husband wife dispute
-
నల్లగా ఉంటే భర్త కాకుండా పోతాడా? కర్ణాటక హైకోర్టు
బెంగుళూరు: భర్త నల్లగా ఉన్నాడని భార్యా అదేపనిగా కించపరచడాన్ని కర్ణాటక హైకోర్టు తప్పు బట్టింది. అదొక క్రూరమైన చర్యగా పరిగణిస్తూ.. దీన్నే బలమైన కారణంగ చెబుతూ ఆ జంటకు విడాకులు మంజూరు చేసింది కర్ణాటక హైకోర్టు. తన భర్త నల్లగా ఉన్నాడంటూ ఓ భార్య అతడిని తరచుగా ఆవమానించడంతో ఆ భర్త విసుగు చెంది విడాకుల కోసం హైకోర్టును ఆశ్రయుయించాడు. కోర్టు ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత భర్త ఎంత నల్లగా ఉన్నా అతడు నల్లగా ఉన్నాడని ఎద్దేవా చేయడం క్రూరత్వమేనని తెలుపుతూ 44 ఏళ్ల భర్తకు తన 41 ఏళ్ల భార్య నుంచి విముక్తి కలిగిస్తూ విడాకులు మంజూరు చేసింది కర్ణాటక కోర్టు. బెంగుళూరుకు చెందిన ఓ జంటకు 2007లో పెళ్లయింది. కొన్నాళ్ళకి వారిద్దరికి ఒక అడ బిడ్డ కూడా జన్మించింది. కానీ తరచుగా వారు గొడవ పడుతుండడం.. మాటల మధ్యలో నువ్వు నల్లగా ఉన్నావంటూ ఆమె తిట్టడం.. ఇదొక దైనందిన ప్రక్రియలా కొనసాగేది. దీంతో విసుగు చెందిన ఆ భర్త ఆమె నుండి వేరుగా ఉంటూ 2012లో విడాకుల కోసం ఫ్యామిలి కోర్టును ఆశ్రయించాడు. తన బిడ్డ కోసమే ఆ అవమానాలన్నిటినీ భరించానని ఇక తన వల్ల కాదంటూ పిటిషన్లో పేర్కొన్నాడు. భర్త విడాకుల కోసం కోర్టుకెక్కడంతో కోపోద్రిక్తురాలైన ఆ భార్య.. తన అత్తమామలు తనను బాగా చిత్ర హింసలకు గురిచేస్తున్నారని, అదనపు కట్నం తీసుకు రావాలంటూ వేధిస్తున్నారని చెబుతూ భర్త సహా అందరిపై గృహ హింస చట్టం కింద కేసు నమోదు చేసింది. తన భర్తకు వేరే మహిళతో అక్రమ సంబంధం కూడా ఉందంటూ ఆరోపణలు చేసింది. అనంతరం తన బిడ్డను తన తల్లిదండ్రుల వద్దకు పంపించేసింది. అయితే ఐదేళ్లపాటు సాగిన వాదనలు, వాయిదాలు తర్వాత 2017లో ఫ్యామిలి కోర్టు భర్త విడాకుల పిటిషన్ ను తోసిపుచ్చింది. అయినా కూడా శాంతించని భర్త విడాకుల కోసం ఏకంగా హైకోర్టును ఆశ్రయించాడు. చివరకు హైకోర్టు కేసు పూర్వాపరాలను పరిశీలించి ఆమె తన భర్తపై చేసిన అక్రమ సంబంధాల ఆరోపణలు నిరాధారమైనవి, నిర్లక్ష్యమైనవని తెలుపుతూ భర్త నల్లగా ఉన్నాడని అవమానించడం కౄరత్వంతో సమానమని చెబుతూ ఆ భర్త కోరినట్లుగా విడాకులు మంజూరు చేసింది. ఇది కూడా చదవండి: రాజ్యసభ నుంచి టీఎంసీ ఎంపీ సస్పెన్షన్ -
చిన్నపాటి ఘర్షణ.. భార్య ఆతహత్య.. సాగర్ కాల్వలో దూకిన భర్త?
