Champai Soren
-
జార్ఖండ్ ఎన్నికలు.. బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో.. అధికార ప్రతిపక్ష పార్టీలు దూకుడు పెంచాయి. పొత్తుల ఖరారు, అభ్యర్థుల ప్రకటన, ప్రచారాలపై కసరర్తు ప్రారంభించాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో ప్రతిపక్ష బీజేపీ తమ అభ్యర్థులకు సంబంధించి తొలి జాబితాను ప్రకటించింది. జార్ఖండ్‌లో మొత్తం 81 స్థానాలు ఉండగా.. 66 మందితో కూడిన తొలి జాబితాను శనివారం విడుదల చేసింది. మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బాబులాల్ మరాండీ ధన్వార్ స్థానం నుంచి బరిలోకి దిగుతున్నారు. జేఎంఎం నుంచి బయటకు వచ్చిన చంపయ్ సోరెన్ సరాయ్‌కెలా నుంచి పోటీ చేయనున్నారు. ఇక జామ్తాడా నుంచి సీతా సోరెన్, కోదర్మా నుంచి నీరా యాదవ్ పోటీ చేయనున్నారు. గండేలో బీజేపీ అభ్యర్థిగా మునియా దేవి, సింద్రీలో తారాదేవి, నిర్సా నుంచి అప్నార్నా సేన్‌గుప్తా ప్రాతినిధ్యం వహించనున్నారు.ఝరియా నుంచి రాగిణి సింగ్, చైబాసా నుంచి గీతా బల్ముచు చైబాసాలో, పుష్పా దేవి భూయాన్ ఛతర్పూర్ నుంచి పోటీ చేయనున్నారు.भाजपा केन्द्रीय चुनाव समिति ने होने वाले झारखण्ड विधानसभा चुनाव 2024 के लिए निम्नलिखित नामों पर अपनी स्वीकृति प्रदान की है। pic.twitter.com/onqghIJeGV— BJP JHARKHAND (@BJP4Jharkhand) October 19, 2024కాగా పొత్తులో భాగంగా బీజేపీ 68 స్థానాల్లో పోటీ చేస్తోంది. దాని మిత్రపక్షాలు, ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ 10, జనతాదళ్ (యూ) రెండు, లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) ఒక చోట నుంచి పోటీ చేయనున్నాయి. కాగా జార్ఖండ్‌లో నవంబర్ 13, 20 తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 23న ఓట్లు లెక్కింపు ఉండనుంది. -
ఆస్పత్రిలో చేరిన మాజీ సీఎం చంపయ్ సోరెన్
రాంచీ: జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి చంపయ్ సోరెన్ ఆస్పత్రిలో చేరారు. బ్లడ్ షుగర్‌కు సంబంధించిన సమస్యల కారణంగా చంపయ్ ఆసుపత్రిలో చేరినట్లు ఆదివారం ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. శనివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఆయన జంషెడ్‌పూర్‌లోని టాటా మెయిన్ ఆసుపత్రిలో చేరారు.स्वास्थ्य संबंधित परेशानियों की वजह से आज वीर भूमि भोगनाडीह में आयोजित "मांझी परगना महासम्मेलन" में वीडियो कॉन्फ्रेंसिंग के माध्यम से शामिल रहूंगा।डॉक्टरों के अनुसार चिंता की कोई खास बात नहीं है। मैं शीघ्र पुर्णतः स्वस्थ होकर, आप सभी के बीच वापस आऊंगा। जोहार ! pic.twitter.com/rUrCzCd7lK— Champai Soren (@ChampaiSoren) October 6, 2024‘‘చంపయ్ రక్తంలో చక్కెర స్థాయి తగ్గింది.దీంతో వెంటనే ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. చంపయ్ పరిస్థితి మెరుగుపడుతోంది’ అని టాటా మెయిన్ హాస్పిటల్ జీఎం డాక్టర్ సుధీర్ రాయ్ తెలిపారు.ఆగస్టు 30న కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ, జార్ఖండ్ బీజేపీ అధ్యక్షుడు బాబులాల్ మరాండీ సమక్షంలో చంపయ్ సోరెన్ బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. మనీలాండరింగ్ కేసులో ఈడీ అరెస్ట్ చేసిన తర్వాత హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయగా.. చంపయ్ సీఎంగా ఫిబ్రవరి 2న ప్రమాణం చేశారు. హేమంత్ బెయిల్‌పై విడుదలైన తర్వాత చంపయ్ సీఎం పదవికి రాజీనామా చేశారు. జూలైలో హేమంత్ మళ్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే అప్పటి నుంచి చంపయ్ సోరెన్ జేఎంఎం పార్టీకి దూరంగా ఉండి.. అనంతరం బీజేపీలో చేరారు.చదవండి: రూ. 1,800 కోట్ల విలువైన భారీ డ్రగ్స్ పట్టివేత -
బీజేపీలో చేరిన చంపయ్ సోరెన్
రాంచీ: జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి చంపయ్ సోరెన్(67) బీజేపీలో చేరారు. జేఎంఎం ప్రస్తుత పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేయడంతోపాటు పార్టీలో తనను అవమానించారని ఆరోపిస్తూ రెండు రోజుల క్రితం ఆయన ఆ పార్టీకి, మంత్రి పదవికి రాజీనామా చేశారు. శుక్రవారం రాంచీలోలో జరిగిన కార్యక్రమంలో కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ చంపయ్ సోరెన్‌కు కండువా కప్పి, బీజేపీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా చంపయ్ సోరెన్‌ను ‘టైగర్ జిందా హై’అంటూ చౌహాన్ అభివర్ణించారు. జార్ఖండ్ ఉద్యమంలో కొల్హన్ ప్రాంతంలో కీలకంగా ఉన్న చంపయ్‌ను అక్కడి వారు ‘కొల్హన్ టైగర్’గా పిలుచుకుంటారు. చంపయ్ మాట్లాడుతూ..ఢిల్లీ, కోల్‌కతాలలో ఉన్న సమయంలో తనపై హేమంత్ సోరెన్ ప్రభుత్వం నిఘా పెట్టిందని, దీన్ని జీర్ణించుకోలేకే ఆ పార్టీని వీడి బీజేపీలో చేరాల్సి వచ్చిందన్నారు. -
బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నా: చంపయీ సోరెన్
ఢిల్లీ: జార్ఖండ్ ఆదివాసీ నేత, మాజీ సీఎం చంపయీ సోరెన్ తాను బీజేపీ పార్టీలో చేరబోతున్నట్లు స్వయంగా వెల్లడించారు. మంగళవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ‘‘ తొలుత క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకొందామని అనుకున్నా. ఈ నెల 18న ఢిల్లీకి వచ్చినప్పుడే నా వైఖరిని స్పష్టంగా చెప్పాను. పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకోవాలని భావించా. కానీ, ప్రజల మద్దతు నాకు ఉంది. అందుకే బీజేపీలో చేరాలని నిర్ణయిం తీసుకున్నా’ అని చంపయీ స్పష్టం చేశారు.#WATCH | Delhi: Former Jharkhand CM & JMM leader Champai Soren says, "When I had come on 18th August I had made my position clear...At first, I thought that I would retire from politics but then due to the public support, I decided not to...I have decided to join the BJP..."… pic.twitter.com/i4BD0KtOSV— ANI (@ANI) August 27, 2024 ఇక.. ఆయన ఆగస్టు 30న బీజేపీలో అధికారికంగా చేరనున్నారని అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సోమవారం వెల్లడించిన విషయం తెలిసిందే. చంపయ్ కేంద్రమంత్రి అమిత్ షాతో సమావేశం అయ్యాక పార్టీలో చేరిక విషయంలో నిర్ణయం తీసుకున్నారని హిమంత తెలిపారు.చదవండి: బిగ్ ట్విస్ట్ ఇచ్చిన చంపయీ సోరెన్! -
బిగ్ ట్విస్ట్ ఇచ్చిన చంపయీ సోరెన్!
