ఆరు వందేభారత్‌లకు మోదీ పచ్చ జెండా | Modi Will Flag off 6 New Vande Bharat Trains | Sakshi
Sakshi News home page

ఆరు వందేభారత్‌లకు మోదీ పచ్చ జెండా

Published Sun, Sep 15 2024 11:55 AM | Last Updated on Sun, Sep 15 2024 11:55 AM

Modi Will Flag off 6 New Vande Bharat Trains

న్యూఢిల్లీ: ఆరు నూతన వందేభారత్ రైళ్లను ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కొత్త రైళ్ల రాకతో 54గా ఉన్న వందేభారత్‌ రైళ్ల సంఖ్య 60కి చేరిందని రైల్వే మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

ప్రధాని మోదీ ఆదివారం నాడు జార్ఖండ్‌లో పర్యటించనున్నారు. ప్రధాని మోదీ ప్రారంభించిన ఈ ఆరు నూతన వందేభారత్‌ రైళ్లు టాటా నగర్-పాట్నా, బ్రహ్మపూర్-టాటా నగర్, రూర్కెలా-హౌరా, డియోఘర్-వారణాసి, భాగల్పూర్-హౌరా, గయా-హౌరా మధ్య నడుస్తాయి.

ఈ కొత్త వందే భారత్ రైళ్లు దేవఘర్‌లోని బైద్యనాథ్ ధామ్, వారణాసిలోని కాశీ విశ్వనాథ్ ఆలయం, కాళీఘాట్, కోల్‌కతాలోని బేలూర్ మఠం వంటి మతపరమైన ప్రదేశాలకు త్వరగా చేరుకోవడానికి సహాయపడతాయి. ఇది కాకుండా ఈ రైళ్లు ధన్‌బాద్‌లో బొగ్గు గనుల పరిశ్రమను, కోల్‌కతాలోని జనపనార పరిశ్రమను, దుర్గాపూర్‌లో ఇనుము, ఉక్కు పరిశ్రమను  చూపిస్తాయి.

ఇది కూడా చదవండి: కాలుష్య కట్టడికి రూ.25 వేలకోట్లు

మొదటి వందే భారత్ రైలు 2019, ఫిబ్రవరి 15న ప్రారంభమయ్యింది. ఈ రైలు గంటకు 160 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదని, లక్షలాది మంది ప్రయాణికులకు ప్రత్యేక ప్రయాణ అనుభూతిని అందజేస్తుందని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పటి వరకు వందే భారత్ మొత్తం సుమారు 36,000 ప్రయాణాలను పూర్తి చేసింది. 3.17 కోట్ల మంది ప్రయాణీకులకు ఉత్తమ ప్రయాణ అనుభూతిని అందించిందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement