ఇండియా కూటమి సమన్వయ కమిటీ కీలక నిర్ణయం.. | INDIA Bloc's First Joint Rally In Bhopal In October - Sakshi
Sakshi News home page

ఇండియా కూటమి మొదటి బహిరంగ సభ అప్పుడే..!

Published Wed, Sep 13 2023 7:32 PM | Last Updated on Wed, Sep 13 2023 9:24 PM

INDIA 1st Public Meet In Bhopal In October - Sakshi

ఢిల్లీ: ఇండియా కూటమి సమన్వయ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ మొదటి వారంలో మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో మొదటి బహిరంగ సభను నిర్వహించాలని ప్రకటించింది. ధరల పెరుగుదల, నిరుద్యోగం, బీజేపీ అవినీతి పాలన వంటి ప్రధాన అంశాలను జనంలోకి తీసుకువెళ్లాలని స్పష్టం చేసింది.  నేడు ఢిల్లీలో ఇండియా కూటమి సమన్వయ కమిటీ సమావేశమైంది. ఈ మేరకు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాలని పేర్కొంది. లోక్ సభ సీటు షేరింగ్‌ ప్రక్రియ ప్రారంభమైందని స్పష్టం చేసింది. 

లోక్‌సభ సీట్ షేరింగ్‌ ప్రారంభమైందని, త్వరలో పూర్తి నిర్ణయం తీసుకుంటామని ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా తెలిపారు. జాయింట్ పబ్లిక్ ర్యాలీ భోపాల్‌లో నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. 

సమన్వయ కమిటీ మీటింగ్ అనంతరం కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ మాట్లాడారు. సీట్ షేరింగ్ విధానం ప్రారంభమైందని చెప్పారు. పార్టీల చర్చలు జరిపి వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని చెప్పారు. 

కుల గణన అంశంపై నిర్ణయం..
జేడీయూ, ఆర్జేడీ ప్రతిపాదించిన కుల గణన సర్వే సమస్యను పరిగణలోకి తీసుకుంటామని ఇండియా కూటమి సమన్వయ కమిటీ నేడు తీర్మానించింది. ఈ విషయాన్ని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ చెప్పారు. ఈ రోజు 14 మంది సమన్వయ కమిటీ మీటింగ్‌కు 12 మంది హాజరయ్యారు. ఇందులో ప్రధానంగా టీఎంసీ అభ్యర్థి, ఎంపీ అభిషేక్ బెనర్జీ గౌర్హాజరయ్యారు. కుల గణన అంశాన్ని కూటమి చేపట్టడాన్ని టీఎంసీ ఎప్పటి నుంచో వ్యతిరేకిస్తోంది. ఆ పార్టీ సభ్యులు మీటింగ్‌కు హాజరు కానప్పటికీ నేడు ఆ అంశాన్ని చర్చించి, నిర్ణయం తీసుకున్నారు. 

కుల గణన అంశాన్ని బిహార్‌లోని జేడీయూ, ఆర్జేడీలు ముందుకు తీసుకువచ్చాయి. జులైలో జరిగిన ఇండియా కూటమి మీటింగ్‌లోనే  ఈ అంశంపై పోరాడాలని కూటమికి అభ్యర్థనలు వచ్చాయి. కానీ కూటమిలోని టీఎంసీ దీనిని వ్యతిరేకించింది. అటు.. సీటు షేరింగ్‌ అంశంలోనూ టీఎంసీ చీఫ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో సీటు షేరింగ్ చేసే ప్రసక్తే లేదని అన్నారు.   

నేడు సాయంత్రం ఇండియా కూటమి సమన్వయ కమిటీ సమావేశమయింది. సమన్వయ కమిటీ ఢిల్లీలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నివాసంలో భేటీ అయ్యారు. లోక్‌సభ ఎన్నికల్లో సీట్ షేరింగ్ , ఎన్నికల ప్రచారం తదితర అంశాలపై చర్చించారు.   

ఇదీ చదవండి: ఈ నెల 17న అఖిలపక్ష భేటీకి కేంద్రం పిలుపు..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement