భార్య వివాహేతర సంబంధం.. తట్టుకోలేక భర్త ఆత్మహత్య.. 12 గంటల్లోనే | Bhopal: Woman Husband Suicide Them Self Over Extra Marital Affair | Sakshi
Sakshi News home page

వివాహేతర సంబంధం.. భర్త చనిపోయిన 12 గంటల్లోనే భార్య ఆత్మహత్య

Published Sat, Nov 6 2021 7:32 PM | Last Updated on Sat, Nov 6 2021 8:38 PM

Bhopal: Woman Husband Suicide Them Self Over Extra Marital Affair - Sakshi

భర్తతో సుధ

వివాహేతర సంబంధం రెండు నిండు ప్రాణాలను బలి తీసుకుంది. కట్టుకున్న భార్య  వివాహేతర సంబంధాన్ని తట్టుకోలేని భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భర్త చనిపోయిన వార్త తెలిసిన 12 గంటల్లోనే భార్య సైతం బలవన్మరణానికి పాల్పడింది. తల్లిదండ్రుల ఆత్మహత్యతో నాలుగేళ్ల బిడ్డ అనాథగా మారిపోయింది. ఈ ఘోర ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. భోపాల్‌లోని టీటీ నగర్‌కు చెందిన 25 ఏళ్ల గొల్లు బలన్ అనే వ్యక్తికి 22 ఏళ్ల సుధతో మహిళతో ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి నాలుగేళ్ల కొడుకు ఉన్నాడు.
చదవండి: ‘నేను ఐపీఎస్‌ అధికారిని.. తొలిచూపులోనే నచ్చావ్‌.. పెళ్లి చేసుకుందాం’

అయితే ఇటీవల మహిళకు మరో వ్యక్తి సాగర్‌బాబాతో అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. భార్య, సాగర్‌ల మధ్య స్నేహం వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం భర్తకు తెలియడంతో భార్యభర్తలిద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. దీంతో వివామిత తన తల్లిగారింటికి వెళ్లింది. అయితే ఈ గొడవను పరిష్కరించుకునేందుకు భర్త ఎంత ప్రయత్నించినా సర్ధుమనగలేదు. దీంతో భర్త ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భర్త చనిపోయిన విషయం తెలియగానే భార్య సైతం పెట్రోల్ పోసుకొని నిప్పటించుకొని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే ఇంట్లో దొరికిన సుసైడ్‌ నోట్‌, కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు సాగర్‌పై కేసు నమోదైంది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
చదవండి: తప్పతాగి వేరే వాళ్ల ఇంటికి వెళ్లి గొడవ.. మాజీ ఎంపీని చితకబాదిన ఓనర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement