Bhopal
-
భార్య ముందు అంకుల్ అన్నందుకు చితక బాదాడు
భోపాల్: మధ్యప్రదేశ్ రాజధాని నగరం భోపాల్‌లో రెండు రోజుల క్రితం విచిత్ర సంఘటన జరిగింది. భార్యకు చీరలు కొనడానికి వెళ్లిన రోహిత్ అనే వ్యక్తి షాపు యజమానిని చితకబాదాడు. ఇంతకీ కారణమేంటంటే భార్యతో కలిసి చీరలు కొంటున్న రోహిత్‌కు షాపు యజమాని విశాల్ చాలా చీరలు చూపించాడు. ఎన్ని చీరలు చూసినా రోహిత్ దంపతులు ఒక్కటీ సెలెక్ట్ చేయలేదు. దీంతో విసుగెత్తిన విశాల్ మీకు వెయ్యి రూపాయల రేంజ్లో చీరలు కావాలా అని అడిగాడు. ‘మేం అంతకంటే ఎక్కువ రేంజ్ చీరలే కొనగలం, మమ్మల్ని తక్కువ అంచనా వేయకు’అని రోహిత్ షాపు యజమాని విశాల్‌పై అగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో విశాల్ స్పందిస్తూ ‘అంకుల్ మీకు అన్ని రేంజ్‌ల చీరలు చూపిస్తాను’అని వ్యంగ్యంగా సమాధానమిచ్చాడు. భార్య ముందు అంకుల్ అనడంతో రోహిత్ కోపం కట్టలు తెంచుకుంది. షాపు నుంచి వెళ్లిపోయి కొద్ది సేపటికి స్నేహితులను వెంటేసుకొచ్చి షాపు యజమాని విశాల్‌ను కర్రలు, బెల్టులతో చితకబాది అక్కడి నుంచి పారిపోయారు. ఇదీ చదవండి: బలవంతంగా ఉమ్మి నాకించారు -
Madhya Pradesh High Court: భారత్ మాతాకీ జై అనాల్సిందే
జబల్పూర్: మాతృదేశాన్ని మరచి శత్రుదేశాన్ని పొగిడిన వ్యక్తికి మధ్యప్రదేశ్ హైకోర్టు తగిన శిక్ష విధించింది. తుది తీర్పు వచ్చేదాకా నెలకు రెండు సార్లు పోలీస్‌స్టేషన్‌కు వచ్చి అక్కడి జాతీయ జెండాకు 21 సార్లు సెల్యూట్ చేయాలని, రెండు సార్లు భారత్ మాతా కీ జై అని నినదించాలని ఆదేశించింది. భోపాల్‌లోని మిస్రోడ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఫైజల్ అలియాస్ ఫైజాన్ మే నెలలో ‘పాకిస్తాన్ జిందాబాద్, హిందుస్తాన్ ముర్దాబాద్’ అని నినదించాడు. దీంతో ఇతనిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. 153బీ సెక్షన్ కింద కేసునమోదుచేశారు. సమాజంలో రెండు వర్గాల మధ్య శత్రుత్వం పెంచేలా, దేశ సమగ్రతను దెబ్బతీసేలా వ్యవహరించాడని పోలీసులు కేసు నమోదుచేశారు. దీంతో బెయిల్ కోసం మధ్యప్రదేశ్ హైకోర్టును ఫైజల్ ఆశ్రయించాడు. ఈ కేసును జస్టిస్ డీకే పలివాల్ మంగళవారం విచారించారు. రూ.50వేల వ్యక్తిగత బాండు, మరో రూ.50వేల వ్యక్తిగత పూచీకత్తు సమర్పించి బెయిల్ ఇచ్చేందుకు కోర్టు అంగీకరిస్తూ రెండు షరతులు విధించింది. ‘‘ ప్రతి నెలా తొలి, చివరి మంగళవారాల్లో భోపాల్‌లోని మిస్రోడ్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లు. అక్కడి భవంతిపై రెపరెపలాడే త్రివర్ణ పతాకానికి 21 సార్లు సెల్యూట్చేసి రెండు సార్లు భారత్ మాతాకీ జై అని నినదించు. ఈ కేసులో తుదితీర్పు వచ్చేదాకా ఇలా చేయాల్సిందే. ఇలా చేస్తే అయినా నీలో దేశభక్తి కాస్తయినా పెరుగుతుంది’ అని జడ్జి వ్యాఖ్యానించారు. ‘‘ ఇతనికి బెయిల్ ఇవ్వకండి. గతంలోనూ ఇలాగే ప్రవర్తించాడు. ఇతనిపై 14 నేరకేసులు పెండింగ్‌లో ఉన్నాయి’ అని ప్రభుత్వ లాయర్ వాదించారు. -
రూ.1,814 కోట్ల డ్రగ్స్ సీజ్
అహ్మదాబాద్/న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో భారీగా మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. ఓ ఫ్యాక్టరీ నుంచి రూ.1,814 కోట్ల విలువైన 907 కిలోల మెఫెడ్రిన్‌తోపాటు, ముడి సరుకును, యంత్ర పరికరాలను అధికారులు స్వా«దీనం చేసుకున్నారు. గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్(ఏటీఎస్), ఢిల్లీ నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ)సంయుక్తంగా జరిపిన దాడిలో బగ్రోడా పారిశ్రామిక ఎస్టేట్‌పై శనివారం దాడి జరిపినట్లు అధికారులు తెలిపారు. గుజరాత్ ఏటీఎస్ యూనిట్ సారథ్యంలో ఇంతభారీగా డ్రగ్స్ పట్టుబడిన ఘటన ఇదే. ఫ్యాక్టరీలో రోజుకు 25 కిలోల మెఫెడ్రిన్ తయారవుతోందని చెప్పారు. ఈ సందర్భంగా ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఒకరు 2017లో మహారాష్ట్రలోని అంబోలిలో మెఫెడ్రిన్ పట్టుబడిన కేసులో ఐదేళ్ల జైలు శిక్ష అనుభవించాడని అధికారులు వివరించారు. అమృత్‌సర్‌లో రూ.10 కోట్ల కొకైన్ లభ్యం అమృత్‌సర్‌లో రూ.10 కోట్ల విలువైన కొకైన్‌ను స్వా«దీనం పోలీసులు చేసుకున్నారు. ఇటీవల ఢిల్లీలో రూ.5,620 కోట్ల విలువైన 560 కిలోల కొౖకైన్, 40 కిలోల మారిజువానాను సీజ్ చేయడం తెలిసిందే. ఆ కేసు దర్యాప్తు క్రమంలోనే తాజాగా కొకైన్ పట్టుబడింది. ఈ సందర్భంగా ఒక వ్యక్తితోపాటు అతడి టయోటా కారును స్వా«దీనం చేసుకున్నారు. నిందితుడు విదేశాలకు పరారయ్యేందుకు ఏర్పాట్లు చేసుకున్నాడని అధికారులు తెలిపారు. -
రూ. 1,800 కోట్ల విలువైన భారీ డ్రగ్స్ పట్టివేత
భోపాల్: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. భోపాల్ సమీపంలోని ఓ ఫ్యాక్టరీ నుంచి సుమారు 1,814 కోట్ల విలువైన భారీ డ్రగ్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఎటీఎస్), నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ), ఢిల్లీ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన ఈ ఆపరేషన్‌లో భారీగా డ్రగ్స్, వాటి తయారికి ఉపయోగించే ముడిసరుకును అధికారులు స్వాధీనం చేసుకున్నారని గుజరాత్ హోం సహాయ మంత్రి హర్ష్ సంఘవి ఆదివారం ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు.Kudos to Gujarat ATS and NCB (Ops), Delhi, for a massive win in the fight against drugs!Recently, they raided a factory in Bhopal and seized MD and materials used to manufacture MD, with a staggering total value of ₹1814 crores!This achievement showcases the tireless efforts… pic.twitter.com/BANCZJDSsA— Harsh Sanghavi (@sanghaviharsh) October 6, 2024‘‘డ్రగ్స్‌పై పోరాటంలో భారీ విజయం సాధించిన గుజరాత్ ఏటీఎస్ , ఎన్సీబీ, ఢిల్లీ అధికారులకు అభినందనలు.వీరు భోపాల్‌లోని ఒక ఫ్యాక్టరీపై దాడి చేసి, ఎండీ, ఎండీ డ్రగ్స్ తయారీకి ఉపయోగించే వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్స్ మొత్తం విలువ రూ. 1814 కోట్లు ఉంటుందని అంచనా. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా దుర్వినియోగాన్ని ఎదుర్కోవడంలో లా అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నాయి. సమాజ ఆరోగ్యం, భద్రతను కాపాడటంలో వారి ప్రయత్నం చాలా కీలకం. చట్టాన్ని అమలు చేసే సంస్థల అంకితభావం నిజంగా అభినందయం. భారతదేశాన్ని సురక్షితమైన, ఆరోగ్యకరమైన దేశంగా మార్చే వారి మిషన్‌కు మద్దతునిస్తూనే ఉందాం’’ అని అన్నారు.చదవండి: ఆపరేషన్ తోడేలు సక్సెస్.. ఊపిరి పీల్చుకున్న గ్రామస్థులు -
దారుణం.. వాటర్ ట్యాంక్‌లో చిన్నారి మృత దేహం
భోపాల్: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో అదృశ్యమైన ఐదేళ్ల బాలిక కేసు విషాదంగా మారింది. చిన్నారి నివసిస్తున్న ఇంటికి ఎదురుగా ఉన్న మరో ఇంటి వాటర్ ట్యాంక్‌లో శవమై తేలింది. అయితే నిందితులు చిన్నారిపై దారుణానికి ఒడిగట్టి హత్య చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని సంబంధిత వర్గాలు తెలిపాయి.మూడు రోజుల క్రితం చిన్నారి అదృశ్యంపై తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు డాగ్ స్క్వాడ్లు, డ్రోన్లతో పాటు ఐదు పోలీసు స్టేషన్ల నుండి 100 మంది పోలీసులు రంగంలోకి దిగారు. బృందాలుగా విడిపోయి చిన్నారి కోసం గాలించారు. అనుమానాస్పద ప్రాంతాల్ని క్షుణ్ణంగా పరిశీలించారు. మొత్తం వెయ్యికి పైగా ఇళ్లల్లో తనిఖీలు చేపట్టారు. 72 గంటల తర్వాత చిన్నారి నివసిస్తున్న ఇంటికి ఎదురుగా నిర్మానుష్యంగా ఉన్న మరో ఇంటి నుంచి దుర్వాసన వెదజల్లింది. దీంతో అనుమానంతో ఇంటిని తినిఖీ చేయగా.. ఇంటిపైన ఉన్న వాటర్ ట్యాంక్‌లో చిన్నారి మృత దేహం లభ్యమైంది. పాప ఆచూకీతో స్థానికులు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందుగా చిన్నారి నివసిస్తున్న ఇల్లు..నిర్మానుష్యంగా ఉన్న మరో ఇంట్లో ఎందుకు తనిఖీలు చేయాలని మండిపడుతున్నారు. -
రాజ రాజ చోర
అది ఓ చిన్న పాఠశాల. విద్యార్థులు టీచర్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇంతలోఓ వ్యక్తి తరగతి గది లోపలకు వచ్చాడు. అతడి చేతిలో కత్తెర, బ్లేడు, తాళాలు, స్క్రూడ్రైవర్ వంటి సరంజామా ఉంది.వెంటనే పాఠం మొదలుపెట్టాడు.అంటే ఏవో సైన్స్ ప్రాక్టికల్స్ చెబుతున్నాడేమో అనుకోకండి. అక్కడ జరిగే సంగతి తెలిస్తే నోరెళ్లబెడతారు.పిక్ పాకెటింగ్ ఎలా చేయాలి? దొంగతనం చేసిన తర్వాత దొరక్కుండాఎలా తప్పించుకోవాలి? తాళాలను ఎలా ఓపెన్ చేయాలి వంటి అంశాల్లోఅక్కడ తర్ఫీదు ఇస్తారు.వినడానికి విడ్డూరంగా విన్నా కొన్నేళ్లుగా అక్కడ జరుగుతున్న తతంగం ఇది. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌కు 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖడియా, గుల్ ఖేడి, హుల్ ఖేడి అనే మూడు గ్రామాల్లో దొంగల స్కూళ్లు ఉన్నాయి. 12 సంవత్సరాల నుంచి 17 ఏళ్ల లోపు వయసున్న వారికి దొంగతనాలు, దోపిడీలు ఎలా చేయాలో అందులో శిక్షణ ఇస్తారు. అవసరమైన సందర్భాల్లో హత్యలు ఎలా చేయాలో కూడా నేర్పిస్తారు. పేద కుటుంబాలకు చెందిన పిల్లలను లక్ష్యంగా చేసుకుని ఓ దొంగల ముఠా ఈ స్కూళ్లు నడుపుతోంది. ఏడాదిపాటు సకల చోర కళల్లో శిక్షణ ఇస్తారు. జనం రద్దీగా ఉండే ప్రదేశాల్లో పిక్ పాకెటింగ్ ఎలా చేయాలి, బ్యాగు ఎలా లాక్కోవాలి? ఆపై ఎవరికీ చిక్కకుండా ఎలా పారిపోవాలి? బ్యాంకులను ఎలా దోచుకోవాలి? పోలీసులకు చిక్కితే వారి లాఠీ దెబ్బలను ఎలా తట్టుకోవాలి? వంటి అన్ని అంశాల్లోనూ సుశిక్షితులను చేస్తారు. ముఖ్యంగా పెద్దింటి పిల్లలు ఎలా వ్యవహరిస్తారో, వారు ఎలాంటి డ్రెస్సులు వేసుకుంటారో కూడా వివరించి అన్ని విధాలా సన్నద్ధం చేస్తారు. ఈ శిక్షణ విజయవంతంగా పూర్తిచేసుకున్నవారు దొంగతనాల్లో గ్రాడ్యుయేట్ల కిందే లెక్క. అంతేకాదు.. ఏడాదిపాటు ఇచ్చే శిక్షణ కోసం రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలు ఫీజుగా తీసుకుంటున్నారు. శిక్షణ పూర్తయిన తర్వాత వారిని గ్యాంగులో సభ్యులుగా చేర్చుకుంటారు. అనంతరం దేశంలోని వివిధ ప్రాంతాలకు ప్రాక్టికల్స్‌కు పంపిస్తారు. అలా వారు కొట్టుకొచి్చన సొమ్ము ఈ దొంగల ముఠాయే తీసుకుని, వారి తల్లిదండ్రులకు ఏడాదికి రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు మాత్రమే ఇస్తుంది. దీంతో ఇదేదో బాగుందని భావిస్తున్న ఆ చుట్టుపక్కల ఊళ్ల జనం నానా తిప్పలూ పడి ఫీజులు చెల్లించి తమ పిల్లలను దొంగల స్కూళ్లలో చేర్పిస్తున్నారు.ఇలా బయటపడింది.. ఈ దొంగల శిక్షణ వ్యవహారం చాలాకాలంగా సాగుతున్నప్పటికీ,ఇటీవల ముంబైలో జరిగిన ఓ దొంగతనంతో వెలుగులోకి వచి్చంది. ఓ బడా పారిశ్రామికవేత్త కుటుంబ వివాహ వేడుక ముంబైలోని ఓ ఖరీదైన హోటల్లో ఘనంగా జరిగింది. ఆ హోటల్లోకి ఈ ముఠాకు చెందిన కుర్రాడు పెద్దింటి బిడ్డగా చొరబడి రూ.కోటిన్నర విలువైన నగలతో మాయమయ్యాడు. నగలు కనిపించకపోవడంతో సీసీ కెమెరాలు పరిశీలించగా దొంగతనం విషయం బయటపడింది. ఆ కుర్రాడు ఎవరా అని ఆరా తీసిన పోలీసులు చివరకు మధ్యప్రదేశ్‌లోని ఈ మూలాలుగుర్తించి అవాక్కయ్యారు. పోలీసులు ఏం చేయలేరా? నిజానికి ఆ మూడు గ్రామాల్లో దొంగల స్కూళ్లు నడుస్తున్నాయనే సంగతి స్థానిక పోలీసులకు తెలిసినా వారు ఏమీ చేయలేని పరిస్థితి. ఆ ఊళ్లోకి పోలీసులు వెళ్తే చాలు.. ఊరి జనమంతా ఏకమై అడ్డుకుంటారు. ఎవరైనా అపరిచితులు అక్కడకు వెళ్లినా వదిలిపెట్టరు. దీంతో ఒక్క దొంగను అరెస్టు చేయడానికి వెళ్లాలంటే పోలీసులు పెద్ద ఎత్తున మందీమార్బలంలో వెళ్లాల్సిందే. పైగా దొంగల స్కూల్‌ను మూయించే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే అది మామూలు పాఠశాలలాగే ఉంటుంది. మేం విద్యార్థులకు ట్యూషన్ చెబుతున్నాం.. అది కూడా తప్పా అని ప్రశ్నిస్తారు. దీంతో పోలీసులు తిరుగుముఖం పట్టడం తప్ప చేసేదేమీ ఉండదు. దేశవ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లలో ఈ ముఠాకు చెందిన 2వేల మందికి పైగా వ్యక్తులపై దాదాపు 8వేల కేసులు నమోదయ్యాయి. - సాక్షి సెంట్రల్ డెస్క్ -
మ్యూజియంలో చోరీకి వచ్చి.. పోలీసులకు చిక్కాడిలా..
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో గల స్టేట్ మ్యూజియంలో చోరీకి వచ్చిన దొంగ తాను ఊహించని రీతిలో పోలీసుల చేతికి చిక్కాడు. మ్యూజియంలోని కోట్లాది రూపాయల విలువైన వందల ఏళ్లనాటి పురాతన వస్తువులతో పారిపోయేందుకు ఆ దొంగ విఫలయత్నం చేశాడు.ఈ ఉదంతం గురించి పోలీసు కమిషనర్ హరినారాయణచారి మిశ్రా మీడియాకు వెల్లడించారు. స్టేట్ మ్యూజియంలోకి ప్రవేశించిన ఒక వ్యక్తి రాత్రంతా లోపలే ఉండిపోయాడు. ఉదయం భద్రతా సిబ్బంది అతన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు మ్యూజియంనకు చేరుకుని అతనిని అరెస్టు చేశారు. నాణేలను, ఇతర వస్తువులను దొంగిలించి, మ్యూజియం నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఆ దొంగ గోడపై నుంచి దూకి తీవ్రంగా గాయపడ్డాడు దీంతో కదలలేకపోయాడు. తరువాత అపస్మారక స్థితికి చేరుకున్నాడు. అతడిని ఉదయం భద్రతా సిబ్బంది గుర్తించి, పోలీసులకు సమాచారం అందించారు.పోలీసులు ఆ దొంగ దగ్గరి నుంచి గుప్తులు, సుల్తానేట్ కాలానికి చెందిన 100 నాణేలతో పాటు పురాతన నగలు, పాత్రలు, ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ఈ నాణేల విలువ దాదాపు రూ.10 నుంచి 12 కోట్ల వరకూ వరకు ఉంటుందని సమాచారం. ఈ సంఘటన నేపధ్యంలో భోపాలోని మ్యూజియం భద్రతా ఏర్పాట్లపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇకనైనా ప్రభుత్వం మ్యూజియంనకు పటిష్టమైన భద్రతను కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. -
Nikita Kaushik: సిటీకి పల్లె కళ
గ్రామీణ మహిళా కళాకారులను ప్రోత్సహించడానికి, వారి వారసత్వ కళను, ఫ్యాబ్రిక్ క్రాఫ్ట్‌ను భారతదేశం అంతటా పరిచయం చేయడానికి ది వోవెన్ ల్యాబ్ పేరుతో కృషి చేస్తున్నారు భూపాల్ వాసి నిఖితా కౌశిక్. ముంబైలోని నిఫ్ట్ పూర్వవిద్యార్థి అయిన నిఖిత జీరోవేస్ట్ పాలసీతో పాతికమంది గ్రామీణ మహిళల చేత పట్టణ మహిళల కోసం ఆధునికంగా డ్రెస్‌లను డిజైన్ చేయించి, వారికి ఉపాధి కల్పిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ‘స్టైల్ తత్త్వ’ ఎగ్జిబిషన్లో క్రాఫ్ట్స్, హ్యాండ్లూమ్ క్లస్టర్స్‌కి వారధిగా ఉంటూ చేస్తున్న కృషిని వివరించారు. ‘‘ఈ రోజు మనం భారతీయులమని చెప్పుకోవడానికి గర్విస్తున్నామంటే మన దేశంలోని విభిన్న సంస్కృతులూ, సంప్రదాయాలూ కారణం. వేటికవి సొంత మార్గాలలో ప్రత్యేకమైనవి. ఫలితంగా మన జీవితంలో దుస్తులు ముఖ్యమైన అంశంగా మారాయి. మన గ్రామీణ మహిళా కళాకారుల హస్తకళ శిల్ప నైపుణ్యాన్ని చేతితో నేసిన వస్త్రాలను మరింత మెరుగుపరచడంలో మా పని కీలకంగా ఉంటుంది. చిట్ట చివరగా ఉపయోగించే చిన్న ఫ్యాబ్రిక్ పీస్తో కూడా ‘కళ’ద్వారా అందంగా డిజైన్ చేస్తాం. ఇందుకోసం నిరంతరం పరిశోధన జరుగుతూనే ఉంటుంది. అందుకే, మా బ్రాండ్‌కు ‘ది వోవెన్ ల్యాబ్’ అని పేరు పెట్టాం.జీరో వేస్ట్ పాలసీ రాజస్థాన్, గుజరాత్ భోపాల్.. ్రపాంతాల్లోని గ్రామీణ, గిరిజన మహిళల చేతుల్లో రూపుదిద్దుకున్న మా దుస్తుల డిజైన్స్ బయట షాపుల్లో లభించవు. ఎగ్జిబిషన్లు, ఆన్లైన్ ద్వారా అమ్మకం చేస్తుంటాం. మన దేశీ కాలా పత్తితో పాటు టెన్సెల్, రీసైకిల్ ఫ్యాబ్రిక్స్, పర్యావరణ అనుకూలమైన క్లాత్‌తోనే డిజైన్ చేస్తున్నాం. అరుదైన కాటన్ ఫ్యాబ్రిక్, ్రపాచీన కళా వైభవం గల మోడర్న్ డిజైనరీ డ్రెస్సులు కాబట్టే వీటి ఖర్చు ఎక్కువే. కానీ, ఎక్కడ ఉన్నా ప్రత్యేకతను చాటుతుంటాయి.మహిళా సాధికారతమా సంస్థకు ఉన్న బలమైన స్తంభాలలో ఒకటి మహిళా సాధికారత. ఇప్పటికి పాతిక మంది గ్రామీణ మహిళలు ఈ డిజైన్స్ కోసం కృషి చేస్తున్నారు. కళ పట్ల ఆసక్తి ఉన్న గ్రామీణ బాలికలను ఎంపిక చేసుకొని, శిక్షణ ఇవ్వడమే కాకుండా, వారి ్రపాథమిక విద్య కూడా సవ్యంగా జరిగేలా చూస్తున్నాం. ఒక డ్రెస్ కొనుగోలు చేస్తే ఆ మొత్తంతో ఆ కళాకారుల ఇల్లు నెలంతా ఏ ఇబ్బంది లేకుండా గడిచి΄ోతుంది. భవిష్యత్తు తరాలు ఆ కళావైభవాన్ని సొంతం చేసుకోవాలన్నదే నా కల. చాలావరకు సేకరించే కాటన్ ఫ్యాబ్రిక్ ఐవరీ, గ్రే కలర్ వే ఎంచుకుంటాం. కొన్నింటికి మాత్రం నేచురల్ రంగులతో డైయింగ్ ప్రక్రియ ఉంటుంది. వ్యర్థాలను నివారిస్తూ, పర్యావరణ అనుకూలమైన ఉత్పత్తులను వెలుగులోకి తీసుకురావాలన్నదే మా ప్రయత్నం తప్ప ఫాస్ట్ ఫ్యాషన్ ΄ోటీ పరుగులో చేరం.రాబోయే తరాలకు మన కళప్రాచీన హ్యాండ్ వర్క్స్‌ని వదిలేస్తే అవి అంతే సులువుగా మరుగున పడి΄ోతాయి. క్రాఫ్ట్స్ క్లస్టర్స్ ఆఫ్ ఇండియాతో అనుబంధంగా వర్క్ చేస్తున్నాను కాబట్టి దేశంలోని హ్యాండ్లూమ్ క్లస్టర్స్తోనూ, ఈ మార్గంలో వచ్చే అంతరాలను పూడ్చేందుకు నిఫ్ట్‌లోని వివిధ కేంద్రాలతో అనుబంధంగా వర్క్ చేస్తున్నాను.ఫ్యాబ్రిక్ సేకరణ, డిజైన్స్ సృష్టి, వ్యర్థాలు మిగలకుండా జాగ్రత్తపడటం అనేది ఓ సవాల్‌గా ఉంటుంది. కానీ, పర్యావరణ హితంగా, మనసుకు నచ్చిన పని చేస్తుండటం ఎప్పుడూ ఉత్సాహాన్ని ఇస్తుంది. అంతేకాదు, ఈ డిజైన్స్‌ని ఇష్టపడి కొనుగోలు చేసేవారి ద్వారా ప్రాణం పెట్టే కళాకారులకు ఉపాధి ΄÷ందేలా చేయడం మరింత సంతృప్తిని ఇస్తుంది’’ అని వివరించారు ఈ డిజైనర్. – నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
‘డిగ్రీలతో ఉపయోగం లేదు.. పంక్చర్ షాప్ తెరవండి’
భోపాల్: మధ్యప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే పన్నాలాల్ శాక్య విద్యార్థులను ఉద్దేశించి విచిత్రమైన వ్యాఖ్యాలు చేశారు. ఆయన సోమవారం గుణ అసెంబ్లీ నియోజకవర్గంలో పీఎం కాలేజీ ఆఫ్ ఎక్స్‌లెన్సీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. డిగ్రీలు చదవటం వల్ల ఏం రాదు.. డబ్బులు సంపాదించాలంటే విద్యార్థులు మోటర్ సైకిల్ రిపేర్ చేసే.. పంక్చర్ షాప్‌ను పెట్టుకొవాలని సూచించారు.‘మేము ఇవాళ పీఎం కాలేజీ ఆఫ్ ఎక్స్‌లెన్సీని ప్రారంభించాం. నేను అందరికీ ఒక్కటే మాట చెప్పదల్చుకున్నా.. దానిని మీరు గుర్తు పెట్టుకోండి. కాలేజీలో డిగ్రీలతో ఏం రాదు. దాని బదులు మోటర్ సైకిల్ రిపేర్ చేసే.. పంక్చర్ షాప్‌ను పెట్టుకోండి. కనీసం దాని వల్ల రోజువారిగా డబ్బులు సంపాదించుకోవచ్చు’ అని అన్నారు.डिग्री से कुछ नहीं होने वाला, पंक्चर की दुकान खोल लेना" गुना से BJP विधायक पन्नालाल शाक्य ने कहा #Guna | Pannalal Shakya | #PannalalShakya pic.twitter.com/j3u7w4HvQ7— Deshhit News (@deshhit_news) July 15, 2024 ఆదివారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. మధ్యప్రదేశ్‌లోని 55 జిల్లాలో ఏర్పాటు చేసిన పీఎం కాలేజీ ఆఫ్ ఎక్స్‌లెన్సీని వర్చువల్‌గా ప్రారంభించారు. బీజేపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎమ్మెల్యే పన్నాలాల్ శాక్య చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నారు. -
భోజ్‌శాల కాంప్లెక్స్: ప్రభుత్వం చేతికి ఏఎస్ఐ రిపోర్టు
భోపాల్: హైకోర్టు ఆదేశాల మేరకు మధ్యప్రదేశ్ ధార్‌లోని వివాదాస్పద భోజ్‌శాల(కమల్ మౌలా మాస్క్) కాంప్లెక్స్‌లో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ సర్వే చేపట్టింది. తాజాగా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ సర్వే రిపోర్టును సోమవారం మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి అందజేసింది.సర్వే రిపోర్టు ప్రకారం.. సిల్వర్, కాపర్, అల్యూమినియం, స్టీల్‌తో తయారు చేయబడ్డ 31 నాణేలను గుర్తించారు. ఈ నాణేలు ఇండో-సస్సానియన్ (10-11వ శతాబ్దం), ఢిల్లీ సుల్తానేట్ (13-14వ శతాబ్దం), మాల్వా సుల్తానేట్ (15-16వ శతాబ్దం), మొఘల్ (16-18వ శతాబ్దం), ధార్ రాష్ట్రం (19వ శతాబ్దం), బ్రిటిష్(19-20వ శతాబ్దం)వారికి చెందినవిగా పేర్కొంది. మొత్తం 94 శిల్పాలు, శిల్పాల శకలాలు, నిర్మాణాలు బయటపడినట్లు పేర్కొంది.బయటపడిన ఈ శిల్పాలు బసాల్ట్, పాలరాయి, మృదువైన రాయి, ఇసుకరాయి, సున్నపురాయితో తయారు చేయబడినట్లు తెలిపింది. ఈ శిల్పాలు హిందూ దేవుళ్లు వినాయకుడు, బ్రహ్మ, నరసింహ, భైరవలో పాటు పలు జంతువులు, మానవుల రూపంలో ఉన్నాయి. వాటితో పాటు సింహం, ఎనుగులు, గుర్రాలు, కుక్క, కోతి, పాము, తాబేలు, పక్షులతో కూడిన శిల్పాలను గుర్తించినట్లు తెలియజేసింది. పలు శాసనాలపై సంస్కృతం, ప్రాకృత భాష రాసి ఉన్నట్లు పేర్కొంది. వాటిపై విద్యావ్యవస్థకు సంబంధించిన కార్యకలాపాలు జరిగినట్లు సూచిస్తున్నాయి. మరోవైపు.. భోజ్ రాజు హాయాంలో అక్కడి విద్యాకేంద్రం ఉన్నట్లు ఏఎస్ఐ రిపోర్టు సూచిస్తోంది.మార్చి 11న భోపాల్ హైకోర్టు భోజ్‌శాలలో సర్వే నిర్వహించాలని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ను ఆదేశించింది. మధ్య యుగానికి సంబంధించిన భోజ్‌శాల కాంప్లెక్స్ సరస్వతీ దేవీ ఆలయమని హిందువులు, కమల్ మౌలా మసీదు అని ముస్లింలు వాదిస్తున్నారు. ప్రస్తుతం ఈ కాంప్లెక్సులో ప్రతి మంగళవారం హిందువులు పూజలు చేస్తుండగా శుక్రవారం ముస్లింలు నమాజ్ చేస్తున్నారు.ఇటీవల మధ్యప్రదేశ్ హైకోర్టు పూర్తి సర్వే రిపోర్టును జూలై 15వరకు సమర్పించాలని ఏఎస్ఐని ఆదేశించింది. దీనిపై తదుపరి విచారణను హైకోర్టు జూలై 22కు వాయిదా వేసింది. -
‘శివరాజ్ సింగ్ భారీ గెలుపుతో.. ఢిల్లీ మొత్తం తలవంచింది’
భోపాల్: లోక్‌సభ ఎన్నికల్లో తన తండ్రి, కేంద్ర వ్యవసాయం శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహన్‌పై గెలుపుతో ఢిల్లీ మొత్తం తలవంచిందని కార్తికేయ సింగ్ అన్నారు. ఆయన శుక్రవారం బుధ్నీ అసెంబ్లీ స్థానంలో నిర్వహించిన ఓ సభలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘నేను ఢిల్లీ నుంచి వచ్చాను. అయతే మన నేత(శివరాజ్ సింగ్ చౌహన్) ఒక ముఖ్యమంత్రిగా చాలా పాపులర్. అయిన ఇప్పుడు సీఎం కాకున్నా మరింత పాపుల్ అయ్యారు. మన నేత భారీ విజయం సాధించారు. దీంతో ఢిల్లీ మొత్తం ప్రస్తుతం మన నేత ముందు తలవంచంది. ఢిల్లీ మొత్తానికి ఆయనేంటో తెలుసు. అదేవిధంగా ఆయనకు గుర్తింపు, గౌరవం ఇస్తుంది. ఒక్క ఢిల్లీనే కాదు.. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆయన్ను గౌరవిస్తారు. దేశవ్యాప్తంగా ఉన్న పెద్ద నేతల జాబితాలో శివరాజ్‌సింగ్ ఒకరుగా నిలుస్తారు’అని తండ్రిపై ప్రశంసలు కురిపించారు.లోక్‌సభ ఎన్నికల విదిశ పార్లమెంట్ స్థానంలో బీజేపీ తరఫున బరిలోకి దిగిన మాజీ మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ 8.20 లక్షల ఓట్ల భారీ మెజార్టీతో ఘన విజయం సాధించారు. దీంతో ఆయన కేంద్ర కేబినెట్లో చోటుదక్కించుకొని వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.ఇక.. తన తండ్రిపై కార్తికేయ సింగ్ చేసిన వ్యాఖ్యలపై మధ్యప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ జితూ పట్వారీ ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు. కార్తికేయ సింగ్ వ్యాఖ్యలతో ఢిల్లీకి అసమ్మతి భయం ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోందని అన్నారు.‘కేంద్ర మంత్రి కుమారుడు (యువరాజు) కార్తికేయ ఢిల్లీ భయంతో ఉందని ఉంటున్నారు. ఇది 100 శాతం నిజం. ఎందుకంటే దేశం భయంతో ఉన్న ఓ నియంతను నిశితంగా పరిశీలిస్తోంది. పార్టీలో వ్యక్తం అవుతున్న అసమ్మతి స్వరం. రెబెల్ అవుతున్న పెద్ద నేతలు. సంకీర్ణ ప్రభుత్వ సమన్వయం. ప్రభుత్వానికి మద్దతు తగ్గటం వల్ల భయంతో అధికార పీఠం కదులుతోంది’అని జితూ పట్వారీ అన్నారు. మరోవైపు.. శివరాజ్ సింగ్ కేంద్రమంత్రి కావటంతో బుధ్నీ అసెంబ్లీ నియోజకర్గం నుంచి పోటీ చేయడానికి ఆయన కుమారుడు కార్తికేయ సింగ్ చౌహాన్‌కు లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. -
ఓటు వేశారు.. డైమండ్ రింగ్ గెలుచుకున్నారు!
దేశంలో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. పలు రాష్ట్రాలలో మంగళవారం మూడో విడత పోలింగ్ జరిగింది. ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరిగేందుకు ఎన్నికల సంఘం పలు చర్యలు తీసుకుంటుంది. ఇదే కోవలో మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఓటర్లను ప్రోత్సహించేందుకు ప్రత్యేక బహుమతులను అందించారు.భోపాల్‌లోని పలు పోలింగ్ కేంద్రాలలో లాటరీ పథకాన్ని ఏర్పాటు చేశారు. ఈ లాటరీ పథకంలో ఉదయం 11 గంటలకు జరిగిన మొదటి డ్రాలో యోగేష్ సాహు డైమండ్ రింగ్ గెలుచుకున్నారు. తరువాత మధ్యాహ్నం 2, 5 గంటలకు మరో రెండు డ్రాలు జరిగాయి. దీని తర్వాత బంపర్ డ్రా కూడా జరిగింది.లోక్‌సభ ఎన్నికల రెండవ దశలో ఓటింగ్ శాతం తగ్గిన నేపధ్యంలో ఓటర్లను ప్రోత్సహించడానికి భోపాల్‌లోని పలు పోలింగ్ బూత్‌లలో ఎన్నికల సంఘం లాటరీ పథకాన్ని ప్రారంభించింది. ఓటు హక్కును వినియోగించుకున్న వారికి ఆకర్షణీయమైన బహుమతిని అందజేస్తామని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు.భోపాల్ ఎన్నికల చరిత్రలో తక్కువ ఓటింగ్ నమోదవుతూ వస్తోంది. ఈ నేపధ్యంలో ఇక్కడ ఓటింగ్ శాతం పెరిగేందుకు ఎన్నికల సంఘం ప్రత్యేక చొరవ చూపింది. ఈ నేపధ్యంలో 65.7 శాతం పోలింగ్ నమోదయ్యింది. ఎన్నికల సంఘం నిర్వహించిన లక్కీ డ్రాలో ముగ్గురు ఓటర్లకు వజ్రాల ఉంగరాలు లభించగా, మరికొంతమందికి మిక్సర్లు, వాటర్ కూలర్లు లభించాయి. కొందరు టీ షర్టులను గెలుచుకున్నారు. -
Lok sabha elections 2024: ఓటేస్తే డైమండ్ రింగ్
లక్కీ డ్రాలో బహుమతులు గెలుచుకోవచ్చంటే సామాన్యుల కాలు కదలకుండా ఉంటుందా..? మధ్యప్రదేశ్‌లోని భోపాల్ లోక్‌సభ స్థానంలో ఓటింగ్ శాతం పెంచేందుకు అధికారులు ఇలాంటి ఆఫరే ఇస్తున్నారు. మూడో దశలో భాగంగా ఈ నెల 7న భోపాల్‌లో పోలింగ్ జరుగుతోంది. ఆ రోజున ఓటేసే వారి పేర్లనుంచి ప్రతి మూడు గంటలకు ఒకసారి లక్కీ డ్రా తీయనున్నారు. విజేతలకు వజ్రపు ఉంగరాలు, రిఫ్రిజిరేటర్లు, టీవీలు తదితర కానుకలిస్తారట! ‘‘నియోజకవర్గవ్యాప్తంగా ప్రతి పోలింగ్ కేంద్రంలో ఉదయం 10, మధ్యాహ్నం 3, సాయంత్రం 6 గంటలకు లక్కీ డ్రా తీసి విజేతలకు బహుమతులిస్తం. పోలింగ్ మర్నాడు మెగా డ్రా తీసి విజేతలకు మరింత పెద్ద బహమతులిస్తాం’’అని జిల్లా ఎన్నికల అధికారి కౌసలేంద్ర విక్రమ్ సింగ్ ప్రకటించారు. ఓటింగ్ పెంచేందుకే.. మధ్యప్రదేశ్‌లో ఇప్పటిదాకా జరిగిన రెండు దశల్లో పోలింగ్ 2019తో పోలిస్తే సగటున 8.5 శాతం తగ్గింది. 2019లో భోపాల్‌లో 65.7 శాతం ఓటింగ్ నమోదైంది. ఈసారి ఎండలు విపరీతంగా ఉన్నందున ఓటర్లు పెద్దగా ఇల్లు కదలకపోవచ్చన్న ఆందోళనలున్నాయి. దీంతో ఎలాగైనా ఓటింగ్‌ను పెంచాలని ఈసీ కృత నిశ్చయంతో ఉంది. భోపాల్ నియోజకవర్గంలో 3,097 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ప్రతి బూత్ వద్ద ఒక బీఎల్వో, వలంటీర్‌ను లక్కీ డ్రా కోసం నియమించారు. ఓటేశాక అక్కడి కూపన్ బుక్‌లెట్‌లో పేరు, మొబైల్ నంబర్ రాసి రసీదు తీసుకోవాలి. బహమతుల ఖర్చును కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద కంపెనీలు భరిస్తున్నాయి. మెగా డ్రా కోసం డైమండ్ ఉంగరాలు, ల్యాప్‌టాప్‌లు, ఫ్రిజ్‌లు ఎనిమిది డిన్నర్ సెట్లు, రెండు మొబైల్ ఫోన్లు రెడీగా ఉన్నాయి. దీంతోపాటు ప్రతి పోలింగ్ కేంద్రంలో తొలి ఓటర్ను గౌరవించేందుకు ప్రత్యేకంగా ఏదైనా చేయాలని అధికారులు ఆలోచిస్తున్నారు! – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఓటర్ల సంఖ్యను పెంచడానికి కొత్త వ్యూహం.. ప్రతి రెండు గంటలకు ఓ విన్నర్
భోపాల్: లోక్‌సభ ఎన్నికల రెండు దశలు ఇప్పటికే పూర్తయ్యాయి. ఇదివరకు నమోదైన విధంగా తక్కువ ఓటింగ్ శాతాన్ని పరిష్కరించడానికి లేదా ఓటింగ్ శాతాన్ని పెంచుకోవడానికి భోపాల్‌లోని అధికారులు ఓ కొత్త వ్యూహాన్నిరూపొందించారు. ఓటు ప్రాముఖ్యతను గుర్తించి.. ఓటర్లను ఆకర్శించడానికి (ఓటు హక్కును వినియోగించుకోవడానికి) లక్కీ డ్రా నిర్వహించడానికి అధికారులు కంకణం కట్టుకున్నారు.మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే 13 ఎంపీ స్థానాలకు ఓటింగ్ ప్రక్రియ పూర్తయింది. మిగిలిన స్థానాలకు మూడు, నాలుగవ దశల్లో ఓటింగ్ జరగనుంది. ఈ దశల్లో ఓటర్లను ఎక్కువ సంఖ్యలో ఆకర్శించడానికి పోలింగ్ రోజు ప్రతి రెండు గంటలకు ఒక లక్కీ డ్రా నిర్వహించడానికి అధికారులు సంకల్పించారు.లక్కీ డ్రాలో డైమండ్ రింగ్స్, రిఫ్రిజిరేటర్లు, టెలివిజన్ వంటి ఆకర్షణీయమైన బహుమతులు అందించనున్నారు. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో మధ్యప్రదేశ్ అంతటా 8.5 శాతం ఓటింగ్ తగ్గింది. 2019 ఎన్నికలలో కూడా ఓటింగ్ శాతం 65.7% మాత్రమే. ఈ సారి మాత్రం ఓటు హక్కును తప్పకుండా అందరూ ఉపయోగించుకోవాలని అనే నేపథ్యంలో ఈ లక్కీ డ్రా విధానం ప్రవేశపెట్టారు.జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కౌశలేంద్ర విక్రమ్ సింగ్ ఈ లక్కీ డ్రా గురించి మాట్లాడుతూ.. పోలింగ్ రోజు ప్రతి బూట్ వద్ద ఉదయం 10 గంటలకు, మధ్యాహ్నం 3 గంటలకు, సాయంత్రం 6 గంటలకు లక్కీ డ్రాలో విజేతలను ప్రకటిస్తాము. ఎన్నికలు పూర్తయిన ఒకటి లేదా రెండు రోజుల్లో వారికి గిఫ్ట్స్ ఇచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఓటరులో చైతన్యాన్ని తీసుకురావడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని కౌశలేంద్ర పేర్కొన్నారు.భోపాల్ పార్లమెంటరీ నియోజకవర్గం 2,097 పోలింగ్ బూత్‌లను కలిగి ఉంది. పోలింగ్ రోజున ప్రతి పోలింగ్ బూత్ వద్ద ఒక వాలంటీర్‌ను నియమిస్తారు. ఓటు వేసిన తరువాత ఓటరు పేరు, మొబైల్ నెంబర్ రాసి వారి దగ్గర ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తరువాత జరిగే లక్కీ డ్రాలో విజేతలను ఎంపిక చేయడం జరుగుతుంది.#SVEEP के अंतर्गत 'राज्य स्तरीय स्लोगन प्रतियोगिता' ▶️प्रविष्टि भेजने की अंतिम तिथि आज ▶️“प्रत्येक वोट जरूरी है” विषय पर लिखें स्लोगन और जीतें आकर्षक पुरस्कार ➡️प्रविष्टि भेजने के लिए विजिट करें 👇https://t.co/ZX4TawpjyZ @rajivkumarec @ECISVEEP @SpokespersonECI pic.twitter.com/f4CSpBaKDK— Chief Electoral Officer, Madhya Pradesh (@CEOMPElections) April 30, 2024 -
భారత్‌లో డ్రైవర్‌లెస్ కారు.. రోడ్లపై రయ్ రయ్ మంటూ చక్కర్లు
భోపాల్ : కృత్రిమమేధతో నడిచే.. డ్రైవర్ లేని స్వయంగా నడిచే వాహనాలు వచ్చేస్తున్నాయనే ప్రచారం ఇటీవల బాగా జరగుతోంది. నిర్లక్ష్యపు డ్రైవర్లు, మద్యం తాగి వాహనాలు నడిపేవారి నుంచి విముక్తి లభిస్తుందన్న అంచనాలు జోరుగా వ్యక్తమవుతున్నాయి. అయితే ఇది సులువేమీ కాదని ఏఐ నిపుణులు అంటుంటే.. భారత్‌కు చెందిన ఓ కంపెనీ మాత్రం అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. ఆటోమొబైల్ రంగంలో ఏఐ టెక్నాలజీని సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. డ్రైవర్‌లెస్ కారును అందుబాటులోకి తెచ్చింది. ఇప్పుడు ఆ డ్రైవర్ లెస్ కారు భారత్ రోడ్లపై రయ్ రయ్ మంటూ చక్కెర్లు కొడుతుండడం విశేషం. సంజీవ్ శర్మ స్వయాత్ రోబోట్ ఫౌండర్, సీఈఓ తాజాగా ఆ సంస్థ గత కొన్నేళ్లుగా ఓ ప్రముఖ కార్ల తయారీ సంస్థకు చెందిన ఓ డీజిల్ కారుపై అనేక పరిశోధనలు చేస్తూ వచ్చింది.ముఖ్యంగా ఏఐ టెక్నాలజీని జోడించి డీజిల్ వేరియంట్ కారును అటానమస్ డ్రైవర్ లెస్ కారుగా మార్చేశారు. ఈ సందర్భంగా భోపాల్‌లోని కంకాళి కాళీ మాత దేవాలయం నుంచి ఇరుకు సందుల్లో, రోడ్లమీద ట్రాఫిక్‌ను క్లియర్ చేసుకుంటూ డ్రైవర్ లెస్ కారు ప్రయాణాన్ని జీపీఎస్‌తో నావిగేట్ చేస్తున్న వీడియోని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఆ వీడియోలో ఎదురుగా వస్తున్న వాహనాల్ని ఢీకొట్టకుండా పక్కకి వెళ్లడం, జనావాసాల్లో ఎలాంటి ప్రమాదాలకు గురి కాకుండా ముందుకు కారు ప్రయాణించడం మనం గమనించవచ్చు. Autonomous driving through tight, dynamic, stochastic, and adversarial traffic-dynamics on sub-urban roads in India, as well as through partially unstructured environments. This demos showcases the robustness of our motion planning and decision making algorithmic frameworks in… pic.twitter.com/UcY07arxSK — Sanjeev Sharma (@sanjeevs_iitr) February 29, 2024 అయితే దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీ టెస్లాతో పాటు ఇతర కంపెనీలు డ్రైవర్ లెస్ కార్లను అందుబాటులోకి తెచ్చేందుకు విశ్వప్రయత్నాలు చేస్తుంటే స్వయాత్ రోబోట్ డీజిల్ కారును డ్రైవర్‌లెస్ కారు మార్చడమే కాకుండా విజయవంతంగా డ్రైవ్ చేయించడంపై ఆటోమొబైల్ కంపెనీలు అధినేతలు, టెక్నాలజీ నిపుణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
భోపాల్‌లో హైదరాబాద్ షర్బత్.. క్యూ కడుతున్న జనం!
వేసవిలో ఎండవేడిమి నుంచి ఉపశమనానికి చల్లని ఐస్ క్రీం లేదా ఏదైనా పానీయాన్ని తాగాలని ఎవరైనా అనుకుంటారు. హైదరాబాద్‌లో ఆదరణ పొందిన తహురా పానీయం ఇటీవలే మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లోకి ప్రవేశించింది. ముగ్గురు స్నేహితులు ఈ శీతల పానీయ విక్రయాలను భోపాల్‌లో ప్రారంభించారు. హైదరాబాద్‌లో రంజాన్ సందర్భంగా ఈ పానీయానికి మంచి డిమాండ్ ఉంటుంది. అయితే వేసవి ఉపశమనానికి ఈ షర్బత్ మ్యాజిక్‌లా పనిచేస్తుందని పలువురు అంటుంటారు. డ్రై ఫ్రూట్స్, పాలతో తయారు చేసే ఈ షర్బత్‌ను భోపాల్ ప్రజలు ఎంతగానో ఇష్టపడుతున్నారు. ఈ శీతలపానీయాల దుకాణం ప్రారంభించిన నాలుగైదు రోజుల్లోనే ఈ షర్బత్‌కు మంచి డిమాండ్ ఏర్పడింది. భోపాల్‌లోని మోతీ మసీదు కూడలిలో తహురా పేరుతో ఒక దుకాణాన్ని ఈ ప్రాంతానికి చెందిన ఫరూక్ షేక్, జునైద్ అలీ షేక్, జైన్ ఖాన్ ప్రారంభించారు. మహారాష్ట్రంలోని పూణేలో వీరు ఈ షర్బత్‌ను రుచి చూశాక భోపాల్‌లో ఈ పానీయాన్ని విక్రయించాలని నిర్ణయించుకున్నారు. ఈ షర్బత్‌ను ఫరూఖ్, అతని స్నేహితులు స్వయంగా తయారు చేస్తారు. వీరి దుకాణం సాయంత్రం 5 నుండి రాత్రి 11 గంటల వరకు తెరిచి ఉంటుంది. బాదం, పిస్తా, పాలతో తయారు చేసే ఈ పానీయంలో చక్కెరను అస్సలు ఉపయోగించరు. ఇది వేసవిలో శరీరానికి చల్లదనాన్ని అందిస్తుందని చాలామంది చెబుతుంటారు. ఈ పానీయాన్ని తాగేందుకు జనం ‘తహురా’ దుకాణం ముందు క్యూ కడుతుంటారు. -
తొలి ప్రయత్నంలోనే ఐపీఎస్ : ఈ బాలీవుడ్ నటిని గుర్తు పట్టారా?
డాక్టర్ కాబోయి యాక్టర్ అయిన చాలామంది నటులను చూశాం. అలాగే అటునటులుగా, ఇటు డాక్టర్లుగా కొనసాగిన వారి గురించీ విన్నాం. కానీ యాక్టర్ నుంచి పోలీసు అధికారి కావడం గురించి విన్నారా? 2010 బ్యాచ్‌కి చెందిన ఒక మహిళా ఐపీఎస్ ఆఫీసర్‌ను పరిచయం చేసుకుందాం.. రండి..! ఆకర్షణీయమైన ఎంటర్ టైన్మెంట్ రంగంనుంచి ఐపీఎస్ అధికారిగా మారింది ప్రముఖ బాలీవుడ్ నటి సిమల ప్రసాద్. సంకల్పం, పట్టుదల ఉంటే చాలా నిరూపించారు. ఐఏఎస్ అధికారి భగీరథ్ ప్రసాద్, ప్రముఖ రచయిత్రి మెహ్రున్నీసా పర్వేజ్‌ల కుమార్తె సిమల ప్రసాద్. నటిని కావాలన్న ఆశయంతో బాలీవుడ్లో నటిగా అడుగు పెట్టిన తర్వాత కూడా తన మరో లక్ష్యాన్ని మాత్రం మర్చిపోలేదు. (రణపాలతో ఆరోగ్య ప్రయోజనాలు : పేరులోనే ఉంది అంతా!) భోపాల్‌లోని సెయింట్ జోసెఫ్ స్కూల్ చదువు, ఆ తరువాత కామర్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. నృత్యం, నటనపై ఆసక్తిని పెంచుకుంది. మరోవైపు తండ్రి ఐఏఎస్ అధికారిగా ఉన్నప్పటికీ, సివిల్ సర్వీస్ మార్గంవైపు చూడలేదు. నటనపై ఆసక్తితో “అలిఫ్”, “నక్కష్” మూవీల్లో అవకాశాలను దక్కించుకున్నారు. ఈ క్రమంలో “అలీఫ్” సినిమాలో షమ్మీ పాత్రకు గాను విమర్శకులు ప్రశంసలు దక్కాయి. అలా నటి కావాలనే ఆమె కల నెరవేరింది. ఇలా నటనను కొనసాగిస్తూనే భోపాల్‌లోని బర్కతుల్లా విశ్వవిద్యాలయం నుంచి సోషియాలజీలో మాస్టర్స్ డిగ్రీ చేశారామె. (గర్ల్ ఫ్రెండ్ కోసం, సాహసం: అతగాడి కష్టం తెలిస్తే ఔరా అనాల్సిందే!) తరువాత మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. అలా డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ హోదా వరించింది. ఈ క్రమంలోనే యూపీఎస్సీ పరీక్షకు ప్రిపేర్ కావడం కూడా ప్రారంభించింది. ఇక్కడితో ఆమె ఆగిపోలేదు. ఈ క్రమంలోనే యూపీఎస్సీ పరీక్షపై దృష్టిపెట్టారు. అంతేకాదు తొలిప్రయత్నంలోనే ఎలాంటి కోచింగ్ లేకుండానే పరీక్షలో విజయం సాధించి ఐపిఎస్ అధికారిణి కావడం విశేషం. -
‘టికెట్ కోరటం లేదు..’ ప్రజ్ఞా ఠాకూర్ స్పందన
బీజేపీ తొలి జాబితాలో 33 మంది సిట్టింగ్ ఎంపీలను పక్కకుపెట్టింది. లోక్‌సభ ఎన్నికల్లో 370 స్థానాల్లో విజయమే లక్ష్యంగా గెలుపు గుర్రాలనే బరిలోకి దించాలని నిర్ణయించుకుంది. దానికి నిదర్శనమే తొలిజాబితా. ఇక వివాదాస్పద వ్యాఖ్యలు చేసి విమర్శలపాలైన వారికి బీజేపీ ఈసారి మొండి చేయి చూపింది. అటువంటి వారిలో ఒకరు ఎంపీ సాధ్వీ ప్రజ్ఞా ఠాకూర్. ప్రస్తుతం ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్‌సభ స్థానాన్ని అలోక్ శర్మకు కేటాయించింది. అయితే ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు మళ్లీ టికెట్ రాకపోవటానికి కారణమని బీజేపీలో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో సాధ్వీ ప్రజ్ఞా ఠాకూర్ తనకు బీజేపీ టికెట్ కేటాయించకపోవటంపై స్పందించారు. ‘గతంలో నేను టికెట్ కోరలేదు.. ఇప్పడూ కూడా నేను లోక్‌సభ టికెట్ కోరటం లేదు. గతంలోనే నేను చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రధాని మోదీకి నచ్చలేదు. నా వ్యాఖ్యలపై ప్రధాని.. నేను ఎప్పటికీ పూర్తి స్థాయిలో క్షమించబడనని అన్నారు. ఏదేమైనా నేను క్షమాపణలు కూడా చెప్పాను’ అని సాధ్వీ ఆదివారం మీడియాకు వివరించారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కీలక నేత దిగ్విజయ్ సింగ్‌పై 3,64, 822 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఇక.. సాధ్వీ ప్రజ్ఞా ఠాకూర్‌పై గతంలో అనేక వివాదాలున్నాయి. మాలేగావ్ బాంబు పేలుళ్ల కేసు, నాథూరామ్ గాడ్సేను దేశభక్తుడు అని వ్యాఖ్యానించటం, 2008 ఉగ్రదాడుల సమయంలో మరణించిన ముంబై ఏటీఎస్ మాజీ చీఫ్ హేమంత్ కర్కరే గురించి చేసిన కామెంట్లు అప్పట్లో పెను సంచలనంగా మారాయి. ఇలా సాధ్వీ సున్నితమైన అంశాల పట్ల వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు కమలం పెద్దలకు ఆగ్రహం తెప్పించిదని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. -
ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు.. మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక నిర్ణయం
భోపాల్: ఆర్థికంగా వెనుకబడిన జనరల్ కేటగిరీ కులాల వారికే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వర్తిస్తాయా అనే అంశాన్ని మధ్యప్రదేశ్ హైకోర్టు విచారించింది. ఈ విషయంలో చీఫ్ జస్టిస్ రవి విజయ మలిమత్, జస్టిస్ విశాల్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఆరు వారాల్లో స్పందనను తెలియజేయాలని ఆదేశించింది. అడ్వకేట్ యూనియన్ ఫర్ డెమొక్రసీ అండ్ సోషల్ జస్టిస్ సంస్థ ఈ పిటిషన్ దాఖలు చేసింది. ఇతర కులాల్లోని ఆర్థికంగా వెనుకబడిన వారిని ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వర్తించడం లేదని కోర్టుకు తెలిపింది. పేదలపై కులం పేరుతో ప్రభుత్వం వివక్ష చూపిస్తోందని, ఈ డబ్ల్యూఎస్ రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధంగా భావించి కొట్టి వేయాలని పిటిషనర్ కోరారు. ఇదీ చదవండి.. కాంగ్రెస్‌పై అమిత్ షా ఫైర్ -
‘బుల్డోజర్ చర్య ఫ్యాషన్ అయింది’.. హైకోర్టు సీరియస్
మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకున్న బుల్డోజర్ చర్యను రాష్ట్ర హైకోర్టు తీవ్రంగా ఖండించింది. బుల్డోజర్ చర్యలు ఇటీవల కాలంలో ఒక ఫ్యాషన్‌గా తయారైందని కోర్టు సీరియస్ అయింది. ఓ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి ఇల్లును ప్రభుత్వ అధికారులు కూల్చేయడాన్ని మధ్యప్రదేశ్ హైకోర్టు ఇండోర్ బెంచ్ తప్పు పట్టింది. సరైన విధానాలు అమలు పర్చకుండా నిందితుడి ఇంటిని కూల్చివేయటం సరికాదని ప్రభుత్వ అధికారులపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. నిందితుడు రాహుల్ లాంగ్రీ.. ఓ వ్యక్తి వద్ద ఆస్తిని దోచుకోవడానికి ప్రయత్నించాడు. అక్కడితో ఆగకుండా ఆ వ్యక్తిపై బెదింపులకు పాల్పడగా అతను ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఈ కేసులో ప్రస్తుతం రాహుల్ లాంగ్రీ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. ఇదే సమయంలో తాజాగా రాహుల్ లాంగ్రీ ఇంటిపై ప్రభుత్వ అధికారులు బుల్డోజర్ చర్య చేపట్టి.. అతని ఇంటిని కూల్చేశారు. దీంతో రాహుల్ లాంగ్రీ భార్య రాధా కోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వ అధికారుల బుల్డోజర్ చర్యలకు వ్యతిరేకంగా రాధా దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. తమ ఇంటి పాత యజమాని అధికారులు నోటీసులు పంపారు. తమ వివరణ వినకుండా ఉజ్జయినిలోని తమ ఇంటిని ప్రభుత్వ అధికారులు కూల్చివేశారని లాంగ్రీ భార్య పిటిషన్లో పేర్కొన్నారు. తమ ఇల్లు అక్రమంగా కట్టింది కాదని.. ఆ ఇంటికి బ్యాంక్‌లో లోన్ కూడా తీసుకున్నామని ఆమె పిటిషన్లో తెలిపారు. ఈ సందర్భంగా హైకోర్టు ఇండోర్ బెంచ్ ప్రభుత్వ అధికారుల చేపట్టిన బుల్డోజర్ చర్యలను తప్పుపడుతూ.. నష్టపరిహారంగా లాంగ్రీ భార్య, తల్లికి చెరో రూ.లక్ష చెల్లించాలని ఆదేశించింది. ఇక..ఈ కేసులో మరింత నష్టం పరిహారం పొందేందుకు పిటిషన్‌దారులు సివిల్ కోర్టుకు వెళ్లేందుకు కూడా సిద్ధమైనట్లు తెలుస్తోంది. చదవండి: బిహార్‌లో మోదీని ఎదుర్కొంటాం: తేజస్వీ యాదవ్ -
103 ఏళ్ల తాత మూడో పెళ్లి
లక్నో: మధ్యప్రదేశ్‌లో 103 ఏళ్ల వ్యక్తి 49 ఏళ్ల మహిళను వివాహం చేసుకున్నాడు. తన ఇద్దరు భార్యలు మరణించిన కారణంగా మూడో పెళ్లి చేసుకున్నట్లు ఆయన చెప్పారు. తాత వయసున్న ఆయన తన మూడో భార్యతో బయటకు వెళ్లిన క్రమంలో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హబీబ్ నాజర్(103) మధ్యప్రదేశ్‌కు చెందిన వ్యక్తి. స్వాతంత్య్ర ఉద్యమంలోనూ ఆయన పాల్గొన్నాడు. ఆయన ఇద్దరు భార్యలు ఇప్పటికే మరణించారు. దీంతో మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉన్న ఆయన ఒంటరిగా జీవించాలని అనుకోలేదు. అందుకే మూడో వివాహం చేసుకోవాలనుకున్నారట. అందుకే 49 ఏళ్ల ఫిరోజ్ జహాన్ అనే మహిళను వివాహం చేసుకున్నారు. शादी की कोई उम्र नहीं! 103 साल के बुजुर्ग ने 49 की फिरोज जहां से किया निकाह, देखें Video पूरी खबर पढ़ें: https://t.co/rgQhoNLQli#Bhopal #ndtvmpcg #viralvideos pic.twitter.com/dDtcsUOlEm — NDTV MP Chhattisgarh (@NDTVMPCG) January 29, 2024 విహహం అనంతరం నాజర్ మాట్లాడుతూ..' నాకు 103 ఏళ్లు. నా భార్యకు 49. నాసిక్‌లో మొదటిసారి వివాహం అయింది. ఆమె చనిపోయాకు లక్నోలో మరో వివాహం చేసుకున్నారు. రెండో భార్య కూడా చనిపోయింది. నాకు జీవితం ఒంటరిగా అనిపిస్తోంది. ఆరోగ్యంగా ఉన్నాను. ఎలాంటి మెడికల్ సమస్యలు లేవు. అందుకే మరో వివాహం చేసుకున్నాను.' అని తెలిపారు. ఫిరోజ్ జహాన్‌కు ఇది రెండో వివాహం. తన భర్త చనిపోయిన కారణంగా ఒంటరిగా జీవిస్తోంది. 103 ఏళ్ల హబీబ్ నాజర్‌కు స్థానికంగా మంచి పేరు కూడా ఉంది. ఆయనకు చూసుకునే వారు ఎవరూ లేనందున వివాహానికి జహాన్ ఒప్పుకుంది. ఇదీ చదవండి: Preeti Rajak: సుబేదార్ ప్రీతి -
25 అడుగుల జాయింట్ కైట్ ఎగురుతుందిలా..
మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లోని ఎంవీఎం గ్రౌండ్లో ‘సంక్రాంతి మహోత్సవ్-2024’కు సర్వం సిద్ధమైంది. నేటి ఉదయం (జనవరి 14) రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు సూర్యునికి అర్ఘ్యం సమర్పించి ఉత్సవాన్ని ప్రారంభించనున్నారు. ఉత్సవంలో భాగంగా మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి ఒకరికొకరు పసుపు, కుంకుమ పూసుకుంటారు. తరువాత పతంగుల పోటీ జరగనుంది. ఈ సందర్భంగా గుజరాత్‌కు చెందిన పతంగుల కళాకారులు ప్రత్యేకంగా తయారుచేసిన జాయింట్ గాలిపటాన్ని ఎగురవేయనున్నారు. దాని పరిమాణం 25 అడుగుల వరకు ఉంటుంది. ఈ జాయింట్ పతంగులలో కార్టూన్లు, సింహాలు, వివిధ బొమ్మలు ఉంటాయి. ‘సంక్రాంతి మహోత్సవ్-2024’లో మహిళల ఆధ్వర్యంలో ఫుడ్ స్టాల్స్ ఏర్పాటయ్యాయి. అలాగే జిల్లా స్థాయి పతంగుల ఎగురవేత పోటీ ఏర్పాటు చేశారు. సాయంత్రం లోహ్రీ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇందులో భోగి మంటలు వేయడంతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. గాలిపటాలు ఎగురవేయాలనే ఉత్సాహం కలిగినవారికి నిపుణులు శిక్షణ అందిస్తారు. ‘సంక్రాంతి మహోత్సవ్-2024’ జనవరి 15న ముగుస్తుంది. ఇది కూడా చదవండి: తొలి గాలిపటాన్ని ఎవరు తయారు చేశారు? ఎందుకు ఉపయోగించారు? -
భోపాల్: షెల్టర్ హోం నుంచి 26 మంది బాలికల మిస్సింగ్!
