Babulal Marandi
-
జార్ఖండ్ ఎన్నికలు.. బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో.. అధికార ప్రతిపక్ష పార్టీలు దూకుడు పెంచాయి. పొత్తుల ఖరారు, అభ్యర్థుల ప్రకటన, ప్రచారాలపై కసరర్తు ప్రారంభించాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో ప్రతిపక్ష బీజేపీ తమ అభ్యర్థులకు సంబంధించి తొలి జాబితాను ప్రకటించింది. జార్ఖండ్‌లో మొత్తం 81 స్థానాలు ఉండగా.. 66 మందితో కూడిన తొలి జాబితాను శనివారం విడుదల చేసింది. మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బాబులాల్ మరాండీ ధన్వార్ స్థానం నుంచి బరిలోకి దిగుతున్నారు. జేఎంఎం నుంచి బయటకు వచ్చిన చంపయ్ సోరెన్ సరాయ్‌కెలా నుంచి పోటీ చేయనున్నారు. ఇక జామ్తాడా నుంచి సీతా సోరెన్, కోదర్మా నుంచి నీరా యాదవ్ పోటీ చేయనున్నారు. గండేలో బీజేపీ అభ్యర్థిగా మునియా దేవి, సింద్రీలో తారాదేవి, నిర్సా నుంచి అప్నార్నా సేన్‌గుప్తా ప్రాతినిధ్యం వహించనున్నారు.ఝరియా నుంచి రాగిణి సింగ్, చైబాసా నుంచి గీతా బల్ముచు చైబాసాలో, పుష్పా దేవి భూయాన్ ఛతర్పూర్ నుంచి పోటీ చేయనున్నారు.भाजपा केन्द्रीय चुनाव समिति ने होने वाले झारखण्ड विधानसभा चुनाव 2024 के लिए निम्नलिखित नामों पर अपनी स्वीकृति प्रदान की है। pic.twitter.com/onqghIJeGV— BJP JHARKHAND (@BJP4Jharkhand) October 19, 2024కాగా పొత్తులో భాగంగా బీజేపీ 68 స్థానాల్లో పోటీ చేస్తోంది. దాని మిత్రపక్షాలు, ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ 10, జనతాదళ్ (యూ) రెండు, లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) ఒక చోట నుంచి పోటీ చేయనున్నాయి. కాగా జార్ఖండ్‌లో నవంబర్ 13, 20 తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 23న ఓట్లు లెక్కింపు ఉండనుంది. -
పనిమనిషిపై లైంగిక దాడి: మాజీ సీఎం సలహాదారుపై కేసు!
రాంచీ: జార్ఖండ్ మాజీ సీఎం బాబూలాల్ మరాండీకి ఒకప్పుడు సలహాదారుగా పనిచేసిన సునీల్ తివారీపై పోలీసులు లైంగిక దాడి కేసు నమోదైంది. తనపై లైంగిక దాడి చేశాడని సునీల్ పనిమనిషి అయిన 18 ఏళ్ల గిరిజన బాలిక కుంతి రాంచీలోని అర్గోరా పోలీస్ స్టేషన్లోరీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగుచూసింది. మహిళ ఫిర్యాదు ఆధారంగా తివారీపై ఈనెల 16న లైంగిక దాడి కేసు నమోదు చేయగా.. తివారీ తనను బలవంతంగా లోబరుకున్నాడని, తాను అభ్యంతరం వ్యక్తం చేయగా తీవ్రంగా కొట్టాడని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని సునీల్ తివారీ తనను బెదిరించాడని ఆరోపించారు. బాధిత మహిళ తివారీ నివాసంలో ఏడాది పాటు పనిచేసి కరోనా మహమ్మారి కారణంగా ఇటీవల తమ స్వస్థలానికి తిరిగి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత కుటుంబ సభ్యులకు విషయం తెలపడంతో వారి ప్రోద్బలంతో పోలీసులకు ఫిర్యాదు చేశానని బాధిత మహిళ తెలిపారు. కాగా తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, లైంగిక దాడి కేసులో ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారని తివారీ పేర్కొన్నారు. చదవండి: హైదరాబాద్: యువతిపై ఆటో డ్రైవర్ల అఘాయిత్యం -