సాక్షి, మిర్యాలగూడ: క్షణికావేశంలో ఓ ఇల్లాలు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మిర్యాలగూడ పట్టణంలోని ఇందిరమ్మ కాలనీలో చోటు చేసుకుంది. వన్‌టౌన్ పోలీసులు తెలిపిన వి వరాల ప్రకారం.. ఇందిరమ్మకాలనీకి చెందిన గుంటి శివరామకృష్ణ, యామిని భార్యాభర్తలు. వీరికి 11ళ్ల క్రితం వివాహం కాగా పట్టణంలోని రాజీవ్‌చౌక్ సమీ పంలో మీసేవా కేంద్రం నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. వీరికి 9ఏళ్ల కుమారుడు ఉన్నాడు. శుక్రవారం సాయంత్రం ఇంట్లో భార్యాభర్తల మధ్య కొద్దిపాటి ఘర్షణ చోటుచేసుకోగా శివరామకృష్ణ తన సెల్‌ఫోన్‌ను ఇంట్లోనే వదిలేసి ఆవేశంగా బయటకు వెళ్లిపోయాడు. అనంతరం యామిని ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కొద్దిసేపటి తర్వాత కింద పోర్షన్లో ఉన్న అత్తామామ పైకి వెళ్లి తలుపు తెరిచి చూడగా యామిని చున్నీతో ఉరేసుకుని ఉండటం గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న వన్‌టౌన్ ఎస్ఐ శ్రీనునాయక్ ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు. కాగా భార్య యామిని మృతిచెందిన విషయాన్ని తెలుసుకున్న శివరామకృష్ణ మనస్తాపంతో నందిపాడు సమీపంలోని సాగర్ కాల్వలో దూకినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కాల్వ కట్ట వద్ద శివరామకృష్ణకు బైక్ ఉండటంతో వారి అనుమానాలకు బలం చేకూరుస్తోంది. కాగా భార్యాభర్తలు ఇద్దరూ సెన్సిటివ్‌గా ఉంటారని, క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయంతో వారి కుమారుడు ఒంటరి వాడయ్యాడని కాలనీవాసులు పేర్కొన్నారు. చదవండి: Medak: చేపల కూరతో భోజనం.. నాలుగేళ్లు నరకం చూపిన చేపముల్లు · -
విశాఖలో శ్రావణి అనే మహిళ ఆత్మహత్య
-
3 నెలల కిందటే ప్రేమ పెళ్లి.. పెట్రోల్ పోసుకొని వివాహిత ఆత్మహత్య
సాక్షి, విశాఖపట్నం: విశాఖ నగరంలో విషాదం చోటుచేసుకుంది. ఎంవీపీ కాలనీ పోలీస్ స్టేషన్ ముందు ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. శ్రావణి అనే మహిళ పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుంది. అప్రమత్తమైన పోలీసులు ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఆమె మృతిచెందింది. మంటలార్పేందుకు ప్రయత్నించిన ఎస్సైకు గాయాలయ్యాయి. వివరాలు.. గుంటూరుకు చెందిన శ్రావణికి, విశాఖకు చెందిన వినయ్‌తో మూడు నెలల కిందటే ప్రేమ వివాహం జరిగింది. వినయ్‌కు మద్యం అలవాటు కారణంగా భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో భర్త మద్యానికి బానిసై తనను వేధిస్తున్నాడని పోలీసులకు శ్రావణి ఫిర్యాదు చేసింది. భార్యభర్తలకు కౌన్సిలింగ్ ఇచ్చేందుకు పోలీసులు గురువారం పోలీస్ స్టేషనకు పిలిపించారు. దంపతులకు ఎస్సై శ్రీనివాస్ కౌన్సిలింగ్ ఇస్తుండగానే ఇద్దరి మధ్య మళ్లీ గొడవ జరిగింది. మనస్తాపంతో స్టేషన్ బయటికి వచ్చిన శ్రావణి.. ఒంటిపై పెట్రోల్ పొసుకొని నిప్పంటించుకుంది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు మంటలు ఆర్పేందుకు యత్నించారు. ఈ క్రమంలో ఎస్సై శ్రీనివాస్ చేతికి గాయాలయ్యాయి. తీవ్ర గాయాలపాలైన శ్రావణిని పోలీసులు సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతిచెందింది. పోలీసులు గుంటూరులోని శ్రావణి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి.. భర్తను అదుపులోకి తీసుకున్నారు. -
హృదయ విదారకం; నాన్నను చూడాలంటూనే.. మృత్యువొడికి
వడమాలపేట: భార్యపై కోపంలో కొడుకుపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన ఘటనలో చికిత్స పొందుతూ కోలుకోలేక బాలుడు మృత్యువొడి చేరాడు. వివరాలివీ.. తిరుపతి జిల్లా వడమాలపేట మండలం బట్టీకండ్రిగ ఆది ఆంధ్ర వాడకు చెందిన రమేష్‌కు భార్య ఐశ్వర్యతో గత కొంతకాలంగా మనస్పర్థలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తరచూ గొడవ పడటం, విషయం పోలీసుస్టేషన్‌కు వెళ్లడం జరుగుతోంది. అయితే గత సోమవారం కూడా ఇద్దరి మధ్య గొడవ చోటు చేసుకోగా ఐశ్వర్య అదే గ్రామంలోని పుట్టింటికి వెళ్లింది. అప్పటికే మద్యం మత్తులోని రమేష్.. ఆ కోపాన్ని కుమారుడు మహేష్(7)పై చూపుతూ పెట్రోల్ పోసి నిప్పంటించాడు. రెండు రోజులుగా తిరుపతి రుయాలోని చిన్న పిల్లల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి బుధవారం రాత్రి కన్నుమూశాడు. కన్న తండ్రే ఇంతటి ఘాతుకానికి పాల్పడినా.. ఆసుపత్రిలో చివరి శ్వాస వరకు నాన్నను చూడాలని కోరడం, ఆ కోరిక తీరకుండానే తుదిశ్వాస విడిచిన తీరు హృదయ విదారకం. ప్రేమించి పెళ్లి చేసుకున్నా.. అనుమానం పెనుభూతమై ఆ కుటుంబంలో రగిల్చిన చిచ్చు ఆ ప్రేమకు ప్రతిరూపమైన చిన్నారినే బలితీసుకోవడం శోచనీయం. -
భార్యపై కోపంతో.. ఎనిమిదేళ్ల కుమారుడికి నిప్పుపెట్టిన తండ్రి!
ప్రేమ.. ప్రేమ.. ప్రేమ.. మనసులు కలిసి, మనుషులు ముడిపడే వరకు ఎంతకైనా తెగిస్తుంది. తల్లిదండ్రులను ఎదురిస్తుంది.. బంధుత్వాలను దూరం చేస్తుంది.. కల సాకారం చేసుకున్నా, ప్రేమను గెలిపించుకున్నా.. కొన్ని జీవితాలే కలకాలం నిలుస్తున్నాయి. ఇంకొన్ని రోజులు గడిచేకొద్దీ బలహీనపడి ప్రాణాలు తీసుకునే స్థాయికి చేరుతున్నాయి. ఈ కోవలోనే ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట మధ్య పెరిగి పెద్దదైన అనుమానం వారి ప్రేమకు ప్రతిరూపంగా నిలిచిన కన్న కొడుకునే మంటల్లోకి నెట్టడం ప్రేమ‘కులం’లో కలంకం. భార్యపై కోపం కొడుకుకు శాపమైంది. ఈ రోజు చంపేస్తానని ఉదయం నుంచీ తిట్టిపోశాడు. పోలీసుల భయంతో పినాయిల్ తాపించాడు.. తాగిన మైకంలో పెట్రోల్ పోసి నిప్పంటించాడు.. ఒళ్లంతా కాలిన గాయాలు.. ఒకటే మంట.. ప్రాణం నిలుస్తుందో లేదో తెలియదు.. ఇప్పుడు కూడా నవమాసాలు మోసి జన్మనిచ్చిన తల్లికంటే ఆ చిన్నారి మనసు నాన్ననే కోరుకుంటోంది.. చంపేందుకు యత్నించినా ఆ పసి హృదయం నాన్నను చూడాలి, ఎక్కడని రోదిస్తున్న తీరు అందరినీ కన్నీళ్లు పెట్టిస్తోంది. అతను డిగ్రీ పూర్తి చేస్తే.. ఆమె ఇంటర్ చదివింది. రెండేళ్ల పాటు ప్రేమించుకున్నారు. సామాజిక వర్గం ఒకటే కావడం.. పైగా బంధువులు, ఇరువైపులా ఎలాంటి పట్టింపులు లేకపోవడంతో పెళ్లితో ఒక్కటయ్యారు. కోరుకున్న జీవితం సాకారం కావడంతో ఆ ఇద్దరికీ మరో ఇద్దరు పిల్లలు.. సంసారం సాఫీగా సాగిపోతున్న తరుణంలో అనుమానం పెనుభూతమైంది.. తాగుడు తోడై ఆ కుటుంబంలో చిచ్చు రగిల్చింది.. ఏకంగా కన్న కొడుకునే బలితీసుకునే వరకు వెళ్లింది.. ఈ హృదయ విదారక ఘటనకు బట్టికండ్రిగ( నారాయణపురం) పంచాయతీ ఆదిఆంధ్ర వాడ మౌన సాక్ష్యంగా నిలిచింది. వడమాలపేట: బట్టికండ్రిగ(నారాయణపురం) పంచాయతీ, ఆదిఆంధ్ర వాడకు చెందిన చెంగల్రాయుడు, లక్ష్మమ్మ కుమారుడు రమేష్ పుత్తూరులో డిగ్రీ పూర్తి చేశాడు. అదే గ్రామానికి చెందిన బుల్లయ్య, రమణమ్మ కుమార్తె ఐశ్వర్య తిరుపతిలోని ఓ కార్పొరేట్ కాలేజీలో ఇంటర్ చదివింది. ఒకే సామాజిక వర్గం, పైగా బంధుత్వం ఉండడంతో.. ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. రెండేళ్ల అనంతరం ఇరు కుటుంబాల సమ్మతితో ఇద్దరూ ఒక్కటయ్యారు. ఓ ప్రయివేట్ కంపెనీలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ జంటకు భవనశ్రీ(9), మహేష్(7) సంతానం. పాప నాలుగో తరగతి చదువుతుండగా, బాబు రెండో తరగతి. సంసారం సాఫీగా సాగిపోతున్న తరుణంలో రమేష్ కళ్లను అనుమాన భూతం కమ్మేయగా.. తాగుడుకు బానిసయ్యాడు. ఐశ్వర్యను మానసికంగా, శారీరకంగా హింసించసాగాడు. ఒకానొక సమయంలో ఆమె ఈ బాధలు భరించలేక పోలీసులను ఆశ్రయించింది. వాళ్లు సర్దిచెప్పి పంపడం.. ఆ తర్వాత పలుమార్లు వేధింపులతో ఆ ఇద్దరి మధ్య దూరం పెరిగింది. భార్య కనిపించకపోవడంతో.. వారం రోజుల క్రితం రమేష్, ఐశ్వర్యల మధ్య చోటు చేసుకున్న గొడవలో ఆమె చేయి విరిగింది. నొప్పికి తాళలేక విషయాన్ని అదే ప్రాంతంలోని తల్లి ఇంటికి వెళ్లి చెప్పుకుంది. ఆమె కూతురిని ఓదార్చి పుత్తూరు సమీపంలోని ఈశలాపురంలో కట్టు కట్టించి ఇంటికి తీసుకెళ్లింది. ఎంతైనా భర్త, పిల్లల మీద ప్రేమ.. ఆదివారం తిరిగి మెట్టింటికి చేరుకుంది. అయితే సోమవారం ఉదయాన్నే రమేష్ ఫూటుగా మద్యం సేవించి ఇంకా వంట చేయలేదని చేయి చేసుకున్నాడు. తన చేయి విరిగిందని, నిదానంగా చేసి పెడతానని బతిమాలినా మద్యం మత్తు చెలరేగింది. విధిలేని పరిస్థితుల్లో కుమార్తెను తీసుకొని తిరిగి పుట్టింటికి వెళ్లింది. పోలీసులకు ఫిర్యాదుతో.. తన కుమార్తెను అల్లుడు తరచూ చితకబాదడాన్ని తట్టుకోలేకపోయిన ఐశ్వర్య తల్లి జరిగిన విషయాన్ని వడమాలపేట పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. స్పందించిన పోలీసులు రమేష్‌కు ఫోన్ చేసి స్టేషన్‌కు రావాలని పిలిచారు. ఉదయం భార్య వెళ్లినప్పటి నుంచి ఈ రోజు నిన్ను చంపుతానని కొడుకుపై ప్రతాపం చూపించిన రమేష్.. ఇదే సమయంలో పోలీసుల నుంచి ఫోన్ రావడంతో తన కుమారుడు ప్రాణాపాయంలో ఉన్నాడని అప్పటికప్పుడు పినాయిల్ తాపించాడు. ఆసుపత్రికి తీసుకెళ్తున్నానని చెప్పి పుత్తూరుకు చేరుకున్నాడు. అక్కడ ఓ ఆసుపత్రిలో చికిత్స చేయించి ఇద్దరూ ఇంటికొచ్చారు. అప్పటికీ భార్య కనిపించకపోవడంతో స్కూటర్‌పై పిల్లాడితో కలిసి పెట్రోల్ బంకులో ఓ బాటిల్ పెట్రోల్ కొనుగోలు చేశాడు. ఆ తర్వాత ఇంటికి సమీపంలో నడి రోడ్డుపై అందరూ చూస్తుండగానే కుమారునిపై పెట్రోల్‌పోసి నిప్పంటించాడు. సమీప బంధువు నాగరాజు తేరుకొని తన లుంగీతో మంటలు ఆర్పేందుకు యత్నించాడు. ఇంతలో స్థానికులు తోడై మంటలను అదుపుచేసి 108లో బాలుడిని తిరుపతి రుయాకు తరలించారు. ప్రాణాప్రాయ స్థితిలో నాన్న కోసం.. భుజాలపై మోస్తూ.. బండిపై తిప్పుతూ.. అడిగిందల్లా కొనిస్తూ.. కోరిందల్లా తినిపిస్తూ ఎంతో ప్రేమ చూపించిన నాన్న, ఆ రోజు ఎందుకలా చేశాడో ఆ పసి హృదయానికి ఇప్పటికీ అర్థం కాలేదు. పినాయిల్ తాపించినా తాగేశాడు.. పెట్రోల్ పోసినా ఎందుకని అడగలేదు.. చివరకు నిప్పు పెట్టినా బెదరలేదు.. ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య ఇప్పటి కీ నాన్ననే కలవరిస్తున్నాడు. నాన్న కావాలి, ఎక్కడ ని రోదిస్తున్న తీరుతో ఆ తల్లి కన్నీటి పర్యంతమవుతోంది. మెరుగైన చికిత్సకు మంత్రి రోజా ఆదేశం ఈ హృదయ విదారక ఘటనతో మంత్రి రోజా చలించిపోయారు. బాబు ఆరోగ్య పరిస్థితిపై రుయా వైద్యలతో ఆరా తీశారు. శరీరం బాగా కాలిపోయిందని, కొద్ది రోజులు గడిస్తే కాని ఏమీ చెప్పలేమనడంతో మెరుగైన వైద్యం అందించాలని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను ఆదేశించారు. మండల తహసీల్దార్ రోశయ్య కూడా బాధిత కుటుంబాన్ని ఆసుపత్రిలో పరామర్శించారు. ఘటన విషయమై ఎస్ఐ రామాంజనేయులు విలేకరులతో మాట్లాడుతూ రమేష్‌ను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. అతని మానసిక స్థితి బాగోలేదని, కేవలం భార్యపై అనుమానంతోనే ఇలా చేసినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైందన్నారు. -
మద్యానికి బానిసైన భర్త.. ఇంటి నుంచి వెళ్లగొట్టిన భార్య.. ప్రతీకారంతో..
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. ఓ 45 ఏళ్ల వ్యక్తి తన భార్యను పొడిచి చంపి, కత్తితో నేరుగా స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. పోలీసుల వివరాల ప్రకారం..‘‘ఢిల్లీలోని మంగోల్‌పురిలోకి చెందిన సమీర్(45) అనే వ్యక్తి మద్యానికి బానిసయ్యాడు. తరచూ డబ్బులు కావాలని భార్య షబానాతో గొడవ పడేవాడు. దీంతో విసుగు చెందిన భార్య నెల క్రితం అతడిని ఇంటి నుంచి బయటకు వెళ్లగొట్టింది. అప్పటి నుంచి అతను వీధుల్లో నివసిస్తున్నాడు. తాను నిరాశ్రయుడు కావడానికి తన భార్య కారణం అని ప్రతీకారంతో.. శనివారం ఉదయం భార్య షబానాతో ఘర్షణ పడి హత్య చేశాడు. అంతేకాకుండా భార్యను కత్తితో పొడిచి చంపి స్టేషన్లో లొంగిపోయాడు.’’ అని తెలిపారు. కాగా, ఈ ఘటనపై నిందితుడుని మంగోల్‌పురి స్టేషన్ పోలీసులు వెంటనే అరెస్టు చేశారు. ఇక అతని భార్య షబానా (40)ను స్థానికులు సంజయ్ గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా మృతి చెందింది. కాగా, ఈ జంటకు 21, 17 ఏళ్ల వయసు గల ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
దంపతుల పరస్పర దాడి భర్త మృతి.. భార్య పరిస్థితి విషమం
పాలకోడేరు(ఉండి): దంపతుల మధ్య మాటామాటా పెరిగి పట్టరాని ఆవేశంతో ఒకరినొకరు కొట్టుకోవడంతో భర్త మృతి చెందగా.. భార్య ఆస్పత్రి పాలై మృత్యువుతో పోరాడుతోంది. పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరు మండలం గొల్లలకోడేరులో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గొల్లలకోడేరు సంజనా అపార్ట్మెంట్లోని సివికా ఫ్లాట్–311లో కనుమూరి విజయరామరాజు (80), సరళాదేవి (70) కాపురం ఉంటున్నారు. వీరిద్దరిదీ ద్వితీయ వివాహమే. తరచూ ప్రతి విషయానికీ కీచులాడుకునేవారు. సోమవారం ఉదయం కూడా వీరిద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది. బంధువుల ఇంటికి పెళ్లిళ్లకు వెళ్లి నెల రోజులు ఉండి వస్తానని భార్య అంటే.. తాను కుమారుడి ఇంటికి వెళ్తానని భర్త అన్నాడని చుట్టుపక్కల వారు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మాటామాటా పెరిగింది. దీంతో పచ్చడి చేసుకునే పొత్రంతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. దీంతో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. కొద్దిసేపటికి భర్త మృతి చెందగా, భార్య అపస్మారక స్థితిలోకి వెళ్లింది. అదే అపార్ట్మెంట్లోని 411 ఫ్లాట్‌లో ఉంటున్న సమీప బంధువు సమాచారం తెలుసుకుని అక్కడికి వచ్చి తలుపులు బద్దలుకొట్టి లోపలికి ప్రవేశించారు. ప్రాణాలతో ఉన్న సరళాదేవిని భీమవరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. -
ఫ్యామిలీ గ్రూప్‌లో నగ్న చిత్రాలు.. కాపురంలో చిచ్చు
ఫోన్ పోతే లైట్ తీసుకునేవాళ్లకు ఒక అలర్ట్ లాంటిది ఈ ఘటన. ఫోన్ చోరీకి గురైందని పట్టించుకోకుండా ఉండిపోయింది ఆమె. అయితే నెలరోజుల తర్వాత ఆమె వాట్సాప్ నుంచే ఫ్యామిలీ గ్రూప్‌లో ఆమెవేనంటూ నగ్న ఫొటోలు, అశ్లీల వీడియోలు షేర్ చేశాడు ఆ దొంగ. అంతేకాదు పని చేసే చోట ఆమె ఎఫైర్లు పెట్టుకుందంటూ ఆమె భర్తకే కాల్ చేసి చెప్పాడు. కాపురంలో చిచ్చు పెట్టిన ఫోన్ చోరీ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. భోపాల్: గ్వాలియర్‌కు చెందిన మహిళ(28) స్థానికంగా ఆస్పత్రిలో నర్స్‌గా పనిచేస్తోంది. నెల క్రితం ఫోన్ పోగా.. ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఆపై కొత్త ఫోన్ కొనుక్కుని వాడుకుంటోంది. పది రోజుల కిందట కుటుంబ సభ్యులకు, ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్‌లో ఆమె నగ్న చిత్రాలు, అశ్లీల దృశ్యాలు షేర్ అయ్యాయి. అవి చూసి ఆమె కంగుతింది. తన ప్రమేయం లేకుండా తన వాట్సాప్ నుంచే అవి పోస్ట్‌కావడంతో భయపడింది. ఈలోపు ఆమె భర్తకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. ప్రతీకాత్మక చిత్రం ఖంగుతిన్న భర్త ఆమె పనిచేస్తున్న ఆస్పత్రిలో మేల్ స్టాఫ్‌తో శారీరక సంబంధం పెట్టుకుందని, అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు తన దగ్గర ఉన్నాయని ఆ ఆగంతకుడు ఆమె భర్తకి ఫోన్లో చెప్పాడు. అంతటితో ఆగకుండా కొన్ని పంపాడు కూడా. దీంతో ఆమె భర్త షాక్ తిన్నాడు. నిలదీయడంతో భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ మొత్తం వ్యవహారంతో పరువు పొగొట్టుకున్న ఆ యువతి.. మహరాజ్‌పుర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ప్రతీకాత్మక చిత్రం అవి మార్ఫింగ్‌వి! కాగా, తనవని ప్రచారం జరుగుతన్న ఫొటోలు, వీడియోలు ఎవరో మార్ఫ్ చేసినవని ఆమె వాపోయింది. ఈ మేరకు మీడియా ముందుకు వచ్చిన ఆమె.. వాటిని షేర్ చేయొద్దని ప్రజలకు రిక్వెస్ట్ చేసింది. ఈ విషయంలో భర్త కుటుంబంతో రాజీ చర్చలు జరుపుతున్నామని ఆమె బంధువు ఒకరు తెలిపారు. కాగా, వేధింపులు, బ్లాక్‌మెయిలింగ్ నేరాల కింద కేసు నమోదు చేసుకున్న మహరాజ్‌పుర పోలీసులు.. సైబర్ క్రైమ్ వింగ్సాయంతో కేసును చేధించి నిందితుడిని పట్టుకునే పనిలో పడ్డారు. -
భార్యభర్తల గొడవ ఎంత పనిచేసింది..