ఢిల్లీ: జార్ఖండ్ ఆదివాసీ నేత, మాజీ సీఎం చంపయీ సోరెన్.. జేఎంఎంకు ఝలక్ ఇచ్చారు. గత కొంతకాలంగా ఆయన బీజేపీలో చేరునున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీనిపై చంపయీ సైతం ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. అయితే తాజాగా ఆయన చేరికను నిర్ధారిస్తూ.. బీజేపీ నేత, అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ ‘ఎక్స్’ వేదికగా సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ‘మాజీ సీఎం, ఆదివాసీ నేత చంపయీ సోరెన్ ఈ రోజు కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిశారు. రాంచీలో చంపయీ అధికారికంగా ఆగస్టు 30 (శుక్రవారం)బీజేపీలో చేరనున్నారు’అని పేర్కొన్నారు.Former Chief Minister of Jharkhand and a distinguished Adivasi leader of our country, @ChampaiSoren Ji met Hon’ble Union Home Minister @AmitShah Ji a short while ago. He will officially join the @BJP4India on 30th August in Ranchi. pic.twitter.com/OOAhpgrvmu— Himanta Biswa Sarma (@himantabiswa) August 26, 2024ముఖ్యమంత్రిగా ఉన్నపుడు సొంత పార్టీ నేతలే తనను దారుణంగా అవమానించారని, దాంతో ప్రత్యామ్నాయం చూసుకోవాల్సి వచ్చిందని చంపయ సోరెన్ ఇటీవల అన్నారు. మరోవైపు.. బీజేపీ తమ పార్టీ ఎమ్మెల్యేలకు ఎర వేస్తోందని జేఎంఎం కార్యవర్గ నేత, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఆరోపించిన విషయం తెలిసిందే. బీజేపీ గుజరాత్, అస్సాం, మహారాష్ట్ర నుంచి నాయకులను జార్ఖండ్‌కు తెచ్చి గిరిజనులు, దళితులు, వెనుకబడిన వర్గాలు, మైనారిటీల్లో విషం నింపుతోందని, ఒకరిపైకి మరొకరిని ఉసిగోల్పుతోందని అన్నారు.భూ కుంభకోణం కేసులో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌ను ఈడీ ఈ ఏడాది జనవరి 31న అరెస్టు చేసింది. ఈడీ అరెస్ట్‌తో హేమంత్ సోరెన్ సీఎం పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత సోరెన్ కుటుంబానికి సన్నిహితుడిగా ఉన్న చంపయీ సోరెన్‌ను ముఖ్యమంత్రిగా నియమించారు. వరుస పరిణామాల అనంతరం హేమంత్‌కు ఝార్ఖండ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆయన మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. అయితే తనను సీఎం పదవి నుంచి తప్పించడం వల్ల చంపయీ పార్టీ వీడాలని నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరిగింది.జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల గడువు జనవరి 5, 2025తో ముగియనుంది. దీంతో.. ఈ ఏడాది చివర్లోపు అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. తాజాగా జమ్ము కశ్మీర్, హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించిన కేంద్ర ఎన్నికల సంఘం.. జార్ఖండ్‌కు ప్రకటన చేయొచ్చనే ప్రచారం జరిగింది. కానీ, ఈసీ అలాంటిదేం చేయలేదు. -
మాజీ సీఎం చంపయీ సోరెన్ కొత్త పార్టీ
రాంచి : జార్ఖండ్ రాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి చంపయీ సోరెన్ కొత్త పార్టీ పెట్టనున్నట్లు తెలుస్తోంది. కొత్త పార్టీపై ప్రకటన, పార్టీ గుర్తు ఇతర అంశాలపై మరో వారంలో చంపయీ సోరెన్ స్పష్టత ఇవ్వనున్నట్లు సమాచారం.జార్ఖండ్ రాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి,జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) నేత చంపయీ సోరెన్ కొత్త పార్టీ పెట్టనున్నట్లు తెలుస్తోంది. మరో వారంలో చంపయీ సోరెన్ కొత్త పార్టీ ఏర్పాటుపై స్పష్టత ఇవ్వనున్నట్లు చెప్పారు. చంపయీ సోరెన్ బీజేపీలో చేరుతున్నానే వార్తల నేపథ్యంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.#WATCH | Former Jharkhand CM & JMM leader Champai Soren says, "I will not retire from politics. In the new chapter that I have started, I'll strengthen the new organisation and if I find a good friend in the way, I'll move ahead with that friendship to serve the people and… pic.twitter.com/Q8VwIK694o— ANI (@ANI) August 21, 2024మంగళవారం నుండి మద్దతుదారులు చంపయీ సోరెన్ భారీగా చేరుకుంటున్నారు. ఆయనతో మంతనాలు జరుపుతున్నారు. ఇదే అంశంపై చంపయీ సోరెన్ మాట్లాడారు. నేను ఇప్పటికే చెప్పా. ఒకటి రాజకీయాల నుంచి తప్పుకోవడం, కొత్త పార్టీని పెట్టడం, లేదంటే మరో పార్టీలో చేరడం. ఇప్పుడు చెబుతున్నా. నేను రాజకీయాల నుంచి తప్పుకోవడం లేదు. నేను నా సొంత పార్టీని ఎందుకు పెట్టకూడదు.నా తదుపరి భవిష్యత్ కార్యచరణ ఏంటనేది వారంలో తేలిపోతుందన్ని అన్నారు. ఆగస్ట్ 18న ఢిల్లీలో మకాంఆగస్ట్ 18న చంపయీ సోరెన్ కొందరు ఎమ్మెల్యేలతో కలిసి ఢిల్లీకి వెళ్లారు. దీంతో ఆయన అమిత్‌షా సమక్షంలో బీజేపీలో చేరనున్నారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి.దీనికి తోడు చంపయీ సోరెన్‌ను ఎన్డీయేలోకి స్వాగతం పలుకుతూ ‘చంపయీ సోరెన్ నువ్వు ఒక పులివి.. నువ్వు ఎప్పుడూ పులిలాగే ఉండాలి.. నీకు ఎన్డీయే కూటమిలోకి స్వాగతం’అంటూ కేంద్ర మంత్రి జీతన్‌రామ్ మాంఝీ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి పదవి పోవడంతోనే భూ కుంభకోణం కేసులో అప్పటి జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌ను ఈడీ ఈ ఏడాది జనవరి 31న అరెస్టు చేసింది. ఈడీ అరెస్ట్‌తో హేమంత్ సోరెన్ సీఎం పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత సోరెన్ కుటుంబానికి సన్నిహితుడిగా ఉన్న చంపాయీ సోరెన్‌ను ముఖ్యమంత్రిగా నియమించారు. వరుస పరిణామాల అనంతరం హేమంత్‌కు ఝార్ఖండ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆయన మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. అయితే తనను సీఎం పదవి నుంచి తప్పించడం వల్ల చంపయీ పార్టీ వీడాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. -
‘చంపయీ నీవు పులివి.. ఎన్డీయేలోకి స్వాగతం’
ఢిల్లీ: జార్ఖండ్ ముక్తి మోర్చా నేత చంపయీ సోరెన్ బీబీజేలో చేరుతున్నారంటూ ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఆదివారం పలువులు ఎమ్మెల్యేలు వెంటబెట్టుకొని ఢిల్లీకి వెళ్లిన చంపాయీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమక్షంలో బీజేపీ చేరిపోతారంటూ ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా చంపయీ సోరెన్‌ను ఎన్డీయేలోకి స్వాగతం పలుకుతూ కేంద్ర మంత్రి జీతన్‌రామ్ మాంఝీ ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఆయన చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. ‘చంపయీ సోరెన్ నువ్వు ఒక పులివి.. నువ్వు ఎప్పుడూ పులిలాగే ఉండాలి.. నీకు ఎన్డీయే కూటమిలోకి స్వాగతం’’ అని అన్నారు.चंपाई दा आप टाईगर थें,टाईगर हैं और टाईगर ही रहेंगें।NDA परिवार में आपका स्वागत है।जोहार टाईगर…@ChampaiSoren— Jitan Ram Manjhi (@jitanrmanjhi) August 18, 2024బీజేపీలో చేరుతున్నారనే ప్రచారం నేపథ్యంలో చంపాయీ ఆదివారం ఢిల్లీకి చేరుకున్నారు. అనంతరం ‘ఎక్స్’లో తన ఆవేదనను షేర్ చేశారు. ‘జూలై మొదటివారంలో ముఖ్యమంత్రిగా నేను పాల్గొనాల్సిన అన్ని ప్రభుత్వ కార్యక్రమాలను నాకు మాటమాత్రమైనా చెప్పకుండా పార్టీ నాయకత్వం రద్దు చేసింది. ఎందుకని ఆరా తీయగా పార్టీ ఎమ్మెల్యేల సమావేశం ఉందని, అప్పటిదాకా ఏ ప్రభుత్వ కార్యక్రమానికి హాజరు కాకూడదని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ఇంతకంటే అవమానం మరొకటి ఉంటుందా?. ఎమ్మెల్యేల సమావేశంలో నన్ను రాజీనామా చేయమన్నారు. నిర్ఘాంతపోయా. అధికారంపై నాకెలాంటి యావ లేదు కాబట్టి వెంటనే రాజీనామా చేశా. కానీ నా ఆత్మగౌరవం దెబ్బతింది’ అని చెప్పుకొచ్చారు. జీవితాన్ని ధారపోసిన పార్టీలో నా ఉనికే ప్రశ్నార్థకమైంది. నా జీవితంలో కొత్త అధ్యాయం మొదలైందని ఆ రోజే ఎమ్మెల్యేల భేటీలో ప్రకటించా. నా ఈ ప్రయాణంలో అన్ని ప్రత్యామ్నాయాలు తెరిచే ఉంటాయని సోరెన్ అన్నారు. ఇది తన వ్యక్తిగత పోరాటమని, ఇతర జేఎంఎం నాయకులను ఇందులోకి లాగదలచుకోలేదని చెప్పారు. ఎంతో చెమటోడ్చి నిర్మించుకున్న పార్టీకి నష్టం కలిగించాలనే ఆలోచన తానెప్పుడూ చేయలేదని, కాని అలాంటి పరిస్థితులు కల్పించారని చంపయీ అన్నారు. -
దారుణంగా అవమానించారు
రాంచీ: ముఖ్యమంత్రిగా ఉన్నపుడు సొంత పార్టీ నేతలే తనను దారుణంగా అవమానించారని, దాంతో ప్రత్యామ్నాయం చూసుకోవాల్సి వచి్చందని జార్ఖండ్ మాజీ సీఎం, జేఎంఎం సీనియర్ నాయకుడు చంపయ్ సోరెన్ అన్నారు. బీజేపీలో చేరుతున్నారనే ప్రచారం నేపథ్యంలో చంపయ్ ఆదివారం ఢిల్లీకి చేరుకున్నారు. అనంతరం ‘ఎక్స్’లో తన ఆవేదనను షేర్ చేశారు. ‘జూలై మొదటివారంలో ముఖ్యమంత్రిగా నేను పాల్గొనాల్సిన అన్ని ప్రభుత్వ కార్యక్రమాలను నాకు మాటమాత్రమైనా చెప్పకుండా పార్టీ నాయకత్వం రద్దు చేసింది. ఎందుకని ఆరా తీయగా పార్టీ ఎమ్మెల్యేల సమావేశం ఉందని, అప్పటిదాకా ఏ ప్రభుత్వ కార్యక్రమానికి హాజరు కాకూడదని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ఇంతకంటే అవమానం మరొకటి ఉంటుందా?. ఎమ్మెల్యేల సమావేశంలో నన్ను రాజీనామా చేయమన్నారు. నిర్ఘాంతపోయా. అధికారంపై నాకెలాంటి యావ లేదు కాబట్టి వెంటనే రాజీనామా చేశా. కానీ నా ఆత్మగౌరవం దెబ్బతింది’ అని చెప్పుకొచ్చారు. జీవితాన్ని ధారపోసిన పార్టీలో నా ఉనికే ప్రశ్నార్థకమైంది. నా జీవితంలో కొత్త అధ్యాయం మొదలైందని ఆ రోజే ఎమ్మెల్యేల భేటీలో ప్రకటించా. నా ఈ ప్రయాణంలో అన్ని ప్రత్యామ్నాయాలు తెరిచే ఉంటాయని సోరెన్ అన్నారు. ఇది తన వ్యక్తిగత పోరాటమని, ఇతర జేఎంఎం నాయకులను ఇందులోకి లాగదలచుకోలేదని చెప్పారు. ఎంతో చెమటోడ్చి నిర్మించుకున్న పార్టీకి నష్టం కలిగించాలనే ఆలోచన తానెప్పుడూ చేయలేదని, కాని అలాంటి పరిస్థితులు కలి్పంచారని చంపయ్ అన్నారు. ఎమ్మెల్యేలకు ఎరవేస్తున్నారు: హేమంత్బీజేపీ తమ పార్టీ ఎమ్మెల్యేలకు ఎర వేస్తోందని జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఆరోపించారు. బీజేపీ గుజరాత్, అస్సాం, మహారాష్ట్ర నుంచి నాయకులను జార్ఖండ్‌కు తెచ్చి గిరిజనులు, దళితులు, వెనుకబడిన వర్గాలు, మైనారిటీల్లో విషం నింపుతోందని, ఒకరిపైకి మరొకరిని ఉసిగోల్పుతోందని అన్నారు. ‘సమాజాన్ని విభజించడం మాట అటుంచితే.. వీళ్లు కుటుంబాలకు, పారీ్టలను కూడా చీల్చుతారు. ఎమ్మెల్యేలకు ఎర వేస్తారు. డబ్బు నాయకులను పార్టీలు మారేలా చేస్తుంది’ అని హేమంత్ పరోక్షంగా చంపయ్‌ను విమర్శించారు. -
బీజేపీ లో చేరిక పై స్పందించిన జార్ఖండ్ మాజీ సీఎం
-
జార్ఖండ్‌లో బిగ్ ట్విస్ట్.. బీజేపీలోకి చంపై సోరెన్?
రాంచీ: మరికొన్ని రోజుల్లో జార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర రాజకీయాల్లో భారీ ట్విస్ట్ చోటు చేసుకుంది. రాజకీయ సంక్షోభం దిశగా జార్ఖండ్‌లో పరిణామాలు వేగంగా కొనసాగుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి, ఝార్ఖండ్ ముక్తిమోర్చా (జేఎంఎం) నేత చంపై సోరెన్ బీజేపీలో చేరనున్నట్లు సమాచారం. ఆయన కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఆరుగురు ఎమ్మెల్యేలతో చంపై ఢిల్లీ చేరుకున్నట్లు జాతీయ మీడియా వార్తలు వెల్లడిస్తోంది. ఆయనతో పాటు పలువురు ఎమ్మెల్యేలు కూడా బీజేపీలో చేరనున్నట్లు విశ్వసనీయ వర్గాలు ద్వారా తెలుస్తోంది. మరోవైపు.. ఢిల్లీకి చేరుకున్న చంపై సోరెన్‌ను బీజేపీ నేత సువేందు అధికారిని కలిశారా? అని మీడియా ప్రశ్నించగా.. ‘నేను ఎవరినీ కలవలేదు. వ్యక్తిగత పని కోసం ఇక్కడకు వచ్చాను’ అని అన్నారు.#WATCH | Delhi: When asked if he met West Bengal LoP Suvendu Adhikari in Kolkata, former Jharkhand CM and JMM leader Champai Soren says, "I have not met anyone. I have come here for personal work..." pic.twitter.com/c2mg33FvLi— ANI (@ANI) August 18, 2024 ప్రస్తుతం సీఎం హేమంత్ సోరెన్ కేబినెట్లో చంపై మంత్రిగా ఉన్నారు. ప్రస్తుతం జార్ఖండ్‌లో ఇండియా కూటమి ప్రభుత్వం ఉన్న విషయం తెలిసిందే. భూ కుంభకోణం కేసులో సీఎం హేమంత్ సోరెన్‌ను ఈడీ జనవరి 31న అరెస్టు చేయగా.. అనంతరం చంపై సోరెన్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. భూ కుంభకోణం కేసులో హేమంత్ సోరెన్‌కు జార్ఖండ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో చంపై సోరెన్ జూలై 3న ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలిగారు. ఇక.. హేమంత్ సోరెన్ మరోసారి జార్ఖండ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి చంపై సోరెన్ సంతోషంగా లేరని పార్టీ నేతల్లో చర్చ జరుగుతోంది. జార్ఖండ్ మొత్తం 81 స్థానాలకు గాను అధికార జేఎంఎంకు 45 సీట్లు, ప్రతికక్షాలకు 30 సీట్లు ఉన్నాయి. -
చంపై సోరెన్ రాజీనామా..జార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్
రాంచీ : జార్ఖండ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్ర సీఎంగా హేమంత్ సోరెన్ బాధ్యతలు స్వీకరించేందుకు సర్వం సిద్ధమైంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ నియామకానికి జార్ఖండ్ ముక్తా మోర్చా(జేఎంఎం), కాంగ్రెస్, ఆర్జేడీలు సోరెన్ ఏకగ్రీవంగా మద్దతు పలికాయి. దీంతో రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని హేమంత్ సోరెన్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌ను కోరారు.రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలతో ప్రస్తుత జార్ఖండ్ సీఎం చంపై సోరెన్ తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను గవర్నర్‌కు అందించారు.Champai Soren resigns as Jharkhand CM, Hemant Soren stakes claim to form govtRead @ANI Story | https://t.co/Mc2d74htr5#ChampaiSoren #JharkhandCM #HemantSoren pic.twitter.com/T6fkdW4I2Q— ANI Digital (@ani_digital) July 3, 2024 ఈడీ ఆరోపణలపై కోర్టు తీర్పుమనీల్యాండరింగ్ కేసుకు సంబంధించి ఈ ఏడాది జనవరిలో హేమంత్ సోరెన్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. అయితే తాజాగా జార్ఖండ్ హైకోర్టు సోరెన్‌కు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ పిటిషన్‌పై విచారణ ఈడీ ఆరోపించిన విధంగా నేరానికి పాల్పడలేదు’అని తీర్పు వెలువరించింది. దీంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. అవమానం జరిగిందని మనీ ల్యాండరింగ్ కేసులో అరెస్ట్ అయ్యే సమయంలో సీఎంగా ఉన్న హేమంత్ సోరెన్ తన పదవికి రాజీనామా చేశారు. చంపై సోరెన్ ఆ పదవి బాధ్యతల్ని స్వీకరించారు. తాజాగా, హేమంత్ సోరెన్‌కు బెయిల్ రావడం.. చంపై సోరెన్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడం అంతా చకచకా జరిగిపోయాయి. ఈ అనూహ్య నాటకీయ పరిణామాలతో సీఎం పదవికి రాజీనామా చేయించడం చంపై సోరెన్ తనకు అవమానం జరిగిందని తన సహచరుల వద్ద గోడు వెళ్లబోసుకున్నట్లు తెలుస్తోంది. -
ఓటర్లకు జార్ఖండ్ సీఎం విజ్ఞప్తి
రాంచి (జార్ఖండ్): లోక్‌సభ ఎన్నికల నాలుగో దశ పోలింగ్ వివిధ రాష్ట్రాల్లో చరుగ్గా సాగుతోంది. జార్ఖండ్ ముఖ్యమంత్రి చంపయి సోరెన్ సరైకేలా ఖర్సవాన్ జిల్లా జిలింగోరాలోని పోలింగ్ బూత్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.జిలింగ్‌గోరాలోని ఉత్క్రమిత్ మధ్య విద్యాలయలో 220 నంబర్ పోలింగ్ బూత్‌లో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేసిన సీఎం చంపయి సోరెన్.. ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నానని ఏఎన్ఐతో అన్నారు.తొమ్మిది రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని 96 నియోజకవర్గాల్లో లోక్‌సభ ఎన్నికల నాలుగో దశకు పోలింగ్ జరుగుతుండగా, ఉదయం 9 గంటల వరకు మొత్తం 10.35 ఓటింగ్ శాతం నమోదైంది. -
Jharkhand: మంత్రి పదవుల ముసలం.. హస్తినలో ఎమ్మెల్యేలు బిజీ!
