భోపాల్: మధ్యప్రదేశ్ నుంచి ఐదు వందే భారత్ రైళ్లకు పచ్చ జెండా ఊపారు భారత ప్రధాని నరేంద్ర మోదీ. వీటిలో రెండిటిని ప్రత్యక్షంగా ప్రారంభించగా మూడింటిని మాత్రం వర్చువల్ గా ప్రారంభించారు. దీంతో ప్రధాని ప్రకటించిన 75 వందే భారత్ రైళ్లలో ఇప్పటికి 23 రైళ్లు పట్టాలెక్కాయి.
మధ్యప్రదేశ్ షాహ్ధూల్ జిల్లాలో పర్యటించిన ప్రధాని మొదట భోపాల్ రాణి కమలాపాటి రైల్వే స్టేషన్ చేరుకుని భోపాల్-ఇండోర్, భోపాల్-జబల్ పూర్ మధ్య వందే భారత్ రైళ్లను ప్రారంభించారు. అనంతరం గోవా- ముంబై, ధార్వాడ్-బెంగుళూరు, హతియా-పాట్నా వందేభారత్ రైళ్లను కూడా వర్చువల్ గా ప్రారంభించారు.
ఈ సందర్బంగా ప్రధాని మాట్లాడుతూ.. ఈరోజు ప్రారంభించిన రైళ్లు రాష్ట్రాల మధ్య కనెక్టివిటీని పెంచుతాయని.. మధ్యప్రదేశ్, కర్ణాటక, గోవా, బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల మధ్య అనుబంధాలను మరింత మెరుగుపరుస్తాయని అన్నారు. వాణిజ్యపరంగా, పర్యాటకంగా కూడా ఈ కనెక్టివిటీ ఉపయోగపడుతుందని ఆయనన్నారు. ఈ కార్యక్రమంలో రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, గవర్నర్ మంగుభాయ్ పటేల్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చోహాన్, కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, జ్యోతిరాదిత్య సింధియా పాల్గొన్నారు.
ఇక ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత మధ్యప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోని సుమారు 10 లక్షల మంది బూత్ స్థాయి కార్యకర్తలతో వర్చువల్ గా సమావేశం కానున్నారు. అనంతరం దేశంలోని 3000 మంది బూత్ స్థాయి కార్యకర్తలతో కూడా మాట్లాడనున్నారు.
#WATCH | Madhya Pradesh | PM Narendra Modi flags off five Vande Bharat trains from Rani Kamlapati Railway Station in Bhopal.
— ANI (@ANI) June 27, 2023
Vande Bharat trains that have been flagged off today are-Bhopal (Rani Kamalapati)-Indore Vande Bharat Express; Bhopal (Rani Kamalapati)-Jabalpur Vande… pic.twitter.com/N4a72zwR0m
ఇది కూడా చదవండి: దేశంలో ఏం జరుగుతోందో తెలియాలంటే మణిపూర్ వెళ్లి చూడండి..
Comments
Please login to add a commentAdd a comment