విషాదం: మహబూబ్‌నగర్‌ జిల్లాలో దంపతుల ఆత్మహత్య | Couple Commits Suicide In Mahabubnagar District | Sakshi
Sakshi News home page

విషాదం: మహబూబ్‌నగర్‌ జిల్లాలో దంపతుల ఆత్మహత్య

Published Tue, Oct 26 2021 2:04 PM | Last Updated on Tue, Oct 26 2021 2:04 PM

Couple Commits Suicide In Mahabubnagar District - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, మహబూబ్ నగర్: పట్టణంలోని మధురానగర్ కాలనీలో దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ధర్మాపూర్ గ్రామానికి చెందిన నర్సింహారెడ్డి, లత దంపతులు మధురానగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. అయితే గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న దంపతులు జీవితంపై విసుగుచెంది ఉదయం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. వారికి కూమారుడు, కుమార్తె ఉన్నారు.

కుమారుడు భరత్ కుమారెడ్డి ఉన్నత చదువుల కోసం ఆగస్టు నెలలో అమెరికా వెళ్లాడు. కూతురు సుష్మ ఇటీవలే సాప్ట్ ఉద్యోగంలో చేరింది. దంపతుల ఆత్మహత్యతో కాలనీలో విషాదఛాయలు అలముకున్నాయి. కాగా ఉదయం తాను జిమ్ కోసం వెళ్లివచ్చే సరికే ఉరేసుకున్నారని సుష్మ కన్నీటి పర్యంతమయ్యింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

చదవండి: (వైరల్‌: ధవణి దీనంగా.. ప్లీజ్‌ సీఎం తాతా వాటిని పూడ్చండి..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement