
సునీల్ తివారీ
రాంచీ: జార్ఖండ్ మాజీ సీఎం బాబూలాల్ మరాండీకి ఒకప్పుడు సలహాదారుగా పనిచేసిన సునీల్ తివారీపై పోలీసులు లైంగిక దాడి కేసు నమోదైంది. తనపై లైంగిక దాడి చేశాడని సునీల్ పనిమనిషి అయిన 18 ఏళ్ల గిరిజన బాలిక కుంతి రాంచీలోని అర్గోరా పోలీస్ స్టేషన్‌లోరీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగుచూసింది.
మహిళ ఫిర్యాదు ఆధారంగా తివారీపై ఈనెల 16న లైంగిక దాడి కేసు నమోదు చేయగా.. తివారీ తనను బలవంతంగా లోబరుకున్నాడని, తాను అభ్యంతరం వ్యక్తం చేయగా తీవ్రంగా కొట్టాడని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని సునీల్ తివారీ తనను బెదిరించాడని ఆరోపించారు.
బాధిత మహిళ తివారీ నివాసంలో ఏడాది పాటు పనిచేసి కరోనా మహమ్మారి కారణంగా ఇటీవల తమ స్వస్థలానికి తిరిగి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత కుటుంబ సభ్యులకు విషయం తెలపడంతో వారి ప్రోద్బలంతో పోలీసులకు ఫిర్యాదు చేశానని బాధిత మహిళ తెలిపారు. కాగా తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, లైంగిక దాడి కేసులో ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారని తివారీ పేర్కొన్నారు.
చదవండి: హైదరాబాద్: యువతిపై ఆటో డ్రైవర్ల అఘాయిత్యం
Comments
Please login to add a commentAdd a comment