గవి సూసైడ్‌నోట్ రాసి బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత బాత్రూంలో చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భార్య బలవన్మరణాన్ని చూసి తట్టుకోలేని వెంకటేష్ బెడ్రూం దూలానికి చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం ఉదయం మూడు నెలల బాబు గుక్కపట్టి ఏడుస్తున్నా ఇంటి లోపలి నుంచి ఎటువంటి అలికిడి లేకపోవడం, ఎంత కొట్టినా తలుపులు తీయకపోవడంతో స్థానికుల సహాయంతో కిటికీ నుంచి లోపలకు వెల్లి చూడగా భార్యభర్తలు వేర్వేరుగా ఉరికి వేలాడుతు కనిపించారు. మృతుల కుటుంబసభ్యులు ఒకరినొకరు దూషించుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. గోపాలపురం ఏసీపీ వెంకటరమణ, చిలకలగూడ సీఐ బాలగంగిరెడ్డి, సెక్టార్ ఎస్ఐ వరుణ్‌కాంత్‌రెడ్డిలు ఘటనస్థలానికి చేరుకుని ఇరువర్గాలను శాంతింపజేశారు. వెంకటేష్ కుటుంబసభ్యులైన తిరుమల బాలకృష్ణ, లక్ష్మీ, రవి, సంతోష్, వజ్రమ్మ, రాణి, భాగ్యలే తన కుమార్తె, అల్లుడు ఆత్మహత్యకు కారణమని మృతురాలు భార్గవి తండ్రి రాములు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన కొడుకు, కోడలును డబ్బులు కోసం వేధించలేదని, ఎందుకు ఆత్మహత్యకు పాల్పడ్డారో తెలియదని మృతుడు వెంకటేష్ తండ్రి తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని సీఐ తెలిపారు. -
క్షణికావేశం.. విషాదంతం
రెంటచింతల(మాచర్ల): క్షణికావేశంలో భార్యాభర్తలు తీసుకున్న నిర్ణయంతో ఆ కుటుంబం ఛిన్నాభిన్నమైపోయింది. మున్నంగి నర్సింహారెడ్డి, దుర్గాభవాని దంపతులు మండల కేంద్రమైన రెంటచింతల గంధంవారి బజారు సమీపంలో నివసిస్తున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో బుధవారం రాత్రి పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్థానికులు వారిని రెంటచింతల ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా.. భార్య దుర్గాభవాని (38) చికిత్స పొందుతూ మృతి చెందింది. భర్త నర్సింహారెడ్డి పరిస్థితి విషమించడంతో వెంటనే నర్సరావుపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నర్సింహా రెడ్డి దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె అంజలికి వివాహమైంది. చిన్న కుమార్తె స్రవంతి స్థానిక వైఆర్ఎస్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. మృతురాలు దుర్గాభవాని తల్లి బిక్కిరెడ్డి విజయ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ చల్లా సురేష్ తెలిపారు. -
భార్యాభర్తల ఆత్మహత్య
కర్ణాటక, చెళ్లకెరె రూరల్: నగరంలోని వాసవినగర్‌లో నివాసం ఉంటున్న భార్యాభర్తలు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బుధవారం రాత్రి జరిగింది. రాఘవేంద్ర(43), ఆరతి(35) అనే దంపతులు నగరంలోని బెంగళూరు రోడ్డులో దత్తా కిరాణి అండ్ జనరల్ స్టోర్స్ నడుపుతున్నారు. వీరికి ఎనిమిదో తరగతి చదువుతున్న రమ్య అనే కుమార్తె ఉంది.సాయంత్రం రమ్య ట్యూషన్‌కు వెళ్లిన సమయంలో దంపతులిద్దరూ తమ చావుకు తామే కారణమని ఇంటిలోనే డెత్‌నోట్ రాసి పెట్టి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ట్యూషన్ నుంచి రమ్య ఇంటికి వచ్చి చూడగా వీరి ఆత్మహత్య విషయం బయట పడింది. కాగా వీరి ఆత్మహత్యకు గల కారణాలు ఏమిటో ఇంకా తెలియరాలేదు. సమాచారం అందిన వెంటనే చెళ్లకెరె పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్ట్‌మార్టంకు తరలించారు. -
బతుకు బరువైందా..?