సాక్షి, లక్ష్మణచాంద(నిర్మల్): రోడ్డు నిర్మాణం సందర్భంగా పెట్టిన సేప్టీ బోర్డును బైక్‌తో డీకొట్టి వ్యక్తి మృతి చెందిన సంఘంటన మండలంలోని కనకాపూర్ సమీపంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే మేక గోపీచంద్ (42) మేదరిపేట్ గ్రామానికి చెందిన వ్యక్తి. నిర్మల్ జిల్లా కేంద్రంలోని గొల్లపేట్‌లో భార్యా పిల్లలతో నివాసముంటున్నాడు .శుక్రవారం ఇంటి వద్ద తన అత్తమ్మ విషయంలో భార్యా భర్తలు గొడవ పడ్డారు. రాత్రి బాగా పొద్దుపోయాక తమ స్వగ్రామమైన మేదరిపేట్‌కు వెళ్తానని చెప్పి నిర్మల్ నుండి బయలు దేరాడు. మండలంలోని కనకాపూర్, బాబా పూర్ గ్రామాల మధ్య రోడ్డు నిర్మాణం సందర్బంగా రోడ్డుకు అడ్డంగా పెట్టిన సేప్టీ బోర్డును అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో వేగంగా డీకొట్టుకొని బ్రిడ్జీ నిర్మాణం కోసం పక్కనే తీసిన పిల్లరు గోతిలో పడిపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. భార్య మేదరి విజయలక్ష్మి ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఇన్చార్జ్ ఎస్సై వినయ్‌కుమార్ తెలిపారు. మృతునికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
విషాదం: ఒకే కుటుంబంలో ముగ్గురు..
సాక్షి, కొమురం భీమ్ : ఆసీఫాబాద్ జిల్లా చింతలమానెపల్లి మండలం బూరపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. భార్య భర్తల మధ్య ఏర్పడిన గొడవ కారణంగా నక్క రాజు అనే వ్యక్తి భార్య తన కూతురిని వెంట తీసుకొని మహారాష్ట్ర లోని వారి పుట్టింటికి వెళ్తున్న అని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లింది. అనంతరం కూతురితో కలిసి తల్లి ప్రాణహిత నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న భర్త నక్క రాజు తన ఇంటి దగ్గర ఉన్న బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాగా వీరికి ఇద్దరు కూతుర్లు ఉన్నారని సమాచారం. చదవండి: సైబర్ టవర్ సిగ్నల్ వద్ద రోడ్డు ప్రమాదం చదవండి: జగిత్యాలలో దంపతుల ఆత్మహత్య -
భార్యతో గొడవ, ఆ వ్యక్తి ఏం చేశాడంటే...
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో దారుణం చోటు చేసుకుంది. తల్లిదండ్రుల మధ్య జరిగిన గొడవకు మూడేళ్ల పసిపాప బలైయ్యింది. భార్యభర్తల మధ్య గొడవ జరుగుతుండగా కోపంతో ఆమె భర్త పసి పాపను నేలకు వేసి బలంగా కొట్టాడు. దీంతో పాప అక్కడికి అక్కడే మరణించింది. ఈ సంఘటనలో పాప తల్లి కూడా తీవ్రంగా గాయపడింది. సెక్టార్ 49 పోలీస్ స్టేషన్ పరిధిలోని బరోలా గ్రామంలో ఈ విషాదకర సంఘటన చోటు చేసుకుంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరే సమయానికి మహిళ తీవ్రంగా గాయపడినట్లు, చిన్నారి అప్పటికే మరణించినట్లు అధికారులు తెలిపారు. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించినట్లు నోయిడా అదనపు పోలీస్ కమిషనర్ రణవిజయ్ సింగ్ చెప్పారు. నిందితుడు రోజు మద్యం సేవించి, భార్యతో తరచూ గొడవలు పడేవాడని చుట్టు పక్కల వారు తెలిపారు. నిన్న గొడవ జరిగే సమయంలోనూ అతడు మందు తాగి ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుడిని బులంద్‌షహర్ జిల్లాకు చెందిన అమిత్‌గా గుర్తించినట్లు పోలీసులు ప్రకటించారు. నోయిడాలో పనిచేసే అతను ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పాప చనిపోయిందన్న విషయాన్ని అతడు తన భార్య రేణు కుటుంబానికి సమాచారం ఇచ్చాడని, అయితే పాప చనిపోవడానికి గల కారణాన్ని వారికి తప్పుగా చెప్పాడని అతని అత్తమామలు వెల్లడించారు. ఈ ఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశామని, అమిత్‌ను అరెస్ట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. చదవండి: చిన్నారి ప్రాణం తీసిన బిస్కెట్లు -