మధ్యప్రదేశ్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. భోపాల్‌లో చట్టవిరుద్దంగా నిర్వహిస్తున్న షెల్టర్ హోమ్ నుంచి 26 మంది బాలికలు అదృశ్యమయ్యారు. భోపాల్ శివారు ప్రాంతంలో అంచల్ బాలికల హాస్టల్ నిర్వహిస్తున్నారు. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్(ఎన్సీపీసీఆర్) చైర్మన్ ప్రియాంక్ కనుంగో .. ఈ చిల్డ్రన్స్ హోమ్‌ను ఆకస్మికంగా సందర్శించారు. అయితే రిజిస్టర్‌ను తనిఖీ చేయగా.. అందులో 68 బాలికల ఎంట్రీలు ఉండగా.. 26 మంది గల్లంతైనట్లు గుర్తించారు. మిస్ అయిన వారిలో గుజరాత్, జార్ఖండ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లోని సెహోర్, రైసెన్, చింద్వారా, బాలాఘాట్ ప్రాంతాలకు చెందిన బాలికలు ఉన్నారు. అదృశ్యమైన బాలికల గురించి షెల్టర్ హోమ్ డైరెక్టర్ అనిల్ మాథ్యూను ప్రశ్నించగా.. ఆయన పొంతన లేని సమాధానలు చెప్పాడు. అనుమానం వచ్చిన అధికారి.. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల దర్యాప్తులో బాలికల హాస్టల్లో అనేక అవకతవకలు వెలుగులోకి వచ్చాయి. అసలు షెల్టర్ హోంను అక్రమంగా నిర్వహిస్తున్నట్లు తేలింది. వీధుల్లో ఒంటరిగా కనిపించిన పిల్లలను ఒక చోట చేర్చి, ఎలాంటి లైసెన్స్ లేకుండా ఓ మిషనరీ( మత గురువు) ఈ షెల్టర్ హోమ్‌ను నడుపుతున్నట్లు కనుంగో ట్వీట్ చేశారు. రక్షించిన పిల్లలకు రహస్యంగా క్రైస్తవ మతాన్ని ఆచరించేలా చేశారని ఆరోపించారు. హాస్ట్‌లో ఎక్కువమంది అమ్మాయిలు ఆరు నుంచి 18 సంవత్సరాల వారేనని.. వీరిలో అధికంగా హిందువులే ఉన్నట్లు తెలిపారు. కాగా ఈ విషయం గురించి తెలుసుకున్న గవర్నర్.. దీనిపై దర్యాప్తు చేయాల్సిందిగా ఆదేశిస్తూ ప్రభుత్వ సీఎస్‌కు నోటీసులు పంపినట్లు తెలిపారు. ఇక షెల్టర్ హోంలోని మిగతా పిల్లలను చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పజెప్పారు. చదవండి: రామమందిర ప్రారంభం.. ఆలయానికి వెళ్లి మహా హారతి ఇస్తా: ఉద్ధవ్ -
22న అయోధ్యలో డమరూ బృందం ప్రదర్శన
అయోధ్యలోని నూతన రామాలయంలో ఈనెల 22న బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం వైభవంగా జరగనుంది. ఈ ఉత్సవంలో మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందిన డమరూ బృందం పాల్గొననుంది. 108 మంది సభ్యుల డమరూ బృందం జనవరి 22న అయోధ్యలో ప్రదర్శన ఇవ్వనుంది. దేశంలో రామ భజన, రామ స్తుతి, శివ తాండవ స్తోత్రాన్ని పఠించే ఏకైక బృందంగా భోపాల్ డమరూ బృందం పేరుగాంచింది. జనవరి 22న అయోధ్యలో దేశ నలుమూలలకు చెందిన పలువురు కళాకారులు తమ ప్రదర్శనలు ఇవ్వనున్నారు. ఈ నేపధ్యంలోనే భోపాల్‌కు చెందిన డమరూ బృందం కూడా తమ ప్రదర్శనతో ఉర్రూతలూగించనుంది. భోపాల్‌లోని శ్రీ బాబా బటేశ్వర్ కీర్తన సమితికి అయోధ్య నుండి ఆహ్వానం అందింది. దీంతో జనవరి 22న రామభక్తులు ఆలయానికి వెళ్లే మార్గంలో శ్రీ బాబా బటేశ్వర్ కీర్తన సమితికి చెందిన డమరూ బృందం ప్రదర్శన ఇవ్వనుంది. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి జనవరి 20న ఈ డమరూ బృందానికి చెందిన 108 మంది సభ్యులు అయోధ్యకు చేరుకుంటారు. అక్కడ వారు 21న రిహార్సల్ చేస్తారు. జనవరి 22న ప్రధాని నరేంద్ర మోదీ, ఇతర వీవీఐపీల సమక్షంలో వీరి ప్రదర్శన సాగనుంది. ఇది కూడా చదవండి: అయోధ్యాపురిలో నూతన రామాలయ వైభవమిదే.. -
రెండు నెలల్లో రూ.4 లక్షలు.. ఏసీ కోచ్‌ల నుంచే..
గత రెండు నెలల్లో ట్రైన్ ఎస్ కోచ్‌ల నుంచి లక్షల విలువైన దుప్పట్లు, బెడ్షీట్లు, దిండ్లు, ఇతర వస్తువులు చోరీకి గురయ్యాయని ప్రభుత్వ రైల్వే పోలీసు అధికారులు తెలిపారు. చోరీకి గారైన వస్తువుల విలువ ఎంత? ఎక్కడ ఈ చోరీలు ఎక్కువగా జరిగాయనే మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం. ఏసీ కోచ్‌ల ప్రయాణించే ప్రయాణికులకు దుప్పట్లు, దిండ్లు వంటి వస్తువులను రైల్వే శాఖ ఉచితంగానే అందిస్తుంది. కొందరు ప్రయాణికులు వారి ప్రయాణం పూర్తయిన తరువాత ఆ దుప్పట్లను మడిచి బ్యాగులో వేసుకునే వెళ్లిపోయే సంఘటనలు చాలానే ఉన్నాయి. ప్రయాణికులు కాకుండా.. ఏసీ కోచ్ అటెండర్లు కూడా ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి సంఘటనలు ఎక్కువగా భోపాల్‌లో జరిగినట్లు సమాచారం. భోపాల్ నుంచి ఢిల్లీకి వెళ్లే ఎక్స్‌ప్రెస్‌లలో ఇలాంటి చోరీలు జరిగాయని కొందరు అధికారులు తెలియజేసారు. భోపాల్ ఎక్స్‌ప్రెస్, రేవాంచల్ ఎక్స్‌ప్రెస్, మహామన ఎక్స్‌ప్రెస్, హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్ గమ్యస్థానానికి చేరుకోవడానికి సుమారు 12 గంటల కంటే ఎక్కువ సమయం పడుతుండటంతో ఇలాంటి దొంగతనాలు ఎక్కువగా జరిగాయి. అన్ని రైళ్లలో 12 కోచ్‌లు, ఇద్దరు అటెండర్లు మాత్రమే ఉంటారు. వారు రాత్రి సమయంలో పడుకునే సందర్భంలో మధ్యలో దిగిపోయేవారు ఇలాంటి చర్యలకు పాల్పడి ఉంటారని చెబుతున్నారు. ఇదీ చదవండి: బిలినీయర్స్ జాబితాలో కొత్త వ్యక్తి.. మద్యం అమ్ముతూ అరుదైన ఘనత కేవలం గత రెండు నెలల్లో రైళ్లలో రూ.2.65 లక్షల విలువైన 1,503 బెడ్షీట్లు, రూ.1.9 లక్షల విలువైన 189 దుప్పట్లు, రూ.10 వేలకు పైగా విలువ చేసే 326 దిండ్లు చోరీకి గురైనట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకులు ఇలాంటి చర్యలకు పాల్పడే వ్యక్తులపై పెద్దగా చర్యలు తీసుకోలేదని.. చోరీలను ఆపడానికి కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సంబంధిత అధికారులు వెల్లడించారు. 🚨 Blankets, bed sheets, pillows and other stuff worth 4 lakh were stolen from trains AC coaches in last two months. Most incidents took place in Bhopal, Rewanchal, Mahamana and Humsafar express (GRP Officials) pic.twitter.com/paAGnaNSRH — Indian Tech & Infra (@IndianTechGuide) December 14, 2023