న్యూఢిల్లీ: జార్ఖండ్ ప్రభుత్వంలో మంత్రి పదవుల ముసలం పుట్టింది. చంపయ్ సోరేన్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వంతో తమకు మంత్రి పదవులు దక్కలేదని ఎనిమిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యే అసంతృప్తితో ఉన్నారు. అక్కడితో ఆగకూండా ఆ ఎనిమిది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ అధిష్టానాన్ని కలడానికి శనివారం ఢిల్లీకి చేరుకున్నారు. తాజాగా చంపయ్ సోరేన్ నేతృత్వంలో ఏర్పడిన ప్రభుత్వంలో కాంగ్రెస్‌కు చెందిన ఆలంగీర్ ఆలం, రామేశ్వర్ ఓరాన్, బన్నా గుప్తా, బాదల్ పత్రలేఖ్లకు మళ్లీ మంత్రి పదవులు ఇవ్వాలన్న కాంగ్రెస్ పార్టీ నిర్ణయంపై ఎమ్మెల్యేలు తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ‘మేము కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలను కలవడానికి ఢిల్లీ వచ్చాం. ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ. వేణుగోపాల్, పార్టీ చీఫ్ మల్లికార్జున ఖార్గేతో మా సమస్యలు చెబుతాం’ అని ఎమ్మెల్యే రాజేష్ కచాప్ తెలిపారు. ఢిల్లీ బయలుదేరే ముందు మరో ఎమ్మెల్యే కుమార్ జైమంగల్ అలియాస్ అనూప్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ.. కేబినెట్లోకి తీసుకున్న నలుగురు మంత్రుల స్థానంలో కొత్తవారికి అవకాశం ఇవ్వాలన్నారు. అంత కంటే ముందు.. మంత్రి పదవులపై అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యేలు జేఎంఎం పార్టీకి చెందిన కొత్త మంత్రి బసంత్ సొరెన్‌ను కలిసి తమ అసంతృప్తి తెలియజేశారు. అయితే సమావేశం అనంతరం ఆయన మీడియాతో మట్లాడుతూ... ‘రెండు పార్టీల మధ్య ఎటువంటి అనిశ్చితి లేదు. తామంతా ఐకమత్యంగా ఉన్నాం’ అని చెప్పారు. మరోవైపు.. అసంతృప్త ఎమ్మెల్యేల కంటే ముందే సీఎం చంపయ్ సొరెన్, రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ రాజేశ్ ఠాకూర్ ఢిల్లీలో చేరుకున్నారు. వీరు కూడా కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేను కలవనున్నారు. కేబినెట్లో నలుగురు మంత్రుల స్థానంలో కొత్తవారికి అవకాశం ఇవ్వకపోతే.. ఫిబ్రవరి 23న జరిగే అసెంబ్లీ సమావేశాలకు అసంతృప్త ఎమ్మెల్యేలు హాజరుకాకుండా జైపూర్పు వెళ్లనున్నట్లు వార్తలు వస్తున్నాయి. సీఎం చంపయ్ సొరెన్ జనవరి 16 కొత్త కెబినెట్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 2న హేమంత్ సొరెన్‌ను భూకుంభకోణం కేసులో ఈడీ అరెస్ట్ చేసిన నేపథ్యంలో చంపయ్ సొరెన్ జార్ఖండ్‌కు కొత్త సీఎం బాధ్యతలు చేపట్టారు. జేఎంఎం-29, కాంగ్రెస్-17, ఆర్జేడీ-1 స్థానంతో జార్ఖండ్‌లో జేఎంఎం సంకీర్ణం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. -
విశ్వాస పరీక్ష నెగ్గిన చంపయ్ సర్కారు
రాంచీ: జార్ఖండ్ రాజకీయ సంక్షోభానికి తెరపడింది. చంపయ్ సొరెన్ సర్కారు విశ్వాస పరీక్షలో నెగ్గింది. చంపయ్ ప్రభుత్వానికి అనుకూలంగా 47 ఓట్లు పడ్డాయి. వ్యతిరేకంగా 29 ఓట్లు వచ్చాయి. హేమంత్ సొరెన్ అరెస్టు అనంతరం జార్ఖండ్‌లో నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన చంపయ్ సొరెన్ ప్రభుత్వానికి నేడు అసెంబ్లీలో విశ్వాస పరీక్ష జరిగింది. CM Champai Soren led Jharkhand government wins floor test after 47 MLAs support him 29 MLAs in opposition. #JharkhandPolitics pic.twitter.com/30BBXMjaak — ANI (@ANI) February 5, 2024 జార్ఖండ్‌లో 81 అసెంబ్లీ స్థానాలకు ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రస్తుతం అసెంబ్లీలో జార్ఖండ్ ముక్తి మోర్చా(28), కాంగ్రెస్(16), ఆర్జేడీ(1) కూటమికి 45 సీట్లు ఉన్నాయి. సీపీఐ(ఎంఎల్) ఏకైక ఎమ్మెల్యే ఆ కూటమికి బయటి నుంచి మద్దతిస్తుండగా.. బీజేపీతో కూడిన విపక్ష కూటమికి 29 మంది ఎమ్మెల్యేలున్నారు. బలపరీక్షలో గెలవాలంటే జేఎంఎం కూటమికి 41 ఓట్లు వస్తే సరిపోతుంది. అయితే, ప్రస్తుతం కూటమి బలపరీక్షలో విజయం సాధించింది. ఇదీ చదవండి: రసవత్తరంగా జార్ఖండ్ రాజకీయం.. సోరెన్ సర్కార్‌కు బలపరీక్ష -
నా అరెస్టులో రాజ్‌భవన్ ప్రమేయం ఉంది: హేమంత్ సొరెన్
రాంచీ: జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సొరెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈడీ తనను అరెస్టు చేయడంలో గవర్నర్ ప్రమేయం కూడా ఉందని ఆరోపించారు. చంపయ్ సొరెన్ నేతృత్వంలోని ప్రభుత్వ బలపరీక్షలో పాల్గొనడానికి హేమంత్ సొరెన్‌కు కోర్టు అనుమతించింది. ఈ క్రమంలో ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ.. తన అరెస్టును భారత ప్రజాస్వామ్యంలో నల్ల అధ్యాయం అని అన్నారు. భూ కుంభకోణంతో తనకు సంబంధం ఉందని నిరూపించాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్‌కు హేమంత్ సొరెన్ సవాలు విసిరారు. చట్టాన్ని దుర్వినియోగం చేయడం ఎలాగో వారి నుండి నేర్చుకోవాలని కేంద్రాన్ని ఉద్దేశిస్తూ మాట్లాడారు. నేరం రుజువైతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని అన్నారు. తన అరెస్టుకు 2022 నుంచి కుట్ర చేస్తున్నారని చెప్పారు. "మేము ఇంకా ఓటమిని అంగీకరించలేదు. నన్ను కటకటాల వెనక్కి నెట్టి విజయం సాధించగలమని భావిస్తే, జార్ఖండ్‌లో ప్రతి మూలలో గిరిజనులు, దళితులు తమ ప్రాణాలను అర్పించడానికి సిద్ధంగా ఉన్నారు." అని హేమంత్ సోరెన్ అన్నారు. 'కేంద్రం 2019 తర్వాత స్కామ్‌లను మాత్రమే చూస్తోంది. 2000లలో జరిగిన స్కామ్‌లను చూడలేరు. గిరిజనులు రాష్ట్రాలకు చీఫ్లుగా, IAS లేదా IPS కావాలని కేంద్రం కోరుకోవడం లేదు. గిరిజన నాయకుల ప్రభుత్వాల కాలవ్యవధిని శాంతియుతంగా పూర్తి చేయనివ్వరు. నాకు అలాంటి పరిస్థితే ఎదురవుతోంది' అని హేమంత్ సొరెన్ అన్నారు. భూ కుంభకోణం కేసులో జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సొరెన్‌ను ఈడీ అరెస్టు చేసింది. దీంతో జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ సంకీర్ణ కూటమి తరుపున హేమంత్ సొరెన్ సన్నిహితుడు చంపయ్ సొరెన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ఉందని నేడు అసెంబ్లీలో బలప్రదర్శన జరుగుతోంది. ఇదీ చదవండి:రసవత్తరంగా జార్ఖండ్ రాజకీయం.. సోరెన్ సర్కార్‌కు బలపరీక్ష -
జార్ఖండ్ అసెంబ్లీలో నేడు బలపరీక్ష..ఏ పార్టీ బలం ఎంత..?
