జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో.. అధికార ప్రతిపక్ష పార్టీలు దూకుడు పెంచాయి. పొత్తుల ఖరారు, అభ్యర్థుల ప్రకటన, ప్రచారాలపై కసరర్తు ప్రారంభించాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో ప్రతిపక్ష బీజేపీ తమ అభ్యర్థులకు సంబంధించి తొలి జాబితాను ప్రకటించింది. జార్ఖండ్‌లో మొత్తం 81 స్థానాలు ఉండగా.. 66 మందితో కూడిన తొలి జాబితాను శనివారం విడుదల చేసింది.
మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బాబులాల్ మరాండీ ధన్‌వార్ స్థానం నుంచి బరిలోకి దిగుతున్నారు. జేఎంఎం నుంచి బయటకు వచ్చిన చంపయ్ సోరెన్ సరాయ్‌కెలా నుంచి పోటీ చేయనున్నారు. ఇక జామ్‌తాడా నుంచి సీతా సోరెన్, కోదర్మా నుంచి నీరా యాదవ్ పోటీ చేయనున్నారు. గండేలో బీజేపీ అభ్యర్థిగా మునియా దేవి, సింద్రీలో తారాదేవి, నిర్సా నుంచి అప్నార్నా సేన్‌గుప్తా ప్రాతినిధ్యం వహించనున్నారు.ఝరియా నుంచి రాగిణి సింగ్, చైబాసా నుంచి గీతా బల్ముచు చైబాసాలో, పుష్పా దేవి భూయాన్ ఛతర్‌పూర్ నుంచి పోటీ చేయనున్నారు.
भाजपा केन्द्रीय चुनाव समिति ने होने वाले झारखण्ड विधानसभा चुनाव 2024 के लिए निम्नलिखित नामों पर अपनी स्वीकृति प्रदान की है। pic.twitter.com/onqghIJeGV
— BJP JHARKHAND (@BJP4Jharkhand) October 19, 2024
కాగా పొత్తులో భాగంగా బీజేపీ 68 స్థానాల్లో పోటీ చేస్తోంది. దాని మిత్రపక్షాలు, ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ 10, జనతాదళ్ (యూ) రెండు, లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) ఒక చోట నుంచి పోటీ చేయనున్నాయి. కాగా జార్ఖండ్‌లో నవంబర్ 13, 20 తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 23న ఓట్లు లెక్కింపు ఉండనుంది.
Comments
Please login to add a commentAdd a comment