♦ చినమురపాకలో ఉరి వేసుకొని భార్యాభర్తల ఆత్మహత్య ♦ మనస్పర్థలే కారణమా? – మృతురాలు విజయనగరం జిల్లా వాసి ♦ దంపతుల మృతిపై గోప్యత పాటించిన బంధువులు, గ్రామస్తులు ♦ దహన సంస్కారాలను మధ్యలో ఆపి మృతదేహాలను తీసుకెళ్లిన పోలీసులు ♦ చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన కుమారుడు లావేరు(శ్రీకాకుళం): మండలంలోని చినమురపాక గ్రామంలో ఆదివారం ఉదయం భార్యాభర్తలు అంపోలు శ్రీనివాసరావు(39), హైమావతి(33)లు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఇద్దరి మధ్యా ఉన్న మనస్పర్థలే ఆత్మహత్యకు కారణమై ఉండవచ్చని స్థానికులు భావిస్తున్నారు. ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారనే విషయాన్ని బంధువులు, గ్రామస్తులు కచ్చితంగా చెప్పలేకపోతున్నారు. భార్యాభర్తల ఆత్మహత్య విషయాన్ని కూడా వారు చాలా గోప్యంగా ఉంచారు. పోలీసులకు కూడా తెలియకుండా హడావుడిగా రెండు మృతదేహాలను దహనం చేయడానికి ప్రయత్నించారు. ఆఖరకు విషయం పోలీసులకు తెలియడంతో వారు ఫైర్ ఇంజిన్‌తో శ్మశాన వాటికకు వెళ్లి, దహన సంస్కారాలను మధ్యలోనే ఆపి, సగం కాలిన మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం కోసం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. మనస్పర్థలే కారణమా..? చినమురపాక గ్రామానికి చెందిన అంపోలు శ్రీనుకు, విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలోని వల్లూరు గ్రామానికి చెందిన హైమావతిలకు పదేళ్ల కిందట వివాహం జరిగింది. కొన్నేళ్ల వరకు వారి కాపురం సజావుగానే సాగినా ఆ తర్వాత విభేదాలు మొదలయ్యాయి. ఇటీవల అవి చాలా ఎక్కువయ్యాయి. ఓసారి లావేరు పోలీస్‌స్టేషన్‌లో వీరిద్దరికీ కౌన్సిలింగ్ కూడా చేసినట్లు సమాచారం. ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో భార్యభర్తలు ఇంటి వద్దనే ఉన్నారు. ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలీదు గానీ భర్త శ్రీను ఇంటిలోని ఒక గదిలోను, భార్య హైమావతి వేరొక గదిలోనూ శ్లాబ్‌కు ఉన్న ఐరన్ హుక్కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. వారి ఇంటికి విద్యుత్ బిల్లులు తీయడానికి ఒక వ్యక్తి రావడంతో ఆ దంపతుల కుమారుడు శశి వచ్చి ఇంటి తలుపులు తీశాడు. అప్పటికే ఇద్దరూ ఉరి వేసుకుని ఉండడాన్ని గమనించిన ఆ వ్యక్తి బయటకు వచ్చి విషయాన్ని గ్రామస్తులకు చెప్పాడు. ఇద్దరినీ కిందకు దించి చూడగా అప్పటికే చనిపోయినట్లు గుర్తించారు. పోలీసులకు చెప్పకుండా.. భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకొని మృతి చెందిన విషయాన్ని పోలీసులకు కూడా తెలియజేయకుండా వారి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు గోప్యత పాటించి, హడావుడిగా రెండు మృతదేహాలను శ్మశాన వాటికకు తీసుకువెళ్లి దహనం చేయడానికి ప్రయత్నించారు. విషయం లావేరు పోలీసులకు తెలియడంతో లావేరు ఎస్ఐ రామారావు, హెచ్‌సీ శ్రీనివాసరావులు తన సిబ్బందితో కలిసి చినమురపాక గ్రామానికి వెళ్లి, ఫైర్ ఇంజిన్‌ను తెప్పించి దహన సంస్కారాలను ఆపివేయించారు. సగం కాలిన మృతదేహాలను బయటకు తీయించి శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. మృతుడు శ్రీను కుటుంబ సభ్యులు, మృతురాలు హైమావతి కుటుంబ సభ్యులు ఒక అవగాహనకు రావడం వల్లనే ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేయకుండా గోప్యత పాటించినట్లు సమాచారం. తల్లిదండ్రులను కోల్పోయి.. ఆత్మహత్య చేసుకొని మృతి చెందిన భార్యాభర్తలకు శశి అనే ఎనిమిదేళ్ల కుమారుడు ఉన్నాడు. చినమురపాక గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో శశి 3వ తరగతి చదువుతున్నాడు. చిన్నతనంలోనే శశి తల్లిదండ్రులును కోల్పోయి అనాథగా మిగిలాడు. బాలుడి పరిస్థితిని చూసి స్థానికులంతా కంట తడి పెట్టారు. మృతుడు శ్రీను వారి తల్లిదండ్రులకు ఒక్కడే కుమారుడు కాగా హైమావతి కూడా ఆమె తల్లిదండ్రులకు ఒక్కతే కుమార్తె. వీరి మృతితో ఇరుకుటుంబాల వారు గుండెలవిసేలా రోదించారు. వీరి మృతితో గ్రామంలో విషాదం నెలకొంది.