భార్యాభర్తల గొడవ, పోలీస్‌కు చెంపదెబ్బ
తిరువొత్తియూరు: భార్యాభర్తల గొడవలో పరమేశ్వరుడు తలదూర్చినా తలనొప్పులు తప్పవన్న నానుడికి సరిగ్గా అబ్బేలా ఓ సంఘటన నగరంలో గురువారం జరిగింది. భార్యాభర్తల మధ్య గొడవ సరిచేయాలని ప్రయత్నించిన పోలీసులకు చెంప దెబ్బ తప్పలేదు. వివరాలు.. గిండి స్టేషన్ కానిస్టేబుల్ శశికుమార్, జోసఫ్ గురువారం వేకువజామున 1.30 గంటల సమయంలో గస్తీ పనుల్లో నిమగ్నమయ్యారు. ఆ సమయంలో గిండి పడువాంకరై, మసూది కాలనీ 17వ వీధికి వెళ్లారు. అక్కడ భార్య, భర్త గొడవపడుతూ ఉన్నారు. తన భర్త మద్యం సేవించి వచ్చి తనను వేధిస్తున్నట్లు భార్య తెలిపింది. అప్పుడు శశికుమార్ ఆమె భర్త వద్ద విచారించడానికి వెళ్లాడు. తీవ్ర మద్యం మత్తులో ఉన్న ఆ వ్యక్తి నా భార్య నా ఇష్టం అంటూ.. కానిస్టేబుల్ శశికుమార్ చెంప పగులగొట్టాడు. అతని పేరు ఉమర్ అని తెలిసింది. దీంతో అతడిని స్టేషన్‌కు తీసుకెళ్లారు. మత్తులో ఉండడంతో ఉమర్‌ను గురువారం విచారణ చేపట్టారు. పోలీసుపై చేయి చేసుకున్న సంఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది. -
పిల్లల్ని సంపులో పడేసి.. ఒంటిపై కిరోసిన్ పోసుకుని
సాక్షి, చెన్నై : భార్యాభర్తల మధ్య ఉన్న తగాదాలు ఇద్దరు పిల్లలను బలికొన్నాయి. ఈ సంఘటన శుక్రవారం తమిళనాడులోని తిరుపూరు జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. తిరుపూరు జిల్లా పూమలూరుకు చెందిన శివరంజని అనే మహిళకు భర్తతో గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. శుక్రవారం ఉదయం కూడా ఇరువురి మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ సందర్భంగా భర్త ఆమెను కొట్టడంతో మనోవేదనకు గురైంది. దీంతో ఆత్మహత్య చేసుకోవాలని నిశ్చయించుకుంది. ముందుగా ఆరు నెలల కుమార్తెను, ఏడు సంవత్సరాల కుమారున్ని ఇంటి ముందు ఉన్న నీటి సంపులో పడేసింది. నీటిలో ఊపిరాడక పిల్లలిద్దరూ చనిపోయారని ధ్రువీకరించుకున్న శివరంజని వంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. మంటల్లో కాలుతున్న ఆమె గట్టిగా కేకలు వేయటం మొదలుపెట్టింది. ఆమె కేకలు విన్న ఇరుగు పొరుగు వారు మంటలు ఆర్పి కోయంబత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం శివరంజని ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. భార్యాభర్తల నడుమ గొడవ ఇద్దరు చిన్నారులను బలి కొనటం తిరుపూరు జిల్లాలో కలకలం సృష్టించటమే కాకుండా విషాదం నింపింది. -
నా పెళ్లాంతో గొడవ పడుతుంటే అడ్డొస్తావా!
తాను తన భార్యతో గొడవ పడుతుంటే.. మధ్యలో అడ్డు తగిలినందుకు ఓ వైద్యుడిని చితక్కొట్టాడో పెద్దమనిషి. విషయం ఏమిటంటే, ఓ మహిళను ఆమె భర్త శివకుమార్ (33) తీవ్రంగా కొట్టడంతో గాయపడి.. మెట్టుపాళ్యంలో గల ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతోంది. శుక్రవారం నాడు ఆమెకు ఓ వైద్యుడు చికిత్స చేస్తున్న సమయంలో శివకుమార్ అక్కడకు వచ్చాడు. ఆమెను తిట్టడం మొదలుపెట్టాడు. అయితే, వైద్యుడు కలగజేసుకుని.. ఆమెకు అసలే బాగోలేదని, ఎందుకలా చేస్తున్నావని అడగడంతో అసలు తన భార్యకు చికిత్స చేయడానికి నువ్వెవరంటూ ఆ వైద్యుడిపై తిరగబడ్డాడు. ఆయనను బాగా కొట్టడమే కాక, మళ్లీ ఇలా మధ్యలో అడ్డొస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించాడు. వైద్యుడి ఫిర్యాదుతో పోలీసులు శివకుమార్‌ను అరెస్టు చేసి మెట్టుపాళ్యం కోర్టులో ప్రవేశపెట్టగా, కోర్టు అతడిని 15 రోజుల రిమాండుకు పంపింది.