సోరేన్ సర్కారుకు మద్దతు ఉపసంహరణ
రాంచి: జార్ఖండ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. దాదాపు నెల రోజుల క్రితం జేఎంఎం, కాంగ్రెస్ సంకీర్ణ సర్కారులో చేరిన జార్ఖండ్ వికాస్ మోర్చా (జేవీఎం) కూటమి నుంచి బయటకు వచ్చింది. హేమంత్ సోరేన్‌కు మద్దతు ఉపసంహరిస్తున్నట్టు ప్రకటించింది. తమ పార్టీని చీల్చేందుకు కాంగ్రెస్ చేస్తున్న కుట్రలకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు జేవీఎం అధ్యక్షుడు బాబులాల్ మారాండీ తెలిపారు. ఈ మేరకు ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్‌కు ఆయన లేఖ రాశారు. ‘మీ నేతృత్వంలోని (హేమంత్ సోరేన్) ప్రభుత్వానికి బేషరతుగా మద్దతు ఇస్తూ మా పార్టీ జార్ఖండ్ వికాస్ మోర్చా డిసెంబర్ 24, 2019న లేఖ ఇచ్చింది. కానీ కూటమిలో భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ మా ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకుని జేవీఎంను చీల్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు దినపత్రికలు ఈరోజు ప్రముఖంగా ప్రచురించాయి. ఈ నేపథ్యంలో మీ నాయకత్వంలోని సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవాలని నిర్ణయించామ’ని లేఖలో బాబులాల్ మారాండీ పేర్కొన్నారు. జేవీఎం ఎమ్మెల్యేలు ప్రదీప్ యాదవ్, బంధు టిక్రీ.. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీని కలిసినట్టు వార్తలు రావడంతో వీరిద్దరూ కాంగ్రెస్‌లో చేరతారని ఊహాగానాలు రేగాయి. రాహుల్ గాంధీ, జార్ఖండ్ కాంగ్రెస్ ఇన్చార్జి ఆర్పీఎన్ సింగ్‌లను కూడా వారు కలవడంతో ఊహాగానాలకు బలం చేకూరింది. ఇటీవల జరిగిన జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో జేవీఎం మూడు స్థానాల్లో గెలిచింది. ఇద్దరు ఎమ్మెల్యేలు వెళ్లిపోతే ఒక్కరు మాత్రమే ఆ పార్టీలో మిగులుతారు. కాగా, జేవీఎం మద్దతు ఉపసంహరించుకున్నా హేమంత్ సోరేన్ సర్కారు ఎటువంటి ముప్పులేదు. -
బీజేపీలో జేవీపీ విలీనం
రాంచి: జార్ఖండ్ వికాస్ మోర్చా (జేవీపీ-ప్రజాతాంత్రిక్)లోని ఒక వర్గం బుధవారం లాంఛనంగా బీజేపీలో విలీనమైంది. కేపీ శర్మ అధ్యక్షతలోని జేవీపీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు- సర్మేశ్ సింగ్, చంద్రికా మహతా, జై ప్రకాశ్ భోక్తా, నిర్భయ్ సహవాది, పూల్‌చంద్ మండల్ బీజేపీలో చేరారు. రాంచీలోని పార్టీ కార్యాలయంవద్ద జరిగిన కార్యక్రమంలో సీనియర్ బీజేపీ నేత అర్జున్ ముండా, పార్టీ ప్రధాన కార్యదర్శి భూపేంద్ర యాదవ్, జార్ఖండ్ శాఖ అధ్యక్షుడు రవీంద్ర రాయ్ వారిని పార్టీలోకి స్వాగతించారు. జేవీపీ-ప్రజాతాంత్రిక్ అధ్యక్షుడు బాబూలాల్ మారాండీ కూడా బీజేపీలో చేరాలని అర్జున్ ముండా విజ్ఞప్తి చేశారు.