-
హేమంత్ సొరెన్‌పై సొంత ఎమ్మెల్యే విమర్శలు
రాంచీ: జార్ఖండ్‌లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. రాష్ట్ర అసెంబ్లీలో నూతనంగా సీఎం పదవి చేపట్టిన చంపయ్ సొరెన్ రేపు బలప్రదర్శన నిరూపించుకోవాల్సి ఉంది. ఈ కీలక సమయాల్లో జేఎంఎంకు చెందిన ఓ ఎమ్మెల్యే మాజీ సీఎం హేమంత్ సొరెన్‌పై విమర్శలు చేయడం, ప్రస్తుతం సీఎం చంపయ్ సొరెన్ మద్దతుకు మరో ఎమ్మెల్యే దూరంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు రేపు జరగబోయే ఫ్లోర్ టెస్టుకు దూరంగా ఉండనున్నారని సమాచారం. ఈ పరిణామాలు జార్ఖండ్‌లో నాయకత్వ మార్పుల ముప్పు తొలగిపోలేదని గుర్తుచేస్తున్నాయి. సాహిబ్‌గంజ్ జిల్లాలోని బోరియో స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న లోబిన్ హెంబ్రోమ్ ఒక రాజకీయేతర సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. 2019 రాష్ట్ర ఎన్నికలకు ముందు జేఎంఎం మేనిఫెస్టోలో చోటా నాగ్‌పూర్ అద్దె చట్టం, సంతాల్ పరగణాల అద్దె చట్టం అమలు చేస్తామని హామీ ఇచ్చింది. కానీ నెరవేర్చలేదు. 1996 కేంద్ర పంచాయతీ (షెడ్యూల్డ్ ప్రాంతాలకు పొడిగింపు) చట్టాన్ని కూడా రాష్ట్రంలో అమలు చేయలేదు. చోటానాగ్పూర్ అద్దె చట్టం, సంతాల్ పరగణాల చట్టాలు గిరిజనుల భూమి హక్కులను పరిరక్షించే లక్ష్యంతో ఉండగా.. కేంద్ర గ్రామ పంచాయతీ చట్టం గిరిజనులను దోపిడీ నుండి రక్షించడానికి గ్రామసభకు అధికారం ఇస్తుంది. ఈ చట్టాలు అమలైతే గిరిజనుల భూములకు రక్షణ ఉంటుంది. చెప్పినా పట్టించుకోలేదు.. గిరిజన సంక్షేమం విషయంలో జేఎంఎం నుండి అన్ని సంబంధాలను తెంచుకుంటానని లోబిన్ హెంబ్రోమ్ హెచ్చరించారు. శిబు సోరెన్ ఆధ్వర్యంలో ఎంతో పోరాటం చేస్తే జార్ఖండ్ ఏర్పడింది, కానీ నేటికీ క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కారం కాలేదని విమర్శించారు. ఈ సమస్యలను అసెంబ్లీలో లేవనెత్తుతానని చెప్పారు. విమానాశ్రయం, ఆనకట్టలు, పరిశ్రమల పేరుతో గిరిజనుల భూములను రాష్ట్ర ప్రభుత్వం లాక్కుందని హెంబ్రోమ్ ఆరోపించారు. జార్ఖండ్‌లో గిరిజనేతరుల పాలన కొనసాగుతోందని విమర్శించారు. ప్రతీ విషయంలో బిహారీలు కల్పించుకుంటారు.. హేమంత్ సొరెన్‌కు తాను చెప్పినా పట్టించుకోలేదని అన్నారు. బిషున్‌పూర్ నియోజకవర్గానికి చెందిన మరో ఎమ్మెల్యే చమ్ర లిండా కూడా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. మెజారిటీ పరీక్షకు ముందు జరిగిన పార్టీ సమావేశాలకు లిండా గైర్హాజరయ్యారు. జేఎంఎం ప్రధాన కార్యదర్శి సుప్రియో భట్టాచార్య ఈ అంశాలపై స్పందించారు. హెంబ్రోమ్‌తో మాట్లాడామని తెలిపారు. రేపు జరగబోయే ఫ్లోర్ టెస్ట్ కి ఆయన కూడా వస్తారని చెప్పారు. చమ్ర లిండా అనారోగ్యంతో ఉన్నారని వివరించారు. ఇదీ చదవండి: బీజేపీపై కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు -
బలపరీక్షలో సోరెన్ పాల్గొనవచ్చు
రాంచీ: జార్ఖండ్‌లో కొత్తగా ఏర్పాటైన చంపయ్ సోరెన్ ప్రభుత్వం బలపరీక్షకు సిద్ధమైన వేళ ప్రభుత్వ సానుకూల ఉత్తర్వును రాంచీ కోర్టు వెలువరిచింది. ఫిబ్రవరి ఐదో తేదీన అసెంబ్లీలో చంపయ్ సర్కార్ చేపట్టే బలపరీక్షలో పాల్గొనేందుకు ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి హేమంత్‌సోరెన్‌కు అనుమతినిస్తూ రాంచీలోని ప్రత్యేక కోర్టు ఉత్తర్వులిచ్చింది. జార్ఖండ్ భూకుంభకోణం ఉదంతంలో మనీ లాండరింగ్‌కు పాల్పడ్డారని ఆరోపిస్తూ హేమంత్‌ను ఈడీ అరెస్ట్‌చేసిన సంగతి తెల్సిందే. ప్రస్తుతం ఆయన ఈడీ కస్టడీలోనే ఉన్నారు. -
జార్ఖండ్ ప్రభుత్వ బలపరీక్షకు డేట్ ఫిక్స్.. ఎవరి బలమెంత?
జార్ఖండ్‌లో కొత్తగా కొలువుదీరిన సీఎం చంపయ్ సోరెన్ నేతృత్వంలోని ప్రభుత్వం బలపరీక్షకు తేదీ ఖరారైంది. సోమవారం జార్ఖండ్ అసెంబ్లీలో బలం నిరూపించుకోవాలని స్పీకర్ ప్రభుత్వాన్ని ఆదేశించారు. జార్ఖండ్ ముక్తి మోర్చా కూటమి ప్రభుత్వానికి చెందిన 40 మంది ఎమ్మెల్యేలు ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ రిసార్ట్‌లో బస చేస్తున్నారు. తమ సంఖ్యా బలాన్ని కాపాడుకునేందుకు, ఇతర పార్టీల వలలో చిక్కుకోకుండా జాగ్రత్తపడుతున్నారు. సోమవారం ఫ్లోర్ టెస్ట్ జరిగే వరకు కూటమి ఎమ్మెల్యేలంతా హైదరాబాద్‌లో ఉండనున్నట్లు జార్ఖండ్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ గులాం అహ్మద్ మీర్ తెలిపారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు తమ ప్రభుత్వాన్ని బలహీనపరిచేందుకు కేంద్రంలోని బీజేపీ ఉద్దేశ్యపూర్వకంగా లక్ష్యంగా పెట్టుకుందని ఆరోపించారు. ఇక భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో జార్ఖండ్ సీఎం హేమంత్ సొరెన్‌ను ఈడీ విచారించడం, అరెస్ట్ చేయడంతో రాష్ట్ర రాజకీయాల్లో అనిశ్చితి నెలకొన్న విషయం తెలిసిందే. ఈడీ అరెస్టుకు ముందే సోరెన్ రాజీనామా చేసి స్పీకర్‌కు సమర్పించారు. పార్టీ శాసనసభాపక్ష నేతగా చంపయ్ సోరెన్‌ను ఎన్నుకున్న తరువాత శుక్రవారం జార్ఖండ్ నూతన సీఎంగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. కాంగ్రెస్, జేఎంఎం, ఆర్జేడీ ఎమ్మెల్యేలు ఆయనకు మద్దతు తెలిపారు. తమ ప్రభుత్వాన్ని నిలబెట్టుకునేందుకు ఆయన తన ఎమ్మెల్యేలతో కలిసి సోమవారం అసెంబ్లీ బల పరీక్షను ఎదుర్కోనున్నారు. కాగా జార్ఖండ్ అసెంబ్లీలో మొత్తం 81 స్థానాలు ఉన్నాయి. మెజార్జీని నిరూపించుకోవాలంటే 41 మంది ఎమ్మెల్యే మద్దతు కూడగట్టుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం జేఎంఎం(28)-కాంగ్రెస్(16)- ఆర్జేడీ(1), సీపీఎంఎల్(1) కూటమికి 46 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బీజేపీ, ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్, అజిత్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీతో కూడిన ప్రతిపక్ష ఎన్డీయే కూటమికి 29 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ క్రమంలో జార్ఖండ్ రాజకీయాలు ఏ మలుపు తిరుగనున్నాయో.. ఎవరూ అధికారం చేపట్టనున్నారో మరో రెండు రోజుల్లో తేలిపోనుంది. చదవండి: కేజ్రీవాల్ జైలుకెళ్తే.. ‘ఆప్’ ఏం చేయనుంది? -
Jharkhand politics 2024: సీఎంగా చంపయ్ ప్రమాణం
రాంచీ: జార్ఖండ్ నూతన ముఖ్యమంత్రిగా జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) శాసనసభాపక్ష నేత చంపయ్ సోరెన్ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లోని దర్బార్ హాల్లో గవర్నర్ సి.పి.రాధాకృష్ణన్ ఆయనతో సీఎంగా ప్రమాణం చేయించారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అలంగీర్ అలాం, రాష్రీ్టయ జనతాదళ్(ఆర్జేడీ) నేత సత్యానంద్ భోక్తా రాష్ట్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. 67 ఏళ్ల గిరిజన నాయకుడు చంపయ్ సోరెన్ జార్ఖండ్‌కు 12వ ముఖ్యమంత్రిగా రికార్డుకెక్కారు. మనీ లాండరింగ్ కేసులో ఈడీ విచారణను ఎదుర్కొంటున్న జేఎంఎం అగ్రనేత హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంతో పార్టీ శాసనసభాపక్ష నేతగా చంపయ్ సోరెన్‌ను ఎన్నుకున్న సంగతి తెలిసిందే. సీఎంగా ప్రమాణం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. హేమంత్ సోరెన్ ప్రారంభించిన సంక్షేమ పథకాలను ముందుకు తీసుకెళ్లడమే తమ లక్ష్యమని చెప్పారు. హైదరాబాద్ చేరుకున్న జేఎంఎం కూటమి ఎమ్మెల్యేలు జార్ఖండ్ సీఎంగా చంపయ్ సోరెన్ ప్రమాణ స్వీకారం ముగిసిన వెంటనే జేఎంఎం కూటమి ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పాలిత తెలంగాణ రాజధాని హైదరాబాద్‌కు తరలించారు. తమ ఎమ్మెల్యేలపై విపక్ష బీజేపీ వల విసిరే అవకాశం ఉండడంతో ముందుజాగ్రత్తగా వారిని బయటకు తరలించినట్లు కూటమి నేతలు చెప్పారు. ప్రమాణ స్వీకారం అనంతరం గవర్నర్ రాధాకృష్ణన్‌తో చంపయ్ సోరెన్ -
హేమంత్ సొరెన్‌కు ఐదు రోజుల కస్టడీ
రాంచీ: మనీలాండరింగ్ కేసులో అరెస్టైన జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సొరెన్‌కు ఐదు రోజుల కస్టడీ విధించారు. హేమంత్ సోరెన్‌ను బుధవారం ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. గురువారం రాంచీలోని ప్రత్యేక మనీ లాండరింగ్ నిరోధక చట్టం కోర్టులో ప్రవేశపెట్టారు. తదుపరి విచారణ నిమిత్తం సోరెన్‌ను 10 రోజులపాటు ఆయనను తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ ఈడీ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయస్థానం తమ తీర్పును శుక్రవారానికి రిజర్వ్ చేసింది. కాగా.. సుప్రీంకోర్టులో హేమంత్ సోరెన్‌కు ఎదురుదెబ్బ తగిలింది. మనీలాండరింగ్ కేసులో ఈడీ అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం తిరస్కరించింది. ఈ కేసులో ప్రస్తుతం తాము జోక్యం చేసుకోలేమని.. ముందుగా హైకోర్టుకు వెళ్లాలని తెలిపింది. హేమంత్ సోరెన్ మొదట జార్ఖండ్ హైకోర్టును ఆశ్రయించారు. గురువారం ఉదయం దానిపై ధర్మాసనం విచారించాల్సి ఉంది. అయితే సోరెన్ తరపు సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, అభిషేక్ మను సింఘ్వీ, హైకోర్టు నుంచి పిటిషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు. అనంతరం ఈ ఇద్దరు న్యాయవాదులు గురువారం సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం ముందు హాజరై తమ పిటిషన్‌పై అత్యవసర జాబితా కింద విచారించాలని పేర్కొన్నారు. ఇదీ చదవండి: జార్ఖండ్ సీఎంగా చంపయ్ సొరెన్ ప్రమాణ స్వీకారం -
జార్ఖండ్ సీఎంగా చంపయ్ సొరెన్ ప్రమాణం
రాంచీ: జార్ఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంపయ్ సొరెన్ ప్రమాణ స్వీకారం చేశారు. కాంగ్రెస్, జేఎంఎం, ఆర్జేడీ ఎమ్మెల్యేలు ఆయనకు మద్దతు తెలిపారు. 10 రోజుల్లో బలనిరూపణ చేసుకోవాలని గవర్నర్ ఆదేశించారు. బలనిరూపణ వరకు ఉండేందుకు జేఎంఎం సంకీర్ణ ఎమ్మెల్యేలు హైదరాబాద్ చేరుకోనున్నారు. బేగంపేట ఎయిర్‌పోర్టుకు ప్రత్యేక విమానంలో జార్ఖండ్ ఎమ్మెల్యేలు మరికాసేపట్లో రానున్నారు. మాజీ సీఎం హేమంత్ సొరెన్‌ను ఈడీ అధికారుల అరెస్టు చేసిన విషయం తెలిసిందే. చంపయ్ సోరెన్ 1956 నవంబర్‌లో జిలింగోరా గ్రామంలో రైతు కుటుంబంలో జన్మించారు. మెట్రిక్యులేషన్ చదివారు. తొలిసారిగా 1991లో సెరికేలా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పటినుంచి వరుసగా విజయం సాధిస్తూనే ఉన్నారు. జేఎంఎం అధినేత శిబూ సోరెన్‌కు విధేయుడిగా పేరుగాంచారు. జార్ఖండ్ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. అయితే, శిబూ సోరెన్ కుటుంబంతో చంపయ్ సోరెన్‌కు ఎలాంటి బంధుత్వం లేదు. హేమంత్ సొరెన్ కుటుంబంతో సన్నిహితంగా ఉంటారు. చంపయ్‌ను ప్రజలు జార్ఖండ్ టైగర్ అని పిలుస్తుంటారు. ఇప్పటివరకు రాష్ట్రంలో రవాణా మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. #WATCH | JMM vice president Champai Soren takes oath as the Chief Minister of Jharkhand, at the Raj Bhavan in Ranchi. This comes two days after Hemant Soren's resignation as the CM and his arrest by the ED. pic.twitter.com/WEECELBegr — ANI (@ANI) February 2, 2024 రాష్ట్ర మాజీ హేమంత్ సోరెన్‌ను బుధవారం ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. గురువారం రాంచీలోని ‘ప్రత్యేక మనీ లాండరింగ్ నిరోధక చట్టం కోర్టు’లో ప్రవేశపెట్టారు. తదుపరి విచారణ నిమిత్తం సోరెన్‌ను 10 రోజులపాటు ఆయనను తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయస్థానం తమ తీర్పును శుక్రవారానికి రిజర్వ్ చేసింది. అలాగే సోరెన్‌ను ఒకరోజుపాటు జ్యుడీషియల్ కస్టడీకి తరలిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టును హేమంత్ సొరెన్ ఆశ్రయించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. హైకోర్టులోనే తేల్చుకోవాలని సుప్రీం స్పష్టం చేసింది. ఇదీ చదవండి: సుప్రీంకోర్టులో హేమంత్ సోరెన్‌కు ఎదురుదెబ్బ -
జార్ఖండ్ లో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై వీడిన సందిగ్ధత
-
జార్ఖండ్‌లో ఉత్కంఠకు తెర
రాంచీ: జార్ఖండ్‌లో ఉత్కంఠకు తెరపడింది. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ రాజీనామా చేసి 24 గంటలు గడిచిపోయిన తర్వాత కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు అడుగులు పడ్డాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని జేఎంఎం శాసనసభాపక్ష నేత చంపయ్ సోరెన్‌ను జార్ఖండ్ గవర్నర్ సి.పి.రాధాకృష్ణన్ గురువారం రాత్రి ఆహ్వానించారు. ప్రమాణ స్వీకారం అనంతరం అసెంబ్లీలో 10 రోజుల్లోగా బలనిరూపణ చేసుకోవాలని ఆదేశించారు. జార్ఖండ్ కొత్త ముఖ్యమంత్రిగా చంపయ్ సోరెన్ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై తొలుత సందిగ్ధత నెలకొంది. గవర్నర్ నుంచి పిలుపు రాకపోవడంతో జేఎంఎం–కాంగ్రెస్–ఆర్జేడీ కూటమి నేతలు ఆందోళనకు గురయ్యారు. ప్రభుత్వ ఏర్పాటుకు తాము సిద్ధంగా ఉన్నట్లు చంపయ్ సోరెన్ మరోసారి స్పష్టం చేశారు. ఆయన గురువారం సాయంత్రం రాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్‌ను కలిశారు. తమకు మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు ఉందని, ప్రభుత్వ ఏర్పాటుకు ఆహా్వనించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన వెంట జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ, సీపీఐ(ఎంఎల్) ఎమ్మెల్యేలు ఉన్నారు. గవర్నర్‌తో భేటీ అనంతరం చంపయ్ సోరెన్ మీడియాతో మాట్లాడారు. కొత్త ప్రభుత్వాన్ని కొలువుదీర్చే విషయంలో త్వరలో నిర్ణయం తీసుకుంటామని గవర్నర్ చెప్పారని వెల్లడించారు. గవర్నర్‌ను చంపయ్ సోరెన్ కలవడానికి కంటే ముందు జేఎంఎం–కాంగ్రెస్–ఆర్జేడీ కూటమి ఓ వీడియోను విడుదల చేసింది. చంపయ్‌కి మద్దతిస్తున్న 43 మంది ఎమ్మెల్యేలు ఈ వీడియోలో కనిపించారు. మరోవైపు, బీజేపీ బారి నుంచి తమ ఎమ్మెల్యేలను కాపాడుకోవడంపై దృష్టి పెట్టారు. 43 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పాలిత తెలంగాణ రాజధాని హైదరబాద్‌కు గురువారం రెండు ప్రత్యేక విమానాల్లో తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. వారిని గచ్చిబౌలీలోని ఎల్లా హోటల్‌కు చేర్చాలని నిర్ణయించారు. అయితే, ప్రతికూల వాతావరణం కారణంగా చివరి నిమిషంలో రాంచీ నుంచి ప్రత్యేక విమానాల టేకాఫ్‌కు ఎయిర్‌పోర్టు అధికారుల నుంచి అనుమతి లభించలేదు. రెండు గంటలపాటు విమానాల్లోనే కూర్చుండిపోయిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు చేసేది లేక సర్క్యూట్ హౌజ్‌కు తిరిగివచ్చారు. వీరిలో హేమంత్ సోరెన్ సోదరుడు, ఎమ్మెల్యే బసంత్ సోరెన్ కూడా ఉన్నారు. నూతన ప్రభుత్వ ఏర్పాటులకు ఎట్టకేలకు గవర్నర్ నుంచి ఆహా్వనం రావడంతో ఊహాగానాలకు తెరపడింది. రాంచీ జైలుకు హేమంత్ సోరెన్ మనీ లాండరింగ్ కేసులో అరెస్టయిన జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) నేత, మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ను అధికారులు రాంచీలోని హొత్వార్ జైలుకు తరలించారు. ఈడీ అధికారులు ఆయనను బుధవారం 7 గంటల సుదీర్ఘ విచారణ తర్వాత అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. గురువారం రాంచీలోని ‘ప్రత్యేక మనీ లాండరింగ్ నిరోధక చట్టం కోర్టు’లో సోరెన్‌ను ప్రవేశపెట్టారు. తదుపరి విచారణ నిమిత్తం 10 రోజులపాటు ఆయనను తమ కస్టడీకి అప్పగించాలని కోరారు. ఈ మేరకు పిటిషన్ దాఖలు చేశారు. రాంచీలో 8.5 ఎకరాల భూములు అక్రమంగా సోరెన్ ఆ«దీనంలో ఉన్నాయని, అందుకే మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద దర్యాప్తు ప్రారంభించామని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై న్యాయస్థానం తమ తీర్పును శుక్రవారానికి రిజర్వ్ చేసింది. సోరెన్‌ను ఒకరోజుపాటు జ్యుడీíÙయల్ కస్టడీకి తరలిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దాంతో అధికారులు ఆయనను జైలుకు తరలించారు. గురువారం రాత్రంతా సోరెన్ జైలులో గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. సుప్రీంకోర్టులో సోరెన్ పిటిషన్ తన అరెస్టు అక్రమమంటూ సోరెన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం çశుక్రవారం విచారణ చేపట్టనుంది. -
Jharkhand: ‘గవర్నర్‌గారూ.. మా మెజార్టీ ఇది!’
రాంచీ: హేమంత్ సొరెన్ అరెస్ట్ వెంటనే జార్ఖండ్‌లో నూతన ప్రభుత్వ ఏర్పాటు దిశగా ప్రయత్నాలు ఊపందుకున్నాయి. ఆలస్యం చేయకుండా జేఎంఎం సీనియర్ నేత చంపయ్ రాయ్‌ను లెజిస్టేటివ్ లీడర్‌గా ప్రకటించారు. కానీ, గవర్నర్ మాత్రం ప్రభుత్వ ఏర్పాటునకు వెంటనే ఆహ్వానించలేదు. దీంతో తీవ్ర సస్పెన్స్ తర్వాత.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌ను చంపయ్ సొరెన్ కలిశారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తమకు మెజారిటీ ఉందని గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌కు తెలిపారు. అంతేకాదు.. అప్పటికే తీసిన మద్దతు తెలుపుతున్న ఎమ్మెల్యేల వీడియోను గవర్నర్‌కు చూపించడం గమనార్హం. జార్ఖండ్ ముక్తి మోర్చా, కాంగ్రెస్, రాష్ట్రీయ లోక్ దళ్(ఆర్జేడీ)ల అధికార కూటమి చంపయ్ సొరెన్‌కు మద్దతు తెలుపుతున్న 43 మంది ఎమ్మెల్యేల వీడియోను విడుదల చేసింది. గవర్నర్‌ను చంపయ్ సొరెన్ కలవడానికి వెళ్లే ముందు ఎమ్మెల్యేలు వీడియో రికార్డింగ్ ద్వారా మద్దతు చెప్పించారు. महामहिम राज्यपाल जी बहुमत यंहा साफ-साफ बिना चश्मा को देखा जा सकता है। फिर भी नया सरकार का गठन में देरी किस बात का? जब विद्यायकों का समर्थन का लेटर आपके पास पहुंचा हुआ है, तो किस शुभ घड़ी का इंतज़ार कर रहे है आप? जनता को जवाब दे महामहिम @jhar_governor जी।#JharkhandCM pic.twitter.com/BNuc8jaHu2 — Md Furkan Ahmad (@Furkanjmm) February 1, 2024 ఆ వీడియోలో చంపయ్ సొరెన్‌తో పాటు కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత అలంగీర్ ఆలం, ఆర్జేడీ ఎమ్మెల్యే సత్యానంద్ భోక్తా, సీపీఐ (ఎంఎల్) ఎల్ ఎమ్మెల్యే వినోద్ సింగ్, ప్రదీప్ యాదవ్‌లు ఉన్నారు. సమావేశానంతరం చంపయ్ సొరెన్ మాట్లాడుతూ.. 'ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మెజారిటీ సాధించి 22 గంటలైంది. త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని గవర్నర్ చెప్పారు.' అని అన్నారు. మనీలాండరింగ్ కేసులో హేమంత్ సోరెన్ బుధవారం రాత్రి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ కేసులో హేమంత్ సొరెన్ అరెస్టు కావడంతో చంపయ్ సొరెన్ వెంటనే సీఎంగా ప్రమాణం చేస్తారని అంతా భావించారు. కానీ, రాజ్‌భవన్ వద్ద నాటకీయ పరిణామాల నేపథ్యంలో అది వాయిదా పడుతూ వస్తోంది. ఇదీ చదవండి: Jarkhand Crisis: కొత్త సీఎంగా చంపయ్ సొరెన్ ఎంపికకు అసలు కారణం ఇదే?