జార్ఖండ్ మాజీ సీఎం చంపయ్ సోరెన్
ఢిల్లీలో మకాం.. బీజేపీలో చేరే అవకాశం
రాంచీ: ముఖ్యమంత్రిగా ఉన్నపుడు సొంత పార్టీ నేతలే తనను దారుణంగా అవమానించారని, దాంతో ప్రత్యామ్నాయం చూసుకోవాల్సి వచి్చందని జార్ఖండ్ మాజీ సీఎం, జేఎంఎం సీనియర్ నాయకుడు చంపయ్ సోరెన్ అన్నారు. బీజేపీలో చేరుతున్నారనే ప్రచారం నేపథ్యంలో చంపయ్ ఆదివారం ఢిల్లీకి చేరుకున్నారు. అనంతరం ‘ఎక్స్’లో తన ఆవేదనను షేర్ చేశారు. ‘జూలై మొదటివారంలో ముఖ్యమంత్రిగా నేను పాల్గొనాల్సిన అన్ని ప్రభుత్వ కార్యక్రమాలను నాకు మాటమాత్రమైనా చెప్పకుండా పార్టీ నాయకత్వం రద్దు చేసింది.
ఎందుకని ఆరా తీయగా పార్టీ ఎమ్మెల్యేల సమావేశం ఉందని, అప్పటిదాకా ఏ ప్రభుత్వ కార్యక్రమానికి హాజరు కాకూడదని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ఇంతకంటే అవమానం మరొకటి ఉంటుందా?. ఎమ్మెల్యేల సమావేశంలో నన్ను రాజీనామా చేయమన్నారు. నిర్ఘాంతపోయా. అధికారంపై నాకెలాంటి యావ లేదు కాబట్టి వెంటనే రాజీనామా చేశా. కానీ నా ఆత్మగౌరవం దెబ్బతింది’ అని చెప్పుకొచ్చారు. జీవితాన్ని ధారపోసిన పార్టీలో నా ఉనికే ప్రశ్నార్థకమైంది.
నా జీవితంలో కొత్త అధ్యాయం మొదలైందని ఆ రోజే ఎమ్మెల్యేల భేటీలో ప్రకటించా. నా ఈ ప్రయాణంలో అన్ని ప్రత్యామ్నాయాలు తెరిచే ఉంటాయని సోరెన్ అన్నారు. ఇది తన వ్యక్తిగత పోరాటమని, ఇతర జేఎంఎం నాయకులను ఇందులోకి లాగదలచుకోలేదని చెప్పారు. ఎంతో చెమటోడ్చి నిర్మించుకున్న పార్టీకి నష్టం కలిగించాలనే ఆలోచన తానెప్పుడూ చేయలేదని, కాని అలాంటి పరిస్థితులు కలి్పంచారని చంపయ్ అన్నారు.
ఎమ్మెల్యేలకు ఎరవేస్తున్నారు: హేమంత్
బీజేపీ తమ పార్టీ ఎమ్మెల్యేలకు ఎర వేస్తోందని జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఆరోపించారు. బీజేపీ గుజరాత్, అస్సాం, మహారాష్ట్ర నుంచి నాయకులను జార్ఖండ్‌కు తెచ్చి గిరిజనులు, దళితులు, వెనుకబడిన వర్గాలు, మైనారిటీల్లో విషం నింపుతోందని, ఒకరిపైకి మరొకరిని ఉసిగోల్పుతోందని అన్నారు. ‘సమాజాన్ని విభజించడం మాట అటుంచితే.. వీళ్లు కుటుంబాలకు, పారీ్టలను కూడా చీల్చుతారు. ఎమ్మెల్యేలకు ఎర వేస్తారు. డబ్బు నాయకులను పార్టీలు మారేలా చేస్తుంది’ అని హేమంత్ పరోక్షంగా చంపయ్‌ను విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment