శివరామకృష్ణ, యామిని దంపతులు(ఫైల్), 9ఏళ్ల కొడుకు
సాక్షి, మిర్యాలగూడ: క్షణికావేశంలో ఓ ఇల్లాలు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మిర్యాలగూడ పట్టణంలోని ఇందిరమ్మ కాలనీలో చోటు చేసుకుంది. వన్‌టౌన్ పోలీసులు తెలిపిన వి వరాల ప్రకారం.. ఇందిరమ్మకాలనీకి చెందిన గుంటి శివరామకృష్ణ, యామిని భార్యాభర్తలు. వీరికి 11ళ్ల క్రితం వివాహం కాగా పట్టణంలోని రాజీవ్‌చౌక్ సమీ పంలో మీసేవా కేంద్రం నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. వీరికి 9ఏళ్ల కుమారుడు ఉన్నాడు.
శుక్రవారం సాయంత్రం ఇంట్లో భార్యాభర్తల మధ్య కొద్దిపాటి ఘర్షణ చోటుచేసుకోగా శివరామకృష్ణ తన సెల్‌ఫోన్‌ను ఇంట్లోనే వదిలేసి ఆవేశంగా బయటకు వెళ్లిపోయాడు. అనంతరం యామిని ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కొద్దిసేపటి తర్వాత కింద పోర్షన్‌లో ఉన్న అత్తామామ పైకి వెళ్లి తలుపు తెరిచి చూడగా యామిని చున్నీతో ఉరేసుకుని ఉండటం గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న వన్‌టౌన్ ఎస్‌ఐ శ్రీనునాయక్ ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.
కాగా భార్య యామిని మృతిచెందిన విషయాన్ని తెలుసుకున్న శివరామకృష్ణ మనస్తాపంతో నందిపాడు సమీపంలోని సాగర్ కాల్వలో దూకినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కాల్వ కట్ట వద్ద శివరామకృష్ణకు బైక్ ఉండటంతో వారి అనుమానాలకు బలం చేకూరుస్తోంది. కాగా భార్యాభర్తలు ఇద్దరూ సెన్సిటివ్‌గా ఉంటారని, క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయంతో వారి కుమారుడు ఒంటరి వాడయ్యాడని కాలనీవాసులు పేర్కొన్నారు.
చదవండి: Medak: చేపల కూరతో భోజనం.. నాలుగేళ్లు నరకం చూపిన చేపముల్లు
·
Comments
Please login to add a commentAdd a comment