భోపాల్: ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో మధ్యప్రదేశ్‌లో ఎన్నికల వేడి రాజుకుంది. మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చోహాన్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ప్రధాని మన రాష్ట్రం ఎప్పుడు వచ్చినా నోటికొచ్చిన అబద్దాలు చెప్పడంతో ప్రధానికి మీ విషయం అర్థమైందని మీరు ముఖ్యమంత్రే కానీ డమ్మీ ముఖ్యమంత్రి అని అన్నారు.
డమ్మీ సీఎం..
ఈరోజు 'జన ఆశీర్వాద యాత్ర' ముగింపు సందర్బంగా ప్రధాని కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడనున్న నేపథ్యంలో ఎక్కడా ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చోహాన్ ఉనికి కనిపించడంలేదని చెబుతూ ఆయనొక అబద్దాలు కోరు అని ప్రధానికి అర్థమైందని అందుకే ప్రచార కార్యక్రమంలో ఈయన లేకుండా జాగ్రత్త పడ్డారని చెప్పుకొచ్చారు. మీరు ముఖ్యమంత్రే కానీ అసలు ముఖ్యమంత్రి కాదని అందుకే బీజేపీ నేత అమిత్ షా ఎన్నికలు పూర్తైన తర్వాతే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది నిర్ణయిస్తామన్నట్టు గుర్తు చేశారు.
అన్నీ అబద్దాలే..
మీరు అబద్ధాలతో ప్రధానిని చాలా ఇబ్బంది పెట్టారని రైతుల ఆదాయం రెట్టింపయ్యిందని మీరు చెబితే నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం రైతుల ఆదాయం గణనీయంగా తగ్గినట్లు ఆయనకు తెలిసిపోయిందని పెట్రోల్ ధరలు, గ్యాస్ ధరలు తగ్గాయని మీరు చెప్పినవి కూడా అబద్ధాలేనని ఆయనకు తెలిసిపోయిందన్నారు.
ప్రధానికి అర్ధమైపోయింది..
అన్నిటినీ మించి ప్రధాని బుందేల్‌ఖండ్ వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ బుందేల్‌ఖండ్‌పై నిర్లక్ష్య వైఖరితో వ్యవహారించిందని ఏకంగా ప్రధానితోనే చెప్పించారు. కానీ కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏ ప్రభుత్వం బుందేల్‌ఖండ్‌కు రూ.7,600 కోట్లు స్పెషల్ ప్యాకేజీ ఇచ్చిందని గుర్తుచేశారు. ఇలా నోటికొచ్చిన అబద్దాలు చెప్పడం వల్లనే ప్రధాని సీఎంను పక్కన పెట్టేశారని అన్నారు.
ఇది కూడా చదవండి: ‘మామూలు రైళ్లకే రంగులేసి వందేభారత్‌గా దోపిడీ’
Comments
Please login to add a commentAdd a comment